నటి సమంత స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వర్కౌట్లు..! ఆ టైంలో చేయొచ్చా? | Samantha Ruth Prabhu Is Strength Training During Her Pregnancy | Sakshi
Sakshi News home page

నటి సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్‌ రొటీన్‌..! ఆ టైంలో స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ చేయొచ్చా?

Aug 26 2026 3:44 PM | Updated on Aug 26 2026 4:21 PM

Samantha Ruth Prabhu Is Strength Training During Her Pregnancy

మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్‌ అందుకున్న నటి సమంత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనేకమంది సెలబ్రిటీలు గర్భధారణ అనేది రెస్ట్‌ తీసుకునే అనారోగ్యం లాంటిది కాదని, ఈ దశలో కూడా చురుగ్గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా సమంత కూడా చేరిపోయారు. ఆమె జిమ్‌కి వెళ్లడం వరకు మాత్రమే కాదు, వెయిట్‌లిఫ్టింగ్‌, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వంటి వర్కౌట్లు చేసేస్తోంది. పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారామె. 

మొదటి వీడియోలో కేబుల్‌ రో వ్యాయామం చేసింది సమంత. దానికి క్యాప్షన్‌గా ఈ రోజు భిన్నమైన వర్కౌట్‌  చేశా. అయితే ఎక్కువగా కష్టపడకుండా, శ్రద్ధగా వినడం నేర్చుకున్నా అంటూ రాసింది. రెండొవ వీడియోలు బరువులు ఎత్తుతూ కనపించింది సమంత. ఈ సమయంలో ఎంత మేర ఎంతగలరో అంతే పైకి ఎత్తండి అని క్యాప్షన్‌ పెట్టింది. అలాగే తదుపరి పోస్ట్‌ల్‌లో కొన్ని రోజులు బలంగా ఉన్నట్లు భావిస్తా, అందుకే వ్యాయామాలు సవరించుకుంటానని పేర్కొంది. పైగా యోగా మ్యాట్‌పై పడుకుని చేసే వర్కౌట్లే కొన్ని రోజులు హాయిగా అనిపిస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. 

తన జీవితాంతం జిమ్‌లో మరింతగా చేయడానికి తన పరిమితులను అధిగమించడానికి శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ప్రెగ్నెన్సీ దశలో శరీరాన్ని గౌరవించడం. శరీరం మాట వినడం వంటివి నేర్చుకున్నానని పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే ఈ సమయంలో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసే అత్యంత బలమైన పని అమ్మ అవ్వడమేనని భావిస్తున్నానంటూ పోస్ట్‌ని ముంగించింది. అలాగే తన శక్తి శిక్షణా వ్యాయామాలు గురించి మాట్లాడుతూ..ఇవన్నీ తాను చాలా ఏళ్లుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మరి చేస్తున్నవని, అలాగే గర్భధారణకు అనుగుణంగా సవరించినవేనని కూడా ఆమె వెల్లడించింది. 

 

అలాగే తన ట్రైనర్స్‌ ప్రతిష్టాత్మక సంస్థల్లో సర్టిఫికేట్‌ పొందినవారని, పైగా తన ఆరోగ్యానికి, గర్భధారణకు అనుగుణంగా నిర్ణయించిన వ్యాయామాలని కూడా పేర్కోంది. ఈ క్రమంలో అందరూ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి గర్భం భిన్నంగా ఉంటుందని, అందువల్ల ఇతర ప్రెగ్నెంట్‌ మహిళలెవ్వరూ తన వర్కౌట్లను అనుకరించొద్దని హెచ్చరించింది సమంత. 

తనలా వ్యాయామాలు చేయాలనుకుంటే వైద్యుడి సలహా సూచనల మేరకు చేయాలని విజ్ఞప్తి చేసిందామె. కాగా, సమంత రూత్ ప్రభు ఈ ఏడాది జూన్‌ మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అందుకోసమే కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇస్తున్నానని కూడా పేర్కొంది. 

 

(చదవండి: ఒకప్పుడు బాలీవుడ్‌ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్‌! ఎందుకో తెలుసా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement