breaking news
Jewellers protest
-
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్‌తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్‌లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ
సాక్షి,ముంబై : లక్షల రూపాయలు మోసపోయామంటూ పండుగ వేళ పెట్టుబడిదారులు రోడ్డెక్కారు. ముంబైలోని గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు రూ. కోట్ల మేర ఇన్వెస్టర్లను ముంచేసి బిచాణా ఎత్తేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని అనంతరం భారీగా టోకరా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన 50కి పైగా పెట్టుబడిదారులు ముంబైలోని రాంనగర్ పోలీస్ స్టేషన్ ముందు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గుడ్విన్ జ్యువెల్లరీ షాపులను సీజ్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆకర్షణీయ పథకాలు, బంగారం, 16 శాతం వడ్డీ, ఇతర ఆఫర్లతో గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. దీంతో వేలమంది రూ.2 వేల దాకా 50 లక్షల దాకా పెట్టుబడులు పెట్టారు. అయితే అక్టోబర్ 21నుంచే యజమానులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. షాపులను మూసివేసి కుటుంబ సభ్యులతో సహా ఉడాయించారనీ, నిందితుల పాస్‌పోర్ట్ వివరాలను సేకరిస్తున్నామనీ, లుక్ అవుట్ నోటీసులు జారీకి యోచిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసులను, పోలీసు కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేశామన్నారు. గుడ్విన్ గ్రూప్ ఛైర్మన్ ఎం సునీల్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఎం.సుధీర్ కుమార్; గుడ్విన్ జ్యువెలర్స్ డొంబివ్లి బ్రాంచ్ మేనేజర్ మనీష్ కుండిపై కేసునమోదుచేశామనీ, నిందితులు పరారీలో ఉన్నారని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సురేష్ అహెర్ తెలిపారు. ఒక్క డొంబివ్లి శాఖలోనే వెయ్యిమంది దాకా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరు 13 లక్షల నుండి కోటి రూపాయల మధ్య పెట్టుబడి వుంటారని అనుమానం. ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయనీ, దీంతో ఈ కేసు ఫిర్యాదులను స్వీకరించడానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (క్రైమ్) ఎన్ వి జాదవ్ అన్నారు. గుడ్‌విల్ జ్యువెల్లరీ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ దాదాపు 29మంది పెట్టుబడిదారులు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 80 కోట్ల రూపాయల మోసపోయామని ఆరోపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదివారం మరింతమంది బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. మరో 300 బాధితులు నమోదు చేసే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుడ్విన్ ప్రకటించిన ఆఫర్లకు ఆకర్షితుడనై చాలా ఆశతో భారీ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టామని బాధితులు వాపోతున్నారు. రూ. 9.81 లక్షలు పెట్టుబడి పెట్టానని సంజయ్ బిస్వాస్ (44) తెలిపారు. కాగా కేరళకు చెందిన గుడ్విన్ జ్యుయలరీ గ్రూప్‌నకు థానే, నవీముంబై సహా ముంబైలో 13 బ్రాంచీలున్నాయి. వీటిలో చాలావరకు ఇప్పుడు మూసివేయడం గమనార్హం. బాధిత పెట్టుబడిదారుల్లో కేరళనుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన వారే ఎక్కువని భావిస్తున్నారు. -
మోదీ ఫొటోకు నెక్లెస్, చెవి రింగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం వ్యాపారులు కదం తొక్కారు. బంగారం కొనుగోళ్లు, ఉత్పత్తి వ్యవహారంలో కొత్త నిబంధనలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ రాంలీలా మైదానంలో ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పోస్టర్లను ప్రదర్శించారు. మోదీ, జైట్లీ బంగారు నెక్లెస్ లు, చెవికమ్మెలు, ముక్కెరలు ధరించినట్టుగా పోస్టర్లలో చూపించారు. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొంటే పాన్ కార్డును తప్పని చేశారు. అలాగే, ఉత్పత్తి మీద ఎక్సైజ్ సుంకం 1 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బంగారం వర్తకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దుకాణాలు మూసేసి గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.


