గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్‌లోమరో విడత ఉద్యోగ కోత (Layoff) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం తెల్లవారేసరికి ల్యాప్‌టాప్‌లు పనిచేయడం మానివేయడంతో వేల మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన పడిపోయారు.అమెరికాలోనే ఉద్యోగాల కోతలు ఉన్నట్లు భావించినా ఇప్పుడు ఇండియాలో కూడా మరో రౌండ్ లేఆఫ్స్ జరుగుతున్నట్టు టెకీల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఈ క్రమంలో ఒరాకిల్ (Oracle) సంస్థలో 12 సంవత్సరాలుగా సీనియర్ ప్రిన్సిపాల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేసిన ఇండియన్ టెకీ సౌరభ్ (Sourabh), ఇటీవల సంస్థ చేపట్టిన ఉద్యోగ కోతలలో తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆయన తన వర్క్ సిస్టమ్‌లోకి లాగిన్ కాలేకపోవడంతో ఉద్యోగం పోయిందని గ్రహించారు.
సౌరభ్ భార్య పూజా సాహు లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా తన భర్త సంస్థ పట్ల ఎంతో విధేయత, అంకిత భావంతో పనిచేశారో వివరిస్తూ పోస్ట్ పోట్టారు. సెలవులు, వారాంతాలు లేవు. పండగలు, పబ్బాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేశారనీ చెప్పుకొచ్చారు. హోలీ, దీపావళి వంటి పండుగలు, కుటుంబ వేడుకలు, చివరికి ఆమె ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో కూడా ఆయన పనిచేశారని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇంత చేసిని 12 ఏళ్ల అనుభవం ఉన్నా తనకి ఉద్వాసన తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కష్టపడి పనిచేసే తన భర్తకు తగిన ఉద్యోగ అవకాశాలు చూపించాల్సిందిగా ఆమె తన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను కోరారు. చివరగా "సౌరభ్ నీకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ తన భర్తకు భరోసా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆమె భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో ఉద్యోగికథ
పన్నెండేళ్లు అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి మాత్రం దీన్ని ఇదోరకమై "విముక్తి"గా అభివర్ణించాడు. భారీ పనిగంటలు,. ఒత్తిడినుంచి మోక్షం లభించిందన్నాడు. రెడ్డిట్ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒక కీలకమైన ప్రాజెక్ట్‌పై పనిచేశానని, రోజుకు 12-13 గంటలు కష్టపడ్డానని తెలిపాడు. అయితే, మేనేజ్‌మెంట్ నుండి ఎదురైన సూక్ష్మ పర్యవేక్షణ (micromanagement) , అధిక ఒత్తిడి కారణంగా ఈ ఉద్యోగం పోవడం వల్ల తనకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నాడు.
ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని సంవత్సరాల విశ్వాసపాత్రత చూపించినా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగ కోతలను క్షణాల్లో అమలు చేస్తాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు
కాగా 2026 ప్రారంభంలో జరిగిన చాలా పెద్ద కోత తర్వాత ఈ తాజా కోతలు చోటుచేసుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మంది (13 శాతం) తగ్గారు. దీంతో మే నెలాఖరు నాటికి కంపెనీలో దాదాపు 141,000 మంది ఉద్యోగులు మిగిలారు. కంపెనీ AI మౌలిక సదుపాయాలు , డేటా సెంటర్లపై కూడా ఖర్చును గణనీయంగా పెంచుతోంది.విస్తృత సంస్థాగత మార్పులలో భాగంగా సెప్టెంబర్ 14న కంపెనీ కొత్త విడత ఉద్యోగ కోతలను ప్రారంభించింది. ప్రభావిత ఉద్యోగులకు తెల్లవారుజామున ఇమెయిల్స్ అందినట్లు సమాచారం. ఈ తాజా విడతలో ప్రభావితమైన మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఒరాకిల్ బహిరంగంగా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్


