లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దారుణ ఘటన జరిగింది. తనను మోసం చేశాడని అడ్డుకున్న ప్రియురాలిపై ప్రియుడు ఏకంగా కారు ఎక్కించాడు. లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడిని నిలదీసిన యువతిపై, నిందితుడు రాక్షసంగా వ్యవహరించిన తీరు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. అనామిక అనే యువతి, షహన్వాజ్ కొంతకాలంగా పరిచయంలో ఉన్నారు. అయితే, మరో యువతితో షహన్వాజ్ కారులో తిరుగుతుండగా అనామిక రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో గొడవకు దిగింది. వివాదం ముదిరడంతో షహన్వాజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, యువతి అడ్డుకునే యత్నం చేసింది.
అయితే ఆ సమయంలోనూ తన ప్రియుడు ఏమాత్రం కనికరం చూపకుండా కారుతో వేగంగా కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కిందపడిపోయిన ఆమెపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లక్నో పోలీసులు, ప్రధాన నిందితుడు షహన్వాజ్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు యువతిని పేరు మార్చి (యష్ ఠాకూర్) పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.
Lucknow - A woman was struck by a car and carried on its bonnet for some distance during a dispute near Janeshwar Mishra Park on Wednesday morning, according to police. A video of the incident has circulated widely on social media. Preliminary police accounts said the woman saw… pic.twitter.com/9setQbAQYs
— NextMinute News (@nextminutenews7) September 16, 2026


