దసరా రేపా? ఎల్లుండా?.. పండితులు చెబుతున్నదిదే! | Dussehra 2026 Date 20 or 21 October? | Sakshi
Sakshi News home page

దసరా రేపా? ఎల్లుండా?.. పండితులు చెబుతున్నదిదే!

Oct 19 2026 9:56 AM | Updated on Oct 19 2026 10:04 AM

Dussehra 2026 Date 20 or 21 October?

న్యూఢిల్లీ: ఈ ఏడాది దసరా (విజయదశమి) పండుగ తేదీ విషయంలో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ఆశ్వయుజ శుక్ల దశమి తిథి రెండు రోజుల పాటు రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఉత్తర భారతదేశం, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అక్టోబర్ 20న దసరా వేడుకలు జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ సంప్రదాయాలు, సిందూర్‌ ఖేల్‌ విగ్రహ నిమజ్జనాల ప్రకారం అక్టోబర్ 21న విజయదశమి నిర్వహిస్తున్నారు.

పంచాంగం లెక్కల ప్రకారం దశమి తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం ప్రారంభమై, అక్టోబర్ 21 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. పూజలు నిర్వహించడానికి అక్టోబర్ 20 మధ్యాహ్నం విజయ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా పండితులు పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో రామ్‌లీలా ముగింపు సందర్భంగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మల దహనాన్ని అక్టోబర్ 20 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్థానిక వేడుకల ఏర్పాట్ల ఆధారంగా చేపట్టనున్నారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ రోజున ఆయుధ పూజ, వాహనాలు, వృత్తి పనిముట్లకు పూజలు చేయడం ఆచారంగా వస్తోంది. వ్యాపారులు లెక్కల పుస్తకాలకు పూజలు చేస్తారు. వీటితో పాటు శమీ (జమ్మి) వృక్షాన్ని పూజించడం ద్వారా విజయం, సౌభాగ్యం లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. 

ఇదీ చదవండి: తమిళనాట ​వర్ష బీభత్సం.. చెన్నై సహా పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement