ఓటీటీలోకి వచ్చేసిన ‘డిసి’ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే? | Lokesh Kanagaraj dc will stream on this platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన ‘డిసి’ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

Aug 29 2026 11:09 AM | Updated on Aug 29 2026 11:46 AM

Lokesh Kanagaraj dc will stream on this platform

స్టార్‌ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించగా అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్‌ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపింది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం మరోసారి ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సన్‌ నెక్ట్‌ వేదికగా సెప్టెంబర్‌ 4 నుంచి అలరించనుందని తెలిపింది. 

(చదవండి: సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!)

కథేంటంటే.. 
గ్యాంగ్‌స్టర్‌ సర్కార్‌ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్‌ అలియాస్‌ దాసు(లోకేశ్‌ కనకరాజ్‌). పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్‌ బృందాన్ని ఆశ్రయిస్తుంది.

విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్‌ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి విజ‌య‌వాడ‌లోని ఓ బార్‌లో త‌ల‌దాచుకుంటారు. అక్క‌డ బార్‌ సింగ‌ర్ పార్వ‌తిని (సంజ‌నా కృష్ణ‌మూర్తి) చూసి దేవ‌దాస్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్‌. దీంతో ఆమె కూడా దాస్‌ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. 

ఇదీ చదవండి: క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement