లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్‌యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా, ఓ వార్తా సంస్థ హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌లో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు విమానం లోపల నుంచి తీసిన వీడియోలో కనిపిస్తున్నాయి.
చాట్స్‌వర్త్‌లోని ఎన్ మాన్షన ఎవెన్యూ 9100 బ్లాక్ సమీపంలోని ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ కూలిపోయింది. అక్కడికి సమీపంలోనే అంతకుముందు ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎస్‌యూవీ(కారు).. మెట్రో బస్సును ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. హెలికాప్టర్‌లోని కెమెరా రికార్డింగ్‌లో విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అది కూలిపోవడంతో వీడియో రికార్డింగ్ ముగిసింది. రెండు వాణిజ్య భవనాల మధ్య హెలికాప్టర్ కూలిపోయి.. అది పలు వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లపై పడింది.
లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్‌మన్ సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. హెలికాప్టర్ కూలిన సమయంలో ఆ వ్యక్తి దాని వెలుపల ఉన్నట్లు కనిపించిందన్నారు. ‘హెలికాప్టర్‌లో ఎంత మంది బాధితులు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సిల్వర్‌మన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానం చాలావరకు పూర్తిగా ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు.
హెలికాప్టర్‌లో మరెవరైనా ఉన్నారా? విమానం ఎవరిదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను పరిశీలించాల్సి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం హెలికాప్టర్ ఓ టెలివిజన్ స్టేషన్‌కు చెందినది. అయితే ఏ స్టేషన్‌కు చెందినదో వెంటనే నిర్ధారించలేదని సీబీఎస్ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై లాస్ ఏంజెల్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని తెలుస్తోంది.
BREAKING: KNBC helicopter crashes while covering metro bus crash in Los Angeles, California. https://t.co/TgzkkVTBHx
— AZ Intel (@AZ_Intel_) September 16, 2026


