బిగ్‌ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Avengers Endgame Encore Official Telugu Trailer | Sakshi
Sakshi News home page

Avengers Endgame Encore: అవెంజర్స్ ఎండ్‌ కాలేదు.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Aug 26 2026 7:07 PM | Updated on Aug 26 2026 7:47 PM

Avengers Endgame Encore Official Telugu Trailer

అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్‌తో మరోసారి థియేటర్లలోకి సందడి చేయనుంది. అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. అవెంజర్స్: ఎండ్‌గేమ్‌కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా మరో మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ ఐమాక్స్ స్క్రీన్స్‌తో  పాటు మార్వల్ స్టూడియోస్‌ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉండనుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది.

అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్‌లో థానోస్ కారణంగా ప్రపంచ జనాభాలో సగం మంది కనుమరుగైన తర్వాత మిగిలిన సూపర్‌హీరోలు ఎదుర్కొనే పరిస్థితులు, తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి వారు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్‌తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించనుంది.

కాగా.. ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా.. ఆంథనీ, జో రూసో దర్శకత్వం వహించారు. లూయిస్ డి ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈ అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్ సెప్టెంబర్ 25, 2026 ఇండియాలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement