డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే బ్లడీ వయలెన్స్, హై ఎమోషన్ ఉన్న అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలే గుర్తొస్తాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' చేస్తున్న ఇతడు.. నిర్మాతగానూ ఓ చిత్రాన్ని తీశాడు. అదే 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. సెప్టెంబరు 3న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెప్పిన మాటలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి.
(ఇదీ చదవండి: ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత)
నేను రోమాంచకం కథని 'యానిమల్' చేస్తున్న టైమ్‌లో విన్నాను. మస్తు నవ్వుకున్నా.. ఈ స్టోరీలో నిజాయితీ ఉంది. నేను ఇలాంటి కథని రాయలేను. అందుకే నిర్మించాను. ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా నా సినిమాలకు రాలేదు ఈసారి రండి. థియేటర్ బయట మిమ్మల్ని ఎవడూ ఆపడు. ఎప్పుడూ 'ఏ' వచ్చేది… ఫస్ట్ టైమ్ మేం తీసిన సినిమాకు క్లీన్ 'యూ/ఏ' వచ్చింది అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. అలానే 'స్పిరిట్'కి మాత్రం కచ్చితంగా ఏ సర్టిఫికెట్ వస్తుందని స్పష్టం చేశాడు.
'రోమాంచకం' ట్రైలర్ బట్టి చూస్తే ఇదో జెన్-జీ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. హీరో ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతుంటాడు. ఆ ప్రయాణంలో హీరోయిన్ పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత అలకలు, అడ్డుగోడలూ మొదలవుతాయి. మరి ఈ ప్రేమకథ కంచికి ఎలా చేరిందనేదే మిగతా స్టోరీ. ప్రస్తుత యువత సైకాలజీని అర్థం చేసుకొని, వాళ్లకు నచ్చేలా ఓ ప్రేమకథ తీసినట్లు అనిపిస్తుంది. వేణు దర్శకుడు.
(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' ట్విటర్ రివ్యూ)


