ప్రయాణంలోనూ ఫ్యాషన్‌ ఐకాన్‌గా కనిపించాలంటే.. ఇలా రెడీ అవ్వండి! | Men's Travel Fashion Vacation Style Tips | Sakshi
Sakshi News home page

ప్రయాణంలోనూ ఫ్యాషన్‌ ఐకాన్‌గా కనిపించాలంటే.. ఇలా రెడీ అవ్వండి!

Oct 18 2026 1:14 PM | Updated on Oct 18 2026 1:16 PM

Men's Travel Fashion Vacation Style Tips

ఫండే

ట్రెండీమెన్‌

విమానంలో కూర్చున్నా, కారులో గంటలకొద్దీ ప్రయాణించినా, పోలో టీషర్ట్‌ మాత్రం ఎప్పుడూ హ్యాండ్సమ్‌ చాయిస్‌. మరీ బిగుతుగా కాకుండా, మరీ వదులుగా కాకుండా ఉండే కాటన్‌ పోలో కంఫర్ట్‌లో కింగ్‌.  

చలికి లుక్‌కు కూడా!
వాతావరణం ఎప్పుడు ఏ ట్విస్ట్‌ ఇస్తుందో చెప్పలేం. ఉదయం ఎండైతే, రాత్రికి చల్లగాలి! అందుకే, సూట్‌కేస్‌లో ఎప్పుడూ ఒక తేలికపాటి జాకెట్‌కు చోటివ్వాలి. బాంబర్‌ జాకెట్‌ అయితే క్యాజువల్‌ లుక్‌కు, లైట్‌ బ్లేజర్‌ అయితే బిజినెస్‌ మీటింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది.

ఆల్‌ రౌండర్‌!
లినెన్‌ షర్ట్‌కి సెలవులు, బీచ్‌లు అంటే చాలా ఇష్టం. కానీ దాని పని అంతటితో అయిపోదు! సరిగ్గా స్టయిల్‌ చేస్తే రెస్టారెంట్, క్యాజువల్‌ మీటింగ్, సిటీ టూర్‌– అన్నింటికీ సరిపోతుంది. తెలుపు, లేత నీలం, బీజ్, ఆలివ్‌ వంటి రంగుల్లో ఒకటుంటే చాలు. షార్ట్స్‌తో వేసుకుంటే హాలిడే లుక్‌ గ్యారెంటీ.

విలాసం పట్టు!
షర్ట్‌ అంటే కాటన్, లినెన్‌ మాత్రమే అనుకునే వారికి సిల్క్‌ షర్ట్‌ కాస్త కొత్త అనుభూతి ఇస్తుంది. సాదా రంగులో ఉండే సిల్క్‌ షర్ట్‌కి ట్రౌజర్‌ జత చేస్తే వెంటనే లుక్‌లో లగ్జరీ టచ్‌ వచ్చేస్తుంది. ముఖ్యంగా రిసార్ట్‌ డిన్నర్, నైట్‌ అవుట్‌ లేదా ట్రాపికల్‌ వెకేషన్‌ లో ఇది బాగా పనిచేస్తుంది.

ఒక్క ప్యాంట్‌తో రెండు పనులు!
ఎక్కువ బట్టలు తీసుకెళ్లకుండా ఎక్కువ లుక్స్‌ కావాలంటే ప్యాటర్న్‌ ఉన్న ట్రౌజర్‌ బాగా ఉపయోగపడుతుంది. చిన్న చెక్స్, సింపుల్‌ టెక్స్చర్‌ ఉన్న ట్రౌజర్‌– షర్ట్, టీషర్ట్‌ దేనికైనా సరిపోతుంది. అలా ప్యాంట్‌ ఒక్కటే గాని, పాత్రలు మాత్రం ఎన్నో!

అడుగుల్లో క్లాస్‌!
ప్రయాణంలో చెప్పుల విషయంలో పొరపాటు చేస్తే మొత్తం లుక్‌ తలకిందులే. అందుకే కనీసం ఒక మంచి జత సెమీ–ఫార్మల్‌ షూస్‌ వెంట ఉండటం మంచిది.

వెకేషన్‌ కు రంగుల టికెట్‌!
వెకేషన్‌కు వెళ్లి కూడా ఆఫీస్‌ షర్ట్‌లలోనే తిరిగితే వెకేషన్‌ కూడా వెకేట్‌ చేస్తుంది! అందుకే ఒకటి రెండు ప్రింటెడ్‌ కాటన్‌ షర్ట్‌లు తప్పనిసరి. ప్రింట్లు, చిన్న మోటిఫ్‌లు, కాస్త రంగులున్న షర్ట్‌లు హాలిడే మూడ్‌ను వెంటనే పెంచేస్తాయి.

డెనిమ్‌ టర్న్‌!
బ్లూ జీన్‌ ్స ప్రతి మగాడి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. కానీ ట్రావెల్‌ సూట్‌కేస్‌లో ఒక వైట్‌ డెనిమ్‌ ఉంటే లుక్‌కు కొత్తదనం వస్తుంది. అయితే తెల్లటి డెనిమ్‌కు చిన్న మచ్చ కూడా పెద్ద ఇబ్బందే కాబట్టి, ప్రయాణంలో కాస్త జాగ్రత్త!

లేయరింగ్‌లో హీరో!
టీషర్ట్‌ మీద డెనిమ్‌ షర్ట్‌ను ఓపెన్‌ గా వేసుకోవడం ఎప్పటికీ పాతబడని స్టయిల్‌. మరో ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే, లుక్‌ను లేయర్‌ చేయడంతో పాటు ఎండ నుంచి రక్షణ కూడా ఇస్తుంది.

బ్యాగ్‌లో తప్పనిసరి!
స్టయిల్‌కి దుస్తులు మాత్రమే సరిపోవు. లుక్‌ను పూర్తి చేసేది యాక్సెసరీసే! సన్‌ గ్లాసెస్, వాచ్, బెల్ట్, వాలెట్, క్యాప్‌ లేదా టోపీ వంటి సింపుల్‌ యాక్సెసరీస్‌ వెంట పెట్టుకోవాలి. కెమెరా ముందు మరింత ఫ్రెష్‌గా కనిపించాలంటే, ఫేస్‌ వాష్, మాయిశ్చరైజర్, సన్‌ స్క్రీన్‌వి చిన్న పౌచ్‌లో సెట్‌ చేసుకుంటే మంచిది. అలా బ్యాగ్‌లో బట్టలు తక్కువైనా పర్లేదు. కాని, ప్రతి కాస్ట్యూమ్‌ ఎక్కువ పని చేసేలా ప్లాన్‌ చేసుకోండి.
- కొండి దీపిక

ఇదీ చదవండి: ఇంద్రధనుస్సు గొడుగు మాయ.. బుజ్జి చేసిన పనికి అక్క ఫిదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement