ఆభరణాల విషయంలో నీతా అంబానీకి సరిరారెవ్వరూ. ఆమె పండుగకు, ఈవెంట్లకు అనుగుణంగా ధరించి ఆభరణాలు మన భారతీయ కళాకారుల నైపుణ్యం, చారిత్రక వైభవాన్ని చాటి చెబుతాయి. ఆమె ధరించే ప్రతి ఆభరణం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ దాగుంటుంది. తరతరాలు తెలసుకునేందుకు దారితీయడమే గాక..మన హస్తకళా వైభవం, నైపుణ్యం గురించి అవగాహన కల్పించడానికి దోహదపడుతుండటం విశేషం. ఈసారి కూడా అంతే విలక్షణమైన ఆభరణంతో గణేశ్ చతుర్థి వేడుకల్లో మేరిసింది.
అంబానీ ఇంట గణపతి నవరాత్రులు ఈసారి కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సినతారలంతా కదిలి వచ్చారు. ఆమె ఈ వేడుక కోసం తన రూపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఆమె నారింజ రంగు పట్టు చీరలో దేవతలా మెరిసింది. ముఖ్యంగా మెడకు ఓ భారీ కళఖండాన్ని పోలిన నెక్లెస్‌ని ధరించారు. ఆ నగ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తూ..కట్టిపడేసింది. ఈ నెక్లెస్ మెడ నుంచి భుజాల వరకు ఆవరించి ఉండటమే కాదు..మొత్తం ఆమె లుక్‌లో హైలెట్‌గా ఉండటం విశేషం.
ఈ నెక్లెస్‌ని ‘అమ్రపాలి భరతం’ అని పిలుస్తారట. దీని తయారీకి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అత్యుత్తమ వారసత్వ వింటేజ్ ఆభరణాలను పొందుపర్చి.. డిజైన్ చేసిన వస్త్రం మాదిరి ఆభరణం. ఆ ఆభరణం వివరణాత్మకమైన ఒక పురాతన కళాఖండ. మధ్యభాగం కేరళ నెక్లెస్‌ని పోలి ఉంటుంది. దీన్ని సుమారు 14 మంది కళకారులు తీర్చిదిద్దారట. దీనిలో ఝూమర్లు, దక్షిణ భారత నాథ్‌లు, పాసా, షాండిలియర్ లాంటి చెవిపోగులు, బిల్లాలు, చాంద్‌బాలీలు తదితరాలని ఉపయోగించారు.
దీని తయారీకి మూడున్నరేళ్లు పైనే పట్టిందట. అలాగే దీనికి మంచి రాయల్ లుక్‌ని అందివ్వడానికి మరో ఆరు నెలల వ్యవధి తీసుకుందట. దీనిలో కుందన్ పనితనం, ముత్యాల దండలే, పోల్కీ అమరికలు, మీనాకారి అంకరణ అత్యంత ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కాగా, నీతా ఇంతకుమునుపు కూడా అత్యంత విలక్షణమైన విలాసవంతమైన ఆభరణాలతో మెరిసింది. ఈ సారి ధరించిన ఆభరణం మాత్రం మెడకు ధరించిన బంగారు వస్త్రంలా ఆమె శరీరానికి అల్లుకుపోయింది.
(చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!)


