బిగ్‌బాస్‌ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు? | Bigg Boss Telugu 10 Day 11 Promo | Sakshi
Sakshi News home page

Bigg Boss: చరణ్‌ను మళ్లీ తెచ్చిందుకు షాలినీ వెళ్లిందా..?

Sep 17 2026 1:56 PM | Updated on Sep 17 2026 2:41 PM

Bigg Boss Telugu 10 Day 11 Promo

బిగ్‌బాస్‌ విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోలో కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా హౌస్‌లోకి రావడం.. షాలినీని పట్టుకుని బయటకు తీసుకెళ్లడం కనిపించింది. వారిని చూడగానే ఇంట్లోని సగం మంది కంటెస్టెంట్లు భయపడిపోయారు. దీంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

అయితే ఇదంతా నిజంగా జరిగిన ఘటన కాదని, హౌస్‌మేట్స్‌ను ఆటపట్టించేందుకు చేసిన ప్రాంక్‌ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక కంటెస్టెంట్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లాలంటే బిగ్‌బాస్‌ ఫార్మాట్‌ ప్రకారం నామినేషన్లు, ఎలిమినేషన్‌ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి ప్రక్రియ లేకుండా షాలినీని తీసుకెళ్లడం వెనుక ఏదైనా టాస్క్‌ లేదా ట్విస్ట్‌ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
బిగ్‌బాస్‌ అసంతృప్తి..
ఇదిలా ఉంటే.. షాలినీ విషయంలో బిగ్‌బాస్‌ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయపాలన పాటించడం లేదంటూ ఆమెను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో షాలినీని టార్గెట్‌ చేయడంతో హౌస్‌లో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.
చరణ్‌ ఎంట్రీకి సంబంధించిన వారేనా..
మరోవైపు చైత్ర కంటే చరణ్‌కే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. చరణ్‌ త్వరలోనే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఈరోజు ఎపిసోడ్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రోమోలో కనిపించిన వ్యక్తులు చరణ్‌ ఎంట్రీకి సంబంధించినవారేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అసలు షాలినీని పట్టుకెళ్లడం వెనుక ఉన్న ట్విస్ట్‌ ఏంటి? ఇది ప్రాంక్‌నా.. టాస్క్‌లో భాగమా? చరణ్‌ ఎంట్రీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్నది పూర్తి ఎపిసోడ్‌లోనే క్లారిటీ రానుంది.
(ఇదీ చదవండి: ‘గబ్బర్‌ సింగ్‌’ నటుడికి బ్రైయిన్‌ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement