గర్భంతో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు/మహిళలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నారని పెద్దగా పనులు చెప్పేందుకు ఇష్టపడరు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాగానీ అన్ని పనులు చేసుకుంటున్నారు. మరికొందరైతే వర్కౌట్స్ కూడా చేసి షాకిస్తున్నారు. సమంత కూడా అలానే బరువులు ఎత్తేస్తోంది. ఈ మేరకు ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?)
'కడుపుతో ఉన్నప్పటికీ నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కొనసాగిస్తున్నాను. దీనికోసం ఇంతకుముందే డాక్టర్ అనుమతి తీసుకున్నాను. నా ట్రైనర్ కూడా ప్రీనేటల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందిన వ్యక్తి. నా శరీర పరిస్థితి, అనుభవం, ప్రస్తుత గర్భధారణకు అనుగుణంగా ప్రతి వ్యాయామాన్ని అవసరమైన విధంగా మార్పులు చేసి చేస్తున్నాను'
'అయితే ప్రతి మహిళకు గర్భధారణ అనుభవం వేరేగా ఉంటుంది. నేను చేస్తున్న వ్యాయామాలు ఇతరులు వాళ్లకు వాళ్లు సొంతంగా చేయొద్దు. ప్రెగ్నెన్సీతో వర్కౌట్ చేసేముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణలోనే వ్యాయమం చేయండి' అని సమంత చెప్పుకొచ్చింది.
సామ్ జోరు చూస్తుంటే తొమ్మిది నెలతోనూ ఈ తరహా వర్కౌట్స్ చేస్తుందేమో అనిపిస్తుంది. గతంలో నాగచైతన్యని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఈ నటి.. గతేడాది డిసెంబరులో 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. రెండు నెలల క్రితం 'మా ఇంటి బంగారం' సినిమాతో హిట్ కొట్టిన సమంత.. ఈ ఏడాది చివరలోనే తల్లి కాబోతుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం)
(ఇదీ చదవండి: స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ)


