రోజుకు రూ. 50వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా? | Lawyer quits highpaying job to walk dogs now she earns Rs 50000 per day | Sakshi
Sakshi News home page

రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?

Sep 22 2026 1:20 PM | Updated on Sep 22 2026 1:24 PM

Lawyer quits highpaying job to walk dogs now she earns Rs 50000 per day

నూకలిస్తాను మేకలు కాస్తావా అనే పాత  సామెత... ఆధునిక కాలంలో కుక్కల్ని వాకింగ్‌ తీసుకెడితే ఎంతిస్తారో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. అందుకే యూకేకు చెందిన 30 ఏళ్ల యువతి  న్యాయవాది  వృత్తిని వదిలేసి మరీ ఈ పనిని ఎంచుకుంది.  పూర్తి స్టోరీ అర్థం కావాలంటే ఈ కథనం మొత్తం  చదవాలి మరి.

 పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, లిజ్ ఈస్ట్ (Liz East) అనే బ్రిటన్  యువతి కన్సల్టింగ్ రంగంలోకి మారడానికి ముందు, క్రిమినల్ డిఫెన్స్‌లో పారాలీగల్‌గా నాలుగేళ్లు పనిచేసింది.అడ్మినిస్ట్రేటివ్ పనులు, కోర్టు విచారణలు, జైలు సందర్శనలు వంటి విపరీతమైన ఒత్తిడితో కూడిన పనులతో రోజుకు 12 గంటలకు పైగా శ్రమించేది. పైగా లండన్ ప్రయాణంతో కలిపి షెడ్యూల్ చాలా కష్టంగా ఉండేది. క్రిమినల్ డిఫెన్స్ లాయర్ కావాలని కలలు కన్న లిజ్ న్యాయ రంగంలో తన ఉజ్వల భవిష్యత్తును ఉన్న కెరీర్‌ను వదులుకుని  మరీ డాగ్‌ వాకింగ్‌ పని ఒప్పుకోవడం అంటే విశేషమే కదా.  ఇప్పుడు పూర్తిస్థాయిలో కుక్కలను నడిపించే వ్యాపారాన్ని నడుపుతోంది. తాను చాలా తక్కువ గంటలు పనిచేస్తూనే, ప్రతి నెలా వేల పౌండ్లు అదనంగా సంపాదిస్తున్నానని ఆమె చెబుతోంది.

అయితే  ఈ నిర్ణయం  తీసుకోవడం వెనుక ఉన్న ఆమె భర్తే. ఆతను డాగ్ వాకింగ్ , బోర్డింగ్ వ్యాపారం చేస్తూ తన పనిని ఎంతో ఆస్వాదించడం చూసి ప్రేరణ పొందింది. వారాంతాల్లో పనిని తలచుకుని భయపడే బదులు తనకు ఇష్టమైన పని చేయాలని నిర్ణయించుకుంది.

గంటకు ప్రతి కుక్కకు దాదాపు 19 డాలర్ల చొప్పున వసూలు చేస్తుంది. అంటే రోజుకి సంపాదన  సుమారు రూ. 38,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆమె రోజుకు సుమారు 20 నుండి 30 కుక్కలను నాలుగు ట్రిప్పుల్లో వాకింగ్‌కు తీసుకెళ్తుంది.గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పనిచేసినదానికంటే ఇప్పుడు నెలకు వేల పౌండ్లు ఎక్కువ సంపాదిస్తున్నానని, పని గంటలు కూడా సగానికి తగ్గాయని ఆమె తెలిపింది.

న్యాయవాద వృత్తిలో ఆమెకున్న నేపథ్యం తెలిసిన చాలా మందికి, ఆమె వృత్తిని మార్చుకోవడం ఆశ్చర్యం కలిగించిందట. న్యాయవాద వృత్తి నుండి కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే పనికి మారారా? అంత చదువు చదివి ఇప్పుడు కేవలం కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తున్నారా?' అని అంటుంటారని ఆమె గుర్తు చేసుకుంది.  చాలా తాను  ఆరేళ్లు వృథా చేశానని అనుకుంటారు. కానీ ఆ ఆరేళ్లలో  ఎంతో నేర్చుకున్నాను, వాటిని ఇప్పటికీ తన దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నానని కూడా తెలిపింది. అంతేకాదు  తన పాత ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సంపాదిస్తున్నానని చాలామంది అనుకుంటారని, . అయితే, కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే పనిని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా మాత్రమే చూడకూడదని లిజ్   సూచిస్తుంది.  

నెటిజన్ల స్పందన  లా చదివి డాగ్ వాకింగ్ చేయడం ఏంటని కొందరు విమర్శించినా, ఆమె తన నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. "జీవితం చిన్నది, అసంతృప్తిగా ఉన్న ఉద్యోగంలో ఉండకండి, మీకు నచ్చిన మార్పు చేసుకోండి" అని ఆమె ఇతరులకు సలహా ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement