ప్రముఖ ప్లేబ్యాక్‌సింగర్ 45 ఏళ్ల వయసులో ఒక ఇంటి వాడయ్యాడు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుఅందుకున్న నరేష్ అయ్యర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో హితులు, సన్నిహితులు నూతన దంపతులకు శుభాకాంక్షల అందించారు. మహారాష్ట్రలోని అయ్యప్ప విష్ణు ఆలయంలో ఈ వేడుక జరిగింది. నరేష్ , ఆయన భార్యకు అభినందనలు తెలుపుతూ ఆలయ అధికారిక పేజీలో షేర్ చేసిన పోస్ట్‌తో వీరి పెళ్లికబురు అభిమానులకు అందించారు. ఆ పోస్ట్‌లో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఉండటం విశేషం.

ఈ అందమైన కొత్త అధ్యాయం మా ఆలయంలో ప్రారంభం కావడం మాకు ఎంతో గౌరవప్రదం. ఆ దేవుని దివ్య ఆశీస్సులు నూతన దంపతులకు జీవితాంతం ప్రేమ, సంతోషం, సామరస్యం, శ్రేయస్సును ప్రసాదించుగాక." అని ఆలయ బృందం తన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. ఇంతకుమించి వివాహానికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడి కాలేదు. ద్వారా అనేకమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
“Munbe Vaa” singer Naresh Iyer gets married at 45! 💍♥️✨
The voice behind one of our most-loved melodies has started a beautiful new chapter. 🥹🧿
Wishing him a lifetime of happiness! 🤍 pic.twitter.com/F0F3iGpDk5— 𝑩𝒖𝒕𝒕𝒆𝒓𝒇𝒍𝒚🦋 (@buttu_iam27) September 16, 2026
ఇదీ చదవండి: అయోధ్య విరాళాల గోల్‌మాల్, సిట్ సంచలన నివేదిక
కాగా 2006లో వచ్చిన 'రంగ్ దే బసంతి' చిత్రంలోని 'రూబరూ' (Roobaroo) పాటకు గాను నరేష్ అయ్యర్ ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 'అన్వర్' చిత్రంలోని 'కన్నినిమ నీలే' (Kanninima Neelae) పాటతో మలయాళ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందారు. 'ఉస్తాద్ హోటల్'లోని 'మెల్ మెల్ మెల్' (Mel Mel Mel) , 'సెకండ్ షో'లోని 'స్వప్నం' (Swapnam) లాంటి ప్రజాదరణ పొందిన పాటలను కూడా ఆయన పాడారు. 'హార్ట్‌బీట్' (Heartbeat) చిత్రంతో నరేష్ మలయాళంలో గాయకుడిగా అరంగేట్రం చేశారు.
ఇదీ చదవండి: లగ్జరీ హోటల్‌లో ‘ ‘రోచీ’: పరువుపోయింది, తుకారం ముండే కాస్త చూస్తారా?


