చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి లీక్స్ చేస్తుంటారు. గతంలో చాలాసార్లు టైటిల్స్ లీక్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా కాకాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని తన పాత్ర పేరును బయట పెట్టేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తన రోల్ వెల్లడించారు.
కాకాలో తాను కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నట్లు చిరు వెల్లడించారు. తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే తన క్యారెక్టర్‌లో పెట్టుకున్నానని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk
— Kaaka (@KaakaMovie) September 20, 2026


