రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ అనుమాన పక్షి. ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్‌లో కొత్త తేదీని రివీల్ చేశారు. కాగా.. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు.


