కేతన్ హత్య కేసు: సియా కుటుంబంపై మరిన్ని అనుమానాలు! | Ketan Agarwal's father suspects Siya Goyal's family role in murder | Sakshi
Sakshi News home page

కేతన్ హత్య కేసు: సియా కుటుంబంపై మరిన్ని అనుమానాలు!

Sep 22 2026 11:46 AM | Updated on Sep 22 2026 11:49 AM

Ketan Agarwal's father suspects Siya Goyal's family role in murder

పూణె: మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సరికొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. తన కుమారుడి హత్య కుట్రలో కేతన్ కాబోయే భార్య సియా గోయల్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉండొచ్చని అతని తండ్రి విశాల్ అగర్వాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరికీ మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

జూన్ 18న లోహగఢ్ కోట నుంచి కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసేయడంతో ఆయన మృతి చెందారు. ఈ కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చెతన్ చౌదరి, అతని స్నేహితుడు రితేశ్ హాంగేలను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పుణే రూరల్ పోలీసులు 5,000 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. కాగా తాను ఇంకా ఛార్జ్‌షీట్‌ను పూర్తిగా చదవలేదని విశాల్ అగర్వాల్ తెలిపారు. దాని ప్రతిని పొందేందుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాతే మరిన్ని విషయాలపై మాట్లాడతానని అన్నారు.

అయితే సియా తండ్రి, తల్లి, సోదరుడు, మామ, అత్త కూడా హత్య కుట్రలో భాగస్వాములై ఉండొచ్చని తాను అనుమానిస్తున్నట్లు విశాల్ చెప్పారు. ఇదిలా ఉండగా.. సియా గోయల్, సహ నిందితుడు చెతన్ చౌదరి రహస్యంగా వివాహం చేసుకున్నారన్న వార్తలపై కూడా కేతన్ తండ్రి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ విషయం నిజమైతే.. తన కుమారుడితో సియా వివాహానికి ఆమె కుటుంబం ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు.

ఈ కేసులో త్వరితగతిన విచారణ చేపట్టాలని, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించాలని గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కోరినట్లు విశాల్ తెలిపారు. తన డిమాండ్లపై ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదని, మరోసారి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. తన కుమారుడిని హత్య చేసిన వారందరికీ మరణశిక్ష విధించడమే తన ప్రధాన డిమాండ్ అని విశాల్ అగర్వాల్ పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి: భారత్‌కు యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement