ట్రెండీ లుక్‌, రాయల్‌ వైబ్స్‌..బంధానీ దుస్తుల్లో మెరిసిన నీతా అంబానీ, రాధికా మర్చంట్‌ | fashion Tips: Nita Ambani Radhika Merchant Wore Bandhani outfits | Sakshi
Sakshi News home page

ఇంద్రధనస్సు, పచ్చదనం మెరుపుల్‌..! నీతా అంబానీ, రాధికా మర్చంట్‌ల ట్రెడిషనల్‌ లుక్‌!

Oct 19 2026 3:35 PM | Updated on Oct 19 2026 3:53 PM

fashion Tips: Nita Ambani Radhika Merchant Wore Bandhani outfits

ఏ వేడుకలైన అంబానీ ఇంట అదిరిపోవాల్సిందే. ధూం ధాం రేంజ్‌లో వేడుకలు జరుగుతాయి. ఇక ఈ దేవి నవరాత్రలు వేడుకలు కూడా ఏ స్థాయిలో జరుగతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్‌తోనూ తన కళా నైపుణ్యంతోనూ అలరిస్తారు. ఎప్పటిలానే ఈసారికూడా నీతా ఇంట నవరాత్రలు వేడుకలు ఆ తరహాలోనే సాగుతున్నాయి. 

అంతేగాదు ఈ వేడుకలో నీతా అంబానీ, చిన్న కోడలు రాధికా మర్చంట్‌ సాంప్రదాయ దుస్తులతో మెరిశారు. ముఖ్యంగా గుజరాత్‌ కళావైభవాన్ని చాటిచెప్పేలా అద్భుతమైన బంధానీ దుస్తుల్లో మెరిశారు. వారి ఫ్యాషన్‌వేర్ల తోటే పండుగ కళను తెచ్చారు. సాంప్రదాయ బంధానీ కళను భారతీయ హస్తకళతో మేళవించి, గొప్ప వస్త్ర వారసత్వానికి నివాళులర్పించారు. 

ఇంధ్రదనుస్సుని తలపించేలా నీతా..
గుజరాత్‌ వస్త్ర సంప్రదాయ వైభవాన్ని చాటి చెప్పేలా ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సు వర్ణపు బంధానీ చీరలో అందరినీ ఆకట్టుకుంది. గులాబీ, ముదురు, నీలం, పసుపు, ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన రంగులతో కూడిన చీరపై క్లిష్టమైన సాంప్రదాయ నమునాలు, జ్యామితీయ ఆకృతులు అలకిరించి ఉన్నాయి.

 ఆమె ఈ చీరకు మ్యాచింగ్‌గా బహుళ వర్ణాలతో భారీగా ఎంబ్రాయిడరీ చేసి..మోచేతి వరకు ఉండే బ్లౌజ్‌ని ధరించారు. అందుకు తగిన విధంగా బంగారు పచ్చల నెక్లెస్‌, పెద్ద ఝుమ్కాలు, సాంప్రదాయ బంగారు ఆభరణాలు, రంగురంగుల గాజులతో ఇంధ్రధనుస్సే ముంగిట వాలిందా అన్నంద అందంగా మెరిశారు నీతా అంబానీ. ముఖ్యంగా ఆమె ధరించిన చీరలోని రంగులు పండుగ శోభను అందించాయి. 

పచ్చదనం రంగులో పసిడి బొమ్మలా రాధికా..
ఇక రాధికా మర్చంట్‌ బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిని ముదురు సీసా ఆకుపచ్చ రంగు సాంప్రదాయ దుస్తులలో పుత్తడి బొమ్మలా మెరిసింది. పూల నమునాలు, జ్యామీతాయ డిజైన్‌లు క్లిష్టమైన హస్తకళా వైభవాన్ని చాటి చెప్పాయి. ఈ చుడిదార్‌కి మ్యాచింగ్‌గా బంధానీ స్పూర్తితో డిజైన్‌  చేసిన, ఆరెంజ్‌-పింక్‌ దుప్ట్టాను జత చేశారు. ఆకుపచ్చకి కాంట్రాస్టింగ్‌గా దుప్పటా రంగు నిలిచి మరింత అందాన్ని ఇచ్చింది రాధికాకు. 

అంతేగాదు ఈ అత్తా కోడళ్ల రాయల్‌ లుక్‌ ఇద్దరి మధ్య పోటీ లేదు అనేలా చూపురులను ఆకర్షించారు. రాధకా నిరాడంబరతకు పెద్దపీట వేస్తూ స్టేట్‌మెంట్‌ ​చెవిపోగులు వదులైన చుట్టుతో సింపుల్‌ లుక్‌నే ఎంచుకుందామె. అలాగే అనంత్‌ అంబానీ ప్రకాశవంతమైన మెజెంటా పింక్‌ రంగు పూర్తి చేతులతో కూడిన కుర్తాలో కనిపించారు. అంతేగాదు ఇరువురు తమ నృత్యంతో అభిమానులను ఆకట్టుకున్నారు.  

 

ఇదీ చదవండి: ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర! రూ.420 కోట్ల వజ్రాల అలంకరణ..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement