టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్ | Bangalore Court Orders on Fake content promotion On Toxic Movie | Sakshi
Sakshi News home page

Toxic Movie: టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్

Aug 26 2026 8:04 PM | Updated on Aug 26 2026 8:36 PM

Bangalore Court Orders on Fake content promotion On Toxic Movie

టాక్సిక్ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై స్పందించింది. టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌పై బెంగళూరు కోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. టాక్సిక్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సినిమాను కించపరిచేలా మీడియాలోనూ పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే వీటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement