పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌ | He studied on a Mumbai terrace using neighbour Wi-Fi now IIT Delhi | Sakshi
Sakshi News home page

పక్కింటి వైఫై సాయం : స్లమ్‌ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్‌

Sep 22 2026 6:21 PM | Updated on Sep 22 2026 6:21 PM

He studied on a Mumbai terrace using neighbour Wi-Fi now IIT Delhi

Abhishek Sujit Sharma Success story పట్టుదల, కృషి ఉండాలేగానీ అడ్డంకులన్నీ విజయానికి బాటలు వేస్తాయి. ముంబైలోని ఒక మురికివాడ నుంచి  ఐఐటీ ఢిల్లీ దాకాఎదిగిన వైనం స్ఫూర్తి దాయకం.   జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 199 మార్కులు సాధించి, OBC-NCL కేటగిరీలో 415 ర్యాంక్ (All India Rank 2,456) సాధించాడు. దీని ద్వారా ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి, తన కమ్యూనిటీ నుంచి తొలి ఐఐటీయన్‌గా నిలిచిన అభిషేక్ సుజిత్ శర్మ సక్సెస్‌ స్టోరీ ఇది.

ముంబైలోని లోకమాన్య తిలక్ నగర్‌లోని హరద్ ఛావుల్‌లో ఒక చిన్న అద్దె గదిలో (నెలకు రూ. 3,000) నలుగురు సభ్యుల కుటుంబంతో అభిషేక్ నివసించేవాడు. అతని తండ్రి ఒక స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో కార్మికుడిగా  ఉన్నారు.  కనీస వసతులు కూడా లేక, అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య అభిషేక్‌ చదువు సాగేది.  దీంతో ఖరీదైన కోచింగ్‌లు అన్న ప్రశ్నేలేదు. ఆన్‌లైన్ క్లాసులపైనే ఆధారపడేవాడు. 

ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?

మొబైల్ డేటా అయిపోయిన ప్రతిసారీ, పక్కింటి వారి వైఫై (Wi-Fi) కనెక్షన్‌ని ఉపయోగించుకోవడానికి అతను తన ఇంటి టెర్రస్ పైకి ఎక్కేవాడు. ఆ టెర్రసే కొంతకాలం అతనికి క్లాస్‌రూమ్‌లా మార్చుకుని జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ప్రిపేర్‌ అయ్యేవాడు. అభిషేక్‌కు సౌకర్యంగా ఉండాలని అతని తల్లిదండ్రులు నేలపై పడుకుని మంచాన్ని అతనికి కేటాయించారు. చివరికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 199 మార్కులు సాధించి, ఓబీసీ-ఎన్‌సీఎల్ విభాగంలో 415వ ర్యాంకును పొందారు. తొలి ఐఐటియన్‌గా తన కుటుంబానికి గర్వంగా నిలవడమే కాడు, తనలాంటి  ఎంతోమంది  స్ఫూర్తిగా నిలిచాడు.

ఇదీ చదవండి: రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement