హిందీ బిగ్ బాస్ తాజా సీజన్ ‘వీకెండ్ కా వార్’ ప్రోమో సల్మాన్ ఖాన్ అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. ఆ ప్రోమోలో సల్మాన్ ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, నీళ్లు అడుగుతూ డాక్టర్‌ను పిలవాలని చెప్పినట్లు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అసలు తన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని, బిగ్ బాస్ ప్రోమోను కట్ చేసిన విధానం వల్లే ఈ అపార్థం ఏర్పడిందని తెలిపారు. బిగ్ బాస్ హౌస్‌మేట్ క్వాజీ తౌకీర్ చేసిన నాటకం వల్ల ఇతరులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అతడికి అర్థమయ్యేలా చెప్పేందుకే తాను అలా నటించినట్లు వివరించారు.
ప్రోమో కట్ చేసిన తీరు వల్ల దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. మేకర్స్ తరఫున అందరికీ సల్మాన్ క్షమాపణలు చెప్తున్నానని అన్నాడు. తర్వాత మేకర్స్ జరిగిన పూర్తి విషయాన్ని చూపించేలా ప్రోమోను కూడా సవరించారని సల్మాన్ తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.


