గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు | At least 60 killed in gold mine collapse in Kordofan | Sakshi
Sakshi News home page

గని కూలి 60 మంది మృతి.. శిథిలాల కిందే మరికొందరు

Sep 16 2026 7:23 PM | Updated on Sep 16 2026 7:56 PM

At least 60 killed in gold mine collapse in Kordofan

Representative image

సూడాన్‌లోని వెస్ట్ కొర్డోఫాన్ రాష్ట్రంలో బంగారు గని కూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. భూగర్భంలో మరికొందరు కార్మికులు ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని స్థానిక హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది.

అల్-జారా గని వద్ద వరుసగా ఉన్న పలు గని మార్గాలు కూలిపోయినట్లు కొర్డోఫాన్ అబ్జర్వేటరీ తెలిపింది. ఫౌజా ప్రాంతంలో, అల్-నుహుద్‌కు వాయవ్య దిశలో ఈ గని ఉంది. ఈ ఘటనలో 70 మందికి పైగా చేతివృత్తి ఆధారిత గని కార్మికులు మృతి చెంది ఉండొచ్చని లేదా గల్లంతయ్యారని ఆ సంస్థ బుధవారం తెలిపింది.

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం మంగళవారం ఒక కార్మికుడు గని నుంచి బయటకు వచ్చి, ఇంకా కొందరు లోపల ప్రాణాలతో ఉన్నారని చెప్పినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ప్రత్యేక శిక్షణ పొందిన సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేదని తెలిపింది. ఇసుకతో కూడిన బలహీనమైన నేల కారణంగా స్థానికులు సాధారణ పనిముట్లతో సహాయక చర్యలు చేపట్టడం, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారిందని పేర్కొంది.

గని ప్రాంతంలో భద్రతా చర్యలు, సహాయక పరికరాలు లేకపోవడమే అధిక మరణాలకు కారణమై ఉండొచ‍్చు. సూడాన్ ఆఫ్రికాలోని ప్రధాన బంగారం ఉత్పత్తిదారుల్లో ఒకటి. అయితే అక్కడి బంగారంలో అధిక భాగం ప్రమాదకరమైన చిన్నస్థాయి, చేతివృత్తి ఆధారిత గనుల ద్వారా వెలికితీస్తారు. గని ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం అవుతాయా, భూగర్భంలో చిక్కుకున్న వారిని రక్షించగలరా? అనేది ఇప్పుడు కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement