సన్ పిక్చర్స్ అధినేత, 'DC' చిత్ర నిర్మాత కళానిధి మారన్ తన ఉదారతతో అందరి మనసులను గెలుచు కున్నారు. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ టర్న్డ్ నటుడు లోకేష్ కనగరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు ఖరీదైన 'BMW iX1 LWB' కార్లను బహుమతిగా అందించారు. నిర్మాత్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు సినిమా విజయంలో కీలకమైన తన పాత్రకు 100 శాతం న్యాయం చేసిన వామికా గబ్బికి గిప్ట్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ తమిళ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ ఈ ముగ్గురికీ అందించిన BMW కార్ల మొత్తం విలువ రూ. 1.5 కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్కో కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 49 లక్షల నుండి రూ. 55.81 లక్షల వరకు ఉంది.
మరి వామికా గబ్బికి ఏది?
ఒకవైపు నెటిజన్లు కళానిధి మారన్ చేసిన ఈ పనిని ప్రశంసిస్తుంటే, మరొకవైపు సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రశ్నలు గుప్పిస్తోంది. సినిమాలో కథానాయికగా 'చంద్ర' పాత్రలో అద్భుతంగా నటించిన వామికా గబ్బికి ఎందుకు కారు బహుమతిగా ఇవ్వలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "వామికా గబ్బికి న్యాయం చేయాలి", "చంద్ర పాత్రకు కూడా ఈ బహుమతి దక్కాల్సిందే" అంటూ పలువురు కామెంట్లు చేశారు. నటులతో సమానంగా, అంతకంటే మెరుగ్గా నటించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా నటీమణుల గుర్తించి, వామికాకు కూడా కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఎక్స్ (ట్విటర్) లో ఒక యూజర్ కోరారు.
కాగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా అరంగేట్రం చేసిన ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి, ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!


