‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..! | Irumudi Child Artist Nakshatra Wins Hearts, Here’s How Much She Earned For The Film, Read Story Inside | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..!

Aug 27 2026 7:17 AM | Updated on Aug 27 2026 11:57 AM

Irumudi Child Artist Nakshatra Remuneration

ప్రస్తుతం అంతటా ‘ఇరుముడి’ ఫీవర్‌ నడుస్తోంది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్‌ చేస్తోంది.  శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్‌ అందించిన మ్యూజిక్‌ సైతం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.  తండ్రికూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇదే సమయంలో మరో బాలనటి నటన.. ప్రేక్షకులను మత్రముగ్ధులను చేసింది. ఆమె మరేవరో కాదు బాలనటి నక్షత్ర. ఇరుముడి చిత్రం ద్వారా అందరిమనసులు దోచుకుంది ఈ బాలనటి . ఈ సినిమాలో ఆమెకి ఉన్న పాత్ర అలాంటిది మరి. మనమ్మపాత్ర సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. ఇప్పటికే డైరెక్టర్‌ నుంచి హీరో వరకు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. అయితే ఇరుముడిలో ఆమెకు ఎలా అవకాశం వచ్చింది, ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌ ఎంతని ఇప్పుడు హాట్‌టాపిగ్‌ మారింది.

పారితోషికం ఎంతంటే..
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తుండగా, దర్శకుడు ఆమె తల్లిని సంప్రదించారట. హైదరాబాద్‌లో ఆడిషన్‌ ఇచ్చి, మనమ్మపాత్రకు ఎంపికయ్యారని అటు నక్షత్ర, ఇటు డైరెక్టర్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. సుమారు రూ.10లక్షలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్‌ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి:  నాకు యాక్టింగ్‌ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement