ఆడంబరమైన పెళ్లి కాదు, కానీ ఆ సోదరులు చేసిన ఘనమైన వివాహ ఏర్పాటు ఆ గ్రామానికే కన్నుల పండుగగా మారింది. చూడటానికి ఆ సోదరులు స్థాయికి పెద్ద మొత్తం ఖర్చు అయినా..ఆ వధువుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతిని అందించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. రైతు కుమారులైన రోహిల్ ఖాన్, సాహిర్ ఖాన్‌లకు సమీప గ్రామానికి చెందిన ఇద్దరి అక్కాచెల్లెళ్లతో వివాహం జరిగింది. విమానంలో తమ అత్తారింటికి వెళ్లాలన్న ఆ వధువుల కోరికను నెరవేర్చేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే ఏర్పాటు చేశారు. దాంతో ఈ పెళ్లి వేడుక ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఆ హెలికాప్టర్‌ని చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అంతేగాదు అక్కడ స్థానికులు ఈ వివాహాన్ని తమ గ్రామానికే గర్వకారణమైన క్షణంగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. కాగా, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న పినాన్ రెస్ట్ హౌస్ నుంచి ఈ హెలికాప్టర్‌ని అద్దెకు తీసుకున్నట్లు ఆ వధువుల తండ్రి తెలిపాడు.
జస్ల్ నాలుగు గంటల బుకింగ్‌కి ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చు అయ్యిందట. హెలికాప్టర్ ఒక గ్రామంలో రెండు గంటలు, మరో గ్రామంలో మరో రెండు గంటలు గడిపి, పెళ్లిలోని ఇరు పక్షాలకు సేవలు అందించిందట. అయితే పెళ్లికొడుకులు మాత్రం సింపుల్‌గా తమ కాబేయే భార్యల కల కోసమే ఇలా చేశామని చెబుతుండటం విశేషం.
ఇదీ చదవండి: ఇంద్రధనస్సు, పచ్చదనం మెరుపుల్..! నీతా అంబానీ, రాధికా మర్చంట్‌ల ట్రెడిషనల్ లుక్!


