నాన్న డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌ | father and son rtc employees in telangana | Sakshi
Sakshi News home page

నాన్న డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌

Sep 22 2026 7:36 AM | Updated on Sep 22 2026 7:36 AM

father and son rtc employees in telangana

కామారెడ్డి జిల్లా: ‘నాన్న బస్సు ఆపు’అని కండక్టర్‌ అనగానే.. డ్రైవర్‌ ఆపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా విచిత్రంగా చూశారు. డ్రైవర్‌ను కండక్టర్‌ ‘అన్నా అనో.. తమ్ముడనో.. అంకుల్‌’అనో సంబోధిస్తారు కానీ ఇలా.. నాన్న అని ఎవరైనా పిలుస్తారా? అని ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఓ ప్రయాణికుడు డ్రైవర్‌ను ఆరా తీయగా.. తామిద్దరం తండ్రీ కొడుకులమన్న విషయాన్ని చెప్పాడు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన గుజ్జరి గంగారాం ఆరీ్టసీలో దశాబ్దాలుగా డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. ఆయన కుమారుడు రంజిత్‌కుమార్‌ ఇటీవల ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కండక్టర్‌గా చేరాడు. బాన్సువాడ డిపో అధికారులు సోమవారం వారిద్దరికి నిజామాబాద్‌ – బాన్సువాడ రూట్‌లో ఒకే బస్సులో డ్యూటీ వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement