రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది | Rashmila Mandanna MYSAA Movie Teaser out now | Sakshi
Sakshi News home page

MYSAA Movie Teaser: 'ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు'.. రష్మిక యాక్షన్‌ టీజర్

Sep 20 2026 8:17 PM | Updated on Sep 20 2026 8:30 PM

Rashmila Mandanna MYSAA Movie Teaser out now

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్‌ రోల్‌లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ మైసా. ఈ  చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

'అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను' అనే రష్మిక డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్‌ చూస్తుంటే తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళ పాత్రలో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'యుద్ధానికి ఆయుధమంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు'  అనే డైలాగ్‌ మైసాపై మరింత ఆసక్తి పెంచుతోంది. రష్మిక ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement