ఇరుముడి వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ | Ravi Teja Movie Irumudi collections Crossed another Milestone | Sakshi
Sakshi News home page

Irumudi Movie: ఇరుముడి వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్

Sep 21 2026 5:34 PM | Updated on Sep 21 2026 5:52 PM

Ravi Teja Movie Irumudi collections Crossed another Milestone

ఇటీవలే రిలీజైన రవితేజ ఇరుముడి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తండ్రి, కూతురి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. 

తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చినప్పటీ.. వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించింది.  ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement