మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్‌ డేట్‌ వైరల్..! | Megastar Chiranjeevi Vishwambhara Movie New Release Trending On Social Media | Sakshi
Sakshi News home page

Vishwambhara Movie: మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్‌ డేట్‌ వైరల్..!

Sep 20 2026 6:54 PM | Updated on Sep 20 2026 7:17 PM

Megastar Chiranjeevi Vishwambhara Movie New Release date Viral

మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన ఈ సోషల్ ఫాంటసీ చిత్రం రిలీజ్‌ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. చిరు మరో మూవీ కాకా.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుండగా.. విశ్వంభరపై మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు.

అయితే ఇటీవల ఓటీటీ డీల్‌ కుదిరినట్లు వార్తలొచ్చాయి. దీంతో మరోసారి విశ్వంభర రిలీజ్‌పై చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. ఇదే ఏడాదిలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుందని లేటేస్ట్ టాక్ వైరలవుతోంది. వచ్చేనెల దసరాకు టైమ్ సరిపోనందున వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

అయితే దసరా తర్వాత నవంబర్‌లో విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాదిలోనే విశ్వంభర చూసే ఛాన్స్ మెగా ఫ్యాన్స్‌కు దక్కనుంది. రాబోయే రోజుల్లోనైనా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా..విశ్వంభరలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించగా.. కీరవాణి సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement