టాక్సిక్ నెగెటివ్ టాక్... ఆ విషయంలో తగ్గేదేలే..! | Yash Toxic Movie beats Jawan Animal day 1 collections | Sakshi
Sakshi News home page

Toxic Movie: టాక్సిక్ నెగెటివ్ టాక్... అయినా తగ్గేదేలే..!

Aug 26 2026 6:56 PM | Updated on Aug 26 2026 7:42 PM

Yash Toxic Movie beats Jawan Animal day 1 collections

యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేజీఎఫ్-2 తర్వాత వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌పై విమర్శలు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. భారీ అంచనాలతో పాటు విమర్శల నేపథ్యంలో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. యశ్ నటనతో మెప్పించినా కథపై విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యశ్ మూవీ కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు.

కలెక్షన్ల వర్షం..

అయితే ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకే రూ.79.12 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్‌నిల్క్ వెల్లడించింది. కేవలం కన్నడ వర్షన్‌లో రూ.19 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన దురంధర్‌ రూ.28 కోట్ల వసూళ్లను టాక్సిక్ అధిగమించింది. ఇప్పటికే పఠాన్, యానిమల్, జవాన్ చిత్రాలను కూడా దాటేసింది. అయితే కేజీఎఫ్ చాప్టర్- 2 రూ.116 కోట్ల తొలిరోజు వసూళ్ల ఆల్-టైమ్ కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ మాత్రం అందుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.  కాగా..టాక్సిక్ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement