కత్రినాపై బాడీ షేమింగ్‌.. పాకిస్తాన్‌ నటుడు మద్దతు | Ali Zafar Comes In Support Of Katrina Kaif Amid Online Trolling Over Post Pregnancy Look, Says Let Her Live | Sakshi
Sakshi News home page

Katrina Kaif: కత్రినాపై బాడీ షేమింగ్‌.. పాకిస్తాన్‌ నటుడు ఫైర్‌

Sep 18 2026 8:39 AM | Updated on Sep 18 2026 9:30 AM

Pakistani Actor Ali Zafar Supports Katrina Kaif Amid Body Shaming

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ ఇటీవల ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో కనిపించడంతో సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.  భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ముకేశ్‌, నీతా అంబానీ నిర్వహించిన గణేశ్‌ వేడుకలకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమె ఫొటోలు వైరల్‌ అయ్యాయి.  అయితే కొందరు నెటిజన్లు కత్రినా ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాతి ఫొటోలను పోల్చుతూ ఆమె లుక్‌పై కామెంట్లు చేశారు. దీంతో కత్రినాపై జరుగుతున్న బాడీ షేమింగ్‌పై పాకిస్థాన్‌ నటుడు, గాయకుడు అలీ జాఫర్‌ స్పందించాడు.  (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో చరణ్‌ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్‌..)

‘ఆమెను బతకనివ్వండి’
కత్రినా గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని అలీ జాఫర్‌ తెలిపాడు. మహిళల శరీరం, రూపంపై సమాజం పెట్టుకున్న ప్రమాణాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా పురుషులు తమ ఆలోచనా విధానాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించాడు. ప్రతి మహిళకు తనదైన జీవితం ఉంటుందని ఆమె గతం,  భవిష్యత్తు గురించి బయటివారు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.  ‘ఆమెను బతకనివ్వండి.. మీరు మీ జీవితంపై దృష్టిపెట్టండి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కత్రినా కైఫ్‌కు మద్దతుగా నిలిచాడు.

కత్రినాపై గతంలోనూ ఇలాంటి కామెంట్లు రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. నటి శివాలీకా ఒబెరాయ్‌ సైతం కత్రినా పోస్ట్‌ ప్రెగ్నెన్సీ లుక్‌పై వస్తున్న విమర్శలను ప్రశ్నిస్తూ.. ఇది మాతృత్వం అని పేర్కొంది.
(ఇదీ చదవండి: ఈసారి నాని కాదు.. ఆ పేరుతో పిలుస్తారు: నాని)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement