132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్‌..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు! | Magazine Returned To Library After 132 Years Goes Viral | Sakshi
Sakshi News home page

132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్‌..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!

Sep 16 2026 5:09 PM | Updated on Sep 16 2026 5:29 PM

Magazine Returned To Library After 132 Years Goes Viral

అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో జరిమానాను మినహాయించింది. ఈ ప్రకటనతో ఎన్నో పుస్తకాలు మళ్లీ లైబ్రరీ అరల్లోకి వస్తాయని ఆత్రుతగా చూసింది. అలాంటిది ఏం జరగకపోగా ఊహించనిది ఎదురైంది. గడుపు దాటిన ఎన్నో పుస్తకాలు తిరిగి వస్తాయనుకుంటే..ఒకే ఒక్క పుస్తకం తిరిగి వచ్చింది. పోనీ అది కూడా మూడు లేదా నాలుగేళ్ల నాటిది కూడా కాదు ఏకంగా 132 ఏళ్ల నాటి మ్యాగజైన్‌ తిరిగి రావడంతో లైబ్రరీ నిర్వాహాకులు ఒక్కసారగా కంగుతిన్నారు. 

అది కూడా 84 ఏళ్ల జాన్‌ హాన్సన్‌ వృద్ధుడు తీసుకురావడంతో మరింత విస్తుపోతారు. జాన్‌ 19వ శతాబ్దాం నాటి మ్యాగజైన్‌ని లైబ్రరీకి తిరిగి ఇచ్చాడు. అంటే సుమరు 48,220 రోజులు గడుపు దాటిపోయిన ఏళ్ల నాటి మ్యాగజైన్‌ అది. అంటే 1894లో ప్రచురితమైన మ్యాగజైన తిరిగి రావడం లైబ్రరీ నిర్వాహకులు ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది. నిజానికి జరిమానా మినహాయిస్తే ఓ పదేళ్ల క్రితం నాటి ఎన్నో పుస్తకాలు వస్తాయని భావించాం, కానీ 19వ శతాబ్దపు చివరలో వచ్చిన మ్యాగజైన్‌ తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదంటూ ఆ అమెరికా లైబ్రరీ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొనడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. 

ఇక ఆ తాతగారు తిరిగి లైబ్రరీకి ఇచ్చిన మ్యాగజైన్‌ పేరు ది సెంచరీ ఇల్లస్ట్రేటెడ్ అనే మంత్లీ మ్యాగజైన్. అది కూడా సెప్టెంబర్‌ నెలదట అది. దశాబ్దాలుగా ఆయన ఇంట్లోనే ఉండిపోయింది. అది తన వద్దకు ఎలా వచ్చిందో తెలియదని, తనకసలు గుర్తు కూడా లేదని చెప్పడం గమనార్హం. సదరు లైబ్రరీ జరిమానాను మినహాయించిందన్న ప్రకటన చూసి.. ఆ మ్యాగజైన్‌ని తిరిగి ఇచ్చేసే సమయం ఆసన్నమైందని భావించి లైబ్రరీకి ఇచ్చేశానని అన్నారు. 1966లో బోస్కావెన్ నుంచి బారింగ్‌టన్‌కు మారే సమయంలో ఆ మ్యాగజైన్ తనకు దొరికిందని చెప్పారు. 

అయితే తన దివంగత భార్య కరోల్ పుస్తకాలను అమితంగా ఇష్టపడుతుండేదని, పబ్లిక్‌​ లైబ్రరీలకు వెళ్తుండేదని చెప్పారు. అయితే లైబ్రరీ నుంచి పుస్తకాన్ని గానీ, పత్రికను గానీ అన్నేళ్లపాటు ఇంట్లో ఉంచుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదని పేర్కొనడం విశేషం. విచిత్రంగా జాన్‌ వద్దకు చేరిన ఆ మ్యాగజైన్‌ అంతే చిత్రంగా లైబ్రరీకి తిరిగి వచ్చింది కదూ..!.

ఇదీ చదవండి: పేద కుటుంబం నుంచి ఐదు మెడికల్‌ సీట్లు..!తల్లిదండ్రులు దినసరి కూలీలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement