సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన అన్నిరంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఆస్తుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన నేపధ్యంలో కేటీఆర్ ఆయనకు సవాల్ విసిరారు. 1954 నుంచి 2026 వరకు మా ఆస్తుల లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం తన సొంత సోదరునికి అక్రమంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారు. కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి సంస్కారం లేని వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి బంగ్లాలు ఎలా కట్టారో చెప్పాలి. నవీన్ రావు, సంతోష్ రావులతో మాకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేవరకు తాము పోరాటం చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి కళంకం తెస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి తమను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
''ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలి. మా ఆస్తుల విషయంలో సీఎంకు దమ్ముంటే న్యాయ విచారణ చేయాలి. ఎవరికెన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కతీద్దామా'' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడారు. కమీషన్లు దండుకునేందుకే 22ఏను తీసుకొచ్చారు. కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆన్నారు. రేవంత్ రెడ్డి ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉందని విమర్శించారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ పవిత్రతను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని రేవంత్ తప్పడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే.. కవిత


