భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న మైక్రో ఎస్‌యూవీలలో టాటా పంచ్ ఒకటి. ఇది ప్రస్తుతం ఈవీ, సీఎన్జీ, పెట్రోల్ రూపాల్లో అందుబాటులో ఉంది. అయితే.. కంపెనీ ఇప్పుడు పంచ్ ఈవీ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది.
టాటా పంచ్ ఈవీ స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్‌డ్ ట్రిమ్‌లలో.. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్, స్మార్ట్+ (30kWh) వేరియంట్ల ధరలు రూ.10,000 పెరిగాయి. ఇదే సమయంలో, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్‌డ్, ఎంపవర్‌డ్ ప్లస్ ఎస్ అనే అన్ని 40kWh వేరియంట్ల ధరలు రూ. 20,000 పెరిగాయి. ధరలు పెరుగుదల తరువాత కొత్త రేట్లు రూ. 9.79-12.99 లక్షల మధ్య ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. ఒకటి 87bhp/154Nm అందించే 30 కిలోవాట్ బ్యాటరీ (355కిమీ), రెండోది 127bhp/154Nm అందించే 40 కిలోవాట్ బ్యాటరీ (468కిమీ). డిజైన్ మార్పులలో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, కనెక్టెడ్ లైట్లు, అప్‌డేటెడ్ క్యాబిన్ ఉన్నాయి.


