సిగరెట్‌ ప్రియులకు భారీ షాక్‌ : ఏకంగా 13 శాతం పెంపు | ITC increases cigarette prices of popular brands, details inside | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ ప్రియులకు భారీ షాక్‌ : ఏకంగా 13 శాతం పెంపు

Sep 16 2026 5:57 PM | Updated on Sep 16 2026 6:10 PM

ITC increases cigarette prices of popular brands, details inside

ధూమపాన  ప్రియులకు మరోసారి  భారీ షాక్ తగిలింది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ  ఎంపిక చేసిన  సిగరెట్ బ్రాండ్ల రిటైల్ ధరలను మరోసారి పెంచింది. ముఖ్యంగా 'క్లాసిక్ కనెక్ట్' (Classic Connect), 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' (Gold Flake Super Star) ప్యాక్‌ల ధరలను 12.66శాతం వరకు పెంచేసింది. 

కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులు, సుంకాలను పెంచిన తర్వాత ఈ పెంపులు మొదలయ్యాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఐటీసీ రెండోసారి ధరలను పెంచింది. కొత్త ధరలతో కూడిన సిగరెట్ ప్యాక్‌లు ఇప్పటికే మార్కెట్లోకి, డిస్ట్రిబ్యూషన్ ఛైన్‌లోకి రావడం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల వల్ల కంపెనీలు పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగినప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

పెరిగిన ధరల వివరాలు
డీలర్ల సమాచారం ప్రకారం, 10 సిగరెట్లు ఉండే 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' ప్యాక్ ధర రూ. 79 నుండి రూ. 89కి (రూ. 10 పెరిగింది) చేరుకుంది. 20 సిగరెట్ల క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ ప్యాక్   ధర గతంలో రూ.390గా ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.428కి చేరింది. సుమారు 9.7 శాతం పెరిగింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (GST) రేటు 40శాతం కి పెరగడంతో పాటు కొత్త ఎక్సైజ్ డ్యూటీ విధానం అమలవుతోంది. ఈ పన్నుల భారాన్ని తట్టుకునేందుకు ITC సంస్థ గతంలో ఫిబ్రవరి, మే నెలల్లో కూడా పలుమార్లు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఒరాకిల్‌ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!

ఐటీసీ షేర్ల లాభాలు
సిగరెట్ ధరల పెంపుపై వార్తలు వెలువడిన తర్వాత ఐటీసీ షేర్లలో కదలిక కనిపించింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఐటీసీ షేరు 2.13 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాదిలో రెండోసారి సిగరెట్ల ధరలను పెంచిన నేపథ్యంలో బుధవారం  ITC లిమిటెడ్ షేర్లు  భారీగా లాభపడ్డాయి.

ఇదీ చదవండి: మహువాకు మరోసారి చేదు అనుభవం : జస్టిస్‌ దీపాంకర్‌కు కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement