హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ వద్ద మిలాద్-ఉన్-నబీ (Milad-un-Nabi) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చార్మినార్, మక్కా మస్జిద్ ప్రాంతాల నుండి భారీ మతపరమైన శాంతి యాత్ర ప్రారంభమైంది.
ఈ ఊరేగింపు గుల్జార్ హౌజ్, పతేర్‌గట్టి, నయాపుల్, దారుల్‌షిఫా మీదుగా సాగి మొఘల్‌పురా వరకు కొనసాగింది.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో మార్గాలను నిరంతరం పర్యవేక్షించారు.
నగరంలో పలుచోట ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించడంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.


