రంభ ఊర్వశి మేనక ట్రైలర్.. ఫుల్ ఫన్‌గా ట్రైలర్ | Allari Naresh Ramba Oorvasi Menaka Trailer out now | Sakshi
Sakshi News home page

Ramba Oorvasi Menaka Trailer: భూలోకంలో బాయ్స్ వదులుతారా?.. ఫుల్ ఫన్‌గా ట్రైలర్

Aug 24 2026 5:23 PM | Updated on Aug 24 2026 5:26 PM

Allari Naresh Ramba Oorvasi Menaka Trailer out now

అల్లరి నరేష్‌ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్‌ కాస్మిక్‌ అన్నది ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీని తలపిస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన రంభ, ఊర్వశి, మేనక ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్‌ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement