వివిధ ఫ్యాషన్ షోలో ఎన్నో విలక్షణమైన లగ్జరీయస్ డ్రెస్‌లు చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా అత్యంత ఖరీదైన డిజైనర్‌వేర్‌తో ఫ్యాషన్ ప్రపంచమే విస్తుపోయేలా చేసింది. ఇది మొత్తం వజ్రాలతో డిజైన్ చేసింది. అంతేగాదు ఇప్పటి వరకు తయారు చేసిన వాటిలో ఈ డిజైనర్‌వేరే అత్యంత ఖరీదైనదట.
29 ఏళ్ల ఈ రియాలిటీ స్టార్, బ్యూటీ ఎంటర్‌ప్రెన్యూర్ కైలీ జెన్నర్ విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోపై రన్‌వేపే క్యాట్‌వాక్‌తో అందర్ని కట్టిపడేసింది. ముఖ్యంగా తన బ్యూటీ ఫుల్ లుక్ అత్యంత లగ్జరీ ఇన్నర్‌వేర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా వజ్రాలు పొదిగిన ఫాంటసీ బ్రా'ను ధరించి విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో అరంగేట్రం చేసింది. ఇదేమి సాధారణ ఫాంటసీ బ్రా కాదు. ఇప్పటి వరకు తయారు చేసిన వాటిలో అత్యంత ఖరీదైనది.
నిజానికి ఫాంటసీ లో దుస్తుల శకం ముగిసిపోయిందన్న ఆలోచనను తప్పు అని నిరూపించింది విక్టోరియాస్ సీక్రెట్. 2018లో చివరిసారిగా రన్‌వేపై కైలీ జెన్నర్ మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ ఫ్యాషన్ షోతో రన్‌వే పైకి వచ్చింది. దీన్ని జాకబ్ అండ్ కోకు చెందిన హై-జ్యువెలరీ డిజైనర్ జాకబ్ అరబో డిజైన్ చేశారు.
ఈ బ్రాలో అద్భుతమైన 75.54 క్యారెట్ల రేడియంట్ కట్ పసుపు వజ్రం చుట్టు దాదాపు నాలుగు వేల సహజ వజ్రాలు పొదిగి ఉన్నాయి. దీని బరువు సుమారు 1.8 కిలోలుపైనే ఉంటుందట. దీన్ని తయారు చేయడానికి వెయ్యిగంటల సమయం పైనే పట్టిందట. సుమారు వెయ్యిమంది కళాకారులు సృష్టి అట అది. ఇక తన తొలి విక్టోరియస్ సీక్రెట్ రన్‌వే లుక్ కోసం కైలీ తెల్లటి ఈకల రెక్కలు ఒక చిన్న తెల్లటి మినీ స్కర్ట్ , పారదర్శక హిల్స్‌ని జత చేసింది.
ఆమెనే ఎందుకంటే..
విక్టోరియాస్ సీక్రెట్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఆడమ్ సెల్మాన్ కైలినే ఎందుకు ఎంచుకున్నారో వివరణ ఇస్తూ ఇలా చెప్పుకొచ్చారు. భారీ పాలోయింగ్, గొప్ప సాంస్కృతిక ప్రభావం ఉన్న ప్రతిభావంతురాలి కావడంతో కైలీని ఈ షోకు ఎంపిక చేసుకున్నామని చెప్పారు. కైలీ అయితేనే ప్రేక్షకులను ఆకర్షించగలదని అన్నారు. కాగా, కైలీ విక్టోరియాస్ సీక్రెట్ అనుభవజ్ఞులు, కొత్త తరం సూపర్ మోడల్స్‌తో కూడిన బృందంతో రన్‌వేపై క్యాట్‌వాక్ పంచుకుంది.
ఇదీ చదవండి: న్యాయవాద వృత్తిని వద్దని మెకానిక్ ఉద్యోగం..! వేతనం ఎంతంటే..


