breaking news
Travel
-
HYD: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒక్క టిక్కెట్‌తో డబుల్ జర్నీ!
సాక్షి, హైదరాబాద్: ఒకే టికెట్‌పై సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ, మెట్రో రోజువారీ, నెలవారీ ఉమ్మడి పాస్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రజాభవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ పాస్, ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఉమ్మడి పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్లలో లభించనున్నాయి. ఈ పాస్‌లతో పుష్పక్ మినహా ఔటర్‌రింగ్ లోపల నడిచే అన్ని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో, మెట్రోరైళ్లలో వినియోగించుకోవచ్చు. నగర బస్సుల్లో నిత్యం సుమారు 25 లక్షలు, మెట్రో రైళ్లలో 4.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజువారీ ప్రయాణాలకు చాలామంది బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగిస్తున్నారు. ఈ రెండు సేవల మధ్య సులభంగా మారే సౌకర్యం ఉమ్మడి పాస్‌లతో లభించనుంది.రెండు రకాలుగా.. కార్డుకు అదనంగా రూ.వందరెండు రకాల ఉమ్మడి పాస్‌లు ఉంటాయి. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8500 చొప్పున ఉంటుంది. ఈ చార్జీల్లో డెయిలీ పాస్‌పై రూ.100, నెలవారీ పాస్‌పై రూ.1500 చొప్పున ఆర్టీసీ ఖాతాలో జమ అవుతాయి. మెట్రోకు డెయిలీపై రూ.300, మంత్లీ పాస్‌పై రూ.7,000 చొప్పున లభిస్తాయి. మొదటిసారి ఉమ్మడి పాస్‌ను కొనుగోలు చేసినప్పుడు కార్డు ధర రూ.100 అదనంగా చెల్లించాలి. దీనిని తిరిగి ఇచ్చేటప్పుడు రూ.వంద వాపస్ ఇస్తారు.సిటీ బస్సుల్లో టికెట్ లెస్ జర్నీ..మరోవైపు సిటీ బస్సుల్లోలో టికెట్లెస్ జర్నీ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. కాగితపు టికెట్లకు బదులు మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రదేశం, గమ్యస్థానాలను ఎంపిక చేసుకొని డిజిటల్ విధానంలో సులభంగా చార్జీలను చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ వస్తుంది. ప్రయాణ సమయంలో దీనిని కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ వీక్లీ బస్ పాస్ రూ.600మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు రూ.600 చెల్లించి డిజిటల్ వీక్లీ బస్ పాస్ కూడా తీసుకోవచ్చు. బస్‌పాస్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే వీక్లీ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌తో వారం పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన వెంటనే మొబైల్ యాప్‌లోనే అప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: చదువు.. ఉపాధి -
భుజియా నుంచి కచోరీ వరకు.. బికనీర్ ఫుడ్ ట్రిప్ అదుర్స్!
ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్‌లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.రాజస్థాన్ లోని ఒక పురతాన రాజ వంశానికి చెందిన ఒక డిష్ ఇక్కడి సంస్కృతిగా మార్చింది. 1877 లో బికనీర్ మహారాజా డుంగర్ సింగ్ కిచె¯Œ లో మొదలైన ఒక చిన్న ప్రయోగం, ఇవాళ ప్రపంచం మొత్తం ఆస్వాదించే స్నాక్‌గా మారింది.మొదట్లో టేస్టీగా ఉండే భుజియాను రాజుల కోసం మాత్రమే వండేవారు. ఇది మోత్ దాల్ (బొబ్బర్లు), శనగపిండి, బికనీర్ ఎడారిలో లభించే మిర్చీం ఈ మూడింటి కలయిక.బికనీర్ ఓల్డ్ స్ట్రీట్స్లోకి వెళ్తే ఇది ఒక ఊరు కాదు, ఇది పెద్ద కిచెన్ అని అర్థం అవుతుంది. ఉదయం ఆరు గంటలకే భుజియా బజార్లో కడాయిలు మంటలపై సెట్ అయిపోతాయి. చేతి యంత్రం నుండి బంగారు తీగల్లా జారుతున్న భుజియా, తరువాత వచ్చే ఘాటైన వాసన ఇవన్నీ బికేనేర్ వెళ్లి ఫీల్ అవ్వాల్సిన ఇమోషన్స్.ఒకే వీధిలో ఒక ఇంట్లో భుజియా, మరో ఇంట్లో పాపడ్లు సిద్ధం అవుతుంటాయి. ఇక్కడి పాపడ్ సాధారణ పాపడ్ కాదు. చేతితో సాగదీసిన పెద్ద పాపడ్, ఎడారి గాలి తగిలి మరింత గట్టిపడుతుంది.రుచి వెనుక మనుషులు..మొదట్లో భుజియా అనేది ఇంట్లో ఆడవాళ్లు చేసే లావుపాటి చిరుతిండి మాత్రమే. హల్దీరామ్ అని పిలిచే గంగా బిషన్ అగర్వాల్ అనే వ్యక్తి తన అత్త దగ్గర టేస్టీ భుజియా మేకింగ్‌ను నేర్చుకున్నారు. తరువాత లావుపాటి భుజియాను నోట్లో కరకరలాడే నాజూకు భుజియాగా మార్చాడు.1937లో బికనీర్‌లో అత్త నేర్పిన రెసిపీతో మొదలైన చిన్న కొట్టే హల్దీరామ్. ఇవాళ అది భారత దేశంలో మెక్‌డొనాల్డ్స్‌ను దాటేసిన బ్రాండ్‌గా ఎదిగింది. హల్దీరామ్ వేసిన మార్గంలోనే భికారామ్ చాంద్ మాల్, బికాజీ. ఇలా బికా పేరుతో వచ్చే చాలా సంస్థలు హల్దీరామ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రువులు స్థాపించినవే. వీటిలో పలు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కూడా అయ్యాయి.వీళ్లలో చాలా మంది ఒకే కుటుంబం వాళ్లే కాబట్టి, హల్దీరామ్ పేరు ఎవరిది అని కోర్టులో ఇప్పటికీ గొడవలు నడుస్తున్నాయి. బ్రాండ్లు వేరైనా, రుచి మాత్రం ఒకటే అదే బికనీర్ మట్టి రుచి.బికనీర్‌లో ప్రారంభమైన స్నాక్స్ ఫెస్టివల్ కేవలం భుజియా, పాపడ్ వరకే పరిమితం అవ్వలేదు. తరువాత స్వీట్స్ కూడా ΄్యాకేజ్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. తెల్లగా ఉండే బెంగాల్ రసగుల్లా మెత్తగా ఉంటే, బికనీర్ రసగుల్లా కాస్త కమిలిన రంగులో, పాల ఘాటుతో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. ఇక్కడి లోకల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి అంటే సాయంత్రం కోటా గేట్ దగ్గర కచోరీ తినాలి. వేడి కచోరీ మీద ఒక పిడికెడు భుజియా చల్లి ఇస్తారు. అదే బికనీర్ స్టైల్.బికనీర్ స్నాక్స్ కేపిటల్ ఎందుకు అయింది?ఎడారిలో నీరు తక్కువ, కూరగాయలు తక్కువ. అందుకే ఇక్కడి వాళ్లు నిల్వ ఉండే రుచులను కనిపెట్టారు. భుజియా నెలల తరబడి చెడిపోదు. పాపడ్ ఏడాది పాటు ఉంటుంది. లేని దాని గురించి ఆలోచించి బాధ పడుకుండా ఉన్నదాని నుంచి అద్భుతాలు చేయడమే బికనీర్ స్పెషాలిటీ. అందుకే దీనికి ఇటీవలే జీఐ ట్యాగ్ వచ్చింది. అసలు బికనీరీ భుజియా అంటే బికనీర్ లో చేసిందే.బికనీర్ భుజియా ప్రయాణం తెలుసుకున్న అక్కడికి వెళ్లాలి అనిపించడంలో తప్పేం లేదు. వెళ్లొచ్చు కూడా. హైదరాబాద్ నుండి జైపూర్ మీదుగా బికనీర్ వెళ్లి రెండు రోజుల్లో లోకల్ ఫ్లేవర్ ఎక్స్΄్లోర్ చేయవచ్చు. ఈ రెండు రోజుల ట్రిప్ అనేది అక్కడి కట్టడాలు, నిర్మాణాలు చూడటానికి కాదు. అలాగే నచ్చింది తినడానికి మాత్రమే కాదు..ఒక రుచి ఎలా బతుకుతుందో చూడడానికి ఈ ట్రిప్ ΄్లాన్ చేయాలి.ఇదీ చదవండి: ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట! -
ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట!
సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే. కూర్గ్ నే కాఫీ ప్యారడైజ్ అని ఎందుకంటారు అంటారు?కర్ణాటకలోని కొడగు జిల్లానే కూర్గ్. దీన్ని అందరూ భారతదేశపు స్కాట్లాండ్ అంటారు. కాఫీ లవర్స్ దీనిని కాఫీ కేపిటల్ అని కూడా అంటారు. భారతదేశంలో పండే మొత్తం కాఫీలో 60 శాతం ఒక్క కూర్గ్ లోనే పండుతుంది.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మామూలు తోట కాదు. ఇది అడవి తోట. వంద అడుగుల ఎత్తు పెరిగే రోజ్ వుడ్, టేకు, సిల్వర్ ఓక్ చెట్ల నీడలో కాఫీ మొక్కలు పెరుగుతాయి. ఆ చెట్లకే నల్ల మిరియాల తీగలు, వనిల్లా తీగలు అల్లుకుని ఉంటాయి.ఈ తోటల మధ్యలోనే ఏనుగులు, చిరుతలు, హార్న్ బిల్ పక్షులు తిరుగుతాయి. ఎండలో కాకుండా నీడలో నెమ్మదిగా పెరగడం వల్ల కూర్గ్ కాఫీ గింజలో చేదు తక్కువ, పండ్ల తీపి, చాక్లెట్ సువాసన ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే బెస్ట్ షేడ్ గ్రోన్ కాఫీ అంటారు.ఎప్పుడు వెళ్లాలి?కూర్గ్ ను సంవత్సరం పొడవునా చూడవచ్చు, కానీ కాఫీని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వెళ్లవచ్చు. ఇది హార్వెస్ట్ సీజన్ం ఇదే బెస్ట్ టైమ్. చలి కాలంలో, ఉదయాన్నే తోటలపై దట్టమైన మంచు, మధ్యాహ్నం వెచ్చని ఎండ. ఈ సమయంలోనే ఎర్రగా పండిన కాఫీ చెర్రీలను కోస్తారు. మీరు కూడా తోటలోకి వెళ్లి చెర్రీలు కోయవచ్చు.తరువాత మార్చి నుండి మే వరకు ఫ్లవరింగ్ సీజన్ లో వెళ్లవచ్చు. ఈ సమయంలో కాఫీ మొక్కలకు తెల్లని పూలు పూస్తాయి. లోయ మొత్తం తెల్లగా మారి, గాలి అంతా మల్లెపూల వాసన వస్తుంది. స్థానికులు దీన్ని కూర్గ్ స్నో అని పిలుస్తారు. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు అడవి మరింత పచ్చగా ఉంటుంది, కానీ వర్షం ఎక్కువగా ఉంటుంది. కాఫీ కోసం కాకుండా నేచర్ కోసం వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.హైదరాబాద్ నుండి ఎలా ప్లాన్ చేయాలి?హైదరాబాద్ నుండి కూర్గ్ సుమారు 700 కిలోమీటర్లు. 3 రోజుల ట్రిప్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. ఫాస్ట్ గా వెళ్లాలంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఫ్లైట్ ఎక్కండి. కేవలం గంటా 15 నిమిషాల్లో బెంగుళూరు చేరిపోతారు.బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుండి మడికేరి వరకు క్యాబ్ లేదా కేఎస్ఆర్టీసి ఐరావత్ బస్సులో ఆరు గంటల్లో కూర్గ్ చేరుకోవచ్చు.బడ్జెట్ లో వెళ్లాలంటే..హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ నుండి మడికేరికి డైరెక్ట్ కేఎస్ఆర్టీసి, వీఆర్ఎల్, ఎస్సారెస్ బస్సులు ఉన్నాయి. రాత్రి 8 గంటలకు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కూర్గ్ లో ఉంటారు.రోడ్ ట్రిప్..సొంత కారులో అయితే హైదరాబాద్ – బెంగళూరు – మైసూర్ – కుశాల్ నగర్ – మడికేరి రూట్ చాలా బాగుంటుంది.ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి?హోటల్ లో కాకుండా కాఫీ ఎస్టేట్ హోమ్ స్టేలో ఉండండి. అప్పుడే అసలైన కూర్గ్ ఫీలింగ్‌ను సొంతం చేసుకోవచ్చు. టాటా కాఫీ ప్లాంటేషన్ ట్రైల్స్, మెర్కారా గోల్డ్ ఎస్టేట్, ది తమరా కూర్గ్ బెస్ట్ ఆప్షన్స్.ఉదయాన్నే ఎస్టేట్ ఓనర్ తో కలిసి ప్లాంటేషన్ వాక్ చేయండి. కాఫీ రోస్టింగ్, క్యూరింగ్ ఎలా చేస్తారో చూడండి. కొడవ స్పెషల్ కర్రీ, అక్కి రోటీ తినండి. అబ్బే ఫాల్స్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, నాగరహోళె టైగర్ రిజర్వ్ కూడా చూడండి.తిరిగి వచ్చేటప్పుడు ఎస్టేట్ నుండి ఫ్రెష్ గా రోస్ట్ చేసిన అరబికా గింజలు తీసుకురావడం మర్చిపోకండి. ఒక్కసారి కూర్గ్ అడవి కాఫీ తాగితే, మళ్ళీ సిటీ కాఫీ మీకు రుచించదు.ఇదీ చదవండి: బీచ్ ప్యారడైజ్.. 115 దీవుల సీషెల్స్ అసలు అందం ఇదే! -
బీచ్ ప్యారడైజ్.. 115 దీవుల సీషెల్స్ అసలు అందం ఇదే!
ఇక్కడ సముద్రం ఎక్కువగా హడావుడి చేయదు. అలల సవ్వడి, చల్లగా తనువును మీటే గాలి, తెల్లని ఇసుక మధ్య నెమ్మదిగా సాగే జీవితం...సీషెల్స్‌లో సమయం కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. దీనినే ఐలాండ్ టైమింగ్ అని కూడా అంటారు. ఆఫ్రికా తూర్పు తీరానికి దూరంగా, హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న సీషెల్స్ 115 దీవులతో కూడిన ద్వీప దేశం. మాహె, ప్రాలిన్, లా డిగ్యూ వంటి దీవులు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ప్రకృతి, సముద్రం, గ్రానైట్ శిలలు, పచ్చని అడవులు, క్రియోల్ సంస్కృతి కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాయి. అందుకే సీషెల్స్ యాత్ర కేవలం బీచ్ హాలిడేగా మిగిలిపోదు. ఒక కంప్లీట్ డెస్టినేషన్ అనుభూతిని మదినిండా నింపుతుంది..సీషెల్స్ అసలు ప్రయాణం అనేది మాహె దీవి నుంచే మొదలవుతుంది. సీషెల్స్ రాజధాని విక్టోరియా ఇక్కడే ఉంది. చిన్న నగరమైన విక్టోరియాలో లోకల్ మార్కెట్, సీఫుడ్ , క్రియోల్ కల్చర్ స్థానికులు జీవన విధానాన్ని గమనించవచ్చు. నగరం నుంచి కొంచెం దూరం వెళ్తే పచ్చని కొండలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న దీవులు ప్రయాణికులను తప్పకుండా ఆకర్షిస్తాయి.ప్రాలిన్ దీవిలో వాల్లీ డి మే ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ΄÷ందిన ఈ అడవిలో కొకో డి మెర్ పామ్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అడవి మధ్య నడుస్తుంటే చుట్టూ ఉన్న నిశ్శబ్దం, పక్షుల సవ్వడితో కలిసి మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.లా డిగ్యూ అనే ప్రాంతంలో స్లో టూరిజాన్ని అనుభూతి చెందవచ్చు. ఇక్కడ ఎక్కువ హడావిడి ఉండదు. చాలా మంది సైకిళ్లపై తిరుగుతూ ఉంటారు. పది గంటలకు కలుస్తా అన్న వ్యక్తి ఇక్కడ పదిన్నరకు కలిసినా ఎవరూ ఏమీ అనుకోరు. ఐలాండ్ టైమింగ్స్, అక్కడి లైఫ్స్టైల్లో టైమ్ కన్నా ప్రశాంతతే ఇంపార్టెంట్ అనుకుంటారు.ఇక సీషెల్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన వ్యూస్ అంటే వైట్ శాండ్, భారీ గ్రానైట్ రాళ్లు చూడాలి అనుకుంటే అన్సే సోర్స్ డీ ఆర్జెంట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందే.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి సీషెల్స్‌కు డైరక్ట్ విమానాలు లేదు. ఈ ప్రయాణం మాహెలోని సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది. మేఘాల పైనుంచి హిందూ మహాసముద్రం వైపు సాగుతూ, చివరికి నీలి సముద్రం మధ్యలో ఉన్న దీవి కనిపించే క్షణం ఈ యాత్రకు అందమైన ఆరంభంలా అనిపిస్తుంది.తక్కువ ధరకు లభించే టికెట్ కొంటే రెండు విమానాలు మార్చాల్సి ఉంటుంది. ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో సుమారు 25 గంటల వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. అదే ఫాస్టెస్ట్ టికెట్ కొంటే 10 గంటల్లోనే నేరుగా చేరుకోవచ్చు.విజయవాడ నుంచి వచ్చేవారు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాచ్ చేయవచ్చు. మాహె నుంచి ప్రాలిన్కు ఫెర్రీ లేదా డొమెస్టిక్ ఫ్లైట్, ప్రాలిన్ నుంచి లా డిగ్యూకు ఫెర్రీ ప్రయాణం ఈ యాత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. సముద్రం మధ్య సాగే ఈ చిన్న ప్రయాణాలు కూడా సీషెల్స్ అనుభవంలో భాగమే.ఏం చూడాలి?సీషెల్స్‌లో చూడాల్సింది కేవలం బీచ్ మాత్రమే కాదు. మాహె కొండలపై నుంచి కనిపించే సముద్రం, ప్రాలిన్ అడవుల్లోని కొకో డి మెర్ చెట్లు, లా డిగ్యూ గ్రానైట్ శిలల మధ్య మెరిసే బ్లూ వాటర్ంఇవన్నీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి.సముద్రంలో స్నార్కెలింగ్ చేస్తుంటే నీటి కింద కదిలే చేపల గుంపులు, పగడపు దిబ్బలు ఇవన్నీ చూస్తే మనం మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేస్తాయి.లా డిగ్యూలో సైకిల్‌పై నెమ్మదిగా సముద్రపు గాలిని ఫీల్ అవ్వడం తప్పకుండా సీషెల్స్ ఐకానిక్ ఎక్స్పీరియెన్్సగా మిగిలిపోతుంది. సాయంత్రం బీచ్ పక్కన కూర్చుని సన్‌సెట్‌ను చూడటం, నైట్‌లో స్టార్ గేజ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న సరదాలే జర్నీలో హైలైట్‌గా నిలిచిపోతాయి.ఎక్కడ ఉండాలి?రాజధాని విక్టోరియా ఉండే మాహె ఐల్యాండ్ ప్రాంతం చుట్టూ సముద్రానికి దగ్గరగా ఉండే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు కనిపిస్తాయి. మార్నింగ్ బాల్కనీ తలుపు తెరిచినప్పుడు ముందుగా సముద్రం కనిపించడం ఒక స్పెషల్ ఎక్స్పీరియెన్్సగా మిగిలిపోతుంది..ప్రాలిన్లో పచ్చని చెట్ల మధ్య ఉండే రిసార్టులు, విల్లాలు ప్రకతికి మరింత దగ్గర చేస్తాయి. లా డిగ్యూలో చిన్న గెస్ట్‌హౌస్‌లు, స్థానిక శైలిలో ఉండే వసతులు దీవి నిదానమైన జీవన విధానాన్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి.ఆసక్తికరమైన విషయాలు..- సీషెల్స్‌లో మొత్తం 115 దీవులు ఉన్నాయి. వాటిలో మాహె అతిపెద్ద దీవి.- విక్టోరియా సీషెల్స్ రాజధాని. ఇది మాహె దీవిలో ఉంది.- కొకో డి మెర్ పామ్ చెట్టు సీషెల్స్‌కు ప్రత్యేక గుర్తింపు. దీని విత్తనం ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనాల్లో ఒకటి. దీని బరుకు 30 కిలోల వరకు ఉంటుంది.- అల్డబ్రా జెయింట్ టార్టాయిస్ సీషెల్స్‌కు చెందిన ప్రత్యేక వన్యజీవుల్లో ఒకటి.- సీషెల్స్ రూపీ స్థానిక కరెన్సీ. పర్యాటక ప్రాంతాల్లో యూరో, అమెరికన్ డాలర్ వంటి కరెన్సీలను కూడా అనేక చోట్ల స్వీకరిస్తారు.ఏం తినాలి?సీషెల్స్‌లో ఫుడ్ అక్కడి ఐలాండ్ కల్చర్‌ను రిప్రెజెంట్ చేస్తుంది. క్రియోల్ వంటకాల్లో ఫ్రెంచ్, ఆఫ్రికన్, భారతీయ టచ్ కనిపిస్తుంది. ఫ్రెష్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ ఫిష్, కొబ్బరితో తయారు చేసే వంటకాలు ట్రై చేయవచ్చు..ఇక్కడి పాపులర్ డిషెస్‌లో ఆక్టోపస్ కర్రీ కూడా ఒకటి. ఇలాంటి ఎక్స్పరిమెంట్ ఫుడ్ ఎవాయిడ్ చేయకూడదు అనుకుంటే స్కిప్ చేయండి. కావాలంటే మీరు అరటి పండు, కొబ్బరి పాలు వంటి పదార్థాలతో తయారు చేసే లడోబ్ స్వీట్ ట్రై చేయవచ్చు. లేదంటే బీచ్ పక్కనే ఉన్న లోకల్ రెస్టారెంట్లో చేపలతో చేసిన వెరైటీలు ట్రై చేయవచ్చు. యాత్ర, బడ్జెట్ వివరాలు?సీషెల్స్‌లో ఐదు రోజులు ట్రిప్ ΄్లాన్ చేస్తే బడ్జెట్ అనేది మీ స్టే అండ్ ఫ్లై చార్జీలను బట్టి మారుతుంది. హైదరాబాద్ నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అనేది సీజన్, ఎయిర్లైన్్స, బుకింగ్ సమయాన్ని బట్టి సుమారు రూ.70 వేల నుంచి రూ.1 లక్షా 15 వేల వరకు ఉంటుంది.అక్కడ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ. బేసిక్ గెస్ట్ హౌస్ లేదా సెల్ఫ్ కేటరింగ్ అపార్ట్మెంట్ కి రోజుకి కనీసం రూ.8 వేల నుంచి రూ.12 వేలు అవుతుంది. స్టాండర్డ్ 3 స్టార్ హోటల్స్ కి రూ.15 వేల నుంచి రూ.25 వేలు, ప్రీమియం రిసార్ట్ కి రోజుకి రూ.40 వేల నుంచి మొదలై రూ.6 లక్షల వరకు కూడా ఉంటుంది.ఫుడ్ కోసం రోజుకి సగటున రూ.5 వేలు బడ్జెట్ పెట్టుకోవాలి. మొత్తంగా ఐదు రోజుల ట్రిప్ కి ఒక్కొక్కరికి బడ్జెట్ విధానంలో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలు, స్టాండర్డ్ వసతులతో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్్సపోర్టేషన్, వాటర్ యాక్టివిటీస్ కలిపితే బడ్జెట్ రూ.3.5 లక్షలు దాటుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణ ఖర్చు దీనికి అదనం.వీసా..భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు సీషెల్స్‌లో వీసా అవసరం లేదు. అయితే ప్రయాణానికి ముందు సీషెల్స్ ట్రావెల్ ఆథరైజేషన్ తీసుకోవాలి. పాస్‌పోర్ట్, స్టే, రిటర్న్ టికెట్, ట్రావెల్ డీటెయిల్స్ వంటి వివరాలు అందించాల్సిన అవసరం పడొచ్చు. ట్రావెల్ ఆథరైజేషన్ ఫీజు, ప్రవేశ నిబంధనలు వంటి వివరాలను ప్రయాణానికి ముందు అధికారిక వనరుల్లో పరిశీలించాలి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇదీ చదవండి: పర్యాటకంతో కాసుల వర్షం.. టాప్–10 దేశాలు ఇవే! -
పర్యాటకంతో కాసుల వర్షం.. టాప్–10 దేశాలు ఇవే!
టూరుకెళ్లడం అంటేనే చాలామందికి ఎక్కడలేని హుషారు! కాస్త సమయం చిక్కితే, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, అక్కడి వింతలను ప్రత్యక్షంగా తిలకించాలని ఉబలాటపడేవాళ్లు ప్రపంచమంతటా ఉంటారు. చారిత్రక ప్రదేశాలను చూడటానికి చాలామంది పర్యటనలు చేస్తారు.మన దేశంలో ఎక్కువమంది తీర్థ క్షేత్రాలను సందర్శించడానికి పర్యటనలు చేస్తారు. పర్యాటకం చాలా దేశాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. కేవలం పర్యాటక ఆదాయమే ప్రధాన వనరుగా మనుగడ సాగిస్తున్న దేశాలు డజన్లలో ఉన్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...ప్రపంచంలో కొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతో కిటకిటలాడుతుంటే, ఇంకొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతోనే కాకుండా, పర్యాటక ఆదాయంతోనూ కళకళలాడుతున్నాయి. పర్యాటక ఆదాయంలో అత్యధికంగా కాసులు రాబట్టుకుంటున్న టాప్–10 దేశాల గణాంకాలు...ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో ఉన్నా, ప్రపంచ పర్యాటకంలో ఇంకా 39వ స్థానంలోనే ఉంది. మన పర్యాటక ఆదాయంలో అత్యధిక భాగం స్వదేశీ పర్యాటకుల ద్వారానే లభిస్తోంది. మన దేశానికి విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువమంది ప్రవాస భారతీయులే ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న బంధుమిత్రులను చూడటానికి వచ్చేవారే వీరిలో ఎక్కువమంది ఉంటున్నారు. మన దేశ పర్యాటక వివరాలను గణాంకాల్లో చూద్దాం...ఇదీ చదవండి: ప్రేమా.. ధనమా.. ప్రతిష్ఠా? ముందుగా ఏది ఇంట్లోకి రావాలి? -
నయా ట్రెండ్.. నయా లైఫ్! హాయిగా.. హ్యాపీగా..
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు. దీర్ఘాయుర్దాయాన్ని మాత్రమే కాదు, ఆయువు ఉన్నంత వరకు ఒంట్లో పట్టుసడలని ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నారు.పైపై పొగడ్తలను కాదు, ప్రేమతో పలకరించే మనుషులను కోరుకుంటున్నారు. సంపదను పోగేసుకోవడం కంటే జీవితంలో సంతృప్తిని కోరుకుంటున్నారు. ఖరీదైన వస్తువుల కోసం కంటే విలువైన అనుభవాల కోసం ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సమాజం ఒరవడిలో కొట్టుకుపోకుండా, తమదైన సమయాన్ని తమ కోసం కోరుకుంటున్నారు. జీవితాన్ని మరింత అర్థవంతంగా మలచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవనశైలిలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆనందాన్ని వెదుక్కోవడం వరకు; సామాజిక జీవితాన్ని ఆస్వాదించడం నుంచి తన కోసం తనదైన సమయాన్ని కేటాయించుకోవడం వరకు; కొత్త అనుభవాల కోసం అడుగులు వేయడం నుంచి జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవడం వరకు ఈతరం మనిషి కోరుకుంటున్నది ఒక్కటే– ‘జీవితాన్ని ఎలాగోలా గడపడం కాదు, మనస్ఫూర్తిగా జీవించాలి’. ‘తెల్లారిందా, నిద్రలేచామా, తిన్నామా, మళ్లీ నిద్రపోయామా’ అనేదే దినచర్య కాదు. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆలోచనల కోసం, ఆనందం కోసం ఆరోగ్యంగా బతకడమే జీవించడం.నేటి తరం మనిషి మళ్లీ తనను తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే రాబట్టుకోవాలి అన్నట్లు మళ్లీ మొదటికే పయనమవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పరుగెడుతూనే ఉన్నాడు. శరీరం అలసిపోతూనే ఉంది. అయినా మరుసటి రోజు మళ్లీ అదే పరుగు. కానీ ఒక్కసారి ఆగి చూస్తే, అసలు ఎటు పరుగెడుతున్నాడో మాత్రం తెలియడం లేదు.ఉత్సాహమే ఊపిరి!ఇంతకాలం ‘ఎక్కువ కాలం బతకాలి’ అనేది ప్రధాన లక్ష్యం. ‘బతికినంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అనేది ఇప్పటి లక్ష్యం. వయసును ఆపడం ఎవరి చేతిలోనూ లేదు. కానీ వయసుతో పాటు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. మంచి ఆహారం, క్రమంతప్పని వ్యాయామం, తగినంత నిద్ర, నడక, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత– ఇవి ఇప్పుడు అందమైన రూపం కోసం మాత్రమే కాదు, ఆనందభరితమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన అలవాట్లు.లక్ష్యం కేవలం ఎక్కువ రోజులు జీవించడం కాదు. బతికినంత కాలం మన పనులను మనమే చేసుకునేంత ఆరోగ్యంగా ఉండటం. అరవైలోనూ ఇరవైలా ఇష్టమైన ప్రయాణాలు చేయగలగాలి. డెబ్బై వచ్చినా మనకు నచ్చిన పనులు మనమే చేసుకోగలగాలి. అందుకు శరీరం సహకరించగలిగేలా చూసుకోవాలి. మనసు ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకునే విషయం కాకుండా ప్రతిరోజూ నిర్మించుకునే జీవన విధానంగా మారాలి.అనుబంధాలకు అగ్రతాంబూలంమన చుట్టూ చాలామంది ఉంటారు. మనసు విప్పి మాట్లాడగలిగే వారు ఎంతమంది? మనపై ప్రేమ కురిపించేవారెందరు? అందుకే పెద్ద పెద్ద వేడుకలు, హడావుడి కార్యక్రమాల కంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడటం, సాయంత్రం సరదాగా కలిసి నడవడం వంటి చిన్న చిన్న క్షణాలకు విలువ పెరుగుతోంది. సంతోషకరమైన జీవితం కావాలంటే ఎప్పుడూ ఖర్చుతో కూడిన వినోదాలే అవసరం లేదు. మనసును తాకే చిన్న ఆత్మీయత చాలాసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అయినా, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం లేకుండా పోతున్న తరుణంలో తక్కువ మంది సన్నిహితులు, గాఢమైన అనుబంధం అనే ఆలోచనకు ఈ ట్రెండ్ కొత్త ఉత్తేజాన్నిస్తోంది.ప్రయాణం పదిలం!ప్రయాణం అంటే ఇప్పుడు కేవలం కొత్త ప్రదేశాలను చూసి తిరిగి రావడం కాదు. కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మన ఆలోచనలను మార్చే అనుభవాలను పొందడం కూడా ప్రయాణంలో భాగమవుతోంది. ఒక మంచి ప్రయాణం ముగిసిన తర్వాత మన దగ్గర కొన్ని చిత్రాలు మాత్రమే కాదు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కథలు, కొన్ని కొత్త ఆలోచనలు మిగలాలి.కొన్నిసార్లు ఖరీదైన టూర్ కంటే ఓ ప్రశాంతమైన ఉదయం, సముద్రపు అలల చప్పుడు, కొండల మధ్య నడక మనసుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెడితేనే ప్రయాణం మొదలవుతుందనేది వందశాతం నిజం. ఎందుకంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచనను పక్కనపెట్టి, ఒక్కసారి కళ్లతో చూసి మనసులో దాచుకుంటే ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ప్రయాణం ముగిసేది మనం ఇంటికి చేరుకున్నప్పుడు కాదు, ఆ ప్రయాణం మనలో ఒక జ్ఞాపకంగా మిగిలినప్పుడు.’ట్రెండ్ సెట్ చేద్దామనుకుంటూ...వందేళ్లు బతకాలనే లక్ష్యంతో రోజూ పొద్దున్నే చేదు జ్యూస్‌లు తాగుతూ, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రోజు ప్రారంభించేవారు ఉంటారు. విడ్డూరమేంటంటే, అలా తాగేటప్పుడు వాళ్ల మొహం చూస్తే వందేళ్లు కాదు కదా, ఈ ఐదు నిమిషాలు బతికితే చాలు అనేలా ఎక్స్ప్రెషన్ పెడతారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లిన వాళ్లు కూడా, అక్కడ ‘మ్యాగీ తింటూ రీల్స్ చేయడం’ మర్చిపోరు.హెల్దీ లైఫ్ కోసం కొన్న ఫిట్నెస్ బ్యాండులు రోజూ పదివేల అడుగులు వేయమని అలారమ్‌లు మోగిస్తుంటే, వాటిని ఇంట్లో ఆడుకునే పిల్లల చేతికి కట్టేసి కామ్‌గా టీవీ చూసే మహానుభావులు మన మధ్యే కనిపిస్తారు.ఒకప్పుడు ఫ్రెండ్స్ కలవడమంటే కలిసి టీ కొట్టు దగ్గర గంటలు గడపడం. కానీ నేటి రిలాక్స్డ్ సోషియబిలిటీ రూమ్‌లో అందరూ పక్కపక్కనే కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రీల్స్ షేర్ చేసుకోవడం.‘మన మందరం కలిసి ఈ వీకెండ్ ట్రిప్ వెళ్లాలి’ అని వాట్సాప్ గ్రూప్‌లో ప్లాన్ వేయడమే అసలైన ఎంజాయ్మెంట్. ఆ ట్రిప్ ఎప్పటికీ క్యాన్సిల్ అవుతుందని గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు!ఈరోజు నాకు ప్రశాంతత కావాలి, ఈ టైమ్ నాది అని ఫోన్ సైలెంట్లో పెట్టి డోర్ వేసుకుంటారు. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో ‘ఎవరైనా మెసేజ్ చేశారేమో, నోటిఫికేషన్లు వచ్చాయేమో’ అని ఫోన్ అన్ లాక్ చేసి మరీ చూస్తుంటారు.బాత్ రూమ్‌లో షవర్ కింద నిలబడి జీవిత పాఠాల గురించి ఆలోచించే ఆ పదిహేను నిమిషాలే నేటి మానవుడికి దొరికే తనదైన సమయం.‘జీవితంలో కొత్త అనుభవం కావాలి, నన్ను నేను వెతుక్కోవాలి‘ అని కొండలు, కోనలు ఎక్కడానికి సోలో ట్రిప్‌లు వేస్తారు. తీరా అక్కడ కొండ కొనకి వెళ్లాక వెతికేది ‘తనను తాను’ కాదు, ఫోన్ లో ‘సిగ్నల్ వస్తుందా లేదా‘ అని!మనకంటూ మనదైన సమయంఅందరి కోసం పరుగెడుతూ, మనల్ని మనం మర్చిపోవద్దు. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, బాధ్యతల కోసం– ఇలా అందరి కోసం సమయం కేటాయిస్తున్నాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయించు కోగలుగుతున్నాం? పుస్తకం చదవడానికి కావచ్చు, సంగీతం వినడానికి కావచ్చు, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కావచ్చు, ఇష్టమైన పని చేసుకోవడానికి కావచ్చు– రోజులో కొంత మనదైన సమయం మనకంటూ ఉండాలి.మనల్ని మనం చూసుకోవడం స్వార్థం కాదు. మనసు అలసిపోకుండా చూసుకోవడం. మన మనసుకు నచ్చిన పని చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, మన గురించి మనం ఆలోచించేందుకు కాసేపు సమయం కేటాయించడం. ఇందులో పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. మనసుకు కాస్త ఊరటనివ్వడమే లక్ష్యం. రోజులో గంటల సమయం అవసరం లేదు. పది నిమిషాలైనా మన కోసం కేటాయిస్తే, ఆ రోజు మనదిగా అనిపిస్తుంది. అందరి కోసం పరుగెత్తే జీవితంలో ఒక్కసారి మన కోసం ఆగడం కూడా అవసరమే!ప్రశాంతతకే ప్రాధాన్యంఇంతకు ముందు ఎంత లగ్జరీగా ఉంటే అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటారు అనే ఒక భావన ఉండేది. ఇల్లు నిండా వస్తువులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని లేదు. అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం, ఉపయోగించని వస్తువులను తగ్గించడం, ఉన్నవాటిని విలువగా ఉపయోగించడం ఇప్పుడు కొత్త జీవన విధానంలో భాగమవుతోంది. తక్కువ వస్తువులు అంటే తక్కువ జీవితం కాదు. తక్కువ గందరగోళంలో ఎక్కువ ప్రశాంతత.దుస్తులు, అలంకరణ వస్తువులు, ఇంటి సామగ్రి, ఉపయోగించని పరికరాలు– ఇలా అవసరంలేని వాటిని తగ్గించుకుంటూ సరళమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వస్తువులను తగ్గించుకోవడం కాదు. మన సమయాన్ని, మన డబ్బును, మన శక్తిని ఎక్కడ ఉపయోగించాలో ఎంచుకోవడం. ఇల్లు వస్తువులతో నిండిపోవడం కంటే మనసుకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే ఆలోచన పెరుగుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ గందరగోళం, తక్కువ ఖర్చు, ఎక్కువ స్వేచ్ఛ.ఆహార శ్రద్ధతోనే ఆరోగ్యంఆహారం విషయంలోనూ కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. రుచితో పాటు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తయారైంది? శరీరానికి ఎంత ఉపయోగం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంటివంట, స్థానికంగా లభించే పదార్థాలు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, తక్కువగా తయారుచేసిన ఆహారం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ‘కడుపు నిండితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘శరీరానికి మేలు చేసే ఆహారం కావాలి’ అనే ఆలోచన వైపు మార్పు కనిపిస్తోంది.ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులుగా ఇంటివంట, తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, సంప్రదాయ ధాన్యాలు, స్థానికంగా లభించే పదార్థాలు వంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిర్మించే రోజువారీ పెట్టుబడి అనే భావన నవతరంలో బలపడుతోంది. రుచిని వదులుకోకుండా, ఆరోగ్యాన్ని కూడా దృష్టి్టలో పెట్టుకుని తినడం నేటి జీవనశైలిలో ముఖ్యమైన మార్పుగా మారుతోంది.జీవితం పరుగు పందెం కాదుఅందరి కంటే ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా మనమే ముందుండాలి అనే ఆలోచనతో పరుగులు పెడుతూనే ఉన్నాం. అదే మనల్ని, మన ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తోంది. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు మాత్రమే విజయం కాదు. ఆరోగ్యంగా ఉండటం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే! జీవితమేమీ పరుగు పందెం కాదు, ప్రతి రోజూ గెలవాల్సిన పనిలేదు. రోజులో కొన్ని క్షణాలనైనా ఆనందంగా ఆస్వాదించడమే అసలైన జీవితం. జీవితాన్ని తర్వాత ఎప్పుడో ఆస్వాదిద్దాం అనుకుంటూ ఉంటే, ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చిన కొద్దీ జీవితం మరింత సులభతరంగా, మరింత వేగవంతంగా మారింది. కానీ అదే సమయంలో నిశ్శబ్దం, విశ్రాంతి, ప్రకృతి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సమయం వంటి వాటి విలువ కూడా మనకు మరింత స్పష్టంగా తెలుస్తోంది. అందుకే 2026 జీవనశైలి ఒక విచిత్రమైన మలుపులో నిలిచింది. ఈతరం పనుల్లో వేగాన్ని కోరుకుంటూనే, జీవితంలో నిదానానికి ప్రాధాన్యమిస్తోంది. సౌకర్యాలను ఆస్వాదిస్తూనే, సరళత వైపు అడుగులు వేస్తోంది. సాంకేతికతను అక్కున చేర్చుకుంటూనే, దాని నుంచి కొంత దూరం కావాలని కోరుకుంటోంది.కొత్తదనం కోసం కొత్తగా ప్రయత్నించక్కర్లేదు, ముందు ఆన్లైన్ చెత్తను డంప్ చేస్తే చాలు. జీవితం దానంతట అదే కొత్తగా అనిపిస్తుంది!- రమా జంబులఇదీ చదవండి: డాటర్ ఇన్లా మదర్ -
పర్యాటకుడు ప్రకృతికి అతిథి..
పర్యాటకం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి వెళ్లడం కాదు. భిన్న సంస్కృతులను దగ్గర చేసే వంతెన. ఉపాధిని పెంచుతూ, ప్రజల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించే శక్తిమంతమైన సాధనం. మనం సందర్శించే ప్రాంతం ప్రకృతికి, స్థానిక ప్రజలకు, భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా ఉండేలా చూసు కోవాలి. అందుకే పర్యాటక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరం ఉంది.హోటళ్లు, రవాణా సంస్థలు, రెస్టారెంట్లు, చిరువ్యాపా రులు, హస్తకళాకారులు, గైడ్లు, స్థానిక కళాకారులు... ఇలా అనేక వర్గాలకు ఉపాధి, ఆదాయం లభిస్తాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడం అంటే స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వడమే.పర్యాటక ప్రాంతాల్లో తరచూ ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు పేరుకుపోతూ ఉండటం వల్ల ప్రకృతి సౌందర్యం దెబ్బ తినడమే కాదు, దానికి తీవ్రమైన హాని కలుగుతుంది. పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రకృతిపై మితి మీరిన ఒత్తిడి తీసుకురావడం చివరకు పర్యాటకానికే నష్టం చేస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ‘బాధ్యతాయుతమైన పర్యాటకం’ ఆచరణలోకి రావాలి.ఒక ప్రాంతం భరించగలిగిన దాని కంటే ఎక్కువమంది పర్యాట కులు ఒకేసారి చేరుకుంటే నీటి కొరత, చెత్త నిర్వహణ, ట్రాఫిక్, వసతి, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చు. స్థానిక సంస్థలు కూడా శాస్త్రీయంగా వ్యర్థాలను నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకు తగిన పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.పర్యాటక అభివృద్ధి అంటే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కాదు, ప్రకృతిని కాపాడే, స్థానికులకు ప్రయోజనం చేకూర్చే పర్యాటక విధానాన్ని రూపొందించడం కూడా! పర్యాటకులు, స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు, ప్రభుత్వ విభాగాలు కలిసి పనిచేసినప్పుడే ఈ సమతు ల్యత సాధ్యం. భారతీయ సంస్కృతిలో ‘అతిథి దేవోభవ’ అనే గొప్ప భావన ఉంది.అదే సమయంలో అతిథిగా వచ్చే ప్రతి పర్యాటకుడు కూడా తాను సందర్శించే ప్రాంతాన్ని, సంస్కృతిని, స్థానిక ప్రజల జీవన విధానాన్ని గౌర వించాలి. ఆతిథ్యం ఇచ్చేవారు సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత కల్పిస్తే... పర్యాటకులు బాధ్యత, క్రమశిక్షణ, పర్యావరణ స్పృహతో వ్యవహరించాలి. అప్పుడే ‘అతిథి దేవోభవ’ స్ఫూర్తి పరిపూర్ణమవుతుంది.– వాడవల్లి శ్రీధర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు (రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం)ఇదీ చదవండి: ఆటపాటల ప్రజా కళాజాతర.. -
ప్రపంచ వేదికపై ముంబై తాజ్!
సముద్రాన్ని చూస్తూ.. వందేళ్లకు పైగా చరిత్రను మోస్తూ.. ముంబై నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన తాజ్ మహల్ ప్యాలెస్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2026లో ప్రపంచంలోని 50 ఉత్తమ హోటళ్ల జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 38వ స్థానంలో ఉన్న ఈ చారిత్రక హోటల్ ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. 1903లో ప్రారంభమైన ఈ హోటల్ నేటికీ తన రాజసాన్ని కోల్పోకుండా ప్రపంచ స్థాయి అతిథులను ఆకట్టుకుంటోంది. వైభవమైన నిర్మాణం, సముద్రతీర దృశ్యం, ఆతిథ్యానికి పేరుగాంచిన సేవలు.. ఇవన్నీ తాజ్ ప్రత్యేకతలు. ప్రపంచంలోని ప్రముఖ హోటల్ రంగ నిపుణులు, ప్రయాణ రచయితలు, అనుభవజ్ఞులైన ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందింది.ఇదీ చదవండి: స్టూల్ మధ్యలో ఆ రంధ్రం ఎందుకో తెలుసా? కారణం తెలిస్తే షాక్! -
సముద్రం మధ్యలో పచ్చని స్వర్గమా?! ఈ దీవి ఎక్కడుందో తెలుసా?
భారత్‌లో ఎన్నో అందమైన దీవులు ఉన్నాయి. అయితే పచ్చని ప్రకృతి, నీలిరంగు సముద్రం, ప్రశాంతమైన వాతావరణంతో అండమాన్ లోని హేవ్‌లాక్ ఐలాండ్‌ను భారతదేశపు ఎమరాల్డ్ ఐలాండ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ దీవిని స్వరాజ్ ద్వీప్ అని కూడా పిలుస్తున్నారు. సముద్రం మధ్యలో పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు కలిసిన ఈ దీవి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవుల సమూహంలో స్వరాజ్ ద్వీప్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఒకప్పుడు హేవ్‌లాక్ ఐలాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ దీవికి 2018లో స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చారు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్రపు నీరు కనిపిస్తాయి. అందుకే ‘ఎమరాల్డ్’ అనే పేరు దీనికి చక్కగా సెట్ అవుతుంది.స్వరాజ్ ద్వీప్‌లో రాధానగర్ బీచ్ ప్రధాన ఆకర్షణ. తెల్లటి ఇసుక, నీలి సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు.. ఇవన్నీ కలిసి పైసా వసూల్ అనుభూతిని అందిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో బీచ్ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఎలిఫెంట్ బీచ్ వద్ద స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్ ట్రై చేయవచ్చు. నీటి అడుగున కనిపించే పగడాలు, రంగురంగుల చేపలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.ఇక్కడికి చాలా మంది వెళ్లే ముందు బీచ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఉదయం పూట పచ్చని చెట్ల మధ్య ప్రయాణించడం, చిన్న చిన్న లోకల్ షాపుల్లో షాపింగ్ చేయడం, సముద్ర తీరంలో కొంతసేపు ప్రశాంతంగా గడపడం కూడా ఈ ప్రయాణంలో భాగమే. అక్టోబర్ నుంచి మే వరకు సాధారణంగా అండమాన్ పర్యటనకు అనుకూలమైన కాలంగా భావిస్తారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఫెర్రీ ద్వారా స్వరాజ్ ద్వీప్ చేరుకోవచ్చు.పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లటి ఇసుక తీరాల కాంబినేషన్ లో కనిపించే ఈ ఎమరాల్డ్ ఐలాండ్.. అంటే ఒకప్పటి హేవ్‌లాక్ ఐలాండ్.. ప్రయాణికులకు ఎవర్గ్రీన్ మెమరీగా మిగిలిపోతుంది.ఇదీ చదవండి: ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే? -
ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే?
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరాల్లో ఒకటైన ఎల్ ఆల్టోలో లైఫ్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చాలా మంది దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ఉన్న ఎల్ ఆల్టోకు వెళ్తుంటారు. లా పాజ్ నగరానికి సమీపంలో ఉన్న ఈ నగరం.. ఎత్తైన ప్రాంతాల్లో ప్రజల దైనందిన జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేస్తుంది.విశాలమైన రహదారులు, ఇటుక భవనాలు, కలర్‌ఫుల్ మార్కెట్ స్ట్రీట్స్, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఎల్ ఆల్టో ప్రత్యేకత. కేబుల్ కారులో ప్రయాణిస్తే నగరం విస్తరించిన తీరు, కొండలు, రహదారులపై రాకపోకలు మరో కోణంలో కనిపిస్తాయి. మార్కెట్లలో స్థానికులు తమ రోజువారీ పనుల్లో బిజీగా కనిపిస్తారు.ఎల్ ఆల్టో వైబ్‌ను ఫీల్ అవ్వాలంటే కేబుల్ కారులో ప్రయాణిస్తే సరిపోతుంది అంటారు. ఇక్కడి మెర్కాడో 16 డి జులియో మార్కెట్లో స్థానికుల సందడి కనిపిస్తుంది. సమీపంలోని లా పాజ్ నగరం, వల్లే డి లా లూనా ప్రాంతాలను కూడా ట్రావెల్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. ఎల్ ఆల్టోలో మన సమోసాల్లా ఉండే సాల్టెనాస్ను వేడివేడిగా ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే హాట్ డ్రింక్‌తో పాటు స్వీట్‌గా ఉండే ఆపి కాన్ పాస్టెల్ను ఎంజాయ్ చేయవచ్చు. ఎత్తైన ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణం, నగర దృశ్యాలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.ఎప్పుడు వెళ్లాలి?ఎల్ ఆల్టోలో మే నుంచి అక్టోబర్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉండటంతో పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్లినా.. మొదటి రోజు కాస్త నెమ్మదిగా స్థానిక వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ చెక్‌లిస్ట్ ప్రకారం ట్రావెల్‌ను కంటిన్యూ చేయొచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బొలీవియాకు నేరుగా విమానాలు లేవు. ఒకటి లేదా రెండు కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా బొలీవియా రాజధాని లా పాజ్ చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 24–30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. లా పాజ్ నుంచి ఎల్ ఆల్టోకు రోడ్డు మార్గంలో లేదా కేబుల్ కార్ ద్వారా చేరుకోవచ్చు.ఇదీ చదవండి: ఈ 5 పర్వతాలను ఎవరూ అధిరోహించలేదు! ఎందుకంటే? -
ఈ 5 పర్వతాలను ఎవరూ అధిరోహించలేదు! ఎందుకంటే?
పర్వతారోహణ అంటేనే సాహసం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మనిషి అధిరోహించాడు. మరి ఎవరెస్ట్‌ను ఎక్కిన పర్వతారోహకులు ప్రపంచంలోని తమకు నచ్చిన ప్రతీ శిఖరాన్ని అధిరోహించగలరా? అంటే ‘నో’ అనే సమాధానం వస్తుంది. ప్రతీ పర్వతాన్ని మనిషి ఎక్కడం సాధ్యం కాదు. ప్రపంచంలో కొన్ని పర్వతాలు ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాటి శిఖరాలను అధిరోహించడం ఎప్పటికీ వీలు కాదు. ఎందుకంటే ఇందులో కొన్ని పర్వతాలపై కాలు పెట్టడం నిషేధించారు. ఇందులో కొన్ని పర్వతాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మరికొన్ని పర్వతాలను పర్యావరణ పరిరక్షణ కోసం రక్షించేందుకు నియమాలు పెట్టారు. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలే పర్వతారోహణకు అడ్డుగా నిలుస్తున్నాయి.ప్రపంచంలో మూడో ఎత్తైన కాంచెన్‌జంగా శిఖరాన్ని 1955లో తొలిసారిగా అధిరోహించారు. నేపాల్ వైపు నుంచి ఆ తర్వాత కూడా అనేక అధిరోహణలు జరిగాయి. కానీ సిక్కిం వైపు నుంచి శిఖరారోహణకు నిషేధం ఉంది. అంటే పర్వతం ఎత్తు కంటే దాని వెనుక ఉన్న విశ్వాసాలు, ప్రకృతి, ప్రభుత్వ నిబంధనలే కొన్ని శిఖరాలను ప్రత్యేకంగా మార్చాయి. అలాంటి ఐదు పర్వతాల కథ ఇది.నందాదేవి : ప్రకృతిని కాపాడేందుకు నిషేధంఉత్తరాఖండ్లోని నందాదేవి శిఖరం సుమారు 7,816 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హిమాలయాల్లోని అత్యంత ముఖ్యమైన పర్వతాల్లో ఇది ఒకటి. నందాదేవిని స్థానిక సంప్రదాయాల్లో దేవతా స్వరూపంగా భావిస్తారు. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు అపారమైన పర్యావరణ ప్రాధాన్యత ఉంది. గతంలో నందాదేవి ప్రాంతంలో పర్వతారోహణ కార్యకలాపాలు పెరగడంతో చెత్త పేరుకుపోవడం, సహజ పర్యావరణానికి నష్టం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.దీంతో 1983 నుంచి నందాదేవి నేషనల్ పార్క్‌లో పర్వతారోహణ, సాహస కార్యకలాపాలపై నిషేధం విధించారు. పర్యావరణాన్ని కాపాడటమే దీనిలో ప్రధాన ఉద్దేశం. అంటే నందాదేవి విషయంలో మత విశ్వాసంతో పాటు ప్రకతి పరిరక్షణ కూడా ముఖ్యమైన అంశం. ప్రతి శిఖరాన్ని అధిరోహించడం కంటేం కొన్ని శిఖరాలను అలాగే కాపాడటం కూడా అవసరమేనని నందాదేవి చెబుతోంది.మచ్ఛపుచ్ఛరే: చేప తోకలా కనిపించే పవిత్ర పర్వతంనేపాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణిలో ఉన్న మచ్ఛపుచ్ఛరే మరో అద్భుతమైన శిఖరం. దీని ఎత్తు సుమారు 6,993 మీటర్లు. పర్వతం పైభాగం రెండు కొమ్ముల్లా విడిపోయి చేప తోకను పోలి కనిపిస్తుంది. అందుకే దీనికి మచ్ఛపుచ్ఛరే అనే పేరు వచ్చింది. స్థానిక గురుంగ్ సంప్రదాయాల్లో ఈ పర్వతానికి పవిత్రమైన స్థానం ఉంది. శివుడితో దీనికి ఆధ్యాత్మిక అనుబంధం ఉందనే స్థానిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. 1950లలో ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించలేదు. ఆ తర్వాత నేపాల్ ప్రభుత్వం ఈ పర్వతాన్ని పవిత్రమైనదిగా పరిగణించి పర్వతారోహణకు అనుమతి ఇవ్వలేదు. అందుకే మచ్ఛపుచ్ఛరే నేటికీ పూర్తిగా అధిరోహించని అందమైన హిమాలయ శిఖరంగా నిలిచింది.కైలాస పర్వతం: పవిత్రతను గౌరవించడంపరమేశ్వరుడి నివాసంగా భావించే శిఖరం ఇది. టిబెట్‌లోని కైలాస పర్వతం ఎత్తు సుమారు 6,638 మీటర్లు. అంటే 8,849 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ కంటే ఇది చాలా తక్కువ. అయితే కైలాసం ప్రత్యేకత దాని ఎత్తులో లేదు. దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతలో ఉంది. హిందువులు కైలాసాన్ని పరమశివుడి నివాసంగా భావిస్తారు. బౌద్ధులు, జైనులు, బాన్ సంప్రదాయాల్లో కూడా ఈ పర్వతానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. కైలాసం చుట్టూ పరిక్రమ చేయడానికి యాత్రికులు వెళ్తారు. కానీ పర్వత శిఖరాన్ని అధిరోహించడం మాత్రం అనుమతించరు. కైలాస శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినట్టు ఇప్పటి వరకు విశ్వసనీయమైన నమోదు కూడా లేదు. అందుకే ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన శిఖరాలు పర్వతారోహకులను ఆకర్షిస్తుంటే కైలాసం మాత్రం భిన్నంగా నిలిచింది. ఇక్కడ లక్ష్యం శిఖరాన్ని జయించడం కాదు. దూరం నుంచి దర్శించి, దాని పవిత్రతను గౌరవించడం.కాంచెన్‌జంగా: సిక్కిం వైపు నుంచి ఎక్కలేరుభారత్–నేపాల్ సరిహద్దులో ఉన్న కాంచెన్‌జంగా ప్రపంచంలో మూడో ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 8,586 మీటర్లు. కాంచెంజంగాను ఎవరూ అధిరోహించని పర్వతం అనుకోవద్దు. 1955 మే 25న జో బ్రౌన్, జార్జ్ బ్యాండ్ తొలిసారిగా కాంచెంజంగా శిఖరాన్ని అధిరోహించారు. ఆ తర్వాత నేపాల్ వైపు నుంచి అనేక పర్వతారోహణలు జరిగాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.కాంచెన్‌జంగా సిక్కిం వైపు నుంచి శిఖరారోహణకు అనుమతి లేదు. సిక్కిం ప్రజల సంప్రదాయాల్లో కాంచెన్జంగాకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. స్థానిక విశ్వాసాల్లో ఇది రక్షక దేవతతో అనుబంధం కలిగిన పవిత్ర పర్వతంగా భావిస్తారు. అందుకే ఒకే పర్వతంం ఒక వైపు నుంచి అధిరోహించబడుతుండగా, మరో వైపు నుంచి మాత్రం పవిత్రమైన శిఖరంగా గౌరవించబడుతోంది. ఇదే కాంచెన్‌జంగా ప్రత్యేకత.గంఖర్ పుయెన్సమ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అధిరోహించని శిఖరంభూటాన్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న గంఖర్ పుయెన్సమ్ ఎత్తు సుమారు 7,570 మీటర్లు. ఎవరెస్ట్ కంటే ఇది దాదాపు 1,300 మీటర్లు తక్కువ. అయినా ఇప్పటివరకు ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించలేదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అధిరోహించని పర్వతంగా ప్రసిద్ధి చెందింది. దీనికి కారణం ఈ పర్వతాన్ని అధిరోహించడం కష్టం అని మాత్రమే కాదు. నిజానికి భూటాన్ లోని పర్వతాలకు ఆధ్యాత్మిక ్రపాధాన్యత ఉంది. 1994లో 6,000 మీటర్లకు పైబడిన పర్వతాలపై అధిరోహణకు నిషేధం విధించారు. 2003 నుంచి భూటాన్ లో పర్వతారోహణపై మరింత కఠినమైన నిషేధం అమల్లోకి వచ్చింది.దీంతో గంఖర్ పుయెన్సమ్ ఇప్పటికీ మనిషి అధిరోహించని అత్యంత ఎత్తైన శిఖరంగా నిలిచింది. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను జయించాలనే లక్ష్యంతో పర్వతారోహకులు ముందుకు వెళ్తుంటేం భూటాన్ మాత్రం తన పవిత్ర పర్వతాలను అధిరోహణ నుంచి దూరంగా ఉంచింది.ఇదీ చదవండి: ఏఐ.. బుక్స్ భోంచేస్తోందిప్రతి పర్వతాన్ని జయించాల్సిన అవసరం ఉందా?ఈ ఐదు పర్వతాల కథలను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మనిషి ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు. కానీ ప్రతి పర్వతాన్ని జయించాల్సిన అవసరం లేదని ఈ పర్వతాలు గుర్తు చేస్తున్నాయి.విశ్వాసానికి ప్రతీకలు... - కాంచెంజంగా స్థానిక సంప్రదాయాలకు ఉన్న గౌరవానికి ఉదాహరణ.- నందాదేవి ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది.- గంఖర్ పుయెన్సమ్ ఒక దేశం తన పర్వతాలను అధిరోహణ నుంచి రక్షించిన ప్రత్యేక ఉదాహరణ.- మచ్ఛపుచ్ఛరే ప్రకృతి అందాన్ని దూరం నుంచే ఆస్వాదించాల్సిన పవిత్ర శిఖరంగా నిలిచింది.- పర్వతారోహకుడికి శిఖరాన్ని చేరుకోవడం ఒక లక్ష్యం కావచ్చు. కానీ కొన్ని పర్వతాల విషయంలో స్థానిక విశ్వాసాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ నిబంధనలను గౌరవించడం కూడా ఆ పర్వతాల ప్రత్యేకతలో భాగమే.- ప్రతి పర్వతం మనిషి జయించడానికి పుట్టలేదు. కొన్ని పర్వతాలుం మనిషి దూరం నుంచి చూసి, వాటి విశ్వాసాలను గౌరవించి, ప్రకృతిని కాపాడుతూ ఉండటానికే.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్‌గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్‌గా మార్చాయి. కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె -
బస్సు ప్రయాణాల యాత్రా కుటుంబం
వాట్సాప్‌లో ఒకరు మెసేజ్ పెడతారు. ‘ఈ శనివారం చెక్కేద్దామా?’ ఎక్కడికి వెళ్లాలో చెప్తారు. ఖర్చు అంతా కలిపితే ఆరేడు వందలు. 300 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపు ‘యాత్రా కుటుంబం’లో కనీసం 120 మంది ‘రెడీ’ అంటారు. రెండు బస్సులు మాట్లాడతారు. ఇంకేముంది... అక్క.. అమ్మ... పిన్నీ అంటూ అదొక కుటుంబంగా మారిపోయి ప్రయాణం కడతారు. కేరళ ఆర్టీసీ బడ్జెట్ యాత్రలు కేరళలో అపరిచితులను కుటుంబాలుగా మారుస్తున్నాయి. ఈ సరికొత్త ‘ట్రావెల్ ఫ్యామిలీ’ ట్రెండ్ గురించి...‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల’ అనంటాడు రావు గోపాలరావు ఏదో సినిమాలో. చూడబోతే ఈ డైలాగుకు న్యాయం చేసే వాళ్లు కేరళలో మెండుగా ఉన్నట్టున్నారు. ఇంట్లో ముక్కిపోవడం కంటే తక్కువ ఖర్చులో పర్యటనలు చేస్తూ ప్రకృతిని చూసి పులకిస్తూ.... ఎవరికీ ఎవరూ పట్టని ఈ రోజుల్లో ఈ వంకన కొత్త బంధువులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తిరువనంతపురంలో రెండేళ్ల క్రితం మొదలైన ఒక యాత్ర 300 మందిని ‘యాత్రా కుటుంబం’గా మార్చేసింది.సన్నివేశం: ఒక ఆదివారం ఉదయం. కేరళలోని వాయనాడ్ వెళ్లే ప్రభుత్వ బస్సు సీట్ నెంబర్ 12లో కూర్చుని ఉన్న మేరీకుట్టికి బెరుగ్గా ఉంది. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడటంతో, ఇంట్లోని నాలుగు గోడల మధ్యే ఆమె ప్రపంచం ఆగిపోయింది. కాని ఆ రోజు మొదటిసారి ఒంటరిగా బస్సెక్కింది. చుట్టూ ఉన్నవాళ్లంతా ముక్కుమొహం తెలియనివారు. ఏం మాట్లాడాలో తెలియదు. కానీ, ప్రయాణం మొదలయ్యాక పక్క సీటామె ‘కొంచెం ఉ΄్మా తింటావా అక్కా’ అని తన బాక్సు తెరిచింది. ఆ ఒక్క మాటతో ముఖం తెలియని అపరిచితుల మధ్య మాటల వంతెన పడింది.... అన్నీ ఇలాంటి బంధాలే ఈ ‘యాత్రా కుటుంబం’లో.ఇలా మొదలైంది: టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చే కేరళ ప్రభుత్వం స్థానికులు కూడా పర్యటనలు చేసేలా ఆర్టీసీ కింద ‘బడ్జెట్ టూరిజం సెల్’ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చులో బస్సు మాట్లాడుకుని తిరిగే ఏర్పాటు అది. బడ్జెట్ టూరిజం సెల్ నుంచి ఒక కోఆర్డినేటర్ తోడు వచ్చి యాత్రను సులువు చేస్తాడు. రెండేళ్ల క్రితం తిరువనంతపురం బస్టాండ్ నుంచి రెండు బస్సులు అలా అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని బోనాకాడ్ కొండ ప్రాంతానికి బయలుదేరాయి. దానిలో ఉన్నదంతా 60లు దాటిన స్త్రీలు. రిటైర్డ్ ఉద్యోగులు. తక్కువ ఖర్చుతో చేసిన ఆ యాత్ర సాయంత్రం వరకూ వారికి ఎంతో ఆనందం పంచింది. కోఆర్డినేటర్‌గా వచ్చిన బస్సు కండక్టర్ సజిత్ తిరుగు ప్రయాణంలో ‘మీరంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇలా ప్రయాణాలు చేయొచ్చు’ అని సలహా ఇచ్చాడు. అలా పుట్టిందే ‘యాత్ర కుటుంబం’. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కుటుంబంలో 300 మంది సభ్యులయ్యారు. ప్రతి వీకెండ్ ప్రయాణాలు చేస్తున్నారు. మొన్న తిరువనంతపురంలోని మేయంకడవు నది ఒడ్డున వీరంతా ఓనం పండుగ జరుపుకున్నారు. 60 మంది మహిళలు, వృద్ధులు కలిసి పడవ ప్రయాణం చేస్తూ, పాటలు పాడుకుంటూ, క్యాంప్‌ఫైర్ వేసుకుని నవ్వులతో రాత్రి గడిపారు. మొన్నటివరకు ఒంటరితనంతో బాధపడిన మేరీకుట్టి ఇప్పుడు ఆ గ్రూప్‌లో అందరికంటే హుషారుగా డాన్స్ చేస్తోంది.పురలిమల కొండల్లో వెన్నెల రాత్రులు! ఈ గ్రూప్ చేసే ప్రయాణాలు రొటీన్ టూరిస్ట్ ప్లేస్లలాగా అస్సలు ఉండవు. ‘యాత్ర కుటుంబం’ సభ్యుల్లో లోకల్ గైడ్స్ ఉండటంతో ఎవరికీ తెలియని అత్యంత సుందరమైన ఆఫ్–బీట్ లొకేషన్లను ఎంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉండే ‘బొనాకాడు’ బేస్ క్యాంప్ కొండలు, తెల్లటి పాలధారల్లా జారే ‘కుంభవురుట్టి’ జలపాతాలు, అచ్చన్ కోవిల్ నదీ తీరాలు వీరి సొంతం. మొన్నటి ఓనం వేడుకల్లో నదీ తీరాన క్యాంప్‌ఫైర్ వేసుకుని వీరంతా కూర్చున్నప్పుడు.. పురలిమల కొండల వెనుక నుండి నిండు చందమామ పైకి వస్తుంటే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో వారి కళ్లలో కనిపించిన ఆనందం వందల కోట్ల ఆస్తి ఉన్నా దొరకనిది! అమాయక గిరిజన పల్లెల్లో, చారిత్రాత్మక పునలూరు తూగు వంతెనల మీద వీరు వేసే అడుగులు చూస్తుంటే... ‘మనం కూడా ఇలాంటి గ్రూప్ కడితే బాగుంటుంది కదా’ అనే ఆశ పుడుతుంది.వయసుతో పనేముంది? ఈ గ్రూప్‌లో ఉన్నవారంతా రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరిగా ఉండే గృహిణులే. మామూలుగా అయితే అయినవాళ్లు వీళ్లని ‘ఇంట్లో విశ్రాంతి తీసుకోండి’ అని కదలకుండా చూస్తారు. కానీ, వీరు మాత్రం ‘మా సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అంటూ రోడ్డు ఎక్కారు. అన్నట్టు ఈ సెప్టెంబర్ 12న పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఒక గిరిజన గ్రామానికి, అలాగే సెప్టెంబర్ 25న చొక్రముడి కొండలపై వికసించే ‘నీలకురింజి’ పూల అందాలను చూడటానికీ వీరంతా బస్సెక్కి ప్రయాణం చేయబోతున్నారు.వీరు ఆగేలా లేరు. ఏమంటే ప్రయాణమే ఒక జీవితం, అందులో దొరికే స్నేహాలే అమృతం! -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్‌వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్‌కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. -
సహ్యాద్రి గుండెల్లో ఛత్రపతి అడుగులు
సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.ఒక చారిత్రాత్మక యాత్రమహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదుం సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ... ఇలా సహ్యాద్రి ప్రకతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కతమవుతుంది.శివనేరిఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది.కొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్ మిగిలిపోయేలా చేస్తాయి.తోరణ... తొలి అడుగు సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. ఒకవైపు ప్రకతి, మరోవైపు చరిత్ర... రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.ప్రతాపగఢ్...ప్రతాపగఢ్ పేరు వినగానే 1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది. కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్‌లో మహా యుద్ధం, సింహగఢ్‌లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్‌లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.1674లో రాయగఢ్‌లోనే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.సింహగఢ్ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.ఎక్కడ ఉండాలిపుణె, మహాడ్, సతారా, జున్నర్ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్‌ను స్లోగా ఎంజాయ్ చేయవచ్చు. నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్‌లో మరో హైలైట్.ఏం తినాలి ?మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ్ర΄ాంతాల్లో ΄ోహా, మిసల్ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుశివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.తోరణను ప్రచండగఢ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్ చరిత్రలో నిలిచిపోయింది.సింహగఢ్ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది గుర్తు చేస్తుంటారు.1674లో రాయగఢ్‌లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది.ఏం చూడాలిశివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్‌లో యుద్ధగాథలను తెలుసుకోవడం, సింహగఢ్‌లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్‌లో పట్టాభిషేకం జరిగినప్రాంతం వైబ్‌ను ఫీల్ అవ్వడం.. ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్‌ను ఒక కంప్లీట్ మెమోరీగా మార్చేస్తాయి.ఎలా వెళ్లాలిహైదరాబాద్ నుంచి సహ్యాద్రి ్ర΄ాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్. దీని కోసం రైలు లేదా ఫ్లైట్‌లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్ చేస్తారు. పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్ జోన్ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్ అనేది ప్రయాణికుల లైఫ్‌స్టైల్‌ను బట్టి మారుతుంది. యావరేజ్‌గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, యాక్టివిటీస్‌ను బట్టి మారుతాయి.ఇక హోటల్ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్ నైట్ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్ అవ్వొచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్‌లో తక్కువ ధరకు దొరికే రూమ్స్ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్‌నే ఎంచుకోవడం ఉత్తమం.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ వివరాలను సొంతంగా రీసెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఎం జి కిశోర్ ప్రయాణికుడు(చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
ఎయిర్పోర్ట్ లేదు.. ఆర్మీ లేదు అయినా రిచెస్ట్ దేశాల్లో ఒకటి!
ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లీచెన్ స్టీన్ . ఈ దేశం సైజు హైదరాబాద్ నగరం కన్నా చిన్నదే. జనాభా కూడా 40 వేల వరకు ఉంటుంది. అయినా తలసరి ఆదాయం విషయంలో మాత్రం ప్రపంచంలోని ఎన్నో పెద్ద దేశాలను వెనక్కి నెట్టేసింది ఈ ఈ చిన్న దేశం.లిచీన్ స్టీన్ మొత్తం విస్తీర్ణం సుమారు 160 చదరపు కిలోమీటర్లు మాత్రమే.విమానాశ్రయం లేదులీచెన్ స్టీన్ గురించి ఆసక్తికరంగా చెప్పుకునే విషయాల్లో ఒకటి.. ఈ దేశానికి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. లీచెన్ స్టీన్ కు ప్రయాణించే వారు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ విమానాశ్రయం, జర్మనీలోని మ్యూనిక్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటారు.ప్రతీ దేశంలో ఒక్కటైనా విమానాశ్రయం ఉంటుంది కదాందీనికి ఎందుకు లేదు అనే చాలా మంది సందేహం. దీనికి కారణం ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ తక్కువ. అంత పెద్ద విమానాశ్రయం కట్టడానికి సరైన చోటు కూడా లేదు. అందుకే పక్క దేశం ఎయిర్‌పోర్టును వినియోగిస్తారు.సొంత సైన్యం లేదుమరో ప్రత్యేకత.. లీచెన్ స్టీన్ కు సొంత సైన్యం లేదు. 1866లో జరిగిన ఆస్ట్రో–ప్రష్యన్ యుద్ధం సమయంలో లీచెన్ స్టీన్ తన సైనిక దళాన్ని చివరిసారిగా ఉపయోగించింది. తరువాత సైన్యాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకుంది. అయితే భూమిపై ఇలా ఆర్మీ లేని దేశాలు చాలా ఉన్నాయి.స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎప్పుడైనా ఆర్మీ అవసరం పడినా ఆ దేశాలు చూసుకుంటాయి. ఆర్మీ లేదు కానీ ఇక్కడి పోలిస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.సొంత కరెన్సీ లేదుకరెన్సీ విషయంలోనూ లీచెన్ స్టీన్ కు ప్రత్యేకత ఉంది. పొరుగుదేశం అయిన స్విట్జర్లాండ్‌తో ఒక ఒప్పందం చేసుకున్న ఈ చిన్ని దేశం వాళ్ల కరెన్సీనే తమ కరెన్సీగా చెలామణి చేస్తోంది. 1921 నుంచి స్విస్ ఫ్రాంక్ను ఉపయోగిస్తున్న ఈ దేశం, 1980లో స్విట్జర్లాండ్‌తో కరెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.వజ్రంలాంటి ఎకానమీవజ్రం సైజు చిన్నదే అయినా దాని వెల ఎక్కువగా ఉంటుంది కదా..అలాగే ఈ దేశం చిన్నదే అయినా దీని ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం ఈ దేశ జీడిపి 2,20,000 డాలర్లు. అదే మన భారత్ విషయానికి వస్తే జీడిపి 2,700 డాలర్లుగా ఉంది. అంటే మన దేశ జీడిపీ కన్నా ఈ దేశ జీడిపి 81 రెట్లు ఎక్కువ. అందుకే ఇది ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటిగా ఉంది.బిజినెస్ సెంటర్ చిన్న దేశమైనప్పటికీ వ్యాపార రంగంలో లీచెన్ స్టీన్ కు మంచి పేరు ఉంది. దేశంలో వేలాది కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. మెడికల్, డెంటల్ టెక్నాలజీ, ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఉత్పత్తులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇక్కడి ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేలా చేశాయి.పొరుగుదేశం అయిన స్విట్జర్లాండ్, ఆస్ట్రియా నుంచి ప్రతిరోజూ చాలా మంది లీచెన్ స్టీన్ కు వచ్చి వెళ్తారు. 50 శాతం కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఈ రెండు దేశాల ప్రజలే చేస్తారు . -
మైనస్ 50 డిగ్రీల చలి.. లక్షల మంది జీవించే నగరం ఇదే!
యాకుట్సిక్, సఖా రిపబ్లిక్ క్షణాల్లో వేడి నీళ్లను మంచులా మార్చేసే చలి. ప్రతీ క్షణం జీవితాన్ని ఒక అడ్వెంచర్‌గా మార్చే వాతావరణం. ఈ నగరంలో చలికాలంలో టెంపరేచర్ మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ ప్రదేశమే రష్యాలోని సఖా రిపబ్లిక్ రాజధాని యాకుట్సిక్.సైబీరియాలోని ఈశాన్య ప్రాంతంలో లెనా నది తీరంలో ఉన్న యాకుట్సిక్ను ప్రపంచంలోనే అత్యంత కోల్డోస్ట్ సిటీల్లో ఒకటిగా చెబుతారు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దాదాపు ఏడు నెలల పాటు ఉండే చలికాలంలో లైఫ్ ప్రతీ రోజు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది.సిమెంట్ పిల్లర్స్‌పై నిలబడే ఇల్లు యాకుట్సిక్ ఉన్న సఖాలో ప్రాంతంలో అధిక భాగం పర్మాఫ్రాస్ట్ నేల ఉంటుంది. అంటే భూమి లోపలి పొరలు వందల మీటర్ల లోతు వరకు శాశ్వతంగా గడ్డకట్టిన స్థితిలో ఉంటాయి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అంటే మంచు గడ్డపై నిలబడే ప్రయత్నం చేయడం లాంటిదే. అందుకే ఇంటి నిర్మాణం కోసం డిఫరెంట్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇంటిని బలమైన పైల్స్‌పై అంటే పొడుగాటి పిల్లర్స్‌పై నిర్మిస్తారు. ఇంటి నుంచి బయటికి వచ్చే వేడి వల్ల అక్కడి గడ్డకట్టిన నేల కరగకుండా గ్యాప్‌తో నిర్మిస్తారు.నీటి పైపులు కూడా బయటే మన ఇంటి పైపులు సాధారణంగా అయితే భూమిలోపల ఉంటాయి కదా.. కానీ ఇక్కడ మాత్రం భూమిపైనే ఈ పైపులను అంటే నీరు, హీటింగ్, గ్యాస్‌లాంటి ఇంధన సరఫరా వ్యవస్థలకు సంబంధించిన పైపులను భూమిపైనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ పైపులు భూమిలోపల ఉంటే వాటి మెయింటెనెన్స్ చాలా కష్టం. బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీటికి స్పెషల్ ఇన్సులేషన్ ఏర్పాటు చేస్తారు.ఇంతటి అత్యంత చల్లని వాతావరణంలోనూ యాకుట్సిక్లో లక్షలాది మంది ప్రజలు సాధారణంగా జీవిస్తారు. స్కూల్స్, ఆఫీసులు, షాపులు, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కూడా ఇక్కడి వాతావరణాన్ని బట్టి నడుస్తాయి. కోల్డెస్ట్ ప్రదేశంగా పాపులర్ అయిన యాకుట్సిక్లో డైమండ్స్ లాంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. మంచుతో కవర్ అయిన ఈ నేలలో దాగి ఉన్న ఖనిజ సంపదే ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’హైదరాబాద్ నుంచి యాకుట్సిక్ ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి యాకుట్సిక్కు వెళ్లేందుకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. హైదరాబాద్ నుంచి ముందు మాస్కో వెళ్లి, అక్కడి నుంచి యాకుట్సిక్కు వెళ్లవచ్చు. మొత్తం ప్రయాణానికి సుమారు 15 నుంచి 20 గంటల టైమ్ పట్టే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ? -
వర్షం పడితే ఈ ద్వీపం అందం రెట్టింపు.. ఎక్కడో తెలుసా?
వర్షం కొన్ని ప్రదేశాలను మరింత అందంగా కనువిందు చేస్తుంది. డబుల్ బ్యూటీతో అలరించే ద్వీపాల సమూహమైన ఇండోనేషియా వర్షంలో కొత్త రంగులను పులుముకుంటుంది. మిగతా రోజుల్లో బాలి వెళ్లిన వాళ్లు వర్షాకాలంలో మరోసారి వెళ్లాల్సిందే అనుకుంటారు. చిరుజల్లులతో ఆకులపై నిలిచే చినుకులు, జారి నేలపై పడటం.. ఆలయ సమూహంలో నిలిచే నీరు.. ఇవన్నీ మణిరత్నం సినిమాలోని ఫ్రేమ్‌లా అనిపిస్తాయి.ఇండోనేషియా అంటే ఒక దేశం మాత్రమే కాదు. ఇది ఎన్నో ద్వీపాల సమూహం. ఏకంగా 17,380కు పైగా ద్వీపాలు ఉన్న ఈ దేశానికి ఒక వైపు సముద్రం ఉంటే మరోవైపు అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇందులో బాలీ, జావా, లంబోక్ వంటి ద్వీపాలకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడి బ్యూటీ అనేది సీజన్ ను బట్టి మారుతుంది.ఎలా వెళ్లాలి..బాలి ఎలా వెళ్లాలి అని చాలా మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తుంటారు. ఈ సమాచారం వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ముందుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ఈ డ్రీమ్ జర్నీ మొదలవుతుంది. కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా సాగే ట్రిప్ మేఘాల సముద్రంలో పడవలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.అలాగే బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక చల్లని గాలి వచ్చి హాయ్ అని పలకరిస్తుంది. ఇదే ఇండోనేషియా వెల్కమ్ చెప్పే స్టైల్. ఈ విమానాశ్రయం డెన్ పసార్ నగరానికి సమీపంలోని టుబాన్ ప్రాంతంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఉబుద్‌కు వెళ్లే సమయంలో సిటీ గజిబిజి నుంచి ప్రశాంతమైన పచ్చని పొలాల మధ్య ఈ ట్రాన్సిషన్ ఎంత స్మూత్‌గా జరుగుతుందో గమనించవచ్చు.విజయవాడలో ఉన్న వారు ఉదయానికి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి జర్నీని ్రపారంభించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు.. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడమే.ఆసక్తికరమైన విషయాలు..2024 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో17,380 ద్వీపాలు ఉన్నాయి.బాలీ రాజధాని డెన్ పసార్. బాలీకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ప్రవేశ ద్వారం.ఉబుద్ బాలీ కళలు, సంప్రదాయాలు, సంస్కతికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.జటిలువిహ్ వరి పొలాలు బాలీ యూనెస్కో గుర్తించి కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌లో భాగం.ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి జాతి అయిన కొమోడో డ్రాగన్ ఇండోనేషియాలోనే కనిపిస్తుంది.ఏం తినాలి..చాలా మంది ఫుడ్ లవర్స్ ఇండోనేషియా వెళ్లే ముందు అక్కడ మంచి ఫుడ్ లభిస్తుందా లేదా అని ఆలోచిస్తారు. వారిని ఇండోనేషియా అస్సలు డిస΄్పాయింట్ చేయదు. ఎందుకంటే భోజనం కూడా ప్రయాణంలో ఒక భాగమే.నాసి గోరెంగ్ అనే ఫ్రై డ్ రైస్, నంచుకోవడానికి ఫ్రై డ్ ఎగ్స్, ఫ్లేవర్ కోసం కొద్దిగా మిరపకాయ, వెల్లుల్లి, టమోటోలను దంచి చేసిన రోటి పచ్చడి లాంటి సాంబల్ ఇవన్నీ మన తెలుగు రుచులను గుర్తుచేస్తాయి. ముందు కాస్త కారంగా అనిపించినా, అరే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. రెండు రోజుల్లో అలవాటైపోతుంది.అలాగే చాలా మంది ఇండోనేషియాలో ఎంజాయ్ చేసే ఫస్ట్ డిష్ వచ్చేసి గడో గడో అనే లోకల్ రెసిపీ. దీనిని ఒక రెసిపీ అనడం కన్నా సలాడ్ అనడం బాగుంటుంది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో ఈ డిష్ లభిస్తుంది.ఏం చూడాలి..ఇండోనేషియాను కళ్లతో కాకుండా మనసుతో చూడాలి. కెమెరా కన్నులకు కాస్త విశ్రాంతిని ఇచ్చి అక్కడి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి. స్థానికంగా ఉండే సందర్శనీయ ప్రదేశాల్లో చాలా మంది తెలియకుండానే అక్కడి జటిలువిహ్ వరి పొలాలను కూడా యాడ్ చేసుకుంటారు. సూర్యుడి వెలుగును బట్టి అక్కడి పొలాల అందం మారిపోతుంది. అలాగే ఉబుద్‌లో కెచక్ డ్యాన్ ్స చూడటం, ప్రాంబనన్ దేవాలయ దర్శనం, లంబోక్ తీరంలో కూర్చొని ఇండోనేషియాను కొత్త కోణంలో చూడటం ఇలా ఎన్నో ΄్లాన్ చేసుకోవచ్చు.ఎక్కడ ఉండాలి..ఇండోనేషియా వెళ్తే బాలిని చూడాలి.. ఉబుద్‌లో ఉండాలి అనే సింపుల్ థియరీ గుర్తుంచుకోవాలి. ఉబుద్‌లో ఉండటానికి కారణం అక్కడి ప్రకతి. ఇక్కడ చెట్ల మధ్య కలపతో చేసిన జోగ్లో హౌస్‌లు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి.వాటి ముందు చిన్న కొలను, చుట్టూ వరి చేలుం మార్నింగ్ లేవగానే బాల్కనీలో కూర్చుని.. ఆల్రెడీ తడిసిన పొలాలపై పడే వర్షాన్ని చూస్తూం కాఫీ లేదా చాయ్ సిప్ చేస్తుంటే వచ్చే ఫీలింగ్‌కు ఏం పేరు పెట్టగలమో చెప్పండి.ఒకవేళ మీరు సముద్రానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే సనూర్, సెమిన్యాక్లో కూడా ΄్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి విల్లాల్లో ఉంటే ఒకవైపు సముద్రం హోరు, మరోవైపు వర్షపు జోరు రెండూ కలిస్తే వచ్చే మ్యూజిక్ ఒక మ్యాజిక్‌లా ఉంటుంది.యోగ్యకర్త అనే ప్రదేశంలో అయితే పాతకాలపు హోటళ్లు ఉంటాయి, గోడల మీద బటిక్ పెయింటింగ్స్, మూలల్లో చెక్క బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కసారిగా రాజుల కాలంలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుంచి ఐదు రోజుల బాలి ట్రిప్ కోసం సుమారు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు కావచ్చు. ఇందులో ఫుడ్, ఫ్లైట్, స్టే వంటి ఖర్చులు ఉంటాయి. కాస్త లగ్జరీగా ట్రావెల్ చేయాలి అనుకుంటే రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల వరకు, అల్ట్రా లగ్జరీ ట్రిప్‌కోసం రూ.1 లక్షా 50 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్ నుంచి బాలి రిటర్న్ ఫ్లైట్ కాస్ట్ అనేది టికెట్ బుకింగ్ టైమ్, ఎయిర్‌లైన్ ను బట్టి మారుతుంది. విజయవాడ నుంచి బాలి వెళ్లాలి అనుకుంటి ఫ్లైట్ కాస్ట మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్టే విషయానికి వస్తే హోమ్‌స్టేలు, హోటల్స్ బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు వివిధ ధరల్లో లభిస్తాయి.భారతీయులు బాలికి వెళ్లాలి అంటే ఆన్ అరైవల్ వీసా పొందవచ్చు. దీని కోసం 5 లక్షల ఇండోనేషియా రుపియాలు ఖర్చు అవుతాయి. ఈ వీసాతో 30 రోజుల వరకు ఇండోనేషియాలో ఉండవచ్చు. ఒకసారి మరో 30 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
టూర్ వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి!
‘ఆకాశపు అంచుల్లో విహరిస్తూ.. మేఘాల్లో తేలిపోవాలని ఉందా? అయితే.. మీకు ఇదే మా స్వాగతం’ అంటూ ఓ అందమైన యువతి హిమాలయాల్లో నిల్చుని రీల్స్‌తో ఆకట్టుకుంది. ఆమె వెనక పిల్లలు, పెద్దలు, మహిళలు బారులు తీరి కనిపిస్తారు. సుందర మంచుకొండలు, పర్యాటకుల సందడితో ఆ రీల్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. మరో ఆలోచనకు తావు లేకుండా పర్యాటక ప్రియులు ఆ రీల్స్‌తో పాటు కనిపించే మొబైల్ నంబర్లను సంప్రదిస్తారు.ఆ తర్వాత బుకింగ్‌ల పర్వం మొదలవుతుంది. క్షణాల్లో చెల్లింపులు.. ఆ వెంటనే పర్యటన తేదీల ఖరారు. మరోవైపు ఆధ్యాత్మిక టూర్ల పేరిట మహిళలు, వయోధికులను ఆకట్టుకొనే ప్రకటనలు. టూర్ ఏజెంట్లు ఏఐ ఆధారిత రీల్స్‌తో మాయాజాలం సృష్టిస్తున్నారు. పర్యాటకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాణాలు, అధికారిక గుర్తింపు లేకుండా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులను దోచుకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్గ్రూప్ టూర్లపై ఆసక్తి.. కొంతకాలంగా గ్రూప్ టూర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున ఇలాంటి టూర్లకు తరలి వెళ్తున్నారు. కిట్టీపారీ్టల పేరిట డబ్బులు పొదుపు చేసే మహిళలు, ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వయోధికులైన భార్యాభర్తలు, ఇంటిల్లిపాది కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని భావించే వాళ్లు గ్రూప్ టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ బడ్జెట్లో ఈ తరహా టూర్లు అందుబాటులో ఉండడంతో క్షణాల్లో బుకింగ్‌లు భర్తీ అవుతున్నాయి.మరోవైపు విదేశాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్‌లోని తమ తల్లిదండ్రులకు ఈ ప్యాకేజీలను బహుమతులుగా అందజేస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా ఇలాంటి ప్యాకేజీలను రూపొందిస్తున్న టూరిస్ట్ సంస్థలు నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను తరలిస్తున్నాయి. కేవలం ఏజెంట్లను నమ్ముకొని వెళ్లే ఇలాంటి పర్యాటకులు ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేపాల్, భూటాన్ వంటి ప్రాంతాల భౌగోళిక, వాతావరణంపై కనీస అవగాహన లేకుండానే విమానంలో తరలి వెళ్తున్నారని పర్యాటకరంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాయమాటలు నమ్మి.. టిబెట్, నేపాల్ తదితర ప్రాంతాల్లో వందలాది సరస్సులు ఉన్నాయి. కానీ.. చాలామంది కైలాస మానస సరోవరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు లేనివాళ్లు మాత్రమే అక్కడి వరకు వెళ్లగలరు. ఇటీవల కాలంలో 65 ఏళ్లు దాటిన వాళ్లు, గుండెజబ్బులు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు కూడా ఏజెంట్ల మాయ మాటలు నమ్మి వెళ్తున్నారు.ఈ నిబంధనలు తప్పనిసరి..కొండలు, ఎత్తైన పర్వతాల్లో విహరించేందుకు వెళ్లే పర్యాటకులకు శిక్షణ అవసరం. పాస్‌పోర్ట్, చైనా, టిబెట్ వీసాలు తప్పనిసరిగా తీసుకోవాలని మన విదేశాంగశాఖ ఈ ఏడాది జూన్ 27న స్పష్టంగా ప్రకటించింది.ఈసీజీ, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువీకరణ ఉండాలి.విదేశాంగశాఖ నిబంధనల మేరకు బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 లోపు ఉంటే మంచిది.ఆర్ధోపెడిక్గా ఫిట్నెస్ లేనివాళ్లు, ఆస్తమా బాధితులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి టూర్లకు వెళ్లొద్దు.రీల్స్ చూసి మోసపోవద్దుకొంతమంది నకిలీ ఏజెంట్లు సృష్టించే కృత్రిమ రీల్స్‌ను చూసి మోసపోవద్దు. గ్రూప్ టూరిజం జోలికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లే ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి. కనీస సదుపాయాలు, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.– కె.రంగారెడ్డి, చైర్మన్ ఐఏటీఓఇవీ చదవండి: కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని కాదని ట్రావెల్ వీడియోలు..!
రిస్క్ ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు అని అంటుంటారు పెద్దలు. కొన్ని సమయాల్లో డేర్‌గా నిర్ణయాలు తీసుకుంటేనే లైఫ్ టర్న్ అవుతుంది. కొన్ని సమయాల్లో మంచి పొజిషన్లో ఉన్నా..మనశ్శాంతి, ఆత్మసంతృప్తి కోసంకొందరు తమకు నచ్చిన రంగంలో కొనసాగుతుంటారు. అంతకుముందు జీవితంలోలా మంచి హోదా, ఎక్కువ జీతం లేకపోయినా..అందులోనే కొనసాగి తమ ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. అలాంటి వ్యక్తే ఈ టెకీ. కానీ ఈ వ్యక్తి చేసిన అతిపెద్ద సాహసం తెలిస్తే విస్తుపోతారు. అంత మంచి వేతనాన్ని ఎలా వదుకోగలిగాడు అని కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అతడే సాక్షమ్ రాజ్ సేథ్. అతడొక టెక్ నిపుణుడు. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్‌గా పూర్తి స్థాయిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఏటా రూ. 85 లక్షలు పైనే ఆర్జించే ప్యాకేజ్ని తృణప్రాయంగా వదిలేశారు. ఆయన అంతపెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ..ఆయన భాగస్వామి స్మృతి సిదానా మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నెలకు రూ. 1.5 లక్షల జీతంతో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తుందామె. అయితే సాక్షమ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగం నచ్చకపోవడం లేదా పనిచేయడం ఆపేయాలనో కాదు. కాలక్రమేణం జీవిత ఏదో యాంత్రికంగా మారిపోతున్న ఫీల్ కలిగి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి ఆదాయం వస్తున్నప్పటికీ తనకు నచ్చినట్లుగా సమాయన్ని గడిపే స్వేచ్ఛ లేకపోతున్నట్లు అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను అధిక జీతం కంటే స్వేచ్ఛ, కొత్త అనుభవాలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. View this post on Instagram A post shared by Smriti & Saksham ✈️ Adventure Couple (@smritiandsaksham) తాము అప్పటికే ట్రావెల్ కంటెంట్‌ని రూపొందిస్తుండటంతో..రిస్క్ తీసుకుని పూర్తి స్థాయిలో దీనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్నది కూడా కాదని చెప్పారు. నిజానికి ఏకంగా రూ. 85 లక్షల జీతం వదిలేయడం అంటే..ఆర్థిక భద్రతను, సౌకర్యమంతమైన జీవనశైలిని స్వచ్ఛందంగా వదులుకోవడం, పైగా అనిశ్చితితో కూడిన మార్గాన్ని ఎంచుకోవడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అనిశ్చితి అనేది అతిపెద్ద సవాలని, ఎందుకంటే..మంచి వేతనం అందించే ఉద్యోగాన్ని వదులుకోవడం సులువు గానీ, అంతే స్థిరమైన మరో ఆదాయ వనరు ఎప్పటికీ కష్టమేనని అన్నారు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా సంపాదించిన దానికి ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్‌గా పొందే వేతనానికి ఏమాత్రం పోలిక ఉండదు. ఇలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా ఆర్థికంగా వెనుకడుగు వేయడంగానే పేర్కొనవచ్చు. పైగా ఈ కొత్త కెరీర్లో విజయం సాధించాలనే ఒత్తిడి కూడా చాలా ఎక్కువుగా ఉంటుందని సాక్షమ్ అన్నారు. కంటెంట్ క్రియేషన్‌లో స్థిరమైన జీతం, గ్యారెంటీ లేని ఎదుగుదల లేదా నిర్దిష్టమైన కెరీర్ మార్గం ఉండవని అంగీకరించారు. ఈ వృత్తిలో నిరంతరం కంటెంట్‌ని రూపొందిస్తూ..కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడం, బ్రాండ్లను సంప్రదించడం వంటివి ఉంటాయి. ఇక్కడ ప్రయాణాలను శాశ్వత సెలవుల్లా పరిగణించలేమని అన్నారు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సమయాన్ని సమతుల్యం చేసుకోవడం వంటివి నేర్చుకోవాలి. ఇక ఆయన భార్య స్మృతి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా..పార్ట్‌టైమ్‌గా ప్రయాణ జీవనశైలికి సంబంధించిన కంటెంట్‌ను కూడా సృష్టిస్తుంది. తమ జీవితం మరింత అనిశ్చితంగా మారినప్పటికీ, అది మరింత సార్థకంగా కూడా అనిపిస్తోందని ఆమె పేర్కొంది. ఇక తన భర్తలో వచ్చిన అతిపెద్ద మార్పు సమయంపై చక్కటి నియంత్రణ కలిగి ఉండటమేనని అన్నారు. ఆయన ఇప్పుడు తన రోజుని ఎలా గడాపాలనుకుంటున్నాడో స్వేచ్ఛగా నిర్ణయించుకోగలడు. అయితే ఈ జీవనశైలిని అస్సలు ఆదర్శంగా భావించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే..పూర్తికాల క్రియేటర్‌గా ఉండటం కూడా ఒక పనే. ఇందులో షూట్లు, ఎడిటింగ్, బ్రాండ్ సంప్రదింపులు, ప్రణాళిక, పిచింగ్, ప్రజలు చూడాలనుకునేదాన్ని నిరంతరం సృష్టించాలనే ఒత్తిడివంటివి ఉంటాయంటూ..సోషల్ మీడియా వేదికగా తమ జీవనశైలిని వివరించారు. ఇక్కడ ప్రయణాలు మనుషుల ఆలోచన విధానాన్ని, జీవితం పట్ల వారి దృక్పథాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయనే విషయాన్ని చాటిచెప్పాయి. View this post on Instagram A post shared by Smriti & Saksham ✈️ Adventure Couple (@smritiandsaksham) (చదవండి: ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..) -
మంచు కొండలో ఈ వాల్ట్ ఎందుకో తెలుసా?
మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.ప్రపంచంలోని వేలాది పంటల విత్తనాలను బ్యాకప్‌గా భద్రపరిచే ప్రత్యేకమైన గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇది. నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ఆర్కిపెలాగోలోని స్పిట్స్‌బెర్గెన్ ద్వీపంలో ఈ సీడ్ వాల్ట్ ఉంది. ఈ వాల్ట్‌ను ఆర్కిటిక్ మంచు, కొండల మధ్యలో, ఒక పర్వతం లోపల నిర్మించారు. అందుకే ఇది బయట నుంచి చూస్తే మంచు మధ్య దాగి ఉన్న పెద్ద లాకర్లా ఉంటుంది.సీడ్ వాల్ట్ లక్ష్యం ఏంటి?నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో విత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా విత్తనాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే సంస్థలు ఉన్నాయి. అలాగే స్వాల్బార్డ్ అనేది సీడ్ బ్యాంక్ కాదు.. ఇది వాల్ట్.వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు, జీన్ బ్యాంకుల నుంచి విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఒక దేశంలో ప్రకతి విపత్తు సంభవించినా, యుద్ధం కారణంగా పంటలు లేదా విత్తనాల సేకరణలు నాశనమైనా, భవిష్యత్తులో ఈ విత్తనాలను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.దీనిని పర్వతం లోపల నిర్మించారు. అది ఒక నేచురల్ ఫ్రీజర్‌గా పని చేస్తుంది. పర్వతం లోపల లోతుగా ఉండటం వల్ల బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి ఈ విత్తనాలకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజమైన చల్లని వాతావరణం కూడా ఈ సంరక్షణకు సహాయపడుతుంది.స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్‌ను 2008లోప్రారంభించారు. దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతం లోపలికి వెళ్లే ఒక పొడవైన టన్నెల్ ద్వారా సీడ్ స్టోరేజ్ చాంబర్లకు చేరుకోవచ్చు. అక్కడ మన షాపింగ్ మాల్లో ఉన్నట్టు ర్యాక్స్ ఉంటాయి. ఒక దేశానికి ర్యాక్‌లో కొంత ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్‌లో ఆ దేశం పంపించే విత్తనాలను సేవ్ చేస్తారు.ఇది సాధారణ సీడ్ స్టోరేజ్ సెంటర్ కాదు. భవిష్యత్ తరాల కోసం ప్రపంచంలోని వ్యవసాయ వైవిధ్యాన్ని కా΄ాడే ఒక గ్లోబల్ బ్యాకప్ సిస్టమ్. అందుకే దీనిని కొన్నిసార్లు ‘‘డూమ్స్‌డే వాల్ట్’’ అని కూడా పిలుస్తారు.ఇవి చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా?
భారత దేశంలో ఎన్నో రివర్స్ ఉన్నాయి. అందులో కొన్ని నదులు ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్ రివర్ అని కూడా అంటారు.బ్రహ్మపుత్ర నది జర్నీ టిబెట్‌లో ప్రారంభం అవుతుంది. టిబెట్‌లో దీనిని యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తారు. హిమాలయాలను దాటుకుంటూ భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యాక, దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.అస్సాంకి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చిన నేచురల్ ఫోర్స్‌గా బ్రహ్మపుత్ర నదిని కీర్తిస్తారు. నది చుట్టూ కనిపించే పచ్చని అడవులు, ద్వీపాలు, వెట్‌ల్యాండ్స్, హిమాలయన్ పాద ప్రాంతాలు కలిసి ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేస్తాయి.రెడ్ రివర్ అని ఎందుకు అంటారు?ఇక రెడ్ రివర్ అనే పేరు విషయానికి వస్తే, నది నీటిలో కనిపించే ఎరుపు రంగే దీనికి కారణం. హిమాలయాల నుంచి భారీ స్థాయిలో వచ్చే సెడిమెంట్స్, మట్టి, ఖనిజాలు నదిలో కలుస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నదీ నీరు ఎర్రగా లేదా మట్టిగా కనిపిస్తుంది.బ్రహ్మపుత్ర అస్సాంకి కేవలం ఒక నది మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవితం కూడా. వ్యవసాయం, చేపలు పట్టడంలో ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఇక్కడి కల్చర్‌తో కూడా ఈ నదికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. నదీ లోయలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవితం కూడా ఈ నదితో పాటు కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.బ్రహ్మపుత్ర నదీ జర్నీలో మజూలీ అనే ప్రముఖ నది ద్వీపం కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అస్సాం కల్చర్, ట్రెడిషన్స్, నేచురల్ బ్యూటీకి ప్రతీకగా నిలుస్తుంది.హిమాలయాల నుంచి ప్రారంభమై, అస్సాం మైదానాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ వరకు ప్రయాణించే బ్రహ్మపుత్ర నది జర్నీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెడ్ రివర్ అనే పేరుతో భారతీయ భౌగోళిక అద్భుతాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.ఇవి చదవండి: ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు! -
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్‌థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్‌లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల సమీపంలో గ్రామీణ హోమ్‌స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు!
విహారం ఆహ్లాదాన్నిస్తుంది.. సాహసం ధైర్యాన్నిస్తుంది. కానీ ఒక చిన్న ఏమరపాటు ప్రాణాలమీదికి తెస్తుంది. మన దేశపు యువతలో కూడా ట్రెక్కింగ్ కల్చర్ పెరుగుతోంది. రిషికేశ్‌లో వైట్–వాటర్ రాఫ్టింగ్, బీర్ బిల్లింగ్‌లో పారాగ్లైడింగ్, దాండేలిలో జిప్‌లైన్, హిమాలయాల్లో ట్రెక్కింగ్.. ఇలా సాహస క్రీడల వైపు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే, ఈ క్రేజ్‌కు తగినట్లుగా పర్యాటకుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల కర్ణాటకలోని దాండేలి రిసార్ట్‌లో జరిగిన ఒక తీవ్రమైన ప్రమాదం ఈ భద్రతా లోపాలను మరోసారి కళ్లకుకట్టింది. జూలై 3న 24 ఏళ్ల కుబేర్ సుర్పూర్ అనే యువకుడు దాండేలిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జిప్‌లైన్ చేస్తుండగా, సగం దూరంలో ఉండగానే ‘సేఫ్టీ లాక్’ ఊడిపోయింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి అతను కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెళ్లే‘ముందు’ జాగ్రత్తలు..గుడ్డిగా నమ్మవద్దు: మీరు ఎంచుకున్న ఆపరేటర్ పర్యాటక శాఖ లేదా అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాడో లేదో తెలుసుకోండి. వెబ్సైట్లో రాసింది నమ్మకుండా, వారి ఒరిజినల్ భద్రతా సర్టిఫికెట్లను చూపించమని అడగండి.స్వయంగా చూడండి: బెల్టులు, హెల్మెట్లు, తాళ్లు, లాకింగ్ సిస్టమ్స్ పాతబడిపోయాయా లేదా తుప్పు పట్టి ఉన్నాయా అనేది స్వయంగా చూసుకోండి. అనుమానం వస్తే ఆ రైడ్ మానడమే మంచిది.సేఫ్టీ బ్రీఫింగ్: యాక్టివిటీ మొదలయ్యే ముందు నిపుణులైన ఇన్ స్ట్రక్టర్ ఇచ్చే భద్రతా సూచనలు స్పష్టంగా వినండి. సేఫ్టీ లాక్స్, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకోండి.దాచవద్దు: మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇటీవలి ఆపరేషన్ల వివరాలను ముందే చెప్పండి. బరువు, ఎత్తు పరిమితులను కచ్చితంగా పాటించండి.ప్యాకేజీలకు మోసపోవద్దు: తక్కువ ధరకే ప్యాకేజీలు ఇస్తున్నారంటే వారు పరికరాల నిర్వహణ, సిబ్బంది శిక్షణలో లోపం ఉందేమో అని గమనించాలి.వాతావరణం బాగున్నప్పుడే: భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు ఉన్నప్పుడు ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి యాక్టివిటీలు చేయవద్దు. ప్రతికూల వాతావరణం వల్ల రోప్‌ల పట్టు సడలి ప్రమాదాలు జరుగుతాయి.రివ్యూలు ముఖ్యం: కేవలం పక్కన ఉన్న లొకేషన్ బాగుందని కాకుండా, ఆపరేటర్ భద్రతా పద్ధతులు, ఇన్‌స్ట్రక్టర్ల ప్రవర్తనపై ఇతర పర్యాటకులు ఇచ్చిన రివ్యూలను చదవండి.స్టంట్స్ వద్దు: రైడ్ లేదా రాఫ్టింగ్ మధ్యలో బెల్టులు తీయడం, స్టంట్స్ చేయడం వంటివి ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి. సరదాగా గడిపే క్షణాలు జీవితాంతం బాధింపకూడదంటే సాహస యాత్రల్లో ఉత్సాహంతో పాటు కాస్త అప్రమత్తత కూడా చాలా అవసరం. థ్రిల్ కన్నా మీ ప్రాణాల భద్రతే ముఖ్యం!అమలులో లోపం!భారత పర్యాటక శాఖ, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి నేల, నీరు, ఆకాశంలో చేసే సాహస క్రీడలకు కఠిన నిబంధనలు రూపొందించాయి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. క్రమం తప్పకుండా పరికరాల తనిఖీలు, సర్టిఫైడ్ గైడ్లు, క్వాలిటీ హార్నెస్ సిస్టమ్స్ వాడాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ స్థానిక స్థాయిలో వీటి పర్యవేక్షణ చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల అనుమతులు, భద్రతా తనిఖీలు లేని ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
సోలో ట్రావెల్ చేశారంటే.. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు!
సోలో ట్రావెల్ అంటే లోన్లీనెస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మనతో మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాము. ఎవరికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి అనే నిర్ణయాలు అన్నీ మనమే తీసుకుంటాము.నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాముసోలో ట్రిప్‌లో చిన్న చిన్న నిర్ణయాలు కూడా మనమే తీసుకోవాలి. ట్రైన్ మిస్ అయితే నెక్ట్స్ ఆప్షన్స్ ఏంటి? హోటల్ నచ్చకపోతే ఏం చేయాలి? రూట్ ఛేంజ్ అయితే ఎలాప్రొసీడ్ అవ్వాలి? ఇలాంటి సిచ్చువేషన్స్ మన కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా సిచ్చువేషన్స్ని హ్యాండిల్ చేయడం అలవాటు అవుతుంది.కొత్తవారితో మాట్లాడే ధైర్యం వస్తుందిప్రయాణాల్లో కొత్తవారితో మాట్లాడటం సాధారణం అవుతుంది. లోకల్ షాప్ ఓనర్స్, ఆటో డ్రైవర్స్, తోటి ప్రయాణికులు లేదా ఒక చిన్న కేఫెలో కలిసిన వ్యక్తితో సంభాషణ ప్రారంభిస్తాము. ఇలా కొత్తవారితో కనెక్ట్ అవ్వడం వల్ల మన కంఫర్ట్ జోన్ మెల్లిగా పెరుగుతుంది.మన గురించి మనకు తెలుస్తుందిగ్రూప్ ట్రావెల్లో మన పర్సనాలిటీలో కొన్ని సైడ్స్ బయటికి రాకపోవచ్చు. కానీ సోలో ట్రావెల్లో మనమే మన ప్రపంచం. మనమే మనకు తోడు. సైలెన్స్‌ని ఎంజాయ్ చేయడం, అంతగా తెలియని ప్రాంతాల్లో అడ్జస్ట్ అవ్వడం, ఊహించని పరిస్థితులను హ్యాండిల్ చేయడం వల్ల మన బలాలు, బలహీనతలు రెండూ మనకు క్లియర్‌గా తెలుస్తాయి.చిన్న చిన్న ఆనందాల విలువ తెలుస్తుంది.ఒక హాట్ టీ, మార్నింగ్ స¯Œ రైజ్, కొత్త ప్రాంతంలో ప్రశాంతమైన స్ట్రీట్, లాంగ్ ట్రైన్ జర్నీంఇలాంటి సింపుల్ మూమెంట్స్ కూడా స్పెషల్‌గా అనిపిస్తాయి. ట్రావెల్ మన అటెన్షన్‌ని పెద్ద పెద్ద టాస్కుల నుంచి చిన్న చిన్న ఆనందాలవైపు మళ్లిస్తాయి.కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారుసోలో ట్రిప్ కంప్లీట్ చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో కొన్ని కొత్త వస్తువులు, మైండ్‌లో కొత్త మెమోరీస్తో పాటు ఒక కొత్త వ్యక్తిత్వం, కొత్త ఐడియాలజీతో ఒక కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారు. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ప్రపంచం గురించి మాట్లాడటమే కాదు, మన గురించి కూడా తెలుసుకోవడానికి ట్రావెల్ ఒక బ్యూటిఫుల్ ఐడియాగా పనికొస్తుంది. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది ఒంటరి ప్రయాణం. అందుకే జీవితంలో అప్పుడప్పుడూ సోలో ట్రిప్స్ చేస్తుండాలి. -
మొదటిసారి ఫ్లైట్ జర్నీనా? అయితే ఈ రూల్స్ తెలియాల్సిందే!
మొదటిసారి ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ట్రైన్ లేదా బస్సులో మనం క్యాజువల్‌గా కేరీ చేసే వస్తువులు కొన్ని విమానాల్లో అనుమతి ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్లడానికి ముందు లగేజ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.పెద్ద లిక్విడ్ బాటిల్స్ వద్దు: షాంపూ, పెర్ఫ్యూమ్, లోషన్, క్రీమ్స్, జెల్స్ లాంటి ద్రవ పదార్థాలను క్యాబిన్ బ్యాగేజీలో తీసుకెళ్లేప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెద్ద బాటిల్స్ కన్నా ట్రావెల్ సైజ్ కంటెయినర్స్ తీసుకెళ్లడం బెటర్. సెక్యూరిటీ చెక్ దగ్గర అనవసర కన్ ఫ్యూజన్ రాకుండా ముందుగానే ప్యాక్ చేసుకోవాలి.షార్ప్ వస్తువులు తీసుకెళ్లరాదు: కత్తి, బ్లేడ్, కటర్, పెద్ద కత్తెర, ఐరన్ స్కేల్ లాంటి షార్ప్ వస్తువులను బ్యాగులో పెట్టుకోరాదు. వీటి వల్ల సెక్యూరిటీ చెక్‌లో ఆపేసే అవకాశం ఉంది. అవసరమైన వస్తువులు ఉంటే ఎయిర్‌లైన్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం వాటిని ప్యాక్ చేయడం మంచిది.పవర్ బ్యాంక్ చెకిన్ బ్యాగ్‌లో పెట్టకండి: ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వారు సాధారణంగా చేసే తప్పుల్లో పవర్ బ్యాంకును చెకిన్ బ్యాగులో పెట్టడం ఒకటి. జనరల్లీ పవర్ బ్యాంకును, స్పేర్ లిథియం బ్యాటరీలను క్యాబిన్ బ్యాగేజ్లోనే కేరీ చేయాలి. చెకిన్ బ్యాగేజీలో పెట్టడానికి అనుమతి ఉండకపోవచ్చు.లైటర్స్, అగ్గిపెట్టెలు: లైటర్స్, అగ్గిపెట్టెలు లాంటి నిప్పు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లడం నిషేధం కావచ్చు. వీటిని లగేజీలో పెట్టే ముందు మీ ఎయిర్‌లైన్ రూల్స్‌ను పక్కాగా చెక్ చేయండి.బొమ్మ ఆయుధాలు కూడా వద్దు: టాయ్ గన్స్, రెప్లికా ఆయుధాలు, ఆయుధాల లాగా కనిపించే వస్తువులు ఉంటే సెక్యూరిటీ వద్దే ఆపేసే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వస్తువులను ఫ్లైట్‌లో కేరీ చేయకపోవడమే మంచిది.పేలుడు వస్తువులు తీసుకెళ్లకండి: టపాసుల వంటి ఫైర్ వర్క్స్, ఫ్యూయల్, గ్యాస్ సిలిండర్, కెమికల్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులను ఫ్లైట్‌లో తీసుకెళ్లడం నిషేధం. వీటిని చెక్డ్ బ్యాగేజీలో కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఉండకపోవచ్చు.లగేజ్ బరువు: ఫస్ట్ టైమ్ అవసరం లేని వస్తువులతో బ్యాగును ఫుల్ చేయడం కన్నా అవసరమైన వస్తువులను మాత్రమే కేరీ చేయడం మంచిది. పాస్‌పోర్ట్ లేదా ఐడీ, టికెట్, ఫోన్, చార్జర్, మందులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని సులభంగా లభించే ప్రదేశంలో ఉంచుకుంటే ఎయిర్పోర్ట్ ప్రాసెస్ సులభంగా ఉంటుంది.ఫ్లైట్‌కు ముందు చెక్ చేయండి: చివరిగా ప్రతీ ఎయిర్‌లైన్ లో బ్యాగేజి రూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండవచ్చు. కాబట్టి ఫ్లైట్‌కి బయల్దేరే ముందు మీ ఎయిర్‌లైన్ అఫిషియల్ బ్యాగేజ్ రూల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ముందుగానే ప్రిపేర్ అయితే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ టెన్షన్ లేకుండా స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. -
దేశం చివరి అంచుల వరకు.. అద్భుత దృశ్యం!
భారత్ అంటే ఒక దేశం మాత్రమే కాదు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం ఉన్న ఒక ప్రపంచం. ఉత్తరాన హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన సముద్ర తీరం వరకు కొన్ని ప్రదేశాలు దేశ వైభవాన్ని చాటి చెబుతాయి. మ్యాప్ మీద గీసిన గీతలు ఆగిపోయే చోట, పర్వతాలు, సముద్రం, నదులు కలిసి ఒక కొత్త భారతదేశాన్ని మనకు పరిచయం చేస్తాయి. మానా, కిబితూ, చిట్కుల్, ధార్చులా, కన్యాకుమారి.. వీటిలో ఎక్కడికి వెళ్లినా అది ప్రయాణం మాత్రమే కాదు ఒక అనుభవం.ఉత్తరాఖండ్‌లోని మానా అనేది బద్రినా«ద్‌కి దగ్గరగా సరస్వతీ నది జన్మించి.. భూ గర్భంలోకి ఇంకిపోయే ప్రదేశంలో ఉన్న చిన్నగ్రామం. ఇండో టిబెటెన్ బార్డర్ వైపు ఉన్న ఈ ప్రదేశంలో రాతి ఇల్లు, ఇరుకు వీధులు, చుట్టూ నిలబడి ఉన్న హిమాలయ కొండలు ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఇస్తాయి.సరస్వతీ నదీ ప్రవాహం, భీముడి వంతెన, వసుధారా జలపాతం వైపు సాగే పర్వత మార్గం మానా ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేస్తాయి.అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబుతు దగ్గరికి చేరుకునే కొద్ది ప్రకృతి మరింత వైల్డ్‌గా మారిపోతుంది. లోహిత్ నది, ఎతై ్తన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు కలిసి తూర్పు హిమాలయ ప్రపంచాన్ని చూపిస్తాయి. డాంగ్ నుంచి కిబుతు వైపు సాగే మార్గం భారత దేశ ఈశాన్య భూభాగం వైభవాన్ని చూపిస్తుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామం. చుట్టూ బాస్పా నది, చెక్కతో నిర్మించిన ఇల్లు, మతి దేవీ ఆలయం అన్నీ కలిసి ఒక నిశ్శబ్దమైన హిమాలయ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇండో టిబెటన్ బార్డర్ వద్ద ఉన్న చిట్కుల్ హిమాచల్‌లోని చివరి గ్రామ వైభవాన్ని చూపిస్తుంది.ఉత్తరాఖండ్‌లోని పితోర్ఘడ్ జిల్లాలో ఉన్న ధార్చులా అనేది కాస్త భిన్నమైన గ్రామం. ఇది ఒక చివరి గ్రామం మాత్రమే కాదు కాళీ నది ఒడ్డున నిలిచిన సరిహద్దు పట్టణం కూడా. ఒకవైపు భారత్, మరో వైపు నేపాల్ మధ్యలో ప్రవహించే కాళి నదీ రెండూ ప్రపంచాలను కలుపుతుంది. జాల్జిబి మార్కెట్, నారాయణ్ ఆశ్రమం, పంచచులి దృశ్యాలు ఈ ప్రదేశాలకు మరింత రంగులు జోడిస్తాయి.దక్షిణాన కన్యాకుమారి దగ్గరికి చేరుకుంటే హిమాలయాల నిశ్శబ్దం కాస్త ఇక్కడ సముద్ర గాలిగా మారిపోతుంది. భారత దేశ దక్షిణాదిలో చివరి భాగం అయిన కన్యాకుమారి వద్ద అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం కలిసే దశ్యం ఒక సినిమాలో హ్యాపీ ఎండింగ్‌లా ఉంటుంది.ఇక్కడ వివేకానందా రాక్ మెమోరియల్, తిరువళ్లూరు స్టాట్యూ, కుమారి అమ్మన్ ఆలయం ఈ తీర చరిత్ర, సంస్కృతిని రెండింటినీ అందిస్తాయి.ఏం చూడాలి?మానాలో సరస్వతి నది శబ్దాన్ని వినడం, భీమ్ పుల్ దగ్గర నిలబడి సరస్వతీ నదీ పర్వతాల మధ్యలోంచి జారిపడే సమయంలో ఏర్పడే ఇంద్రధనస్సును చూడటం, వసుధారా జలపాతం వెళ్లే దారిలో హిమాలయ వైభవాన్ని వీక్షించడం ఇవన్నీ జీవితకాలం గుర్తుంటాయి.అలాగే చిట్కుల్లో బాస్పా నది పక్కనే నడవటం, మతి దేవీ ఆలయం శిల్పకళ వైభవాన్ని గమనించడం, గ్రామాల్లో వుడెన్ హౌసెస్ మధ్య సమయం గడపటం మరొక అనుభవం.కిబుతులో లోహిత్ వ్యాలీ దృశ్యాలు, ధార్చులాలో కాళీ నది వైపు కనిపించే బార్డర్ ల్యాండ్‌స్కేప్, కన్యాకుమారిలో సముద్ర సంగమం, వివేకానంద రాక్ంఇలా ప్రతీ చోటు భారత దేశం చివరి భాగం వరకు ఎంత అందమైనదో, ఎంత విభిన్నమైనదో చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?మన ప్రయాణంలో బద్రినాథ్ లేదా జోషిమఠ్‌లో సింపుల్ హోటల్స్, గెస్ట్ హౌజ్‌ల మధ్య ఒక హిమాలయన్ స్టే అనుభవం లభిస్తుంది.చిట్కుల్, సాంగ్లా ప్రాంతాల్లో హోమ్‌స్టేస్, చిన్న హోటల్స్, గ్రామీణ జీవనాన్ని దగ్గరగా చూపిస్తాయి.ధార్చులాలో కాళీ నది వైపు ఉండే హాస్టల్స్, లాడ్జిలు బార్డర్ ప్రాంతంలో లైఫ్‌ను ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందిస్తాయి.కన్యాకుమారిలో సముద్రం దగ్గర హోటల్స్‌లో సూర్యోదయం, సన్ సెట్ రెండూ ఆస్వాదించడం ప్రయాణంలో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?హిమాలయన్ గ్రామాల్లో లోకల్‌గా దొరికే సింపుల్ భోజనం ఆ ప్రదేశ జీవన విధానాన్ని చూపిస్తుంది.మానాలో రాజ్మా, పొటాటో లాంటివి స్థానికంగా పండిస్తారు.చిట్కుల్, కిన్నోర్ ప్రాంతాల్లో సిద్దు, చనా మాద్రా లాంటివి స్థానిక రుచులను ఆస్వాదించవచ్చు.కన్యాకుమారి చేరుకున్నప్పుడు ప్లేట్లో వడ్డించే ఫుడ్ కడుపునే కాదు మనసును కూడా నింపేస్తాయి.తీర ప్రాంతంలో సౌత్ ఇండియన్ మీల్, కొబ్బరితో చేసిన వంటకాలు, సీ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుమానా అనేది ఉత్తరాఖండ్ ఇండో టిబెటన్ బార్డర్ వైపు ఉన్న చివరి గ్రామంగా ఫేమస్ అయింది.కిబుతు అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు వైపున ఉన్న రిమోట్ బార్డర్ డెస్టినేషన్.చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ధార్చులా కాళీ నది ఒడ్డున భారత్ నేపాల్ బార్డర్ టౌన్.కన్యాకుమారి భారత ప్రధాన భూభాగానికి దక్షిణాది చివరి అంచు. ఇక్కడ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే దృశ్యాన్ని చూడొచ్చు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు చివరి గ్రామాలను ఒకే ట్రిప్‌లో చూడటం కన్నా వేరు వేరు వేరుగా ప్లాన్ చేయడం బెటర్. మానా కోసం హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వైపు ఫ్లైట్ జర్నీ అక్కడి నుంచి జోషిమఠ్, బద్రినాథ్ మార్గంలో సాగే రోడ్డు జర్నీ ఒక మంచి ట్రాన్సిషన్ లా ఉంటుంది. బద్రినాథ్ నుంచి మానా వైపు పర్వతాల మధ్య ప్రయాణం మొదలు అవుతుంది. మీరు నడుస్తూ కూడా వెళ్లవచ్చు.కిబుతు కోసం హైదరాబాద్ నుంచి అస్సాం లేదా అరుణాచల్ ప్రదేశ్‌కి ఎయిర్ జర్నీ తరువాత రోడ్డు జర్నీ చేయవచ్చు. చిట్కుల్ కోసం చండిగఢ్ లేదా షిమ్లావైపు వెళ్లాలి. అక్కడి నుంచి కిన్నౌర్ కొండల మధ్య సాగే రోడ్ జర్నీ సూపర్ మెమోరీగా మిగిలిపోతుంది. ధార్చులా కోసం ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్ లేదా పితోర్‌గఢ్ వైపు సాగే ప్రయాణం హిమాలయాలలో మరో ముఖాన్ని చూపిస్తుంది.కన్యాకుమారి అనేది హైదరాబాద్ నుంచి రైలు, రోడ్డుమార్గంలో ఈజీగా రీచ్ అవ్వగల డెస్టినేషన్.తమిళనాడులోని ఈ ప్రాంతానికి వెళ్లే సమయంలో మీకు పర్వతాలకు బదులు సముద్రం కనిపించడం ఈ ప్రయాణంలో ఒక బ్యూటిఫుల్ ఛేంజ్‌లా కనిపిస్తుంది.ఏం చేయాలి?ఈ ప్రయాణంలో ఒకసారి అయినా మానాలో సరస్వతి నదిని చూడాలి.చిట్కుల్లో బాస్పా నది పక్కన నడవాలి.కిబుతూలో తూర్పు హిమాలయాల నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి.ధార్చులాలో కాళీ నది రెండు దేశాలను కలిపే సన్నివేశాన్ని చూడాలి.చివరగా కన్యాకుమారిలో సముద్రం ముందు నిలబడి భారత దేశ దక్షిణ అంచుని ఫీల్ అవ్వాలి.యాత్రా, బడ్జెట్ వివరాలుఈ ఐదు డెస్టినేషన్స్‌ను ఒకటే ట్రిప్‌లో లేదా 5 రోజుల్లో కవర్ చేయడం లేదా చేయాలి అనుకోవడం అంత మంచి ఐడియా కాదు. సో, 5 రోజుల ట్రిప్‌ను మానా, చిట్కుల్, కిబుత్ లాంటి దగ్గరగా ఉన్నహిమాలయన్ డెస్టినేషన్స్ కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి విమానాలు, తరువాత లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టే కలిపి బడ్జెట్ రేంజ్ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుంది.స్టాండర్డ్ బడ్జెట్ వచ్చేసరికి రూ.30 వేల నుంచి రూ 50 వేల వరకు, ప్రీమియం అయితే రూ.60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.కిబుత్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు రోడ్డు ప్రయాణమే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధార్చులా ట్రిప్‌ను అయితే రూ.18 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ప్లాన్ చేసుకోవచ్చు.కన్యాకుమారి 5 రోజుల ట్రిప్‌ను రూ.15 వేల నుంచి రూ.30 వేల రేంజిలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది మీ ట్రావెల్ క్లాస్, ఎంచుకునే హోటల్‌ను బట్టి మారుతుంది.స్టే కోసం హిమాలయన్ డెస్టినేషన్ లో రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ప్రీమియం ప్రాపర్టీలలో దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం ప్రతీ రోజు సుమారు రూ.500 నుంచి రూ.1,200 వరకు ఖర్చు అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే ఇన్నర్‌లైన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంట్రీకి ముందు కావాల్సిన ఇతర రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
పిల్లలతో బయటకు వెళ్తే.. ఈ గాడ్జెట్స్ మర్చిపోవద్దు!
పిల్లలు చిన్నవాళ్లే, కానీ వాళ్ల అవసరాలకు మాత్రం పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే, బుజ్జాయికి కంఫర్ట్‌తో పాటు పేరెంట్స్‌కు పీస్ ఇచ్చే ఈ చిన్న చిన్న గాడ్జెట్స్ మీకోసం...శబ్దాలకు... బుజ్జి బుజ్జి బ్రేక్!బుజ్జాయి నిద్రలోకి వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయితే, వెళ్లాక లేవకుండా కాపాడటం అంతకంటే పెద్ద టాస్క్! అందుకే, చుట్టూ ఎంత హడావుడి ఉన్నా శబ్దాన్ని తగ్గించే ఈ చిన్న ఇయర్‌మఫ్స్, ప్రతి పేరెంట్స్ బ్యాగ్‌లో ఉండాల్సిందే! ఇది చుట్టూ ఉన్న పెద్ద శబ్దాలను అనుకూలమైన వాల్యూమ్‌లో తగ్గించేలా రూపొందించారు.మృదువైన ఇయర్ ప్యాడ్స్, సర్దుబాటు చేసుకునే హెడ్‌బ్యాండ్ ఉండటంతో చిన్నారులకు సౌకర్యంగా పెట్టుకోవచ్చు. చెవులపై ఎక్కువ ఒత్తిడి పడకుండా డిజైన్ చేయడంతో విమాన ప్రయాణాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కచేరీలు లేదా రద్దీ ప్రదేశాల్లోనూ ఉపయోగపడతాయి. మడిచి చిన్నగా చేసుకోవచ్చు కాబట్టి ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకోవడమూ ఈజీ. అప్పుడే పుట్టిన బుజ్జాయిల నుంచి మూడు సంవత్సరాల వయసు బుజ్జాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీటి ధర రూ.1000.కింద పడినా... స్నాక్ పడదు!అమ్మ కష్టపడి స్నాక్ రెడి చేసి పెడితే... బుజ్జోడు మాత్రం ఒక్క సెకనులో బోర్లించేయడం కామనే! ఇక స్నాక్స్ నేలపాలయ్యే సీన్ కు ఈ స్పిల్ ప్రూఫ్ కప్‌తో చెక్ పెట్టొచ్చు. పిల్లలు కప్‌ను షేక్ చేసినా, పిండినా, కింద పడేసినా... లోపలున్న స్నాక్స్ బయటకు రాకుండా సిలికాన్ ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ కప్ చిన్న చేతులకు సులభంగా పట్టుకునేలా ఉంటుంది. పిల్లలు తమంతట తామే స్నాక్స్ తినడం నేర్చుకోవడానికీ ఉపయోగపడుతుంది. మూత ఉండటంతో బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు తీసుకెళ్లడమూ ఈజీ. కారులో, పార్కులో, ట్రావెల్లో... ఎక్కడైనా స్నాక్ టైమ్ నో టెన్షన్! అన్ని భాగాలనూ విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. డిష్వాషర్లోనూ వేయొచ్చు. బుజ్జోడు కింద పడినా, స్నాక్స్ మాత్రం పడవు! ధర రూ.500.ఎక్కడైనా బుజ్జాయికి బెడ్రూమ్!పిల్లలతో ప్రయాణం అంటే... టికెట్ ఒక్కరికే, టెన్షన్ మాత్రం మొత్తం ఫ్యామిలీకి! కాసేపు కూర్చోబెట్టినా కాళ్లు చాపాలని, పడుకోవాలనిపిస్తే సీటు సరిపోదు. ఇలాంటి సమయంలో ఈ చిన్న ట్రావెల్ యాక్సెసరీ కాస్త అదనపు స్పేస్ ఇచ్చేస్తుంది.విమానం సీట్ల మధ్య అమర్చుకుని పిల్లలు కాళ్లు చాపుకోవడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఫుట్రెస్ట్లా ఉపయోగించుకోవచ్చు. నిద్రొస్తే చిన్న హ్యామాక్లా కూడా సెట్ చేసుకోవచ్చు. పాలిస్టర్ మెటీరియల్‌తో తయారైన ఇది మడిచి బ్యాగ్‌లో పెట్టేసుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు. విమానంలోనే కాదు... రైలు, షిప్ లేదా కార్ జర్నీలోనూ పనికొస్తుంది. ధర రూ.1,500. -
బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్ లుక్!
ముంబై: ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), సూరత్ స్టేషన్ల తాజా దృశ్యాలు ప్రాజెక్ట్ పురోగతిని స్పష్టం చేస్తున్నాయి. సూరత్ స్టేషన్లో ఇంటీరియర్ ఫినిషింగ్ పనులు తుది దశకు చేరుకోగా, ముంబైలోని భూగర్భ బీకేసీ స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భారతదేశపు తొలి ప్రత్యేక హై-స్పీడ్ రైలు ప్రాజెక్టైన 508 కిలోమీటర్ల ఈ కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 12 స్టేషన్లతో అనుసంధానమై ఉంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. #WATCH | Surat, Gujarat: Construction work is progressing at the Surat station for the Mumbai-Ahmedabad Bullet Train project, with structural and roofing work completed and interior finishing underway. The station's design draws inspiration from Surat's diamond-cutting industry.… pic.twitter.com/b6CTQBO7Tp— ANI (@ANI) August 15, 2026సూరత్ డైమండ్ ఇండస్ట్రీ స్ఫూర్తితో స్టేషన్ డిజైన్ఈ కారిడార్‌లో అత్యంత ఆధునిక స్టేషన్లలో సూరత్ ఒకటి. దీని నిర్మాణం, రూఫింగ్ పూర్తికాగా ప్రస్తుతం ఇంటీరియర్ ఫినిషింగ్ కొనసాగుతోంది. సూరత్ నగరానికి గుర్తింపు అయిన వజ్రాల కటింగ్ పరిశ్రమ స్ఫూర్తితో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. మెట్లు, ప్లాట్‌ఫారమ్‌లు, సీలింగ్ పనులతో పాటు ట్రాక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే గుజరాత్లో సూరత్-వాపి సెక్షన్ మధ్య సివిల్ పనులు పూర్తయ్యాయి.భూగర్భంలో ముంబై బీకేసీ స్టేషన్ముంబై వైపు ఈ కారిడార్‌కు ప్రారంభ స్టేషన్‌గా ఉన్న బీకేసీ స్టేషన్‌ను భూగర్భంలో సుమారు 30 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇదే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులలో ఇది ఒకటి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ముంబై బీకేసీ, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.మొదటి సర్వీస్ ఎప్పుడంటే?ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి సెక్షన్ సేవలు 2027 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. సూరత్ నుంచి వాపి మధ్య సుమారు 100 కిలోమీటర్ల మేర తొలి సర్వీస్ నడుపనున్నారు. ఈ తొలి సర్వీస్ కోసం బీఈఎంఎల్లో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా ‘భారత్’ బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం కేవలం ఒక గంట 58 నిమిషాలకు తగ్గనుంది.ఇది కూడా చదవండి: ఒకే నంబరుతో రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం! -
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్ అడ్వెంచర్!
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్‌లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్‌లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్‌గా ప్రసిద్ధి పొందింది.ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు.ఎందుకు స్పెషల్ ?సాన్ డూంగ్ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్‌గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో డాంగ్ హోయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్‌కి ట్యాక్సీ లేదా షటిల్ బస్‌లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్‌కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్‌ని సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ లేకుండా ఫోంగ్ నా రీజియన్ వరకు ప్లాన్ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్లో కంఫర్టబుల్‌గా పూర్తి చేయవచ్చు.ఏం తినాలి?వియత్నాం ఫుడ్ లవర్స్‌కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్ సూప్, బాన్ మీ శాండ్విచ్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, కామ్ టామ్ చాలా ఫేమస్. శాఖాహారుల కోసం వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్ కాఫీని మాత్రం మిస్ అవ్వకండి.దగ్గర్లో చూడాల్సినవిసాన్ డూంగ్ కేవ్‌తో పాటు ఫోంగ్ నా కేవ్, ప్యారడైజ్ కేవ్, డార్క్ కేవ్, మూక్ స్ప్రింగ్ ఎకో ట్రెయిల్, బొటానిక్ గార్డెన్ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్ బ్యూటీ కనిపిస్తుంది.సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్ డూంగ్ కేవ్‌ని లైఫ్‌లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. -
వర్షం పడినా జర్నీ స్టైల్ తగ్గకూడదంటే… ఇలా చేయండి!
వర్షాకాలం అంటే కేవలం వర్షాలు మాత్రమే కాదుం చల్లని గాలి, పచ్చని ప్రకృతి, తాజా వాతావరణంతో ట్రావెల్‌కి పర్ఫెక్ట్ సీజన్ కూడా. కానీ వర్షాకాలంలో డ్రెస్సింగ్ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటే జర్నీ మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్టైల్‌తో ΄ాటు కంఫర్ట్‌ని మెయింటేన్ చేయడం మాన్ సూన్ ఫ్యాషన్ లో ముఖ్యం.తక్కువ బరువు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకోండివర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్, లైనిన్, రేయాన్ లాంటి లైట్‌వెయిట్ ఫ్యాబ్రిక్స్ కంఫర్టబుల్‌గా ఉంటాయి. హెవీ ఫ్యాబ్రిక్స్ వర్షపు నీటిని పీల్చుకుని ఎక్కువసేపు తడిగా ఉంటాయి. సులువుగా ఆరి΄ోయే బట్టలు అయితే బెటర్.బ్రైట్ కలర్స్ బెస్ట్వర్షాకాలంలో వాతావరణం ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ΄ాస్టల్ షేడ్స్, బ్రైట్ కలర్స్, ఎర్తీ టోన్స్ మీ ఔట్‌ఫిట్‌కి ఫ్రెష్ లుక్ ఇస్తాయి. వైట్ షేడ్స్ కన్నా మురికి అంతగా కనిపించని రంగుల దుస్తువులు ఈ సీజన్ లో పెర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.కంఫర్టబుల్ ఫుట్‌వేర్ ముఖ్యంవర్షాకాలం సీజన్ లో ఫుట్‌వేర్ సెలెక్షన్ చాలా ఇం΄ార్టెంట్. వాటర్ రెసిస్టెంట్ శాండిల్స్, క్విక్ డ్రై షూస్ లేదా కంఫర్టబుల్ స్లిప్పర్స్ ట్రావెల్‌కి చాలా సూట్ అవుతాయి. తడిసిన రోడ్డుల్లో కంఫర్ట్ కోసం గ్రిప్ ఉన్న ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.లేయరింగ్తో స్మార్ట్ లుక్హిల్ స్టేషన్ లేదా చల్లని ప్రదేశాలకు ఈ వర్షాకాలంలో వెళ్తే మాత్రం లైట్ జాకెట్, హుడీ లేదా విండ్చీటర్ క్యారీ చేయడం మంచిది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుంది. కాబట్టి లేయరింగ్ స్టైల్‌తో కంఫర్ట్ మెయింటేన్ చేయవచ్చు.రెయిన్ ఆక్సెసరీస్గొడుగు, లైట్‌వెయిట్ రెయిన్ కోట్, వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ కవర్ లాంటి యాక్సెసరీలు మాన్ సూన్ వార్డ్‌రోబ్‌లో భాగం అవుతాయి. మరీ ముఖ్యంగా ట్రావెల్లో కెమెరా, మొబైల్, డాక్యుమెంట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వాటర్‌ప్రూఫ్ ΄ûచెస్ బాగా ఉపయోగపడతాయి.హెయిర్, పర్సనల్ కేర్ కూడా ముఖ్యంతేమ వల్ల హెయిర్ కేర్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సింపుల్ హెయిర్ స్టైల్, కంఫర్టబుల్ క్యాప్స్ లేదా స్కార్ఫ్‌లు వినియోగించడం వల్ల కాస్త లుక్ మెయింటేన్ చేయవచ్చు. అలాగే జుట్టును ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.వర్షాకాలంలో డ్రెస్సింగ్ అంటే కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. వర్షాకాలం అందాన్ని ఎంజాయ్ చేస్తూ కంఫర్టబుల్‌గా ఉండటం. సరైన ఔట్ఫిట్ ఛాయిస్‌తో వర్షాకాలంలో ప్రతి ట్రిప్‌ను స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. -
Tour: చరిత్ర చెప్పే భారత యాత్ర
కొన్ని ప్రదేశాలు మ్యాపులో కనిపించే లొకేషన్లు మాత్రమే కావు. అవి ఒక దేశ జ్ఞాపకాలు కూడా. అక్కడి నేల, గోడలు, దారులు అన్నీ అక్కడి త్యాగాల కథలను నేటికీ చెబుతూనే ఉంటాయి. భారత స్వాతంత్య్ర పోరాటం అనగానే కొన్ని ప్రముఖ నగరాలు ప్రదేశాలు, కట్టడాలు గుర్తొస్తాయి. అయితే దేశంలోని ప్రతిప్రాంతం తన వంతు పోరాట స్మృతులను రాసుకుంది. మన తెలుగు నేల కూడా అలాంటి వీర చరిత్రకు నిలయం.ఆంధ్రప్రదేశ్ అడవుల్లో వినిపించే మన్యం పోరాట స్వరాల నుంచి అండమాన్ సముద్రం మధ్యలో ఉన్న సెల్యులర్ జైలు వరకు ఈ ఫ్రీడమ్ ట్రెయిల్ యాత్ర (India Freedom Trail) భారత స్వాతంత్య్ర స్పూర్తిని పరిచయం చేస్తుంది. దేశం కోసం పోరాడిన వీరుల అడుగుజాడలను స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపే ఆనాటి పోరాట కథలు చెప్పే ప్రదేశాలను సందర్శించడానికి 5 రోజుల భారత్ ఫ్రీడమ్ ట్రెయిల్ ఇది..మన్యం అడవుల్లో స్వాతంత్య్ర పోరాట జాడలు...ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల మధ్యలో ఉన్న మన్యంప్రాంతం ప్రకృతి అందాలతో పాటు ఒక వీర చరిత్రను కూడా మోసుకొస్తుంది. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిపిన రంపా పోరాటం తెలుగు స్వాతంత్య్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.కొండలు, అడవులు, గిరిజన జీవన విధానం మధ్య ఆయన పోరాట జ్ఞాపకాలను ఇప్పటికీ ఆప్రాంతంలో ఫీల్ అవ్వవచ్చు. అల్లూరి పేరు వినగానే తెలుగు ప్రజల మనసులో ఒక వీరుడి రూపం కనిపిస్తుంది. మన్యం పోరాటం జరిగిన ప్రదేశాల్లో ప్రయాణం చేస్తే ప్రకతితో పాటు చరిత్ర కూడా మనతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి రాజమండ్రికి లేక విశాఖపట్టణం చేరుకుని అక్కడి నుంచి రోడ్ జర్నీలో ఏజెన్సీప్రాంతాలకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రాజమండ్రి మార్గం కూడా అనుకూలంగా ఉంటుంది. రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లిప్రాంతాల్లో స్టే ఆప్షన్స్ లభిస్తాయి.దండి మార్చ్‌కు నాంది పలికిన సబర్మతిగుజరాత్లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి ఆశ్రమం ఒక ప్రశాంతమైన చారిత్రక ప్రదేశం. సబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలకు మార్గదర్శనం చేశారు. 1930లోప్రారంభమైన దాండీ మార్చ్ కూడా ఇక్కడేప్రారంభం అయింది.ఆశ్రమంలో మహాత్ముడు ఉపయోగించిన వస్తువులు, ఫొటోగ్రాఫ్స్, లెటర్స్ చరిత్రను దగ్గరగా పరిచయం చేస్తాయి.సబర్మతి ఆశ్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోరు.ఈ ఆశ్రమాన్ని సందర్శించాలి అనుకుంటే ముందుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.అహ్మదాబాద్‌లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000, కంఫర్టబుల్ హోటల్స్ రూ.3000 నుంచి రూ.7500 వరకు బడ్జెట్లో లభిస్తాయి.కాలాపాని సెల్యులర్ జైలు.. స్వాతంత్య్ర సమరయోధుల కన్నీటి గాథసముద్రం మధ్యలో ఉన్న అండమాన్ ద్వీపాల్లో సెల్యులర్ జైల్ చరిత్ర తెలుసుకుంటే నాటి పోరాటం వెనక ఉన్న త్యాగాలు అర్థం అవుతాయి. బ్రిటిష్ కాలంలో వీర్ సావర్కర్తో పాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇక్కడే బంధించారు. జైల్లో ఉన్న ప్రతి గది దేశ భక్తుల త్యాగం, వారి పోరాటం గురించి మౌనంగా వివరిస్తుంది. ఇప్పుడు సెల్యులర్ జైలును నేషనల్ మెమోరియల్‌గా మార్చి పర్యాటకుల కోసం తెరిచి ఉంచారు. సందర్శకులు మ్యూజియం, పాత కారాగారాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ జ్ఞాపకాలను చూడవచ్చు.భారతీయ పర్యాటకులకు ఇక్కడికి వెళ్లేందుకు సుమారు రూ.30 ఎంట్రీ ఫీజు ఉంటుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో ఈ ప్రదేశ చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. షో టికెట్ కాస్ట్ వచ్చేసి రూ.300.కాలాపాని వెళ్లాలి అనుకునే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి చెన్నై లేక కోల్‌కతా ద్వారా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నై రూట్లో వెళ్లడం సులువుగా ఉంటుంది.పోర్ట్ బ్లెయిర్‌లో బడ్జెట్ హోటల్స్ రూ.1500 నుంచి రూ.3000 వరకు లభిస్తాయి. కాస్త కంఫర్టబుల్ స్టే కావాలి అనుకుంటే మాత్రం రూ.3000 నుంచి రూ.6000 మధ్యలో లభిస్తాయి.సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని తెలిపే నేతాజీ భవన్పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉన్న నేతాజి భవన్ అనేది సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన వారసత్వ సంపద. ఇక్కడ నేతాజి ఉపయోగించిన వస్తువులు, ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ భద్రపరిచారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాల గురించి తెలుస్తాయి.నేతాజి భవన్ టూరిస్టుల కోసం తెరిచే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ లేక చెన్నై ద్వారా చేరుకోవచ్చు. కలకత్తాలో బడ్జెట్ స్టే రూ.1,000 నుంచి రూ.3000లో లభిస్తుంది.జలియన్ వాలా బాగ్.. నెత్తుటి చరిత్రకు సాక్ష్యంపంజాబ్లో ఉన్న జలియన్ వాలా బాగ్ భారత చరిత్రలో ఒక పీడకలగా మిగిలిపోయింది. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక మెమోరియల్‌గా నిలిచి, ఆ నాటి చేదు జ్ఞాపకాలను నేటి తరానికి అందిస్తోంది.టూరిస్టులు ఇక్కడ మెమోరియల్, మ్యూజియం, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఎంట్రీ సాధారణంగా ఫ్రీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమత్సర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఢిల్లీ రూట్ అనుకూలంగానే ఉంటుంది.అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ దగ్గర స్టే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ హోటల్స్ రూ.1,000 నుంచి రూ.2500 మధ్యలో దొరుకుతాయి. కంఫర్టబుల్‌గా స్టే చేయాలి అంటే రూ.3000 నుంచి రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకమైన రుచులుఈ యాత్రలో ప్రతిప్రాంతం తన రుచులతో పరిచయం చేస్తుంది. ఆంధ్రా మన్యంప్రాంతాల్లో లోకల్ గిరిజన రుచులు, గోదావరి స్పెషల్ వంటకాలను ఆస్వాదించవచ్చు.అండమాన్ లో సీఫుడ్‌తో పాటు దక్షిణాది వంటకాలు లభిస్తాయి. గుజరాత్లో ఢోక్లా, తెప్లా, గుజరాతీ థాలీ, పంజాబ్‌లో అమత్సర్ కుల్చా, కోల్‌కతాలో బెంగాలీ స్వీట్స్ ఈ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌లో భాగం అవుతాయి.5 రోజుల ఫ్రీడమ్ ట్రెయిల్.. ఎంత బడ్జెట్ కావాలి?ఈ ఫ్రీడమ్ ట్రెయిల్స్ని 5 రోజుల ప్లాన్ లో కవర్ చేయాలి అంటే ఎక్కువగా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే విమాన చార్జీలు, వసతి, భోజనం, రవాణా, ప్రవేశ రుసుము కలిపి బడ్జెట్ ట్రావెల్ కోసం సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు అవసరం పడవచ్చు.కంఫర్టబుల్ స్టాండర్డ్ ట్రావెల్ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీమియం ట్రావెల్ అనుభూతి కోసం రూ.80 వేలపైనే బడ్జెట్ అవసరం అవుతుంది.విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే కనెక్టివిటీని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. స్టే కోసం ప్రతి డెస్టినేషన్ లో సుమారు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఖర్చు అవుతుంది. ఫుడ్ కోసం రోజుకు రూ.300 నుంచి రూ.1500 వరకు మీ ఛాయిస్‌ను బట్టి ఖర్చు చేయవచ్చు.ఈ ఫ్రీడమ్ ట్రెయిల్లో ఆసక్తికర విశేషాలు...సెల్యులర్ జైల్‌ని బ్రిటిష్ కాలంలో కాలాపానీ అని పిలిచేవారు.అల్లూరి సీతారామ రాజుని తెలుగులో ప్రజలు మన్యం వీరుడు అని గౌరవిస్తారు.దాండీ మార్చ్‌ను మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి పారంభించారు.జలియన్ వాలా బాగ్ ఘటన భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మలుపు లాంటిది.నేతాజి భవన్ లో సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు తెసుకోవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
అందమైన ప్రదేశాలెన్నున్నా.. కొన్ని చోట్లకి పదే పదే ఎందుకెళ్తాం?
గోవా, హిమాచల్‌ప్రదేశ్ వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రతిసారీ పదే పదే వెళ్లే పర్యాటకులను మనం తరచుగా చూస్తుంటాం. ప్రపంచంలో చూడాల్సిన అందమైన ప్రదేశాలు వేలల్లో ఉండగా, ఒకే ప్రదేశానికి పదే పదే ఎందుకు వెళ్తున్నారనే సందేహం చాలామందికి రావచ్చు. అయితే మనుషులు పదే పదే ఒకే ప్రాంతాన్ని సందర్శించడం వెనుక వారి మానసిక స్థితి, భావోద్వేగాలు దాగి ఉన్నాయని టూరిజం సైకాలజీ పరిశోధనల్లో తేలింది.స్ట్రెస్ బస్టర్..కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రూట్లు వెతుక్కోవడం, హోటళ్లు ఎంచుకోవడం, ఆహార అలవాట్లు తెలుసుకోవడం వంటి విషయాల్లో బ్రెయిన్ స్ట్రెస్‌కు గురవుతుంటుంది. అదే తెలిసిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆ సమస్య ఉండదు. అప్పటికే మనకు అక్కడ ఏ కేఫ్‌లు బాగుంటాయో, ఏ రెస్టారెంట్లో ఆహారం నచ్చుతుందో స్పష్టత ఉంటుంది. దీనివల్ల మెదడుపై మానసిక భారం గణనీయంగా తగ్గుతుంది.బాండింగ్కొన్ని ప్రాంతాలు కేవలం టూరిస్టు ప్రాంతాలుగా మాత్రమే కాకుండా, ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన హిల్ స్టేషన్లు లేదా ఈత నేర్చుకున్న సముద్ర తీరాలు వారి గుర్తింపుతో ముడిపడిపోతాయి. పరిశోధనల ప్రకారం... ఇటువంటి ప్రదేశాలు పర్యాటకులకు శారీరక, మానసిక ఉపశమనాన్ని ఇచ్చి, వారి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.నోస్టాల్జియా..మనం గతంలో గడిపిన క్షణాలు, అక్కడి అనుభూతులు, పరిమళాలు మనలో పాజిటివ్ థింకింగ్‌ని పెంపొందిస్తాయి. టూరిజం అధ్యయనాల ప్రకారం... నోస్టాల్జియా అనేది పర్యాటకులను మళ్లీ మళ్లీ పాత ప్రదేశాలకే రప్పిస్తుంది. అందుకే చాలామంది తమ చిన్ననాటి అనుభూతులను తమ పిల్లలకు లేదా మిత్రులకు పరిచయం చేసేందుకు ఆ ప్రదేశాలకు తిరిగి వెళ్తుంటారు.సేఫ్ జర్నీమొదటిసారి ఒక ప్రదేశానికి వెళ్లినప్పుడు అన్ని విజిటింగ్ స్పాట్లను ఎలాగైనా చూసేయాలనే తొందరపాటు ఉంటుంది. కానీ రెండోసారి వెళ్లినప్పుడు ఆ స్ట్రెస్ పూర్తిగా తొలగిపోతుంది. ఏ విధమైన హడావుడి లేకుండా లోకల్ కేఫ్‌లలో సమయం గడపడం, వీధుల్లో ప్రశాంతంగా నడవటం లేదా సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం వంటివి చేయగలుగుతారు.మనుషులు ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషించడానికి మాత్రమే ప్రయాణాలు చేయరనీ,. తమ పాత జ్ఞాపకాలను పునరుద్ధరించుకోవడానికి, తమను తాము తిరిగి ఆవిష్కరించుకోవడానికి కూడా ప్రయాణాలు చేస్తారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
తెలంగాణవాళ్లు టూర్ ఇందుకే వెళ్తారు..!!
దేశవ్యాప్తంగా పర్యాటక ఆసక్తులను తెలుసుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఆపరేటర్ స్కైస్కానర్స్ ఇండియా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ఆధారంగా బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వాసుల ప్రయాణాభిరుచులను వెల్లడించే కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది.దీని ప్రకారం, భారత దేశం వెలుపల పర్యటనలతో సహా ఎక్కడికి ప్రయాణించాలి? అనే అంశాన్ని ఆహారం, పండుగలు, చారిత్రక నేపధ్యాలే ప్రధానంగా నిర్ణయిస్తున్నాయి. ప్రాంతాల వారీగా ఆహార అనుభవాలు తమ పర్యటనలను ఎంచుకోవడానికి ప్రముఖ కారణంగా 56% స్పష్టం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో సాంస్కృతిక పర్యటనలపై కూడా తమకు ఆసక్తి పెరిగిందని 83% మంది చెప్పారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కైస్కానర్స్ చెందిన నీల్ ఘోస్ మాట్లాడుతూ ఇప్పుడు వెళ్లే స్థలం కంటే అక్కడ అందుకునే అనుభవంపైనే ప్రయాణ నిర్ణయాలు ఆధారపడి ఉంటున్నాయని చెప్పారు. ‘నేను ఎక్కడికి ప్రయాణం చేయాలి?’ అనే ప్రశ్న తో పాటు ‘నేను ఏమి అనుభవించాలనుకుంటున్నాను?’అనేది ప్రధానంగా మారింది’’ అని ఆయన వివరించారు.హైదరాబాద్ సాంస్కృతిక గుర్తింపులో ఆహారం ఒక ప్రాథమిక భాగం’’ అని ఘోష్ చెప్పారు. అయితే, చార్మినార్ ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్‌ల ద్వారా 39% మంది తెలంగాణ విశేషాలకు మరింత ప్రచారం అవసరమని అభిప్రాయపడ్డారు. దుర్గాపూజను 38% మంది దీపావళిని 37%, పొంగల్ కుంభమేళాలను 33% మంది చొప్పున తమ ప్రయాణాలకు కారణాలుగా చెప్పారు. బతుకమ్మను 32%, బోనాలు 31% మంది ఎంపిక చేసుకున్నారు. దేశీయ జాబితాలో కొచ్చి, ఉదయపూర్, అల్మోరా, కోల్‌కతా, ముంబై, లక్నో, పూరీ కొహిమాలు హైదరాబాద్ ప్రయాణికులు ఇష్టపడే సాంస్కృతిక నేపధ్యం కలిగిన ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ సాంస్కృతిక ప్రయాణాల్లో తమ ఎంపికగా 22% మంది జపాన్ను ఎన్నుకున్నారు. థాయ్‌లాండ్, వియత్నాంలకు 17%, ఫ్రాన్స్ 16%, యునైటెడ్ కింగ్డమ్ 15% ఇటలీ 10% మంది ఇష్టాల్ని గెలుచుకున్నాయి. -
ఫ్రెండ్స్-కూతురితో కలిసి నమ్రత హాలీడే ట్రిప్ (ఫొటోలు)
-
వర్షంలో రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా?
కారు ట్రిప్ అంటే కేవలం ఒక డెస్టినేషన్‌కు చేరుకోవడం కాదు. మధ్యలో కనిపించే ప్రదేశాలు, ఫ్యామిలీతో గడిపిన క్షణాలు, రోడ్ జర్నీ మెమోరీస్ అన్నీ కలిసి ఒక స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారుతాయి. కానీ వింటర్, మాన్సూన్ సీజన్లో కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే జర్నీ అంత బాగుంటుంది.కార్ చెకప్‌తో స్టార్ట్ చేయండిలాంగ్ డ్రైవ్‌కి ముందు కార్ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. టైర్స్ కండిషన్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు, లైట్స్, వైపర్స్ లాంటి బేసిక్ పార్ట్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వర్షాకాలంలో తడిసిన రహదారులు, వింటర్లో ఫాగ్ వల్ల విజిబిలిటీ తగ్గుతుంది కాబట్టి కార్ రెడీనెస్ ముఖ్యం.వాతావరణానికి తగినట్టు ప్లాన్ చేయండివర్షాకాలం అయినా, చలికాలం అయినా ఉదయం వేళలో ఫాగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్ టైమ్‌ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే జర్నీ స్మూత్‌గా సాగుతుంది. వర్షాకాలంలో చిరుజల్లుల మధ్య రోడ్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కాబట్టి ట్రావెల్ పేస్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్లడం మంచి అనుభూతిని ఇస్తుంది.కార్లో ఉండాల్సిన వస్తువులు రోడ్ ట్రిప్ కోసం కొన్ని బేసిక్ ఐటమ్స్ కార్లో రెడీ ఉంచుకోవాలి. వాటర్ బాటిల్స్, స్నాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, రెయిన్ కవర్ లాంటి ఎసెన్షియల్స్ అనుకోని పరిస్థితుల్లో బాగా ఉపయోగపడతాయి.కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్లాంగ్ డ్రైవ్స్‌లో మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం బాడీకి రిలాక్సేషన్ ఇస్తుంది. విండో బయట కనిపించే గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్, మిస్టీ మౌంటెన్స్, వింటర్ మార్నింగ్స్ లాంటి సీన్స్‌ని ఆస్వాదిస్తూ జర్నీని పూర్తి చేయవచ్చు.ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇంకా స్పెషల్చలికాలం, వర్షాకాలంలో కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. రోడ్ పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు, లోకల్ ఫుడ్ స్టాప్స్, ఊహించని అందమైన లొకేషన్స్ అన్నీ కలిసి జర్నీని డెస్టినేషన్ కన్నా స్పెషల్‌గా మార్చేస్తాయి.చదవండి: 'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'కార్ ట్రిప్‌లో వేగం కన్నా సేఫ్టీ ముఖ్యం, గమ్యం కన్నా ఎక్స్‌పీరియెన్స్ ముఖ్యం. సరైన ప్లానింగ్‌తో వింటర్, మాన్సూన్ రోడ్ జర్నీస్ జీవితంలో మరిచిపోలేని ట్రావెల్ మెమోరీస్‌గా నిలుస్తాయి. -
ఫ్రెండ్‌ట్రిప్.. స్నేహ వారధులుగా ప్రయాణాలు..!
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల అల్లికకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అపరిచితులుగా కలిసిన వారు టూర్ ముగిసే కొన్ని రోజుల వ్యవధిలోనే మంచి మిత్రులుగా మారుతుండడం ఈ స్నేహాల పట్ల నగర వాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.‘విభిన్న ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి స్నేహాల కోసం సాహస యాత్రల్ని ఎంచుకుంటున్నారు’ అని నగరానికి చెందిన ట్రెక్ ఇట్ సంస్థ నిర్వాహకులు వెంకట్ తెలిపారు. ఈ ఆసక్తిని గమనించిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ కమ్యూనిటీలు ఇప్పుడు కేవలం ‘కొత్త ప్రదేశాలు చూడండి.. కొత్త స్నేహాలను ఏర్పరచుకోండి’ అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. సోలోమంటూ.. స్నేహాలకు చలో.. ఈ తరహా యాత్రలు కనీసం 20 మంది నుంచి 50 మంది దాకా బృందంతో నిర్వహిస్తారు. అందరూ కలిసి ఒకే వాహనంలో ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం, ఒకే క్యాంప్‌లో బస చేయడం, ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ఫొటోలు దిగడం.. ఇలా మొదలవుతున్న పరిచయం శరవేగంగా స్నేహంగా మారుతోంది. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సందర్భాల్లో ఒకరు అలసిపోతే మరొకరు చేయి అందిస్తారు. వాటర్ బాటిల్ ఖాళీ అయితే ఇంకొకరు తమ నీటిని పంచుకుంటారు. ఒకరి బ్యాగ్‌ను మరొకరు కొద్దిసేపు మోస్తారు. ఇదే ‘ట్రిప్ ఫ్రెండ్’ను ‘లైఫ్ ఫ్రెండ్’గా మార్చేస్తోంది.యాత్ర సమాప్తం.. ఆగని స్నేహం.. అడ్వెంచర్ ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ సంబంధాలు, తదుపరి ట్రిప్స్ ప్లాన్ చేయడం ద్వారా స్నేహాలు బలోపేతమవుతున్నాయి. సాహస యాత్రలు చేసే అభిరుచి ఎక్కువగా యువతదే అయినప్పటికీ మొత్తం బృందంలో ముగ్గురు నలుగురే మధ్య వయసు్కలు ఉంటారు. సహజంగానే వీరు సమవయసు్కలు కావడంతో స్నేహితులుగా మారుతున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల మధ్య స్నేహితుల తో బంధాలు తగ్గిపోయిన 40+, 50+ వయసు వారిలోనూ గ్రూప్ ట్రావెల్, ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఊర్లు వేరు.. దార్లు ఒకటే...‘మాది తిరుపతి, అన్నాడు సునీల్ మాది పీలేరు అన్నాడు రెడ్డి శంకర్. మాది ఒంటిమిట్ట అని చెప్పాడు సంపత్. ఆ ముగ్గురు యువకులు. నగరం నుంచి ప్రారంభం అయే ప్రయాణాల్లో మేము సైతం అంటూ తమ బైక్‌ని కలుపుతారు. లేదా వీరు ముగ్గురూ కలిసి తరచుగా బైక్ ట్రిప్స్ వేస్తుంటారు ‘ఇటీవలే వాయనాడ్, కూర్గ్.. చుట్టు పక్కల ప్రాంతాలకు బైక్స్ మీద వెళ్లి వచ్చాం. ఎవరు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బైక్ కిక్ కొట్టాల్సిందే’ అంటోందీ స్నేహ త్రయం. ప్రయాణ అభిరుచే కలిపింది.. కడప నివాసి మహ్మద్ వాసిమ్, నగరవాసి రాజ్ కుమార్ వశిష్టలను ఓ సాహస యాత్ర మంచి స్నేహితులుగా మార్చింది. ఇటీవలే దేవ్‌కుండ్ వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ముగించుకుని వచ్చిన వీరు తమ తదుపరి మాన్సూన్ ట్రెక్కు సిద్ధమవుతున్నారు.‘తొలుత నేను ట్రిప్ ప్లాన్ చేస్తాను. వాసిమ్ ని సంప్రదించి తను ఓకే అన్నాక ఫైనల్ చేస్తాను’ అంటూ చెప్పారు రాజ్. కుల,మత నేపథ్యాలతో పాటు వృత్తి వ్యాపకాలు కూడా వేర్వేరు. (వాసిమ్ వ్యాపారి కాగా రాజ్ ఐటీ ఉద్యోగి ) అయినా అవేవీ వీరి స్నేహ ప్రయాణానికి అడ్డంకి కాకపోవడం గమనార్హం. -
ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్‌లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల మనుగడను కాపాడేందుకు, మరికొన్ని ప్రాంతాను మిలిటరీ రహస్యాల వల్ల సాధారణ ప్రజలకు దూరంగా ఉంచారు. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఇవే..నార్త్ సెంటినల్ ఐలాండ్భారతదేశంలో ఉన్న అండమాన్ ద్వీప సమూహంలో ఈ చిన్న ద్వీపంలోనికి బయటి ప్రపంచం నుంచి ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ సెంటినెలీజ్ అనే ప్రపంచంతో సంబంధం లేని ప్రజలు ఉంటారు. వాళ్లను అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ చుట్టూ స్ట్రిక్ట్‌గా నో–ఎంట్రీ జోన్ మెయింటైన్ చేస్తోంది.ఏరియా 51ఏలియెన్స్ ఉన్నారా? సీక్రెట్ వెపన్స్ తయారు చేస్తున్నారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు కేరాఫ్ చిరునామాగా మారింది అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతం. నిజం ఏంటి అనే విషయం కాస్త పక్కన పెడితేం ఇది అమెరికా మిలిటరీకి చెందిన హై–సెక్యూరిటీ జోన్ లేదా బేస్. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం.స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్దీనినే ప్రపంచ బ్యాకప్ లాకర్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో లక్షలాది మొక్కల విత్తనాలను సంరక్షిస్తారు. భవిష్యత్తులో ఏదైనా తెలియని విపత్తు వచ్చినా కూడా వ్యవసాయం మళ్లీ ప్రారంభించేందుకు ఇది ప్రపంచానికి ఇన్సూరెన్స్ పాలసీలా పని చేస్తుంది. అందుకే సాధారణ ప్రజలను ఇక్కడికి వెళ్లేందుకు అనుమతించరు.లాస్కాక్స్17,000 ఏళ్ల నాటి పురాతనమైన పెయింటింగ్స్ ఉన్న ఈ గుహల్లోకి ఒకప్పుడు సందర్శకులు వెళ్లేవారు. అయితే కాల క్రమేన మనుషుల శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రత, బయటి ప్రపంచం నుంచి వచ్చే కాలుష్యం వల్ల పెయింటింగ్స్‌కు డ్యామేజ్ అవ్వడం మొదలైంది.దీంతో కంప్లీట్‌గా పర్యాటకులను బ్యాన్ చేసేశారు.వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్శతాబ్దాల నాటి పురాతనమైన, అత్యంత రహస్యాత్మక డాక్యుమెంట్స్, రాజపత్రాలు, చారిత్రాత్మక రికార్డులు అన్నీ కూడా ఇక్కడే దాచి పెడతారు. ప్రత్యేక అనుమతి తీసుకుని వెళ్లే పరిశోధకులకు త΄్పా ఇతరులకు ఎవరికీ ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లభించదు.నిజానికి ప్రతీ అందమైన ప్రదేశం మనం విజిట్ చేయడానికి కాదు. కొన్ని ప్రదేశాలకు రహస్యమే అందం. ఇలా సీక్రెట్‌గా ఉండటం వల్లే వాటి ప్రత్యేకత అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదుం వెళ్లిన ప్రతీ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను గౌరవించడం. అలాగే వెళ్లకూడని ప్రదేశాలను అలా ఏకాంతంగా వదిలేయడం కూడా వాటిని గౌరవించడమే అవుతుంది. -
మాన్సూన్ ట్రిప్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి
వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్ లో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్ ట్రిప్ కాస్తా స్ట్రెస్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈ 5 కామన్ ట్రావెల్ మిస్టేక్స్ ఎవాయిడ్ చేస్తే మీ ట్రిప్ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.బయల్దేరే ముందు వాతావరణం చెక్ చేయడంలొకేషన్ ఫోటోలు చూసి ఎగ్జైట్ అయిపోయి డైరెక్ట్‌గా జర్నీ స్టార్ట్ చేయకండి. ముందు ఒక్కసారి అక్కడి వాతావరణం, దారి మధ్యలో పరిస్థితులు చెక్ చేసుకోండి. భారీ వర్షాలు, ల్యాండ్‌స్లైడ్, రోడ్ బ్లాక్ లాంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఒక 5 నిమిషాలు చెక్ చేస్తే అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.తప్పుడు షూస్ వేసుకుని వెళ్లకండిమాన్సూన్ లో స్టైల్ కంటే కంఫర్ట్ ముఖ్యం. ఫ్లాట్ స్లిప్పర్స్ లేదా స్మూత్ సోల్ ఉన్న షూస్ వేసుకుని స్లిప్పరీ రోడ్‌పై వెళ్లి ఇబ్బంది పడకండి. మంచి గ్రిప్ ఉన్న షూస్ లేదా ట్రెక్కింగ్ శాండిల్స్ వేసుకుంటే నడవడం కాస్త ఈజీగా ఉంటుంది. దీంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.ఫోన్, కెమెరా సేఫ్టీ ఇష్యూట్రావెల్ అంటే ఫోటోలు తప్పనిసరి. కానీ వర్షంలో ఫోన్, కెమెరా, పవర్ బ్యాంక్ తడిసిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా జిప్ కవర్ తీసుకెళ్లండి. బ్యాకప్‌లా రెయిన్ కవర్ ఉంటే మరీ మంచిది. చిన్న ప్రికాషన్ పెద్ద డ్యామేజ్‌ని సేవ్ చేస్తుంది.ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్లకపోవడంమాన్సూన్ లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఫుల్‌గా తడిస్తే జర్నీ మొత్తం చికాకుగా మారిపోతుంది. అందుకే ఒక ఎక్స్ట్రా టీ షర్ట్, సాక్స్, టవల్, రెయిన్ జాకెట్ బ్యాగ్‌లో తప్పకుండా పెట్టుకోండి. ఇవి చిన్నగా కనిపించినా బాగా యూజ్ అవుతాయి.ఎక్కువగా ప్లాన్ చేయకండిఒక రోజులో 5–6 ప్రదేశాలు కవర్ చేయాలని చాలా మంది ఓవర్ ప్లాన్ చేస్తుంటారు. ఇది ఒక కామన్ ట్రావెల్ మిస్టేక్. వర్షాకాంలో ట్రాఫిక్ స్లో అవ్వచ్చు, రోడ్డుపై జామ్ అవ్వొచ్చు. అందుకే కాస్త బఫర్ టైమ్ మెయింటైన్ చేస్తూ రిలాక్స్‌గా జర్నీ ప్లాన్ చేసుకోండి. గుర్తుంచుకోండి.. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదు. -
ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క క్షణం ఓ అద్భుతం!
వర్షం అంటే కేవలం నేలంతా తడవడం మాత్రమే కాదు.. కొన్ని ప్రదేశాలు తమ అందాన్ని చూపించే కాలం కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని పర్వతాలు, పట్టణాలు వర్షాకాలం వస్తే చాలు మరింత అందంగా మారిపోతాయి. ప్రతీ మలుపు ఒక కొత్త చిత్రంలా అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కనే ఉంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాన్సూన్ ట్రిప్ అనేది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ సీజన్ లో ఈ హిల్ టౌన్స్‌లో గాలి, మబ్బులు, పచ్చని అడవులు కలిసి ఒక మధురమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రాంతం చిరునవ్వుతో ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.మబ్బుల్లో మధురమైన కూర్గ్, చిక్మగళూరుకర్ణాటకలో ఉన్న కూర్గ్, చిక్‌మగళూరు వర్షాకాలంలో కాఫీ సుగంధంతో మరింతగా అలరిస్తాయి. ప్రతీ ఉదయం మబ్బులు కాఫీ తోటల మధ్య నిలిచి ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న జలధారలు, అడవి మార్గాలు, కొండల మధ్య పడిన చినుకులు అన్నీ కలిసి ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటాయి.ఇక్కడ నడిచే ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడినట్టు ఉంటుంది. కాఫీ ఎస్టేట్స్ మధ్య వాకింగ్, చిన్న చిన్న జలపాతాల వద్ద సమయం గడపడం, స్థానిక గ్రామాల్లో ప్రజల జీవితాన్ని దగ్గరి నుంచి చూడటం అనేది ఈ ప్రయాణంలో సహజంగా కలిగే అనుభవాలుగా మిగిలిపోతాయి.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి బెంగుళూరు, కోచి, కోయంబత్తూరు, మదురై, విశాఖపట్టణం లాంటి నగరాలకు ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు ఈజీగా దొరుకుతాయి. అక్కడి నుంచి కొండ రహాదారుల్లో ప్రయాణం మొదలవుతుంది.ప్లెయిన్స్ నుంచి మెల్లగా కొండల మధ్యకి చేరేటప్పుడు గాలి మారడం, టెంపరేచర్ తగ్గడం, మబ్బులు దగ్గరవడం అనేది ప్రయాణంలో ఒక అందమైన మార్పుగా కనిపిస్తుంది.విజయవాడ నుంచి విశాఖపట్టణం, బెంగళూరు, కోయంబత్తూరు, కోచికి చేరుకుని అక్కడి నుంచి ఈ హిల్ టౌన్స్కి చేరుకోవచ్చు. జర్నీలో ప్రతీ క్షణం ప్రకృతి తన కొత్త రూపాన్ని చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?ఈ మౌంటెయిన్ టౌన్స్‌లో బోటీక్ హోమ్ స్టేలు, ప్లాంటేషన్ కాటేజీలు, హెరిటేజ్ బంగ్లాలు, నేచర్ రిసార్ట్స్, సింపుల్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కిటికీ తెరవగానే టీ గార్డెన్స్ కనిపించే రూమ్ అయినా, కాఫీ ఎస్టేట్స్ మధ్య వెలిసిన కాటేజీలు అయినా, ఫారెస్ట్ ఎడ్జ్‌లో ఉన్న స్టేలు అయినా అకామిడేషన్ కూడా ప్రయాణంలో ఒక భాగంగా అనిపిస్తుంది.ఏం తినాలి?కూర్గ్‌లో పాండీ కర్రీ ఇష్టపడేవారికి ఫేమస్. కానీ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. చిక్‌మగళూరు ఫ్రెష్ కాఫీని ఒక్కసారి రుచి చూస్తే ఇక ఎప్పుడూ మర్చిపోలేరు. ఊటీ హోమ్మేడ్ చాకొలేట్స్, మున్నార్ టీ, వాయనాడ్ స్పైసెస్, అరకు ఆర్గానిక్ కాఫీ, కొడైకనాల్ హోమ్మేడ్ చాకొలేట్స్, లోకల్ బేకరీ ఐటమ్స్ ఇలా ప్రతీ ఐటమ్ ఆ ప్రదేశానికి బ్రాండ్ ఎంబాసెడర్లా పని చేస్తుంది.నీలగిరి అందాలు..తమిళనాడులో నీలగిరి పర్వతాల మధ్య ఉండే ఊటీ, కూనూరు ఎప్పుడూ అందంగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఈ అందాలు రెట్టింపు అవుతాయి. టీ గార్డెన్స్‌పై పడిన మబ్బులు, టాయ్ ట్రెయిన్ శబ్దం, యూకలిప్టస్ వాసన కలిసి ఒక నాస్టాల్జిక్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ప్రతీ రోడ్డు మలుపు దగ్గర కొత్త లోయ కనిపిస్తుంది. చిన్న రైల్వే స్టేషన్స్, కాలనియల్ బిల్డింగ్స్, టీ ప్లాంటేషన్స్ మధ్య గడిపే సమయం ప్రయాణాన్ని స్లోగా ఆస్వాదించే అవకాశం ఇస్తుంది.ఆంధ్రప్రదేశ్ పర్వత శోభఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకులోయ వర్షాకాలంలో ఒక హరిత వస్త్రాన్ని ధరించినట్టు గ్రీనరీతో నిండి ఉంటుంది. విశాఖపట్టణం నుంచి మొదలయ్యే ట్రైన్ జర్నీలో టన్నెల్స్, బ్రిడ్జిలు, లోయలు కలిసి ఒక మరపురాని అనుభూతిని అందిస్తాయి. కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ అరకుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్కొడైకనాల్ని చాలా మంది ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. మాన్సూన్ లో ఆ పేరుకి తగ్గట్టే ఉంటుంది ఇక్కడి బ్యూటి. పైన్ ఫారెస్ట్ మధ్య చినుకులు పడుతుంటే, లేక్ పక్కనే గాలి మెల్లిగా వీస్తుంటే, సమయం కొంచెం మెల్లిగా సాగినట్టు, కొన్ని సార్లు క్షణం పాటు ఆగినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ మిస్ట్‌లో వాకింగ్, స్మాల్ కేఫేలో హాట్ కాఫీ తాగడం, సాయంత్రం లేక్ రిఫ్లెక్షన్స్ చూడటంం ఈ అనుభవాలు ప్రయాణాన్ని మరింతగా గుర్తుండేలా చేస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుఈ తొమ్మిది హిల్ టౌన్స్‌లో ప్రతీ ప్రదేశం ఒక డిఫరెంట్ అనుభవాన్ని అందిస్తుంది. కూర్గ్ కాఫీ ఎస్టేట్స్, చిక్‌మగళూరు ముల్లాయనగిరి పరిసర ప్రాంతాలు, ఊటీ బొటానికల్ గార్డెన్, కూనూరు టీ తోటలు, మున్నార్ టీ ప్లాంటేషన్స్, వాయనాడ్ అడవులు, అరకు కాఫీ గార్డెన్స్, మేఘమలై రోలింగ్ హిల్స్, యెర్కాడ్ లేక్, కొడైకనాల్ పైన్ ఫారెస్ట్ అన్నీ కలిసి సౌత్ ఇండియా బ్యూటీని ప్రపంచానికి మరింత అందంగా చూపిస్తాయి. ప్రతీ ప్రదేశంలో ప్రకృతి ఒక కొత్త రంగును చూపిస్తుంది.ఏం చూడాలి?మార్నింగ్ మిస్ట్‌లో లోయలను, వర్షం తరువాత మెరుసే జలపాతాలు, టీ, కాఫీ ప్లాంటేషన్స్, చిన్న రైల్వే స్టేషన్స్, ట్రైబల్ కల్చర్, లేక్స్, అడవిలో సాగే ప్రయాణం, సూరస్తమయంలో రంగు రంగులతో సందడి చేసే వ్యూ పాయింట్స్ ఈ అనుభవాలు ఒక్కో హిల్ స్టేషన్ లో ఒక్కోలా ఉంటాయి.లోకల్ మార్కెట్లలో నడవడం, ప్లాంటేషన్ విజిట్స్, సీనిక్ ట్రైన్ జర్నీస్, బోటింగ్, ఫోటోగ్రఫీ, విలేజ్ వాక్స్ లాంటివి ఈ ప్రయాణంలో సహజంగా కనిపిస్తాయి.కేరళ పచ్చదనంకేరళ అందాలు చూడాలి అనుకుంటే మున్నార్ లేదా వయనాడ్ వెళ్తే చాలు. ఇందులో ఏ ప్రాంతానికి వెళ్లినా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. మున్నార్ టీ గార్డెన్స్ వర్షంలో పచ్చని వెల్వెట్ బ్లాంకెట్లా కనిపిస్తాయి. వాయనాడ్ అడవుల్లో మబ్బులు దిగివచ్చి చెట్ల మధ్య ఆటలాడుతున్నట్టు ఉంటాయి.స్థానికుల జీవితం ఇక్కడ ప్రకృతి రిథమ్‌కి తగ్గట్టు ఉంటుంది. ప్లాంటేషన్ గ్రామాలు, చిన్న మార్కెట్లు, స్పైస్ ప్లాంటేషన్స్, వర్షంలో తడిసిన రహదారులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.మేఘాల మధ్య మేఘమలై, యెర్కాడ్తమిళనాడులో మేఘమలై పేరు వినగానే మబ్బులు గుర్తొస్తాయి. పేరుకి తగ్గట్టే మబ్బులు ఇక్కడ కొండలకు దగ్గరగా చేరుకుంటాయి. యెర్కాడ్‌లో లేక్ పక్కనే వర్షం చినుకుల శబ్దం వినడం, నారింజ తోటల మధ్య నడవడం, ప్రశాంతతను ఆస్వాదించడం ఒక మెమొరబుల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. టూరిస్టుల రష్ కన్నా నేచర్ సౌండ్స్ ఎక్కువగా వినిపించే ఈ ప్రదేశాలు స్లో ట్రావెల్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతాయి.ఆసక్తికరమైన విషయాలు - వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ హిల్ టౌన్స్ అత్యంత అందంగా ఉంటాయి.- ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయి.- వర్షాకాలంలో ఈ ప్రదేశాలకు వెళ్తే చల్లని గాలితో పాటు, మబ్బులతో నిండిన ఆకాశం, పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు.- ఇందులో మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నా 5 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు టీ లేదా కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో స్లో ట్రావెల్‌ను ఆస్వాదించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల మాన్సూన్ హిల్ స్టేషన్ ట్రిప్ బడ్జెట్ రేంజ్ అనేది మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి మారుతుంది. బడ్జెట్ ట్రావెల్‌ను సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ కాస్ట్ సుమారు రూ.28,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.45,000 నుంచి రూ.70,000 వరకు బడ్జెట్ అవవచ్చు.స్టే విషయానికి వస్తే ప్రతీ రాత్రికి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.1,500 మధ్య ఖర్చు అవుతుంది.హైదరాబాద్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది డెస్టినేషన్ ను బట్టి రూ.4,000 నుంచి రూ.15,000 మధ్య మారుతుంది. విజయవాడ నుంచి ట్రావెల్ కాస్ట్ కొంచెం తక్కువ లేదా దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్ స్టే ΄్యాకేజీలు, హెరిటేజ్ స్టేస్, సీనిక్ ట్రైన్ ఎక్స్‌పీరియెన్స్ అన్నీ కలిపి ప్రయాణాన్ని మరింత స్పెషల్‌గా మార్చేస్తాయి.గమనిక: ఈ ట్రావెల్ గైడ్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారం, స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకుని, వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
పీక్ సీజన్లో హోటళ్లు చవకగా బుక్ చేసుకోవాలంటే...
సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్లు... ఇలా పీక్ సీజన్ లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్ సీజన్ లో మరో ధర ఉంటుంది. అయితే కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే 20 నుంచి 40 శాతం వరకు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ 12 సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి.1. సరైన సమయంలో బుకింగ్ చేయండి..వారం మధ్యలో, ముఖ్యంగా డిమాండ్ తక్కువగా ఉండే సమయంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ధరలు పరిశీలించి బుక్ చేయండి.2. వ్యక్తిగత బ్రౌజింగ్ లేకుండా వెతకండి..ఒకే హోటల్‌ను పదేపదే వెతికితే ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారం లేకుండా లేదా మరో పరికరం ద్వారా కూడా ఒకసారి ధరలు పరిశీలించండి.3. ప్రధాన ప్రాంతం కాకుండా..పర్యాటక ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న హోటళ్లు ఖరీదుగా ఉండే అవకాశం ఎక్కువ. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరకొచ్చు.4. వారాంతపు రోజులను వీలైతే ఎవాయిడ్ చేయండి..శని, ఆదివారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సోమవారం నుంచి గురువారం మధ్య బుకింగ్ చేసుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించండి.5. హోటల్‌తో నేరుగా మాట్లాడండి..ఆన్ లైన్ లో కనిపించిన ధరను ప్రస్తావిస్తూ హోటల్‌కు నేరుగా ఫోన్ చేస్తే కొన్నిసార్లు అదే ధరకు లేదా ఇంకా తక్కువకు గది ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ చెకిన్ లేదా లేట్ చెకిన్ చేసే సౌకర్యం కూడా లభించవచ్చు.6. ఫుడ్ ఉన్న ప్యాకేజీలను ఎంచుకోండి..గదితో పాటు అల్పాహారం లేదా రాత్రి భోజనం కలిపి ఇచ్చే ప్యాకేజీలు ఎంచుకుంటే విడిగా ఖర్చు చేయడంకంటే చవకగా ఉండొచ్చు.7. ఫిల్టర్ కరెక్టుగా చేయండి..మంచి రేటింగ్, సరైన ప్రదేశం, తక్కువ ధర వంటి ప్రమాణాలతో హోటళ్లను ఫిల్టర్ చేసుకుంటే చూసుకుంటే మంచి వసతి సులభంగా దొరుకుతుంది.8. ముందుగానే బుక్ చేసుకోండి..ప్రయాణ తేదీ ముందే ఖరారైతే కనీసం రెండు నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది. ఫ్రీ కేన్సిలేషన్ సౌకర్యం ఉన్న రూమ్‌ని ఎంచుకుంటే తరువాత ధర తగ్గినప్పుడు మళ్లీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.9. హోటల్‌కు వెళ్లిన తర్వాతే చెల్లించండి..ఇలా చెకిన్ చేసిన తరువాత పే చేసే అవకాశం ఉంటే ధరలు, రూల్స్ చెక్ చేయండి. అయితే ముందుగా పక్కాగా చెల్లించాలా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.10. ఆఫర్లను యూజ్ చేసుకోండి..వివిధ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంకులు, యూపీఐ సేవలు అందించే ఆఫర్లు, కూపన్లు, రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకుంటే మరింత ఆదా చేయవచ్చు.11. రద్దీ సమయంలో వద్దు..సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువ మంది బుకింగ్ చేయడం వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. వీలైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందుగానే బుకింగ్ ప్రయత్నించండి.12. నియర్ బై టౌన్స్ చెక్ చేయండిప్రధాన ప్రాంతంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయినప్పుడు సమీప పట్టణాలు లేదా శివారు ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరికే అవకాశం ఉంటుంది.చివరగా...ఒకే వెబ్‌సైట్‌పై ఆధారపడకుండా కనీసం రెండు లేదా మూడు బుకింగ్ వేదికల్లో ధరలను పోల్చండి. హోటల్ రివ్యూలు, కేన్సిలేషన్, అదనపు ఛార్జీలను పరిశీలించిన తర్వాతే బుకింగ్ చేయండి. -
'తెలంగాణ కాశ్మీర్' చూడదగ్గ అందమైన స్థలం..
చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. ఎటు చూసినా పచ్చని చెట్లతో దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు కనువిందు చేసే ఈ జిల్లాను తెలంగాణ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లా ప్రకృతి అందాలు ఊటీ, కొడైకెనాల్‌లను గుర్తుచేస్తాయని పర్యాటకులు అంటుంటారు.ముఖ్యంగా తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారు. మరి ఇంత అందమైన కుంటాల జలపాతం హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉందో, ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలేంటో తెలుసుకుందాం.జలపాతం ప్రత్యేకతకుంటాల జలపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) నేరడిగొండ మండలం కుంటాల(బి) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని దగ్గరగా చూడాలంటే సుమారు 430 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. సహ్యాద్రి పర్వతాల నడుమ వంపులు తిరిగే మహబూబ్ ఘాట్ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. హైదరాబాద్ సిటీ నుంచి ఈ కుంటాల వాటర్‌ఫాల్ సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.విజయవాడ నుంచి ఎలా వెళ్లాలి?విజయవాడ నుంచి కుంటాల జలపాతానికి సుమారు 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో 8–9 గంటల్లో చేరుకోవచ్చు.విజయవాడ–హైదరాబాద్–కామారెడ్డి–నిర్మల్–నేరడిగొండ మీదుగా కుంటాలకు వెళ్లొచ్చు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా నిర్మల్ వరకు రైలు, బస్సులో చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ లేదా ఆర్టీసీ బస్సులో జలపాతానికి వెళ్లవచ్చు.ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర టూరిజం స్పాట్స్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కుంటాల జలపాతం మాత్రమే కాదు, ఎన్నో సుందరమైన దృశ్యాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయం ఇక్కడే ఉంది.గోదావరి, ప్రాణహిత నదులు ఇక్కడ పరవళ్లు తొక్కుతుంటే, కడెం ప్రాజెక్టు ప్రకతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ అభయారణ్యం పచ్చని చెట్లతో ప్రకతికి పచ్చని చీరకట్టినట్లు కనిపిస్తుంది. ఈ అభయారణ్యం ఎన్నో రకాల పక్షులు, వన్య్రపాణులకు ఆలవాలంగా మారింది. జైపూర్ మండలం శివారం మొసళ్ల సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది.ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లు, నల్లటి రహదారులు ప్రకతి రమణీయతను పెంచుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడి అందాలు పీక్కు చేరుకుంటాయి. ఆ సీజన్ లో పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని, అందాలను ఆస్వాదించి వెళతారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే, ఈ తెలంగాణ కాశ్మీర్ అందాలను ఒక్కసారి తప్పక దర్శించండి. -
చరిత్రతో చేతులు కలిపిన ప్రకృతి..
కంబోడియాలోని సీయెమ్ రీప్ వద్ద ఉన్న అంగ్కోర్ వాట్ని మొదటిసారి చూస్తే గ్రాఫిక్స్ చేసిన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రతి గోపురం, ప్రతి మెట్టు, ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది.సరస్సులో ఆలయ ప్రతిబింబం ఆంగ్కోర్ వాట్ ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యోదయం సమయంలో ఆకాశం రంగులు మారిపోతాయి. ఆ ప్రతిబింబం ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో పడటం చూస్తే కాలం కాసేపు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది. క్రీ.శ.12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహా కట్టడం నేటికీ వివిధ దేశాల నుండి వచ్చే సందర్శకులను తన వైపు ఆకర్షిస్తూ ఉంది. అయితే అంగ్కోర్ వాట్ నిజమైన అందం దాని పరిమాణంలో కాదు. దాని మధ్య నడిచే సమయంలో ఫీలయ్యే సైలెన్స్, అడవి చెట్ల వాసనలో, రాళ్ల మీద పడే వెలుగులో ఉంటుంది.ఎంత గొప్ప కట్టడాలైన కాల గమనంలో కనుమరుగవుతుంటాయి. కానీ, కాలాన్ని కూడా అధిగమించి అలనాటి కథలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది ఆంగ్కోర్ వాట్ ఆలయం. ఇక్కడ చిన్న ఆకు సవ్వడి చేసినా వినిపించేంతటి నిశ్శబ్దం.. ఉదయం వెలుగులో మెరిసే గోపురాలు... రాళ్ల మీద సప్తవర్ణాలు లిఖించే సూర్యకిరణాలు.. ఎటు చూసినా పచ్చందనంతో అడవి మధ్యలో కాలం నిలిచి పోయిందా అనడానికి సజీవ సాక్ష్యంలా ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా విరాజిల్లుతోంది అంగ్‌కోర్‌వాట్.సందర్శనీయ ప్రదేశాలు..అంగ్కోర్ వాట్ ఆర్కియాలజీ ΄ార్క్ మొత్తం ఒక ఓపెన్ మ్యూజియంలా ఉంటుంది. స్థానికంగా బయోన్ టెంపుల్లో నవ్వుతున్న ముఖాలను చూస్తే ఆ శిల్పకారుల కలలో మనం కూడా చేరిపోతాం.తాప్రోమ్ దగ్గర రాళ్ల మధ్యలో పెరిగిన చెట్లను చూస్తే ప్రకృతి, చరిత్ర మధ్య ఉన్న స్నేహం అర్థం అవుతుంది.బాంటీ స్రే అనే చిన్న ఆలయంలో ఉన్న చిన్న పింక్ శాండ్‌స్టోన్ శిల్పకళ మనసును హత్తుకునేలా ఉంటుంది. నాటి కళాకారుల ఓపిక, వారి ప్రతిభను గుర్తు చేస్తుంది.ప్రే ఖాన్, అంగ్కోర్ థామ్ మధ్య నడుస్తూ వెళ్తే ప్రతి మూలలో ఒక కొత్త దృశ్యం ఎదురవుతుంది. ఎక్కడ చూసినా శిల్పం, చెరువు, గోపురం.. అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.ఏం చూడాలి?అంగ్కోర్ వాట్ వద్ద సూర్యోదయాన్ని చూడటం ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. బయోన్ ఆలయంలో ఉన్న చిరునవ్వులు, తాప్రోమ్ను ఆక్రమించిన వృక్షాలు, అంగ్కోర్ థామ్ ద్వారాలు, ఎలిఫెంట్ టెర్రస్, బాంటీ స్రే శిల్పకళ ఇవన్నీ ప్రతీసారి కొత్తగా అనిపిస్తాయి.సాయంత్రం ఫ్నోమ్ బాఖెంగ్ దగ్గర సూర్యాస్తమయంలో ఆకాశంలో రంగులు మెల్లగా మారడాన్ని చూసి ఆస్వాదించవచ్చు. చెరువుల్లో పడిన ఆ వెలుగు ప్రతిబింబం ప్రయాణాన్ని ఒక అందమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది.రాళ్ల మధ్య సాగే ప్రయాణం..అంగ్కోర్ వాట్లో గడిపే ప్రతి నిమిషం ఒక సినిమా సీన్ లా ఉంటుంది. ఉదయం వెలుగులో గోపురాలను ముద్దాడుతుంటే కెమెరా పక్కన పెట్టాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కేవలం అక్కడే నిలబడి ఆ మౌనాన్ని వింటేనే చాలు అనిపిస్తుంది.సాయంత్రం చెరువుల పక్కన వీచే గాలిని ఫీలవ్వడం అనేది మాటలకు అందని అనుభవంగా మిగిలిపోతుంది. దూరంగా వినిపించే పక్షుల స్వరాలు, అడవి ఆకుల కదలికలుం ఈ ప్రదేశాన్ని ఇంకా లైవ్లీగా మార్చేస్తాయి. ఇక్కడ ప్రతి అడుగు చరిత్రతో కలిసి నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది.ఇక్కడ సైకిల్ రైడ్ చేయడం, సన్ రైజ్‌ను నిశ్శబ్దంగా ఆస్వాదించడం, తాప్రోమ్ అడవిలో నడవడం, బయోన్ శిల్పాలను దగ్గరగా గమనించడం, సాయంత్రం సాస్కృతిక నృత్య ప్రదర్శనలను చూడటం ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.అడవి ఒడిలో.. మహా కట్టడం12వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తి 2వ సూర్యవర్మన్ నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం మొదటిగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. తరువాత బుద్ధ సంప్రదాయంలో ప్రముఖ ఆరాధన కేంద్రంగా మారింది.సమయం మారినా, కాలం గడిచినా, శతాబ్దాల ΄ాటు అడవి ఈ మహా కట్టడాన్ని తన ఒడిలో దాచుకున్నా.. దాని వైభవం మాత్రం నేటికీ తగ్గలేదు.ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న అంగ్కోర్ వాట్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు.. మానవ సృజనాత్మకత శక్తికి, కళ, ఆధ్యాత్మిక భావన, చరిత్ర కలిసిన ఒక సజీవ మహాకావ్యం.ఆసక్తికరమైన విషయాలుఅంగ్కోర్ వాట్ అనేది 1992 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది.అంగ్కోర్ వాట్ ఆలయం కంబోడియాలోని సియేమ్ రీప్ ప్రావిన్స్ దగ్గర అంగ్కోర్ ఆర్కియాలజికల్ ΄ార్క్లో ఉంది.ఖ్మేర్ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళ, నిర్మాణానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి సియేమ్ రీప్ వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ బ్యాంకాక్, కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్తో చేరుకోవచ్చు.ప్రయాణం మధ్యలో ఆకాశం నుంచి కనిపించే పచ్చని పొలాలు, మెకాంగ్ప్రాంతం దృశ్యాలు జర్నీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా అంతర్జాతీయ విమానాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుండి సియేమ్ రీప్ నగరం వరకు ప్రయాణం తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.నగరం నుంచి అంగ్కోర్ ఆర్కియాలజీ ΄ార్క్ చేరేటప్పుడు రోడ్ పక్కనే కనిపించే చెట్లు, చెరువులు, గ్రామ జీవితం ప్రయాణాన్ని ఇంకా అందంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?సియేమ్ రీప్‌లో బోటిక్ హోటల్స్, హెరిటేజ్ రిసార్ట్స్, గార్డెన్ స్టేస్ చాలా అందంగా ఉంటాయి. పూల్ పక్కనే నెలకొన్న నిశ్శబ్దం, పచ్చని చెట్లు, ట్రెడిషనల్ ఖ్మేర్ ఆర్కిటెక్చర్ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.ఉదయం కాఫీతో నుంచి సాయంత్రం దీ΄ాల వెలుగులో గార్డెన్స్‌లో కూర్చుని సమయం గడిపే వరకు ఈ గ్రామంలో మీకు ఎక్కడా బోర్ కొట్టదు.లగ్జరీ రిసార్ట్స్ నుండి సింపుల్ గెస్ట్ హౌస్ వరకు ప్రతి స్టేలో కంబోడియా ప్రజల మంచి మనసు, వారి సింప్లిసిటీ స్పష్టంగా కనిపిస్తుంది.ఏం తినాలి?కంబోడియా భోజనంలో ఫ్రెష్‌నెస్ ప్రతి బైట్‌లో మీరు ఫీల్ అవ్వవచ్చు. ఫిష్ అమోక్ అనే స్థానిక ట్రెడిషనల్ కర్రీ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా మధురంగా ఉంటుంది. ఖ్మేర్ కర్రీ, ఫ్రై డ్ రైస్, ట్రాపికల్ ఫ్రూట్స్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, స్టికీ రైస్ డెజర్ట్స్ ప్రతి భోజనాన్ని మరింత రుచికరంగా మార్చుతాయి.స్ట్రీట్ కేఫ్స్‌లో దొరికే లోకల్ కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫుడ్ మార్కెట్లో ఉన్న వాతావరణం ఇవన్నీ కంప్లీట్ ఫుడ్ ఫ్లేవర్‌ను అందిస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుండి 5 రోజుల అంగ్కోర్ వాట్ ప్రయాణం బడ్జెట్ కేటగిరీలో ΄్లాన్ చేసుకుంటే ప్రతి వ్యక్తికి సుమారు రూ.55,000 నుండి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ ట్రిప్ కోసం రూ.80 వేల నుంచి రూ.1 లక్షా 10 వేల మధ్య ఖర్చు అవుతుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.1 లక్షా 40 వేల నుండి రూ.2 లక్షల వరకు ΄్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను బట్టి కొంచెం అదనపు ఖర్చు అవుతుంది.స్టే చార్జెస్ బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. స్టాండర్డ్ హోటల్స్ రూ.6,000 నుండి రూ.10,000 వరకు, ప్రీమియం రిసార్టులు రూ.15,000 పైన ఉంటాయి. భోజనానికి ప్రతీ రోజు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య ఖర్చు చేస్తే సరిపోతుంది.లోకల్ గైడెడ్ హెరిటేజ్ వాక్స్, టుక్ టుక్ రైడ్స్, సన్ రైజ్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్, కల్చరల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయే అనుభవంగా మార్చేస్తాయి.వీసా ఎలా?:భారతీయ ప్రయాణికులకు కంబోడియా వీసా అనేది ఆన్ అరైవల్తో ΄ాటు ఈ–వీసా రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని స్వయంగా వెరిఫై చేసుకుని ΄్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
Travel: 15,000 అడుగుల ఎత్తులో 'హోటల్ కాదు.. అడ్వెంచర్!'
రోడ్లు లేవు, వాహనాలు లేవు, ట్రెక్ చేస్తేనే చేరగలిగే హోటల్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటే... ఆ హోటల్‌కి వెళ్లాలంటే 5 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సిందే!లగ్జరీ హోటల్స్ గురించి వినుంటారు. కానీ స్విట్జర్లాండ్–ఇటలీ సరిహద్దులో ఆల్ఫ్స్ పర్వతాల మధ్య సుమారు 15,000 అడుగుల (4,554 మీటర్లు) ఎత్తులో ఉన్న మార్గెరిటా హట్ మాత్రం పూర్తిగా భిన్నం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మౌంటైన్ హోటల్స్‌లలో ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేదు, ఏ వాహనం కూడా వెళ్లలేదు. ట్రెక్కింగ్ చేస్తేనే ఇక్కడికి చేరుకోగలం. అది కూడా అందరూ కాదు.5 గంటల ట్రెక్.. జీవితంలో మర్చిపోలేని అనుభూతిమార్గెరిటా హట్ చేరడానికి ముందుగా గ్లేషియర్‌పై నడవాలి. సాధారణంగా పర్వతారోహకులు పుంటా గ్నిఫెట్టి అనేప్రాంతం నుండి గైడ్‌తో కలిసి సుమారు 5 గంటల ట్రెక్ చేస్తారు. మంచుతో నిండిన ఐస్ ఫీల్డులు, స్నో రిడ్జులు, హై ఆల్టిట్యూడ్ టెర్రెయిన్ లో సాగే ఈ జర్నీ అడ్వెంచర్ లవర్స్‌కి మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. దారి మధ్యలో ఆల్ఫ్స్ శిఖరాలు, ఎండ్లెస్ స్నో వ్యూస్ ప్రతి అడుగులో థ్రిల్‌ను పెంచుతాయి.హోటల్ కాదు.. అడ్వెంచర్ బేస్ క్యాంప్ ఇదిఇది రెగ్యులర్ లగ్జరీ హోటల్ కాదు. మౌంటైన్ క్లైంబర్స్, ట్రెక్కర్స్, పరిశోధకుల కోసం నిర్మించిన హై ఆల్టిట్యూడ్ రెఫ్యూజ్ ఇది. సాధారణమైన రూమ్‌లు, షేర్డ్ ఫెసిలిటీస్, వేడి వేడి భోజనం ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆల్పస్ మౌంటైన్ రేంజెస్ మీద పడే బంగారు వెలుగు చూడవచ్చు. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల అక్లైమటైజేషన్ చాలా ముఖ్యం.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా మిలాన్ లేదా జూరిచ్‌కు అంతర్జాతీయ విమానం ఎక్కాలి. అక్కడి నుండి రైలు లేదా కార్ ద్వారా అలాగ్నా వాల్సేసియా లేదా స్టాఫల్ చేరుకోవాలి. తరువాత కేబుల్ కార్ ద్వారా పుంటా ఇండ్రెన్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి సర్టిఫైడ్ మౌంటైన్ గైడ్‌తో ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ అనుభవం లేనివారు గైడ్ లేకుండా ప్రయాణించకూడదు.ట్రావెల్ టిప్స్జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సీజన్ ట్రెక్కింగ్‌కు అనుకూలం. థర్మల్ వేర్, వాటర్‌ప్రూఫ్ జాకెట్, ట్రెక్కింగ్ బూట్స్, గ్లవ్స్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ తప్పనిసరి. వాతావరణం నిమిషాల్లో మారిపోతుంది. కాబట్టి సరైన ప్లానింగ్ అవసరం. మార్గెరిటా హట్ అనేది ఒక హోటల్ మాత్రమే కాదు. ప్రకృతి, సాహసం, మానవ సంకల్పం కలిసిన ఒక జీవితానుభవం. రోడ్డు లేకుండా, వాహనం లేకుండా మంచి డిటర్మినేషన్ తో చేరగలిగే ఈ మౌంటైన్ హట్ సాహసయాత్రికుల బకెట్ లిస్టులో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్. -
ఈలలతో మాట్లాడే ద్వీపం గురించి విన్నారా ఎప్పుడైనా?
స్పెయిన్ లోని కేనరీ దీవుల్లో ఉన్న చిన్న ద్వీపం లా గోమెరాలో ఒక వింత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో మాటలతో కాకుండా ఈలల ద్వారానే మాట్లాడుకుంటారు.ఈ ప్రత్యేక భాషను సిల్బో గొమెరో అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఉన్న లోయలు, ఘాట్ రోడ్ల వల్ల దూరంగా ఉన్న వారికి సందేశం పంపడానికి ఈ పద్ధతి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈల శబ్దంతోనే సందేశాన్ని చేరవేస్తారట ఇక్కడ.ఒకానొక సమయంలో రోడ్లు, ఫోన్లు ఎక్కువ అవడంతో ఈ సంప్రదాయం అంతరిస్తుందేమో అని చాలా మంది భయపడ్డారట. కానీ లా గోమెరా అధికారులు తమ ఈల భాషను రక్షింకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ద్వీపంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో సిల్బో గొమెరో అనే ఈల భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారు. 2009లో యునెస్కో కూడా ఈ భాషను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ఈల శబ్దాలు విన్నప్పుడు వాటిని వినే వారి మెదడులో సాధారణ భాషను అర్థం చేసుకునే లాంగ్వేజ్ సెంటర్లు అలాగే పని చేస్తాయట. అంటే మన మెదడు శబ్దం ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్న అర్థాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో కూడా ఈ ఈల భాష ఇంకా వాడుకలో ఉండడం అనేది నిజంగా అద్భుతం. సిల్బో గొమెరో అనేది మానవ సజనాత్మకత, సంస్కతి, ప్రకతికి అనుగుణంగా మనిషి ఎలా మారగలడో చూపించే అరుదైన ఉదాహరణగా నిలిచింది. -
Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.సందర్శనీయ ప్రదేశాలుఅమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.శేష్నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.కశ్మీర్ క్యూజిన్ లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.ఏం చూడాలి?ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్ లా అనిపిస్తాయి.డాల్ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ కశ్మీర్లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలుఅమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.ఎక్కడ ఉండాలి?శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుందిప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
చార్టర్డ్ ప్లైట్లలో పనస పండ్ల ప్రయాణం!
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చెట్టుకు కాసి, వృథాగా రాలిపోయే పనస పండుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు అత్యధిక డిమాండ్ పలుకుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల అధికారిక ఫలమైన పనసపండు (జాక్‌ఫ్రూట్) ప్రస్తుతం సరిహద్దులు దాటి చార్టర్డ్ విమానాల్లో విదేశాలకు ఎగుమతి అవుతోంది. స్థానికంగా కేవలం రూ.10 పలుకుతున్న కిలో పనస ధర, విదేశీ మార్కెట్లలో ఏకంగా రూ.500 నుండి రూ.600 వరకు పలుకుతుండటం విశేషం. ముఖ్యంగా కేరళకు చెందిన ‘వరిక్క’ రకం పనస పండ్లకు గల్ఫ్, యూరప్ దేశాలలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.చార్టర్డ్ విమానాల్లో.. పండగ సీజన్లలో గల్ఫ్, యూరప్ దేశాల నుండి వచ్చే డిమాండ్‌ను అందుకోవడానికి పనసపండ్ల విక్రయదారులు ఏకంగా చార్టర్డ్ విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పండగ రోజుల్లో కేరళ నుండి ప్రతిరోజూ 500 కిలోల నుండి ఒక టన్ను వరకు పనస పండ్లను విదేశాలకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 దేశాలకు ఈ పండ్లు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాల నుండి కూడా పనస పండ్లు గల్ఫ్, యూరప్ మార్కెట్లకు వస్తున్నప్పటికీ, కేరళ పనసకు ఉన్న ప్రత్యేక క్రేజ్ వల్ల దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.పెరిగిన కార్గో ధరలు - ఎగుమతులపై ప్రభావంప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా కార్గో రవాణా ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీనివల్ల గత కొన్ని నెలలుగా పనస ఎగుమతులు కొంత మేర తగ్గాయని పనస ఎగుమతిదారుడు ఆర్ అశోక్ తెలిపారు. విదేశీ ఎగుమతులతో పాటు, ఉత్తర భారత రాష్ట్రాలలో వేగన్ (పాలు, వెన్న, తేనె వంటి జంతుసంబంధిత ఉత్పత్తులను కూడా తీసుకోని వారు) ఆహారానికి ఆదరణ పెరగడంతో, వారికి అవసరమైన పచ్చి పనసకాయలను రైళ్ల ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.సీజన్ ఆధారిత ఎగుమతులుపనస పండ్ల ఎగుమతి పూర్తిగా సీజన్లపై ఆధారపడి ఉంటుంది. కేరళలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పనస పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఆ తర్వాత మే నుండి జూలై వరకు కేరళలో వర్షాకాలం (మాన్సూన్) ప్రారంభం కావడంతో, ఎగుమతిదారులు సరఫరా కోసం తమిళనాడుపై ఆధారపడతారు. వాతావరణ మార్పుల వల్ల కేరళలో పనస ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినప్పటికీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో హైబ్రిడ్ పనస చెట్లను విస్తృతంగా సాగు చేస్తుండటంతో ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు.కొల్లి హిల్స్ పనస ప్రత్యేకతతమిళనాడులోని నామక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న ‘కొల్లి హిల్స్’ ప్రాంతం పనస సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు పనస కోతల సీజన్ సాగుతుంది. కొల్లి హిల్స్ పనస పండ్లు వాటి పెద్ద తొనలు, అమితమైన తీపి, ప్రత్యేకమైన సువాసనకు మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందాయి.నాణ్యమైన సేకరణ విధానంకొల్లి హిల్స్‌లో పనస పండ్లను సేకరించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎత్తైన, పెద్ద పెద్ద చెట్ల నుండి పండ్లు కింద పడి పాడవకుండా, నేలను తాకకుండా చాలా జాగ్రత్తగా తాడు సాయంతో కిందికి దించుతారు. ఇలా సేకరించిన నాణ్యమైన పండ్లను కొనుగోలుదారులు నేరుగా రైతులకు చెందిన తోటల వద్ద నుండి కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ కొనుగోలు చేస్తుంటారు. -
ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తూర్పు ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడంతో పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP— Press Trust of India (@PTI_News) July 5, 2026భారీ వర్షాల కారణంగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేసి, రహదారిని మూసివేశారు. టన్నెల్ పైభాగం నుండి వర్షపు నీరు జలపాతంలా కిందకు పడటం, రహదారిపై రోడ్డు నిర్మాణ శిథిలాల చరియలు విరిగిపడిన దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసామవుతున్నాయి. రహదారి రవాణాతో పాటు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబై-పూణె మధ్య నడిచే దూరప్రాంత రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత నెల చివర నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నగరంలో చెట్లు విరిగిపడి ఇప్పటివరకు మరో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముంబై నగరంలో సగటున 100 మిల్లీమీటర్ల (3.9 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 161 మిల్లీమీటర్ల (6.3 అంగుళాలు) వరకు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం చాలా చోట్ల చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇది కూడా చదవండి: రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం! -
ప్రతి వీధికీ ఓ కథ.. ప్రతి క్షణం ఒక ఎవర్గ్రీన్!
మన జీవితకాలంలో ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తాం. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనసులో అలాగే నిలిచిపోతాయి. వియత్నాం కూడా అలాంటి ఒక దేశమే. ప్రతి ఉదయం ఒక కొత్త రంగును, ప్రతి సాయంత్రం ఒక కొత్త జ్ఞాపకాన్ని అందిస్తుంది ఈ దేశం. వియత్నాం అంటే కేవలం ఒక ఫారిన్ డెస్టినేషన్ మాత్రమే కాదు. పచ్చని పొలాలు, నదుల మధ్య సాగే జీవితంప్రాచీన సంస్కృతి, నవ్వుతూ పలకరించే జనం కలిసిన ఒక చక్కటి అనుభూతి వియత్నాం.వియత్నాం అనేది దక్షిణ ఆసియాలో ఉన్న ఒక అందమైన దేశం. చైనా, లావోస్, కంబోడియా దేశాలకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి ప్రతి సీజన్ లో ఒక కొత్త రూపాన్ని ధరించినట్టు అనిపిస్తుంది. నగరాల వేగం ఉన్నా కూడా గ్రామాల నిశ్చలమైన జీవితం, పచ్చని పొలాలు, చిన్న టీ షాప్స్, సైకిల్‌పై తిరిగే ప్రజలు కలిసి ఈ దేశానికి ఒక ప్రత్యేక స్వరూపం ఇస్తాయి. వియత్నాంలో ప్రయాణం చేస్తుంటే ఒకవైపు చరిత్ర, మరోవైపు ప్రకృతి, ఇంకోవైపు ఆధునిక నగర జీవనం కలిసి ఒక అందమైన కథల పుస్తకంలా తెరుచుకుంటుంది.సందర్శనీయ ప్రదేశాలువియత్నాంలో ప్రతి ప్రదేశం విశేషంగా అనిపిస్తుంది. హానోయ్ వీధుల్లో నడుస్తుంటే కాఫీ సుగంధం గాలిలో కలిసిపోయి శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. హో చి మిన్ సిటీలో ఆధునిక భవనాల మధ్య చరిత్ర ఇంకా జీవించినట్టు కనిపిస్తుంది. హా లాంగ్ బే లో నీళ్ల మధ్య నిలిచిన సున్నపు రాళ్లను చూస్తుంటే ప్రకతి తన చేతులతో ఒక శిల్పం తయారు చేసిందేమో అనిపిస్తుంది. నిన్ బిన్ లో నదిలో మెల్లిగా సాగుతున్న బోట్ జర్నీ మధ్య రెండు వైపులా పచ్చని కొండలు మనసును మౌనంలోకి తీసుకెళ్తాయి. హోయ్ ఆన్ లో సాయంత్రం వెలుగుల్లో రంగురంగుల లాంతర్లు మెరుస్తుంటే కాలం కొన్ని నిమిషాలు ఆగిపోయినట్టు అనిపిస్తుంది. దా నాంగ్ సముద్ర తీరం ఉదయం వెలుగుల్లో చూస్తుంటే సముద్రం, ఆకాశం ఒకటే రంగులో కలిసిపోయినట్టు ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి వియత్నాం ప్రయాణంలో ఎయిర్‌పోర్టులో తొలి అడుగుపడగానే ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. సింగాపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్ లేదా దోహా లాంటి నగరాల ద్వారా కనెక్టింగ్ ఫ్లైట్స్తో హానోయ్ లేదా హో చి మిన్ సిటీ చేరుకోవచ్చు. ప్రయాణం మధ్యలో మేఘాల మధ్య విమానం సాగుతుంటే ముందు ఉన్న అనుభూతుల గురించి ఆలోచనలు మొదలవుతాయి. మనసులో చిన్నపాటి ఎగ్టైట్మెంట్ ఫీల్ అవ్వొచ్చు. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేసుకోవచ్చు.ఏం చూడాలి?వియత్నాంలో చూడాల్సింది కేవలం ప్రదేశాలు కాదు. ఉదయం లోకల్ మార్కెట్లో మొదలైన జీవితం, నదిపై మెల్లిగా సాగుతున్న బోట్లు, వరి పొలాల మధ్య పని చేస్తున్న రైతన్నలు, ఆలయ గంట శబ్దాలు, సిటీలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఉండే నిశ్శబ్దం అన్నీ కలిసి ఒక ఫుల్ లైఫ్ సైకిల్‌గా అనిపిస్తాయి. లాంతర్ల ఫెస్టివల్ సందర్భంగా వెలుగులో మెరిసే వీధులు, హా లాంగ్ బే క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ సూర్యోదయాన్ని చూడటం, కాఫీ షాపుల్లో కిటికీ దగ్గర కూర్చొని బయట ప్రపంచాన్ని గమనించడం, సైకిల్‌పై గ్రామాల మధ్య తిరగడం, ట్రెడిషనల్ వాటర్ పప్పెట్ షో చూడటం లాంటి అనుభవాలు ఈ యాత్రను మరింత గొప్పగా మార్చేస్తాయి. ఇలా ప్రయాణంలో సహజంగా కలిసే ఈ అనుభవాలే వియత్నాంను నిజంగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి.ఎక్కడ ఉండాలి?వియత్నాంలో స్టే అనేది కేవలం నిద్రపోయే చోటు మాత్రమే కాదు. హానోయ్‌లో హెరిటేజ్ స్టైల్ బోటిక్ హోటల్స్, హోయ్ ఆన్ లో రివర్ పక్కన హోమ్ స్టేస్, దా నాంగ్‌లో సముద్రం ఎదురుగా ఉన్న రిసార్టులు ప్రతి ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చేస్తాయి. ఉదయం బాల్కనీ నుంచి కనిపించే పచ్చని చెట్లు, కాఫీ వాసన, సైకిల్ బెల్ శబ్దం కలిసి రోజును చాలా ప్రశాంతంగా స్టార్ట్ చేసే మూడ్‌ను అందిస్తాయి. రాత్రి లాంతర్ల వెలుగులో నడిచే ప్రతి క్షణం ఒక ఎవర్గ్రీన్ మెమరీగా మిగిలిపోతుంది.ఏం తినాలి?వియత్నాంలో భోజనం చాలా సింపుల్. కానీ చక్కని అనుభూతిని అందిస్తుంది. ఫో అనే సూప్ ఉదయం చల్లని గాలిలో మరింత రుచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ హెర్బ్స్, నూడిల్స్ కలిసిన రుచి లోకల్ ప్లేవర్ సత్తా ఏంటో నాలుకకు చూపిస్తుంది.‘బాన్ మి శాండ్విచ్’లో ఫ్రెంచ్ అండ్ వియత్నాం రుచులు కలిసి ఉంటాయి.ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, స్టికీ రైస్ ప్రిపరేషన్స్, కొకోనట్ డెజర్ట్స్, ఎగ్ కాఫీ లాంటి రుచులు ప్రతి భోజనాన్ని ఒక కొత్త పరిచయంగా మార్చేస్తాయి.చిన్న స్ట్రీట్ కేఫ్‌లలో కాఫీ సిప్ చేస్తూ బయట జీవితాన్ని గమనించడం కూడా ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది.ఆసక్తికరమైన విషయాలువియత్నాం రాజధాని హానోయ్, దేశ సంస్కృతి, చరిత్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది.వియత్నాం కరెన్సీ వియత్నామీస్ ‘డాంగ్.’ దైనందిన జీవితంలో ఈ కరెన్సీ వినియోగం ఎక్కువగా ఉంటుంది.అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు అనేక ప్రదేశాలు సందర్శించడానికి అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు.వియత్నాం ప్రపంచవ్యాప్తంగా కాఫీ సంస్కృతికి ప్రసిద్ధి పొందిన దేశాల్లో ఒకటి.ప్రకృతి, చరిత్ర, సంప్రదాయం, సముద్ర తీరాలు అన్నీ కలిసిన ఒక కంప్లీట్ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే దేశమే వియత్నాం.యాత్రా బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుండి ఐదు రోజుల వియత్నాం యాత్ర కోసం బడ్జెట్ ప్యాకేజీ ప్రయాణానికి సుమారు రూ.55 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ ప్లాన్ రూ.75 వేల నుండి రూ.1 లక్షా 10 వేల వరకు ఉంటుంది. ప్రీమియం అనుభవం కోరుకునేవారికి రూ.1 లక్షా 40 వేల నుండి రూ.2 లక్షల 20 వేల వరకు ఖర్చు అవ్వొచ్చు.విజయవాడ నుండి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్షన్ బట్టి కొంచెం అదనపు ట్రావెల్ కాస్ట్ ఉంటుంది.అకామడేషన్ విషయానికి వస్తే డే అండ్ నైట్ స్టే కోసం రూమ్స్ రూ.2,500 నుండి రూ.12,000 వరకు ఆప్షన్స్‌లో దొరకుతాయి. భోజనం రోజుకు సుమారు రూ.1,000 నుండి రూ.2,000 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. క్రూయిజ్ ఎక్స్పీరియెన్సెస్, కల్చర్ టూర్స్, లాంతర్న్ ఈవినింగ్స్ లాంటి ప్యాకేజీలు కూడా ట్రై చేయవచ్చు.చాలా మంది వియత్నం వీసా విషయంలో కాస్త కన్ ఫ్యూజ్ అవుతుంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయ ప్రయాణికులు వియత్నాం వెళ్లడానికి వీసా అవసరం. ఈ వీసా కోసం ముందుగా అప్లై చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
బ్లాక్ ఫారెస్ట్.. స్వీట్ లవర్స్‌కి గ్రేట్ టేస్ట్!
ప్రతీ ట్రిప్ అడ్వెంచర్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా? ఎందుకంటే కొన్ని ప్రదేశాలు సైలెంట్‌గా మనసును రిఫ్రెష్ చేస్తాయి. ‘బ్లాక్ ఫారెస్ట్’ అలాంటి ఒక ప్రదేశమే. మొదటిసారి యూరోప్ విజిట్ చేసే వాళ్లకు కూడా ఈ ప్రదేశం కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ వ్యూస్, ప్రశాంతమైన రహదారులు కలిసి ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఇస్తాయి. ఇక్కడ సమయం నెమ్మదిగా గడుస్తున్న అనుభూతి కలుగుతుంది.అడవి మధ్య గ్రామాలు చాలా నీట్‌గా ఉంటాయి. వుడెన్ హౌజెస్, ఫ్లవర్ బాల్కనీలు, చిన్న స్ట్రీట్స్ అన్నీ పోస్ట్కార్డులా కనిపిస్తాయి. మార్నింగ్ మిస్ట్ చెట్ల మధ్య పడితే వాతావరణం ఇంకా కామ్‌గా ఉంటుంది. వాకింగ్ చేస్తూ నేచర్ సౌండ్స్ వింటుంటే సిటీ నాయిస్ సులభంగా మరిచిపోతాం. ప్రతీ కార్నర్లో సింపుల్ బ్యూటీ కనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలు: ట్రిబెర్గ్ జల΄ాతాల దగ్గర నీటి శబ్దాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. టిటిసీ లేక్ పక్కన ఈవినింగ్ వాక్ ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. బేడెన్ బేడెన్ స్ట్రీట్స్ వైబ్ ఫీల్ అవ్వాలంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్లాల్సిందే అనిపిస్తుంది.ఏం తినాలి?‘బ్లాక్ ఫారెస్ట్ కేక్’ స్వీట్ లవర్స్‌కి మెమోరెబుల్ టేస్ట్ ఇస్తుంది. ఫ్లామ్కుచెన్ క్రిస్పీ బేస్‌తో లైట్‌గా ఎంజాయ్ చేయవచ్చు. ట్రెడిషనల్ జర్మన్ సాసేజ్‌లను వార్మ్ బ్రెడ్‌తో ఆస్వాదిస్తే లోకల్ ఫ్లేవర్ కంప్లీట్‌గా ఫీల్ అవుతుంది. సింపుల్ ఫుడ్ అయినా శాటిస్ఫైయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.ఎప్పుడు వెళ్లాలి?మే నుంచి అక్టోబర్ వరకు క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆటమ్‌లో రంగురంగుల చెట్లు ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఈ సమయంలో వెళ్తే రోడ్లు చాలా క్లీన్ గా ఉంటాయి. స్థానికులు చాలా స్నేహభావంతో పలకరిస్తారు. స్లో ట్రావెల్‌ని ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ వాతావరణం అని చెప్పవచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ లేక స్టుట్‌గార్డ్ కి కనెక్టింగ్ ఫ్లైట్‌లో సుమారు 12 నుంచి 15 గంటల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్రెయిన్ లేక కార్ జర్నీతో బ్లాక్ ఫారెస్ట్ రీచ్ అవ్వడం ఈజీ. సీనిక్ రూట్ జర్నీని ఇంకా ఎంజాయబుల్‌గా మార్చేస్తుంది. ట్రిప్ అయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా గుర్తొస్తాయి. నేచర్‌తో స్పెండ్ చేసిన క్వైట్ మూమెంట్స్ హార్ట్‌లో లాంగ్ టైమ్ ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్ విజిట్ సింపుల్‌గా జర్నీ అయినా అనుభూతి మాత్రం లైఫ్ టైమ్ మిగిలిపోతుంది. -
విచిత్రమైన ఆలయం.. ఎలుకలే దేవుడికి అతిథులు!
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయం ఇదే. కొన్ని ప్రదేశాల గురించి వినగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం కదా... కర్ణీ మాతా ర్యాట్ టెంపుల్ అలాంటి డెస్టినేషనే. తొలిసారి విజిట్ చేసే వాళ్లకి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. వేలాది ఎలుకల మధ్య కూడా ఈ ఆలయ వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. భక్తి, విశ్వాసం, ఆచారం అన్నీ కలిసి ఒక వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది.ఆలయం బయటి నుంచి సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లగానే బ్యూటిఫుల్ మార్బుల్ ఫ్లోర్స్, సిల్వర్ డోర్లు, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఎలుకలు వాటికి నచ్చినట్టు తిరుగుతూ ఉన్నా కూడా భక్తులు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు.సందర్శనీయ ప్రదేశాలుఆలయ సందర్శన ట్రిప్‌లో కర్ణీ మాతా ఆలయం అనేది ప్రధాన ఆకర్షణ. అయితే దగ్గర్లోనే బికనేర్ కోట గురించి కథలు వింటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లిపోతాం. లాల్గర్ ప్యాలెస్ కు వెళ్తే రాజుల కాలం నాటి వైభవం ఏంటో తెలుసుకోవచ్చు. గజ్నేర్ సరస్సు, దగ్గర సాయంత్రం సమయంలో ప్రశాంతంగా ఉంటుంది.ఏం తినాలి?వరల్డ్ ఫేమస్ బికనేరీ భూజియా స్పైసీ, క్రిస్పీ, టేస్టీగా అందరికీ నచ్చేలా ఉంటుంది. దాల్ భాటి చూర్మా, ఆథెంటిక్ రాజస్థాని ఫ్లేవర్‌ని అందిస్తుంది. ఘేవర్ స్వీట్, సాఫ్ట్ టెక్చర్‌తో మీల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. లోకల్ చాయ్ తాగితే జర్నీ ఇంకా మెమొరబుల్‌గా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రయాణం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్థానికులు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. ఆలయం ఆచారాల గురించి తెలుసుకుంటూ స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తే ఈ ప్రయాణం అద్భుతమైన జర్నీగా మిగిలిపోతుంది. ఇక్కడ ప్రతీ మూమెంట్ ఒక కొత్త మెమొరీని క్రియేట్ చేస్తుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ఫ్లైట్ జర్నీకి సుమారు 3 గంటలు పడుతుంది. అక్కడి నుంచి బికనేర్‌కి ట్రైన్ లేదా రోడ్ జర్నీకి సుమారు 5–6 గంటలు పడుతుంది. డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రోడ్ జర్నీలో ఎడారి అందాలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఈ ట్రిప్ పూర్తి అయ్యాక జ్ఞాపకాలు మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డిఫరెంట్ ట్రెడిషన్స్‌ని దగ్గరగా చూడటానికి ఇది మంచి అవకాశం అని భావించవచ్చు. జర్నీ అయిపోయిన తరువాత కూడా ఈ పీస్ఫుల్ ఫీలింగ్ మనసులో చాలా రోజులు ఉంటుంది. -
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
థాయ్‌లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్.. ముఖ్యంగా ‘క్యాష్’
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్‌లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్‌లాండ్‌కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC)ను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.వీసా, నగదు నిబంధనలుప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్తథాయ్లాండ్లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్‌పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్‌లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యమైన చెక్‌లిస్ట్ ఇదే..చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్.కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.పూర్తి ప్రయాణ ప్రణాళిక.ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్ కోడ్ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసావెంట కనీసం 20,000 థాయ్ బాట్ల నగదు.ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.గ్రూప్‌గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్‌లాండ్‌లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D— India in Thailand (@IndiainThailand) July 2, 2026 -
వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా?
వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్‌గా ఎంజాయ్ చేయవచ్చు.వాతావరణం చెక్ చేయండి: ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయడం మంచిది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల గురించి ముందుగా తెలిస్తే తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లోకల్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటే అనవసరమైన అత్యవసర ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.ప్యాకింగ్ ఇలా!లైట్‌వెయిట్ రెయిన్ కోట్ లేదా కాంపాక్ట్ అంబ్రెల్లాను బ్యాగులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ వినియోగిస్తే గ్యాడ్జెట్స్, బట్టలు సేఫ్‌గా ఉంటాయి. మొబైల్, డాక్యుమెంట్స్, వాలెట్ లాంటివి వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లో క్యారీ చేస్తే బెస్ట్.ఫుట్‌వేర్: ఫుట్‌వేర్ సెలెక్ట్ చేసేటప్పుడు వాటర్‌ప్రూఫ్ శాండిల్స్ లేదా క్విక్ డ్రైయింగ్ షూస్ చాలా బెటర్ ఆప్షన్. స్లిప్పరీ రోడ్స్‌లో కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న ఫుట్‌వేర్ జర్నీని సులభతరం చేస్తుంది. ఎక్స్ట్రా సాక్స్ క్యారీ చేస్తే తడిసిన వెంటనే మార్చుకోవచ్చు.స్నాక్స్.. హెల్తీ స్నాక్స్, వాటర్ బాటిల్, చిన్న టవల్, పవర్ బ్యాంక్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ట్రావెల్ ఎసెన్షియల్స్గా బ్యాగులో రెడీగా ఉంటే చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా చార్జింగ్ చేసే అవకాశం దొరక్కపోయినా పవర్ బ్యాంక్‌తో చార్జింగ్ పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటుంది. మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడితే వాటిని సెపరేట్ పౌచ్‌లో ఉంచడం బెటర్.రోడ్ ట్రిప్స్‌లో డ్రైవింగ్ స్లోగా చేయడం, సరైన దూరం పాటించడం చాలా అవసరం. నీటితో నిండిపోయిన రోడ్డుపై అనవసరమైన రిస్క్ తీసుకోకపోవడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే కొంచెం ఎక్స్ట్రా ట్రావెల్ టైమ్ ప్లాన్ చేసుకుంటే రష్ అవాయిడ్ చేయవచ్చు.మాన్ సూన్ ట్రావెల్లో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా మెమొరబుల్‌గా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్, చల్లని వెదర్ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేస్తాయి. కొంచెం సిద్ధం అయి వెళ్తే ఆ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా పూర్తి చేసుకుని ఇంటికి మెమొరీస్‌తో తిరిగి వచ్చేయవచ్చు. వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్‌గా ఎంజాయ్ చేయవచ్చు. -
వర్షాకాలంలో.. వావ్ అనిపించే వనాకా!
వర్షాకాలంలో ప్రశాంతమైన డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారా? వనాకా చూస్తే ఫస్ట్ గ్లాన్స్లోనే కామ్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైమ్ న్యూజీలాండ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్లకి ఇది రిలాక్స్డ్ ఛాయిస్ అవుతుంది.లేక్, మౌంటెన్స్, ఫ్రెష్ ఎయిర్ కలిసి స్లో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ని బ్యూటిఫుల్‌గా మార్చేస్తాయి. తేలికగా వర్షం పడుతుంటే లేక్ పైన మిస్ట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రీన్ హిల్స్ మరింత ఫ్రెష్‌గా కనిపిస్తాయి. స్మాల్ కేఫేస్, ప్రశాంతమైన వీధులు, లేక్‌సైడ్ వాకింగ్ ΄ాథ్స్ అన్ని కంఫర్టబుల్ అట్మాస్పియర్‌ను క్రియేట్ చేస్తాయి. క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల నేచర్‌ని సులభంగా ఎంజాయ్ చేయవచ్చు.సందర్శనీయ స్థలాలులేక్ వనాకా దగ్గర మార్నింగ్ వాక్ ప్రశాంతంగా అనిపిస్తుంది. రాయ్స్ పీక్ పరిసరాలు మిస్ట్‌తో ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రశాంతమైన వనాకా ట్రీ రెయినీ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ తీయవచ్చు. అలాగే మౌంట్ అస్పైరింగ్ నేషనల్ ΄ార్క్ పరిసరాల్లోని గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్ నేచర్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తాయి.వెరైటీ ఫుడ్ చాయిస్ఫ్రెష్ సాల్మన్ డిషెస్ ఇక్కడ చాలా ΄ాపులర్. వార్మ్ పంప్కిన్ సూప్‌ను వర్షాలు పడుతున్న సమయంలో తీసుకుంటే ఆ మజానే వేరు. స్థానికంగా లభించే చీజ్ ΄్లాటర్స్, హాట్ కాఫీతో ఎంజాయ్ చేస్తే వాతావరణం ఇంకా మెమొరబుల్‌గా అనిపిస్తుంది.ఎప్పుడు వెళ్లాలి?జూన్ నుంచి ఆగస్ట్ వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు కురిసే వర్షానికి వనాకా బ్యూటీ మరింత పెరుగుతుంది. లేక్ వ్యూస్ ప్రతి మూమెంట్‌ని రిఫ్రెషింగ్ మెమొరీగా మారుస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఆక్లాండ్ లేదా క్వీన్స్ టౌన్ కి కనెక్టింగ్ ఫ్లైట్స్ లభిస్తాయి. క్వీన్స్ టౌన్ నుంచి రోడ్ జర్నీ ద్వారా వనాకాకు సుమారు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్ కనెక్టివిటీ ఆధారంగా మొత్తం ప్రయాణానికి సుమారు 18 నుంచి 22 గంటల సమయం పడుతుంది.వనాకా జర్నీ కంప్లీట్ అయ్యాక అక్కడి మెమొరీస్ సైలెంట్‌గా మనసులో రివైండ్ అవుతూ ఉంటాయి. వర్షం, పర్వతాలు, సరస్సులోని ప్రతిబింబాలు మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి. ప్రకతిని స్లోగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్లకి ఈ డెస్టినేషన్ ఒక మరపురాని ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలి΄ోతుంది. -
మనసుని తడిపేసే అనుభూతి
కొన్ని ప్రదేశాలు చూడటానికి కాదు, అనుభూతి చెందడానికి పిలుస్తాయి. ఆలాంటి ఒక ప్రదేశమే మేఘాలయ. మేఘాలు భూమిని తాకుతుంటే, జలపాతాలు పాటలు పాడుతుంటే, గమ్యం కన్నా ప్రయాణమే మధురంగా అనిపిస్తే అదే మేఘాలయ.భారత దేశంలోని నార్త్ ఈస్ట్‌లో ఉన్న మేఘాలయా రాష్ట్రాన్ని ‘అబోడ్ ఆఫ్ క్లౌడ్స్‘ అని పిలుస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి భూమి మొత్తం పచ్చని రంగుల్లో మునిగిపోతుంది. మేఘాలు చెరువులుగా భూమిని ఆలింగనం చేసుకున్నట్టు కనిపిస్తాయి. ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడుతుంది. ప్రతీ మార్గం ఒక కొత్త కథను చెబుతుంది. ఇక్కడ ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడం కాదు. ఆ మార్గంలో కలిగే ప్రతీ అనుభూతిని ఆస్వాదించడం.ఆసక్తికరమైన విషయాలు..రాష్ట్రం: మేఘాలయ, నార్త్ ఈస్ట్ ఇండియాబెస్ట్ ఎక్స్‌పీరియెన్స్: మాన్ సూన్ లో మేఘాలు, జలపాతాల మధ్య ప్రయాణందగ్గరిలోని విమానాశ్రయం: గువహతి విమానాశ్రయం, అస్సాంట్రిప్ సమయం: 5 రోజులు సరిపోతుందిటాప్ 5 ప్రదేశాలు: చిరపుంజి, డాకి రివర్, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, షిల్లాంగ్, మావ్లిన్నాంగ్మేఘాల మధ్య జీవనంమేఘాలయలో వర్షం ఒక సీజన్ కాదు. జీవన విధానం. షిల్లాంగ్ వైపు ప్రయాణం మొదలైన వెంటనే రోడ్డు పక్కన నిలిచిన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు, మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న గ్రామాలు మనసుని ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇక్కడ గాలి కూడా చల్లని సుగంధంతో ఉంటుంది. జలపాతాల ధ్వని దూరం నుండి వినిపిస్తుంటే, మేఘాలు కొన్ని సార్లు రోడ్డుమీద దిగివచ్చి మీ పక్కనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి తన అందాన్ని ఇక్కడ కూడా ఆతిశయోక్తి లేకుండా చూపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుషిల్లాంగ్ సిటీకి చేరగానే బ్రిటిష్ హిల్ స్టేషన్ లాంటి ఒక సౌకర్యం, నార్త్ ఈస్ట్ సంస్కృతి కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. వార్డ్స్ లేక్ దగ్గర సాయంత్రం గాలి ఆస్వాదిస్తుంటే, సమయం నెమ్మదిగా నడుస్తున్నట్టు ఉంటుంది. చిరపుంజి వైపు వెళ్లిన తరువాత మేఘాలు ఇంకా దగ్గరగా అనిపిస్తాయి. నోహ్కలికై ఫాల్స్ నుండి పడుతున్న నీటి ధార వర్షాకాలంలో మరింత గంభీరంగా కనిపిస్తుంది. సెవన్ సిస్టర్స్ ఫాల్స్ మధ్య మేఘాలు ఆడుకుంటుంటే ఆ దృశ్యం చాలా సేపు మనసులో నిలిచిపోతుంది.మాస్మై కేవ్‌లో నడుస్తుంటే ప్రకృతి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ అద్భుతమైన కళాకృతిని సిద్ధం చేసిందో అని అనిపిస్తుంది. డాకిలో ఉంగాట్ రివర్ నీరు ఎంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటుందంటే అందులో పడవ వెళ్తుంటే దూరం నుండి గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మావ్లిన్నాంగ్ గ్రామంలో పరిశుభ్రత, ప్రకతి కలిసి ఒక మంచి జీవన విధానాన్ని చూపిస్తాయి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ దగ్గర ప్రకృతి, మానవ సహకారం కలిసి సృష్టించిన అద్భుతం ప్రతీ అడుగులో కనిపిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి షిల్లాంగ్‌కి ప్రయాణం ప్రారంభం అయ్యే ముందు, ఆకాశం వైపు చూస్తూ నార్త్ ఈస్ట్ పిలుపు వినిపిస్తుంది. హైదరాబాద్ నుంచి అస్సాంలోని గువహతికి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా దొరుకుతాయి. అక్కడి నుండి రోడ్డు జర్నీ మొదలవుతుంది.గువహతి నుండి షిల్లాంగ్ వరకు ప్రయాణం చాలా అందమైన ఘాట్ రోడ్ల మధ్య జరుగుతుంది. ప్రతీ మలుపు కొత్త దృశ్యం చూపిస్తుంది. మేఘాలు రోడ్డుపై దిగివస్తుంటే ప్రయాణం డెస్టినేషన్ కన్నా గొప్పగా అనిపిస్తుంది. విజయవాడ నుండి ప్రయాణం చేసే వారు హైదరాబాద్ లేదా బెంగళూరు ద్వారా గువహాతి చేరుకుని అదే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఈ మార్గంలో ప్రయాణం ఒక సినిమాలా, ఒక స్లో మోషన్ సీక్వెన్స్‌లా ఉంటుంది.ఏం చూడాలి?మేఘాలయాలో ప్రతీ నిమిషం ఒక ఫ్రేమ్‌లా ఉంటుంది. జలపాతాలు, మేఘాలు, పచ్చని కొండలు, అడవి మధ్య నడిచే మార్గాలు కలిసి ఒక లైవ్ పెయింటింగ్‌లా కనిపిస్తాయి.లివింగ్ రూట్ బ్రిడ్జిపై నడిచే క్షణం ప్రకతితో కలిసి నడుస్తున్నట్టు ఉంటుంది. డాకి నదిపై పడవ ప్రయాణం చేస్తూ నీటిలో ఆకాశం ప్రతిబింబాన్ని చూస్తూ సమయం మరిచిపోవచ్చు. షిల్లాంగ్ మార్కెట్లో స్థానిక జీవన విధానం, కళ, సంస్కృతి కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు మౌనంగా గడపడం, మేఘాల మధ్య రోడ్డు జర్నీ ఆస్వాదించడం, ఉంగాట్ రివర్‌పై బోట్ రైడ్ ఆస్వాదించడం, లివింగ్ రూట్ బ్రిడ్జి దగ్గర నడవడం, మావ్లిన్నాంగ్ గ్రామంలో ప్రతీ వీధిని నెమ్మదిగా నడుస్తూ ఫీల్ అవ్వడం అనే ఈ ఐదు అనుభవాలు ఈ యాత్రని మరింతగా గుర్తిండిపోయేలా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?షిల్లాంగ్‌లో హెరిటేజ్ కాటేజీలు, బోటీక్ స్టేస్, నేచర్ రిసార్టులు, వుడెన్ హోమ్ స్టేలు ప్రతీ ఒక్కటి ప్రకృతి దగ్గరగా తీసుకెళ్తాయి. ప్రతీ ఉదయం బాల్కనీ తలుపు తెరవగానే మేఘాలు ఎదురుగా నిలబడి స్వాగతం చెబుతాయి. చిరపుంజిలో కొండల మధ్య ఉన్న రిసార్టులో వర్షం శబ్దం మధ్య కాఫీ తాగుతుంటే నగర జీవితం ఎంతో దూరం వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. రాత్రి సమయంలో చల్లని గాలి, పక్షుల స్వరాలు, మేఘాల మధ్య వెలుగులు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.ఏం తినాలి?మేఘాలయ రుచులు కూడా ఇక్కడి భూమిలాగే సహజంగా ఉంటాయి. జడో అనే రైస్ ప్రిపరేషన్, తంగ్రింబై, దోనియాంగ్ లాంటి స్థానిక వంటకాలు ప్రతీ భోజనంలో కొత్త రుచిని పరిచయం చేస్తాయి. నాన్ వెజ్ ప్రియులకు వెరైటీలకు కొదువేలేదు అనేలా ఆప్షన్స్ ఉంటాయి.ఫ్రెష్ ఫ్రూట్స్, బాంబూ షూట్ రెసిపీస్, లోకల్ టీ, వేడి వేడి సూప్ చల్లని వాతావరణంలో మరింత రుచిగా అనిపిస్తాయి. చిన్న కేఫేల్లో కాఫీ సిప్ చేస్తూ మేఘాలను చూస్తూ గడిపిన సమయం భోజనం కన్నా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. యాత్రా అండ్ బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల మేఘాలయ ప్రయాణం అనేది బడ్జెట్ ప్లాన్న్ చేసుకుంటే... ప్రతీ వ్యక్తికి సుమారు రూ.28,000 నుండి రూ.35,000 మధ్య పూర్తి అవుతుంది. స్టాండర్డ్ కంఫర్ట్ ప్లాన్న్ రూ.40,000 నుండి రూ.55,000 మధ్య ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.70,000 నుండి రూ.95,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుండి వెళ్లిన వారికి ప్రయాణం దారిని బట్టి కొంచెం అదనపు ఎయిర్‌ఫేర్ ఉంటుంది. గువహతి నుంచి షిల్లాంగ్ రోడ్డు ప్రయాణం ఎవర్గ్రీన్ మెమోరీగా మిగిలిపోతుంది.స్టే చార్జెస్ ప్రతీ రాత్రికి రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య బడ్జెట్ కేటగిరిలో ఉంటాయి. ప్రీమియం రిసార్టులు రూ.7 వేల నుండి రూ.15 వేల వరకు ఉంటాయి. భోజనం కోసం రోజుకు సుమారు రూ.700 నుంచి రూ.1500 వరకు బడ్జెట్ పెడితే సరిపోతుంది. లోకల్ సైట్‌సీయింగ్ ΄్యాకేజీలు, ప్రైవేట్ క్యాబ్ ఎక్స్‌పీరియెన్స్ అనేవి అందుబాటు ధరలో చూసుకుంటే సరిపోతుంది. భారత దేశంలో భాగమే కాబట్టి వీసా అవసరం లేదు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
కంగారు లేని ప్రయాణం.. మనసుకు నచ్చిన నిశ్శబ్దం!
ఒకప్పుడు వెకేషన్ అంటే ఉదయాన్నే లేవడం, టూరిస్ట్ ప్లేస్‌ల చుట్టూ తిరగడం, ఫొటోలు దిగడం.. వింటుంటేనే అలసిపోయినట్లు ఉంది కదూ! అయితే నేటి తరం యువత (జెన్ జీ) ఈ పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలుకుతోంది. ప్రయాణాల పేరుతో సాగే ఈ పరుగుల పందేన్ని పక్కన పెట్టి, సరికొత్త పద్ధతికి తెరలేపింది. అందమైన ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ లగ్జరీ గదుల్లో ఏమీ చేయకుండా ప్రశాంతంగా గడపడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈ వినూత్న ట్రెండ్‌ను ‘రూమ్ రొట్టింగ్’ అని పిలుస్తున్నారు. ఇది సోమరితనం కాదు, ఒత్తిడిని జయించే ఒక అద్భుతమైన మార్గమని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.మారిన ప్రయాణాల రూపురేఖలుగతంలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలంటే అదొక పెద్ద పట్టిక, సందర్శించాల్సిన స్థలాల జాబితా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటం ఉండేవి. కానీ నేటి తరం ఆ ఒత్తిడిని అస్సలు ఇష్టపడటం లేదు. తాజా గణాంకాల ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు జెన్ జీ పర్యాటకులు కేవలం ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, 10 మందిలో 8 మంది యువతీ యువకులు తమ ట్రిప్‌లో కనీసం సగభాగం తాము బస చేసిన హోటల్ లేదా ఎయిర్బిఎన్బి గదుల్లోనే గడుపుతున్నారు.రూమ్ రొట్టింగ్ వెనుక అసలు రహస్యంఈ సరికొత్త ధోరణిని పాత తరం వారు సమయాన్ని వృథా చేసుకోవడంగా భావించవచ్చు. కానీ జెన్ జీ కోణంలో చూస్తే ఇది ఒక విప్లవాత్మక మార్పు. వారు తమకు నచ్చిన వ్యక్తులతో గడపడానికి, నిరంతరం పనిచేసే మెదడుకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఎయిర్బిఎన్బి గదులే ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. బాల్కనీ నుండి కనిపించే వ్యూ, అర్ధరాత్రి కలిసి వండుకునే వంటలు, తెల్లవార్లూ సాగే మనసు విప్పిన సంభాషణలే వారికి నిజమైన అనుభూతులు.స్వేచ్ఛకు పెరిగిన ప్రాధాన్యతపరిశోధనల ప్రకారం.. దాదాపు 64 శాతం మంది యువత తమ ప్రయాణాల్లో ఎలాంటి షెడ్యూల్స్ లేకుండా ఖాళీగా ఉంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇక 74 శాతం మంది పర్యాటకులు తాము అనుకోకుండా ప్లాన్ చేయకుండా చేసిన పనులే అత్యంత ఉత్తమమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయని చెబుతున్నారు. అర్ధరాత్రి స్నాక్స్ కోసం చేసే డ్రైవ్‌లు, జీవితం గురించి గంటల తరబడి సాగే చర్చలే ఈ తరం ఆశిస్తున్న వినోదం.మానసిక ఆరోగ్యం..ఈ రూమ్ రొట్టింగ్ ట్రెండ్ వెనుక బలమైన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. నేటి యువతలో మానసిక ప్రశాంతత కోసం ప్రయాణాలు చేసే ధోరణి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ యువతలో తీవ్రమైన ఒత్తిడి, బర్నౌట్ (అలసట) నుండి కోలుకోవడానికి చేసే ప్రయాణాలను ‘మెంటీ బీ ట్రావెల్’ అని పిలుస్తున్నారు. ప్రపంచం ఇచ్చే ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మరిన్ని పనులు చేయడం కంటే, ప్రశాంతత కోసం ఏమీ చేయకుండా ఉండటమే సరైన మందు అని వారు నమ్ముతున్నారు.ప్రతి ప్రయాణంలోనూ వైవిధ్యంఈ ట్రెండ్‌లో మరో విశేషం ఏంటంటే.. 67 శాతం మంది జెన్ జీ పర్యాటకులు తాము చేసే ప్రతి ప్రయాణం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో నిర్దిష్టమైన రూల్స్ ఏమీ లేవు. ఒకరికి కొండ ప్రాంతంలో మూడు రోజులు ఏ ప్లాన్ లేకుండా గడపడం నచ్చితే, మరొకరికి నగరంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం 8 గంటల దాకా హాయిగా పడుకోవడం నచ్చవచ్చు. ఇంకొకరు తోటలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదించవచ్చు.అపరాధ భావన వీడిన యువతలక్షలు పోసి టూర్‌కు వచ్చి, బయట తిరగకపోతే డబ్బులు దండగ అనే పాత అపరాధ భావన ఇప్పుడు పూర్తిగా మాయమవుతోంది. రూమ్ రొట్టింగ్ అంటే తక్కువగా బతకడం కాదు, జీవితంలో ఏది ముఖ్యమో దానికి మాత్రమే సమయం కేటాయించడం. తమకు నచ్చిన వారితో, ఎక్కడికీ వెళ్లాలనే కంగారు లేకుండా, ఇంటికి దూరంగా ఒక అందమైన ప్రదేశంలో కేవలం ప్రశాంతంగా ఉండటమే నిజమైన వెకేషన్ అని జెన్ జీ నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ఇక ఫోన్లతో పనిలేదు.. కళ్లద్దాలతోనే కాల్స్, ట్రాన్స్‌లేషన్స్! -
అక్కడికే ఎక్కువమంది!
భారతదేశం నుండి బయల్దేరే, లేదా భారతదేశంలో ఆగే విమాన ప్రయాణికుల సంఖ్యను బట్టి... గల్ఫ్ దేశాలకూ, భారత్‌కూ మధ్యే అత్యధికంగా రాకపోకలు సాగుతున్నాయి. వలసలు, వ్యాపారాలు ఇందుకు ప్రధాన కారణం కాగా, పర్యాటక రంగం తర్వాతి స్థానంలో ఉంది. -
ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్ ఇవే..
ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్ అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ట్రావెలర్ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి తెలుసుకోండి.1. ట్రాకిబుల్ పాస్‌పోర్ట్ వ్యాలెట్విదేశాల్లో ఉన్నప్పుడు పాస్‌పోర్ట్‌ను గుండెకాయలా చూసుకోవాలి. ఒక వేళ అది మిస్ అయితే సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ట్రాకిబుల్ పాస్‌పోర్ట్ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. పాస్‌పోర్ట్ భద్రంగా ఉండాలి అంటే ఈ పాస్‌పోర్ట్ ట్రాకర్ మీకు ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న బ్లూటూత్ ట్రాకింగ్ టెక్నాలజీ వల్ల మీ పాస్‌పోర్ట్ ఉన్న వ్యాలెట్ మిస్ అయినా మీ ఫోన్ వాడి దాని లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. ఈ వ్యాలెట్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులు, బోర్డింగ్ పాస్, ఇతర డాక్యుమెంట్స్ దాచుకునే సదుపాయం కూడా ఉంటుంది.2. హ్యాండ్ ఫ్రీ ఫోన్ హోల్డర్ ఈ డిజైజ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పాపులర్ అవుతోంది. దీనికి కారణం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు హోటల్స్‌లో, వాహనాల్లో దీనిని సులభంగా వాడుకోవచ్చు. ఫోనును చేతితో పట్టుకోకుండా డెస్కుకు, సీటుకు ఒక క్లిప్పులా పెట్టేసి వీడియోలు, ఫోటోలు, మ్యాప్స్ చూడవచ్చు. కార్లు, బైకు, విమానం బస్సులో కూడా వీటిని వినియోగించవచ్చు. ఆన్ లైన్లో మీకు వందల రకాలు మొబైల్ హోల్డర్స్ లభిస్తాయి.3. సోలార్ పవర్ బ్యాంక్ఈ రోజుల్లో మన ఫోన్ తో పాటు ఇతర పరికరాలను చార్జ్ చేసి పెట్టడం అనేది చిన్న ఛాలెంజ్ లాంటిదే. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరీ ఈ ఛాలెంజ్ కాస్త కష్టంగా మారిపోతుంది. దీని కోసం మీరు మల్టి కేబుల్ సోలార్ పవర్ బ్యాంక్ వినియోగించవచ్చు. ఇది ఇకో ఫ్రెండ్లీ అయిన చార్జింగ్ విధానం.ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన గ్యాడ్జెట్స్ వినియోగించి మీరు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగింవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన, మీరు వాడుతున్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు. -
ప్రయాణంలో సరైన బ్యాగ్ ఎంపిక..
చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. తిరుపతి, అరకు, శ్రీశైలం నుంచి ఢిల్లీ, జైపూర్, కేరళ వరకు.. అది ఆధ్యాత్మిక యాత్ర అయినా, కుటుంబ పర్యటన అయినా లేదా సోలో ట్రిప్ అయినా, సరైన బ్యాక్‌ప్యాక్ మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేస్తుంది. భారతీయ పరిస్థితులకు, తెలుగు ప్రయాణ శైలికి సరిపోయే బ్యాగ్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.సరైన సైజును సెలక్ట్ చేసుకోండి..మీరు తిరుపతి లేదా విజయవాడ నుంచి షిర్డీ వంటి ప్రాంతాలకు వీకెండ్ యాత్రకు వెళుతున్నట్లయితే 30–40 లీటర్ల బ్యాగ్ సరిపోతుంది. ఉత్తర భారతదేశ యాత్రలకు లేదా చార్ ధామ్ యాత్రలకు 45–60 లీటర్ల బ్యాగ్ తీసుకెళ్లండి. అతిపెద్ద బ్యాగ్‌ను ఎంచుకోకండి. ఎందుకంటే రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ఆలయాల్లో దానిని మోయడం కష్టం.ఇండియన్ ట్రావెల్‌కు మల్టిపుల్ కంపార్ట్మెంట్లుతెలుగు కుటుంబాలు తరచుగా అదనపు బట్టలు, ప్రసాదం, టిఫిన్ బాక్సులు, బహుమతులు తీసుకువెళ్తుంటాయి. బట్టలు, ఆహారం, చెప్పులు, గ్యాడ్జెట్ల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇది ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద జరిగే సెక్యూరిటీ చెకింగ్స్‌లో ఈజీగా ఉంటుంది.సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యంతెలుగు వారి ప్రయాణాలు సుదీర్ఘ రైలు ప్రయాణాలు, రాత్రిపూట బస్సు ప్రయాణాలు, ఆలయ క్యూలను కలిగి ఉంటాయి. ప్యాడెడ్ పట్టీలు, వెనుక భాగానికి సపోర్ట్, నడుము బెల్టులు ఉన్న బ్యాగ్‌ను తీసుకోండి. బ్యాగ్‌ను పూర్తిగా నింపి ఇంట్లో టెస్ట్ చేయండి. అది సౌకర్యంగా ఉందో లేదో తెలుస్తుంది.వాతావరణాన్ని తట్టుకునేదివిజయవాడలో వర్షాకాలం నుంచి రాజస్థాన్ లోని పొడి వేడి వరకు, భారతదేశ వాతావరణం చాలా వేగంగా మారుతుంది. వర్షం నుంచి రక్షణ కోసం రెయిన్ కవర్, వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో చేసిన బ్యాగ్‌ను సెలక్ట్ చేసుకోండి.రద్దీలో సేఫ్టీఆలయ పట్టణాలు, రైల్వే స్టేషన్లు చాలా రద్దీగా ఉంటాయి. లాక్ చేయగల జిప్‌లు, నగదు లేదా ఆభరణాల కోసం దాచిన పాకెట్లు, కార్డుల కోసం ఆర్ఎఫ్ఐడీ రక్షణ ఉన్న బ్యాగ్‌ను సెలక్ట్ చేసుకోండి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు లేదా కుంభమేళా వంటి పండుగల సమయంలో ప్రయాణించేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.ఈజీ యాక్సెస్ఫ్రంట్–లోడింగ్ బ్యాక్‌ప్యాక్‌లు (సూట్కేస్లాగా) భారతీయ పరిస్థితులకు చాలా మంచివి. మీ టవల్ లేదా రైలు టికెట్ కోసం మొత్తం లగేజీని బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. ఐడీ, స్నాక్స్ లేదా దర్శనం టికెట్ల కోసం అదనపు చిన్న పాకెట్లు ప్రయాణ రోజుల్లో చాలా సహాయపడతాయి.తేలికైనది కానీ దృఢమెనదిబరువుగా ఉండే ఖాళీ బ్యాగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా బస్ బేల మధ్య సుదీర్ఘ నడకలో మరింత భారంగా అనిపిస్తుంది. తేలికైన కానీ బలమైన బ్యాగ్‌ను ఎంచుకోండి. వైల్డ్‌క్రాఫ్ట్, క్వెచువా, సఫారీ వంటి బ్రాండ్లు హైదరాబాద్, విజయవాడ స్టోర్లలో సులభంగా దొరుకుతాయి.బడ్జెట్, నాణ్యతమీరు అత్యంత ఖరీదైన బ్యాగ్‌ను కొనాల్సిన అవసరం లేదు. కానీ కుట్టు, జిప్‌లు, పట్టీల నాణ్యతలో రాజీ పడకండి. రూ.3,000–రూ.5,000 మధ్య ధర కలిగిన మంచి భారతీయ బ్రాండ్ బ్యాక్‌ప్యాక్ సాధారణంగా సంవత్సరాల తరబడి తిరుపతి, కేరళ వంటి యాత్రలకు సరిపోతుంది. -
మాన్సూన్ మజిలీకి కేరాఫ్ అడ్రస్..
అక్కడి వర్షపు చినుకులు ప్రకృతి రంగులను మరింత గాఢంగా మార్చేస్తాయి. ప్రతి అడుగులో పచ్చని వనాలు, మేఘాల చాటున కనిపించే కొండలు, అలల మధ్య నవ్వే తీరాలు.. కల కలిసిన దేశం శ్రీలంక. భారత దేశానికి దగ్గరగా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, మాన్ సూన్ సీజన్ లో ఒక కొత్త రూపం ధరిస్తుంది. ఒక వైపు సముద్ర అలలు, మరో వైపు టీ ప్లాంటేషన్స్, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాలు, కొలనియల్ వీధులు అన్నీ కలిసి ప్రయాణాన్ని గుర్తిండిపోయే అనుభవంగా మారుస్తాయి..శ్రీలంక అనేది దక్షిణ ఆసియాలో హిందూ మహా సముద్రం మధ్య ఉన్న అందమైన ద్వీపదేశం. రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే కాగా, ఆ దేశ ఆర్థిక రాజధాని కొలంబో. వర్షాకాలంలో ముఖ్యంగా నైరుతీ, దేశ మధ్య భాగాలు పచ్చదనంతో మెరిసిపోతాయి. చిన్న దూరం ప్రయాణం చేస్తే బీచుల నుంచి హిల్ స్టేషన్ కి, అక్కడి నుంచి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వరకు సీనరీ మారిపోవడం శ్రీలంక ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత.గాలే ఫేస్ గ్రీన్..కొలంబోలో ప్రయాణం మొదలైతే సముద్ర గాలి, మోడరన్ సిటీ రిథమ్ రెండూ కలిసి ఒక ఆహ్లాదకరమైన ఆరంభాన్ని ఇస్తాయి. గాలే ఫేస్ గ్రీన్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో అలల మధ్య నడుస్తుంటే సమయం మెల్లగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి గాలే ఫేస్ గ్రీన్ దిశలో వెళ్లినప్పుడు డచ్ ఫోర్ట్ మధ్య నడిచే ప్రతి వీధి చరిత్రని గుర్తుచేయడం మొదలు పెడుతుంది. ఓల్డ్ బిల్డింగ్స్, స్టోన్ రోడ్స్, సముద్ర అలల మధ్య ఈ ప్రదేశం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది.కేండీ చేరిన వెంటనే పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. కొండల మధ్య ఉన్న ఈ నగరంలో మేఘాలు దిగివచ్చినట్టు ఉంటాయి. టెంపుల్ ఆఫ్ టూత్ చుట్టూ ఉన్న ప్రశాంతత యాత్రకు మరో అర్థం ఇస్తుంది. సరస్సు పక్కన సాయంత్రం నడిచే సమయం చాలా మధురంగా అనిపిస్తుంది.నువారా ఎలియాకి చేరిన తరువాత టీ ప్లాంటేషన్స్ మధ్య వెళ్తున్న రైల్ జర్నీ ఒక సినిమా సీన్ లా ఉంటుంది. పచ్చని టీ తోటలు, చిన్న చిన్న జల΄ాతాలు, మేఘాల మధ్య కనిపించే స్టేషన్స్ ప్రతి నిమిషం కెమెరాలో కాకుండా మనసులో నిలిచిపోయే దృశ్యాలుగా మిగిలిపోతాయి.ఎల్లాలో నైన్ ఆర్చ్ బ్రిడ్జి దగ్గర రైలు మెల్లగా వెళ్తుంటే ఈ శబ్దం మధ్య ప్రకృతి ఒక సంగీతం వినిపిస్తున్నట్టు ఉంటుంది. లిటిల్ ఆడమ్స్ పీక్‌పై గాలి నిలబడి చూస్తే మేఘాల కింద ప్రపంచం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. యాలా నేషనల్ ΄ార్క్లో ప్రకృతి ఇంకో రూపం కనిపిస్తుంది. అడవి మధ్య సఫారీ చేస్తూ జింకలు, ఏనుగులు, పక్షులను చూడటం ప్రయాణానికి ఇంకో అనుభవం కలిగిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్, వన్ స్టాప్ ఫ్లైట్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. సుమారు రెండు నుండి నాలుగు గంటల ప్రయాణం తరువాత సముద్రం మధ్య ఉన్న ఈ ఐలాండ్‌ని చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకి వచ్చిన వెంటనే తేమతో కూడుకున్న గాలి, కొబ్బరి చెట్లు, సముద్ర వాసనలు లంకకి స్వాగతం చెబుతాయి.విజయవాడ నుంచి ప్రయాణం చేయాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి కొలంబోకి విమానంలో చేరుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చిన్నదిగా ఉండటం వల్ల వీకెండ్ హాలిడేస్‌ని కలుపుకుని కూడా మంచి మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.శ్రీలంకలో రైల్ జర్నీలు కూడా ఈ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. కేండీ నుంచి ఎల్లా వరకు వెళ్లే ట్రైన్ రూట్ ప్రపంచంలో అందమైన రైల్వే జర్నీస్‌లో ఒకటిగా అనిపిస్తుంది. విండో పక్కన కూర్చొని బయటి ప్రకృతిని చూస్తూ వెళ్తే దూరం అనేది పెద్ద భాగంగా అనిపించదు.ఎక్కడ ఉండాలి?కొలంబోలో బీచ్ ఫేసింగ్ హోటల్స్ నుంచి బోటీక్ స్టేస్ వరకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. గాలేలో కాలనియల్ స్టైల్ హెరిటేజ్ హోటల్స్ అనేవి ఓల్డ్ వరల్డ్ చార్మ్‌ని అందిస్తాయి. కేండీలో లేక్ వ్యూ రిసార్ట్స్ ప్రశాంతతని కలిగిస్తాయి. నువారా ఎలియాలో బ్రిటిష్ స్టైల్ కాటేజీలు, టీ ఎస్టేట్ బంగ్లాల్లో ఉండటం ఒక నాస్టాల్జిక్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది. ఎల్లాలో కొండల మధ్య ఉన్న ఎకో స్టేస్‌లో ప్రతి ఉదయం మేఘాల మధ్య కాఫీ తాగడం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?శ్రీలంక రుచులు మన సౌత్ ఇండియా ఫ్లేవర్స్కి దగ్గరగా ఉన్నా వాటి స్పెషాలిటీ వాటిదే. రైస్, కర్రీ ప్రతి భోజనంలో ఒక కొత్త కాంబినేషన్ ఇస్తుంది. హాపర్స్, స్ట్రింగ్ హాపర్స్, కొట్టు రోటి, పోల్ సంభోల్, ఫిష్ కర్రీ, కోకోనట్ కర్రీస్ రుచులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాయంత్రం ఒక హాట్ సిలోన్ టీతో మేఘాలు చూస్తూ గడిపే నిమిషాలు ప్రయాణంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఆసక్తికరమైన విషయాలు..శ్రీలంకని పర్ల్ ఆఫ్ ది ఓషియన్, భారత దేశపు కన్నీటి బిందువు అని కూడా పిలుస్తారు.కేండీ నుంచి ఎల్లా రైల్వే జర్నీ ప్రపంచంలో అత్యంత అందమైన ట్రైన్ జర్నీ రూట్స్‌లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.సీలోన్ టీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేక సంఖ్యలో ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి.మాన్ సూన్ సీజన్ లో టీ ప్లాంటేషన్స్, వాటర్‌ఫాల్స్, అడవులు మరింత పచ్చగా కనిపిస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుండి 5 రోజుల శ్రీలంక మాన్ సూన్ ట్రిప్‌కి బడ్జెట్ ప్యాకేజీ సుమారు రూ.45,000 నుండి రూ.60 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ రూ.65 వేల నుండి రూ.90 వేల వరకు ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కలిపి రూ.1.10 లక్షల వరకు పైకి వెళ్లవచ్చు.విజయవాడ నుండి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ బట్టి కొంచెం ట్రావెల్ కాస్ట్ మారవచ్చు. స్టే చార్జీలు బడ్జెట్ హోటల్స్‌లో రాత్రికి రూ.2,500 నుండి మొదలై ప్రీమియం రిసార్టులు రూ.15 వేలు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య సరిపోతుంది. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు, సీనిక్ ట్రైన్ జర్నీలు, వైల్డ్ లైఫ్ సఫారీ, టీ ఎస్టేట్స్ ఎక్స్‌పీరియెన్స్‌ని కలిపి కంప్లీట్ ప్లాన్ చేసుకోవచ్చు.ఇండియన్ ΄ాస్పోర్ట్ హోల్డర్స్‌కి శ్రీలంక ఎంట్రీ కోసం వీసా అవసరం లేదు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా ముందుగా అప్లై చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం సులభం.ఏం చూడాలి?శ్రీలంకాలో ప్రతి రోజు ఒక కొత్త రంగులో ప్రారంభం అవుతుంది. ఒక రోజు సన్ రైజ్ బీచ్‌పై కనిపిస్తుంది. మరొక రోజు టీ ప్లాంటేషన్స్ మధ్య మేఘాలు దిగివస్తాయి. ఇంకొక రోజు పురాతన ఆలయాల గంటల నాదం వినిపిస్తుంది. సముద్రంపై సాయంత్రం సూర్యాస్తమయం చూస్తుంటే ఆ వెలుగు నీళ్లపై పడిన ప్రతి నిమిషం ఒక పెయింటింగ్‌లా మారిపోతుంది.వేల్ వాచింగ్ సీజన్ లో మిరిస్సా దగ్గర సముద్రంపై వెళ్తుంటే ప్రకృతి విస్తృత రూపం కనిపిస్తుంది. టీ ఫ్యాక్టరీ విజిట్‌లో ఒక కప్ సిలోన్ టీ వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది.లోకల్ మార్కెట్లో రంగురంగుల పండ్లు, మసాలాలు, హ్యాండీక్రాఫ్ట్స్ మధ్య నడుస్తుంటే లంక జీవనశైలిని పూర్తిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయుర్వేద వెల్నెస్ ఎక్స్పీరియెన్సెస్, సీనిక్ ట్రైన్ రైడ్, బీచ్ వాక్స్, వైల్డ్ లైఫ్ సఫారీలు, టీ ఎస్టేట్ మార్నింగ్ వాక్స్ ఇవన్నీ ఈ యాత్రని పూర్తి చేస్తాయి. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్‌వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్‌గా మార్చేస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్‌లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.ప్రతీ కిలో మీటర్లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్‌స్టైల్‌ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్గా మార్చేస్తాయి.ఏం చూడాలి?వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్లో తిరగడం, బోటింగ్‌ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్‌గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.మున్నార్..వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్‌గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.కూర్గ్..కూర్గ్ కాఫీ ఎస్టేట్స్‌లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.వయనాడ్..వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్లీగా మారుతాయి.చిక్‌మగళూరు..చిక్‌మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.అరకు వ్యాలీ..ఆంధ్రప్రదేశ్‌లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.ఏం తినాలి?కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్‌ను పరిచయం చేస్తాయి.కూర్గ్‌లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్‌మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్‌లో స్పెషల్ ప్లేస్‌ను పొందుతుంది.తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్‌ను ఇస్తాయి.అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్‌ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.గమనిక: ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి!
పరిమితికి మించిన ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కొందరు అలానే వెళ్తున్నారు. అనంతపురంలో ఓ ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఇంటిల్లిపాదీ ఒకే బైక్‌పై వెళ్లడం చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
డార్క్ ప్యాటర్న్స్‌తో ఏటా రూ.28,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్‌ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఇందులో విశ్లేషించారు. డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. నివేదికలో మరిన్ని అంశాలు: → రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్‌్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. → ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది → అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. → ఆన్లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది. → ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. → ఆన్లైన్ ట్రావెల్ రంగంలో మేక్మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్‌ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది. → క్విక్ కామర్స్ రంగంలో బిగ్‌బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది. → ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డామ్‌లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్‌కు కూడా గుడ్‌బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్‌ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
హిమాలయాల నడుమ చల్లని స్వర్గం
అవి పర్వత శ్రేణులు మాత్రమే కాదు, ఒక జీవన వేదం. మంచు పర్వతాలతో మొదలయ్యి, ప్రశాంతమైన బుద్ధిస్ట్ ఆలయం వరకు నేపాల్‌లోని ప్రతీ ఒక్కటి మనకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ ఉన్న వాతావరణం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఖాట్మాండులో చారిత్రాత్మక కట్టడాల నుంచి పోఖరాలోని సరస్సు వరకు ప్రతీ అడుగు ఒక కొత్త కథలోకి ఎంటరైన ఫీలింగ్‌ను అందిస్తుంది.ప్రకృతి పరవశంలో...నేపాల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హిమాలయాలు. ఎండాకాలంలో మిగితా చోట్ల ఎండ ఎక్కువ ఉన్నా, ఇక్కడ అనేక చోట్ల వాతావరణం మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఖాట్మాండులోని ప్రాచీన కట్టడాలు, కొత్తగా అనిపించే వీధులు మన ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా మార్చుతాయి. ఇక్కడ ఉండే మనుషులు, వారి ఆత్మీయత మనం దూర ప్రాంతంలో ఉన్నాం అనే ఫీలింగ్‌ని దరిచేరనివ్వవు. ప్రతీ చిన్న గుడిలో ఉండే శాంతి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం కొత్త జ్ఞాపకంలా అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుఖాట్మాండు సిటీలో ఉండే పశుపతినాథ్ ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అక్కడ జరిగే హారతి, వాతావరణం మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇక్కడ ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఇంకా బౌద్ధనాథ్ స్తూపం వద్ద ఉండే ఆ శాంతి, అక్కడికి వచ్చిన భక్తుల మౌనం మనల్ని క్షణం పాటు స్థంభింపచేస్తాయి. పోఖరకి వెళ్తే అక్కడ ఫేవా లేక్‌లో బోట్ రైడింగ్ చేస్తున్నప్పుడు కనిపించే మచ్ఛపుచ్చ్రే పర్వతం రిఫ్లెక్షన్ చూసేందుకు రెండు కళ్లు సరి΄ోవు. సరస్సు నుంచి వచ్చే చల్లని గాలి మన శరీరాన్నే కాదు మనసును కూడా హత్తుకుంటుంది. సారంగ్‌కోట్ నుంచి సూర్యోదయం చూడటం ఒక మరువలేని అనుభవంగా మిగిలి΄ోతుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకి డైరెక్ట్ ఫ్లైట్స్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు మబ్బుల మధ్య కనిపించే హిమాలయ శిఖరాలు చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో గోరఖ్‌పుర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా నేపాల్ బార్డర్స్ దాటాల్సి ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. విజయవాడ నుంచి వచ్చే వారు ముందుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకోవడం ఉత్తమం.ఎక్కడ ఉండాలి?నేపాల్‌లో స్టే చేయడం అంటే ఒక ప్రకృతి ఒడిలో నిద్ర΄ోవడం లానే ఉంటుంది. ఖాట్మాండులోని థామెల్ ఏరియాలో ఉన్న హాస్టల్స్‌లో ఉంటే అక్కడుండే వైబ్రెంట్ లైఫ్‌ని దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కొత్త పరిమళాలతో నిండి ఉంటాయి. పోఖరాలో సరస్సు పక్కనే ఉండే రిసార్ట్స్‌లో స్టే చేస్తే, పొద్దున్నే లేచే సరికి కనిపించే మౌంటెన్ వ్యూస్ మనసును ఉల్లాసపరుస్తాయి. ఇక్కడ రిసార్ట్స్‌లో ఉండే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అక్కడుండే చెట్ల మధ్య, చల్లని గాలి మధ్య స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది.ఏం చూడాలి?నేపాల్‌లో ప్రతీ మూమెంట్ స్పెషల్. భక్తుపూర్లోని ప్రాచీన వీధులు, అక్కడుండే ఆర్కిటెక్చర్ చూస్తే మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్లామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాగర్‌కోట్ నుంచి కనిపించే ఎవరెస్ట్ రేంజ్ వ్యూస్ ట్రిప్‌కి ఒక హైపాయింట్లా ఉంటుంది. సమ్మర్లో అక్కడుండే గ్రీనరీ, మబ్బుల దోబూచులాట చూడటానికి చాలా బాగుంటాయి. పశుపతినాథ్ దగ్గర ఈవినింగ్ హారతి చూడటం, అక్కడి ఆట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడం ఒక గొప్ప ఎక్స్‌పీరియెన్స్.ఏం తినాలి?నేపాల్‌లో ప్రతీ ముద్ద ఒక జ్ఞాపకంలా మిగిలి΄ోతుంది.ఇక్కడ మోమోస్ తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఒక యూనిక్ ఇమోషన్. మోమోస్ మాత్రమే కాదు, లోకల్ ఎక్స్‌పీరియెన్స్ ఆ రుచి మనసుకు హత్తుకుంటుంది. ట్రెడిషనల్ దాల్ భాట్ మనం తినే థాలిని పోలి ఉంటుంది. హిమాలయన్ స్పైసెస్ వల్ల కొత్త రుచి వస్తుంది. ఎండాకాలం బేవరేజెస్ అండ్ టీ వెరైటీలు రిఫ్రెషింగ్లా ఉంటాయి. వీటితో పాటు క్రిస్పీ సెల్ రోటీ, యోమారి లాంటి స్వీట్ డెలికసీస్ నేపాల్ ఆథెంటిక్ టేస్టును చూపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్‌లో దొరికే చోయిలా, చాటామరి అనే నేపాల్ పిజ్జాను పర్యాటకులు బాగా ఇష్టపడతారు.నేపాల్ యాత్ర బడ్జెట్ వివరాలునేపాల్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు 5 డేస్ ప్లాన్ చాలా బాగుంటుంది. టోటల్ ట్రిప్ బడ్జెట్ పర్ పర్సన్ వచ్చేసి మినిమం రూ.20 వేల అనుకుంటే, మ్యాక్సిమమ్ అనేది మీ ట్రావెల్ స్టైల్, రూమ్ అండ్ ఫుడ్, ఇతర ఖర్చులను బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా చెప్పాలంటే ఒక వ్యక్తికి వారం రోజుల నేపాల్ యాత్రకు యావరేజ్ రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకు ఫ్లైట్ చార్జీలు సీజన్, ప్రయాణించే క్లాసును బట్టి రూ.35 వేల నుంచి రూ.51 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రూమ్స్ విషయానికి వస్తే రూ.500కు కూడా రూమ్స్ లభిస్తాయి. కానీ అందులో సేఫ్టీ ఇష్యూస్ అండ్ సదు΄ాయాల కొరత ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ సమస్యే కాదు అనుకుంటే రూ.10 వేలకు కూడా రూమ్స్ లభిస్తాయి.ఇక ఫుడ్ కాస్ట్ విషయానికి వస్తే యావరేజ్‌గా రోజుకు రూ.600 నుంచి రూ.1500 వరకు మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్‌ను బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ట్రావెలర్స్ కోసం గెస్ట్ హౌజెస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి.ఎవరెస్ట్, కైలాస శిఖర దర్శనంనేపాల్ నుంచి ఎవరెస్ట్ అండ్ పవిత్ర కైలాస పర్వత శిఖరాన్ని చూడటం ఒక తీయని అనుభూతిగా మిగిలి΄ోతుంది. ఖాట్మాండు నుంచి ఎర్లీగా మౌంటెన్ ఫ్లైట్ ఎక్కితే ఎవరెస్ట్‌ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఎవరెస్ట్‌ని చూసేందుకు ఫ్లైట్స్ ఉన్నా, కైలాస పర్వత దర్శనం కోసం హుమ్లాలోని లిమి ప్లాచా వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి చైనా వీసా లేకుండా దూరంగా ఉన్న కైలాస మానస సరోవర్‌ని కళ్లారా చూడవచ్చు.వీసా అవసరం లేదుభారతీయులకు నేపాల్ వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్టు ఉంటే సరి΄ోతుంది. డిజిటల్ కాపీలను కాకుండా ఒరిజినల్ తీసుకెళ్లండి. ఎందుకంటే డిజిటల్ కాపీలు, ప్రింటౌట్లు, డిజిలాకర్ వర్షన్లను బార్డర్స్ అండ్ ఎయిర్΄ోర్టుల్లో యాక్సెప్ట్ చేయరు. మరో విషయం ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్స్‌గా అంగీకరించరు.తెలుసుకోవాల్సిన విషయాలు 1. ప్రపంచంలోని టాప్ 14 అత్యంత ఎతైన పర్వతాల్లో 8 నేపాల్‌లోనే ఉన్నాయి.2. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన లుంబిని నేపాల్‌లోనే ఉంది.3. నేపాల్ ఫ్లాగ్ ప్రపంచంలోనే యూనిక్ షేప్‌లో ఉంటుంది.4. ఇక్కడ నేలీ భాషతోపాటు చాలామంది హిందీ, ఇంగ్లిష్ మాట్లాడుతారు.5. ఇండియన్ కరెన్సీని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు.ఎండాకాలంలోవెళ్తే మాత్రంనే;ల్ సమ్మర్ ట్రిప్ వెళ్తే మాత్రం బ్రెతబుల్ కాటన్ క్లోత్స్, ఒక లైట్ జాకెట్ తీసుకెళ్లండి. వెళ్లే ముందు వాతావరణం అప్డేట్స్ తెలుసుకోవడం మరవకండి.ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు నోట్: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ అప్టేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు. (చదవండి: ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..) -
టిక్కెట్ల రద్దు ఛార్జీల దోపిడీపై కేంద్రం సీరియస్
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు(ఓటీఏ) వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న భారీ రద్దు చార్జీల (క్యాన్సిలేషన్ ఛార్జీలు) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. విమానయాన సంస్థలు నిర్ణయించిన రుసుముల కంటే అదనంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతో పాటు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తక్షణమే రంగంలోకి దిగి అన్ని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.పారదర్శకతకు పాతర.. చట్టప్రకారం చర్యలు!ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆన్లైన్ బుకింగ్ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘విమానయాన సంస్థలు అధికారికంగా వసూలు చేసే ఛార్జీల కంటే ఎక్కువగా లేదా బుకింగ్ సమయంలో వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇష్టారాజ్యంగా అదనపు రద్దు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే అంశంపై విచారణకు ఆదేశించాం. ఇటువంటి చర్యలు మార్కెట్లో పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు.ఒకవేళ విచారణలో ఈ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినట్లు లేదా అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడినట్లు తేలితే.. ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బాధితుల తరఫున సీసీపీఏ ద్వారా ‘క్లాస్ యాక్షన్’ (ఉమ్మడి చట్టపరమైన చర్యలు) తీసుకునేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తేజీందర్ బగ్గా చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరుగా ఎయిర్‌లైన్ సంస్థ ద్వారా బుక్ చేసుకునే టికెట్ రద్దు ఛార్జీలకు, థర్డ్-పార్టీ ఆన్లైన్ ట్రావెల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే ఛార్జీలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని ఆయన ఆధారాలతో సహా పోస్ట్ చేశారు.విచారణ పరిధిలోకి అన్ని ప్లాట్ఫామ్లుకేవలం ఒక్క సంస్థపైనే కాకుండా దేశంలో సేవలందిస్తున్న అన్ని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ల (ఉదాహరణకు మేక్మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, క్లియర్‌ట్రిప్, యాత్ర, అగోడా మొదలైనవి) రద్దు విధానాలు, వారు విధిస్తున్న హిడెన్ ఛార్జీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగనుందని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఫ్రీ బస్సుతో కేరళ ఖజానాకు చిల్లు?
తిరువనంతపురం: కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (యూడీఎప్) ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఒకవైపు ఆడపడుచుల్లో ఆనందం నింపుతున్నా.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూన్ 15 నుంచి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు కానున్న ఈ పథకంతో అటు రవాణా వ్యవస్థకు, ఇటు రాష్ట్ర ఖజానాకు మోయలేనంత ఆర్థిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ఉరితాడు!కేరళలో దాదాపు 80 శాతానికి పైగా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల పైనే ఆధారపడి ఉన్నారు. మహిళలకు కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, తమ బస్సుల్లో కేవలం విద్యార్థులు మాత్రమే మిగులుతారని, ఇది ప్రైవేట్ బస్ సెక్టార్‌ను నాశనం చేస్తుందని ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీసం డీజిల్ కొట్టించడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. గోపీనాథన్ వాపోతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు వారు తెలిపారు.అప్పుల కుప్పగా మారనున్న కేరళ?ఈ ఉచిత హామీతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ఈ తరుణంలో.. అదనపు సంక్షేమ పథకాలతో సబ్సిడీ భారం లక్ష కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉందని, తద్వారా అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కేఎస్ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పొరుగు రాష్ట్రాల పాఠాలు ఏవి?కర్ణాటకలో అమలు చేస్తున్న ‘శక్తి’ పథకానికి ఏటా రూ. 5,300 కోట్లు ఖర్చవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణ హామీతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలందరికీ కాకుండా, మత్స్యకార్మికులు, కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తే ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురుకావని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి -
సమ్మర్ ట్రిప్స్‌లో ఈ కిట్ తప్పనిసరి!
సమ్మర్ వెకేషన్స్ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్స్, జలపాతాలు, బీచ్ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్ కాబట్టి చిన్ననాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్‌ను స్పాయిల్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, ఫ్యామిలీ టూర్స్, పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కిట్ అనేది తప్పనిసరి!చాలా మంది బట్టలు, చార్జర్స్, కెమెరా ప్యాక్ చేస్తారు కానీ ఎమర్జెన్సీకి పనికొచ్చే వస్తువులు మర్చిపోతారు. కానీ మన జర్నీలో ఈ కిట్ ఒక సూపర్ హీరోలా అవసర సమయంలో ఆదుకుంటుంది అని చాలా మందికి తెలియదు. ప్రయాణంలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేందుకు మీ వద్ద ఈ కిట్ మెయింటేన్ చేయడం మరవకండి.ఎమర్జెన్సీ కిట్‌లో ఏముండాలి?ఈ ఎమర్జెన్సీ కిట్‌లో తప్పకుండా స్పేర్‌గా ఒక వాటర్ బాటిల్, కొన్ని ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. అందుకే రీయూజబుల్ బాటిల్‌తో ΄ాటు ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ క్యారీ చేయండి.బేసిక్ మెడిసిన్స్.. తలనొప్పి ట్యాబ్లెట్స్, ఫీవర్ మెడిసిన్, మోషన్ సిక్నెస్ ట్యాబ్లెట్స్, ఆసిడిటీ రెగ్యులేటర్ ట్యాబ్లెట్స్, బ్యాండ్ ఎయిడ్స్, యాంటిసెప్టిక్ క్రీమ్ తప్పకుండా ఉండాలి. పిల్లలతో వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇవన్నీ తీసుకున్నాక అవసరమైతే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించడం మరవకండి!సన్‌స్క్రీన్, క్యాప్... మన తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, క్యాప్ లేకపోతే వేడికి చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్ బ్యాంక్ అండ్ టార్చ్ ... కొండప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్తే చార్జింగ్ పేయింట్స్ లభించకపోవచ్చు. పవర్ బ్యాంక్, చిన్న టార్చ్ లైట్ చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు సాధారణమే.వెట్ వైప్స్, శానిటైజర్... రోడ్ ట్రిప్స్‌లో హైజీన్ మెయింటేన్ చేయడానికి వెట్ వైప్స్ చాలా ఉపయోగపడతాయి. శానిటైజర్ మీ బ్యాగ్‌లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.చిరుతిళ్లు ... బిస్కిట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ బార్స్ లాంటి స్నాక్స్ క్యారీ చేయడం మరవకండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం రోడ్ ట్రిప్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఉదయం త్వరగా బయల్దేరి ఎండ పెరిగేలోపు ప్రయాణించండి. తరువాత సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ ప్రయాణం మరింత కంఫర్టబుల్‌గా సాగుతుంది. (చదవండి: చిన్న నది.. పేద్ద కథ!) -
46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!
భారతదేశ పర్యటన గురించి ఓ విదేశీ యాత్రికుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎన్నో దేశాలను పర్యటించానని, కానీ భారత్ పర్యటన తన ప్రయాణ అనుభవాన్నే మార్చేసిందంటూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో the_globedigger గా ప్రసిద్ధి చెందిన జెఫ్ జోసీకి భారతదేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ పర్యటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించారు. తాను మొత్తం 46 దేశాలను పర్యటించానని, ఒక యాత్రికుడికి విజయవంతమైన పర్యటన అంటే..ఎలాంటి ఆటంకాలు లేని ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అని అర్థం. కానీ భారతదేశంలో చేసే ప్రయాణం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. అంతేగాదు ఇక్కడ ప్రయాణం చాలా అరుదుగా సులభంగా ఉంటుందన్నారు. ఇక్కడ పర్యటన సౌకర్యానికి చాలా దూరంగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లే..ఆ గమ్యస్థానాన్ని అత్యంత అపురూపమైనదిగా మార్చేస్తాయని నొక్కి చెప్పారు. అలాగే భారత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమమైన వీధి ఆహారాలు, ప్రపంచస్థాయి బీచ్‌లు ఉన్నాయిన పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆయన గోల్డెన్ టెంపుల్‌తో సహా "ప్రముఖ" దేవాలయాలను సందర్శించడం చూపించారు. ఆయన జైపూర్‌లోని హవా మహల్, ఆగ్రాలోని తాజ్ మహల్, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ను కూడా సందర్శించారు. 46 దేశాలు పర్యటించిన తర్వాత భారత్ తనకు ప్రయాణం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేసింది అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఇక్కడ పర్యటన అంత సులభమైన గమ్యస్థానం కాదు, సౌకర్యవంతంగా ఉండకపోయినా..మదిలో నిలిచపోతుంది అంటూ భారత్ పర్యటనపై పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే భారత్ మనల్ని నెమ్మదించేలా, పరిస్థితులకు అలవాటు పడేలా చేయడమే గాక ప్రపంచాన్ని విభిన్నంగా చూపించేలా చేస్తుందని, ఓ పర్యాటకుడు చవి చూడాల్సింది కూడా ఇదేనంటూ భారత్‌పై ప్రశంసంల వర్షం కురిపించారు. నెటిజన్ల కూడా ఆయనతో ఏకీభవిస్తూనే..ఈ నేలపై మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Geoff Josey (@the_globedigger) (చదవండి: ఆ ట్రైన్స్ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు ..అదొక ఎక్స్‌పీరియెన్స్) -
ఆ ట్రైన్స్ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు ..!
రైలు ప్రయాణం మనం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే అనుకుంటాం. కానీ చాలా మందికి ఇది ఒక ఇమోషన్. విండో పక్కనే కూర్చుని బయటకు చూస్తుంటే కనిపించే పచ్చని పర్వతాలు, మబ్బుల్లో మాయం అయ్యే ట్రాక్స్, టన్నెల్స్‌లో ఉన్న చీకటి నుంచి వెలుగులోకి వెళ్లే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్.. ఇవన్నీ కలిసి ఒక మేజికల్ అనుభవాన్ని క్రియేట్ చేస్తాయి.ఈ మ్యాజికల్ మూమెంట్స్‌ని ఇంకా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి భారత దేశంలో హెరిటేజ్ రైల్వేస్. ఇవి సింపుల్‌గా ట్రైన్స్ కాదు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్తున్న టైమ్ మెషన్స్ లాంటివి. బ్రిటిష్ కాలంలో మరీ ముఖ్యంగా 19 నుంచి 20వ శతాబ్దంలోనే భారత దేశంలో అత్యంత కఠినమైన ప్రాంతాల్లో రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆధునిక సాంకేతికత లేకపోయినా ఈ దారులను ఏర్పాటు చేయడం ఒక ఇంజినీరింగ్ అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ ట్రాక్స్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్లనే అవి హెరిటేజ్ రైల్వేస్‌గా గుర్తింపు పొందాయి. ఈ దారుల్లో కొన్ని అంతర్జాతీయంగా కూడా పేరుపొంది యునెస్కోలో చోటు సంపాదించాయి. నిజానికి ఈ ట్రైన్స్స్పీడ్ చాలా తక్కువ. ఇందులో కొన్ని ట్రైన్లు 10 నుంచి 30 కిమీ వేగంతో మాత్రమే వెళ్తాయి. కానీ ఇందులో ప్రయాణించేవారు వేగం కోసం కాకుండా చక్కని అనుభూతి కోసం చాలా దూరం నుంచి వస్తుంటారు.నీలిగిరి మౌంటెన్ రైల్వేసౌత్ ఇండియాలో ఉన్న నీలిగిరి మౌంటెయిన్ రైల్వే ఒక అందమైన జర్నీ అనుభవాన్ని ఇస్తుంది. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు వెళ్లే ఈ బ్లూ ట్రెయిన్ మన దేశంలో ఇప్పటికీ ఆవిరితో నడిచే రైల్వే వ్యవస్థలో ఒకటిగా నిలుస్తోంది. ఉదయం వేళలో పొగ మంచులో అటవి అందాలు, జలపాతాల మధ్యలో వెళ్తుంటే ఈ జర్నీ ఒక డ్రీమ్ సీక్వెన్స్‌లా అనిపిస్తుంది. మూవీలో ఐకానిక్ విజువల్స్ కూడా ఇక్కడే షూట్ అయ్యాయి.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్భారత దేశంలో హెరిటేజ్ జర్నీస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్. 1881లో ప్రారంభమైన ఈ టాయ్ ట్రెయిన్, న్యూ జల్పైగురి నుంచి డార్జీలింగ్ వరకు వెళ్తుంది. టీ గార్డెన్ల మధ్యలో నెమ్మదిగా తిరుగుతూ వెళ్తుంది ఈ ట్రెయిన్. బటాసియా లూప్ దగ్గర సర్క్యులర్గా తిరిగే మూమెంట్ చాలా ఫేమస్. రోడ్డు పక్కనే వెళ్తుంది కాబట్టి కొన్ని చోట్ల కార్లు, వ్యానులు కూడా ఈ ట్రైనుకు సమాంతరంగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. బాలీవుడ్ సినిమా సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఈ జర్నీలో ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్కార్డ్లా అనిపిస్తుంది.హెరిటేజ్ ట్రైన్ ఎందుకు భిన్నం అంటే..’మన రెగ్యులర్ ట్రైన్స్ వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ఉంటాయి. కానీ హెరిటేజ్ ట్రైన్స్‌లో ప్రధాన లక్ష్యం వేగం కాదు. అనుభవం, అనుభూతి, మెమోరీస్ క్రియేట్ చేయడం. స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ స్లో మూమెంట్ వల్ల ప్రతీ క్షణాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది, సాధారణ ట్రైన్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ట్రైన్స్ చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే ఈ జర్నీని చాలా మంది ట్రావెల్ కాదు ఇది ఒక ఎక్స్‌పీరియెన్స్ అని వర్ణిస్తారు.ఆసక్తికరమైన విషయాలుఈ హెరిటేజ్ ట్రైన్ జర్నీలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ట్రావెల్ రీల్స్ చూస్తే ఈ ట్రైన్ విజువల్స్ రెగ్యులర్‌గా కనిపిస్తాయి. స్లోగా వంపులు తిరుగుతూ వెళ్లడం, టన్నెల్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ షాట్స్, ఫాగ్ మధ్యలో ట్రాక్స్.. ఇవన్నీ రీల్స్‌కి పర్ఫెక్ట్ సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. అందుకే ట్రావెల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకి ఈ ప్రయాణాలు ఒక సువర్ణావకాశంలా అనిపిస్తాయి.సింపుల్ ట్రావెల్ ప్లాన్ఈ జర్నీస్ని ప్లాన్ చేయడానికి సింపుల్‌గా 2–3 రోజుల ఐటిసిఆర్ ఫాలో అవ్వొచ్చు. మొదటి రోజు బేస్ లొకేషన్‌కి రీచ్ అవ్వడం, రెండవ రోజు హెరిటేజ్ ట్రెయిన్ జర్నీ, మూడవ రోజు రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే రష్ లేకుండా చక్కగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే టైమ్ లభిస్తుంది.బుకింగ్ ఎలా?ఈ జర్నీస్ ప్లాన్ చేయడానికి టికెట్స్‌ని ఆన్లైన్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా.. సుమారు రూ.500 నుంచి రూ.1500 మధ్య ఉంటాయి. వేసవిలోనూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సీనరీస్ చాలా అందంగా ఉంటాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.కాంగ్రా వ్యాలీ రైల్వేకాంగ్రా వ్యాలీ రైల్వే అనేది చాలా తక్కువ మందికి తెలిసిన ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ. పఠాన్‌కోట్ నుంచి జోగిందర్ నగర్ వరకు వెళ్లే ఈ ట్రైన్ రూట్లో ధౌలాధర్ మౌంటెయిన్ రేంజ్ వ్యూస్ డైరెక్ట్‌గా కనిపిస్తాయి.క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల ఈ జర్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్‌ని చాలా కామ్‌గా ఎంజాయ్ చేయాలి అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది ఒక స్వర్గంలాంటిది.మాతెరన్ హిల్ రైల్వేమహారాష్ట్రలో ఉన్న మాతెరన్ హిల్ రైల్వే కూడా చాలా యూనిక్ అని చెప్పవచ్చు. మాతెరన్లో వాహనాలను అనుమతించరు. అందుకే ఇక్కడి టాయ్ ట్రెయిన్ ఒక ప్రధాన రవాణా సాధనంగా మారిపోయింది. సన్నని గేజ్ ట్రాక్‌పై చుట్టపక్కల వనాల్లోంచి టైన్ వెళ్తోంటే పక్షుల శబ్దాలు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఈ జర్నీలో హైలైట్‌గా నిలుస్తాయి.కాల్కా–షిమ్లా రైల్వేహిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాల్కా షిమ్లా రైల్వే అనేది బ్రిటిష్ ఇంజినీరింగ్ బ్రిలియన్స్కు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. 1903లో స్టార్ట్ అయిన ఈ రూట్లో 100కి పైగా టన్నెల్స్, 800కి పైగా బ్రిడ్జిలు ఉంటాయి. బారోగ్ టన్నెల్ అనేది అత్యంత పొడవైన టన్నెల్‌గా ప్రసిద్ధి చెందింది. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు(చదవండి: అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..! మనసును హత్తుకునే బ్యూటిఫుల్ ప్రదేశం) -
అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..!
ఒక ఊరిలో నడుస్తోంటే ప్రతీ ఒక్కరు రెండు సార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది?! కేరళలోని మలప్పురం దగ్గర ఉండే ‘కోడిని’ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. మొదటిసారి ట్రావెల్ చేసే వారికి ఇది చాలా వింతగా, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. స్పెషల్ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనే వారికి ఇది చాలా ఈజీగా, మనసును హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అద్దం ముందు నిలబడినట్టుగా ప్రతీ చోట జనాలు కనిపిస్తూ ఉంటే ఎవరికరైనా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా!అక్కడ అడుగు పెట్టగానే పచ్చని పొలాలు, చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతాయి. ఆర్కిటెక్చర్ చాలా సింపుల్‌గా, మన ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ తిరిగే కవల పిల్లలు చూస్తుంటే ఒక్కసారిగా మనం ఎక్కడున్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఆ గాలిలో నడుస్తుంటే మనం ఒక వింత స్వప్నంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ప్రతీ తోటలో, ప్రతీ ఇంటి ముందు ఒక కొత్త కళ కనిపిస్తుంది. మనుషుల చిరునవ్వులు, వారి అమాయకత్వం మనసుకు చాలా హాయిని ఇస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుకవలల నగరం లేదా ట్విన్ టౌన్ అని పిలిచే ఈ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి స్థానికులతో మాట్లాడటం ఒక గొప్ప అనుభవం. దగ్గరలో ఉన్న కడలుండి బర్డ్ శాంక్చువరీలో రంగురంగుల పక్షులను చూడటం లేదా నీలాంబుర్లోని తోటలను సందర్శించడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.ఏం తినాలి?కేరళ స్థానిక రుచులు అయిన వేడి వేడి పుట్టు, కడల కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ అని చెప్పవచ్చు. స్థానిక టీ స్టాల్స్ దగ్గర లభించే వేడి భోజనం, బనానా ఫ్రిట్టర్స్ అక్కడ కూర్చొని తినడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?సెప్టెంబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో కూడా వెళ్లవచ్చు. అప్పుడూ అక్కడి పచ్చదనం మనసును హాయిగా ఉంచుతుంది. కానీ చలికాలంలో వెళ్లడం ఉత్తమం. మీరు ఎప్పుడు వెళ్లినా కూడా స్థానికులు చాలా మర్యాదగా పలకరిస్తారు. మొత్తం ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కోజికోడ్‌కు డైరెక్ట్ విమానాలు ఉంటాయి. ట్రైన్లో వెళ్తే కోజికోడ్ లేదా తిరూర్ దగ్గర దిగి సుమారు 40 కిమీ రోడ్ జర్నీ చేయాలి. బస్సులో వెళ్లాలని ప్లాన్ చేస్తే కోజికోడ్ లేదా మలప్పురంకి డైరెక్ట్ సర్వీసులు ఉంటాయి. అక్కడి నుంచి లోకల్ బస్ లేదా క్యాబ్‌తో కోడిని ఈజీగా చేరుకోవచ్చు. ఈ ప్రయాణం మనలోని క్యూరియాసిటీకి ఒక సమాధానంతోపాటు ప్రకతితో మమేకం అయ్యే ఒక అవకాశం. ప్రపంచంలోని వింతల గురించి ఆలోచించినప్పుడు కోడిని మీకు తప్పకుండా గుర్తుకు రావాలి అంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్లిరావాలి మరి!.(చదవండి: కేదార్నాథ్: మంచుకొండల్లో ఓంకార నాదం) -
లేక్ పక్కనే బొమ్మరిల్లు లాంటి గ్రామం..!
మనం చిన్నప్పుడు చూసిన ఫైయిరీ టేయిల్స్లో ఉండే గ్రామాలు నిజంగా ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? హాల్స్టాట్కి వెళ్లినప్పుడు మనకి ఆ ఫీలింగే కలుగుతుంది. లేక్ పక్కనే ఉన్న హౌజెస్ చూస్తుంటే మనం ఏదో ఒక అందమైన పిక్చర్ ఫ్రేమ్‌లో ఉన్నాము అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైమ్ ట్రావెలర్స్‌కి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతను ఇచ్చే చక్కని ప్రదేశం.ఆస్ట్రియాలోని స్నో మౌంటెన్స్ అండ్ హాల్‌స్టాట్ లేక్ వాటర్ మధ్య పోల్చిచూస్తే మనకి ఒక కొత్త కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. కొండాకోనల్లో నుంచి లేక్ వైపు చూస్తూ కూర్చోవడం ఒక పెద్ద రిఫ్లెక్షన్. ఇక్కడి నారో స్ట్రీట్స్‌లో నడుస్తుంటే నేచర్ సౌండ్స్ తప్పా ఇంకేమీ వినిపించవు. ప్రతీ ఇల్లు పూలతో అలంకరించుకుని ఉంటుంది. వుడెన్ ఆర్కిటెక్చర్‌తో చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక కళాత్మక వాతావరణం కనిపిస్తుంది.సందర్శనీయ స్థలాలుఇక్కడ ఉన్న సాల్ట్ మైన్ టూర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని హిస్టరీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. స్కైవాక్ వ్యూ ఫ్లాట్‌ఫామ్ నుంచి విలేజ్ మొత్తం చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. హాల్స్టాట్టర్ లేక్‌లో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న పర్వతాలను ఆ నీటిలో నుంచి చూడటం అనేది మర్చి΄ోలేని అనుభూతిగా మిగిలి΄ోతుంది.ఏం తినాలి?లోకల్‌గా వెతికి ఫ్రెష్ డిషెస్‌ను ఆస్వాదిస్తే ఆ ఫ్రెష్‌నెస్ ఏంటో తెలుస్తుంది. దీంతో΄ాటు ఇక్కడి ట్రెడిషనల్ పేస్ట్రీస్ అండ్ హాట్ కాఫీ తింటూ లేక్ సైడ్ కూర్చోవడం ఒక స్పెషల్ ఎక్స్‌పీరియె¯Œ ్సగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి ? ఏప్రిల్ అండ్ మే నెలల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఈ సమయంలోనే ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. స్థానిక అందాలు చూడచక్కగా కనిపిస్తాయి.మార్నింగ్ సమయంలో బయటకు వస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడి లోకల్స్ చాలా కామ్‌గా ఉంటారు. ట్రావెల్ కంఫర్ట్ చాలా ఎక్కువ. సింపుల్‌గా నడుస్తూ ఈ విలేజ్ అందాలు చూస్తుంటే టైమ్ సైన్సు తెలియదు.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి వియన్నాకి కనెక్టింగ్ విమానాలు ఉంటాయి. వియన్నా నుంచి ట్రెయిన్ లేదా కార్ జర్నీ ద్వారా 3 నుంచి 4 గంటల్లో హాల్‌స్టాట్ చేరుకోవచ్చు.హాల్‌స్టాట్ మనల్ని స్లో ట్రావెల్ వైపు తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా ఆ లేక్ అండ్ అందమైన ఇళ్లు మనకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. (చదవండి: పచ్చని స్వర్గధామం..సమ్మర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం!) -
అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి..!
ఎన్నో రైళ్ల జర్నీలు చేసి ఉంటారు. కానీ చైనాలో ఆ ప్రదేశంలోని రైలు జర్నీ ఓ ప్రత్యేక అనుభూతి మాత్రమే కాదు, ఆస్ప్రతిలో ఉన్నామా అనే భావన వస్తుంది. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆక్సిజన్ మాస్క్ ధరించి తీరాల్సిందే. లేదంటే కష్టం. ఎందుకంటే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గమైన చైనా క్వింగ్హై-టిబెట్ రైల్వేలో కచ్చితంగా ఆక్సిజన్ మాస్క్ ధరించి ప్రయాణించాలి. ఆ రైలు "ఆసుపత్రి తరహా" ఏర్పాటుతో వస్తుంది. ఈ అసాధారణ ప్రయాణం మిమ్మల్ని టిబెట్ రాజధాని అయిన లాసా వరకు తీసుకువెళుతుంది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైగా పొడవైన ఈ రైలు మార్గంలో అధిక భాగం సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల (13,123 అడుగులు) ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం టాంగ్గులా కనుమ వద్ద 5,072 మీటర్ల(16,640 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ఎత్తులో, సముద్ర మట్టంతో పోలిస్తే గాలిలో సుమారు 40 శాతం తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సునాయాసంగా చేయడానికి, అలాగే అధిక ఎత్తులో ప్రయాణించేలా సహాయం చేయడానికి రెండు ప్రధాన ఆక్సిజన్ వ్యవస్థలను రూపొందించారు.మొదటిది డిస్పర్షన్ ఆక్సిజన్ సిస్టమ్. ఈ వ్యవస్థ రైలులోని ఎయిర్ కండిషనింగ్‌లో అదనపు ఆక్సిజన్‌ను కలుపుతుంది, తద్వారా ప్రతి కోచ్ లోపల మొత్తం ఆక్సిజన్ స్థాయి సుమారు 23.5 శాతానికి పెరుగుతుంది. రైలు సాధారణంగా గోల్ముద్ (2,829 మీ) చేరుకున్న తర్వాత ఈ వ్యవస్థను ప్రారంభిస్తుంది.రెండవది డైరెక్ట్ ఆక్సిజన్ అవుట్లెట్ సిస్టమ్. ఇది ప్రయాణికులు తమ సీట్ల దగ్గర ఉన్న అవుట్లెట్లకు అనుసంధానించబడిన చిన్న పైపుల ద్వారా ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. హార్డ్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్‌కు దాని పక్క గోడల వెంబడి ఆక్సిజన్ అవుట్లెట్లు అమర్చబడి ఉంటాయి.హార్డ్ సీట్ కోచ్‌లలో, ఆక్సిజన్ అవుట్లెట్లు క్యారేజీ గోడల వెంబడి క్రమమైన విరామాలలో లేదా కొన్నిసార్లు సీట్ల కిందకూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి అవుట్‌లెట్‌ను సుమారు 4 నుంచి 6 మంది ప్రయాణికులు పంచుకుంటారు. సాఫ్ట్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో, ప్రతి బెర్త్‌కు మంచం దగ్గర దాని స్వంత ఆక్సిజన్ అవుట్లెట్ ఉంటుంది.ఈ రైలు మార్గం ప్రకృతి సౌందర్యానికి నెలవు..కింగ్హై-టిబెట్ రైలు ద్వారా లాసా చేరుకునే ప్రయాణం చాలా అందమైనది, ప్రత్యేకమైనది. ఈ రైలు బీజింగ్, షాంఘై, చెంగ్డూ, షినింగ్ వంటి నగరాల నుంచి టిబెట్‌లోని లాసా వరకు వెళుతుంది.ఈ ప్రయాణంలో, ప్రయాణికులు మార్గం పొడవునా ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వారు విశాలమైన నీలి ఆకాశాన్ని,తెల్లని మేఘాలను చూస్తారు. గాడిదలు, గొర్రెల మందలతో కూడిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఈ రైలు కున్లూన్ పర్వత శ్రేణితో సహా మంచుతో కప్పబడిన పర్వతాలు, యాంగ్జీ వంటి ప్రధాన నదుల గుండా కూడా వెళుతుంది. ఈ ప్రయాణం హోహ్ షిల్ నేషనల్ నేచర్ రిజర్వ్ వంటి మారుమూల సహజ ప్రాంతాల గుండా సాగుతుంది.సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్ల కోసం ఢిల్లీ నుంmr లాసాకు ప్రయాణిస్తుంటే, బీజింగ్ మీదుగా విమానంలో వెళ్లవలసి ఉంటుంది. దీనికి సుమారుగా రూ. 55,000 ఖర్చవుతుంది. బీజింగ్ నుంచి లాసాకు రైలులో వెళ్లాలి. ధర మీరు ఎంచుకునే సీటు రకంపై ఆధారపడి ఉంటుంది.మూడు రకాల సీట్లు ఉన్నాయి. సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక, దీనిలోని ప్రతి క్యాబిన్లో నాలుగు బెర్త్‌లు ఉంటాయి. కంపార్ట్మెంట్లు విశాలంగా ఉంటాయి. లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్, టీవీ స్క్రీన్, లగేజీ పెట్టుకునే స్థలం, ఆక్సిజన్ అవుట్లెట్ల వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పై బర్త్‌కు సుమారుగా రూ. 675, కింది బంక్‌కు రూ. 700 ఖర్చవుతుంది.తరువాతది హార్డ్ స్లీపర్. ప్రతి కంపార్ట్మెంట్లో ఆరు బెర్త్‌లు ఉంటాయి, దిండ్లు, దుప్పట్లు అందించబడతాయి. గోప్యత కోసం తలుపు ఉండదు, మరియు స్థలం ఇరుకుగా ఉంటుంది. ధరలు పై బర్త్‌కు రూ. 425 మధ్య బర్త్ రూ. 440, కింది బంక్‌కు రూ. 450 నుంచి ప్రారంభమవుతాయి.హార్డ్ సీట్లు అత్యంత చౌకైన సుదీర్ఘ ప్రయాణానికి మాత్రమే సాధారణ సీటింగ్‌ను అందిస్తాయి. దీనికి సుమారుగా రూ. 212 ఖర్చవుతుంది. View this post on Instagram A post shared by marina guaragna (@marinaguaragna) (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
పచ్చని స్వర్గధామం..సమ్మర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం!
కాశ్మీర్ వేసవి అనుభవం కేవలం ఒక ప్రయాణం కాదు.. ప్రకృతి, సంస్కృతి ప్రశాంతత కలిసిన ఒక సజీవ కావ్వధార. ‘భూమిపై స్వర్గం’గా పేరొందిన ఈ ప్రాంతం, వేసవి కాలంలో తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని పర్వత లోయలు, నీలిరంగు సరస్సులు, పూలతో నిండిన తోటలు... ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ను ఒక కలల ప్రపంచంలా మార్చేస్తాయి.. పూలతో నిండి బోట్లుశ్రీనగర్కి ఆభరణంలా వెలుగొందే దాల్ సరస్సు, కాశ్మీర్ పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. శికారా పడవలో సరస్సు మీద నెమ్మదిగా ప్రయాణించడం ఒక మధురమైన అనుభవం. నీటి మీద తేలియాడే తోటలు, పూలతో నిండిన హౌస్బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరిగే తేలియాడే కూరగాయల మార్కెట్ అనుభవం మరచిపోలేనిది. స్థానిక రైతులు తమ పడవలలో తాజా కూరగాయలను విక్రయించే ఈ దృశ్యం, కాశ్మీర్ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తుంది.మొఘల్ తోటలువేసవి ప్రారంభంలో శ్రీనగర్ చుట్టూ ఉన్న తోటలు పుష్పాలతో కళకళలాడుతుంటాయి. టులిప్ ఉత్సవం ఏప్రిల్‌లో ముగిసినా, షాలిమార్ బాగ్ మరియు నిషాత్ బాగ్ వంటి మొఘల్ తోటలు ఇంకా అందంగా వికసిస్తూనే ఉంటాయి. ఈ తోటల్లో విహరించడం ఒక రొమాంటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలోనూ ప్రకృతి అందాల పరిమళం మనసును హత్తుకుంటుంది.పచ్చని స్వర్గధామం..‘పూల మైదానం’గా పేరొందిన గుల్మార్గ్ వేసవిలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మంచు కరిగిపోయిన తర్వాత పచ్చని గడ్డి మైదానాలు విస్తరించి, కనిపిస్తాయి. గుల్మార్గ్ గోండోలా రైడ్ ఆసియాలోనే అత్యంత ఎతైన కేబుల్ కార్లలో ఒకటి. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా, వసతి సదుపాయాలు ఉన్నాయి. ఐఆర్‌సిటితోపాటు ఇతర ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు కూడా ప్యాకేజీని అందిస్తున్నాయి.నాలుగు, ఐదు, ఎనిమిది రోజులకు గాను రూ.20 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కాశ్మీర్ వేసవి అనుభవం ఒక కలలా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది. ప్రకృతి అందాలు, సాంస్కృతిక సంపద, ప్రశాంత జీవనం కలిసిన ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నూతన సంవత్సరాది బోహాగ్ బిహుదేశంలో చల్లని ప్రదేశంగా పేరొందిన అస్సాంలో ఆనందంగా జరుపుకునే సంవత్సరాది పండగ బోహాగ్ బిహె. దీనిని ‘రొంగలీ బిహు’ అని కూడా పిలుస్తారు. ఉత్సాహభరితమైన పండుగగా పేరొందింది ఇది అస్సామీ నూతన సంవత్సరాన్ని, వసంతకాలం ఆగమనాన్నీ సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరాది ఉగాది. అస్సామీల సంవత్సరాది బోహాగ్ బిహు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్ నెల మధ్యలో (అస్సామీ నెల ’బోహాగ్’ మొదటి రోజు) వస్తుంది. దీనిని వాళ్లు వారం రోజుల పాటు జరుపుకుంటారు.పంటల కోసం దేవుని ఆశీర్వాదం..ఈ పండగ వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఏడాది అంతా పంటలు బాగా పండాలని, ఈ రోజున వారు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ‘రొంగలి’ అంటే ఆనందం, రంగుల పండుగ అని కూడా అర్థం.పండగ మొదటి రోజును గోరు బిహు అంటారు. ఆ రోజున ఆవులను, ఎద్దులను పసుపు, ఇతర ఔషధ మూలికలతో కడిగి, పూల దండలు వేసి, పూజలు జరుపుతారు. బెండకాయలు, పొట్లకాయలు తినిపిస్తారు.పండగ రెండవ రోజున మనుహ్ బిహు అంటారు. ఆ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గరకు వెళ్లి, పిఠా అనే సంప్రదాయ వంటకాన్ని, రుచికరమైన పదార్థాలను పంచుకుంటారు.ఆనందంగా నృత్యాలు..యువతీ–యువకులు సంప్రదాయ దుస్తులను అలంకరించుకుంటారు. డ్రమ్స్ వాయిస్తూ, కొమ్ముతో చేసిన వాయిద్యాలతో శబ్ధం చేస్తూ నృత్యం ఆనందంగా చేస్తారు. ఈ ఏడురోజుల పండగను చూడటానికి టూరిస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెళుతుంటారు. (చదవండి: సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!) -
కొత్త బంగారు లోకం..! బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఇది..
యూరోప్‌లో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతంగానే కాదుఅందమైన కిరీటంగా భాసిల్లుతోంది జంగ్‌ఫ్రాజోచ్ భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకున్నట్టుమంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు...ఎండాకాలంలో చల్లని గాలి పలకరింపు.. మాటలకు అందని ప్రయాణానుభూతిని జంగ్‌ఫ్రాజోచ్ అందిస్తుంది. స్వర్గపు తలుపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లామా..! అనే ఆశ్చర్యానందంలో ముంచెత్తుతుంది.స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్ దగ్గర మొదలై.. పచ్చని కొండల మధ్య నుంచి మెల్లిగా మంచు మెరుపుల వైపు వెళ్లే జంగ్‌ఫ్రాజోచ్ ప్రయాణం మనసును మృదువుగా తాకుతోంది. జీవితకాలపు అనుభూతిని అందిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుఐగర్ గ్లేషియర్ నుంచి మొదలై స్పింక్స్ అబ్జర్వేటరీ దాకా వెళ్లే ప్రతీ అడుగు ఒక కొత్త పరిశోధనలా ఉంటుంది. ఐస్ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో నడస్తుంటే మనం ఒక డ్రీమ్ వరల్డ్‌లో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఐస్‌తో చేసిన కళాఖండాలు మనిషి, ప్రకృతి కలిసే చేసే సృజన అద్భుతంగా ఎలా ఆవిష్కరిస్తుందో అర్థం అవుతుంది.ఐస్ ప్యాలెస్‌లో అనుభవాలుగ్లేషియర్ లోపల తవ్విన ఈ టన్నెల్స్‌లో నీలి రంగు మెరుపులు మన కళ్ల ముందు ఒక మేజిక్‌లా కదులుతూ ఉంటాయి. ఇక్కడ గద్ద, ఎలుగుబంటుల రూపంలో చేసిన మంచు శిలలు చాలా సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఉదయం వేళలో ఈ ఐస్ ప్యాలెస్‌కి వెళ్లడం ఎంతో మధురానుభూతిని కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో క్రౌడ్ తక్కువగా ఉంటాయి. ఆ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.ఎక్కడ ఉండాలి?ఇంటర్లేకన్ లేదా గ్రైండెల్వాల్డ్ విలేజెస్లోని ట్రెడిషనల్ స్విస్ చాలెటట్స్ ఉంటే ప్రతీ ఉదయం మంచు కొండలు పలకరిస్తాయి. వుడెన్ వాల్కనీస్ నుంచి కనిపించే వ్యూ, రాత్రి పూట మెరిసే నక్షత్రాలు మనకు మర్చిపోలేని మధురానుభూతులను ఇస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే హోటల్స్‌లో బస ప్రకృతికి దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్‌ని ఇస్తుంది.ఎలా వెళ్లాలి? ప్రయాణం స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి గ్రైండెల్వాల్డ్ టర్మినల్ రీచ్ అయ్యి, అక్కడి నుండి ఐగర్ ఎక్స్‌ప్రెస్ కేబుల్ కార్ ఎక్కితే గంటలోనే పీక్స్ వరకు వెళ్లిపోవచ్చు.ట్రైన్ వెళ్లేప్పుడు విండో సీట్ దగ్గర ఉంటే నేచర్‌లో వచ్చే వ్యూస్‌ని కెమెరాలో బంధించవచ్చు.ఏం చూడాలి?స్పింక్స్ అబ్జర్వేటరీ నుంచి ఆలెష్ గ్లేషియర్‌ను చూడటం ఒక సీ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది.యూరోప్‌లోని పెద్ద గ్లేషియర్‌లో అలెష్ గ్లేషియర్ని చూస్తే తెల్లని నదిలా పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తుందా అనిపించక మానదు. మధ్యాహ్నం సమయంలో గ్లేషియర్‌పై సూర్య కిరణాలు ఒక కొత్త రంగును పరిచయం చేస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కనులు సరిపోవు.ఏం తినాలి ?ఇక్కడ చాకొలెట్ షాప్‌లో దొరికే ఫ్రెష్ స్విస్ ఛాకోలేట్స్ ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేస్తాయి. చల్లగా ఉన్న శిఖరాల మధ్యలో వేడిగా ఉండే స్విస్ ఛీజ్ లేదా ట్రెడిషనల్ సూప్ సేవిస్తూ ఉంటే ఆ టేస్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. లిండ్ట్ చాకొలేట్ హెవెన్‌లో దొరికే హాట్ చాకొలేట్ ఆ కోల్డ్ వెదర్లో ఒక వేడిని, ఎనర్జీని ఇస్తుంది. యాక్టివిటీస్స్నో ఫన్ పార్క్‌లో మంచు మీద ప్రయాణం, ఐస్ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో ఫోటోస్ తీసుకోవడం, ఆల్పైన్ సెన్సేషన్ కారిడార్‌లో నడుస్తూ జంగ్‌ఫ్రాజోచ్ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.యూరోప్‌లోని హయ్యెస్ట్ పోస్ట్ ఆఫిస్ నుంచి ఒక పోస్ట్ కార్డు పంపడం మర్చిపోలేని ఙ్ఞాపకంగా. స్పింక్స్ డెక్‌పై నుంచి చుట్టూ ఉన్న పీక్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు.సమ్మర్లో ట్రిప్ ప్లాన్ చేస్తే సన్‌గ్లాసెస్ మర్చిపోకండి. స్నో రిఫ్లెక్షన్ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు (చదవండి: పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్..! అక్కడ సమయం గడవదు..) -
ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఎప్పటినుంచంటే..!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామంటూ రైల్వేకు లేఖ రాసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.కాగా, ఈ పథకం అమలుపై సీఎస్.. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం.. దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాయగా.. తెలంగాణ సర్కార్ లేఖపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ఎంవోయూ పంపించాలని.. పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని వెల్లడించింది.మరోవైపు, యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఇటీవల ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు.తొలుత రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు. -
పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్..!
ఎండాకాలం చల్లని ప్రయాణాలు చేయాల్సిందే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ అయ్యేవారికి కూర్గ్ ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.కూర్గ్‌లో రోడ్ల పక్కనే కాఫీ ప్లాంటేషన్స్ మధ్య మధ్యలో జలపాతాలు, చిన్న చిన్న ఇళ్లతో కలిసి ఒక కామ్ అండ్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఉదయం వేళలో వీచే గాలి కాఫీ ఘుమఘుమలను మోసుకొచ్చే మెసెంజర్‌లా మారి΄ోతుంది.సందర్శనీయ స్థలాలుఅబ్బే ఫాల్స్ దగ్గర నీరు పడే శబ్దంలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. రాజాస్ సీట్ నుండి వ్యాలీ చూస్తూ సూర్యోదయం మెల్లిగా విస్తరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర నేచర్ మధ్య రిలాక్స్ అయ్యే అవకాశం లభిస్తుంది.ఏం తినాలి?కూర్గ్ స్టైల్ మీల్స్‌లో స్పైసెస్ మైల్డ్‌గా, ఫ్లేవర్ రిచ్‌గా ఉంటాయి. ఇక్కడి నాన్ వెజ్ వంటకాలకు స్థానిక మసాలాలే ప్రత్యేకత. ఫ్రెష్ కాఫీ సిప్ చేస్తూ అక్కడి వైబ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు.ఎప్పుడు వెళ్లాలి?అక్టోబర్ నుంచి మార్చి వరకు వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అయితే చాలా మంది ఎండాకాలంలో కూడా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చలికాలంలో అయితే మిస్ట్, గ్రీనరీ, కూల్ బ్రీజ్ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఎండాకాలం ఒక ప్రశాంతమైన అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు, చల్లదనం కోసం కూర్గ్ వెళ్లవచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్లైట్‌లో సుమారు 90 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5–6 గంటలు ప్రయాణించి కూర్గ్‌కు చేరుకోవచ్చు. కూర్గ్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటే గాలిలో కాఫీ సువాసన, ప్రశాంతత గుర్తుకొస్తాయి. అక్కడి స్లో లైఫ్ మనసులో చిరకాలం నిలిచిపోతుంది. బాలి, ఇండోనేషియా..!కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే ఇండోనేషియాలోని బాలి. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసే ట్రావెలర్స్‌కు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే వైబ్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్లో ఒక రిలాక్స్డ్ ఫ్లో ఉంటుంది.బాలి రోడ్ సైడ్‌లో కొబ్బరి చెట్లు, ఆలయాలు, చిన్న కేఫ్స్ కలిసి ఒక నేచురల్ రిథమ్‌ను క్రియేట్ చేస్తాయి. ఉదయం వేళలో పలచని సూర్యకాంతి, సాయంత్ర వేళలో సముద్రం పక్కనే చల్లని గాలి.. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని చాలా కంఫర్టబుల్‌గా మార్చేస్తాయి. నడుస్తూ చూస్తూ వెళ్తే టైమ్ స్లోగా అయి΄ోయిన ఫీలింగ్ కలుగుతుంది.సందర్శనీయ స్థలాలుఉబుద్లో గ్రీనరీ మధ్య ఉన్న ఆలయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తనాహ్ లాట్ ఆలయం సముద్రం పక్కన నిలిచిన దృశ్యంలో ఒక కామ్ ప్రెజెన్స్ ఉంటుంది. ఉలువాటు ఆలయం దగ్గర క్లిఫ్స్ మీద వేవ్స్ చూస్తూ ఉండటం ఒక స్మూత్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది.ఏం తినాలి?బాలిలో నాసి గొరేంగ్ అనే రైస్ డిష్ వార్మ్‌గా, లైట్ స్పైసెస్తో చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. సాటే స్టిక్స్ ఫ్రెష్‌గా గ్రిల్ చేసి పక్కన సాస్‌తో సర్వ్ చేస్తారు. ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసులు అక్కడ నేచురల్‌గా రిఫ్రెషింగ్ ఫీలింగ్‌ను ఇస్తాయి.ఎప్పుడు వెళ్లాలి?ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వెదర్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఈ సమయంలో బీచ్ వాక్స్, టెంపుల్ విజిట్స్, స్ట్రీట్స్‌లో నడవడం ఇవన్నీ మంచి మెమోరీస్‌గా మిగిలిపోతాయి. స్థానికులు నవ్వుతూ పలకరిస్తారు, దీంతో ఈ ప్రదేశం అందరికీ నచ్చేలా అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బాలి కి కనెక్టింగ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. ట్రావెల్ టైమ్ సుమారు 10 నుంచి 12 గంటలు ఉంటుంది. ఎయిర్పోఒర్ట్ నుంచి సిటీకి వెళ్లే రోడ్ జర్నీ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.బాలీలో గడిపిన సమయం ఓ అందమైన జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది. అక్కడి స్లో లైఫ్ రిథమ్ మనసులో మరికొంత కాలం అలాగే నిలిచిపోతుంది.(చదవండి: సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!) -
సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!
దక్షిణ భారతదేశంలో ఎండాకాలం వేడిని భరించలేం అనుకుంటారు. కానీ, వేసవిలోనూ సౌత్‌లో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా, వినసొంపైన పాటలా సాగిపోతుంది. చిక్‌మగళూరు నుంచి వల్పరై వరకు అటు నుంచి అరకు వరకు.. ఈ ప్రదేశాలు వేడిలో కూడా చల్లని ప్రయాణపు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తే వేసవి వేడిని ఇట్టే మర్చిపోతాం. చిరుగాలి పంచే చల్లదనం, నేలంతా పరుచుకున్న పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక .. ఇవన్నీ కలిసి ఈ వేసవిని చిల్‌గా మార్చేస్తాయి.చిక్మగళూరుకర్ణాటకలోని చిక్మగళూరులో ఉదయ వేళలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. పొగ మంచు మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్‌గా ఉండే దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి. స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్ ఎలివేషన్‌లా అనిపిస్తుంది.తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్ మధ్య ఒక ఎండ్లెస్ గ్రీన్ కారిడార్‌లో నడవడంలా ఉంటుంది. చుట్టూ ఉన్న స్లోప్స్ మీద ప్లాంటేషన్ లైన్స్ ఒక రిథమ్‌లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలిం ఒక నిశ్చలమైన దశ్యాన్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్‌లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్ స్పేస్ ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు ప్రదేశాలకు ప్రయాణం.. చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్‌లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్‌లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారి΄ోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?ఈ హిల్ స్టేషన్స్‌లో పెద్ద బిల్డింగ్స్ కన్నా చిన్న హోమ్ స్టేలు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలను వింటూ సమయం గడపడం లాంటిదే.ఇక్కడ ప్రతి మూమెంట్ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్‌పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.అరకు లోయ అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది. వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో పొగ మంచు మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.గాలిలో మాయిశ్చర్ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి.మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్ మధ్య తిరగడం, ఫారెస్ట్ ఎడ్జెస్‌లో కూర్చుని గాలిని ఎంజాయ్ చేయడం ఈ చిన్న మూమెంట్స్ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.సాయంత్రం అయితే సన్‌సెట్ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది.ఏం తినాలి?ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతోపాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.కాఫీ ప్లాంటేషన్ దగ్గర దొరికే ఫ్రెష్ కాఫీని సిప్ చేస్తే ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. చల్లని వాతావరణంలో హాట్ ఫుడ్ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.యాక్టివిటీస్మార్నింగ్ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్ మార్కెట్లో తిరగడం, హిల్ స్లోప్స్‌లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్‌లో కొన్ని మాత్రమే. ఎం. జి.కిశోర్, ప్రయాణికుడు.. (చదవండి: ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!) -
ఆ టెకీది సాహసమా..? నాటకమా..?
కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్‌కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని బిజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్‌గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. ట్రెక్కింగ్ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..ఇలా ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్‌ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్‌లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!) -
ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!
ఫస్ట్ టైమ్ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు. సిటీలో వాక్ చేస్తుంటే పురాతన భవనాలు, రంగురంగుల బాల్కనీలు, కోబుల్ స్టోన్ వీధులు కలిసి ఒక సాఫ్ట్ విజువల్ క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ లైట్లో స్ట్రీట్స్ స్లోగా వేక్ అవ్వడం చూస్తే, ఈ ప్లేస్‌తో కనెక్షన్ నాచురల్‌గా బిల్డ్ అవుతుంది.సందర్శనీయ స్థలాలు పాత టిబిలిసిలో చిన్న చిన్న ఇరుకైన సందుల్లో నడుస్తూ ఉంటే గతంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. నరికలా కోటకి వెళ్లినప్పుడు సిటీ వ్యూ వైడ్‌గా కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ రాత్రి సమయంలో ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. అబానోతుబాని ప్రాంతంలో ట్రెడిషనల్ టిబిలిసి సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి.ఏం తినాలి?ఇక్కడ ఫుడ్ సింపుల్‌గా కనిపించినా చాలా శాటిస్ఫయింగ్గా ఉంటుంది. ఖాచాపూరిలో కరిగిన చీజ్, సాఫ్ట్ బ్రెడ్‌తో కలిసి కంఫర్ట్ ఫుడ్‌లా ఉంటుంది. అలాగే ఖింకలి అనే డంప్లింగ్స్ చాలా జ్యూసీగా ఉంటాయి. వీటిని తినే విధానం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా మిగులుతుంది.ఎప్పుడు వెళ్లాలి?స్ప్రింగ్ (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) సమయంలో వాతావరణం చాలా ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. ఆటమ్‌లో సిటీ రంగులు చాలా సాఫ్ట్‌గా, అందంగా మారుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని సీజనల్‌గా అందుబాటులో ఉంటాయి.లేదంటే దుబాయ్ లేదా దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా లభిస్తాయి.ప్రయాణ సమయం సుమారు 7 నుంచి 10 గంటలు.టిబిలిసిలో గడిపే టైమ్ ఫాస్ట్‌గా వెళ్లి΄ోతుందిం కానీ మెమోరీస్ మాత్రం స్లోగా మనసులో నిలిచి΄ోతాయి. సింపుల్ ట్రిప్ప్లాన్ చేసినా, ఈ నగరం అనుభవం మాత్రం నేచురల్‌గా స్పెషల్‌గా మిగిలి΄ోతుంది.హిమాలయాల్లో రహస్య జీవనంహిమాలయ పర్వతాల మధ్య ఒక గుహలో మలచిన పుగ్తాల్ మొనాస్టరీని చూస్తే ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం కూడా.కాలం కొత్త రంగులుఈ మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది... ఈ కాంబినేషన్లో కాసేపు గడిపినా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు జీవితం కొత్త రంగులను అద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్ బ్రేకర్లా పని చేస్తుంది. ప్రకృతితో సహజీవనంఎలక్ట్రిక్ లైట్స్ కన్నా సహజమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ రిథమ్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్‌ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్‌కి ఫ్లైట్ తీసుకుని, లేహ్ నుంచి జాన్సా్కర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్ చేసి ఫుగ్తాల్ మొనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ΄్లాన్ చేసుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం ఈ బౌద్ధ ఆలయం మనసులో చాలా లోతుగా నిలిచి΄ోతుంది. మేఘాలలో దాగిన హరిత స్వర్గం(ఆగుంబే)ప్రకృతిలో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పీరియెన్స్ అవ్వాలి అనుకునే వారి కోసం ఇది ఒక సాఫ్ట్ ఎంట్రీ ఫీల్ ఇస్తుంది. ఈ ప్రదేశం పచ్చదనానికి కేరాఫ్ అడ్రెస్‌గా అనిపిస్తుంది. రోడ్ జర్నీలోనే మార్పు మొదలవుతుంది. సిటీ సౌండ్స్ తగ్గి, చుట్టూ లష్ ఫారెస్ట్, మిస్ట్‌తో కప్పబడిన కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్ చేస్తుంటే ప్రతి కార్నర్లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్ క్లియర్‌గా తెలుస్తుంది.సందర్శనీయ స్థలాలు సన్‌సెట్ పాయింట్ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు. బర్కానా ఫాల్స్ చుట్టుపక్కల నేచర్ చాలా రా అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ ట్రైల్స్‌లో నడిస్తే సైలెన్స్ కూడా ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపిస్తుంది.ట్రై చేయాల్సిన ఫుడ్ఇక్కడ ఫుడ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. లోకల్ స్టైల్ మీల్స్ ఫ్రెష్‌గా సర్వ్ చేస్తారు. హాట్ రైస్, లైట్ కర్రీలు ఇంటి భోజనం ఫీల్ ఇస్తాయి. వర్షాకాలంలో చాయ్‌తో స్నాక్స్ ఎంజాయ్ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుండి మంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్ లేదా ట్రైన్లో చేరి, అక్కడి నుండి రోడ్ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్ టైమ్ సుమారు 10–12 గంటలు వరకు ఉంటుంది. ఆగుంబేలో లైఫ్ స్లోగా, నేచర్‌తో సింక్ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్లో ఉన్నట్టే రియల్ అనుభూతిని పొందుతారు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు(చదవండి: తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!) -
తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!
మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కు వెళ్లడం ఓ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్‌లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. రూపకర్త ఎవరు అంటే.. ఢిల్లీ నివాసి తరుణ్ థక్కర్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్కిర్ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్‌ల నుంచి టేబుల్ ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. సినిమా సన్నివేశాలకు వీలుగా!భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్కూడా ఏర్పాటు చేశారు.బస్సుల పాత్ర ఎంతో..మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. మేఘాలలో తేలిపోమ్మన్నది..సైకిల్, స్కూటర్, మోటార్‌సైకిల్, మోపెడ్స్... ఒకనాడు సింగిల్‌గానూ, కపుల్‌గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్‌లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.ఆకాశయానంఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.రైలు.. టికెట్లు..రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ΄ఫ్లాట్‌ఫామ్ నమూనా, సెలూన్‌ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.నీటిపైన తేలియాడే...మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్‌ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ మన కళ్లకు కడుతుంది.ఎక్కడ ఉందంటే...బిలాస్పూర్ – తౌరు రోడ్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ 132 ఆఫ్ ఎన్.హెచ్ 8, బిలాస్పూర్, చౌక్, తౌరు, హర్యానాసందర్శన సమయంఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) టికెట్ ధర: పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. (చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!) -
పర్వతాల మధ్య ప్రకృతి గీతం..
పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్‌లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.సరస్సుల అందాలుఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్‌మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.సందర్శనీయ స్థలాలుఇక్కడి చామోనిక్స్లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్ బ్లాంక్ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్ క్లియర్‌గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.నిశ్శబ్ధ సంగీతం..ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్‌లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.పర్వతాల మీదుగా ప్రయాణంహైదరాబాద్ నుంచి ముందుగా ప్యారిస్ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. జెనీవా నుంచి ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ కు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.వుడెన్ హౌజ్‌లో బసచిన్న చాలెట్స్, వుడెన్ హౌసెస్ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.ఏం చూడాలి?మంచు పర్వతాలుపచ్చని పచ్చిక మైదానాలస్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. మరికొన్ని ఆసక్తికరమైనవి: మాంట్ బ్లాంక్ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి.వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. ఆల్పైన్ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.వాకింగ్, సైక్లింగ్‌కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధిఛీజ్తో తయారైన వేడి వేడి వంటకాలుఫ్రెంచ్ కంట్రీసైడ్‌లో బ్రెడ్, చీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్‌వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్‌లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్‌వైన్.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్‌లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే. ఎండకాలమే సరైనది...ఎండాకాలంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్ ఫీలింగ్‌ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.– ఎం.జి.కిశోర్,ప్రయాణికుడు.కామ్(చదవండి: నేచర్ లవర్స్‌కు డ్రీమ్ డెస్టినేషన్) -
నేచర్ లవర్స్‌కు డ్రీమ్ డెస్టినేషన్
హిమాచల్ ప్రదేశ్‌లోని కల్ప అనే చిన్న గ్రామం ఒక నేచురల్ వండర్లా అనిపిస్తుంది. చుట్టూ కిన్నోర్ కైలాష్ పర్వతాలు గర్వంగా నిలబడిన తీరు, ఈ సీన్ చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ సమయంలో పీక్స్‌పై పడిన భానుడి కిరణాల వెలుగు చూస్తే ఒక నిర్మలమైన, దివ్యమైన దృశ్యంలా అనిపిస్తుంది.మబ్బులు కొంచెంగా పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటే ఈ సీన్స్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ప్రకృతితో కలిసిన ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.జీవితం చాలా సింపుల్ఇక్కడ జీవితం చాలా సింపుల్, నిధానంగా ఉంటుంది. చిన్న ఇళ్లు, ఆపిల్ తోటలు, తాజా గాలుల మధ్య ఒక కామ్ రిథమ్ ఉంటుంది. ప్రతీ రోజు ఒక రొటీన్ లైఫ్ స్టైల్లా కాకుండా ఒక భిన్నమైన అనుభూతిలా అనిపిస్తుంది. లోకల్ వీధుల్లో నడుస్తూ ఉంటే గ్రామ జీవితంలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసులు కనిపిస్తాయి.ఇక్కడ సమయం కొంచెం స్లోగా నడుస్తుందనే భావన కలుగుతుంది. సిటీ జీవితం నుండి దూరంగా ఉన్న ఒక పీస్ఫుల్ వరల్డ్‌లా ఉంటుంది. ∙సాయంత్రం సమయంలో పర్వతాల వెనక సూర్యాస్తమం చూస్తే ఆ ఆకాశం ఆరెంజ్, పింక్ షేడ్స్‌తో మారిపోతుంది. ఆ క్షణంలో కలిగే సైలెన్స్, ప్రశాంతత ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తాయి.ఎలా చేరుకోవాలంటే..హైదరాబాద్ నుండి ముందుగా ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కల్పకు చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో హిమాలయన్ దృశ్యాలు, నదులు, లోయలు చూస్తూ సాగుతుంది. దీంతో ఈ జర్నీ ఓ మరపురాని అనుభూతిగా నిలిచిపోతుంది. కూనూరు: ఫాస్ట్ లైఫ్కుబ్రేక్కూనూర్లో ఉదయం అనగానే పచ్చని టీ తోటలపై నిదానంగా కదిలే తొలి మంచు కళ్లముందు నిలుస్తుంది. వాటి మీదుగా గాలులు చల్లగా, తాజాగా వీస్తాయి. ప్రతీ ఆకుపై ఉండే తడి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడి నేచర్ రీఫ్రెష్ బటన్లాంటి ఫీల్ ఇస్తుంది. మార్నింగ్ వాక్‌లో ఈ ఫ్రెష్‌నెస్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.టీ తోటల మధ్య ఉదయంటీ గార్డెన్స్ మధ్య నడుస్తూ ఉంటే అన్ని వైపులా పచ్చని రంగుల లేయర్స్ కనిపిస్తాయి. వర్కర్స్‌ను నిదానంగా టీ లీవ్స్ సేకరిస్తూ ఉండడం చూస్తే ఆ దృశ్యం ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. చిన్న దారుల్లో నడిచే ప్రతీ స్టెప్‌లో సైలెన్స్ , ప్రకృతి మధ్య ఒక కనెక్షన్, ఇక్కడ టైమ్ స్లోగా మూవ్ అవుతుందనే భావన కలుగుతుంది.నీలగిరి పర్వతాల రిథమ్నీలగిరి పర్వతాల మధ్య నడుస్తూ ఉంటే ప్రతీ టర్న్‌లో ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. చిన్న రైలుమార్గాలు, వుడెన్ హౌసెస్, వీటితో పాటు ప్రకృతి.. ఇవన్నీ ఒక ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలో లైవ్‌లో చూపిస్తాయి. కొన్ని ప్రదేశాల నుండి వ్యాలీస్ చూస్తే మేఘాలు కింద తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ అనుభవం మరింత మేజికల్‌గా ఉంటుంది.హైదరాబాద్ నుండి ప్రయాణంముందుగా కోయంబత్తూరు వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ మార్గంలో కూనూర్‌కి చేరుకోవచ్చు. ఆ ఘాట్ రోడ్స్‌లో తిరుగుతూ వెళ్తే పర్వత దృశ్యాలు ప్రయాణాన్ని నిధానంగా, ఆనందంగా మార్చేస్తాయి. (చదవండి: పెయింటింగ్‌లా కనిపించే గ్రామం) -
పెయింటింగ్‌లా కనిపించే గ్రామం
పోర్టోఫినో అనేది ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. లిగూరియా తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పేస్టెల్ కలర్స్ ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి. హార్బర్లో నిలిచిన బోట్లు, వీచే గాలులు ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన రిథమ్లా అనిపిస్తాయి. మనసుకు ప్రశాంతమైన భావాలను కలిగించే ఒక చక్కని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా అనిపిస్తుంది. విలేజ్ స్ట్రీట్స్‌లో నడుస్తూ ఉంటే చిన్న కేఫ్‌ల నుండి వస్తున్న కాఫీ సువాసన, బాల్కనీ గార్డెన్లో విరబూసిన పూలు, ప్రతీ మలుపులో కనిపించే సముద్రం వ్యూ ... ఇవన్నీ కలిసి ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. ఇక్కడ జీవితం నిజంగా నిదానంగా సాగుతుంది. సముద్రం తీరాన కూర్చుని కాఫీ తాగుతూ, అలల శబ్దాన్ని వినడం ఒక మధురమై అనుభూతిని ఇస్తుంది. నేటి ఈ ఫాస్ట్ లైఫ్ నుండి బ్రేక్ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.ఇక్కడ ప్రతీ రోజు ఒక స్లో రిథమ్‌లో నడుస్తుంది రష్ లేకుండా, టెన్షన్ లేకుండా. లోకల్ షాప్స్‌లో హ్యాండ్‌మేడ్ సోవెనీర్స్, కోస్టల్ ఫ్లేవర్స్‌తో తయారైన ఫ్రెష్ సీ ఫుడ్ డిషెస్, గెలాటో రుచి చూస్తూ గడిపే క్షణాలు ట్రావెల్‌ను మరింత మెమొరబుల్‌గా మారుస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్‌కి ఇది ఒక డ్రీమ్ లొకేషన్.. ఇలా ప్రతీ కార్నర్ ఒక పోస్ట్కార్డ్లా ఉంటుంది.సాయంత్రం సమయంలో పోర్టోఫినో మరింత అందంగా మారుతుంది. సూర్యాస్తమ సమయంలో వెలుగు సముద్రంపై పడితే ఆ ప్రతిబింబం గ్రామం మొత్తాన్ని గోల్డెన్ షేడ్‌లో మార్చేస్తుంది. ఆ క్షణాల్లో ప్రతీ దృశ్యం ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది క్యాప్చర్ చేయాలనిపించే మూమెంట్స్ ఎండ్లెస్గా ఉంటాయి. హైదరాబాద్ నుండి మిలాన్ లేదా గెనోవా వరకు ఫ్లైట్‌లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ లేదా ట్రెయిన్ ద్వారా పోర్టోఫినోకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో మెడిటరేనియన్ తీరం దృశ్యాలు, టన్నెల్స్, కోస్టల్ కర్వ్స్ జర్నీని మరింత అందంగా మార్చేస్తాయి. -
ప్రకృతి-మనిషి కలిసి చేసిన అద్భుతం
ఎండాకాలం మొదలవ్వగానే పర్యటనల పట్ల ఆసక్తి గలవారిలో వివిధ రకాల ఆలోచనలు మదిలో మెదలుతుంటాయి. ఈ సీజన్లో కొన్ని ప్రదేశాల ఉష్ణోగ్రతలు పెరిగి హాట్ హాట్‌గా ఉంటే..మరికొన్ని చల్లగా ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. కొండల మధ్య దోబూచులాడే మేఘాలు, సరస్సులపై తేలియాడే ప్రభాత వెలుగులు, వాటిని ఆనుకుని ఉండే పట్టణ వీధుల్లో నడక ప్రయాణం .. ప్రకృతి –మనిషి కలిసి చేసిన అద్భుతం కళ్ల ముందు నిలిచి, వేసవి ప్రయాణాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా మార్చేస్తాయి. అలాంటి వాటిలో ప్రపంచంలోనే పేరొందినవి స్విట్జర్లాండ్‌లో లేక్ టౌన్‌గా పిలిచే లూసెర్న్, ఐస్లాండ్లో రేక్యావిక్, కెనాడలోని బ్యాన్ఫ్, ఇండియాలో లేహ్, జపాన్‌లోని హాంకొనె. ఎందుకు ఇవి మాత్రమే అంతటి ప్రత్యేకతను నింపుకున్నాయో తెలుసుకుందాం. ఈ వేసవి ప్రయాణాన్ని అత్యద్భుతంగా మార్చుకుందాం..హిమాలయాల మధ్య..లేహ్ భారతదేశంలోని లడఖ్‌లో ఉన్న ఒక హిమాలయన్ ప్రాంతం. ఎండాకాలంలో ఇక్కడ లోయలు, కొండల మధ్య ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. హిమాలయాల్లోని మఠాలు, ప్రశాంత గ్రామాలు ఈ ప్రాంత జీవనశైలిని ప్రత్యేకంగా చూపిస్తాయి. ఉదయం సమయంలో పర్వతాలపై పడే వెలుగు వ్యాలీస్ను గోల్డెన్ రంగులో మార్చేస్తుంది. లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ లేక్ అనేది ప్రకృతి అద్భుతం.రాక్ సౌందర్యంబ్యాన్ఫ్ కెనడాలోని ఒక అందమైన హిల్ టౌన్. బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ మధ్యలో ఉన్న ఈ ప్రదేశం బ్లూ లేక్స్, పచ్చని అడవులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎండాకాలంలో కొండలపై పడే వెలుగు, లేక్స్‌లో కనిపించే ప్రతిబింబాలు ప్రయాణికులకు గుర్తుండి΄ోయే అనుభవాన్ని ఇస్తాయి. బాన్ఫ్లోని లేక్ లూసీ నీలి నీటితో ప్రసిద్ధి చెందింది.వెలుగు కథలురేక్యావిక్ ఐస్లాండ్ దేశ రాజధాని. ఎండాకాలంలో ఇక్కడ పగటి సమయం ఎక్కువగా ఉండటంతో నగరం మొత్తం వెలుగుతో నిండి΄ోతుంది. సముద్రం పక్కన ఉన్న ఈ నగరంలో రంగురంగుల ఇళ్లు, చిన్న చిన్న, సన్నని స్ట్రీట్స్, ప్రశాంతమైన కేఫ్స్ కనిపిస్తాయి. ఉదయం వెలుగు సముద్రంపై పడితే నగరం మొత్తం మృదువైన కాంతితో మెరుస్తుంది.ఆల్ఫ్స్ మధ్య లేక్ టౌన్లూసెర్న్ అనే నగరం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక అందమైన లేక్ టౌన్. స్విస్ ఆల్ఫ్స్ కొండల మధ్య విస్తరించిన లూసెర్న్ సమ్మర్లో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు పక్కన నడిచేందుకు సన్నని వీధులు, పాత వుడెన్ బ్రిడ్జ్‌లు ఈ నగరానికి ప్రత్యేక వాతావరణాన్ని ఇస్తాయి. ఉదయ సమయంలో సరస్సు పై పడే సూర్య కిరణాలు నీటిపై బంగారు కాంతిని వెదజల్లుతుంటాయి. కొండల నీడలు, మేఘాల ప్రతిబింబాలు కలిసి ఒక పెయింటింగ్‌లా కనిపిస్తాయి. లూసెర్న్లోని చాపెల్ బ్రిడ్జి నగర చరిత్రను మన ముందు ఆవిష్కరింప జేస్తుంది.సమ్మర్ ట్రావెల్ అనుభవంప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం చూడటం మాత్రమే కాదు. ప్రకృతి రిథమ్‌ను అనుభవించడం కూడా. కొండల మధ్య మేఘాల ప్రయాణం, లేక్స్‌పై పడే వెలుగు, గ్రామాల ప్రశాంత జీవనంం ఇవన్నీ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవంగా మార్చేస్తాయి.ఫుజీ కొండల దృశ్యాలుహాంకొనే జపాన్‌లోని ఒక నేచురల్ డెస్టినేషన్. అడవులు, సరస్సులు, కొండల మధ్య ప్రయాణించే రోడ్లు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. దూరంలో కనిపించే మౌంట్ ఫూజీ దృశ్యం ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. హంకొనేలోని లేక్ ఆషీ పక్కన ఫుజీ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు (చదవండి: ఇండియాలోనే స్విట్జర్లాండ్) -
ఇండియాలోనే స్విట్జర్లాండ్
లడఖ్ ప్రాంతం సమ్మర్లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.గ్రామాల మధ్య జీవనంచిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్‌తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్‌కి డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లవచ్చు. లేహ్ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్ జర్నీ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్‌లా మార్చేస్తాయి. ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్‌ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.అపాతాని సంస్కృతిజీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్ మధ్య ఉన్న ఫుట్‌పాత్స్ ఈ ప్రదేశంలో లైఫ్ రిథమ్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్ సీజన్లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్ జర్నీగా మార్చేస్తాయి. (చదవండి: లాంజ్‌లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి) -
లాంజ్‌లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి
ఎయిర్‌పోర్టులో లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటే లాంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్‌తో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ మరింత బెటర్ అవుతుంది. కానీ అందరికీ లాంజ్ యాక్సెస్ ఉచితంగా లభించదు. కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా యాక్సెస్ పొందవచ్చు.క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్చాలా ప్రీమియం కార్డుల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని కార్డుల్లో సంవత్సరానికి లిమిటెడ్ ఫ్రీ ఎంట్రీస్ ఇస్తారు. ట్రావెల్‌కు ముందు మీ కార్డ్ బెనిఫిట్స్ చెక్ చేసుకుంటే ఈజీగా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.ఎయిర్‌లైన్ లాయల్టీ ప్రోగ్రామ్స్ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ కోసం ఎయిర్‌లైన్స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇస్తాయి. పాయింట్స్ కలెక్ట్ చేసి ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రెగ్యులర్‌గా అదే ఎయిర్‌లైన్‌తో ట్రావెల్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.ఎర్లీ ఫ్లైట్ అప్గ్రేడ్స్కొన్నిసార్లు బిజినెస్ క్లాస్‌కి లాస్ట్ మినిట్ అప్‌గ్రేడ్ ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్స్ట్రా పే చేసి అప్‌గ్రేడ్ తీసుకుంటే లాంజ్ యాక్సెస్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది.ట్రావెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్కొన్ని ట్రావెల్ మెంబర్షిప్ సర్వీసెస్‌లో లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి. యాన్యువల్ మెంబర్షిప్ తీసుకుంటే మల్టిపుల్ ఎయిర్‌పోర్ట్స్‌లో లాంజ్ యూజ్ చేయవచ్చు.స్పెషల్ ఆఫర్స్ అండ్ డీల్స్ఫెస్టివ్ సీజన్ లేదా ట్రావెల్ డీల్స్ సమయంలో కొన్ని కార్డ్స్ లేదా బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ స్పెషల్ లాంజ్ యాక్సెస్ ఆఫర్స్ ఇస్తాయి. అలెర్ట్స్ ఫాలో అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందడం కష్టం అనిపించినా, కరెక్ట్ ట్రిక్స్ ఉపయోగిస్తే సాధ్యమే. కొంచెం ప్లానింగ్‌తో మన ట్రావెల్ అనుభవాన్ని కంఫర్టబుల్, ప్రీమియంగా మార్చుకోవచ్చు. -
మండుటెండల్లో మనసు చల్లగా
మండే ఎండలు, ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజస్థాన్. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే పుష్కర్‌లో ఉన్న పవిత్రమైన పుష్కర్ సరోవర్.ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్‌లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఏర్పడింది అని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.ఎండాకాలంలో పుష్కర్ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది. అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పుష్కర్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ ఆలయం పుష్కరం ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్ లవర్స్‌కు కూడా పుష్కర్ ఒక స్పిరిచ్యువల్ డెస్టినేషన్ గా నిలుస్తుంది. ఎండాకాలంలో రాజస్థాన్ పర్యటన అనేది సాధారణంగా కష్టమైనదే. ఒక వేళ ఏదైనా పనిలో భాగంగా వెళ్తే మాత్రం మౌంట్ అబూ, పుష్కర్ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లచ్చు. మండే వేడిలోనూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.ఎలా చేరుకోవాలి?తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్ నుంచి జైపూర్ కు నేరుగా ఫ్లైట్‌లో చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లేవారు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ స్టేషన్ నుంచి జైపూర్‌కు రైలు మార్గాన చేరుకోవచ్చు. హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ నుంచి రైలు మార్గం అందుబాటులో ఉంది. జైపూర్ నుంచి రోడ్డు మార్గాన అజ్మేర్, పుష్కర్ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్‌లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.యూరప్‌లోని అందమైన ద్వీపాల కథనార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. యూరోప్‌లో ఇది చాలా పాప్యులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీ΄ాలకు ప్రత్యేకమైన, ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణ. ఉదయం వేళలో సముద్ర అలలు, పచ్చని పర్వతాల మధ్య పడిన వెలుగు ప్రపంచం అంతా ప్రశాంతంగా అనిపించే దృశ్యాన్ని సృష్టిస్తుంది.గ్రామాల జీవనంఫరో గ్రామాల సందుల్లో చిన్న ఇళ్లు, గ్రాస్ రూఫ్స్, సముద్రంపై నడిచే పడవల దృశ్యం కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ప్రకృతి రిథమ్‌తో కలిసి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ చూడచ్చు. ఫిషింగ్, సముద్ర సంస్కృతి ఇక్కడి ప్రజల జీవితంలో కీలక భాగంలాంటిది. ఇక్కడ ఎక్కువగా వైకింగ్స్ వారసులే నివసిస్తుంటారు.హైదరాబాద్ నుంచి యాత్రహైదరాబాద్ నుంచి ఫరో ఐలాండ్‌కి ప్రయాణం సాధారణంగా వాయు మార్గంలోనే జరుగుతుంది. ముందుగా హైదరాబాద్ నుండి దుబాయ్ లేదా ఢిల్లీ నుండి యూరోప్‌లోని కోపెన్ హ్యాగెన్ చేరుకోవాలి. అక్కడి నుండి వగార్ విమనాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న రోడ్డు ప్రయాణం చేసి ద్వీపాల మధ్య ఉన్న అందమైన గ్రామాలకు వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. -
మనసుతో చేసే ఆధ్యాత్మిక యాత్ర
గిర్నార్ అనే పర్వత శ్రేణి గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్ నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి చేరుకుంటుంటే భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.అడుగడుగునా మంత్రాల ధ్వనిగిర్నార్కి చేరిన తరువాత కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి మెట్లు ఉంటాయి. ప్రతి అడుగు ఒక రిథమ్‌లో ముందుకు సాగుతుంది. కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతంగా వినిపించే మంత్రాల ధ్వని గాలిలో కలుస్తుంది. చుట్టూ పర్వత వనాలు, పర్వతం పైకి చేరుకుంటున్న కొద్దీ భక్తులు దైవానికి మౌనంగా చేసే నమస్కారాలు.. ఇవన్నీ కలిసి ఒక పవిత్రమైన మార్గంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మారితుంది.గిర్నార్‌లోని అంబాజీ ఆలయం దగ్గర ఉదయం వేళలో దీపాల వెలుగు చాలా హృద్యంగా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్లిన తరువాత దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. గిర్నార్ శిఖరం దగ్గర నిల్చొని చూస్తూ గుజరాత్ నేల అందం ఏంటో తెలుస్తుంది. అక్కడి నేల అందాల్ని చూస్తూ భక్తి, ప్రకృతి రెండూ కలిసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.పర్వతంపై సూర్యోదయంశిఖరం అంచున నిల్చొని సూర్యోదయాన్ని వీక్షిస్తుంటే ఆకాశం బంగారు రంగులో మారడాన్ని గమనించవచ్చు. పర్వత రేఖలు కోమలంగా కనిపిస్తాయి. ఆ క్షణంలో ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా నిలుస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వరకు ఫ్లైట్ లేదా రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్ నుండి రైలు లేదా రోడ్ మార్గం ద్వారా జూనాగఢ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి గిర్నార్ వరకు రోడ్ ప్రయాణం ఉంటుంది. గిర్నార్ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక శారీరక యాత్ర మాత్రమే కాదు. మనసుతో చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. -
ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరం..
ప్రకృతి కొన్ని ప్రదేశాలను అత్యంత శాంతంగా సృష్టిస్తుంది. అక్కడ కాలం కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. మైనస్ 40 డిగ్రీలలోనూ విస్తరించి, ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరంగా పేరొందింది. రష్యాలో ఉన్న యాకుట్స్క్ అనే పేరుగల నగరం ఓ ప్రత్యేక ప్రపంచంలా కనువిందు చేస్తుంది.సైబీరియా ప్రాంతంలో లేనా నదీ తీరం దగ్గర ఉన్న యాకుట్స్క్ ది ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక స్థానం. మంచు నేలపై భానుని కిరణాలు పడి, ఆకాశం నుంచి రాలిన వెలుగుల తారలా మార్చి ్ర΄ారంభంలో యాకుట్స్క్ కనువిందు చేస్తుంది. నట్టనడి వేసవిలో భూమి పచ్చని రంగులోకి మారి΄ోతుంది. ఈ రెండు కాలాల్లోనూ యాకుట్స్క్ ఒక ప్రత్యేక ప్రకృతి కథనాన్ని చూపిస్తుంది.సైబీరియా ప్రభాత దృశ్యంమార్చి, ఏప్రిల్ నెలలో ఉషోదయ సమయాన ఒక మనోహరమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. లేనా నది దగ్గర కనిపించే ప్రశాంతమైన పర్వతాలు, సుదూరంలో కనిపించే చెట్లు ఈ నగరానికి ఒక కొత్త రంగును అద్దుతాయి.కోల్డెస్ట్ సిటీ.. విశేషాలు ఇవీ..మైనస్ 40 డిగ్రీలు: యాకుట్స్క్ ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఒకటి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు –40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయి.శాశ్వత భవనాలు: నగరం మొత్తం పెర్మాఫ్రోస్ట్ (శాశ్వతంగా ఉండేలా) పై నిర్మించబడింది. అందుకే భవనాలను దృఢమైన పిల్లర్లపై నిర్మిస్తారు.డైమండ్స్‌కు ప్రసిద్ధి: యాకుట్స్క్ పరిసర ప్రాంతాలు డైమండ్స్‌కు ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కువ డైమండ్స్ లభించే ప్రాంతాల్లో ఇది ఒకటి.కార్లు ఆఫ్ చేయరు: వింటర్లో కార్ల ఇంజిన్ ఆఫ్ చేస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలాసార్లు ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచుతారు.ఎక్స్ట్రీమ్ సీజన్స్ చలికాలంలో తీవ్ర చలిగా ఉండగా, సమ్మర్లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు పెరుగుతాయి.కష్టమైనా.. ఇష్టంగా!యాకుట్స్క్ ప్రజలు ప్రకృతితో కలిసి జీవించేలా తమ లైఫ్‌స్టైల్‌ను రూపొందించుకున్నారు. గ్రామాల వీధుల్లో చిన్న మార్కెట్లు, సంప్రదాయ ఇళ్లు, ఉదయం సమయంలో కనిపించే కదలికలు ఇక్కడి నగర సంస్కృతిని తెలియజేస్తాయి. స్థానిక సంస్కృతిలో యాకుట్స్క్ సంప్రదాయ పరంపర, నృత్యం, కళలు ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబిస్తాయి.సందర్శనీయ స్థలాలెన్నో! యాకుట్స్క్ ప్రయాణంలో మామ్మోత్ మ్యూజియం అనేది యాకుట్స్క్కు చెందిన ఒక ప్రత్యేక చరిత్ర కథను చూపిస్తుంది. సైబీరియా భూమిలో కనిపించే, అంతరించిన ్ర΄ాచీన జీవుల అవశేషాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి.లేనా నదీ ఎంబార్క్‌మెంట్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ చాలా మంది ఈ నగర రిథమ్‌ను అర్థం చేసుకుంటారు.కొంచెం దూరంలో ఉన్న లేనా పిల్లర్స్ నేచర్ ΄ార్క్ అనేది ప్రకృతి సృష్టించిన విశాల శిలా స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తుంది.అలాగే కింగ్డమ్ ఆఫ్ పెర్మాఫ్రోస్ట్ అనేది యాకుట్స్క్లో మంచు గుహల మధ్య కళాకృతులు కనిపిస్తాయి.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా ఢిల్లీ లేదా దుబాయ్‌కు చేరుకుని అక్కడి నుంచి మాస్కో వరకు విమానంలో వెళ్లాలి. మాస్కో నుంచి విమానంలో యాకుట్స్క్ చేరుకోవచ్చు.ఎక్కడ ఉండాలి?యాకుట్స్క్లో చిన్న హోటల్స్‌తో పాటు ట్రెడిషనల్ గెస్ట్ హౌసులు కూడా ఉంటాయి. లేనా నది దగ్గర ఉండే ప్రదేశాల్లో బస చేస్తే ఉదయం దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.ఏమి తినాలి?ఇక్కడి లోకల్ ఫుడ్‌లో సైబీరియన్ రుచులు కనిపిస్తాయి. చేపలతో చేసే వంటలు, సూప్స్, సంప్రదాయ బ్రెడ్స్ స్థానిక భోజన సంస్కృతిని తెలియజేస్తాయి. లేనా నది తీరంలో మార్నింగ్ వాక్ చేయడం, మమ్మోత్ మ్యూజియం సందర్శించడం, లేనా పిల్లర్స్ దగ్గర ప్రకృతి శిల్పాలను చూడడం వంటి అనుభవాలు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. యాకుట్స్క్ ట్రిప్ అనేది ఒక సుదూరమైన ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, మనిషి జీవితానికి మధ్య జరిగే ఒక అందమైన అనుభవం. మార్చి హిమ వెలుగుల నుంచి వేసవి పచ్చని రంగుల వరకు ఈ నగరం కొంగొత్త దృశ్యాలను కనువిందు చేస్తుంది.– ఎం.జి.కిశోర్, పర్యాటకుడు (చదవండి: ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు) -
వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!
కొన్ని ప్రదేశాలను కళ్లతో చూస్తాం. కొన్ని ప్రదేశాలను మనసులో అనుభూతి చెందుతాం. అలాంటి ఒక అందమైన ప్రదేశమే జూన్‌లోని క్యోటో. క్యోటోలో వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్ అయితేదానిని జీవితాంతం ఒక మెమోరీగా దాచుకుంటాం. జూన్‌లో ఉన్న క్యోటో అనే ప్రాచీన నగరం మార్చి నుంచి సమ్మర్ ప్రారంభం వరకు ఒక అందమైన రంగుల కథలా మారిపోతుంది. సకూరా లేదా చెర్రీ బ్లాసమ్ చెట్ల గులాబీ పుష్పాలతో విరిసిన సమయంలో వీధులు, చెరువులు, సరస్సులు, ఆలయాలు ఇవన్నీ కలిసి ఒక లైవ్ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణం అంటే చెక్‌లిస్ట్ టూరిజం కాదు ఒక స్లో వాక్ం ఒక సైలెంట్ ఫీలింగ్.వసంత వెలుగుల్లో క్యోటో రిథమ్మార్నింగ్ టైమ్‌లో? లైట్ మిస్ట్ మధ్య నడుస్తే గాలిలో ఒక ఆహ్లాదకరమైన సువానస గుండెల్ని మీటుతుంది. రోడ్ సైడ్‌లో చిన్న చిన్న కేఫేలు ఉదయమే తెరుచుకుంటాయి. సైకిల్‌పై డిసిప్లెన్‌గా స్కూల్‌కు వెళ్లే పిల్లలు కనిపిస్తారు. అలాగే పక్కనే ఓల్డ్ వుడెన్ హౌసెస్ సైలెంట్‌గా గంభీరంగా నగరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ లైఫ్ అంటే వేగం కాదు. ప్రశాంతంగా జీవించాలే వేదంలాంటిది. మధ్యాహ్నం సమయంలో కెనాల్ పక్కనే కూర్చుంటే నీటిపై పడిన చెర్రీ బ్లాసమ్ పెటల్స్ స్లోగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తే టైమ్ కూడా స్లో మోషలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్యోటోలో సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ వసంత కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.లోకల్ ఫీల్ ఇచ్చే ప్రాచీన కల్చర్క్యోటో అంటే జూన్ కల్చరల్ క్యాపిటల్ లాంటిది. జియాన్ ఏరియాలో సాయంత్రం సమయంలో వాక్ చేస్తే అక్కడి ట్రెడిషనల్ కిమోనో వేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనిపిస్తారు. ఓల్డ్ టీ హౌసెస్ నుంచి వచ్చే వార్మ్ లైట్ స్ట్రీట్ మీద పడితే సిటీ ఒక వింటేజ్ సినిమా ఫ్రేమ్‌లో మనం ΄ాత్రధారులం అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ టీ సెర్మనీ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సింపుల్‌గా టీ సర్వ్ చేసే విధానంలో కూడా ఒక డిసిప్లిన్, ఒక గౌరవం ఉంటుంది. లోకల్ మార్కెట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్సŠ, సీజనల్ స్వీట్స్ లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకతితో మమేకం అయ్యి జీవిస్తారు. అది మీరు బాగా గమనించవచ్చు.సందర్శనీయ స్థలాలుక్యోటోలో ప్రయాణం అంటే ప్లేస్ నుంచి ప్లేస్‌కు ట్రావెల్ కాదు. ఫీలింగ్ నుంచి ఫీలింగ్‌కి మూవ్ అవ్వడం లాంటిది.ఫుషిమీ ఇనారీ తైషా దగ్గర రెడ్ టోరీ గేట్స్ మధ్య నడవటం అంటే ఒక స్పిరిచువల్ టన్నెల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రతీ అడుగులో నిశ్శబ్దానికి, ప్రశాంతతకు మరింత చేరువ అవుతున్నట్టు అనిపిస్తుంది.కింకాకు–జి, అంటే గోల్డెన్ పెవిలియన్. దీని ప్రతిబింబం సరస్సులో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకుండా మౌనంగా ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని మనసు కూడా చెబుతుంది.అరాషియామా బాంబూ గ్రోవ్‌లో గాలి తనువుతోపాటు మనసును తాకుతూ వెళ్తుంది. ఆ గాలికి వినిపించే నేచురల్ సౌండ్స్ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్‌లా మిగిలిపోతాయి.ఫిలాసఫర్స్ పాత్ కెనాల్ పక్కన సకూరా ఛాయలో నడుస్తే ప్రతీ టర్న్‌లో గులాబీ పెటల్స్ పడుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ వాక్ పూర్తయ్యాక కూడా ఆ సీన్ మనసులో కొనసాగుతూనే ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి టోక్యో లేదా ఒసాకాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా క్యోటోకి ఈజీగా చేరుకోవచ్చు. జూన్ రైల్వే సిస్టమ్ చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా జర్నీ భాగంగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?సిటీ సెంటర్ దగ్గర్లో ట్రెడిషనల్ ర్యోకన్ స్టైల్ స్టేలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ వుడెన్ రూమ్స్, తతామీ మ్యాట్స్, స్లైడింగ్ డోర్స్ ఇలా స్టే కూడా ఒక కల్చరల్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది. మోడర్న్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఓల్డ్ స్టైల్ అకామడేషన్‌లో ఉంటేనే క్యోటో వైబ్ బాగా ఫీల్ అవుతుంది.ఏం చూడాలి?ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు, కెనాల్ వాక్స్, బాంబూ ఫారెస్ట్, ఈవినింగ్ లాంటర్న్ స్ట్రీట్స్ ఇవన్నీ రష్ లేకుండా స్లోగా చూడాలి. ఇక్కడ బ్యూటీ కేవలం కళ్లకు ఇంపుగానే కాదుం మెమోరీస్‌లో సింక్ అయ్యేలా ఉంటుంది.ఏం తినాలి?క్యోటోలో మీరు తప్పకుండా లోకల్ రామెన్ ట్రై చేయండి. దీంతోపాటు మాచా బేస్డ్ స్వీట్స్, తాజా సుషీ, సీజనల్ సకూరా ఫ్లేవర్ ఉన్న డెజర్ట్స్ మిస్ చేయకండి. అలాగే చిన్న స్ట్రీట్ కేఫేలో సింపుల్ టీ తాగితే కూడా ఎక్స్‌పీరియెన్స్ కంప్లీట్ అవుతుంది.ఎప్పుడు వెళ్లాలి?క్యోటో వెళ్లేందుకు వసంతమే ఉత్తమ సమయం. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సకూరా పీక్ సీజన్ ఉంటుంది. సమ్మర్ ప్రారంభం అవ్వడానికి ముందే వాతావరణం కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. సమ్మర్ మొదలయ్యాక కూడా పచ్చదనంతో క్యోటో అందంగా కనిపిస్తుంది.క్యోటో ప్రయాణం పూర్తయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా మిగులుతాయి. గులాబీ పెటల్స్ పడిన ఆ మూమెంట్స్, బాంబూ సౌండ్స్, ఆలయ గంటల శబ్దాలు ఇవన్నీ కలిసి ఒక పీస్ఫుల్ చాప్టర్లా మనసులో నిలిచిపోతాయి. ఎందుకంటే క్యోటోలో వసంతం ఒక సీజన్ కాదు. ఆనందానికి ఒక రీజన్ కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!
విదేశీ టూర్ వ్లాగర్ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్, కనీసం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్ ట్రావెల్ వ్లాగర్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. బిహార్‌లోని ముంగేర్, భాగల్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్ కుమార్ అనే యువకుడు 197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్‌పోర్ట్‌తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్‌తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్ది మధ్య తరగతి నేపథ్యం. తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్ మీడియాలో తన హోమ్‌టూర్ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్ వ్లాగ్ పేరుతో విదేశీ టూర్లు పర్యటించే రేంజ్‌కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్‌గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్ అయ్యేవారు. అలా అతడి యూట్యూబ్ ఛానెల్‌కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఇదంత శుభమ్‌కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. జర్నీ ఎలా ప్రారంభమైందంటే..తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్‌పై అంత పట్టు కూడా లేదని ఓపెన్‌గానే చెప్పేశాడు శుభమ్. కేవలం ఇండియా పాస్‌పోర్ట్‌తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్ వ్లాగ్‌గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్, తర్వాత రష్యా, థాయిలాండ్, లావోస్..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్ వ్లాగ్ పోస్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్హైక్ చేశాడు. అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్‌కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్ పాస్‌పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్‌పోర్ట్‌తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్‌పోర్ట్‌లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్. ఎందుకంటే అప్పటికే తన పాస్‌పోర్ట్‌లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్‌లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్‌పోర్ట్‌లను నింపాడు. అయితే శుభమ్ ప్రతి దేశానికి ఈ పాస్‌పోర్ట్‌తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్. 16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్లు ప్లాన్ చేసుకున్నాడట. అంటే శుభమ్ అప్లోడ్ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం అతడికి ఫోన్‌చేసి మరి అభినందించారట. ఇప్పుడు అతని టూర్ బకెట్ లిస్ట్‌లో బ్రెజిల్ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!. View this post on Instagram A post shared by Shubham Kumar || Extreme Traveller (@nomadshubham) (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!) -
‘స్విస్ ఆల్ఫ్స్’ : వేసవిలో మంచు పరిమళం
సూర్య కిరణాలు పర్వతాల మీదుగా పయనిస్తుండగా మంచు కాంతిమంతంగా కనువిందు చేసే చోటు ఏది అని అడిగితేవెంటనే ‘స్విస్ ఆల్ఫ్స్’ అని చేప్పేయవచ్చు.సమ్మర్లో కూడా యూరప్ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్ ఛాయిస్..స్విట్జర్లాండ్‌లో ఎండాకాలం కూడా మంచు ఆకర్షణ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆకాశం నీలంగా, గడ్డి పర్వతాల మీద పచ్చగా, దూరంగా మంచుపై వెలిగే చంద్రప్రభలా కనిపిస్తుంది. ఎండలో కూడా చల్లని గాలి మనసును మేల్కొలుపుతుంది..సరోవరాల సౌందర్యంస్విస్లో సరస్సులు ఎండాకాలంలో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటాయి. లేక్ జెనీవా తీరం దగ్గర మధ్యాహ్నం నిశ్శబ్దంగా ఉంటుంది. నీళ్లు నీలం రంగులో మెరుస్తూ, పర్వతాల ప్రతిబింబాలను తమలో కలిపేసుకుంటాయి. ఇంటర్లేకన్ అనే ప్రదేశంలో రెండు సరోవరాల మధ్య నిలిచిన ఊరిలో నడవడంతో పాటు, స్థానికంగా ఉన్న గడ్డి మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గడపాలని అనిపిస్తుంది.పర్వతాల మధ్య సూర్యోదయంస్విస్ ఆల్ఫ్స్లో ప్రతీ సూర్యోదయం ఒక గీతంలా మొదలవుతుంది. చర్చి గంటలు దూరంగా వినిపిస్తాయి. పర్వతాల నుంచి దిగే సూర్యోదయం నీలి ఆకాశాన్ని మెల్లిగా బంగారు రంగులో మెరిపిస్తుంది. జెర్మాట్ లాంటి అందమైన గ్రామ వీధుల్లో నడుస్తుంటే, చుట్టూ వుడెన్ హౌసెస్, వరండాల్లో సందడి చేసే పువ్వులు, వెనకాలే మ్యాటర్ హోర్న్ లాంటి శిఖరం చూస్తుంటే జీవితం ఎంత అందమైనదో అనిపిస్తుంది.సందర్శనీయ స్థలాలుఈప్రాంతంలో జెర్మాట్ నుంచి మేటర్హార్న్పపర్వత దర్శనం అనేది ఒక నిశ్చలమైన క్షణంలా అనిపిస్తుంది. ఇంటర్లేకన్లో సరోవరాల మధ్య సాయంత్రం గడపడం ఒక అందమైన పెయింటింగ్‌లో మనం భాగమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే జుంగ్ఫ్రౌ ఉండే ప్రదేశంలో మంచు రేఖలు ఎండాకాలంలో కూడా తెలుపు వర్ణంతో జిగేలుమనిపిస్తాయి.లూసెర్న్ వీధిలో కెపెల్బ్రూక్ బ్రిడ్జిపై నడిచే సమయంలో ప్రాచీన కథల్లో కథానాయకులమయ్యాం అనిపిస్తుంది. లేక్ జెనీవా తీరంలో సాయంత్రం ఆకాశం నీలం నుంచి గులాబీ రంగులోకి మారడం ఒక లైఫ్‌టైమ్ మెమరీగా నిలుస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి జూరిచ్ వరకు విమాన ప్రయాణం చేసి యూరోప్ హదయం లాంటి స్విట్జర్లాండ్‌లోని ఈ అందమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. జూరిచ్ నుంచి రైలులో ప్రయాణిస్తూ పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఈ యాత్రలో కనిపించే సీనరీలు యూరోప్ అంటే ఏంటో చూపిస్తాయి.ఎక్కడ ఉండాలి? స్విస్ గ్రామాల్లో వుడెన్ చాలెట్స్‌లో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవం. బాల్కనీ నుంచి కనిపించే పర్వత శ్రేణులను చూస్తూ ప్రతీ ఉదయాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న గెస్ట్ హౌజుల్లో కూడా ఆత్మీయ అనుభవాన్ని పొందవచ్చు.ఏం చూడాలి?పర్వతాల వద్ద వాక్ చేయడం, సరస్సుల తీరంలో నిశ్శబ్దంగా కూర్చొని పుస్తకాలు చదవడం, కేబుల్ కార్లలో శిఖరాగ్రానికి చేరడంం ఇలా అనేక మరుపురాని ప్రదేశాలను చూస్తూ జీవితాంతం గుర్తుండే మెమోరీస్ సష్టించుకోవచ్చు.ఏం తినాలి?స్విస్‌లో బ్రెడ్, చీజ్ పరిమళం, చాక్లెట్ మధురిమలు చల్లని గాలిలో మరింత రుచిగా అనిపించేలా చేస్తాయి. చిన్న కేఫేలో కాఫీ సిప్ చేస్తూ బయట మంచు శిఖరాలను చూడడం ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఫుడ్ లవర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేచర్‌ను ఆస్వాదించే మనసు ఉంటే చాలు.చేయాల్సిన పనులుసూర్యోదయం సమయంలో మార్నింగ్ వాక్ చేయడం, సరస్సుల తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేయడం, కేబుల్ కార్లో ప్రయాణించడం, స్థానిక గ్రామాల్లో నిశ్శబ్దంగా సంచరించడం, అక్కడి వెరైటీ ఫుడ్‌ను ఆస్వాదించడం ఇలా మీరు ఎన్నో యాక్టివిటీస్ ΄్లాన్ చేసుకోవచ్చు.మంచును ఇష్టపడే మనసుకు.. ప్రశాంతతనిచ్చే మంచి ప్రదేశం. ఎండాకాలం అంటే వేడి అని మాత్రమే అనుకుంటాం. కానీ స్విస్ ఆల్ఫ్స్లో సమ్మర్ అంటే ఒక ఎవర్గ్రీన్ కూల్ మెమోరీని సొంతం చేసుకునే సమయం. ఇక్కడ సూర్యుడూ నేచర్‌ను ఎంజాయ్ చేస్తూ కూల్‌గా కనిపిస్తాడు. అందుకే యూరోప్ ఒక ఎవర్గ్రీన్ ట్రావెల్ డెస్టినేషన్‌గా నిలిచింది.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
అమెరికా వెళ్తున్నారా.. జాగ్రత్త..
-
సోలో లైఫే సో బెటరూ
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ ఈ ‘నిండైన’ దృశ్యం మెల్లిగా మార్పు చెందుతోంది. ఎక్కడ చూసినా సోలో ‘రాజా సాబ్’లు, ఏకాంతవాస రాణీ రత్నమాలలు దర్శనం ఇవ్వటం మామూలైపోయింది.సింగిల్ రిజర్వేషన్రెస్టారెంట్లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్‌తో మొదలైన ఈ ధోరణి, ఎవరో తోడు లేని వారు చేస్తున్న పని కాదు. ఎవరి తోడూ అవసరం లేదని అనుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గం. మునుపటిలా, ‘‘ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..’’ అని వేచి ఉండే రోజులు పోయాయి! ఇప్పుడు తినటానికైనా ఒక్కరే,విహరించటానికైనా ఒక్కరే.ఎవరూ లేక కాదుఇదేమీ ఒంటరితనం కాదు. ఒక స్వీయ చికిత్స. తనకి నచ్చినట్టు తాను ఉండటం మాత్రమే. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. తనకు నచ్చిన దారి, తనకు నచ్చిన వేగం, తనకు నచ్చిన స్థలం! సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక స్వేచ్ఛ.వింత అసలే కాదుభోజనం, ప్రయాణం, వినోదం.. ఇప్పుడు సోలో జీవన శైలికి సంకేతంగా మారింది. లైవ్ ఈవెంట్లకు ఒక్కరే వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఉదయ్‌పూర్, కూర్గ్, సిక్కిం వంటి సురక్షిత మైన ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. డిమ్ లైట్ల డైనింగ్ హాళ్లలో టేబుల్‌కు ఒకరే కూర్చొని భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఖర్చు తగ్గించుకోవటం కాదు, ఎంతైనా ఖర్చుపెట్టి ఏకాంతాన్ని కొనుక్కోవటం.మార్కెట్ పసిగట్టేసింది!ఇదేదో చిన్న మార్పు కాదని బిజినెస్ లోకానికి అర్థమైపోయింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న ఒక పెద్ద ‘వేవ్’ అని కనిపెట్టేసింది. ఇకనేం, కంపెనీల ఆలోచనా విధానమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ‘ఫ్యామిలీ’ చుట్టూ తిరిగిన మార్కెట్ ఇప్పుడు లైట్ హౌస్లా తన ఫోకస్‌ను ఒంటరి కెరటాల మీదకు మళ్లించింది.ఇండియాలో ‘ఒంటరి’ డేటా⇒ 2020నాటికి ఉన్న ఒంటరి వ్యక్తుల గృహాల సంఖ్య 1 కోటి 74 లక్షలు⇒ 2030కి ఒంటరి గృహాల సంఖ్యలో అంచనా పెరుగుదల 5.5 శాతం⇒ సోలో దేశీయ ప్రయాణాల బుకింగ్‌లలో పెరుగుదల : ఏటా 20–35 శాతం⇒ గత ఏడాది ఒంటరిగా ఈవెంట్లకు, సినిమాలకు వెళ్లినవారు : 18 లక్షలకు పైగా⇒ 2025–2030 మధ్య పెరగనున్న సోలో ట్రావెల్ మార్కెట్ విలువ సుమారు : రూ. 359 కోట్ల 36 లక్షల 50 వేలు -
ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)
-
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్‌లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?
ఏదైనా టూర్‌కి వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు, ప్లాన్లు వేసేస్తుంటాం. బడ్జెట్ సరిపోతుందనుకుంటే..టూర్ ప్లాన్ లేదంటే నో చెప్పేస్తాం. అలాంటిది ఈ దేశాలకు మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా హాయిగా చుట్టొచ్చేయొచ్చట. జస్ట్ చేతిలో వంద రూపాయాలుంటే చాలు హాయిగా అక్కడున్న ప్రదేశాలను ధీమాగా చూసేయొచ్చు. అదేంటని విస్తుపోకండి..ఎందుకంటే అక్కడ మన రూపాయి విలువే ఎక్కువ. అందువల్ల చేతిలో పదివేలు ఉన్నాచాలు..లక్షాధికారిలా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. మరి ఆ దేశాలేవో సవివరంగా తెలుసుకుందామా..!.ప్రవాసులకు అత్యంత సరసమైన ధరలో ఖర్చులు కలిసొచ్చే దేశాల జాబితాలో వియత్నాంది అగ్రస్థానం. భారతీయులు వియత్నాంకు జస్ట్ ఆన్లైన్ వీసా పొందే సదుపాయం కూడా ఉంది. అక్కడ హా లాంగ్ బే, హనోయ్, హో చి మిన్ సిటీ, హోయ్ ఆన్, మెకాంగ్ డెల్టా మొదలైన ప్రదేశాలను తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. తర్వాతి స్థానం లావోస్ది.లావోస్ఇక్కడ భూభాగంలో దాదాపు 70 శాతం అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్, కయాకింగ్, జిప్ లైనింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్ మొదలైన సాహస కార్యకలాపాలను తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు. ఇక్కడ పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్నాయి, లుయాంగ్ ప్రాబాంగ్, వియంటియాన్, కువాంగ్ సి జలపాతం, బుద్ధ పార్క్. మన రూపాయి ఇక్కడ కరెన్సీ ప్రకానం 253.25 లావోటియన్ కిప్‌లు పలుకుతుంది.ఇండోనేషియాఇండోనేషియా బాలి, జకార్తా, గిలి దీవులు, కొమోడో జాతీయ ఉద్యానవనం వంటి అనేక ఆకర్షణలతో సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశం. లెక్కలేనన్ని అగ్నిపర్వత ద్వీపాలు, స్పష్టమైన ఆకాశం, నీలి జలాలు, సముద్ర జీవులతో, ఇండోనేషియా ప్రపంచంలోని అతిపెద్ద ద్వీప దేశాలలో ఒకటి. తనహ్ లాట్ టెంపుల్ వద్ద సూర్యాస్తమయం, లెంబోంగన్ రీఫ్ క్రూయిజ్, ఆయుంగ్ వైట్ వాటర్ క్రూయిజ్ అన్నీ సందర్శించదగినవి. ఇక్క మన రూపాయి ఇండోనేషియా కరెన్సీలో 193.77 ఇండోనేషియా రుపియా.కంబోడియాఅందమైన పర్యాటక ప్రాంతాల్లో కంబోడియా ఒకటి . భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు 30 రోజుల్లో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అంగ్కోర్ వాట్, అలాగే అందమైన బీచ్‌లు, మ్యూజియంలు, అరణ్యాలకు నిలయం. ఇక్కడ ఒక రూపాయి విలువ 46.76 కంబోడియన్ రీల్పరాగ్వేఇది అసున్సియన్, పలాసియో డి లోపెజ్, మ్యూజియో డెల్ బారో, యిప్కారా సరస్సు, సాల్టోస్ డెల్ ముండో జలపాతాలు, లా శాంటిసిమా ట్రినిడాడ్ డి పరానా, సెర్రో కోరా నేషనల్ పార్క్, ఎన్కార్నాసియన్ పట్టణం వంటి అనేక ఆకర్షణలకు నిలయంగా ఉంది.దక్షిణ కొరియాఇక్కడ మన దేశ కరెన్సీ విలువ కాస్త తక్కువగా ఉంటుంది. దక్షిణ కొరియాలో వసతి కొంచెం ఖరీదైనది. ముఖ్యంగా సియోల్ వంటి ప్రధాన నగరాల్లో, వసతి, ఆహారం, రవాణా, ఆకర్షణల ఖర్చు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటుంది. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పటికీ, రవాణా ఖర్చులు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటాయి. దక్షిణ కొరియాలో ఏడు రోజుల పర్యటనకు రూ.70 వేల నుంచి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. విమాన ఛార్జీలు, వసతి ఖర్చును తగ్గించడానికి మార్గం ఆఫ్-సీజన్లో ప్రయాణించడం.ఇక్కడ ఒక్క రూపాయి 17.19 దక్షిణ కొరియా వోన్.(చదవండి: కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..) -
ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు
భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మ్యాపులో సింపుల్‌గా కనిపించినా.. అక్కడి వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రదేశమే మలానా గ్రామం. హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ లోయ పక్కనే, కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఒక పురాతన ప్రదేశం.ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఆలయాలను, గోడలను, మనుషులను తాకితే అధికారులు ఫైన్ వేస్తారు. స్థానికులకు ఎవరైనా బయటి వారు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేలపై లేదా కౌంటర్‌పై పెడతారు కానీ చేతికి ఇవ్వరు. పొరపాటున బయటి వాళ్లు టచ్ అయితే వెంటనే వెళ్లి స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.మలానా గ్రామాన్ని (Malana Village) చాలా మంది ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్యం ఉన్న ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ పోలీసు వ్యవస్థతో పని లేకుండా, జమ్లూ దేవత అనే స్థానిక దైవశక్తి సాక్షిగా తీర్పులు, నిర్ణయాలు జరుగుతాయి. మలానా ప్రజలు కానాశీ అనే ఒక సీక్రెట్ భాషలో మాట్లాడుతారు.ఇది ఎంత సీక్రెట్ అంటే, వారు మాట్లాడే పదాలు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులకు కూడా అర్థం కావు. అలాగే అలెగ్జాండర్ (Alexander) సైనికుల వంశం ఇక్కడ కొనసాగుతుందని కూడా కొంతమంది అంటారు, కానీ దానికి స్పష్టమైన రుజువులు లేవు.చదవండి: ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు -
అయోధ్య నుండి పూరి.. ఐఆర్సీటీసీ గోల్డెన్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తరచూ సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రకటిచింది. తొమ్మిది రాత్రులు, 10 పగటి రోజులు సాగే ఈ సుదీర్ఘ యాత్ర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభమై, ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుంది.ఈ యాత్ర చేయాలనుకునేవారు గయ, పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోల్‌కతా, గంగాసాగర్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ పర్యటనలో గయలోని విష్ణుపాద ఆలయం, పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, కోల్‌కతాలోని గంగాసాగర్, జసిదిహ్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి తదిరత పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.ఈ రైలులో మొత్తం 767 సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో 2 ఏసీ విభాగంలో 49, 3 ఏసీ విభాగంలో 70, స్లీపర్ క్లాస్‌లో 648 సీట్లు ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణ సౌకర్యంతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో శాకాహార భోజనం అందిస్తారు. అలాగే స్థానిక ప్రాంతాల సందర్శన కోసం ఏసీ లేదా నాన్-ఏసీ బస్సుల సౌకర్యం ఉంటుంది. ధరల విషయానికి వస్తే ఎకానమీ (స్లీపర్) క్లాస్‌కు ఒక్కొక్కరికి రూ. 19,110, స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) క్లాస్‌కు రూ. 31,720, కంఫర్ట్ (సెకండ్ ఏసీ) క్లాస్‌కు ₹41,980 గా నిర్ణయించారు. ఐదేళ్ల నుండి 11 ఏళ్ల లోపు పిల్లలకు స్వల్ప రాయితీతో కూడిన ధరలు వర్తిస్తాయి.ఈ ఆధ్యాత్మిక యాత్రను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ప్యాకేజీని ఈఎంఐ (ఈఎంఐ) పద్ధతిలో కూడా పొందే అవకాశం కల్పించారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా సులభ వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించే వెసులుబాటు ఉంది. తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని ఐఆర్సీటీసీ తెలిపింది.ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: ఆ వ్యాధితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం -
పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్
భారతదేశంలోని జెన్ జీ (Gen Z) నవ యువతలో సంగీతం ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్ టెక్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) విడుదల చేసిన తాజా అధ్యయనం పలు ఆసక్తి వివరాలు తెలియజేస్తోంది. సంగీత కచేరీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్ యువయాత్రలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఎయిర్‌బీఎన్‌బీ ‘ఎక్స్పీరియన్స్-లెడ్ ట్రావెల్ ఇన్సైట్స్’ రిపోర్ట్ ప్రకారం, 2026లో 62% యువ భారతీయులు కచేరీలు, సంగీత ఫెస్టివల్స్ కోసం ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఇది సంప్రదాయ విహారం కోసం చేసే యాత్రల నుండి సాంస్కృతిక అనుభవాల ఆధారిత యాత్రల వైపు మార్పును సూచిస్తుంది. ఇప్పటికే 76% మంది జెన్ జీ ప్రతినిధులు.. సంగీత కార్యక్రమం కోసమే తాము ఓ కొత్త నగరాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు.ఈవెంట్ ముగిసినా..ఇలా మ్యూజిక్ ఈవెంట్ల కోసం వెళ్లినవారు ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఈవెంట్ అయిపోయాక కూడా అక్కడే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అన్వేషిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 53% మంది ఇలాగే స్థానిక ప్రాంతాలు, కాఫీ షాపులు, నైట్‌లైఫ్, సాంస్కృతిక హాట్స్పాట్లను చూడటం కోసం తమ వసతిని మరికొన్ని రోజులు కొనసాగించారు.విదేశాలకూ వెళ్తాం..ఈ సంగీత ఆధారిత యాత్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 40% కి పైగా జెన్ జీ ప్రతినిధులు అంతర్జాతీయంగా జరిగే మ్యూజిక్ ఈవెంట్ల కోసం ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 70% మంది ఫ్రెండ్స్ తో సమూహంలో ఈ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రూప్ స్టేలకు డిమాండ్‌ను పెంచుతోంది.ఖర్చు లెక్కేం లేదు..ఇలా మ్యూజిక్ ట్రిప్‌లకు వెళ్లడం కోసం ఖర్చుకు కూడా వెనకాడటం లేదు భారత జెన్‌జీ యువత. ప్రతి పది మందిలో ఆరుగురు యువ యాత్రికులు తమ నెలవారీ ఆదాయంలో 21–40% మ్యూజిక్ కన్సర్ట్ -ఆధారిత ట్రిప్లపైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో సంగీత కార్యక్రమ ప్రయాణానికి చేసే సగటు ఖర్చు రూ.51 వేల దాకా ఉంటోంది.ఇదీ చదవండి: ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి -
విదేశాంగ శాఖ కీలక సూచనలు
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లే భారత పౌరులు అత్యవసరమైతే తప్ప ఆదేశానికి వెళ్లకూడదని సూచించింది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్లో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరడంతో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, కఠినఆంక్షలు విధించడం తదితర చర్యలు చేపట్టారు. ఈ నిరసనల్లో బలగాల కాల్పుల్లో దాదాపు 15మందికి పైగా మృతిచెందారు.దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇరాన్లో జరుగుతుంది నిశితంగా గమనిస్తున్నాం. గతంలో మాదిరి అమాయకులను చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుంది. అని అన్నారు. దీంతో మరోసారి ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది. భారతీయులు అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు వెళ్లకూడదని తెలిపింది. అదేవిధంగా ఆదేశంలో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.అదే విధంగా భారత ఎంబసీకి సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అందుకు ఎంబసీ వెబ్సైట్, సోషల్ మీడియా ఫాలో కావాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో అధికశాతం మంది విద్యార్థులే. -
మేఘాల మధ్య దోబూచులాడే భానోదయాన్ని తిలకించాలంటే..!
మంచు తెరలను కప్పుకున్న పచ్చని కొండ కోనలు..మేఘాల మధ్య దోబూచులాడుతూ ఆకాశాన అద్భుతమైన భానోదయాన్ని తిలకించాలంటే అది వంజంగిలోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో సన్‌రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్‌రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వంజంగి అనే పేరు వినగానే చాలా మంది మనసులో మెదిలేది మేఘాల మధ్య నుంచి వెలుగులు చిందిస్తూ ఉదయించే సూర్యుడు. కమర్షియల్ హంగులు లేని ఈ గిరిజన ప్రాంతం, ప్రకృతి సహజ అందాలతో ప్రశాంతమైన పర్యాటక అనుభవాన్ని అందిస్తోంది. తెల్లవారుజామున ఆకాశంలో మేఘాలు దోబుచులాడే విన్యాసమే వంజంగిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అరకు దగ్గరలో.. ప్రకృతి మధ్యలో..అరకు లోయకు సమీపంలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పాడేరు మండలానికి దగ్గరగా ఉన్న వంజంగి కొండ, ఇటీవలి కాలంలో పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్న అందమైన ప్రాంతం. ఒకప్పుడు సాధారణ గిరిజన గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు యువ పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, సోలో ట్రావెలర్ల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందింది.గుడ్మార్నింగ్వంజంగి చేరుకోవడానికి పర్యాటకులు సుమారు రెండు గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తారు. రాత్రి మొత్తంట్రెక్కింగ్ చేసి అలసిపోయిన క్షణంలో, మేఘాలను చీల్చుకుంటూ భానుడు ‘గుడ్‌మార్నింగ్’ చెప్పే దృశ్యం కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణమే చాలుం అలసట అంతా మరిచిపోయి, మరో ప్రపంచంలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి కలుగుతుంది.ఎటు చూసినా కొండలను దుప్పటిలా కప్పేసిన మేఘాలుం వాటి మధ్య నుంచి తన కిరణాలతో సందర్శకులను తాకే సూర్యుడు. ఈ అరుదైన దృశ్యం కోసమే పర్యాటకులు దూర దూరాల నుంచి వంజంగి చేరుకుంటారు.రోజుకో తీరువంజంగిలో సూర్యోదయం ప్రతీ రోజూ ఒకేలా ఉండదు. ఇదే ఇక్కడి అసలైన ప్రత్యేకత. కొన్ని రోజులు మేఘాలు పరుపులా పరిచేసినట్టు కనిపిస్తాయి. ఆ మేఘాల మధ్య మధ్యలో సూర్యుడు క్షణకాలం దర్శనమిచ్చి మళ్లీ మాయం అవుతాడు. మరోసారి ఫోటో తీసుకుందాం అనుకునేలోపే మబ్బులు కమ్మేస్తాయి. కానీ కనిపించిన ఆ ఐదు నిమిషాలే చాలుం జీవితాంతం గుర్తుండి΄ోయే జ్ఞాపకాలు మిగులుతాయి.క్లౌడ్ బెడ్ సన్రైజ్వంజంగిని చాలామంది ‘క్లౌడ్ బెడ్ సన్‌రైజ్’ అని పిలుస్తారు. ఉదయం ఐదు గంటలకు కనిపించే సూర్యోదయాన్ని వీక్షించేందుకు చాలామంది తెల్లవారుజామున 3–4 గంటలకే ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. సాధారణంగా ఒక రోజు ముందే అరకు చేరుకుని, అక్కడి నుంచి పాడేరు దారి మీదుగా వంజంగివైపు ప్రయాణిస్తారు. సుమారు రెండు గంటల ట్రెక్కింగ్ అనంతరం వ్యూ పాయింట్ చేరుకుంటారు.లగ్జరీ కాదు నిజజీవితంవంజంగి పర్యాటకం అంటే లగ్జరీ కాదు. ఇక్కడ కృత్రిమ ఏర్పాట్లు, భారీ సంఖ్యలో పర్యాటకులు, గలగలా మోగే శబ్దాలు కనిపించవు. గిరిజన గ్రామం కావడంతో హోమ్‌స్టేలు కూడా పరిమితంగానే ఉంటాయి. విద్యుత్ సరఫరా, మొబైల్ సిగ్నల్స్ కొన్నిసార్లు బలహీనంగా ఉండొచ్చు. కానీ ఈ చిన్న చిన్న అసౌకర్యాలే వంజంగిని ఒక ప్యూర్ ట్రావెల్ డెస్టినేషన్‌గా మార్చాయి.– ఎం.జి.కిశోర్, ట్రావెలర్బాధ్యతాయుతమైన పర్యాటకానికి ఉదాహరణసోషల్ మీడియా కారణంగా వంజంగి పాపులారిటీ పెరిగినా, ఇప్పటికీ ఇది కమర్షియల్ పర్యాటక కేంద్రంగా మారలేదు. ఇది లోపం కాదు, పెద్ద ప్లస్ పాయింట్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం పర్యాటకులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. దీని వల్ల ఈ ప్రాంతం తన సహజ స్వరూపాన్ని ఇప్పటికీ నిలుపుకుంటోంది.ఎప్పుడు వెళ్లాలి?వంజంగి సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు సరైన సమయం. ఈ సమయంలో పొగమంచు, మేఘాల మధ్య నుంచి సూర్యుడు ఉదయించే దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సన్‌రైజ్ చూడాలంటే ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్య వ్యూ పాయింట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ ఉండాలి?విశాఖ జిల్లా నుంచి లంబసింగి లేదా అరకు చేరుకుని, అక్కడి నుంచి వంజంగి ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. ఉదయం 5:00–6:30 మధ్య మబ్బుల మ్యాజిక్ షో ముగిసిన వెంటనే ఎక్కువ మంది తమ హోటల్‌కి వెళ్తారు. చాలామంది అరకును బేస్ చేసుకుని వంజంగి ట్రిప్ ప్లాన్ చేస్తారు. వంజంగికి దగ్గరలోని పాడేరు మండలంలో కూడా నైట్‌స్టే ప్లాన్ చేయవచ్చు. అక్కడి నుంచి షేరింగ్ ఆటో లేదా జీప్ ద్వారా వంజంగి కొండ పాదం వరకు చేరుకోవడం సులభం. వంజంగి, ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ప్రకృతిని గౌరవిస్తూ, ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించగలిగే ఒక ప్రత్యేక అనుభవం. బయటి ప్రపంచానికి దూరంగా ఒకరోజు గడపాలి అనుకునేవారికి ఇది ఒక అవసరం.ఎం జి కిశోర్ ట్రావెలర్(చదవండి: ట్రావెల్స్‌లో సరికొత్త ట్రెండ్స్..! ఇలాంటి టూర్స్ గురించి విన్నారా?) -
ట్రావెల్స్‌లో సరికొత్త ట్రెండ్స్..! ఇలాంటి టూర్స్ గురించి విన్నారా?
ఏ కాలంలో అయినా ప్రయాణమంటే సంతోషం. ఉల్లాసం. ఉత్సాహం. అయితే కాలంతోటు ప్రయాణాలకు సంబంధించి అభిరుచులు, ఆసక్తులు, ట్రెండ్స్ మారుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ట్రెండ్స్ గురించి...రోడ్ ట్రిప్పదిమందితో కలిసి ప్రయాణాలను ఎంజాయ్ చేసే వారు ఒక రకం. ఒంటరిగా మాత్రమే ఎంజాయ్ చేసే వారు మరొక రకం. రెండో కోవకు చెందిన వారికి నచ్చిన ట్రెండ్...రోడ్ ట్రిప్. హిల్టన్ ‘ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రపంచవ్యాప్తంగా రోడ్ ట్రిప్‌లకు పెరుగుతున్న ఆసక్తి గురించి వెల్లడించింది. ‘క్లాసిక్ రోడ్ ట్రిప్ అనేది లగ్జరీ అనుభవం’ అంటున్నాడు డ్రైవింగ్ హాలిడే స్పెషలిస్ట్ హంటర్ మోస్. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణల పట్ల ఆసక్తి చూపే వారు రోడ్ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు. జెన్ జీలో ఎక్కువ మంది సోలో రోడ్ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు.‘చే గువేరా ది మోటర్‌సైకిల్ డైరీస్ పుస్తకం చదివిన తరువాత, మోటర్ బైక్‌పై ప్రయాణాలు చేయాలనే ఆసక్తి మొదలైంది. మొదట్లో కష్టం అనిపించినా ఆ తరువాత ఎలాంటి సమస్య అనిపించలేదు. రోడ్డు ట్రిప్లతో మనసు ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చేతన్.‘ఉత్తర అమెరికా, యూరప్‌లలో కారు అనేది వాహనం మాత్రమే కాదు. అంతకుమించి. రోడ్డు ప్రయాణాలలో అది వారికి స్నేహితుడు. రోడ్డు పొడవునా కారుతో ముచ్చట్లు చెబుతూ ప్రయాణిస్తుంటారు చాలామంది’ అంటుంది ఒక ట్రావెల్ డిజిటల్ సంస్థలో చీఫ్ బిహేవియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిలేనా నికోలోవా.అల్ట్రా పర్సనలైజ్డ్ ట్రిప్స్ప్రయాణం అంటేనే సంతోషం. అయితే విషాద సమయాల్లో చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. విషాదం నుంచి బయటి పడి మనసును తేలిక చేసుకునే ప్రయాణాలు ఇవి. ఇలాంటి అల్ట్రా పర్సనలైజ్డ్ ట్రిప్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకున్నాయి.కుటుంబ సభ్యుల మరణం, విడాకులు తీసుకోవడం... ఇలా జీవితంలోని రకరకాల విషాదాల నుంచి బయటపడడానికి ఈ స్పెషల్ టూర్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘గ్రీఫ్ టూర్స్ అనేవి ట్రావెల్ ఇండస్ట్రీకి సరికొత్త అవకాశం’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మిన్ బినా.‘విషాదాల నుంచి బయటపడడానికి ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు ఏ మేరకు ఉపయోగపడతాయి?’ అని చెప్పడానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు పరిమితంగానే ఉన్నప్పటికీ ‘విషాదం నుంచి బయటపడే ఒక మార్గం...ప్రయాణం’ అనేదాంట్లో విభేదాలు లేవు.న్యూరో ఇమేజింగ్‌తో దుఃఖాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త మేరీ ఫ్రాన్సిస్... ‘ప్రయాణం అనేది దుఃఖం నుంచి బయటపడే మార్గాలలో ఒకటి’ అన్నారు. దుఃఖం నుంచి బయటపడే ఈ మార్గాన్ని ‘వెల్నెస్ ట్రావెల్ ట్రెండ్’ అని కూడా పిలుస్తున్నారు. ‘రెండు ప్రపంచాల మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయాణం ఉపకరిస్తుంది. అదుపు తప్పిన భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం ద్వారా దుఃఖభారాన్ని తగ్గించుకోవచ్చు’ అంటున్నారు డాక్టర్ రాబర్ట్ నీమెయర్. (చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..) -
ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! ఎక్కడంటే..
రోమ్‌లో ఉంటే రోమన్‌లాగా ఉండాలి అని విన్నాం కానీ మనం ఉన్న చోటునే రోమ్లాగా తీర్చిదిద్దుకోవాలి అనే మాట విన్నామా? చుట్టూ కొండల నడుమ, మధ్యలో సరస్సు దాని చుట్టూ ఇళ్లు, రాతి రహదారులు... అచ్చం ఇటలీని పోలినట్టు తీర్చిదిద్దబడిన ఆ సిటీని చూస్తే కళ్లు అప్పగించాల్సిందే. భారతదేశంలోనే ఏ హిల్ స్టేషన్‌కూ లేని ప్రత్యేకతలెన్నో ఉన్న ఆ పర్వత పట్టణం పేరు లావాసా.పూణే సమీపంలో కొలువుదీరిన లావాసాను ’ఇటలీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. దాని పాస్టెల్–రంగు భవనాల, సరస్సు సమీపంలో విహారయాత్రలు ఇరుకైన వీధుల నడుమ నడవగలిగే బౌలేవార్డ్‌లు సందర్శకులకు యూరోపియన్ అనుభూతిని అందిస్తాయి ఇదే ఇతర భారతీయ హిల్ స్టేషన్ల నుంచి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అన్నింటికంటే విశేషం ఏమిటంటే... క్రమక్రమంగా విస్తరించిన ఊటీ లేదా సిమ్లా వంటి సాంప్రదాయ హిల్ స్టేషన్ ల మాదిరిగా కాకుండా, ఈ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించడం,భారతీయ కొండ వాతావరణంలో యూరోపియన్ అనుభూతిని పునఃసృష్టించడం, ప్రణాళికాబద్ధమైన కృషితో ప్రపంచ ఆకర్షణను మిళితం చేయడం అనే లక్ష్యాలతో ఇది రూపొందింది. పర్యాటకం, నివాస జీవితం విశ్రాంతి మూడింటిని కలగలిపి ఓ సుందరమైన ప్రదేశంలో మిళితం చేసి లావాసాను పునాదుల స్థాయి నుంచే నిర్మించారు. ఈ సిటీ లే అవుట్, డిజైన్ ఇటలీలోని తీరప్రాంత పట్టణం అయిన పోర్టోఫినో నుంచి ప్రేరణ పొందింది, ఇది పాదచారులకు అనుకూలమైన వీధులు, టెర్రకోట పైకప్పులు రాళ్లతో చేసిన దారులతో ఉంటుంది. భవనాలు పీచ్, ఆలివ్ వంటి తేలికపాటి పాస్టెల్‌లతో పెయింట్ చేశారు, తోరణాలు టెర్రస్‌లు యూరోపియన్ ఆకర్షణను అందిస్తాయి. ఫోటోగ్రాఫర్లు, ప్రయాణికులు, వారాంతపు సందర్శకులను ఆకర్షించే విశ్రాంతి, సెలవుదినం లాంటి వాతావరణాన్ని సృష్టించడానికి రూపకర్తలు బహిరంగ ప్రదేశాలు, నడవగలిగే వీధులు సరస్సు వీక్షణలపై దృష్టి సారించారు. దాస్వే సరస్సు చుట్టూ ఉన్న విహార ప్రదేశం. కేఫ్‌లు, బోటిక్‌లు బహిరంగ సీటింగ్ ప్రాంతాలతో ఇటాలియన్ ఓడరేవు పట్టణాల తరహాలో రిలాక్సడ్ వాటర్ ఫ్రంట్ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని ఇస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఈ విహార ప్రదేశంలో నడవడం లేదా సైక్లింగ్ చేయడం వల్ల చాలా మంది సందర్శకులు యూరోపియన్ హాలిడే పట్టణంలో ఉన్నట్లు స్పష్టమైన అనుభూతిని పొందుతారు. పర్యావరణపరంగా సున్నితమైన పశ్చిమ కనుమలలో ఉండటం వల్ల, లావాసా రూపకల్పన సమయంలో పర్యావరణ అడ్డంకులు ఎదుర్కుంది. నీటి వినియోగం, కొండ–వాలు స్థిరత్వం అటవీ సంరక్షణపై దృష్టి సారించి, హరిత చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని సమీక్షించే క్రమంలో అధికారులు పలు దఫాలు నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. అది పర్యావరణ ప్రమాదాలను తగ్గించుకుంటూ పట్టణం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. వారాంతపు విహారయాత్రకు లావాసా సరైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలం పూర్తయిన తర్వాత పచ్చని కొండలు స్పష్టమైన సరస్సు కళ్లు విప్పార్చుకునేలా చేస్తాయి. అనువైన నెలలు.లావాసా ప్రత్యేకతలుభారతదేశంలోని మొట్టమొదటి ప్రణాళికతో కూడిన కొండ నగరంఈ పట్టణంలో బోటింగ్ విశ్రాంతి కార్యకలాపాల కోసం రూపొందించిన మానవ నిర్మిత సరస్సు ఉంది.వీధులకు కోమో జెనీవా వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరస్సులు కొండల పేర్లు ఉంటాయి.మిగిలిన హిల్ స్టేషన్స్‌కు భిన్నంగా ఈ సిటీలో సాంస్కృతిక ఉత్సవాలు సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి.సాహస కార్యకలాపాలలో ఉన్నవారి కోసం కొండలపై ట్రెక్కింగ్, విహార ప్రదేశాలలో సైక్లింగ్ సరస్సులో జల క్రీడలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఇండియన్ ఇటలీకి చేరుకోవాలంటే పూణే లేదా ముంబై మీదుగా వెళ్లవలసి ఉంటుంది. పూణే నుంచి దూరం దాదాపు 60కి.మీ కాగా, ప్రయాణ సమయం 2 గంటల వరకూ పడుతుంది ముంబై నుంచి 190 కి.మీ దూరంలో ఉంది, ప్రయాణ సమయం దాదాపు 5 గంటలు పడుతుంది.(చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..
ఈరోజుతో 2025కి గుడ్ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్ 31 రాత్రి ఉండే సందడి, జోష్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. దీనికి మించి బ్యూటిఫుల్ స్పాట్ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్‌కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్ నేషనల్ పార్క్ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ప్లేష్. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్‌లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్‌ఫుల్‌గా ఉంటుంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్ స్పాట్‌గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో సవాయి మాధోపూర్‌కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్ వేడుకలు మరింత స్పెషల్ ప్రియాంక గాంధీ కుటుంబానికి. ప్రత్యేకతలు..పెద్దపులులకు నిలయం ఈ పార్క్. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్‌లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి. అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్ కండిషనింగ్, వైఫై, వాలెట్ సేవలు, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్‌లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది. కాగా న్యూఇయర్ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్ ఉద్యానవనంని రాహుల్ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.(చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..!) -
దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పరిసరాల్లో దృశ్యమానత (Visibility) గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పొగమంచు ప్రభావంతో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్,ఎయిర్ ఇండియా మొదలైనవి తమ విమాన సర్వీసుల్లో జాప్యం జరుగుతున్నదని వెల్లడించాయి. తక్కువ దృశ్యమానత కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ‘క్యాట్ III’ ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల షెడ్యూల్లో మార్పులు తప్పవని స్పష్టం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల ఆలస్యం కారణంగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్స్ అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు చలి, మరోవైపు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు సర్వీసులపై కూడా ఈ పొగమంచు ప్రభావం పడటంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది.ఈ నేపధ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు ఇంటి నుండి బయలుదేరే ముందే తమ విమాన స్థితిగతులను తెలుసుకోవాలని, ఇందుకోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎయిర్‌లైన్స్ పంపే ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే విమానయాన సంస్థల హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించాలన్నారు.ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు! -
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్‌లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్‌కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. -
ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..
భారత ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ని ప్రారంభించింది. ఈ విధానంతో విమానం మిస్సవుతుందనే భయం లేకుండా నిశ్చింతగా విదేశాలు చుట్టొచ్చేయొచ్చు. అంతేగాదు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడకుండా ఈజీగా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇది ప్రముఖుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది కూడా. అందుకు నిదర్శనం బాలీవుడ్ తారలు సుస్మితా సేన్, రాణి ముఖర్జీలు ఈ చొరవకు సైన్అప్ చేయడమే. ఆ విషయాన్ని స్వయంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేసుకున్న వీడియోలను షేర్ చేసింది కూడా. ఒక వీడియో క్లిప్‌లో రాణి ముఖర్జీ తన బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానికి క్యాప్షన్‌గా "మర్దానీ శివానీ శివాజీ రాయ్ ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌లో నమోదు చేసుకున్నప్పుడూ దేశం కూడా అనుసరిస్తుంది" అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఇక మరో వీడియో క్లిప్‌లో సుస్మితా సేన్ బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేస్తున్నట్లుగా షేర్ చేస్తూ.."సుష్మితా సేన్ క్యూను స్కిప్ చేయాలనుకుంటోంది.. మరి మీరు" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. వీళ్లంతా ఎందుకు ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం నమోదు చేసుకుంటున్నారు? దీనికి ఎవరు అర్హులు? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!FTI-TTP అంటే ఏమిటి?ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ (FTI-TTP) అంతర్జాతీయ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సులభతరం చేయడమే దీని ప్రధానోద్దేశ్యం. క్యూలైన్లలో పడిగాపులు పడకుండా తక్కువ సమయంలో ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకియను పూర్తి చేసేలా ఈ ప్రక్రియ అనుమతిస్తుంది. ఇది 2024లో ప్రారంభమైంది. జస్ట్ 30 సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు అనుమతిస్తుంది. విమానాశ్రయంలో నిరీక్షించాల్సిన పని ఉండదు, అలగే తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎలా అంటే..FTI-TTP కింద నమోదు చేసుకున్న ప్రయాణీకులు సాధారణ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద లైన్లో నుంచోవాల్సిన పని ఉండదు. సంబంధిత విమానాశ్రయాల్లో వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది.రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎవరు అర్హులు?భారతీయ పౌరులుభారతదేశ విదేశీ పౌరసత్వం (OCI) కార్డులు కలిగి ఉన్న విదేశీ పౌరులుపాస్పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి.ఒక్కసారి రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి అయితే ఐదేళ్లు లేదా పాస్‌పోర్ట్ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటవ్వుతుంది. అలాగే ఇది ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది.ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..దరఖాస్తు ప్రక్రియ ఎక్కువగా ఆన్లైన్లో ఉంటుంది. అనుసరించడం సులభం.ఆన్లైన్ దరఖాస్తు: ftittp.mha.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించి ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్ ఫోటో, స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ పేజీలు, నిర్థారిత అడ్రస్, OCI కార్డ్ (వర్తిస్తే) అప్లోడ్ చేయాలి.ఆ తర్వాత అధికారులు సమర్పించిన వివరాలను ధృవీకరిస్తారు. క్లియర్ అయిన తర్వాత దరఖాస్తుదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం అందిస్తారు.బయోమెట్రిక్ అపాయింట్మెంట్: FRRO కార్యాలయంలో లేదా నియమించబడిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అపాయింట్మెంట్ సమయంలోనే వేలిముద్రలు, ముఖ డేటాని నమోదు చేసుకోవాలి. అయితే తుది ఆమోదం ఒక నెల వరకు పట్టవచ్చు.ఎందుకు తిరస్కరింపబడతాయంటే..తప్పుగా లేదా తప్పుడు సమాచారంముఖ్యమైన వివరాలను దాచడంఅస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలు లేదా ఫోటోలుతప్పుగా లేదా తప్పుడు అడ్రస్ చివరగా దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించిన తర్వాత ఈమెయిల్ లేదా SMS ద్వారా రసీదును అందుకుంటారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితే, సమస్యలను సరిదిద్దిన తర్వాత వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.(చదవండి: -
ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్‌గా..
తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీ. దీనిని "భారతదేశపు స్విట్జర్లాండ్" అని కూడా పిలుస్తారు, ఇది వేసవికాలంలో గొప్ప విడిది స్థలం. ఊటీ ఎల్లప్పుడూ హృదయానికి హాయిగా అనిపించే హిల్స్టేషన్లలో ఒకటి. ఈ ముగ్ధ మనోహరమైన పట్టణాన్ని చూసేందుకు పలు కుటుంబాలు, జంటలు, ఒంటరి పర్యాటకులు, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారు ఇక్కడి ఎత్తైన కొండలను అన్వేషించేందకు వాలిపోతుంటారు. ఓ పక్క అందమైన మేఘాల కదలికలు..మరోవైపు వేడి టీ ఆస్వాదిస్తూ..పైన్ అడువుల గుండా నిశబ్దంగా వెళ్తుంటే..మిమ్మల్ని వేగాన్ని తగ్గించి ప్రతి క్షణం ఆస్వాదించేలా అనుభూతి చెందేలా చేస్తుంది అక్కడి ప్రకృతి కమనీయ దృశ్యాలు. ప్రస్తుతం ఇది అందానికే కాదు, బాధ్యతాయుతమైన పర్యాటకాలో మేటి అనిపించికుంటోంది ఊటీ. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజుల క్రితం ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ బార్గవి సిలాపర్శెట్టి ఊటీ ట్రిప్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించడంతో చాలామంది ప్రయణికులు ఆ మిషన్ల వద్ద వాటర్‌ని నింపుకుని తెచ్చుకోవడం ఆసక్తిని రేకెత్తించడంతో ఆ విషయాన్ని బార్గవి ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా సందర్శకులు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడే నీటి ATMలను పట్టణంలో ఏర్పాటు చేశారు. అక్కడ భార్గవి నీటి ఏటీఎం కియోస్క్‌కు చేరుకుని అక్కడ లోపల ఉన్న ఒక మహిళకు ఆ బాటిల్‌ని అందజేయగానే ఆమె వేడి నీటిని నింపి తిరిగి భార్గవికి అందజేస్తుంది. ధర ఎంత అనడగగానే కేవలం రూ. 10 అని చెబుతుండటం కనిపిస్తుంది వీడియోలో. ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా ప్రతి పర్యాటక ప్రదేశంలోనూ దీన్ని అమలు చేయాలని కొందరూ, దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక పద్ధతి ఉండాలని మరికొందరూ ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ ఊటీలో చూడదగ్గ కమనీయ ప్రదేశాలేంటంటే..1. ఊటీ సరస్సుపట్టణంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ బోటింగ్‌కు వెళ్లవచ్చు, సరస్సు చుట్టూ విశ్రాంతిగా నడవవచ్చు లేదా కూర్చుని దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ఉల్లాసంగా ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది.2. నీలగిరి పర్వత రైల్వేఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పనిసరిగా చేయాలి. ఇది సొరంగాలు, అడవులు, టీ తోటల గుండా నెమ్మదిగా కదులుతుంది. అక్కడ ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీస్తూ మునగిపోతాం. 3. టీ తోటలు, టీ ఫ్యాక్టరీఊటీలోని టీ ఎస్టేట్లు అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. పచ్చని పొలాల గుండా నడిచి టీ ఎలా తయారు చేస్తారో చూడటానికి టీ ఫ్యాక్టరీని సందర్శించొచ్చు. అక్కడ తప్పనిసరిగా తాజా టీ కొనడం మర్చిపోవద్దు.4. బొటానికల్ గార్డెన్ఇక్కడ రంగురంగుల పూలతో నిండిన ఈ తోట గుండా ప్రశాంతంగా నడవడం అద్భుతంగా ఉంటుంది. ఇది ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అందంగా ఉంటుంది.5. దొడ్డబెట్ట శిఖరంఊటీలోని ఎత్తైన ప్రదేశం నీలగిరి విస్తృత దృశ్యాలను అందిస్తుంది. పర్యావరణ అనుకూలలమైన రోజున ఈ కొండను ఎక్కేందుకు అద్భుత క్షణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఊటీ ప్రయాణం అందంతోపాటు బాధ్యతయుతమైన పర్యాటకంగా అందరి మనసులను దోచుకుంటోంది. View this post on Instagram A post shared by Bhargavi Silaparsetty (@bhargavi_silparsetty) (చదవండి: 'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!) -
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్‌హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్‌లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్‌జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్‌జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?
ఏటా పెరుగుతున్న భారతీయుల పర్యాటకాసక్తి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది కూడా మనోళ్లు టూర్ ఇష్టులుగానే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని అలీఎక్స్‌ప్రెస్ అనే సంస్థ తాజా ట్రావెల్ ట్రెండ్స్ 2026 నివేదిక వెల్లడించింది. మన వాళ్లు వచ్చే ఏడాది ఏ యే ప్రాంతాలను చూడాలని ఆశిస్తున్నారు? అనేది విశ్లేషించేందుకు అలీ ఎక్స్‌ప్రెస్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పదివేల ట్రావెల్ డేటా పాయింట్లను విశ్లేషించిన ఫలితంగా రూపొందిన ఈ నివేదిక రాబోయే సంవత్సరానికి భారతీయ ప్రయాణికుల ప్రాధాన్య జాబితాలో ఉన్న టాప్ టూరిస్ట్ ప్లేసెస్‌ను ఆవిష్కరించింది. 2026లో భారతీయులు సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న టాప్ 10 గమ్యస్థానాలు ఇక్కడ ఉన్నాయి. జోర్హాట్భారతదేశంలోని అస్సాం రాష్ట్రం ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆసక్తిని బాగా చూరగొంటోంది. అస్సాం హృదయం లాంటి ప్రదేశం జోర్హాట్, విస్తారమైన టీ ఎస్టేట్లు, గొప్ప వారసత్వం, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులికి సమీపంలో టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం చరిత్ర, పచ్చని ప్రకృతి సౌందర్యం, ఉత్సాహభరితమైన అస్సామీ సంప్రదాయాల ప్రశాంతమైన మిశ్రమానికి నెలవుగా ఉంటుంది.జాఫ్నాపామిరాతో కప్పబడిన తీరాలు, పురాతన దేవాలయాలతో, జాఫ్నా శ్రీలంక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తుంది. వచ్చే ఏడాది భారతీయ ప్రయాణికులు (Indian Tourists) ఈ ప్రాంతం చూడాలని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, తమిళ సంస్కృతి వంటకాలతో ఇది భారతీయుల మది దోచుకుంటోంది. ముఖ్యంగా కొత్తగా వృద్ధి చెందిన విమానాల సంఖ్య గతంలో కంటే అక్కడకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.మస్కట్కఠినమైన పర్వతాలు అరేబియా సముద్రం మధ్య ఉన్న మస్కట్, అరేబియా వారసత్వంతో ఆధునిక సంప్రదాయాల సొగసైన మిశ్రమంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. గొప్ప గొప్ప మసీదులు చారిత్రాత్మక కోటల నుంచి ఉత్సాహభరితమైన సౌక్లు సముద్రతీర విహార ప్రదేశాల వరకు, ఈ రాజధాని నగరం తక్కువ విలాసవంతమైన శాశ్వత ఆకర్షణను అందిస్తుంది.క్వీన్స్టౌన్న్యూజిలాండ్ దేశంలోని క్వీన్స్టౌన్ కూడా భారతీయుల ఎంపిక జాబితాలో చోటు సంపాదించింది. వాకటిపు సరస్సు ఒడ్డున ఉన్న ఇది సాహసోపేతమైన ప్రకృతి ప్రేమికులకు అంతిమ ఆట స్థలం. ది రిమార్కబుల్స్ పర్వత శ్రేణితో చుట్టుముట్టబడిన ఇది థ్రిల్, ప్రశాంతతను సజావుగా మిళితం చేస్తుంది. ఐకానిక్ అనుభవాలలో బంగీ జంపింగ్, సుందరమైన ట్రైల్స్, వైన్ తయారీ కేంద్రాలు విశ్రాంతి స్పా రిట్రీట్లు దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.చియాంగ్ రాయ్థాయిలాండ్ లోని చియాంగ్ రాయ్ ఆధ్యాత్మికత కళాత్మకతను కలిసే ప్రదేశం. వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, ప్రశాంతమైన టీ తోటలు, రోలింగ్ హిల్స్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లతో, వైవిధ్యభరిత సంస్కృతుల మధ్య కూడా ప్రశాంతతను కోరుకునే వారికి ఇది స్వర్గధామంగా నిలుస్తోంది.వారణాసిమన దేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాసి (Varanasi) ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అత్యధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. గంగా నది ఒడ్డున మంత్రముగ్ధులను చేసే సాయంత్రం హారతిని వీక్షించడం, సూర్యోదయంలో పవిత్ర స్నానం చేయడం, పురాతనమైన పురాణాలను, ఇతిహాసాల వేదికగా.. పురాతన దేవాలయాలు ఈ నగరాన్ని ఏటా భారతీయ పర్యాటకులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానంగా ఉంటోంది.మనీలాఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా అనేది వైరుధ్యాల నగరం, అక్కడ వలసరాజ్యాల యుగపు గోడలు నియాన్–లైట్ల వెలుగుల్లో దర్శనమిస్తాయి. ఉల్లాసమైన వీధులు, ఇంట్రామురోస్ వంటి చారిత్రాత్మక జిల్లాలు, సందడిగా ఉండే ఆహార మార్కెట్లు ఉత్సాహభరితమైన రాత్రి జీవితం దీనిని సాంస్కృతిక శక్తి కేంద్రం ఇది. ఫిలిప్పీన్స్‌కు చెందిన సుందరమైన ద్వీప సౌందర్యాలను ఆస్వాదించేందుకు సరైన ప్రదేశం. టిబిలిసిజార్జియాలోని టిబిలిసి పాత కాలం నాటి ఆకర్షణ, ఆధునిక సామర్ధ్యం రెండింటితో నిండి ఉంది. రాళ్లతో కప్పబడిన వీధులు శతాబ్దాల నాటి చర్చిలు, థర్మల్ బాత్‌లు సమకాలీన ఆధునిక కేఫ్‌లకు ఇది నిలయం. సృజనాత్మక శక్తి హృదయపూర్వక ఆతిథ్యంతో, జార్జియన్ రాజధాని వైవిధ్యాన్ని కోరుకునే భారతీయ ప్రయాణికుల జాబితాలో ముందుంది.హోచిమిన్వియత్నాంలోని హోచిమిన్ నగరం దాని ఆకాశహర్మ్యాలు, వలసరాజ్యాల ల్యాండ్‌మార్క్‌లు, వీధి ఆహార దుకాణాలు, ఇలా సజీవంగా ఉన్న మార్కెట్లతో అబ్బురపరుస్తుంది. పచ్చని మెకాంగ్ డెల్టా దక్షిణ వియత్నాం వారసత్వ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన లాంచ్‌ప్యాడ్ ఇది. చాలా మంది భారతీయులు ఈ ఏడాది భారీ సంఖ్యలో వియత్నాంకు ప్రయాణించారు మరింత మంది వచ్చే ఏడాది సందర్శించాలని చిస్తున్నారు,పోర్ట్ లూయిస్మారిషస్లోని మణి సముద్రాలు పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న పోర్ట్ లూయిస్ ఉష్ణమండల ఆకర్షణను కాస్మోపాలిటన్ శైలితో మిళితం చేస్తుంది. కళకళలాడే మార్కెట్లు, వలసరాజ్యాల నిర్మాణం భిన్న వైరుధ్యాలు కలిగిన ఫుడ్ కల్చర్ ఉల్లాసమైన ప్రశాంతమైన గమ్యస్థానంగా దీనిని మారుస్తున్నాయి సూర్య ప్రశాంతతను కోరుకునే వారికి అనువైనది. నివేదిక శోధనలలో 93% పెరుగుదలను చూపించింది. దీనిని అనేక మంది భారతీయుల ప్రయాణ బకెట్ జాబితాలలో ఉంచింది.చదవండి: భాయిజాన్ సల్మాన్‌ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! 60లో కూడా కండలు తిరిగిన బాడీ సొంతం కావాలంటే... -
చిన్నగానే చుట్టేసొద్దాం..
సాక్షి, బిజినెస్‌డెస్క్: కరెన్సీ కదలికలు, క్రిస్మస్..న్యూ ఇయర్ సీజన్ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్ సర్విసుల కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.65 శాతం బుకింగ్స్ అయిదు రోజుల్లోపు ట్రిప్‌లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. ⇒ మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ⇒ ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్‌లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్‌కి, జెనరేషన్ జెడ్‌కి, యువ జంటలకి, బ్యాక్‌ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్‌గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్ సీజన్ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి. ⇒ శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. ⇒ ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్‌లో అత్యధిక వాటా దుబాయ్‌ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి. -
ఈ వింటర్ వెకేషన్‌కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్‌లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.‘ఎయిర్‌బీఎన్‌బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్‌లు, బ్యాక్వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్‌డోర్ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్‌బీఎన్‌బీ కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు.సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్ ట్రావెల్ సీజన్లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్‌బీఎన్‌బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..లక్షద్వీప్‌లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్‌లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్‌వాటర్స్ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్‌లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్‌ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.సీజనల్ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్‌ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్‌లను ప్లాన్ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్‌పూర్, జైపూర్‌లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది. -
వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్
ఇప్పుడంటే...ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్‌లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్కు సంబంధించిన పోస్టర్లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్‌లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్కు సంబంధించిన అద్భుత పోస్టర్ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్‌లోని ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...1920లలో...మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.అలా మొదలైంది...దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోస్టర్లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్టైజ్మెంట్. అద్భుతమైన లేఔట్‌తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్‌ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.కళాత్మక విలువలునవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్‌ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.ఆ కాలానికి స్వాగతంఅలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్‌లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. -
Good News: రూ.15 వేల విలువైన వోచర్స్ ఇవ్వనున్న ఇండిగో
-
సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..
పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలలో జీవిస్తున్నవారికి తాగు నీరు, ఆహారం, జీవనోపాధిని అందించేందుకు ప్రతి సంవత్సరం కృషి జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరంగాప్రకటించడం వెనుక గల ఉద్దేశమూ అదే. డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటెయిన్ డే సందర్భంగాసుందర దృశ్యాలకు నెలవుగా ఉన్న హిమాలయాలలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ మార్గాలను అన్వేషిద్దాం...పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు. భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పచ్చని లోయలు, కాశ్మీర్‌లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్‌లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్‌లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి. మన దేశంలో కేదార్కాంత ట్రెక్, ఉత్తరాఖండ్‌లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్‌లోని సందక్ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్‌లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగిపోవచ్చు. హిమాలయాలలో భద్రత, సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. అనువైన మరిన్ని ట్రెక్కింగ్ ప్లేస్‌లు...కేదార్కాంతతో పాటు హిమాలయాలలోనే ఎత్తైన పర్వత శిఖరాలలో పేరొందినవి. దయారా బుగ్వాల్ ట్రెక్ అతి ఎత్తైన శిఖరాలలో ఒకటిగా పేరొందిన దయారా పర్వతం ఎత్తైన గడ్డి మైదానాలతో నిండి ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ట్రెకింగ్ చేయడానికి అందుబాటులో ఉండగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్కీయింగ్ చేసేవారికి మరింత అనుకూలం.ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పచ్చదనంతో నిండి ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు మంచుతో నిండి ఉంటాయి. హిమాలయ శిఖరాలను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ప్యాకేజీలో భోజనం, టిఫిన్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ గైడ్లు, వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్ సిలిండర్లు.. వంటివి అందిస్తారు. డెహ్రాడూన్ నుండి దయారా బుగ్వాల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. బ్రహ్మతల్... లేక్ ట్రెక్ పచ్చిక, అడవులు, మంచుతో నిండిన శిఖరాలను చూస్తూ సాగించే వింటర్ ట్రెక్ ఇది. బెకల్తాల్ సరస్సు పూర్తిగా ఘనీభవించి ఉంటుంది. దీనికి తోడు త్రిశూల్ పర్వతం, నందా ఘటి పర్వతం వంటి శక్తివంతమైన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి. ఇక బ్రహ్మతల్ శిఖరాగ్రం నుండి మరిన్ని అద్భుత శిఖరాలను చూడవచ్చు. అడవులు, గ్రామాలు, పచ్చికభూములు, ఘనీభవించిన సరస్సు మీదుగా ఈ ట్రెక్కింగ్ సాగుతుంది. సరస్సు చుట్టూ పడే శీతాకాలపు సాయంత్రం నడక ఎప్పటికీ గుర్తుండి΄ోతుంది. బ్రహ్మతల్ సరస్సు వద్ద బ్రహ్మ తపస్సు చేశాడని, ఈ సరస్సును బ్రహ్మ పవిత్ర సరస్సుగా మార్చాడని స్థానిక గ్రామస్తులు చెబుతారు.కువారీ పాస్ ట్రెక్ ఇది గర్హా్వల్ పర్వత శ్రేణిలోని ప్రాచీన ట్రెక్‌లలో ఒకటిగా పేరొందింది. ట్రావెల్ ఏజెన్సీలు ఆరు రోజులకు గాను రూ.7000 నుంచి రూ.9000 వరకు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇది చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్న ట్రెక్. 1905లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ ట్రెక్ చేరుకున్నాడు. అప్పటి నుండి అతని పేరు మీదుగానే ఈ ట్రెక్‌ను పిలుస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ ట్రెక్ రిషికేశ్ నుండి మొదలవుతుంది. జోషిమఠ ప్రాంతంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాలి. మంచుతో నిండి, ఏడాది పొడవున ఉండే కువారీ పాస్ ట్రెక్ అన్ని సీజన్లలోనూ అందంగా ఉంటుంది. సందక్పు ఫలుట్ ట్రెక్.. ఈ ట్రెక్‌లో నాలుగు ఎత్తైన శిఖరాలను చూసే ఉత్కంఠభరితమైన అనుభవాన్ని పొందవచ్చు. ఒకవైపు ఎవరెస్ట్, లోట్సే, మకాలు శిఖరాలు చూడవచ్చు. మరోవైపు గంభీరమైన కాంచన్‌జంగా శిఖరంపై కిరీటంలా ఉన్న ప్రసిద్ధ స్లీపింగ్ బుద్ధ మాసిఫ్ను చూడవచ్చు. సందక్పు ట్రెక్‌లో భారతదేశంలోనే అత్యుత్తమ సూర్యాస్తమయ, సూర్యోదయాలను చూడవచ్చు. వెదురు, రోడోడెండ్రాన్ అడవులు సందక్పు ట్రెక్ అందాన్ని మరింత పెంచుతాయి. హిమాలయా పుష్పాలుగా ప్రత్యేకత గల రోడోడెండ్రాన్లు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఎర్ర΄ాండాలను కూడా చూడవచ్చు. ట్రావెల్ ట్రెండ్స్క్వయిట్ వోవర్ఎవ్రీ థింగ్‘క్వయిట్ వోవర్ ఎవ్రీథింగ్’ హవా కొనసాగనుంది. ఆధునిక జీవితంలోని రకరకాల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనే ట్రెండ్ ఇది. డిజిటల్ సంస్కృతిలో పీకల లోతు మునిగిపోయాక చాలామందికి ఇతర ప్రపంచాలేవీ కనిపించడం లేదు. డిజిటల్ సంస్కృతికి ఆవల అద్భుత ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే ప్రయాణించాలి.ప్రయాణించాలంటే డిజిటల్ సంకెళ్లను ఛేదించాలి. ఈ క్రమంలోనే డిజిటల్ డిటాక్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. మితిమీరిన డిజిటల్ సంస్కృతి నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను వెదుక్కుంటూ కొత్త ప్రదేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.ఒరెగాన్స్ స్కైకేవ్ రిట్రీట్స్‌లో అతిథులు చీకటి క్యాబిన్లలో మూడు రోజులు బస చేస్తారు! కొన్ని రోజుల పాటు బాహ్యప్రపంచానికి, వెలుతురుకు దూరంగా ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన పిచ్–బ్లాక్ గదులలో లేదా చీకటి గుహలలో గడపడం అనేది టిబెటన్ బౌద్ధంలోని సంప్రదాయం. ఈ బౌద్ధ సంప్రదాయం ట్రావెల్స్ ట్రెండ్స్‌లో ఒకటిగా మారింది. ‘స్వీయ–ఆవిష్కరణకు ఉపకరిస్తుంది’ అంటారు ఈ విధానాన్ని అనుసరించేవారు.పర్వతారోహకులకు వెంట తప్పనిసరి...పర్వతారోహణ చేసే పర్యాటకులు ఆడ/మగ సమకూర్చుకోవాల్సినవి, వెంట తెచ్చుకోవాల్సినవి...రక్బ్యాక్, డౌన్ జాకెట్, గ్లౌజ్‌లు (వాటర్ ప్రూఫ్‌వి), పోంచో లేదా రెయిన్ కోట్, ట్రెక్కింగ్ పోల్, హెడ్ ??టార్చ్, ట్రెక్ షూస్, ట్రెక్ ΄్యాంట్ – 2, ఒక జత థర్మల్స్, వెచ్చని సాక్స్ (జత), కాటన్ సాక్స్ (3–4 జతలు), ఉన్ని టోపీ, సన్ క్యాప్, గ్లౌజులు (ఉన్ని, వాటర్ ప్రూఫ్), అవసరాన్ని బట్టి అదనపు దుస్తులు, ప్లేట్లు, చెంచా, కాఫీ కప్పు, ఫోటో గుర్తింపు కార్డు, సన్ గ్లాసెస్, హ్యాండ్ టవల్, సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్, చెప్పులు. పవర్‌బ్యాంక్స్, టాయిలెట్ పేపర్ రోల్స్, టవల్స్, జిప్ లాక్ బ్యాగులు, శానిటైజింగ్ టాయిలెట్ స్ప్రే, సోప్, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ .. మొదలైనవి అవసరం అవుతాయి.ప్రపంచంలో.. ఎత్తైన ఏడు శిఖరాలుప్రపంచంలోని ప్రతి ఖండంలో ఉన్న ఎతైన శిఖరాలను అధిరోహించడం ఏ పర్వతారోహకుడికైనా లభించే అత్యంత గౌరవనీయమైన విజయాలలో ఒకటి. సెవన్ సమ్మిట్‌గా పేరొందిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏడు శిఖరాలను కలిగి ఉన్న పర్వతాలు, వాటి మార్గాలు..ఆసియా: ఎవరెస్ట్ శిఖరంఎవరెస్ట్ శిఖరం ఆసియాలోనూ, ప్రపంచంలోనే అత్యంత ఎతఐన పర్వతం. ఇది నేపాల్, టిబెట్ మధ్య సరిహద్దులో దక్షిణ ఆసియాలోని గ్రేట్ హిమాలయాలలో ఉంది. 29,035 అడుగుల (8,850 మీటర్లు) ఎత్తుకు చేరుకున్న దీనిని 1852లో గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా భూమి ఉపరితలంపై ఎతైన ప్రదేశంగా గుర్తించింది. ఎవరెస్ట్ పైకి ప్రధాన యాత్రలు 1920లలో ప్రారంభమయ్యాయి. కానీ 1953లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే లు దాని శిఖరాన్ని చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది పర్వతారోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకునేందుకు తపిస్తున్నారు.దక్షిణ అమెరికా: మౌంట్ అకాన్కాగువాదక్షిణ అమెరికా, పశ్చిమ అర్ధగోళం రెండింటిలోనూ అకాన్కాగువా పర్వతం ఎతై ్తనది. ఇది పశ్చిమ–మధ్య అర్జెంటీనాలోని చిలీ సరిహద్దులో ఉంది. అకాన్కాగువా పర్వతం ఉత్తర, దక్షిణ అనే రెండు శిఖరాలను కలిగి ఉంది, ఇవి ఒక శిఖరం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. దక్షిణ శిఖరం 22,736 అడుగులు (6,930 మీటర్లు) ఎత్తులో ఉంది. 22,831 అడుగులు (6,959 మీటర్లు) ఎత్తులో ఉన్న ఎతైన ఉత్తర శిఖరాన్ని మొదటిసారిగా 1897లో స్విస్ అధిరోహకుడు మాథియాస్ జుర్బ్రిగ్గెన్ చేరుకున్నాడు.ఉత్తర అమెరికా: డెనాలిడెనాలి (మౌంట్ మెకిన్లీ అని కూడా పిలుస్తారు) ఉత్తర అమెరికాలో ఎత్తైన శిఖరం. ఇది దక్షిణ–మధ్య అలాస్కాలోని అలాస్కా శ్రేణిలో ఉంది. ఈ పర్వతం 18,000 అడుగులు (5,500 మీటర్లు) ఎత్తు ఉంటుంది. 1910లో ఇద్దరు ప్రాస్పెక్టర్లు ఉత్తర శిఖరాన్ని జయించిన మొదటి అధిరోహకులు. హడ్సన్ స్టక్, హ్యారీ కార్స్టెన్స్ జూన్ 7, 1913న సౌత్ పీక్కు ఒక బృందానికి నాయకత్వం వహించారు. ఈ రోజుల్లో, ప్రతి సంవత్సరం వందలాది మంది అధిరోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఆఫ్రికా: కిలిమంజారోకిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో ఎతైన శిఖరం. ఇది కెన్యా సరిహద్దుకు సమీపంలో ఈశాన్య టాంజానియాలో ఉంది. ఈ పర్వతం మూడు అగ్నిపర్వతాలతో రూపొందింది. శంఖువును పోలి ఉండే కిబో, 19,340 అడుగులు (5,895 మీటర్లు) ఎత్తులో ఉంది. కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే నాల్గవ అత్యంత ప్రముఖ పర్వతం. 1889లో ఈ శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త హాన్స్ మేయర్ , ఆస్ట్రియన్ పర్వతారోహకుడు లుడ్విగ్ పుర్ట్షెల్లర్. మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్ 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.యూరప్: మౌంట్ ఎల్బ్రస్కాకసస్లోని ఎతైన శిఖరం, ఐరోపాలోని ఎతైన ప్రదేశం నైరుతి రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్. 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ అంతరించిపోయిన అగ్నిపర్వతం జంట శంఖుల్లా ఉంటుంది. ఇవి 18,510 అడుగులు (5,642 మీటర్లు), 18,356 అడుగులు (5,595 మీటర్లు) ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. పొడవైన శంఖువును మొదటిసారిగా 1874లో స్విస్ గైడ్ పీటర్ నుబెల్ నేతృత్వంలోని బ్రిటిష్ యాత్ర అధిరోహించింది.అంటార్కిటికా: విన్సన్ మాసిఫ్1935లో అమెరికన్ అన్వేషకుడు లింకన్ ఎల్స్‌వర్త్ కనుగొన్న విన్సన్ మాసిఫ్ అంటార్కిటికాలో అత్యంత ఎత్తై పర్వతం. ఖండంలోని పశ్చిమ భాగంలోని ఎల్స్‌వర్త్ పర్వతాల సెంటినెల్ శ్రేణిలో ఉన్న ఈ శిఖరం రోన్నే ఐస్ షెల్ఫ్‌ను చూస్తుంది. ఇది సముద్ర మట్టానికి 16,050 అడుగుల (4,892 మీటర్లు) ఎత్తున ఉంది. అంటార్కిటికా అన్వేషణకు నాయకత్వం వహించిన యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు కార్ల్ విన్సన్ పేరు మీద విన్సన్ పేరు పెట్టారు. దీని శిఖరాగ్రాన్ని మొదటిసారిగా 1966లో అమెరికన్ ఆల్పైన్ క్లబ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మద్దతుతో ఒక అమెరికన్ చేరుకున్నారు.ఆస్ట్రేలియా: మౌంట్ కోస్సియుస్కోమౌంట్ కోస్సియుస్కో ఆస్ట్రేలియాలో ఎతైన శిఖరం. ఇది ఆగ్నేయ న్యూ సౌత్ వేల్స్‌లోని ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ స్నోవీ పర్వతాలలో ఉంది. ఈ శిఖరం 7,310 అడుగులు (2,228 మీటర్లు) ఎత్తు. పోలిష్ అన్వేషకుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త పాల్ స్ట్రెజెలెక్కి 1840లో మౌంట్ కోస్సియుస్కోను అధిరోహించిన మొదటి యూరోపియన్. అతను ఈ పర్వతానికి ΄ోలిష్ దేశభక్తుడు, అమెరికన్ విప్లవ వీరుడైన టాడ్యూస్జ్ కోస్సియుస్కో పేరు పెట్టాడు. ‘శీతాకాలపు ట్రెక్‌ల రారాణి’ కేదార్కాంతభారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం పూర్తిగా ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. అందుకే ఈ భూమిని దేవుని స్వంత భూమి లేదా ‘దేవభూమి‘ అని పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏడాది పొడవునా సాహసయాత్ర కోరుకునే ట్రెక్కర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఇక ప్రసిద్ధ శీతాకాల ట్రెక్ ప్రదేశం కేదార్కాంత. ఈ ట్రెక్ ‘శీతాకాలపు ట్రెక్‌ల రాణి‘ గా పేరు పొందింది. గోవింద్ నేషనల్ పార్క్ దట్టమైన పైన్ అడవుల గుండా కేదార్కాంత శిఖరం వైపుగా ట్రెక్కింగ్ వెళుతుంది. మోకాలి లోతు మంచు, పై నుండి మంత్రముగ్ధులను చేసే దృశ్యం. కేదార్కాంత ట్రెక్ 12,500 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ ట్రెక్కింగ్ మొదలుపెట్టేవారికి ఈ మార్గం సులభంగా ఉండటంతో మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మంచు ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఇది ఇతర శీతాకాలపు ట్రెక్‌లకు భిన్నంగా చాలా ప్రజాదరణ పొందింది. ఈ ట్రెక్ సంక్రి అనే చిన్న గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఓక్, రోడోడెండ్రాన్ దట్టమైన అడవులు, గడ్డకట్టిన సరస్సు మధ్యలో నడక సాగిస్తూ, మంచు శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. ప్రముఖ హిమాలయ శిఖరాలు అయిన బందర్‌పూంచ్, కాల్‌నాగ్, స్వర్గారోహిణి మొదలైనవి.. కేదార్కాంత శిఖరం నుండి కనిపిస్తాయి.ఈ ట్రెక్ ప్రత్యేకత ఏమిటంటే... దేశంలోని అత్యంత ప్రసిద్ధ శీతాకాలపు ట్రెక్‌లలో ఒకటిగా పేరొందింది. హిమాలయాలలో శీతాకాలంలో అందుబాటులో ఉండే మంచు ట్రెక్కి ఇది అనుకూలమైనది.ఇది హిమాలయ శిఖరాన్ని ఎక్కిన అనుభూతిని ఇస్తుంది.మొదట్లో ట్రెక్కింగ్ చేసేవారికి అనువైన ప్రాంతం.కేదార్కాంత బేస్ క్యాంప్ అద్భుతమైన సుందర దృశ్యాలకు ఆలవాలం. శిఖరం నుండి కనిపించే దృశ్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. కేదార్కాంత శిఖరం నుండి సూర్యోదయం అత్యుత్తమమైనది.కేదార్కాంత ట్రెక్ షెడ్యూల్ఆరు పగళ్లు, ఐదు రాత్రుళ్లు ప్యాకేజీని ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్నాయి.1వ రోజు: డెహ్రాడూన్ నుండి సంక్రి వరకు 196 కి.మీ డ్రైవ్, దీనికి 8–9 గంటల సమయం పడుతుంది.2వ రోజు: సంక్రి నుండి జుడా కా తలాబ్ క్యాంప్ సైట్ వరకు 3.5 కి.మీ ట్రెక్, 5–6 గంటలు పడుతుంది. ఎత్తు 7200 అడుగుల నుండి 9186 అడుగుల వరకు ఉంటుంది.3వ రోజు: జుడా కా తలాబ్ నుండి కేదార్కాంత బేస్ క్యాంప్‌కు 3 కి.మీ ట్రెక్ చేయాలి. ఇందుకు 4–5 గంటల సమయం పడుతుంది. ఎత్తు 9186 అడుగుల నుండి 10,334 అడుగుల వరకు ఉంటుంది.4వ రోజు: సమ్మిట్ హర్గావ్ క్యాంప్‌లో పగలు, రాత్రి ప్రయాణం, బస సమయం మొత్తం 7 కి.మీ 9–10 గంటలు. 5వ రోజు: హర్గావ్ నుండి సంక్రికి దిగి డెహ్రాడూన్‌కు 4 కి.మీ దిగి, 196 కి.మీ ప్రయాణం చేస్తూ డెహ్రాడూన్‌కు చేరుకోవాలి.సంక్రి ఎలా చేరుకోవాలంటే... హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్నది సంక్రి. కేదార్కాంత, హర్ కి డన్, ఫులారా రిడ్జ్, బాలి పాస్ వంటి అనేక ప్రసిద్ధ హిమాలయ ట్రెక్‌లకు బేస్‌క్యాంప్‌గా పనిచేస్తుంది. నగర జీవిత హడావిడికి దూరంగా ఉన్న ఈ చిన్న గ్రామం మన హృదయాలను ఇట్టే దోచుకుంటుంది. అందమైన హోమ్‌స్టేలు, రుచికరమైన తినుబండారాలు, కేఫ్‌లు, అద్భుతమైన స్వర్గరోహిణి శిఖరం, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలతో సంక్రిప్రాంతం ప్రేమలో ఇట్టే పడిపోతాం. సంక్రి డెహ్రాడూన్ నుండి 206 కి.మీ. ఢిల్లీ నుండి 434 కి.మీ దూరంలో ఉంది. ఢిల్లీ నుండి నేరుగా సంక్రి చేరుకోలేం. డెహ్రాడూన్ చేరుకున్న తర్వాతనే సంక్రికి ప్రయాణించవచ్చు:రోడ్డు మార్గం:సంక్రి డెహ్రాడూన్ నుండి దాదాపు 206 కి.మీ దూరంలో ఉంది మరియు సాధారణంగా చేరుకోవడానికి 8–9 గంటలు పడుతుంది.రెండు మార్గాలు ఉన్నాయి:వయా ముస్సూరీ – తక్కువ దూరం. ఈ మార్గాన్నే చాలా మంది అనుసరిస్తారు. వయా వికాస్‌నగర్ – ముస్సూరీ ట్రాఫిక్‌ను నివారించాలనుకుంటే మంచి ఎంపిక.బస్సు ద్వారా:డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుండి సంక్రికి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి . సాధారణంగా రోజుకు 2–3 బస్సులు ఉంటాయి. చివరి బస్సు ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతుంది. ఆ తరువాత, సంక్రికి బస్సులు అందుబాటులో లేవు.టాక్సీ ద్వారా:4 లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తుంటే టాక్సీని అద్దెకు తీసుకోవాలి. డెహ్రాడూన్ నుండి సంక్రికి టాక్సీ ధర రూ.6500 ఉంటుంది.రైలు మార్గం:సంక్రికి సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. అక్కడి నుండి, సంక్రి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ తీసుకోవచ్చు.విమాన మార్గం:సంక్రికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి డెహ్రాడూన్‌కు విమానాలు అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో సంక్రి చేరుకోవచ్చు. పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు. భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పచ్చని లోయలు, కాశ్మీర్‌లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్‌లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్‌లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి.మన దేశంలో కేదార్కాంత ట్రెక్, ఉత్తరాఖండ్‌లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్‌లోని సందక్ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్‌లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగి΄ోవచ్చు. హిమాలయాలలో భద్రత,సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. (చదవండి: ప్రత్యేక సామర్థ్యంతో అద్భుతాలు చేసిన అసామాన్య వ్యక్తులు..!) -
లుంబిని నుంచి కుశినగర్ వరకు...!
బుద్ధుడికి జన్మనిచ్చిన లుంబినివనం.. సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన బోద్‌గయ. తొలి అష్టాంగమార్గాన్ని విన్న సారనాథ్.. సారనాథ్‌లో శ్రీలంక చైత్యం మూలగంధకుటి. బౌద్ధానికి రాజ గౌరవాన్నిచ్చిన రాజగృహ.. బుద్ధుడి ప్రకృతి విహారకేంద్రం వేణువనం. సమ్యక్ జీవనసాఫల్య క్షేత్రం శ్రావస్థి.. చివరి ప్రబోధాన్ని విన్న మాతాకుటీర్. బుద్ధుని అవశిష్ఠ నిర్మాణం రామభార్ స్థూప.. బుద్ధుడి తుదిశ్వాసకు మౌనసాక్షి కుశినగర. ఒకే పర్యటనలో వీటన్నింటినీ చూడాలంటే... ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైనెక్కాలి.1వ రోజు..ఢిల్లీ నుంచి గయకు ప్రయాణం. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కి చేరాలి. చిన్న వెల్కమ్ తర్వాత ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కాలి. ట్రైన్ రెండున్నరకు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం రైల్లోనే అందిస్తారు. ప్రయాణం కొనసాగుతుంది.2వ రోజురైలు ప్రయాణం కొనసాగుతుంటుంది. రైల్లో ఉదయం టీ, రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. గయకు చేరిన తర్వాత రైలు దిగి బోద్‌గయకు ప్రయాణం. బోద్‌గయలో హోటల్ గదిలో చెక్ ఇన్. కొంత సేపు విశ్రాంతి తర్వాత బోధగయ విహారం, మహాబోధి వృక్షం, మహాబోధి ఆలయ దర్శనం, నిరంజన నది తీరాన విహారం. బోద్‌గయలోని థాయ్ టెంపుల్, జపనీస్ టెంపుల్, బుద్ధ విగ్రహ వీక్షణం. రాత్రి భోజనం, బస హోటల్లో. నిరాడంబరం సుసంపన్నంగాబోధగయలో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనది బోధివృక్షం. దాన్ని మహాబోధి అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం ఇది. ఇక్కడ మహా ఆలయ నిర్మాణం జరిగింది. అదే మహాబోధి ఆలయం. ఈ ఆలయానికి ఓ అరకిలోమీటరు దూరాన మాయా సరోవర్ తీరాన ఉంది వాట్థాయ్ టెంపుల్. బోద్‌గయలోని వివిధ బౌద్ధాలయాన్నీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఆకర్షణీయంగా ఉంటాయి. నిరాడంబరతను ఇంత సుసంపన్నంగా వ్యక్తం చేయవచ్చా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇది 1956లో ధాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్మించిన ఆలయం. భారత్– థాయ్‌లాండ్ దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రధాని నెహ్రూ కోరిన మీదట థాయ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. బంగారు పూత పై కప్పు నిర్మాణంలోని సునిశితత్వం అబ్బురపరుస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో ఎనభై అడుగుల గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహంలో శిల్పనైపుణ్యం అద్భుతం. ఇక జపనీస్ టెంపుల్ ఇండోసాన్ నిప్పన్ జపనీస్ టెంపుల్ ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది. 3వరోజుబోద్గయ నుంచి నలంద, రాజ్‌గిర్, గయ, వారణాసికి ప్రయాణం. ఉదయం బో«ద్గయలోని హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి రాజ్‌గిర్ వైపు సాగిపోవాలి. రాజ్‌గిర్‌లో బింబిసార జైల్, గ్రద్ధకూట పర్వతం, వేణువన్ పర్యటన తర్వాత లంచ్‌కి హోటల్‌కి రావాలి. భోజనం తర్వాత నలందకు ప్రయాణం. నలందలో యూనివర్సిటీ శిథిలాల వీక్షణం, నలంద మ్యూజియం సందర్శనం తర్వాత గయకు ప్రయాణం. గయ రైల్వేస్టేషన్‌కు చేరి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ రైలెక్కాలి. రైలు వారణాసికి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.భీమ – జరాసంధుల యుద్ధక్షేత్రంరాజ్గిర్ అసలు పేరు రాజగృహ. ప్రాచీనకాలం నాటి నివాస ప్రదేశం. మహాభారత కాలంలో జరాసంధుని రాజ్యం గిరివ్రజ ఇదే. భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశం. మగధ రాజ్యానికి కొంతకాలం రాజధాని కూడా. రాజు నివసించే నగరం కావడంతో రాజగృహ అనే పేరు వచ్చింది. బుద్ధుడు తొలి బోధన సారనాథ్‌లో చేశాడు. రాజగృహలో రాజుల సమావేశంలో బోధన చేయడంతో బౌద్ధానికి విశేషమైన ప్రచారం వచ్చింది. సామాన్యులతో పాటు మగధ సామ్రాజ్య స్థాపకుడు బింబిసారుడికి కూడా బుద్ధుడు ఇక్కడే బోధనలు చేశాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు కూడా కొంతకాలం ఇక్కడ నివసించాడు. బింబిసారుడిని అతడి కొడుకు అజాతశత్రు జైలులో బంధించాడు. ఆ జైలు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. బుద్ధుడు రాజ్‌గిర్‌లో నివసించిన కాలంలో పగలంతా బోధనలు చేస్తూ సాంత్వన కోసం సమీపంలోని వేణువన్లో సమయం గడిపేవాడు.నాటి సరస్వతి నిలయంనలంద ప్రపంచంలోనే తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ. బౌద్ధ మహావిహార పేరుతో విలసిల్లింది. క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు విద్యార్థులతో కళకళలాడింది. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే నిర్మాణంలో అనుసరించిన ఇంజనీరింగ్ స్కిల్ అబ్బురపరుస్తుంది. విద్యార్థులకు ఒక్కో గది, పుస్తకాలు దుస్తులకు అరలు ఉన్నాయి. నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉంది. జానపద కథల్లో చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను ఇక్కడ చూడవచ్చు. అతి పెద్ద లైబ్రరీలోని గ్రంథాలను రాశిపోసి భక్తియార్ ఖిల్జీ తగుల పెట్టాడని చెబుతారు. గ్రంథాలు తగలబడిన చోట ఇటుకలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. నలందలో మహావిహార తర్వాత ఆర్కియలాజికల్ మ్యూజియం. సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాలను చూడవచ్చు. 4వ రోజువారణాసి నుంచి సారనాథ్, నౌతన్వాకు ప్రయాణం. గయ నుంచి వారణాసికి వస్తున్న రైల్లో ఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రిఫ్రెష్మెంట్ పూర్తి చేసుకుని వారణాసిలో రైలు దిగిన తర్వాత సారనాథ్‌కు ప్రయాణం. సారనాథ్‌లో ధమేక్ స్థూప, సారనాథ్ మ్యూజియం, అశోక పిల్లర్, మూలగంధకుటి విహార్‌కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, లంచ్ తర్వాత గంగానది తీరాన హారతి వీక్షణం. రాత్రికి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రైలు నౌతన్వా వైపు సాగి΄ోతుంది. నౌతన్వా మనదేశంలో చివరి రైల్వేస్టేషన్.సారనాథ్ బుద్ధుడుబోధగయలో జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. బౌద్ధానికి సంబంధించిన నమూనా చిత్రాల్లో బోధిచెట్టు కింద కూర్చున్న బుద్ధుడు, ఎదురుగా ఐదుగురు శిష్యులు ఉంటారు. అది సారనాథ్‌లో ఇచ్చిన ప్రవచనానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం పేరు ధమేక్ స్థూపం. దానిని అధ్యయనం చేస్తే బౌద్ధ పరమార్థం అవగతమవుతుంది. భారత ప్రభుత్వం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. ఇక్కడి మ్యూజియం ఒక బౌద్ధ అధ్యయన కేంద్రం. నిర్వహణ కూడా బాగుంటుంది. మూలగంధ కుటీర్ నిర్మాణకౌశలంలో మహోన్నతమైనదనే చెప్పాలి. ఓ వందేళ్ల కిందట బుద్ధుడి అవశిష్ఠాన్ని ప్రతిష్ఠించి నిర్మించిన ఆలయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనం చూసే బోధివృక్షం శ్రీలంలోని అనూరాధపురా నుంచి సేకరించిన ఒక బోధి మొక్క. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బోధగయ బోధివృక్షం నుంచి ఒక మొక్కను అశోకుడి కూతురు సంఘమిత్ర... అనూరాధపురాకు తీసుకువెళ్లింది. బో«ద్గయలోని చెట్టు విధ్వంసం అయినప్పుడు అనూరాధపుర వృక్షం నుంచి సేకరించి తెచ్చిన మొక్కల్లో ఒకటి బో«ద్‌గయలో మరొక దానిని సారనాథ్‌లో నాటారు. 5వ రోజుఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ రైల్లోనే. నౌతన్వా రైల్వేస్టేషన్‌కు చేరిన తర్వాత రైలు దిగి నేపాల్‌లో ప్రవేశించి లుంబినికి చేరాలి. పర్యాటకులు పాస్సోర్ట్, వీసా దగ్గర ఉంచుకోవాలి. నేపాల్ వీసా లేని వాళ్లు ఆన్ అరైవల్ వీసా కోసం (అక్కడికి చేరిన తర్వాత జారీ చేసే వీసా) ఫీజు తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. లుంబినిలో హోటల్లో చెక్ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత లుంబిని సైట్ సీయింగ్. రాత్రి భోజనం, బస లుంబినిలో.లుంబినిలో పుట్టాడునౌత్వానా రైల్వే స్టేషన్ చాలా చిన్న స్టేషన్. నిజానికి ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన ప్రదేశం కాదు. కానీ భారత్– నేపాల్ సరిహద్దులో మనదేశం నిర్వహిస్తున్న చివరి స్టేషన్. నేపాల్‌కి వెళ్లాలంటే ఇక్కడ దిగి రోడ్డుమార్గాన సరిహద్దు ప్రదేశం సునౌలి దగ్గర పాస్‌పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే క్రీ.పూ 544లో బుద్ధుడు పుట్టిన లుంబినిలో ఉంటాం. లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశంలో మాయాదేవి ఆలయాన్ని నిర్మించారు. ధవళం మీద ప్రసరించిన కాంతి వెలుగులతో ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుందీ ఆలయం. లుంబినిలో నిర్మించిన మహాస్థూ΄ాన్ని వరల్డ్ పీస్ పగోడాగా గుర్తిస్తారు. లుంబిని మొత్తాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో.6వ రోజులుంబిని హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్. కుశినగరకు ప్రయాణం. కుశినగరలో లంచ్ తర్వాత మహాపరినిర్వాణ టెంపుల్, రామ్భర్ స్థూప, మాతా కుటీర్ టెంపుల్‌తోపాటు ఇతర దర్శనీయ స్థలాల వీక్షణం. అక్కడి నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రయాణం. గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్లో ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కి బలరామ్‌పూర్‌కు సాగి΄ోవాలి. డిన్నర్ ట్రైన్లోనే. (శ్రావస్థికి వెళ్లడానికి)బుద్ధుడి నిర్యాణంనే΄ాల్లో పుట్టిన సిద్ధార్థుడు భారతదేశంలో బుద్ధుడయ్యాడు. ఎనభై ఏళ్లు జీవించిన తర్వాత భారతదేశంలోనే చివరి నిద్రకుపక్రమించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగరలో బుద్ధుడు తుది శ్వాస వదిలిన చోట మహాపరి నిర్యాణ ఆలయాన్ని నిర్మించారు. దాని వెనుక నిర్వాణ చైత్య (పరినిర్వాణ స్థూప) ఉంది. ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన బుద్ధుడి అవశిష్ఠంతో నిర్మించిన రామభార్ స్థూప కూడా గొప్ప ప్రాశస్త్యం కలిగిన బౌద్ధ నిర్మాణం. ఇక ఇక్కడ చూడాల్సిన వాటిలో మాతా కుటీర్ టెంపుల్ ముఖ్యమైనది. బుద్ధుడు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం సారనాథ్ అయితే చివరి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం మాతా కుటీర్ టెంపుల్.7వరోజుఉదయం టీ తాగిన తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్లో రైలు దిగి శ్రావస్థికి ప్రయాణం. 15 కిమీల దూరం. శ్రావస్థిలో హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. జేతవన విహార, పక్కి సెహాత్ మహేత్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు విశ్రాంతి. ఆ తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణం. రైలెక్కిన తర్వాత రైలు ఆగ్రాకు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లో.శ్రావస్థి... ప్రపంచ శాంతిరవంశ్రావస్థి ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం, జనపదాల కాలంలో కోసల రాజ్యానికి రాజధాని నగరం. రాముడి కుమారుడు లవుడు పాలించిన నగరమని చెబుతారు. జ్ఞానోదయమైన తరవాత బుద్ధుడు చాలా కాలం ఈ ప్రదేశంలో నివసించాడు. బుద్ధుడి జీవితంలో అనేక అద్భుతాలు ఇక్కడే జరిగాయని చెబుతారు. వందలాది బోధనలు వెలువరించడంతోపాటు అనేక మందిని సమ్యక్ జీవనం వైపు ప్రభావితం చేసిన ప్రదేశం. నాటి చౌద్ధ జ్ఞాపకాల పునర్నిర్మాణాలను చూడవచ్చు. ఇక్కడ పర్యటించిన బౌద్ధులు శ్రావస్థి సమీపంలోని ఆనందబోధి వృక్షం కింద కొంత సేపు ధ్యానంలో గడుపుతారు. బౌద్ధం ఆకాంక్ష అయిన ప్రపంచ శాంతికి ప్రతీకగా ఇక్కడ ప్రపంచ శాంతి గంట ఉంది. ఈ ప్రదేశం బౌద్ధంతో΄ాటు జైనానికి కూడా ప్రత్యేకమైనదే.జేతవన వీక్షణంబుద్ధుడు ప్రవచనాలను బోధిస్తూ పర్యటిస్తున్న క్రమంలో వేణువనంలో కొంతకాలం నివసించిన తర్వాత జేతవనంలో నివసించాడు. ఇక్కడ పెద్ద విహారం ఉండేది. ఇప్పుడు మనం చూడగలిగింది ఆ విహారానికి ఆనవాలుగా మిగిలిన శిథిలాలను మాత్రమే. బుద్ధుడి కోసం ఈ విహారాన్ని నిర్మించింది శ్రావస్థి నగరంలోని సంపన్నుడైన వ్యాపారి ఆనంద పిండిక. బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత జీవితాన్ని సమాజసేవ కోసం అంకితం చేసిన ఆనంద పిండిక విశాలమైన స్థలాన్ని కొని విహారాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశాన్ని శ్రావస్థి యువరాజు జేత పేరుతో జేతవనంగా పిలిచేవారు. అదే జేతవన విహారంగా వాడుకలోకి వచ్చింది. 8వ రోజుఉదయం టీ తర్వాత రైలు ఆగ్రాకు చేరుతుంది. రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలు దిగి సైట్‌సీయింగ్‌కి వెళ్లాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్ వీక్షణం తర్వాత ఆగ్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. మధ్యాహ్న భోజనం రైల్లోనే. ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ సాయంత్రం టీ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్ నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు చెబుతారు.బియాండ్ ద తాజ్!తాజ్‌మహల్ రకరకాల వాస్తుశైలిల సమ్మిళితం. ఇండో– ఇస్లామిక్ నిర్మాణ శైలికి మొఘల్ ఆర్కిటెక్చర్‌ని జోడిస్తే వచ్చిన రూపం. ముంతాజ్ మరణం తర్వాత మొఘల్ పాలకుడు షాజహాన్ని తీవ్రమైన దుంఖం నుంచి సాంత్వన కలిగించిన నిర్మాణం కూడా. ముంతాజ్ మరణం తర్వాత షాజహాన్ విచారంతో తనకిష్టమైన సంగీతం, ఆహారం, దుస్తుల పట్ల కూడా ఆసక్తి లేకుండా గడిపాడు. ఆగ్రా సమీపంలో రాజా మొదటి జయ్సింగ్ నిర్మించిన గొప్ప నిర్మాణం ఉందని తెలిసిన తర్వాత రాజుతో అంగీకారం కుదుర్చుకుని ముంతాజ్ సమాధి కోసం తీసుకున్నాడని చరిత్రకారులు నిర్ధారించారు. ముంతాజ్ మరణించినప్పుడు ఆమె శవపేటికను మధ్యప్రదేశ్, బుర్హాన్పూర్లో తపతి నది తీరాన అహుఖానా అనే భవనంలో సమాధి చేశారు. జయ్సింగ్తో ఒప్పందం తర్వాత ఆ భవనానికి కొన్ని మార్పులు చేసి ముంతాజ్ శవపేటికను ఇక్కడికి తరలించారు. ఆ తర్వాత షాజహాన్‌ను కూడా ఇక్కడే ఖననం చేశారు. తాజ్‌మహల్‌లో ఆ రెండు సమాధులను చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక దాగిన వాస్తవాలను తెలుసుకునే కొద్దీ ప్రేమ చాలా గొప్పదని ఒప్పుకుని తీరాల్సిందే.ప్యాకేజీల సంగతిదీ.. ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్ ప్రస్తుతం కొత్త ఆఫర్లతో ΄్యాకేజ్ ప్రకటించింది. ఇది ఎనిమిది రోజుల యాత్ర. ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఇవి విదేశీయులు, ఎన్ఆర్ఐల కోసం ఉద్దేశించిన ప్యాకేజ్‌లు, కాబట్టి ప్యాకేజ్ ధరలు యూఎస్ డాలర్లలో ఉంటాయి. మనదేశంలో నివసిస్తున్న భారతీయులు కూడా ఆసక్తి ఉంటే ఈ ప్యాకేజ్‌లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాకేజ్‌లో సూచించిన డాలర్ల సరిపడిన రూపాయలు చెల్లించి టూర్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో టూర్ మొత్తానికి 1400 డాలర్టు. ఒక రోజుకు 175 డాలర్లు.ఏసీ టూ టయర్‌లో టూర్ మొత్తానికి 1160 డాలర్లు, ఒక్క రోజుకు 145 డాలర్లు.ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో టూర్ మొత్తానికి 1550 డాలర్లు, ఒక్క రోజుకు 175 డాలర్లు.టూర్ మొదలయ్యే తేదీలు డిసెంబర్ 20, జనవరి (2026) 3, ఫిబ్రవరి 21, మార్చి 21.ఇవి వర్తించవు!వీసా ఫీజులు ప్యాకేజ్‌లో వర్తించవు., లాండ్రీ, మందులు, మద్యం, ఇతర పానీయాలు ఉండవు. పర్యటన కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం, పర్యటన పూర్తయిన తర్వాత రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే రవాణా సౌకర్యం ఇందులో ఉండదు. పర్యాటక ప్రదేశాల్లోకి కెమెరాలను అనుమతించడానికి ఫీజులు కూడా ప్యాకేజ్‌లో వర్తించవు.ఇవి వర్తిస్తాయి!రైలు ప్రయాణం, రైలు దిగిన తర్వాత పర్యాటక ప్రదేశాలకు ఏసీ వాహనంలో రోడ్డు రవాణా, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బస, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్. వీటితోపాటు ఇంగ్లిష్, హిందీ మాట్లాడే టూర్ ఎస్కార్ట్ కూడా పర్యటన ఆద్యంతం వెంట ఉంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!) -
కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!
కర్ణాటక టూర్ కన్నడ దేశంలో ఏమేమి ఉన్నాయి?విస్తారమైన అరేబియా సముద్ర తీరం ఉంది.నిశ్శబ్దంగా ధ్వనించే మెత్తటి అలలున్నాయి.సముద్రతీరాన శివుడి సిగ్నేచర్ స్టాచ్యూ ఉంది.సముద్రంలో తేలిన సెయింట్ మేరీ దీవులున్నాయి.ఉడుపి శ్రీకృష్ణుడున్నాడు... గోకర్ణ ఈశ్వరుడున్నాడు. వ్యాసుడు ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి ఉంది. ఆది శంకరుడు స్థాపించిన శారదపీఠం ఉంది. పక్షిధామం పిలికుల బయలాజికల్ పార్క్ ఉంది. ఐఆర్సీటీసీ ఒకే టూర్లో వీటన్నింటినీ చూపిస్తోంది.1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళూరులో దిగిన తర్వాత ఎయిర్΄ోర్ట్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ప్రయాణం ఉడుపికి సాగుతుంది. ఉడుపిలో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్స్ విహారం. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయ దర్శనం తర్వాత రాత్రి భోజనం బస ఉడుపిలో.ఇది జియో టూర్ఎకో టూర్, స్పిరుచువల్ టూర్లు మనకు పరిచయమే. ఇది జియో టూర్. ప్రకృతి సహజమైన అద్భుతాలను చూశాం, చారిత్రక అద్భుతాలను చూస్తుంటాం. ఇది భౌగోళిక అద్భుతం. పర్వతం పేలిన తరవాత పెల్లుబికిన లావా సముద్రం పైకి తేలి బలపాలను వరుసగా పేర్చినట్లు అచ్చులు అచ్చులుగా ఘనీభవించడంతో ఏర్పడిన దీవులివి. వీటికి సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అనే పేరు పెట్టింది వాస్కోడి గామా. మనదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ΄ోర్చుగీసు నావికుడు. కేరళలో క΄్పాడ్ బీచ్ దగ్గర మనదేశంలో నేల మీద అడుగు పెట్టాడు. అంతకు ముందు ఈ దీవుల మీద సేదదీరాడు. అరేబియా సముంద్రలో ఉడిపి దగ్గర ఉన్న నాలుగు దీవుల సమూహం. మేరీ మాత గౌరవార్థం ఈ దీవులకు సెయింట్ మేరీస్ ఐలాండ్స్గా నామకరణం చేశాడు. స్థానికులు థోన్సేపార్ అని పిలుస్తారు.అరేబియా తీరాన ఓ సాయంత్రంఉడుపిలో శ్రీకృష్ణుడి దర్శనం ప్రధాన ఆకర్షణ. శ్రీకృష్ణుని దర్శనం తర్వాత కృష్ణుని బంగారు రథాన్ని చూడడం మర్చి΄ోవద్దు. ఉడుపి కృష్ణుని ఆలయ నిర్మాణం దానికదే ప్రత్యేకం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. కృష్ణుడిని దర్శించుకున్న తరువాత సాయంత్రాన్ని మాల్పే బీచ్‌లో ఆహ్లాదంగా గడపవచ్చు. సూర్యోదయానికి బంగాళాఖాతం, సూర్యాస్తమయానికి అరేబియా సముద్రాలు ప్రకృతి మనదేశానికి ఇచ్చిన వరాలు. ఉడుపి, మాల్పే బీచ్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఆటలు పిల్లలకు మధురానుభూతి. భోజన ప్రియులకు ఉడుపి అనగానే రుచికరమైన ఉపాహారాలు గుర్తుకు వచ్చి నోరూరిస్తాయి. కన్నడిగుల చేతి రుచిని బీచ్‌లో ఉన్న స్టాల్స్‌లో టేస్ట్ చేయవచ్చు. 2వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోరనాడుకు ప్రయాణం. అన్నపూర్ణేశ్వరి ఆలయ దర్శనం తర్వాత శృంగేరికి ప్రయాణం. శృంగేరి ఆలయ దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి ఉడుపికి ప్రయాణం. ఈ రాత్రి బస కూడా ఉడుపిలోనే.అన్నం పెట్టే తల్లిహోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం భద్ర నది తీరాన ఉంది. మనం తుంగ– భద్ర నదిగా పిలిచే రెండు నదుల్లో భద్ర నది అన్నమాట. హోరనాడు ప్రదేశం స్వచ్ఛంగా అచ్చమైన ప్రకృతి ఒడి. పచ్చటి పంటచేలు, మంద్రంగా ప్రవహించే భద్ర నది, ధీరగంభీరగా ఆకాశాన్ని తాకడానికే ఎదిగినట్లున్న పశ్చిమ కనుమల సౌందర్యం... వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ఆధ్యాత్మికతను మది నిండా నింపుకోగలిగిన ప్రదేశం ఇది. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి సస్యశ్యామలమైన పొలాలను చూసిన వ్యాసుడు సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్న పంటలకు ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించాడేమో అనిపిస్తుంది.అక్షరమిచ్చే బంగారు తల్లిశృంగగిరి మఠాన్ని ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం స్థాపించాడు. వ్యవహారంలో అది శృంగేరిగా మారిపోయింది. శృంగేరి శారదాపీఠం అనుబంధ మఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ గురు పరంపరలో తెలుగు వ్యక్తి విధుశేఖర భారతి ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం చదువుల తల్లి సరస్వతీ మాత కొలువై ఉన్న శ్రీశారదాంబ ఆలయం. ఆలయ శిల్పసౌందర్య వీక్షణం, సరస్వతీదేవి దర్శనం జీవితకాలం గుర్తుండే మధురానుభూతి. ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన సరస్వతీ మాత విగ్రహం చందన శిల్పం. ఆ తర్వాత విజయనగర రాజులు బంగారు విగ్రహం చేయించారు.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గోకర్ణకు ప్రయాణం. గోకర్ణం బీచ్, మురుదేశ్వర్ ఆలయ దర్శనం తర్వాత కొల్లూరుకు ప్రయాణం. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరిగి ఉడుపికి ప్రయాణం. మూడవ రోజు రాత్రి బస కూడా ఉడుపిలోనే.అరేబియా తీరాన మహేశ్వరులుశివుడు... మురుదేశ్వరుడి పేరుతో పూజలందుకుంటున్న ప్రదేశం పేరే మురుదేశ్వర్. అరేబియా తీరాన ధ్యానముద్రలో శివుడి విగ్రహం మురుదేశ్వర్కి సిగ్నేచర్ పిక్చర్. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద శివుడి విగ్రహాలలో మురుదేశ్వర్ విగ్రహానిది మూడవ స్థానం. ఈ ఆలయంలో 20 అంతస్థుల రాజగోపురం స్పెషల్ అట్రాక్షన్. బంగారు గోపురం సంధ్యా కిరణాలకు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. కైలాసనాథ మహాదేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇక్కడి శివలింగం భూమి మీద ప్రతిష్ఠించింది కాదనీ, భూగర్భం నుంచి ఉద్భవించినదని, కైలాసం నుంచి రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం అని చెబుతారు. ఇక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరన గోకర్ణ తీర్థం ఉంది. అందులోని శివుడు మహాబలేశ్వరుడు. ఇక్కడి లింగాన్ని కూడా ఆత్మలింగం అనే చెబుతారు. ఈ ఆలయాలకు వెళ్లేటప్పుడు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. హిందూ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. భుజాలు, మోకాళ్లను కవర్ చేస్తున్న దుస్తులతోనే అనుమతిస్తారు. జీన్స్, స్లీవ్‌లెస్, షార్ట్స్ వంటి వస్త్రధారణ నిషిద్ధం. కాబట్టి జర్నీ ప్లానింగ్‌లో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చందమామ కథల నేలకన్నడిగులకు కొల్లూరుతో గొప్ప అనుబంధం ఉంది. మనం చందమామ కథల్లో చదివిన మూకాంబిక అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం కొల్లూరు. మహాశక్తివంతమైన దేవతగా విశ్వసిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఆదిశంకరాచార్యులు కేరళలోని కుదజాద్రి కొండల్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో మూకాంబిక దేవి ప్రత్యక్షమైంది. ఆది శంకరుని కోరిక మేరకు ఆమె అతడిని అనుసరిస్తూ వెనుకే నడిచింది. ఆది శంకరుడు వెనక్కి చూసిన క్షణంలో అక్కడే ఆగి΄ోతానని షరతు కూడా పెట్టింది. అలా చేర రాజ్యం నుంచి వారి ప్రయాణం మొదలైంది. కొల్లూరు పరిసరాలకు వచ్చేటప్పటికి ఆది శంకరాచార్యునికి ఆమె పాదమంజీరాల సవ్వడి వినిపించలేదు. అప్పుడతడు వెనక్కి చూశాడని, మూకాంబిక తన షరతు ప్రకారం అక్కడే ఆగిపోయిందని, అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారని చెబుతారు. చేర రాజ్యం నుంచి వచ్చిన దేవత కాబట్టి ఉత్తర కేరళ వాళ్లు తమ ఇంటి ఆడపడుచుగా భావించి మూకాంబిక దర్శనానికి వస్తారు. అందుకే ఇక్కడ కన్నడ వాళ్లతోపాటు మలయాళీలు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.4వ రోజు..బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, ధర్మస్థలకు ప్రయాణం. మంజునాథ ఆలయ దర్శనం తర్వాత కుక్కెకి ప్రయాణం. రాత్రి భోజనం చేసిన తర్వాత కుక్కెలో బస.శివుడు– గోమఠేశ్వరుడుధర్మస్థల ఇటీవల వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివాదాలను పక్కన పెడితే కన్నడ సంస్కృతి– జైన సంప్రదాయాల మేళవింపుకు ప్రతీక అయిన ఈ ఆలయం చూడాల్సిన ప్రదేశమే. ఎనిమిది వందల ఏళ్ల నాటి నిర్మాణం. శివుడు ఇక్కడ మంజునాథుడిగా పూజలందుకుంటున్నాడు. మహాశివరాత్రికి శివుడికి ఉత్సవాలు, జైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడ కొలువై ఉన్న గోమఠేశ్వరుడికి మహామస్తకాభిషేకం వైభవంగా జరుగుతాయి. 5వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుని తిరిగి హోటల్‌కు వచ్చి హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం మంగళూరుకు సాగుతుంది. మంగళూరులో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం తన్నేరు బావి బీచ్ విహారం. కద్రోలి గోకర్ణనాథ ఆలయ దర్శనం. రాత్రి బస మంగళూరులో.ఊరిపేరే దేవుడి పేరుమనదేశంలో శైవం, వైష్ణవం పోటాపోటీగా విస్తరిస్తున్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆలయాలకు లెక్కేలేదు. కర్నాటకలో వీరశైవం ప్రభావంతో శివుడు, శివుడి కుటుంబ సభ్యుల ఆలయాలు ఎక్కువ కనిపిస్తాయి. శివపార్వతుల కుమారులిద్దరూ గణేశుడు, కార్తికేయుడిగా పూజలందుకుంటుంటారు. కార్తికేయుడిని సుబ్రహ్మణ్యంగా కొలుస్తారిక్కడ. స్థలపురాణం కూడా శైవం– వైష్ణవాల ఆధారంగానే ఉంటుంది. విష్ణుమూర్తి వాహనమైన గరుట్మంతుడి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి వాసుకి ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చెబుతారు. ఈ గ్రామం పేరు సుబ్రహ్మణ్య. అందుకే ఇక్కడి దేవుడు సుబ్రహ్మణ్యస్వామిగా వ్యవహారంలోకి వచ్చాడు.బంగారు తీరం తన్నేరు బావి అరేబియా తీరంలో అలలు మంద్రంగా చిరుసవ్వడితో ఆలరిస్తుంటాయి. తన్నేరు బావి దగ్గర అరేబియా సముద్రజలంలో కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లో ఇసుక పసుపురంగులో బంగారం రాశి΄ోసినట్లుంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది మంచి ప్రదేశం. పర్యాటక రంగం ఏర్పాటు చేసిన సౌకర్యాలతో ఈ బీచ్‌లో టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గుర్రం మీద విహరించనూవచ్చు. 6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. మంగళాదేవి ఆలయం, మంజునాథ ఆలయ దర్శనం తర్వాత పిలికుల బయోలాజికల్ పార్క్ వీక్షణం. టూర్ నిర్వహకులు పర్యాటకులను సాయత్రం మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వీడ్కోలు చెబుతారు. విమానం ఎక్కి హైదరాబాద్ చేరడంతో టూర్ పూర్తవుతుంది.మంగళాదేవి ఊరుమంగళాదేవి ఆలయం ఉండడంతోనే ఆ ఊరికి మంగళూరుకు అనే పేరు వచ్చింది. మంగళాదేవి ఆలయం ఏటవాలు ఎర్ర పై కప్పుతో కేరళ వాస్తుశైలిలో ఉంటుంది. ఇందుకు కారణం దీనిని కట్టిన రాజు పేరు కుందవర్మన్. తుళునాడు, మలనాడు ్ర΄ాంతాల ΄ాలకుడు. ఈ సమ్మిళిత శైలి ఈ ఆలయం నిర్మాణంలో కనిపిస్తుంది. అందమైన పక్షిధామంపిలికుల బయలాజికల్ పార్క్ మల్టీ డైమన్షన్లు కలిగిన టూరిస్ట్ ప్లేస్. ఎకో టూరిజమ్, ఎడ్యుకేషనల్ టూరిజమ్, ఆహ్లాదకరమైన విహార ప్రదేశం కూడా. కన్నడంలో దీని పేరు పిలికుల నిసర్గ ధామ. నాలుగు వందల ఎకరాల పార్కులో కోర్ ఏరియా 150 ఎకరాలుంటుంది. ఇక్కడి పక్షులు మాత్రం రెక్కల్లోని వైవిధ్యత అంతా ఒక చోటకు చేర్చి ప్రదర్శనకు పెట్టినట్లు కనువిందు చేస్తాయి. ఆస్ట్రిచ్, ఈము కోళ్లు, రియా కొంగలు, చిలుకలు, బ్లాక్ స్వాన్, పెలికాన్, గినియా ఫౌల్ (గిన్ని కోళ్లు), నైట్ హోరన్, గుడ్లగూబలు, లవ్ బర్డ్స్... ఇలా రకరకాల పక్షులను చూడవచ్చు. రకరకాల జాతుల కొంగలు సున్నితంగా అడుగులు వేస్తూ ఆహ్లాదపరుస్తాయి. భూమ్మీద ఉన్న పక్షి జాతులన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది. టీనేజ్ పిల్లలకు ఈ పార్క్ ఒక ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి, వాటిని కచ్చితంగా అమలు పరుస్తారు కూడా. కాబట్టి పర్యాటకులు విధిగా పాటించి తీరాలి. జంతువులకు చిరాకు కలిగించే పనులు చేయరాదు. వాటికి తినుబండారాలు పెట్టకూడదు. అడవుల్లో పర్యటించేటప్పుడు జంతువులను ఏదో చూశామంటే చూసేశాం అన్నట్లు చూడకూడదు. ప్రతి జంతువునీ దానికంటూ ఉండే ప్రత్యేకత కదలికలను గమనించాలి. కొన్నింటికి తోక ఊపడంలో వైవిధ్యత, కొన్నింటికి కొమ్ములను విదిలించడం, కొన్ని అడుగులు వేసేటప్పుడు మట్టిలో పాదముద్రలు పడనంత సున్నితంగా నడుస్తుంటాయి. ఈ టూర్లో ఎంట్రీ టికెట్‌తో పాటు కెమెరా టికెట్ కూడా తీసుకుంటే కొమ్మల మీద కూర్చుని కువకువలాలడే పక్షలను, గురుపుర నదిలో నీరు తాగుతున్న జింకలను, నేల మీద జరజరపాకే సరీసృపాలను రికార్డ్ చేసుకోవచ్చు.ప్యాకేజ్ పేరు..డివైన్ కర్ణాటక, ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 08. ఈ ఆరు రోజుల టూర్ హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కే చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో హోరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి, గోకర్ణ, మురుదేశ్వర్, కొల్లూరు, ధర్మస్థల, మంజునాథ్ ఆలయం, తన్నేరు బావి బీచ్, కుద్రోలి గోకర్ణాథ టెంపుల్, మంగళాదేవి, కద్రి మంజునాథ, పిలికుల బయోలాజికల్ ΄ార్క్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా..సింగిల్ ఆక్యుపెన్సీ 45,950 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 34,850 రూపాయలు. ప్రయాణం ఎప్పుడు? 21.01.2026, ఉదయం 05.50 గంటలకు 6ఈ 7549 నంబరు విమానం హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్టు నుంచి బయలుదేరి ఉదయం 07.35 గంటలకు మంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 26.01.2026. రాత్రి 21.55 గంటలకు 6ఈ 7241 విమానం మంగళూరు నుంచి బయలుదేరి 23.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.ప్యాకేజ్‌లో...విమానం టికెట్లు, హోటల్ బస, ఆరు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు డిన్నర్లు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు ప్రయాణానికి ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలుంటాయి.లంచ్, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి– ఎయిర్΄ోర్ట్ నుంచి ఇంటికి రవాణా, పర్యాటక ప్రదేశాల్లో దర్శనాల టికెట్లు, డ్రైవర్లకిచ్చే టిప్పులు, ఇతర పానీయాలు, లాండ్రీ, మెనూలో లేన పదార్థాలను ఆర్డర్ చేసుకుంటే ఆ బిల్లులు, పర్యాటక ప్రదేశాల్లో గైడ్ సర్వీస్‌లు ప్యాకేజ్‌లో వర్తించవు.బుకింగ్ కోసం..జోనల్ ఆఫీస్,ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్‌ఫోర్డ్ ΄్లాజా,ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040–27702407, 82879 32229ఐఆర్సీటీసీ – టూరిజమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్,విజయవాడ రైల్వే స్టేషన్ఫోన్ నంబరు: 92810 30714, 82879 32312– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
బరువు 150 గ్రాములు దూరం 5,000 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత పరుగుపందెంలో 100 మీటర్లు వేగంగా పరిగెడితే శెభాష్ అంటాం. మరి ప్రకృతి ఒడిలో సహజంగా అబ్బిన నైపుణ్యంతో మూడు గద్దలు ఏకంగా 5,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగిరి వెళ్తే ఏమనాలి? కేవలం 150 గ్రాముల బరువైన ఈ చిన్న డేగల అసమాన ప్రయాణ కథ విని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. భారత వన్యప్రాణి సంస్థ(డబ్ల్యూఐఐ) డేగల వలస వైరుధ్యాలను లెక్కగట్టేందుకు నవంబర్ 11న అపపాంగ్, అలాంగ్, అహూ అనే మూడు డేగలకు శాటిలైట్ ట్రాకర్లను అతికించి పరీక్షించింది. అవి మణిపూర్ అరణ్యాల్లో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. ఎక్కడా ఆగకుండా అలసిపోకుండా సుదూరాలకు పయనించాయి. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక దాటుకుంటూ అరేబియా సముద్ర గగనతలాన్ని అలవోకగా దాటుకుంటూ తూర్పు ఆఫ్రికా దేశమైన సోమాలియాకు చేరుకున్నాయి. 5,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదురోజుల్లో దాటేయడం విశేషం. -
అంతా.. ఆమే!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కుటుంబమంతా కలిసి విహారయాత్రలకు వెళ్లడం, ఇందుకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం నిర్ణయాధికారం మహిళలదే అని తేలింది. పదింటిలో ఏడు ఫ్యామిలీ ట్రిప్‌లను మహిళలే ప్లాన్ చేస్తున్నారంటేనే ఈ విషయం అర్థమవుతోంది. అందుబాటులో ఉన్న ప్రయాణ ప్రణాళికలను సమీక్షించడం, ఖర్చులు అంచనా వేయడం, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం, అవసరమైన తనిఖీలు క్షుణ్ణంగా చేయడం, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఆయా అంశాలపై చర్చించడం, చివరకు పర్యాటక గమ్యస్థానాలను ఖరా రు చేయడం వరకు ఇంటి యజమానురాలిదే కీలకపాత్ర అని స్పష్టమవుతోంది. మహిళలు ప్లాన్ చేసిన ట్రిప్‌లలో ప్రీమియం అప్గ్రేడ్లు (మెరుగైన సేవలు కోరుకోవడం) పురుషుల కంటే 28% ఎక్కువ ఉంటోంది. కానీ అదేసమయంలో మొత్తం ఖర్చును చూస్తే మాత్రం 6శాతమే అధికమని తేలింది. మహిళలు..పురుషుల కంటే సగటున 9రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు, హోటళ్లను బుక్ చేయడంతో పాటు చివరి నిమిషంలోట్రిప్లు, హోటళ్ల రిజర్వేషన్ల రద్దు, ఇతర ధరల పెరుగుదల వంటి వాటిని నివారిస్తున్నట్టుగా తేలింది. ఏఐ–ఆధారిత ట్రావెల్ ప్లాట్‌ఫామ్ థ్రిల్లో ఫిలియా ‘మహిళలు–ప్రయాణ నిర్ణయాలు 2025’నివేదిక’లో ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2,12,000 ప్రయాణ ప్రణాళికలను, ఏకంగా 89 లక్షల ప్రయాణ ప్రణాళికలకు సంబంధించిన విచారణ (ఎంక్వైరీ)లను థ్రిల్లోఫిలియా విశ్లేషించింది. మహిళలు ఇప్పుడు భారతదేశంలోని 72% విశ్రాంతి ప్రయాణాలను ప్రభావితం చేస్తున్నారని లేదా నేరుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని ఈ నివేదిక తేల్చింది. బడ్జెట్, భద్రత మొదలు అన్ని విషయాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. మూడు రెట్లు ఎక్కువ భద్రత ⇒ మహిళలు అన్నీ ముందస్తు బుకింగ్‌లు చేయడంతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ⇒ బడ్జెట్ పెద్దగా పెరగకుండా అర్థవంతమైన అప్గ్రేడ్లను ఎంచుకుంటున్నారు. ⇒ సౌకర్యవంతమైన, సంతోషకరమైన ప్రయాణాన్ని ఇష్టపడతారు. ⇒ ప్రయాణ ప్రణాళికలలో తరచుగా బోటిక్ బసలు, స్పా సెషన్లు, వెల్నెస్ నడకలు, తీరికగా చేసే విహార యాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. ⇒ మహిళలు ప్లాన్ చేసే ప్రయాణాలకు మూడు రెట్లు ఎక్కువ భద్రతా ఫిల్టర్లు ఉంటాయి. ఫలితంగా టూర్లకు సంబంధించి చేసే అత్యవసర కాల్స్ 23 శాతం తక్కువగా ఉంటున్నాయి. ⇒ మహిళలే ప్రయాణ ప్రణాళికలు వేసినప్పటికీ, 62 శాతం చెల్లింపులు ఇప్పటికీ పురుషులే చేస్తుండటం గమనార్హం. రాజస్థాన్, కేరళ, గోవాలపై మక్కువ ⇒ మహిళలు దేశీయంగా ఇష్టపడే ప్రదేశాల్లో రాజస్థాన్, కేరళ, గోవా ఉన్నాయి ⇒ అంతర్జాతీయంగా చూస్తే బాలి, దుబాయ్–అబుదాబి, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వైపు ఆకర్షితులవుతున్నారు. ⇒ పర్యటనల విషయంలో మహిళల ప్రభావం మెట్రోపాలిటన్ కేంద్రాలకు మించి విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాలు కీలక కేంద్రాలుగా మారుతున్నాయి. -
పగడపు దీవులకు.. పడవ ప్రయాణం!
అరేబియా సముద్రంలో దాగిన రత్నం... భారతదేశపు బ్లూ లగూన్... అండర్ వాటర్ అడ్వెంచర్లకు కేరాఫ్... ఇలా చెప్పుకుంటూపోతే... పర్యాటకులకు అదొక స్వర్గం. మోదీ అక్కడ అడుగుపెట్టాక క్రేజ్ ఓ రేంజ్లో పెరిగింది. మీరు ఊహించింది కరెక్టే.. బీచ్ ప్రేమికులకు లక్షదీవులు ఇప్పుడు హాటెస్ట్ డెస్టినేషన్. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ ప్లేస్మా బకెట్ లిస్ట్‌లోకి చేరింది. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ ప్లాన్ చేశాం. అయితే, విమానంలో వెళ్లడం రొటీన్ అనిపించి.. కొలంబస్‌లా సముద్రంపై సాహసయాత్ర చేస్తే పోలా అనే ఐడియా వచ్చింది? కట్ చేస్తే.. మా గుండెజారి అరేబియా సీలో గల్లంతయ్యింది. దేశంలో తొలి లగ్జరీ క్రూయిజ్లైనర్ ‘కార్డీలియా క్రూయిజెస్’లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నాం. మరి అంతపెద్ద ‘ఎంప్రెస్’ క్రూయిజ్‌లో సీ జర్నీ ఎలా ఉంటుంది? అందులో వింతలు విశేషాలేంటి? ఆ అద్భుతమైన కోరల్ ఐల్యాండ్స్‌ను షిప్లో చుట్టేసి రావాలంటే ఎంత ఖర్చవుతుంది? నేచర్ లవర్స్‌ను రా రమ్మని ఊరిస్తున్న లక్షదీవుల కథేంటో తెలుసుకోవాలనుందా? అబ్బురపరిచే పగడపు దీవుల్లో అలా ఈత కొట్టొద్దాం పదండి. లెట్స్క్రూయిజ్!!కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి! అంటూ ముంబై రైలెక్కేశాం. మా లక్షదీవుల నౌకా యాత్ర నాలుగు రాత్రులు.. ఐదు రోజులు. 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో ఎంజాయ్ చేస్తూ.. అరేబియా సముద్రంలో 1200 కిలోమీటర్ల సాహసయానం చేసి, అద్భుతమైన పగడపు దీవులను చేరుకుంటామని ఊహించుకుంటేనే రాత్రంతా నిద్రపట్టలేదు. ఎట్టకేలకు ముంబైలోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌లో అడుగుపెట్టాం. క్రూయిజ్ బోర్డింగ్ ఎయిర్΄ోర్టులాగే ఉంటుంది. బోర్డింగ్ పాస్, ఆధార్ వెరిఫికేషన్, బ్యాగేజీ సెక్యూరిటీ చెకప్ పూర్తయ్యాక టర్మినల్ నుండి ‘ఎంప్రెస్’ క్రూయిజ్ ఉన్న బెర్త్‌పైకి అడుగుపెట్టాం. రాజహంసలా సేదతీరుతున్న అంతపేద్ద షిప్‌ను చూసేసరికి ఫోటోలు, సెల్ఫీలతో సందడే సందడి.అది అరబిక్ కడలందం...షిప్లో అడుగుపెట్టగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్ కోర్ట్ (ఏట్రియం) నిజంగా హైలైట్. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్‌లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో మయసభను తలపిస్తుంది. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు ముంబైకి గుడ్‌బై చెబుతూ ‘ఎంప్రెస్’గంభీరంగా కదిలింది. క్రూయిజ్ టాప్ డెక్ (11వ అంతస్తు) నుంచి ఒకపక్క సముద్రం, మరోపక్క మిలమిల మెరిసే ముంబై స్కైలైన్‌ను చూస్తే.. ఎవరైనా సరే ‘అది అరబిక్ కడలందం’ అనాల్సిందే! క్రూయిజ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే స్విమ్మింగ్‌పూల్ పక్కన ‘తెరే కాలా చష్మా’అంటూ సెయిల్ ఎవే పార్టీ డ్యాన్సులతో ఫ్లోర్ మొత్తం ఊగిపోతోంది. సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి చిల్అవుతూ డీజే పార్టీని ఎంజాయ్ చేశాం. స్టార్‌లైట్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని టెర్రస్‌పైకి అడుగుపెట్టగానే ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్ కదులుతుంటే... చూసేందుకు రెండు కళ్లూ చాలవు!!ఫన్ .. అన్లిమిటెడ్!క్రూయిజ్ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్ అద్భుతం. రెండంతస్తుల్లో 900 మంది కూర్చోవచ్చు. అరే, రోజు అప్పుడే గడిచిపోయిందా అనిపించేలా క్రూయిజ్‌లో అన్లిమిటెడ్ వినోదం ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్, మ్యూజిక్షోలతోపాటు లైవ్ బ్యాండ్స్, డీజే సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. షిప్ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్‌తో ఏదో తెలియని వైబ్ మనల్ని ఉరకలేయిస్తుంది. 24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్‌లో ఉన్నంతసేపూ ఏదో తిరనాళ్లలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగింది. మెగా హౌసీ, ట్రెజర్‌హంట్.. మ్యాజిక్‌షో.. వీడియో గేమ్స్.. లైబ్రరీ.. కిడ్స్ అకాడమీ.. ఫోటో షూట్స్.. టేబుల్‌టెన్నిస్.. స్నూకర్.. జిమ్.. స్పా.. స్విమ్మింగ్ పూల్.. రాక్వాల్ క్లయింబింగ్.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్’ రారమ్మంటుంది.సన్‌రైజ్, సన్‌సెట్.. వావ్!!క్రూయిజ్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడనివి సన్‌రైజ్, సన్‌సెట్. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! ఎర్రని బంతిలా భానుడు అస్తమించే సన్‌సెట్ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం.. మధ్యలో క్రూయిజ్ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్ లవర్స్ గుండెజారి అరేబియా సముద్రంలో గల్లంతవ్వాల్సిందే!!తిన్నోళ్లకు తిన్నంత..!కార్డీలియా ‘ఎంప్రెస్’లో ఫుడ్.. భోజనప్రియులకు పండగే! ఉదయం బ్రేక్పాస్ట్ నుంచి లంచ్, స్నాక్స్, డిన్నర్ వరకూ అన్నీ ఫ్రీ. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండి΄ోయేలా మెనూ ఉంటుంది. వెజ్, నాన్‌వెజ్ వంటకాలు.. నోరూరించే డెసర్ట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ స్టాండర్డ్ బెవరేజెస్ ప్యాకేజీ (హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కాక్టెయిల్స్, మాక్టెయిల్స్, పళ్ల రసాలు) కూడా అన్ని ప్యాకేజీల్లో భాగం.∙∙ దాదాపు 36 గంటల పాటు (రెండు రాత్రులు) క్రూయిజ్ జర్నీ చేశాక గేట్ వే ఆఫ్ లక్షద్వీప్‌గా పిలిచే అగట్టి ఐల్యాండ్‌కు చేరుకున్నాం. ఇక్కడ సముద్ర జలాల కిందంతా కోరల్ రీఫ్స్ పరుచుకుని ఉండటం వల్ల తీరంలో భారీ షిప్‌లు నిలిపేందుకు వీలుపడదు. ఎంప్రెస్‌కు సముద్రంలో అల్లంత దూరాన లంగరు వేసి.. టూరిస్టులను టెండర్బోట్లలో తీరంలోని జెట్టీ వద్దకు చేర్చారు. ఏపుగా ఎదిగిన కొబ్బరి చెట్ల మధ్య నుండి మూడు నిమిషాల్లోనే అవతలి ఒడ్డుకు క్యాబ్‌లో చేరుకున్నాం. అక్కడ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ లక్షదీవుల సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శన ‘పరిచకలి’ ఏర్పాటు చేశారు. మేము కూడా కత్తి, డాలు పుచ్చుకుని వారితో కలిసి స్టెప్పులేసి బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం. అంతే, నోట మాటలేదు. రెప్ప వేయకుండా అలాగే చూస్తుండిపోయాం. అడుగేస్తే మాసి΄ోతుందా అనేంత తెల్లగా మెరిసి΄ోతున్న ఇసుక తిన్నెలను స్వచ్ఛమైన సముద్రపు కెరటాలు తాకుతుంటే దాన్ని వర్ణించడానికి నిజంగా మాటలు చాలవు! క్రిస్టల్ క్లియర్‌గా ఉన్న నీలి సంద్రాన్ని చూసి ఆనందంతో గంతులేశాం. ఆర్టిస్ట్ కుంచె నుండి జాలువారిన వాటర్ కలర్ పెయింటింగ్‌లా ఉంది ఆ దృశ్యం. లేలేత నుండి ముదురు వర్ణం వరకు రకరకాల నీలి రంగు షేడ్లలో ఉన్న అలాంటి సముద్రాన్ని మారిషస్, మాల్దీవుల్లాంటి చోట షూట్ చేసే సినిమా పాటల్లో, వీడియోల్లో చూడటమే తప్ప.. ప్రత్యక్షంగా చూసింది లేదు. ఒక్కసారిగా అలాంటి ప్రకృతి పెయింటింగ్‌ను చూసేసరికి నోరెళ్లబెట్టాం. లక్షదీవుల సముద్రం కింద పగడపు దిబ్బలు (కోరల్స్ రీఫ్స్) 4,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉండటం వల్ల సముద్రపు నీరు అత్యంత స్వచ్ఛంగా మైమరపించే నీలి, ఆకుపచ్చ వర్ణంలో పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఎటు చూసినా బ్లూ లగూన్స్ కనువిందు చేస్తాయి.పేరులో లక్ష ఉన్నా...పేరులో లక్షణంగా లక్ష ఉన్నా మొత్తం దీవులు 36 మాత్రమే. అందులోనూ 10 దీవుల్లోనే ప్రజలు నివశిస్తున్నారు. కేరళ తీరానికి 220–480 కిలోమీటర్ల దూరంలో ముత్యాల్లా పరుచుకున్న దీవుల సమూహమిది. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా వీటి మీదుగానే! హిడెన్ జెమ్ ఆఫ్ అరేబియా సీగా పిలిచే ఈ కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుత జనాభా కేవలం 70,000. లక్షదీవుల్లో అడుగుపెట్టాలంటే స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. ప్యాకేజీ బుక్ చేసుకుంటే వారే అరేంజ్ చేస్తారు. ఇక్కడంతా ముస్లింలే. ఎక్కువగా మాట్లాడే భాష మలయాళం, ఆ తర్వాత తమిళం, ఇంగ్లీష్ కూడా నడుస్తుంది. అయితే, జెసేరి అనే ప్రత్యేకమైన స్థానిక భాష వీరికి ఉంది. ఇదీ మలయాళంలాగే అనిపించినా ద్రావిడ భాషలన్నీ కలగలిపి ఉంటుంది. లక్షదీవుల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. టూర్‌కు సరైన సమయమిది.అగట్టి అంతా కాలినడకనే..లక్షదీవుల్లో మేము అగట్టి ఐల్యాండ్‌ను పూర్తిగా చుట్టేశాం. మొత్తం దీవుల్లో పొడవైనది (7.6 కి.మీ) ఇదే కావడంతో ఇక్కడ మాత్రమే ఎయిర్‌పోర్టు కట్టారు. దీని వెడల్పు కిలోమీటరే. ఐల్యాండ్ అంతా నడుచుకుంటూ తిరిగేయొచ్చు. పైనంతా నీలాకాశం.. తెల్లగా మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. ఎటుచూసినా పచ్చని కొబ్బరి చెట్ల తోరణం.. కనువిందు చేసే స్వచ్ఛమైన నీలి సముద్రం, దట్టంగా అల్లుకున్న సుగంధ ద్రవ్యాల వృక్షాలతో ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గం. సముద్రపు కెరటాల చిరు సవ్వడి తప్ప మరే చప్పుడు వినిపించదు. రంగు రంగుల కోరల్ ఫిష్ ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. లక్షదీవుల్లో దొరికే ట్యూనా చేపలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఫిషింగ్ తర్వాత కొబ్బరి పరిశ్రమ ఇక్కడ ప్రధానమైనది. రిసార్టులు, హోటళ్లతో టూరిజం అభివృద్ధి చెందుతోంది. మరో విచిత్రమేంటంటే, ఎక్కడా పక్షులు కనిపించలేదు. సముద్రపు పక్షులు కొన్ని జనావాసం లేని దీవుల్లో (పిట్టి) ఉంటాయట. అందుకే దీన్ని బర్డ్ శాంక్చరీగా ప్రకటించారని గైడ్ చెప్పారు.నీలిసంద్రంలో కోరల్స్ లోకం..స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్.. బనానా బోట్ రైడ్.. గ్లాస్ బోటమ్ బోట్.. కయాకింగ్.. వాటర్ స్కీయింగ్.. విండ్ సర్ఫింగ్.. ఇలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బొలెడున్నాయి. బీచ్‌లో కాసేపు ఆడుకున్నాక ముందుగా మేము బనానా బోట్ రైడ్ చేశాం. గాలితో నింపిన ట్యూబ్‌పై లైఫ్ జాకెట్లు వేసుకుని కూర్చోవాలి. దీన్ని మరో స్పీడ్ బోటు తాళ్లతో సముద్రంలోకి లాక్కెళ్తుంది. పావు గంట రైడ్ తర్వాత, వేగంగా వెనక్కి తీసుకొచ్చి ఫ్లిప్ చేస్తారు. సముద్రంలో పడి΄ోవడం భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దీని తర్వాత కోరల్స్ లోకంలోకి డైవ్ చేశాం. రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యనున్న ఫ్లోటింగ్ జెట్టీ వరకు బోట్లో వెళ్లాలి. అక్కడ లైఫ్ జాకెట్, ఫేస్ మాస్క్ తొడుక్కుని సముద్రంలోకి దూకేయడమే. నీటిపైన తేలుతూ ముఖాన్ని సముద్రంలో ముంచి కిందికి చూడమని డైవర్ చెప్పాడు. అంతే, ఒక్కసారిగా మైండ్ బ్లాంక్. కళ్లముందు అద్భుత సాగరలోకం ప్రత్యక్షమైంది. క్రిస్టల్ క్లియర్ వాటర్‌లో రంగురంగుల కోరల్ ఫిష్ గుంపులు గుంపులుగా తిరుగుతుంటే... సముద్రం అడుగున నెమ్మదిగా పొదల్లా ఊగే కలర్‌ఫుల్ కోరల్ రీఫ్ప్... అది మరో ప్రపంచం. బ్లూ లగూన్స్లో దాగిన పగడపు లోకాన్ని తొలిసారి చూసేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా. అక్కడ లోతు 5 మీటర్లే. కోరల్స్ మధ్యలో సముద్రం అడుగున పెద్ద తలతో ఉన్న కోరల్ ఫిష్ ఇసుకలో పొర్లుతోంది. ఆకుపచ్చ, నీలం రంగు ప్యారట్ ఫిష్ ఒకటి నా మాస్క్‌ను ముద్దాడటం మధురానుభూతి. ఇక స్కూబా డైవింగ్ వేరే లెవెల్. ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ జాకెట్లు, కాళ్లకు ఫ్లాప్స్ ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని, జలచరాల్లా చక్కర్లు కొడుతూ కోరల్స్ ప్రపంచంలో ఈదులాడుతుంటే దాన్ని మాట్లలో వర్ణించలేం!!బొండం రూ.80.. లిక్కర్ బ్యాన్యాక్టివిటీలన్నీ అయ్యాక లంచ్‌లో పూర్తిగా స్థానిక వంటకాలను రుచి చూశాం. ప్యారట్ ఫిష్, బటర్ ఫ్లై ఫిష్‌తోపాటు పీతలు కూడా ఇక్కడ సీఫుడ్‌లో ఫేమస్. రెండు అరచేతులంత ప్యారట్ ఫిష్ (గ్రిల్)ను లొట్టలేసుకుంటూ లాగించేశాం. వంటకాలన్నీ కేరళ స్టయిల్లోనే ఉన్నాయి. దీవులన్నీ కొబ్బరి చెట్లతో నిండి ఉన్నా.. బొండం రేటు రూ.80 అనడంతో అవాక్కయ్యాం. స్థానికంగా ఏదీ పండించరు. ఉప్పు, పప్పు నుంచి సర్వం మెయిన్ ల్యాండ్ కేరళ నుంచే వస్తాయి. అందుకే రేటు ఘాటుగానే ఉంటుంది. పంచదార కిలో రూ.80 అంట! వారానికోసారి కొచ్చి నుంచి కార్గో షిప్లో అన్నీ దిగుమతి అవుతాయి. ఇక్కడ లిక్కర్ పూర్తిగా బ్యాన్. అయితే, అగట్టీకి దగ్గరలోని బంగారం ఐల్యాండ్, రాజధాని కవరట్టిలో మాత్రమే రిసార్టుల్లో టూరిస్టులు, ప్రభుత్వాధికారులకు విక్రయిస్తారు. బహిరంగంగా తాగడం, బయటి నుంచి తీసుకురావడం కూడా నేరమే. రోజంతా రకరకాల జలక్రీడల్లో మునిగితేలి రాత్రి 10 గంటలకు తిరిగి క్రూయిజ్‌లోకి చేరి΄ోయాం. అరగంటలో తిరుగు ప్రయాణం మొదలైంది. మర్నాడు మళ్లీ రోజంతా క్రూయిజ్‌లో ఎంటర్టైన్మెంట్ షోలు, స్విమ్మింగ్, రాక్క్లయింబింగ్ వంటి యాక్టివిటీలతో గడిచిపోయింది.∙∙ ఇలా టన్నులకొద్దీ మధుర స్మతులను నింపుకుని, అరేబియా సముద్రమంత లోతైన జ్ఞాపకాలను మూటగట్టుకొని ముంబైలో క్రూయిజ్ దిగుతుంటే.. ఐదు రోజుల టూరు ఐదు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. ఎలాంటి రణగొణ ధ్వనులు.. కిక్కిరిసిన పర్యాటకులు... బార్లు.. పబ్‌ల వంటివేవీ అక్కడ లేవు. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. అంతే స్వచ్ఛమైన నీలి సంద్రాన్ని.. అందులో దాగున్న అబ్బురపరిచే కోరల్ ప్రపంచాన్ని.. రంగురంగుల జలచరాలను చూసి మైమరచిపోవాలనుకునే నేచర్ లవర్స్‌కు లక్షదీవులు లక్షలాది మధురానుభూతులను అందిస్తుంది! ఇండియాలో ఏకైక బ్లూ లగూన్లో రకరకాల జల క్రీడల్లో మునిగి తేలాలంటే ఈ పగడపు దీవులకు లగేజీ సర్దేయాల్సిందే. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవి లాంటి క్రూయిజ్‌లో అలా చక్కర్లు కొడుతూ నేచర్‌ను ఆస్వాదించడం కూడా జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుంది! అంటే ఒకే ట్రిప్‌లో రెండు డెస్టినేషన్లన్నమాట!! మరింకెందుకు ఆలస్యం గెట్ సెట్ క్రూయిజ్!!ప్యాకేజీల సంగతిదీ..మధ్యతరగతి నుండి సంపన్నుల దాకా లగ్జరీ క్రూయిజ్ జర్నీ చేసేలా రకరకాల రూమ్‌లు, డిస్కౌంట్లు, గ్రూప్ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది. స్టేట్రూమ్లకు విండో ఉండదు. ముంబై – లక్షదీవుల రౌండ్ ట్రిప్.. ఇద్దరు పెద్దవాళ్లకు 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజీ ధరలు చూస్తే (జీఎస్టీ కాకుండా)...ఇంటీరియర్ స్టేట్‌రూమ్ స్టాండర్డ్: రూ. 1,14,098ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్రీమియర్: రూ. 1,32,610ఓషన్వ్యూ స్టాండర్డ్: రూ. 1,46.850ఓషన్ వ్యూ ప్రీమియర్: రూ. 1,65,362మినీ సూట్: రూ.1,90,994సూట్: రూ.3,05,626చైర్మన్ సూట్: రూ.4,82,202అంటే ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్ రూమ్‌కు ఒక్కో వ్యక్తికి రూ.67,317 చార్జీ (ఫుడ్, ఎంటర్టైన్మెంట్, అన్ లిమిటెడ్ బెవరేజెస్ ప్యాకేజీ, జీఎస్టీతో కలిపి) పడుతుంది. ఫైఫ్స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతితో పాటు లక్షదీవుల్లో ఎంజాయ్ చేసి రావచ్చు. నేరుగా కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises.com) లేదా అథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సంఖ్య, జర్నీ ఎప్పుడు అనే దాన్ని బట్టి డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. కొచ్చి, గోవా నుంచి 3 నైట్స్, 4 డేస్ ప్యాకేజీలు (ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్ రూమ్ ఒక్కో వ్యక్తికి రూ.52,000) కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకుంటే రేటు ఇంకా తగ్గుతుంది. 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత జర్నీ (బేస్ ఫేర్ మినహాయిస్తారు, సర్ ఛార్జీ, పన్నులు చెల్లించాలి), గ్రూప్ బుకింగ్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. గమ్యస్థానాల్లో షోర్ ఎక్స్కర్సన్ (గ్రూప్ టూర్ ప్యాకేజీ)లకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. లేదంటే మనం సొంతంగా కూడా రోజంతా తిరిగి మళ్లీ రాత్రికి క్రూయిజ్‌లోకి చేరుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. – శివరామకృష్ణ మిర్తిపాటి (చదవండి: ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
పర్వతమే పరమేశ్వరుడు..!
కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం... ఈ అయిదు లింగాలను పంచ భూత మహాలింగాలు అని అంటారు. ఈ అయిదు క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవటం మంచిదని చాలా మంది అలా దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోనే ఈ ఆలయాలు ఉండటం గమనించదగిన విషయం. వరుసక్రమంలోనే కాకుండా దూరం రీత్యా కూడా అరుణాచలం మధ్యలో నిలుస్తుంది.పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలం క్షేత్రం. దీనినే తమిళనాడులో తిరువణ్ణామలై క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్వామి వారు అరుణాచలేశ్వరుడు కాగా అమ్మవారు అపిత కుచలాంబా దేవి. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని స్వామివారే చె΄్పారట. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు పల్లవులు, విజయనగర సార్వభౌములు ఇక్కడ ఆలయాలను ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మిత మైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. నాలుగు దిక్కుల్లో ఎత్తయిన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం పదకొండు అంతస్తుల్లో అలరారుతుంది. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో ఉండే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇక్కడి వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివ గంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. అరుణాచలం క్షేత్రం అంటే రమణ మహర్షిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన్ని సుబ్రహ్మణ్యస్వామి మరో అవతారంగా భక్తులు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అరుణగిరి (పర్వతం) కు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ’అ–రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని అర్థం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని, అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.ఆలయ విశేషాలుతిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.ఎలా వెళ్ళాలంటే..?కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి. చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరటానికి 4–5 గంటల సమయం పడుతుంది.గిరి ప్రదక్షిణఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిద్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపం లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ.ల దూరంలో వుంది. (చదవండి: Kashi Manikarnika Ghat Mystery: కాశీలో అంత్యక్రియల సమయంలో బూడిదపై 94 ఎందుకు రాస్తారు..? దాగున్న ఆధ్యాత్మిక రహస్యం) -
ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్
అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్‌గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్ (Anunay Sood) ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడిఎవరీ అనునయ్ సూద్ అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్‌ది. లాస్ వెగాస్‌లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్. -
మలేసియా– సింగపూర్ ట్విన్ టూర్
సింగపూర్– మలేసియాలు ట్విన్ కంట్రీస్ కాదు... కానీ టూరిజం ప్రధానంగా కవలల్లాగ సరిపోలి ఉంటాయి.ఇండియా నుంచి టూర్ ప్యాకేజ్‌లు కలగలిసి ఉంటాయి.ఈ టూర్లో ఏమేమి చూడవచ్చు... అంటే లిస్ట్ పెద్దదే.మలేసియాలో... ఒక ఇండిపెండెన్స్ స్క్వేర్... మరో నేషనల్ మాన్యుమెంట్. కింగ్స్ ప్యాలెస్ ఇస్తానా నెగారా...తళతళ మెరిసే ట్విన్ టవర్స్.కుమారస్వామి కొలువైన బటూకేవ్స్...ప్రధాని కొలువైన పుత్రజయ.సింగపూర్‌కి వస్తే...దేశ చిహ్నం మెర్లయన్ పార్క్... సంతోషాల హరివిల్లు సెంటోసా.హైబ్రీడ్ పూల ఆర్చిడ్ గార్డెన్... కోట్లాది వీక్షకుల యూనివర్సల్ స్టూడియోస్.స్టార్ ఇమేజ్‌ల మేడమ్ టుస్సాడ్స్... పక్షుల నిలయం బర్డ్ ప్యాడైజ్. ఒకసారి దుస్తులు సర్దుకుంటే... ఆరు రోజుల్లో రెండుదేశాలు తిరిగి రావచ్చు. జీరో డే: సాయంత్రం 19.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ లో టూర్ ఆపరేటర్లకు రిపోర్ట్ చేయాలి. పర్యాటకులకు స్వాగతం పలకడం, ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం, విమానం ఎక్కడం. విమానం రాత్రి 11.10కి బయలు దేరుతుంది. తొలిరోజు ప్రయాణం సాగుతుంది. కానీ పర్యటన ఏమీ ఉండదు. కాబట్టి ఈ టూర్ ఐటెనరీలో తొలిరోజును జీరో డే గా గుర్తిస్తారు. రెండవ రోజును ఐటెనరీ తొలిరోజుగా గుర్తిస్తారు. ఫస్ట్ డే: ఉదయం 8.10 గంటలకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో దిగడం. లగేజ్ తీసుకుని, ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్ తర్వాత విశ్రాంతి, మధ్యాహ్న భోజనం తర్వాత సైట్ సీయింగ్. ఫొటో స్టాప్ ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, చాకొలేట్ హోల్‌సేల్ షాప్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి హోటల్‌కు చేరడం. రాత్రి బస కౌలాలంపూర్.స్వాతంత్య్రవేడుకల నేలఇండిపెండెన్స్ స్క్వేర్ అనేది మలేసియా దేశ గర్వకారణం. బ్రిటిష్ పాలన నుంచి మలేసియా విముక్తి పొందిన రోజు అంటే... 1957, ఆగస్టు 31వ తేదీన యునైటెడ్ కింగ్డమ్ పతాకాన్ని అవనతం చేసి అదే స్థానంలో మలేసియా పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి దీనికి ఇండిపెండెన్స్ స్క్వేర్ అనే పేరు వచ్చింది. ఏటా ఆ దేశ స్వాతంత్య్రదినోత్సవరం రోజున ఇక్కడే జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది.రాజప్రాసాదంకౌలాలంపూర్లో రాజప్రాసాదం పేరు ఇస్తానా నెగారా. ఈ కింగ్స్ ప్యాలెస్ ఉన్న ప్రదేశం జలన్ ఇస్తానా. 13 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ఇది. రాజు నివసిస్తాడు. ఈ ప్యాలెస్ది పల్లడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్. రాజురాణి ప్రజలకు దర్శనమిస్తే హాల్లో సింహాసనాలు రెండు ఉంటాయి. ఇక్కడి పదాలు భారతీయతకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తాయి. సింహాసనానన్ని సింగాహ్సన అంటారు. నేషనల్ మాన్యుమెంట్ దేశభక్తికి ప్రతీక. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దేశం స్వాతంత్య్రం కోసం ΄ోరాడిన సైనికుల గౌరవార్థం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ప్రపంచ రికార్డు ఉంది. వరల్డ్స్ టాలెస్ట బ్రాంజ్ ఫ్రీ స్టాండింగ్ స్కల్ప్చర్ ఇది. నాటి రికార్డ్ టవర్స్స్టీల్, గ్లాస్‌తో నిర్మించిన పెట్రోనాస్ ట్విన్ టవర్స్ తళతళలాడుతూ కౌలాలంపూర్ నలుమూలలకూ కనిపిస్తుంటాయి. 88 అంతస్థుల నిర్మాణం. 86వ అంతస్థులో అబ్జర్వేటరీ డెక్ ఉంది. ఇక్కడికి పర్యాటకులను అనుమతిస్తారు. మలేసియాలోని ప్రధాన వ్యా΄ార సంస్థల కార్యాలయాలు ఇందులోనే ఉన్నాయి. వీటిని 1998లో నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి 2004 వరకు వరల్డ్ టాలెస్ట్ టవర్స్ అనే భుజకీర్తిని ధరించాయి. దీని నిర్మాణానికి మోడల్ స్ట్రక్చర్ మనదేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినారే. సెకండ్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బటూ కేవ్స్‌కు ప్రయాణం. బటూ కేవ్స్ విహారం తర్వాత గెంటింగ్ హైలాండ్స్ సందర్శనం. తిరిగి కౌలాలంపూర్‌కి చేరి ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత బస చేసిన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస అక్కడే.మలేసియా కుమారస్వామిమలేసియాలో బటూ కేవ్స్ పరిసరాల్లోకి వెళ్లగానే తమిళం వినిపిస్తుంది. మనదేశంలో తమిళనాడులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. మురుగా అని తరచూ వినిపిస్తూంటుంది. ఇక్కడున్న మురుగన్ ఎత్తు 140 అడుగులు. బంగారు వర్ణంలో మెరిసి΄ోతూ ఉంటాడు. మనం కుమారస్వామిగా పిలిచే దైవమే మురుగన్. కుమారస్వామిని గుండెల్లో పెట్టుకుని కొలిచే తమిళులు ఇక్కడ ఆకాశమంత రూపాన్నిచ్చారు. ఇరవై ఏళ్ల కిందట దాదాపు 20 కోట్లు ఖర్చయింది. గాంబ్లింగ్ హైల్యాండ్స్గెంటింగ్ హైల్యాండ్స్ అనేది మలేసియాలో ఉలుకాలి శిఖరం మీద ఉన్న పెద్ద థీమ్ పార్క్. గాంబ్లింగ్ అడ్డా. ఇక్కడ గాంబ్లింగ్కి అధికారికంగా అనుమతిస్తారు. పర్యాటకులు ఆ భారీ ఎస్టాబ్లిష్మెంట్ను చూసి ఆనందించడానికి పరిమితం కావాలి. గెంటింగ్ హైల్యాండ్స్ సమీపంలో చిన్ స్వీ కేవ్స్ టెంపుల్ ఉంది. చైనా నిర్మాణాలను పోలి ఉంటుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్‌లు, నిర్మాణ నిపుణులు, శిల్పకారులకు సలామ్ చేయాలనిపిస్తుంది. ఫోర్త్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింగపూర్ సిటీ టూర్. ఆర్చిడ్ గార్డెన్, మెర్లయన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్. లంచ్ తర్వాత కేబుల్ కార్లో సెంటోసాకు చేరాలి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, ఐఓఎస్, వింగ్స్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస సింగపూర్‌లోనే.హైబ్రీడ్ గార్డెన్సింగపూర్ ఆర్చిడ్ గార్డెన్ మామూలు పూలతోట కాదు. ఈ గార్డెన్‌కు ప్రత్యేకమైన హోదా ఉంది. దీని పూర్తి పేరు నేషనల్ ఆర్చిడ్ గార్డెన్. దేశంలో ఎత్తైన ప్రదేశంలో విస్తరించి ఉంది. కొండ మీద బొటానికల్ గార్డెన్‌కి గుండె వంటిది ఈ ఆర్చిడ్ గార్డెన్. బొటానికల్ గార్డెన్‌లోని కోర్ ఏరియా అని చెప్పవచ్చు. రంగుల కలలా అనిపిస్తుంది. గార్డెన్లో విహరించినంత సేపూ రంగుల పూలను విభ్రమగా చూస్తాం. కానీ గార్డెన్ విహారం తర్వాత ఒక చోట కూర్చుని గార్డెన్ మొత్తాన్ని లాంగ్ షాట్లో చూస్తూ సింహావలోకనం చేసుకుంటే ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఆలోచించగా ఆలోచించగా ఈ పూలకు వాసనలు లేవనే వాస్తవం స్ఫూరిస్తుంది. పూలన్నీ హైబ్రీడ్ వంగడాలే. కనువిందు చేయడంలో ఏ కొరతా ఉండదు. సింహంచేపఈ పదం ఎంత విచిత్రంగా ధ్వనిస్తుందో ఈ శిల్పం కూడా అలాగే ఉంటుంది. దిగువ భాగం చేప ఆకారం, పై భాగం సింహం ఆకారంతో మిళితమై ఉంటుంది. ఇది మెర్లయన్ పార్కులో ఉంది, ఈ శిల్పం సింగపూర్ పర్యాటక చిహ్నం. ఇక సింగపూర్ ఫ్లయర్ రైడ్ లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇది కేవలం ఐవు వందల అడుగుల ఎత్తులో తిరిగే జెయింట్‌వీల్ మాత్రమే కాదు, ఏసీ జెయింట్ వీల్. ఇక్కడ పర్యటిస్తుంటే ఈ దేశ పర్యాటకరంగం దేశంలో ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసిందనపిస్తుంది. చదవండి: మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లోసెంటోసా టుస్సాడ్స్సెంటోసా ఐలాండ్ అంటే సింగపూర్‌లో రిలాక్సేషన్, రిక్రియేషన్ హబ్. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం కూడా ఈ దీవిలోనే ఉంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాలు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. సింగపూర్‌లో ఉన్నది ఏడవ బ్రాంచ్. ఇంకా ఈ దీవిలో గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, రిసార్టులు, యూనివర్సల్ స్టూడియో. థీమ్ ΄ార్కులు, మెరీనా బే సాండ్స్ విహారాలన్నీ కలిసి సింగపూర్ టూర్ అంటే నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్‌నిస్తాయి. కేబుల్ కార్లో ప్రయాణిస్తూ ఐలాండ్‌లో వీటన్నింటినీ విహంగవీక్షణం చేయవచ్చు. మలేసియాలో ఉన్నట్లు సింగపూర్‌లో కూడా ప్రదేశాల పేర్లు సంస్కృత మూలాలతో ఉన్నాయి. సెంటోసా అనే పదానికి మూలం కూడా సంస్కృతమే. సంతోష అనే పదం నుంచి వచ్చింది. ఈ దీవిలో ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఎత్తయితే... వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో జరిగే క్రాకర్స్ ఫెస్ట్ మరో ఎత్తు. ఫిఫ్త్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్కి ప్రయాణం. సూడియోస్ విజిట్ తర్వాత గార్డెన్స్ విహారం, సింగపూర్ బే, డోమ్స్ విజిట్. ఇండియన్ రెస్టారెంట్లో భోజనం తరవాత హోటల్ దగ్గర డ్రాపింగ్. రాత్రి బస సింగపూర్‌లోనే. సంతోషాల దీవిసెంటోసా ఐలాండ్ విహారం ఒక రోజులో పూర్తయ్యేది కాదు. యూనివర్సల్ స్టూడియోస్‌లో ఉన్న థీంపార్క్ల కోసం కొన్ని గంటలు కేటాయించాలి. ఇందులో 24 రకాల రైడ్లుంటాయి. ఓ యాభై ఏళ్లు దాటిన వాళ్లకు ఏ రైడ్ అయినా ఒకటే అన్నట్లు ఉంటుంది, కానీ ఇరవై ఏళ్ల వాళ్లకు ప్రతి రైడ్నీ ఎంజాయ్ చేస్తే తప్ప టూర్ ఇచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని ఫీలవ్వలేదు. ఆసియా ఖండం అంతటిలో ఇలాంటి థీమ్ పార్క్ స్టూడియో మరొకటి లేదు. ఆసియా వాసుల మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ సింగపూర్‌ని మంచి టూరిస్ట్ డెస్టినేషన్‌గా చూస్తాయి. అందుకే ఏడాదికి నాలుగు కోట్ల మంది ఈ యూనివర్సల్ స్టూడియోస్కి వస్తారు. ఇక ఇక్కడ సముద్ర తీరాన బే గార్డెన్స్, డోమ్స్ పేరుతో చాలా ఉద్చానవనాలుంటాయి. ఉన్న కొద్దిపాటి నేలను పర్యాటకమే ప్రధానంగా అభివృద్ధి చేసుకుని చక్కటి రాబడిని చూస్తోందీ దేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆరో రోజు : బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బర్డ్ ప్యారడైజ్‌కి ప్రయాణం. లంచ్, షాపింగ్ తర్వాత నిర్వాహకులు పర్యాటకులను సింగపూర్ ఎయిర్΄ోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ విమానం ఎస్క్యూ– 522 బయలుదేరుతుంది. పక్షుల స్వర్గంబర్డ్స్ ప్యారడైజ్... నలభై ఎకరాల్లో విస్తరించిన పక్షిధామం ఇది. పక్షుల స్వర్గధామం అనే పేరు అక్షరాలా నిజం. ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాల్లో జీవించే పక్షిజాతులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆ పక్షుల కోసం వాటికి అనువైన వాతావరణంతో గూళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యటించేటప్పుడు చేయాల్సింది నేలను, నింగినీ చూసుకుంటూ నడవడం కాదు, చెట్ల కొమ్మల మీద కూర్చుని కువకువలాడుతున్న పక్షుల కోసం తలెత్తి కళ్లు విప్పార్చుకుని చూస్తూ సాగి΄ోవాలి. ఒక పక్షి ఉన్నట్లు మరో పక్షి ఉండదు. వాటి రెక్కలకు ప్రకృతి అద్దిన రంగులు గాఢంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇండియా టూ సింగపూర్ వయా మలేసియాసింగపూర్, మలేసియాలను కవర్ చేసే ఈ ఆరు రోజుల టూర్ పేరు ‘మ్యాజికల్ మలేసియా వింత్ సింగపూర్ సెన్సేషన్ ఎక్స్ హైదరాబాద్’. టూర్ కోడ్ : ఎస్హెచ్ఓ1.ప్రయాణం ఎప్పుడు? డిసెంబర్ 11వ తేదీ మొదలవుతుంది.ఎస్క్యూ – 523/104 విమానం రాత్రి 23.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణం 17వ తేదీన. ఎస్క్యూ–522 విమానం సింగపూర్‌లో రాత్రి 20.00 గంటలకు బయలుదేరి 21.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.టారిఫ్ ఇలాగ!సింగిల్ షేరింగ్‌లో ఒకరికి 1,56,900 రూపాయలు, డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 1,29,250 ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 1,29,000 రూపాయలు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ట్రావెల్ కా ముహూరత్ రేపటి నుంచి..
సంవత్సరాంతంలో పర్యటనలను ప్లాన్ చేసుకునే టూరిస్టుల కోసం ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ ‘ట్రావెల్ కా ముహూరత్’ పేరిట సరికొత్త కాన్సెప్ట్ అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా, విమానాలు, హోటల్ వసతులు, హాలిడే ప్యాకేజీలు, గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్, పర్యటనలు, ఇతర ఆకర్షణీయ సేవలతో పాటు వీసా, ఫారెక్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి ప్రయాణ నిత్యావసరాలను కలిపి ఒకే గొడుగు కింద అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ రాజేష్ మాగోవ్ తెలిపారు. తమ ‘ట్రావెల్ కా ముహూరత్’ ప్రారంభ ఎడిషన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. సంవత్సరాంతం (డిసెంబర్)లో ఛార్జీలు పెరుగుతాయని భావించే పర్యాటకులు ముందుగా తమ పర్యటనలను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. (చదవండి: రిటర్న్ గిఫ్ట్.. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్..) -
అచ్చం మంత్రం వేసినట్లే... మంత్రముగ్ధులను చేస్తుంది!!
డిసెంబర్ నెలలో మేఘాలయ విహారం. షిల్లాంగ్‌లో సేదదీరి...చిరపుంజి జల్లును చూద్దాం.మంజీరవ సవ్వడి చేసే జలపాతాన్ని వీక్షిద్దాం. భారత్ –బంగ్లా మధ్య వంతెన మీద అడుగులేద్దాం.స్వచ్ఛగ్రామంలో శుభ్రత పాఠం నేర్చుకుందాం. ముక్కు మీద కొమ్ముతో భయపెట్టే ఖడ్గమృగాన్ని చూద్దాం.కామాఖ్యను దర్శించుకుని బ్రహ్మపుత్రలో విహరిద్దాం.అసోమ్ కళల సంస్కృతిని మ్యూజియంలో చూద్దాం.నో డౌట్... మంత్రముగ్ధులను చేసే పర్యటన ఇది.అచ్చం మంత్రం వేసినట్లే... మంత్రముగ్ధులను చేస్తుంది!! హైదరాబాద్ నుంచి గువాహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణం. గువాహటి ఎయిర్΄ోర్ట్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుని రోడ్డు మార్గాన ప్రయాణం షిల్లాంగ్‌కు సాగుతుంది. షిల్లాంగ్‌లో హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.షిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణం. షిల్లాంగ్‌లో హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజికి చేరుకుని ఎలిఫెంటా ఫాల్స్, నోహ్ కాకికాయ్ ఫాల్స్, మవాస్మాయ్ కేవ్స్ వీక్షణం తర్వాత తిరిగి షిల్లాంగ్‌కు ప్రయాణం. ఆ రాత్రి బస కూడా షిల్లాంగ్‌లోనే.జల సోపానంఈ వాటర్‌ఫాల్స్ సుతిమెత్తగా మెట్లు దిగుతున్న అందమైన అమ్మాయిలాగ ఉంటుంది. పాద మంజీరాల సవ్వడి వలె చిరుసవ్వడి చేస్తూ జలధార మెట్ల మీద నుంచి ప్రవహించి నేల మీద మడుగుగా మారుతుంది. ఈ జలపాతాన్ని చూస్తే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో వెంటనే అర్థం కాదు. ఏనుగంత భారీ జలపాతమూ కాదు, ఏనుగు తొండం వంటి ఆకారం నుంచి నీరు ప్రవహించడం వంటి ప్రకృతి సోయగమూ కనిపించదు. ఇక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండడంతో బ్రిటిష్ వాళ్లు ఎలిఫెంట్ ఫాల్స్ అన్నారు. అధికారిక డాక్యుమెంట్లలో అదే పేరు కొనసాగింది. స్థానిక ఖాసీ తెగ వాళ్లు తమ ఖాసీ భాషలో దీనికి పెట్టుకున్న పేరు ‘కా కై్షద్ లాయ్ పతెంగ్ ఖోసియో’. ఈ పేరు పలకడం సాధ్యం కాక΄ోవడం కూడా బ్రిటిష్ వారు పెట్టిన పేరే స్థిరపడి΄ోయింది.మేఘాలయ బెళుం గుహలు మవాస్మాయ్ గుహలను ప్రకృతి అద్భుతం అంటే చాలా చిన్న మాట అవుతుంది. ఈ గుహలు ఓ పెద్ద రసాయన గ్రంథం. మన రాష్ట్రంలో బెళుం గుహల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా స్టాలగ్మైట్, స్టాలగ్టైట్ ధారలు కనువిందు చేస్తాయి. ఈ రసాయన ధారల గాఢతను బట్టి శాస్త్రవేత్తలు వాటి వయసును నిర్ధారిస్తారు. ఈ గుహల్లోపల నడుస్తుంటే ఒక గుహ నుంచి మరో గుహకు కనెక్షన్ ఉంటుంది. బౌద్ధ గుహల్లాగ ఎవరో పని గట్టుకుని తొలిచిన గుహలు కావివి. సహజంగా ఏర్పడిన గుహలు. ఇక చిరపుంజి గురించి దేశమంతటికీ తెలిసిన విషయం అత్యధిక వర్ష΄ాతం నమోదయ్యే ప్రదేశం అని. కానీ ఇక్కడ ఇంకా ఎన్నో ప్రకృతి చమత్కారాలున్నాయి. పర్వతాల మీదకు ట్రెకింగ్, అందమైన లోయల వీక్షణం, వ్యూ ΄ాయింట్లలో ఫొటో షూట్, వేళ్ల వంతెనలు కూడా. ఐదు వందల ఏళ్ల నాటి వేళ్ల వంతెన చిరపుంజికి మరో రికార్డ్.సెవెన్ సిస్టర్ ఫాల్స్నోహ్ కాకికాయ్ జల΄ాతానికి వ్యవహారనామం సెవెన్ సిస్టర్స్ వాటర్‌ఫాల్స్. ఇది కూడా బ్రిటిష్ అధికారులు చేసిన నామకరణమే. కెనడాలో మనటోబా గ్రామలోని ఏడుపాయల జలపాతం పేరు సెవెన్ సిస్టర్స్ హిల్స్. మేఘాలయలోని నోహ్ కాకికాయ్ జలపాతానికి కూడా సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ అనే పేరు పెట్టడం ప్రభుత్వ రికార్డుల్లో రాయడంతో అది అధికారిక నామం అయింది. ఈ జలపాతం మవాస్మాయ్ గుహలకు దగ్గరలో ఉండడంతో స్థానికులు మవాస్మాయ్ జలపాతం అంటారు. ఇది ఎంత విశాలమైన జలపాతమంటే మొదటిపాయ నుంచి ఏడవ పాయ వరకు దూరం దాదాపు కిలోమీటరు ఉంటుంది. ఎండాకాలంలో సన్నని ధారలుగా ఉంటుంది. వర్షాకాలంలో ఝుమ్మని శబ్దం చేస్తూ ఉరకలెత్తుతున్న గోదావరిని తలపిస్తుంటుంది. ఈ జలపాతాన్ని దూరాన్నుంచి చూడడమే తప్ప జలధారల కింద సేదదీరే అవకాశం లేదు.ఈ రోజు ప్రయాణం షిల్లాంగ్ నుంచి డాకీకి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ప్రయాణం డాకీ లేక్‌కు సాగుతుంది. డాకీ లేక్ విహారం తర్వాత మాలిన్నాంగ్ విలేజ్ వీక్షణం. లివింగ్ రూట్స్ బ్రిడ్జి మీద నడక తర్వాత షిల్లాంగ్‌కు తిరుగు ప్రయాణం. ఈ రాత్రి బస కూడా షిల్లాంగ్‌లోనే.దేశాలను కలిపే వంతెనఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు... అని సినీగేయాలను ఆలపించాం. కానీ ఆ హద్దు ఈ హద్దు సరిహద్దుల మధ్య వంతెన గురించి ఏ పాటా లేదు. మనకు మనమే కపాడుకోవాలి. భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య ఉమ్న్గోట్ నది ప్రవహిస్తుంటుంది. నది మీద మనదేశంలో డాకీ అనే గ్రామం నుంచి బంగ్లాదేశ్‌లోని తమాబిల్కు ఉన్న వంతెన పేరే డాకీ బ్రిడ్జి.వక్కలూరుమావ్ లిన్నాంగ్ గ్రామంలో వక్క పండిస్తారు. తమలపాకుతోపాటు తినే వక్క ఇక్కడ ప్రధాన పంట. గ్రామస్థులు పరిశుభ్రత పట్ల క్రమశిక్షణతో ఉంటారు. గ్రామంలో వీథులకు రెండు పక్కలా చెట్లు చక్కగా చిక్కగా విస్తరించి ఉంటాయి. కానీ రోడ్డు మీద ఒక్క ఆకు కూడా కనిపించదు. రాలిపడిన ఆకులను ఎత్తి డస్ట్‌బిన్‌లో వేయడం నుంచి అలా సేకరించిన చెత్తను ఎరువుగా మార్చడం వరకు ప్రతిదీ నియమబద్ధంగా చేస్తారు. డస్ట్ బిన్‌కి కూడా ప్లాస్టిక్ వాడరు, అన్నీ వెదురు బుట్టలే. అందుకే మావ్ లిన్నాంగ్ గ్రామం జీరో వేస్ట్ ΄ాలసీని అనుసరిస్తున్న అత్యంత శుభ్రమైన గ్రామంగా రికార్డు సాధించింది. ఈ గ్రామంలో మరో విశిష్టత ఏమిటంటే... ఇక్కడ మాతృస్వామ్యం కొనసాగుతోంది. తల్లి నుంచి ఆస్తి కూతుర్లకు సంక్రమిస్తుంది. అలాగే తల్లి ఇంటి పేరే పిల్లలకు సంక్రమిస్తుంది.వేళ్ల వంతెనచెట్ల వేరును వంతెనలా అల్లడం అన్నమాట. భూమిలోపల ఉండే వేళ్లతో ఎలా సాధ్యం అనే సందేహం నిజమే. కానీ రబ్బరు చెట్ల వేళ్లు భూమి లోపల విస్తరించడంతోపాటు కొన్ని వేళ్లు భూమి పైన కూడా ఉంటాయి. వాటిని చెట్టు నుంచి వేరు చేయకనే తాళ్లుగా పేనుతూ వంతెన అల్లుతారు. అల్లిక ఆధారం దొరకడంతో ఆ వేరు అదే దిశలో పెరుగుతూ ఉంటుంది. ఇలా నది మీద ఒక ఒడ్డున ఉన్న చెట్ల నుంచి మరో ఒడ్డున ఉన్న చెట్ల వేళ్లతో కలుపుతూ పూర్తిస్థాయి వంతెన రూపం తీసుకువస్తారు. ఆదివాసీలు తమ జీవనం కోసం ప్రకృతికి విఘాతం కలిగించరు. ఇంటి నిర్మాణానికి అవసరమైన కలపను కూడా ఎండిన చెట్ల నుంచే సేకరిస్తారు. చెట్ల నుంచి వేరును వేరు చేయకుండా వంతెన అల్లే కళ కూడా ప్రకృతి హితమైన జీవనం నుంచి పుట్టిన గొప్ప ఆలోచన అనే చె΄్పాలి. ఈ వంతెన మీద నడుస్తున్నప్పుడు లయబద్ధంగా చిన్న కదలికలు వస్తుంటాయి. స్థానికులు ఆ కదలికలకు అనుగుణంగా దేహాన్ని బాలెన్స్ చేసుకుంటూ ఏ మాత్రం తడబడకుండా నడుస్తారు. షిల్లాంగ్ నుంచి ఖజిరంగాకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన ఖజిరంగా నేషనల్ పార్క్‌కు సాగిపపపోవాలి. ఇది దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల ప్రయాణం. ఖజిరంగాకు చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం, రాత్రి బస.ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికిమేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ హిల్‌స్టేషన్. ప్రకృతి వరమిచ్చినట్లున్న అందమైన పర్యాటక ప్రదేశం కూడా. ‘స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్’ అనే ప్రశంసను పొందిన నగరం. ఖాసీ, జాంతియా హిల్స్ చిక్కటి పచ్చదనాన్ని వీక్షిస్తూ సాగే ప్రయాణం గొప్ప అనుభూతి. పర్యటనలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సాగే ప్రయానానికి అర్థం గమ్యం కోసం ఎదురు చూడడం కాదు. అడుగడుగునా కనువిందు చేస్తున్న ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం. మేఘాలయ రాష్ట్రంలో మొదలైన ప్రయాణం అసోమ్‌కు చేరుతుంది. ఐదువేల అడుగుల ఎత్తులో సాగే ప్రయాణం భౌగోళిక శాస్త్రం పుస్తకాన్ని చదివినట్లే ఉంటుంది.ఖజిరంగ నుంచి గువాహటికి ప్రయాణం. తెల్లవారు జామున ఖజిరంగా నేషనల్ పార్క్ సఫారీకి బయలుదేరాలి. సఫారీ ఖర్చు ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు ఎవరికి వారే భరించాలి. నేషనల్పార్క్ సఫారీ తర్వాత తిరిగి హోటల్‌కు చేరి రిఫ్రెష్ అయి బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని గువాహటి వైపు సాగిపోవాలి. గువాహటిలో హోటల్ చెక్ ఇన్, రాత్రి బస.కత్తిలాంటి అడవిఅసోమ్ అనగానే ఖడ్గమృగం కళ్ల ముందు మెదలుతుంది. ఖజిరంగా నేషనల్ పార్క్‌లో రెండువేలకు పైగా ఖడ్గమృగాలున్నాయంటే నమ్ముతారా? ఖడ్గమృగాలు మాత్రమే కాదు, పులుల సంఖ్య కూడా ఎక్కువే. వన్యప్రాణి సంరక్షణ చర్యలు పటిష్టంగా తీసుకోవడం వల్ల పక్షుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ ప్రకృతి వరాన్ని ఆస్వాదించాలంటే ఎలిఫెంట్ సఫారీ చేయాలి. ఎలిఫెంట్ సఫారీకి భయపడేవాళ్లు జీప్ సఫారీ చేయవచ్చు. ఖజిరంగా నేషనల్ పార్క్ సమగ్రత నేపథ్యంలో యునెస్కో ఈ అటవీ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తరవాత కామాఖ్య ఆలయ దర్శనం. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ విహారం. క్రూయిజ్ టికెట్ ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులే టికెట్ కొనుక్కోవాలి. రాత్రి బస గువాహటిలో.దశమహావిద్యల నిలయంకామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇందులో ప్రధాన దైవం కామాఖ్య అమ్మవారు. కామాఖ్య ఆలయం ప్రాంగణంలో దశమహా విద్యల దేవతలు త్రిపుర సుందరి, మాతంగి, కమల, కాలి, తార, భువనేశ్వరి, బగలాముఖి, చిన్న మస్త, భైరవి, ధూమవతి కొలువై ఉన్నారు. ఇక్కడ శివుడు కామేశ్వరుడు, సిద్ధేశ్వరుడు, కేదారేశ్వర, ఆమరకోటేశ్వర, అగోర, కోటిలింగ పేర్లతో పూజలందుకుంటున్నాడు.బ్రహ్మాండ ప్రయాణంబ్రహ్మపుత్రలో పడవ ప్రయాణం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్. కొండవాలులో విస్తరించిన టీ తోటలను చూస్తూ క్రూయిజ్‌లో ప్రయాణించడం, క్రూయిజ్ ఆగిన చోట దిగి కాలినడకన వెళ్లి స్థానిక నివాస ప్రదేశాలను వీక్షించడం, నడవలేని వాళ్లు రిక్షాలో ప్రయాణిస్తూ చుట్టి రావచ్చు. కాలిబాటల వెంట ఒకరి వెనుక ఒకరు మౌనంగా నడిచి వెళ్లే బౌద్ధ సన్యాసులు కనిపిస్తారు. బౌద్ధ చైత్యాలు, విహారాలు కనిపిస్తాయి. చిన్న పడవల్లో చేపలు పట్టే జాలరులు కనిపిస్తారు. ఈ టూర్లో రియల్ ఇండియాని దగ్గర నుంచి చూడవచ్చు. అందుకే ఇది బ్రహ్మాండమైన ప్రయాణం.గువాహటి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి లగేజ్‌తో బయలుదేరాలి. అస్సాం స్టేట్ మ్యూజియం వీక్షణం తర్వాత గువాహటి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి నిర్వహకులు వీడ్కోలు చెబుతారు. హైదరాబాద్ ఫ్లయిట్ ఎక్కి రాత్రికి హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.అసోం కళల నిలయంఅస్సాం స్టేట్ మ్యూజియాన్ని ‘అస్సాం రీసెర్చ్ సొసైటీ’ స్థాపించింది. మ్యూజియంలో ప్రతి ఎగ్జిబిట్ ఈ విషయాన్ని చెబుతూ ఉంటుంది. ప్రాచీన కాలం నాటి ఆయుధాల విభాగం అసోం జానపద జీవనశైలికి, నాటి లోహశాస్త్ర నైపుణ్యానికి అద్దం పడుతుంది. శిల్ప శాస్త్రం కూడా బాగా అభివృద్ధి చెందిన రోజులవి. రాతి శిల్పాలు, లోహ శిల్పాలతోపాటు దారుశిల్పాలు, మట్టి శిల్పాలను కూడా చూడవచ్చు. పౌరాణిక కథనాల ప్రతిరూపాలవి. అసోం కళలు, సంస్కృతి అవగతమవుతుంది. సాహిత్య విభాగం ఇక్కడ చక్కటి సాహిత్యం వెల్లివిరిసిందనడానికి ప్రతిబింబంగా ఉంటుంది.ఈ టూర్ ప్యాకేజ్ పేరు ‘మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 14. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్ చేరడంతో పూర్తవుతుంది. ఏడు రోజులు సాగే ఈ టూర్లో షిల్లాంగ్, చిరపుంజి, ఖజిరంగా, గువాహటి ప్రదేశాలు కవర్ అవుతాయి. ప్రయాణం ఎప్పుడు? 8.12.2025. డిసెంబర్ 8వ తేదీ తెల్లవారు జామున 05.40 గంటలకు 6ఈ 972 ఫ్లయిట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 08.10 నిమిషాలకు గువాహటికి చేరుతుంది.డిసెంబర్ 14వ తేదీ 6ఈ 187 ఫ్లయిట్ , రాత్రి 19.20 గంటలకు గువాహటి నుంచి బయలుదేరి 22.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.టారిఫ్ ఇలా ఉంటుంది!సింగిల్ ఆక్యుపెన్సీలో 61,100 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 45 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 43, 750 రూపాయలు.బుకింగ్ కోసం: ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్,9–1–129/1/302, మూడవ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా,ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ. ఫోన్ నంబరు: 8287932229 – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రైలుతో... ఆమె చెట్టపట్టాలు
మోనిషా రాజేష్(Monisha Rajesh)... 42 ఏళ్ల ఈ ట్రావెల్ రైటర్‌కు గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఆ తర్వాత లోకమంతా 80 రైళ్లలో చుట్టేసి ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు స్త్రీలు రాత్రిపూట చేసే రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతా తిరిగి ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్’ వెలువరించారు. ఈ రైలు ప్రయాణాల ప్రేమికురాలి పరిచయం...‘భారతదేశాన్ని చూడాలంటే రైలులోనే చూడాలి’ అంటారు మోనిషా రాజేష్. యు.కె.లో స్థిరపడ్డ ఈ మాజీ జర్నలిస్టు ఇప్పుడు పూర్తిగా ‘ట్రావెల్ రైటర్’గా మారారు. ఆశ్చర్యకరంగా ఆమె తన కెరీర్‌కు ‘రైలు’ను ఒక ఆధారంగా మలుచుకున్నారు. అంటే పుస్తకాలు అమ్ముడవగా వచ్చే డబ్బు ఆమెకు రైలు ద్వారా వస్తున్నట్టే. ‘హఠాత్తుగా నాకు ఏమర్థమైందంటే నా పుస్తకాలకు రైలు కంటే మించిన కథానాయకుడు లేడని’ అంటారామె నవ్వుతూ.ఆమె తాజా పుస్తకం ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్ – అరౌండ్ ద వరల్డ్ బై నైట్ ట్రైన్’ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో రాత్రి జర్నీల ద్వారా ట్రైన్లలో సంచారం చేస్తూ తాను చూసిన ప్రపంచాన్ని పరిచయం చేశారు మోనిషా. ఇప్పటివరకూ ‘రైలు’ ప్రయాణాల ఆధారంగా ఆమెవి నాలుగు పుస్తకాలు వచ్చాయి.మొదటిసారి రైలుతో ప్రేమమోనిషా తల్లిదండ్రులది చెన్నై. ఇద్దరూ డాక్టర్లు. అయితే యు.కెలోని నార్ఫోక్లో స్థిరపడ్డారు. మోనిషా అక్కడే పుట్టి పెరిగింది. ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు రెండేళ్లపాటు వెనక్కు వచ్చి చెన్నైలో ఉన్నారు కాని ఆ సమయంలో మోనిషాకు దేశం గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆమె చదువు సాగి, జర్నలిస్టుగా మారాక, 2010 లో మరోసారి ఇండియాకు వచ్చారు. ‘నా దేశాన్ని చూడాలి అని నేను అనుకున్నప్పుడు విమాన ప్రయాణం బడాయి వద్దనుకున్నాను. రోడ్డు సేఫ్ కాదు. అందుకే రైలు ప్రయాణం ఎంచుకున్నాను.90 రోజుల పాస్ తీసుకుని రైళ్లలో తిరగడం మొదలైన రెండు నెలల్లోనే నాకు అర్థమై పోయింది భారతదేశంలో రైలు ప్రయాణం అద్భుతమని. అందుకే ఈసారి ఒక ప్లాన్‌తో వచ్చి 80 ట్రైన్లలో తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశాను. దానికి బోల్డంత పాఠకాదరణ, అవార్డులు లభించాయి. ఆ ఉత్సాహం నన్ను రైలులో ప్రపంచ యాత్ర చేసేలా చేసింది’ అని తెలిపారు మోనిషా. ఆమె ఇండియాలో తిరుగుతూ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.. మోనిషా రైలు మార్గం ఉన్న ప్రతి దేశంలో తిరుగుతూ ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఇప్పుడు రాత్రి ప్రయాణాలు ఉన్న రైళ్లలో ప్రయాణించి ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్’ పుస్తకం రాశారు.ధన్యమయ్యే ప్రయాణం‘నేను భారతదేశమంతా సెకండ్ క్లాస్ ట్రైన్లో తిరిగాను. భారతదేశం అర్థం కావాలంటే ట్రైను ప్రయాణం చేయాలి. అదీగాక మనుషులు విమాన ప్రయాణాలతో విసుగెత్తారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ వచ్చి ముగిశాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భ్రమణకాంక్ష పెరిగింది. లోకం చూద్దాం అనుకుంటున్నారు. దానికి గొప్ప మార్గం రైలే. యూరప్‌లో 2015 నాటికి రాత్రి ప్రయాణాలు ఉండే స్లీపర్ ట్రైన్లు బంద్ చేశారు. ఇప్పుడిప్పుడే అవి తిరిగి మొదలయ్యాయి. స్త్రీలు ఒంటరిగా రాత్రిళ్లు రైలు ప్రయాణాలు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడంలో భాగమే’ అంటారు మోనిషా.ప్రకృతి కన్నులు‘టర్కీ నుంచి ఆర్మేనియా వరకూ 26 గంటల పాటు సాగే రైలు ప్రయాణం అద్భుతం. టర్కీ సౌందర్యం మొత్తం అక్కడ చూడొచ్చు. ఇక అత్యుత్తమ రైలు ప్రయాణమంటే నార్వే దేశానికి వెళ్లాలి. అక్కడ రైలు కంపార్ట్మెంట్లు ఇల్లంత సౌకర్యంగా ఉంటాయి. భోజనం ఏది కావాలంటే అది దొరుకుతుంది. అదొక్కటే కాదు రాత్రి మూడు గంటలకు రైలు అద్దాల్లో నుంచి సూర్యోదయం చూడొచ్చు. ఇలా మరెక్కడ సాధ్యం?’ అంటారు మోనిషా. -
చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..
గండ శిలతో చెక్కిన శిల్పాలను చూస్తాం.పూరీ చెక్కుకున్న దారు శిల్పాలను చూస్తాం.చంద్రభాగలో సైకత శిల్పాలను కూడా చూస్తాం. అశోకుడి తొలి బౌద్ధచిహ్నం ధవళగిరి స్థూపం...దేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు చిలకాలేక్.శిల్పరాజాలు కందగిరి... ఉదయగిరి గుహలు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజ్ టూర్లో చూస్తాం. అది కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూర్. ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది?డిసెంబర్ 1 నుంచి 5 వరకు...టూర్‌కి టికెట్ బుక్ చేసుకుందాం.ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025. ఇది 15వ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఈవేడుకలకు వేదిక ఒడిశా రాష్ట్రం, కోణార్క్‌లోని చంద్రభాగ బీచ్. 1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు చేరాలి. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణం. దారిలో ధౌలి స్థూప వీక్షణం. పూరికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అవడం, రాత్రి బస.ధవళ గిరి స్థూపంకొండ మీద తెల్లటి స్థూపం. భువనేశ్వర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన పూరీకి వెళ్లే దారిలో ఉంటుంది. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిర్మించిన తొలి స్థూపం ఇది. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో మనసు కకావికలమైన అశోకుడు బౌద్ధం వైపు మరిలిన సంగతి తెలిసిందే. అశోకుడు శాంతి మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్థూపం కావడంతో దీనికి శాంతి స్థూపం అని పేరు. బౌద్ధ సన్యాసులు ఈ స్థూపాన్ని సభక్తిగా దర్శించుకుంటారు.2వ రోజుతెల్లవారు జామున బయలుదేరి జగన్నాథుని దర్శనానికి వెళ్లాలి. ఇది ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు తమకు తాముగా వెళ్లి రావాలి. దర్శనం తర్వాత హోటల్‌కు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టూర్ సత్పద వైపు సాగిపోతుంది. చిలకా సరస్సు వీక్షణం తర్వాత తిరిగి పూరీకి చేరాలి. రాత్రి బస పూరీలోనే.జగన్నాథపురిపూరీ అని పిలిచే పట్టణానికి ఆ పేరు రావడానికి జగన్నాథుని ఆలయమే ప్రధానం. జగన్నాథపురి అనే పేరు నుంచి పురి అనే పేరు వ్యవహారంలో పూరీగా మారిపోయింది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు పూజలందుకునే దైవాలు. బలరాముడు, శ్రీకృష్ణుడు, వారి చెల్లెలు సుభద్ర విగ్రహాలు దారుశిల్పాలు. విగ్రహాల రూపం అసంపూర్తి రూపాలతో విచిత్రంగా ఉంటుంది. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే వంటకాలు తయారు చేసే గది ‘రోసాఘర’ను కూడా చూడాలి. 56 రకాల పదార్థాలను వండుతారు. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.సముద్రమంత సరస్సుచిలకా సరస్సు 11 వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనదేశంలో తీర్ర΄ాంతంలో విస్తరించిన పెద్ద తీర సరస్సు ఇది. దయా నది, భార్గవి నది, మకర, మాలగుని, లునా నదుల నీరు బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోట ఆటు΄ోట్లకు సముద్రపు నీరు వెనక్కు తోసుకు రావడంతో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది. మన తెలుగు రాష్ట్రంలో పులికాట్ సరస్సు కూడా అలాంటిదే. పులికాట్ సరస్సుకు వచ్చినట్లే ఖండాంతరాల నుంచి పక్షులు ఇక్కడికి కూడా ఏటా వలస వస్తాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తమతో తీసుకెళ్లిపోతాయి. చిలకా సరస్సు మరో ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి విదేశీ వర్తక వాణిజ్యాలు జరిగిన ప్రదేశం ఇది. యునెస్కో సంస్థ చిలకా సరస్సును వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. సత్పద అనే ప్రదేశంలో సరస్సు మీద కొంత దూరం వెళ్ల్లడానికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఉంటుంది. నీటి మీద విహారాన్ని ఆస్వాదించవచ్చు. 3వ రోజుబ్రేక్ఫాస్ట్, హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత కోణార్క్‌కు ప్రయాణం. కోణార్క్ సూర్యదేవాలయ వీక్షణం, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ఆస్వాదించడం. సాయంత్రం భువనేశ్వర్‌కు ప్రయాణం. హోటల్ చెక్ ఇన్. రాత్రి బస భువనేశ్వర్‌లో.రథచక్రాలయంకోణార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. సూర్యదేవాలయాన్ని చూడడం అంటే ఖగోళశాస్త్రాన్ని శిల్పాల రూపంలో తెలుసుకోవడం. ఆలయం ప్రాంగణంలోని సన్టెంపుల్ మ్యూజియాన్ని చూడడం మర్చి΄ోవద్దు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ఏటా అలరించేది. ఇప్పుడు సైకత శిల్ప కళల వేడుక కూడా తోడవడంతో కోణార్క్ పర్యాటకధామంగా మారింది.ఇసుక బొమ్మల కొలువుకోణార్క్లోని చంద్రభాగ బీచ్‌లో సాండ్ ఆర్ట్ కొలువు దీరి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశ విదేశాల సాండ్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ప్రపంచ శాంతి, ప్రకృతి పరిరక్షణ వంటి థీమ్‌లతో ఒక్కొక్క ఆర్ట్ ఒక్కో సందేశాన్నిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ సరదాగా మొదలు పెట్టిన సైకత శిల్పకళకు చక్కటి ఆదరణ లభించింది. ఎంతగా అంటే... ముఖ్యమైన సందర్భాలు, సామాజిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ అంశాన్ని పట్నాయక్ ఎలా రూపొందించాడో చూడడానికి టెలివిజన్ వార్తలను ఫాలో అయ్యేంతగా. ఇప్పుడు సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతడి బాటలో ఈ తరం యువతీయువకులు సాండ్ ఆర్ట్‌లో శిక్షణ పొంది, ఒకరిని మించి మరొకరు చక్కటి సైకత శిల్పాలకు రూపమిస్తున్నారు.4వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జాజ్‌పూర్‌కు ప్రయాణం. బిరజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత రత్నగిరి బౌద్ధక్షేత్ర వీక్షణం. తిరిగి భువనేశ్వర్‌కు చేరాలి. రాత్రి బస భువనేశ్వర్‌లోనే.బిరజాదేవి ఆలయంఒడిశాలో బిరజ అనే పదానికి అసలు ఉచ్చారణ విరజ. గిరిజాదేవినే ఒడియా వాళ్లు బిరజాదేవి అంటారు. ఇది దుర్గాదేవి శక్తిపీఠం. విరజ క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూసే ఆలయం 13వ శతాబ్దం నాటిది. రత్నగిరి బౌద్ధక్షేత్రం ఒక పురాతత్వగని. తవ్వేకొద్దీ విషయాలను వెల్లడిస్తోంది. రత్నగిరి బౌద్ధ క్షేత్రమే కాని ఇక్కడ హిందూ పౌరాణిక పాత్రల శిల్పాలు అనేకం ఉంటాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని నిర్మాణాలు ఐదవ శతాబ్దం నుంచి మొదలై పదవ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో నిర్ధారణ అయింది. 16వ శతాబ్దంలో వరదల్లో కప్పబడి పోవడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణాలున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయారు. తవ్వకాల్లో దొరికిన శిల్పాలతో ఈ ప్రాంగణంలో మ్యూజియం ఉంది. రత్నగిరి, లలిత్‌గిరి, ఉదయగిరి గుహలను కలిపి డైమండ్ ట్రయాంగిల్‌గా పిలుస్తారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్, గది చెక్ అవుట్ చేసిన తర్వాత లింగరాజ ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, రాజారాణి టెంపుల్ వీక్షణం. మధ్యాహ్నం తర్వాత కందగిరి గుహలు, ఉదయగిరి గుహల్లో విహారం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు టూర్ నిర్వహకులు పర్యాటకులను భువనేశ్వర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.ఆలయాల భువనంభువనేశ్వర్లో ఏమి చూడాలని అడిగితే లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్, రాజారాణి ఆలయాలు అని ఒక్కమాటలో చెప్పవచ్చు. భువనేశ్వర్ గొప్పశిల్ప నిలయం. లింగరాజ ఆలయాన్ని దర్శించిన వాళ్లు, ఆలయం గురించి వివరించేటప్పుడు మొదటి మాటగా నిర్వహణ లోపాన్ని ప్రస్తావిస్తారు. చాలా మురికిగా ఉంటుందని ఆవేదన చెందుతారు. భారీ నిర్మాణం. ఆలయ నిర్మాణకౌశలం ప్రత్యేకంగా ఉంటుంది. మన దక్షిణాది నిర్మాణాలు, ఉత్తరాది నిర్మాణాలకు భిన్నమైన కళింగ నిర్మాణశైలి ఇది. ముక్తేశ్వర్ ఆలయంలో ఏకరాతి శిలాతోరణ ద్వారం గొప్ప శిల్పచాతుర్యమనే చె΄్పాలి. భువనేశ్వర్‌లోని రాజారాణి ఆలయం కూడా పుణ్యక్షేత్రమే. ఈ ఆలయ నిర్మాణం అంతా పసుపు, ఎరుపు సాండ్‌స్టోన్‌ల కలయిక. ఈ రెండు రంగుల రాళ్లను రాజారాణి రాళ్లుగా పిలుస్తారు. అందుకే ఇది శివాలయమే అయినా రాజారాణి ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది.కందగిరి ఉదయగిరి గుహలుకొండలను గుహలుగా తొలచడమే ఒక అద్భుతం అనుకుంటే గుహల్లోపల గోడల నిండుగా రకరకాల థీమ్‌లతో శిల్పాలుంటాయి. స్థూలంగా చూసినప్పుడు శిల్పాలన్నీ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే పౌరాణిక కథల సన్నివేశాలు కళ్లకు కడుతాయి. చేతికందే ఎత్తులో ఉన్న శిల్పాలు యుద్ధానంతర దాడుల్లో ధ్వంసమైన వైనం కూడా అవగతమవుతుంది. ఉదయగిరి గుహల్లో గణేశ గుహను గమనించడం మర్చిపోవద్దు. పదడుగుల ఎత్తున్న కొండను తొలిచి వరండాలాగ మలిచారు. ఎదురుగా చెరుకు తింటున్న ఏనుగులు, ద్వార΄ాలకుల్లాగ సైనికులు, వరండా పైకప్పుకి స్తంభాల్లాగ చెక్కిన రాతిని కలుపుతూ నమస్కార ముద్రలో ఉన్న సాలభంజికలు... చూడ చక్కగా ఉంటాయి.టూర్ వివరాలివిఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ పేరు ‘కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్’. ప్యాకేజ్ కోడ్ : ఎస్హెచ్ఏ42. ఇది ఐదు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో చిలకా లేక్, కోణార్క్ టెంపుల్, బిరజాదేవి ఆలయం, భువనేశ్వర్ ప్రదేశాలకు కవర్ అవుతాయి.నవంబర్ 30వ తేదీ 12.35 గంటలకు ‘6ఈ 6911’ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 14.10 గంటలకు భువనేశ్వర్‌కు చేరుతుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ‘6ఈ 631’ ఫ్లైట్ 22.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి రాత్రి 23.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.టికెట్ ధరలిలాగ:సింగిల్ ఆక్యుపెన్సీలో 43,950 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,800 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 32,650 రూపాయలు. బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407– వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
దీపావళి పండుగ ప్రయాణాలకు డిమాండ్
దీపావళి సందర్భంగా ప్రయాణాలు, హోటల్ బుకింగ్‌లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. దీపావళి సోమవారం రావడంతో, వరుస సెలవుల నేపథ్యంలో పట్టణాలు, విహార ప్రదేశాలు, వివిధ పట్టణాల మధ్య బస్ సేవలకు జోరుగా బుకింగ్‌లు నమోదవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95–100 శాతానికి చేరింది. జీఎస్టీ సంస్కరణలతో మధ్యశ్రేణి హోటళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) ప్రెసిడెంట్ కేబీ కచ్చు తెలిపారు.ఈ ఏడాది దీపావళి కారణంగా వారాంతం ఎక్కువగా ఉండడంతో మెరుగైన పండుగ అనుభవం కోసం ఎక్కువ మంది ముందుగానే తమ ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్నట్టు ఎబిక్స్ ట్రావెలర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విక్రమ్ ధావన్ తెలిపారు. ప్రధానంగా టైర్–2, 3 పట్టణాల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎయిర్‌లైన్ బుకింగ్‌లలోనూ 65–70% విహార పర్యటనలకు సంబంధించే ఉన్నట్టు తెలిపారు. క్రితం ఏడాది దీపావళి సీజన్‌తో పోల్చితే ఈ విడత 15–20% బుకింగ్‌లు పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
‘దీపావళి’ పర్యాటక కళ!
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్‌లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్‌లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్లో ప్రయాణాలకు కీలక డిమాండ్‌గా ఉన్నట్టు మేక్‌మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు. ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్‌లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంకు బుకింగ్‌లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం. ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్‌లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్‌కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. వారణాసికి డిమాండ్.. దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్‌తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్‌లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్‌పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్‌లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్‌లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్‌కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్‌లు వస్తున్నట్టు క్లియర్‌ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్‌లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. -
క్రూయిజ్ జర్నీ, అమేజింగ్ అండమాన్
అండమాన్ టూర్... అమేజింగ్ టూర్. (Amazing Andaman) ఎందుకంటే... ఇది రోడ్డు టూర్ కాదు. అలాగని రైలు బండి పర్యటనా కాదు.గాల్లో విమాన విహారమూ కాదు.నీటి మీద క్రూయిజ్‌లో విహారం. ఇంకా... నగరం మధ్య వీధుల్లో విహారం కాదు.ఇది... సముద్రం మధ్య దీవుల్లో విహారం.ఎటు చూసినా సముద్రమే...ఎటు వెళ్లినా ప్రకృతి ఆహ్లాదమే. ఒకవైపు ఇంద్రధనసు సూర్యోదయం.మరో వైపు ప్రకృతి చెక్కిన రాతి వంతెన.ఇన్ని ప్రకృతి అద్భుతాల సుమహారం ఈ టూర్. 17వ తేదీ తెల్లవారు జామున 4. 35 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ నిర్వహకులకు రిపోర్ట్ చేయాలి. మీట్ అండ్ గ్రీట్ తర్వాత పర్యాటకులందరూ విమానం ఎక్కాలి. విమానం దాదాపు తొమ్మిది గంటలకు పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హోటల్‌కు చేరి చెక్ ఇన్ చేయాలి. లంచ్ తర్వాత అండమాన్‌లోని సెల్యూలార్ జైలు మ్యూజియం వీక్షణం, కోర్బిన్స్ కోవ్ బీచ్ విహారం. సాయంత్రానికి తిరిగి సెల్యూలార్ జైలుకు చేరుకుని లైట్ అండ్ సౌండ్ షో కి హాజరుకావడం.శ్రీ విజయపురం!పోర్ట్ బ్లెయిర్ పట్టణం ఇప్పుడు భారతీయతను సంతరించుకుంది. దీని కొత్త పేరు శ్రీ విజయపురం. అండమాన్ దీవులంటే ఇప్పుడు మనకు పర్యాటక ప్రదేశంగా మాత్రమే గుర్తు వస్తోంది. కానీ మనదేశానికి స్వాతంత్య్రాన్ని అధికారికంగా ప్రకటించకముందే మన జాతీయ పతాకం ఎగిరిన నేల ఇది. అందుకే శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ వీర సావర్కర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన క్షణం నుంచి జాతీయోద్యమకాలంలోకి వెళ్తున్న భావన మొదలవుతుంది. సెల్యులార్ జైలు ్ర΄ాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అసంకల్పితంగా గుండె బరువెక్కుతుంది. ఇది పోరాట యోధుల జీవించే హక్కునే కాలరాయడం కోసమే నిర్మించిన చెరసాల. బ్రిటిష్ దమన నీతికి నిదర్శనం. ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లున్న దీవుల్లో పెద్ద జైలు కట్టి జాతీయోద్యమకారులను బంధించేవారు. ఖైదీల చేత చేయించే పనుల నమూనా చిత్రాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. నాటి ΄ాలన దురాగతాలకు కళ్లకు కడుతుంది సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో. రెండో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ (స్వరాజ్ ద్వీప్)కు ప్రయాణం. తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేసి ఇస్తారు. క్రూయిజ్ జర్నీ మొదలవుతుంది. హావ్లాక్ ఐలాండ్‌కి చేరిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేయాలి. మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్ విహారం. తిరిగి హోటల్‌కు వచ్చిన తర్వాత డిన్నర్. రాత్రి బస హావ్లాక్ దీవిలో.స్వరాజ్ ద్వీప్ విహారంఅండమాన్– నికోబార్ దీవుల్లో అనేక దీవులు, పట్టణాలు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత మెల్లమెల్లగా కొత్త పేర్లతో వ్యవహారంలోకి వస్తున్నాయి. హావ్లాక్ కూడా బ్రిటిష్ అధికారి పేరే. అయితే దీనిని స్వరాజ్ ద్వీప్గా పేరు అధికారికంగా మారింది. ఇందుకు కారణం జాతీయోద్యమంలో భాగంగా అండమాన్ దీవుల్లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయపతాకాన్ని ఆవిష్కరించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినట్లు ప్రకటన చేశాడు. ఆయన గౌరవార్థం పాత పేర్లను హావ్లాక్ ఐలాండ్– స్వరాజ్ ద్వీప్, రాస్ ఐలాండ్– నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, నీయెల్ ఐలాండ్ – షాహీద్ ద్వీప్గా మార్చింది భారతప్రభుత్వం. ఈ దీవులు అచ్చమైన ప్రకృతి వరాలనే చెప్పాలి. చిరు అలల సవ్వడి వింటూ, మెత్తటి ఇసుకలో నడుస్తూ నీలిరంగు నీటికి– నీలాకాశానికి మధ్యనున్న గీత ఎక్కడో వెతుక్కుంటూ ఉంటే టైమ్ తెలియదు. ఇది ఎకో టూరిజమ్ జోన్. నియమాలను పాటించాలి. టైమ్ మ్యాగజైన్ 2004లో ఇక్కడి రాధానగర్ బీచ్‌కి టైమ్ ‘బెస్ట్ బీచ్ ఇన్ ఏషియా’ గుర్తింపు నిచ్చింది. ఈ టూర్లో ఎదురు చూసిన క్రూయిజ్ జర్నీని క్షణక్షణం ఆస్వాదించాలి. మూడో రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్లాలి. వాటర్ స్పోర్ట్స్ టికెట్లు పర్యాటకులే కొనుక్కోవాలి. హోటల్ చేరేది రాత్రికే. హోటల్‌కు భోజనం, బస హావ్లాక్ ఐలాండ్‌లోనే.పగడపు దీవుల విహారం!ఎలిఫెంట్ బీచ్ సముద్రంలో స్విమ్మింగ్, సన్‌బాత్‌కి బాగుంటుంది. వాటర్ స్కూబా డైవింగ్ వంటి స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. మరకతాలు పరిచినట్లున్న సముద్రాన్ని ప్రశాంతం తీరాన కూర్చుని ఆస్వాదించడానికి వీలుగా రెల్లుగడ్డి గొడుగులతో పొడవాటి కుర్చీలుంటాయి. ఇక్కడ కూర్చుని సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి. స్కూబా డైవింగ్‌లో సముద్రగర్భంలోకి దూరిపోయి అక్కడ విస్తరించిన పగడపు దీవులను చుట్టి రావచ్చు. నాలుగో రోజు: హావ్లాక్ నుంచి నీల్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాలాపత్తర్ బీచ్ విహారం తర్వాత క్రూయిజ్‌లో నీల్ ఐలాండ్‌కు చేరాలి. హోటల్ గదిలో చెక్ ఇన్. సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్‌లో సూర్యాస్తమయ వీక్షణం. రాత్రి బస నీయెల్ ఐలాండ్‌లో.సన్‌రైజ్ బీచ్షాహీద్ దీవి నుంచి సూర్యోదయ వీక్షణం ఓ మధురానుభూతి. చక్కటి వ్యూ పాయింట్ అని చెప్పవచ్చు. అందుకే దీనికి సన్‌రైజ్ బీచ్ అనే విశేషణం. ఫొటోగ్రఫీకి ది బెస్ట్ లొకేషన్. నవదంపతులు మంచి లొకేషన్లో ఫొటోలు తీసుకుంటే పర్యటన జ్ఞాపకాలు కూడా కలకాలం పదిలంగా ఉంటాయి.ప్రకృతి అద్భుతం– శిలావంతెనషాహీద్ (నీయెల్) దీవి ప్రకృతి చేసే చిత్రవిచిత్రాలకు, విన్యాసాల నిలయం. తిరుమల గిరుల్లో శిలాతోరణాన్ని చూస్తాం. కొండ రాళ్లు నీటి ప్రవాహ తాకిడికి అరిగి΄ోయి పై భాగంలో శిల అలాగే ఉండిపోవడంతో ఆ రూపం తోరణాన్ని తలపిస్తుంటుంది. ఈ దీవిలోని లక్ష్మణ్‌పూర్ బీచ్‌లో కూడా అలాంటి ప్రకృతి అద్భుతం ఉంది. దీనిని శిలా వంతెన, సహజ వంతెన అంటారు. ఈ బీచ్ సూర్యాస్తమయ వీక్షణానికి గొప్ప ప్రదేశం కావడంతో సన్‌సెట్ బీచ్ అంటారు. ఈ దీవిలో అరవై కిందటి వరకు ఇక్కడ మనుష సంచారం ఉండేది. ఇక్కడ ఉన్న స్థానికులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన హిందూ శరణార్థులే. (రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో)అయిదో రోజు : బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి భరత్పూర్ బీచ్ విహారానికి వెళ్లాలి. ఆ తర్వాత ΄ోర్ట్బ్లెయిర్కు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం విశ్రాంతిగా గడపడమే. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్‌లో. సప్తవర్ణమాలికసముద్రం మీద సూర్యోదయం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆరెంజ్కలర్లో బంతిలాగ నీటి నుంచి ఉద్భవిస్తున్న సూర్యుడి రూపమే. కానీ భరత్పూర్ బీచ్‌లో సూర్యోదయం సప్తవర్ణ సంగమం. సముద్రం ఈమద ఇంద్రధనసు విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సముద్రపు నీరు తక్కువ లోతులో ఈదడానికి అనువుగా జెట్టీ నిర్మాణం ఉంది. అందులో వాటర్ స్పోర్ట్స్, కోరల్ రీవ్స్ విజిట్‌తోపాటు ప్రశాంతంగా నీటిలో సేదదీరవచ్చు.హైదరాబాద్‌కు ప్రయాణం. పోర్ట్బ్లెయిర్లో తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్‌పోర్టుకు చేరాలి. టూర్ నిర్వహకులు పర్యాటకులను ఎనిమిది లోపు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి, వీడ్కోలు చెబుతారు. విమానం 9.55కి బయలుదేరి 12.10 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఇదీ చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ప్యాకేజ్ ఇలా:కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ 74, 425 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 56,625 రూపాయలు. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 54, 925 రూపాయలు. పిల్లలకు (5–11 ఏళ్ల మధ్య) 48, 785 రూపాయలు. ఇందులో విడిగా బెడ్ ఉంటుంది. బెడ్ లేకుండా (2–11 ఏళ్ల మధ్య) 45, 485 రూపాయలు. రెండేళ్లలోపు పిల్లలకయితే టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విమానం ఎక్కే ముందు ఎయిర్΄ోర్ట్ కౌంటర్లో దాదాపుగా 1,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407విజయవాడ ఏరియా ఆఫీస్ : 92810 30714టూర్ కోడ్: SHA18 - AMAZING ANDAMAN OCT 17అమేజింగ్ అండమాన్ టూర్ అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. 6ఈ– 6305 నంబర్ విమానం 17వ తేదీ ఉదయం ఆరు గంటల 25 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఎనిమిది గంటల 55 నిమిషాలకు పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుతుంది. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వారసత్వ ప్రదేశాలకు యువతరం ఓటు
యువతరం (18–24 ఏళ్లు) చారిత్రక ప్రాశస్త్యం, గొప్ప వారసత్వం కలిగిన ప్రదేశాలను చూసి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియం వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతిథ్య సేవల సంస్థ నూర్మహల్ ప్యాలెస్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సంప్రదాయ పర్యాటక ప్రదేశాల కంటే గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రదేశాలను చూడడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, జైపూర్, కర్నాల్, కోల్‌కతాలో 2,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను నూర్మహల్ ప్యాలెస్ విడుదల చేసింది. గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాపర్టీల్లో బస చేయాలని అనుకుంటున్నట్టు సర్వేలో 53 శాతం మంది చెప్పారు. వినూత్నమైన చరిత్ర, నిర్మాణ నైపుణ్యం (ఆర్కిటెక్చర్), వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యం దృష్ట్యా తాము ఖరీదైన వారసత్వ ప్రాపర్టీలను ఎంపిక చేసుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘యువత కేవలం లగ్జరీనే కోరుకోవడం లేదు. చారిత్రక వైభవంతో అనుసంధానాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూనే.. చరిత్ర, సంస్కృతితో అనుసంధానమయ్యే అనుభవాన్ని అందించడం పట్ల గర్విస్తున్నాం’’అని నూర్మహల్ ప్యాలస్ ఈడీ రూప్ ప్రతాప్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
పయనమే జీవనం..
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్ఫైవ్లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.చదవండి : బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తసఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఉన్నప్పుడు సూట్‌కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్‌లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.సోలో ట్రావెల్‌ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్‌ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్‌తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.చదవండి: ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్‌కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.– ఇందిర ఎం -
ఐస్లాండ్లో అనసూయ.. ప్రకృతిలో మైమరచిపోయి (ఫొటోలు)
-
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ : ప్రకృతి పూలతోట చుట్టొద్దాం రండి!
ఈ నెల 27వ తేదీ వరల్డ్ టూరిజమ్ డే. ఓ గొప్ప పర్యటన చేసి తీరాలి. అది... ప్రపంచం గర్వించే ప్రదేశమై ఉండాలి. అంతేనా... అది మనదేశంలోనే ఉండాలి. ఈ టూర్ జీవితమంతా గుర్తుండాలి. మంచు కొండలను చీలుస్తూ ΄పోదాం. ట్రెక్ దారులు వేసుకుంటూ నడుద్దాం. నింగిలో విరిసిన పూల తోటలో విహరిద్దాం. ఐఆర్సీటీసీ... రైళ్లు, బస్సు, విమానాలు, క్రూయిజ్ టూర్లతోపాటు కొత్తగా ట్రెకింగ్ టూర్లను కూడా మొదలు పెట్టింది. వరల్డ్ టూరిజమ్ డే సందర్భంగా మనదేశంలో నెలకొన్ని ప్రకృతి గీసిన అద్భుత చిత్రం ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్’ అడ్వెంచరస్ టూర్ వివరాలు ఈ వారం ట్రావెల్లో.. ప్రకృతి సిగలో తురుముకున్న పూలను చూద్దాం.రిషికేశ్ నుంచి పీపల్కోటికి ప్రయాణం. రిషికేశ్ నుంచి 200 కిమీల దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ప్రయాణ సమయం తొమ్మిది నుంచి పది గంటలు. పీపల్‌కోటి నాలుగు వేల అడుగులకు పైగా ఉంటుంది.కూడలి గ్రామంరిషికేశ్ నుంచి పీపల్కోటికి పర్వత సానువుల మధ్య సాగే ప్రయాణంలో ప్రకృతి విచిత్రాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. అలకనంద నది తీరాన ఉన్న చిన్న గ్రామం పీపల్‌కోటి. ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సిన క్షేత్రాల వంటివేవీ లేవు. చార్ధామ్ యాత్రికులు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మాణా గ్రామ పర్యటనకు వెళ్లడానికి కూడలి ΄ాయింట్. పీపల్ కోటి నుంచి గోవిందఘాట్కు (52 కిమీలు) రోడ్డు మార్గాన ప్రయాణం. ప్రయాణ సమయం రెండు గంటలు. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న పుల్నాలోని ట్రెకింగ్ ΄ాయింట్కు చేరడానికి 15 నిమిషాలు. పుల్నా నుంచి ఘంగారియాకు ట్రెకింగ్. ఈ రోజు ప్రయాణ లక్ష్యం 6,900 అడుగుల ఎత్తులో ఉన్న పుల్నా నుంచి 9.800 అడుగుల ఎత్తులో ఉన్న ఘంగారియా చేరడం. దూరం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. నాలుగు గంటల్లో చేరవచ్చు.లక్ష్మణ గంగ తీరంగోవింద్ ఘాట్ అనే ప్రదేశం చిన్న పట్టణం. అలకనంద నది, లక్ష్మణ గంగ సంగమిస్తాయిక్కడ. ఇది కూడా పై పర్యటన దారిలో తారసపడే ఒక జనావాసం. పర్యాటకం ఆధారంగా పట్టణంగా అభివృద్ధి చెందింది. పుల్నా గ్రామం కూడా ఇలాంటిదే. స్థానికులు పర్యాటకం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహిబ్ పర్యాటకులకు తమ ఇళ్లలో హోమ్‌స్టే సౌకర్యం కల్పిస్తారు. ఇక ఘంగారియా విషయానికి వస్తే ఇది పుష్పవతి నది తీరాన విలసిల్లిన నివాసప్రదేశం. దీనిని చివరి నివాస ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి పైకి వెళ్లే కొద్దీ పర్యాటకులు తప్ప నివాస ప్రదేశాలు ఉండవు. ఘంగారియా గ్రామం కూడా ఏడాదిలో మూడు నెలలు (జూన్– అక్టోబర్) మాత్రమే మనుష్య సంచారంతో ఉంటుంది. మిగిలిన కాలమంతా మంచు కప్పేసి ఉంటుంది.ఘంగారియా నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ట్రెకింగ్. తిరిగి ఘంగారియాకు చేరడం. ఈ రోజు పర్యటనలో చేరే లక్ష్యం 11,500 అడుగుల ఎత్తు. దూరం నాలుగు కిలోమీటర్లు. వెనక్కి రావడానికి మరో నాలుగు కిలోమీటర్లు.ప్రకృతి చీరకు రంగుల పూలుఘంగారియా నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లే దారి ఆద్యంతం రంగులమయమే. తలెత్తి చూస్తే నీలాకాశంలో తేలాడుతున్న వెండి మబ్బులు, ఆ మబ్బుల కంటే ఎత్తులో ఉన్న పచ్చటి శిఖరాలు, దూరంగా మంచుదుప్పటి కప్పుకున్న వెండి కొండలు, కిందకు చూస్తే పచ్చటి చీర మీద రంగు రంగుల పూలను ఎంబ్రాయిడరీ చేసినట్లు ఉంటుంది నేల. బ్లూ పాపీ, స్నేక్ ఫాయిల్, వైట్ లీఫ్ హోగ్ ఫుట్, హిమాలయన్ రేంజ్, మిడోస్ జెరానియమ్, డాగ్ ఫ్లవర్, హూక్డ్ స్టిక్ సీడ్, రివర్ అనేమోన్... వంటి ఇంగ్లీష్ పేర్లు చెబుతారు. అంతే తప్ప వాటికి స్వదేశీ నామాలను స్థానిక గైడ్లు కూడా చెప్పలేరు. మన దగ్గర ‘సీతమ్మ వారి జడకుచ్చులు’ అని పిలిచే ముఖమల్ వస్త్రం వంటి పూలు అక్కడక్కడా కనిపిస్తాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఒక్క మాటలో చె΄్పాలంటే నేల మీద విరిసిన ఇంద్రధనస్సు అనాలి. అన్నట్లు ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన ప్రదేశం. పూల చెట్ల మధ్య రకరకాల జంతువులు కూడా విహరిస్తుంటాయి. అవి మంచును తట్టుకోగలిగిన దేహదారుఢ్యంతో పుష్టిగా ఉంటాయి. మనం వాటిని ఆశ్చర్యంగా చూస్తాం, కానీ అవి మాత్రం పర్యాటకులను చిరపరిచితులన్నట్లు ఒకసారి అలా చూసి వెళ్లిపోతుంటాయి. ఘంగారియా నుంచి హేమ్‌కుండ్ సాహిబ్‌కు ట్రెకింగ్. తిరిగి ఘంటారియాకు చేరడం. ఈ రోజు లక్ష్యం 14,100 అడుగుల ఎత్తుకు చేరడం. ఘంగారియా నుంచి హేమ్‌కుండ్ సాహిబ్‌కు దూరం ఆరు కిలోమీటర్లు. రెండు వైపులా ట్రెకింగ్‌కు తొమ్మిది గంటల సమయం పడుతుంది.బ్రహ్మకమలం విరిసింది!హేమకుండ్ సాహిబ్ కూడా ఓ మోస్తరు పట్టణం మాత్రమే. సిక్కుల పవిత్ర తీర్థం. ఇక్కడి హేమకుండ్ సరస్సు మంచులా గట్టిపడి ఉంటుంది. గురుద్వారాకు నడిచి వెళ్లే దారి మొత్తం రెండు అడుగుల మందాన మంచు పేరుకు΄ోయి ఉంటుంది. పర్యాటకుల కోసం మంచును తవ్వి దారి చేస్తారు. ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య బ్రహ్మ కమలాలు విరుస్తాయి. గురుద్వారా ముందున్న నీటి ఉపరితలం మంచు పలకలుగా మారిపోయి ఉంటుంది.ఘంగారియా నుంచి పుల్నా కు తొమ్మిది కిలోమీటర్ల దూరం ట్రెకింగ్. ఐదు గంటల సమయం. పుల్నా నుంచి వాహనంలో గోవిందఘాట్కు 15 నిమిషాల ప్రయాణం. గోవిందఘాట్ నుంచి బదరీనాథ్ (25కిమీలు)కు గంట ప్రయాణం. అక్కడి నుంచి పీపల్కోటికి (75 కిమీలు) నాలుగు గంటల ప్రయాణం. సమయం, వాతావరణం అనుకూలించక΄ోతే బదరీనాథ్‌ను మినహాయిస్తారు. గోవింద్‌ఘాట్ నుంచి బదరీనాథ్ మధ్య రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగి పడడం వంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ రోజుకారోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.తిరిగి వచ్చే దారివ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్‌లో రెండవ రోజు పుల్నా నుంచి ఘంగారియాకు ప్రయాణించిన దారిలోనే మరోసారి ప్రయాణం సాగుతుంది. వెళ్లేటప్పుడు చూసిన వాటిని మరోసారి మనసారా ఆస్వాదించడానికి అనువైన సమయం ఇది. ట్రెకింగ్ మొదలు పెట్టినప్పుడు ట్రెకింగ్ తామున్న చోటు నుంచి పైకి చూస్తూ సాగుతుంటుంది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలకు చేరాలనే ఉత్సాహం ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు ఆకాశం నుంచి నేల మీదకు దిగుతున్న భావన చాలా గొప్పగా ఉంటుంది. కిందకు చూస్తుంటే కంటికి కనిపించినంత మేర అందమైన ప్రకృతి చిత్రం అలరిస్తుంది. పీపల్‌కోటి నుంచి రిషికేశ్కు ప్రయాణం. ప్రయాణం పదిగంటలు పడుతుంది. రిషికేశ్కు చేరిన తర్వాత టూర్ ఆపరేటర్లు వీడ్కోలు చెబుతారు. పర్యాటకులు రిషికేశ్ నుంచి తమ సొంత స్థానాలకు రావడానికి రైలు లేదా విమాన ప్రయాణానికి మధ్య ఒకరోజు విరామం తీసుకోవడం మంచిది. ఆ రోజు రిషికేశ్ పర్యటన, విశ్రాంతికి కేటాయించుకోవచ్చు.గంగాతీరాన ఒకరోజురిషికేశ్లో ఒక రోజు చూడగలిగిన ప్రదేశాల్లో త్రివేణీఘాట్, త్రివేణీ ఘాట్‌లో సాయంకాలం గంగా హారతి, లక్ష్మణ్ ఝూలా, రామ్‌ఝూలా, పరమార్థ నికేతన్ ఆశ్రమ్, స్వర్గ ఆశ్రమ్‌లోని ప్రాచీన రాతి వలయాకారపు ఆశ్రమాలు, వశిష్ఠ గుహ, రిషికుండ్, భారత్మందిర్, తారా మంజిల్ టెంపుల్. రిషికేశ్‌లో పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సొంతంగా చూడాలి. ప్యాకేజ్‌లో లేవు. పీపల్‌కోటి నుంచి ట్రెకింగ్ టూర్ మొదలు కావడానికి ఒక రోజు ముందుగా రిషికేశ్ చేరిన వాళ్లు సాయంత్రం గంగాహారతిని మిస్ చేసుకోవద్దు. పీపల్‌కోటి నుంచి రిషికేశ్కు ప్రయాణం. ప్రయాణం పదిగంటలు పడుతుంది. రిషికేశ్కు చేరిన తర్వాత టూర్ ఆపరేటర్లు వీడ్కోలు చెబుతారు. పర్యాటకులు రిషికేశ్ నుంచి తమ సొంత స్థానాలకు రావడానికి రైలు లేదా విమాన ప్రయాణానికి మధ్య ఒకరోజు విరామం తీసుకోవడం మంచిది. ఆ రోజు రిషికేశ్ పర్యటన, విశ్రాంతికి కేటాయించుకోవచ్చు.గంగాతీరాన ఒకరోజు రిషికేశ్‌లో ఒక రోజు చూడగలిగిన ప్రదేశాల్లో త్రివేణీఘాట్, త్రివేణీ ఘాట్‌లో సాయంకాలం గంగా హారతి, లక్ష్మణ్ ఝూలా, రామ్‌ఝూలా, పరమార్థ నికేతన్ ఆశ్రమ్, స్వర్గ ఆశ్రమ్‌లోని ప్రాచీన రాతి వలయాకారపు ఆశ్రమాలు, వశిష్ఠ గుహ, రిషికుండ్, భారత్మందిర్, తారా మంజిల్ టెంపుల్. రిషికేశ్‌లో పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సొంతంగా చూడాలి. ప్యాకేజ్‌లో లేవు. పీపల్‌కోటి నుంచి ట్రెకింగ్ టూర్ మొదలు కావడానికి ఒక రోజు ముందుగా రిషికేశ్ చేరిన వాళ్లు సాయంత్రం గంగాహారతిని మిస్ చేసుకోవద్దు. ఫిట్నెస్ ఇలా ఉండాలి!ట్రెకింగ్‌కు బయలుదేరడానికి కనీసం నెల ముందు దేహాన్ని సంసిద్ధం చేసుకోవాలి. ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడానికి రోజూ ఐదు కిలోమీటర్ల దూరం జాగింగ్35 నిమిషాల్లో పూర్తి చేయాలి. జాగింగ్ పూర్తయ్యేటప్పటికి విపరీతంగా అలసిపోయిన ఫీలింగ్ లేకుండా నార్మల్‌గా ఉండగలగాలి. సైక్లింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్లయితే అరగంట సమయంలో 10 కిలోమీటర్లు వెళ్లగలగాలి. అవసరమైన వస్తువులతో నిండిన బ్యాక్‌ప్యాక్ పది నుంచి పన్నెండు కిలోలుంటుంది. ట్రెకింగ్ సమయమంతా దానిని మోయగలిగిన శక్తి ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 18–29 మధ్యలో ఉంటేనే దేహం ట్రెకింగ్ తగినట్లు శక్తిమంతంగా ఉంటుంది.పల్స్ రేట్ నిమిషానికి 60– 100 మధ్య ఉండాలి. బ్లడ్ ప్రెషర్ డయస్టోలిక్ 75–85 మధ్య, సిస్టోలిక్ 100– 130 మధ్య ఉండాలి.ఉచ్వాశనిశ్వాసలు నిమిషానికి 12 నుంచి 20 మధ్య ఉండాలి.లివర్, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, బ్రాంకైల్ ఆస్త్మా, హార్డ్ ప్రాబ్లమ్స్, హైబీపీ,సైనసైటిస్, ఎపిలెప్సీ వంటివి ఉండకూడదు. పేస్‌మేకర్ ఇంప్లాంట్ చేసుకున్న వారు ట్రెకింగ్‌కు వెళ్లరాదు. పై కొలతలు కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ పరంగా దృఢంగా ఉంటే ట్రెక్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ ట్రెకింగ్‌లో 14,100 అడుగుల ఎత్తుకు చేరతారు కాబట్టి ఆల్టిట్యూడ్ సిక్నెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డియో వర్కవుట్స్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్, మెట్లు ఎక్కడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజెన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. ట్రెకింగ్‌కు ముందు కనీసం నెల రోజులు వీటిని సాధన చేస్తే లంగ్ కెపాసిటీ మెరుగవుతుంది. ట్రెకింగ్ టూర్‌ని ఆద్యంతం ఆస్వాదించవచ్చు. ఏ వయసు వాళ్లు ట్రెకింగ్ చేయవచ్చు!తొమ్మిది సంవత్సరాలు నిండిన పిల్లలను కూడా ట్రెకింగ్‌కి అనుమతిస్తారు. కానీ వారితోపాటు తల్లిదండ్రులు కూడా ట్రెకింగ్ టీమ్‌లో ఉండాలి. 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను ఒంటరిగా (తల్లిదండ్రులు వెంట లేకపోయినా) ట్రెకింగ్‌కి అనుమతిస్తారు. కానీ తల్లిదండ్రులు అనుమతి పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది.18 ఏళ్లు దాటిన వారికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. గరిష్ట వయసు విషయానికి వస్తే ప్రత్యేకంగా నిబంధనల కంటే ఆరోగ్య నిర్ధారణ చేస్తూ డిస్‌క్లెయిమర్ ఫార్మ్ సంతకం చేసి ఇవ్వాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్ టూర్ కోడ్: https://www.irctctourism.com/adventure/trekDetails?id=48 ఏమేమి తీసుకెళ్లాలి? బ్యాక్ ప్యాక్, రెయిన్ కవర్, వాకింగ్ స్టిక్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, స్నాక్స్, పర్సనల్ మెడికల్ కిట్, సింథటిక్ టీ షర్ట్, ఫ్లీస్ టీ షర్ట్, ఫ్లీస్ జాకెట్, విండ్ ప్రూఫ్ జాకెట్, హాలో జాకెట్, థర్మల్ ఇన్నర్, ట్రెక్ పాంట్, ఫ్లీస్ , వాటర్ ప్రూఫ్ గ్లవ్స్, ఉలెన్ గ్లవ్స్, హెడ్ టార్చ్, సన్ క్యాప్, ఉలెన్ క్యాప్, నెక్ గెయిటర్స్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్, లిప్ బామ్, టూత్ బ్రష్– పేస్ట్, టాయిలెట్ పేపర్– వైప్స్, సబ్బు, హ్యాండ్ శానిటైజర్, ట్రెకింగ్ షూస్, ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా ఫ్లోటర్స్, కాటన్ సాక్స్, ఉలెన్ సాక్స్, వాటర్ ప్రూఫ్ జాకెట్–పాంట్స్, మైక్రో స్పైక్స్, యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్, క్విక్ డ్రై టవల్. ప్యాకేజ్ వివరాలివిట్రెక్ పేరు ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్, ఇది ఆరు రోజుల పర్యటన. ఉత్తరాఖండ్ రాష్ట్రం, పీపల్‌కోటి నుంచి మొదలవుతుంది. రిషికేశ్ నుంచి టూర్ మొదలవుతుంది. ట్రెకర్లు రిషికేశ్ వరకు తమకు తాముగా చేరుకోవాలి. రిషికేశ్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. రిషికేశ్ వరకు ట్రైన్లో వెళ్లవచ్చు. రిషికేశ్కు సమీప విమానశ్రయం జాలీ గ్రాంట్ ఎయిర్΄ోర్ట్, డెహ్రాడూన్‌లో ఉంది. 21 కిమీల దూరం. ఈ ఆరు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 11,800 రూపాయలవుతుంది.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్‌కి అనువైన ప్రదేశం. నిజానికి దీనిని లెర్నర్స్ ట్రెక్ అనాలి. పెద్ద పెద్ద ట్రెకింగ్‌కి ఇది ప్రాక్టీస్‌గా పనికి వస్తుంది. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ట్రంప్ సృష్టించిన వీసా ప్రకంపనలు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు రుసుముపై అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలంటూ సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్నవారు, హెచ్–1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు బెంబేలెత్తిపోయారు. ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? అని ఆవేదనకు గురయ్యారు. అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇందులో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులైతే వెంటనే అమెరికాకు చేరుకోవడానికి పరుగులు పెట్టారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి విమానం టికెŠక్ట్ కొనుగోలు చేయాల్సి వచి్చంది. అయితే, హెచ్–1బీ వీసాల విషయంలో కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే లక్ష డాలర్లు వసూలు చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచి్చంది. దీంతో చాలామంది ఊరట చెందారు. పెద్ద భారం భారం దిగిపోయినట్లుగా ఉపశమనం పొందారు. టిక్కెట్‌కు రూ.7.04 లక్షలు మహారాష్ట్రకు చెందిన ఒకరు హెచ్–1బీ వీసాతో అమెరికాలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. తన తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ఇటీవలే అమెరికా నుంచి నాగపూర్ వచ్చాడు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. హెచ్–1వీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు గురించి తెలియగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే అమెరికాకు ప్రయాణం కట్టాడు. అప్పటికప్పుడు విమానం టిక్కెట్ దొరకాలంటే మాటలు కాదు కదా! ప్రయాణం కోసం ఎక్కువ సొమ్ము చెల్లించక తప్పలేదు. నాగపూర్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి 8,000 డాలర్లు (రూ.7.04 లక్షలు) ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రోహన్ మెహతా వాపోయాడు. సాధారణం అయ్యే ఖర్చు కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. ట్రంప్ ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చి ఉంటే తనకు ఈ భారం తప్పేదని ఆవేదన వ్యక్తంచేశాడు. యూరప్ దేశాలే ముద్దు దసరా, దీపావళి పండుగల కోసం స్వదేశానికి రావడానికి అమెరికాలోని భారతీయులు ముందే ప్లాన్ చేసుకున్నారు. హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధిస్తున్నారని తెలియగానే విమానం టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. పండుగలకు వెళ్లలేమంటూ ప్రయాణాలు ఆపేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 19న ట్రంప్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచి్చంది. దాంతో సోషల్ మీడియాలో ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. అమెరికాలోని హెచ్–1బీ వీసాదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇండియాకు వెళ్లకపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేశారు. స్వదేశంలో కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకోవాలన్న ఆసక్తి చచి్చపోయిందని ఓ భారతీయుడు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఉన్న వృత్తి నిపుణులు అమెరికా పట్ల విముఖత చూపుతున్నారు. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో వారు పునరాలోచనలో పడ్డారు. ఉద్యోగాలకు యూరప్ దేశాలే బెటర్ అని అంచనాకొచ్చారు. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. పెళ్లి రద్దయ్యింది ఇండియాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇండియాలోనే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారమే పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం శుక్రవారం ఆనందంగా స్వదేశానికి బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ట్రంప్ విసిరిన వీసా బాంబు గురించి తెలిసింది. ఇప్పుడు ఇండియాకు వెళ్తే మళ్లీ వెనక్కి వస్తామో లేదో తెలియని పరిస్థితి. దాంతో ఆ యువకుడు ప్రయాణం ఆపేసి ఎయిర్పోరుŠట్ నుంచి ఇంటికి తిరిగివెళ్లాడు. ఇండియాలో జరగాల్సిన పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు ఉన్నవారిపై లక్ష డాలర్ల రుసుము ఉండబోదని మొదటే చెబితే తనకు ఈ బాధ తప్పేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. సోలో టూరే సో బెటరూ...
ఒంటరి ప్రయాణం అనేది ఒక ఆసక్తికరమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, స్వీయ–ఆవిష్కరణ ఫ్లెక్సిబులిటీలను అందిస్తుంది. అయితే అలా సింగిల్‌గా ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఉల్లాసమైన అనుభవాలు మాత్రమే కాదు భద్రత, సౌలభ్యం కూడా ప్రధానమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే 5 దేశాలు సోలో ట్రావెల్‌కి అత్యంత ఎంచుకోదగినవిగా మారాయి. ఒంటరిగా ప్రయాణీకులకు కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి, విభిన్న వ్యక్తులతో సంభాషించడానికి రాజీ పడకుండా మనసుకు నచ్చిన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పించే ఆ దేశాలలో...జపాన్భద్రత, పరిశుభ్రత అత్యంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కారణంగా వ్యక్తిగత ప్రయాణికులకు నెం1 గమ్యస్థానం జపాన్. టోక్యో, క్యోటో ఒసాకా వంటి నగరాలు ప్రశాంతమైన దేవాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఆధునిక ఆకర్షణలతో సంప్రదాయ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఒంటరి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రాంతాలు సందర్శించేలా ప్రజా రవాణా బాగా పనిచేస్తుంది చౌకగా బస చేయడానికి క్యాప్సూల్ హోటళ్ళు హాస్టళ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.న్యూజిలాండ్ఇది స్నేహపూర్వకంగా ఉండే ప్రజలు తక్కువ నేరాలు కలిగిన చిన్న దేశం, అందువల్ల ఒంటరి ప్రయాణానికి సరైనది. టోంగారిరో ఆల్పైన్ క్రాసింగ్‌ను హైకింగ్ చేయడం సౌత్ ఐలాండ్‌లోని ఫ్జోర్డ్లను సందర్శించడం వంటి అన్ని స్థాయిల ఫిట్‌నెస్‌కు అనుగుణంగా ఉండే కార్యకలాపాలతో న్యూజిలాండ్ సోలో ట్రావెల్‌కు అనుకూలతలు కలిగి ఉంది.పోర్చుగల్సుందరమైన ప్రదేశం, పురాతన పట్టణాలు పర్యాటకులను ఇష్టపడుతూ ఆకర్షించే ఆదరించే సంస్కృతి కలిగిన దేశం పోర్చుగల్. లిస్బన్ పోర్టో వంటి చిన్న నగరాలు కాంపాక్ట్, నడవడానికి అనుకూలమైనవి సాంస్కృతిక అనుభవాలతో నిండి ఉన్నాయి పాత స్మారక చిహ్నాలు సందడిగా ఉండే స్ట్రీట్ లైఫ్ రెండూ ఆకట్టుకుంటాయి. పోర్చుగల్‌లోని కేఫ్ సంస్కృతి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు స్థానికులు ఇతర ప్రయాణికులతో సులభంగా పరిచయాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి.కెనడాఇది వాంకోవర్, టొరంటో మాంట్రియల్ వంటి బహుళ సాంస్కృతిక, బాగా అనుసంధానించబడిన నగరాలను కలిగి ఉన్న దేశం. భద్రత విషయంలో ఉన్నత స్థానంలో ఉంది. ఒంటరి ప్రయాణికులు పట్టణాల్లోనే పలు ఆకర్షణలను సందర్శించవచ్చు. జాతీయ ఉద్యానవనాలలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు లేదా కాలానుగుణ స్కీయింగ్, హైకింగ్ వన్యప్రాణుల వీక్షణను చేపట్టవచ్చు.థాయిలాండ్చౌక ధరలకు ప్రయాణించాలనుకునే ఒంటరి ప్రయాణికులకు థాయిలాండ్ అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, చియాంగ్ మాయి, ద్వీపాలు స్ట్రీట్ ఫుడ్ టూర్స్, దేవాలయాలు, బీచ్‌లు నైట్ లైఫ్‌తో సహా అన్ని రకాల అనుభవాలకూ నిలయం. థాయిలాండ్ పర్యాటక మౌలిక సదుపాయాలు హాస్టళ్లు, గైడెడ్ టూర్లు, రవాణా సేవలు మొదలైన వాటితో బాగా అభివృద్ధి చెందాయి.(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!
భారతదేశం గర్వించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్... దేశం కోసం ప్రాణాలర్పించిన జలియన్‌వాలా బాగ్.సైనిక వందనంతో గౌరవించే వాఘా– అట్టారి సరిహద్దు... పంజాబ్ ప్రాణత్యాగాల నిలయం జంగ్ ఈ ఆజాదీ.వ్యర్థాలను అర్థవంతం చేసిన చండీగఢ్ రాక్ గార్డెన్... భగవద్గీత బోధనక్షేత్రం హరియాణా కురుక్షేత్రం.బహాయీ ధ్యానమందిరం ఢిల్లీ లోటస్ టెంపుల్... భారతీయ లోహ ప్రావీణ్యత చిహ్నం ఐరన్ పిల్లర్.కృష్ణుడు పుట్టిన మధుర... ఆడిపాడిన బృందావనం... భారతీయుల ప్రేమ పొందిన ప్రపంచవింత తాజ్‌మహల్. ఉత్తర భారత వారసత్వాన్ని వారంలో ఒడిసి పట్టుకోవచ్చు.1వ రోజు :హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం తర్వాత 3.50 గంటలకు 6ఈ 167 విమానం బయలుదేరి సాయంత్రం ఆరున్నరకు అమృత్‌సర్‌కు చేరుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహకులు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవడం, విశ్రాంతి, రాత్రి బస.2వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత వాఘా బోర్డర్ విజిట్, రాత్రి బస అమృత్‌సర్‌లోనే.బంగారు మందిరంగోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తొచ్చే ప్రదేశం అమృత్ సర్. ఇటీవల తమిళనాడులో మరో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది. కానీ ఇది 443 ఏళ్ల నాటి నిర్మాణం. దేశమెరిగిన బంగారపు మందిరం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆలయం కూడా. సిక్కుల ప్రార్థనామందిరం రాజకీయ సంక్లిష్టతలకు నెలవైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇందిరాగాంధీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆమె హత్యకు దారి తీశాయి. ఈ గురుద్వారాని రోజుకు లక్షా యాభై వేల మంది సందర్శిస్తారని అంచనా. గురుద్వారా కమిటీ నిర్వహించే లంగార్ (భోజనశాల)లో భోజనం చేయాలి. ఇక్కడో విషయం లంగార్లో అందరూ సమానమే. సహపంక్తి భోజనం చేయాలి. ఎంతమంచి వచ్చినా, కాదనకుండా వడ్డిస్తారు. ఎంత తిన్నా పెడతారు కానీ వడ్డించుకున్న పదార్థాన్ని వృథా చేస్తే ఒప్పుకోరు. పూర్తిగా తినేవరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలుచుంటారు. భోజనాన్ని గౌరవించాలనేది వారి నియమం. భోజనంతోపాటు వారి నియమాన్ని కూడా గౌరవించడం పర్యాటకుల ధర్మం. బంగారు గోపురం ఉన్న ప్రధాన ఆలయం సరోవరం మధ్యలో ఉంటుంది. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వంతెన మీద రావాలి. ఈ గురుద్వారా పేరు హర్మందిర్ సాహిబ్. ఈ మందిర నిర్మాణాల సమూహం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ మందిరంలో జాతిరత్నాలు పొదిగిన పై కప్పును కూడా పరిశీలనగా చూడాలి.బుల్లెట్ గాయాల గోడబ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్లు తగిలి చిల్లులు పడిన గోడ ఉంటుంది. ఆ గోడకు 36 బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 1919, ఏప్రిల్ నెల 13వ తేదీ, బైశాఖీ పండుగరోజు జరిగిందా దుర్ఘటన. డయ్యర్ భారతీయుల మీద కాల్పులు జరపడానికి ముందు బయటకు వెళ్లడానికి అనుమతించిన చిన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు. ఆ కాల్పుల్లో మరణించిన వారి స్మారక నిర్మాణం, అమర జ్యోతి చుట్టూ దేశం కోసం ప్రాణాలొడ్డిన వారి ముఖాల అమరిక అద్భుతంగా ఉంటుంది. వారిని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆ ఘటనలో మరణించిన వారిలో 120 మంది మృత దేహాలు ఒక బావిలో లభించాయి. ఏడు ఎకరాల ప్రదేశంలో అడుగడుగునా స్వాతంత్య్ర పోరాటంలో చోటు చేసుకున్న మౌనరోదనకు ఆనవాలుగా కనిపిస్తుంది.వాఘా– అట్టారి సరిహద్దు ద్వారంభారత్– పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఇది. అమృత్ సర్నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉంది. వాఘా బోర్డర్ అని వాడుకలో అంటుంటాం. కానీ దీని పేరు వాఘా– అట్టారి బోర్డర్. వాఘా అనే గ్రామం భారత్– పాక్ సరిహద్దు రేఖ రెడ్‌క్లిఫ్ లైన్‌కు ఆవల ఆరు వందల మీటర్ల దూరాన ఉంది. భారత సరిహద్దు గ్రామం అట్టారికి మూడు కిలోమీటర్ల దూరం. రోజూ సాయంత్రం ఇక్కడ వాఘా– అట్టారి బోర్డర్ సెరిమనీ జరుగుతుంది. 1959 నుంచి రోజూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలల్లో సందర్శకులు వస్తారు. ఇక్కడి నుంచి అర కిలోమీటరు దూరాన వాఘా రైల్వేస్టేషన్ ఉంది. భారత్– పాక్ మధ్య నడిచే రైలును చూడాలంటే వెళ్లవచ్చు.3వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి జలంధర్‌కు ప్రయాణం. జంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత చండీగఢ్‌కు ప్రయాణం. రాక్ గార్డెన్ విజిట్ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస.సమర జ్ఞాపకంజంగ్ ఈ ఆజాదీ అనే ప్రదేశాన్ని చరిత్ర పాఠంలో చదివి మర్చిపోయి ఉంటాం. ఇది స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ప్రదేశం. ఈ స్మారక భవనం పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరానికి సమీపంలో కర్తార్‌పూర్ పట్టణంలో ఉంది. భారత స్వాతంత్య్ర సమరంలో పంజాబ్ వాసులు నిర్వహించిన పాత్ర, వారి ప్రాణత్యాగాలకు గౌరవ చిహ్నంగా పదేళ్ల కిందట నిర్మించారు. చరిత్రకారులు, పాత్రికేయులు, మేధావులు సమగ్రంగా అధ్యయనం చేసి దీనికి రూపకల్పన చేశారు.రాకింగ్ రాక్స్వేస్ట్ మేనేజ్మెంట్ అవసరాన్ని తెలియచేసే ప్రదేశం ఇది. నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్లో పరిశ్రమల వ్యర్థాలు, ఇంట్లో వాడి పారేసిన వస్తువులతో ఆకర్షణీయమైన కళారూపాలను తయారు చేశారు. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా మానవ నిర్మితమే. సృజనాత్మకత, ఆచరణాత్మకత ఉంటే ఏ వస్తువూ వ్యర్థం కాదు, వృథాగా పారేయడం ఉండదు. అందమైన కళాఖండం అవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ గార్డెన్ అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాడకుండా అటకమీద పెట్టిన వస్తవులకు ఒక రూపమిచ్చే ఆలోచనలు మెదడులో పూస్తాయి.4వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి కురుక్షేత్రకు ప్రయాణం. శ్రీ కృష్ణ మ్యూజియం సందర్శనం. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస ఢిల్లీలో.గీత బడి కురుక్షేత్రంశ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేల ఇది. కురుక్షేత్ర అనగానే కురు– పాండవుల యుద్ధక్షేత్రంగానే గుర్తొస్తుంది. కురుక్షేత్రలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని స్థానికులు ధర్మక్షేత్రగా చెప్పుకుంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించిన ప్రదేశంలో ప్రస్తుతం మ్యూజియం ఉంది. కురుక్షేత్ర పట్టణం హరియాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, కురుక్షేత్ర పనోరమ అండ్ సైన్స్ సెంటర్, శ్రీకృష్ణ మ్యూజియం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీష్మకుండ్, కర్ణ లేక్, కల్పనా చావ్లా ప్లానిటేరియమ్, సూఫీ సన్యాసి షేక్ చిల్లీ టూంబ్ ముఖ్యమైనవి. ఇతడు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సోదరుడు దారాషుకో గురువు. తన ఆధ్మాత్యిక గురువు గౌరవార్థం దారాషుకో దీనిని నిర్మించాడు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ΄ోలిన నిర్మాణం కావడంతో దీనిని హరియాణా తాజ్‌మహల్ అంటారు. 5వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్ విజిట్. సాయంత్రం అక్షరధామ్ దర్శనం. రాత్రి బస ఢిల్లీలోనే.లోటస్ టెంపుల్నిశ్శబ్దంమైన ఆలయం ఇది. టెంపుల్ అంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహమూ ఉండదు. ధ్యానం చేసుకోవడమే ప్రధానంగా రూపొందిన బహాయీ ప్రార్థన మందిరం. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మతం అనే గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఏర్పడిన మతం ఇది. బహాఉలాహ్ అనే తత్వవేత్త ఇరాన్లో 19వ శతాబ్దంలో రూపొందించిన భావజాలం ఇది. అందుకే దీనికి బహాయి మతంగా పేరు వచ్చింది. అరవిరిసిన కలువపువ్వును తలపిస్తుంది. కాబట్టి లోటస్ టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఇది ఒక నిర్మాణ అద్భుతం. 2500 సీటింగ్ కె΄ాసిటీ ఉన్న విశాలమైన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ ఉండదు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. మతాలు, కులాలు, స్థాయీ బేధాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లాలి. ధ్యానం చేసుకుని బయటకు రావాలి. పర్యాటకులకు ధ్యానం చేసుకోగలిగినంత సమయం ఉండదు. కాబట్టి పది నిమిషాల సేపు కళ్లు మూసుకుని ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేసి రావడమే జురుగుతుంది.ఢిల్లీ పేరిలా వచ్చింది!కుతుబ్ మినార్ను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. ఢిల్లీ శివారులోని మెహ్రౌలీలో ఉంది. లాల్ కోట శిథిలాల మీద నిర్మించిన కట్టడం అని చెబుతారు. ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో లాల్ కోట ఉండేదని, అది ఢిల్లిక రాజ్య రాజధాని అని చెబుతారు. అదే దిల్లీగా వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ ఉచ్చారణలో డిల్లీగా మారింది. కుతుబ్‌మినార్ ప్రాంగణం అంతా తిరిగి చూస్తే ఒక భారీ కోట ఉండేదని నమ్మక తప్పదు. భారీ ప్రాకారాలు, గోడలు, వాటి నిర్మాణశైలి ప్రాచీనతకు అద్దం పడతాయి. కుతుబ్‌మినార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ పిల్లర్ చారిత్రక ప్రాధాన్యం కలిగినది మాత్రమే కాదు. మనదేశంలో ప్రాచీనకాలంలోనే లోహశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియచేసే ప్రత్యక్ష ఉదాహరణ. శతాబ్దాలపాటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఐరన్ పిల్లర్కి తుప్పు పట్టలేదు. పేరుకు ఐరన్ పిల్లరే కానీ అనేక లోహాల మిశ్రమం. ఏ లోహాన్ని ఎంత మోతాదులో మిశ్రమం చేశారనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదింకా. గుప్తుల కాలం నాటిది ఈ ఐరన్ పిల్లర్.అక్షరధామ్ఇది స్వామి నారాయణ్ ఆలయం. నిర్మాణ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం తిరిగి చూడాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. అభిషేక మండపంలో నీటి చెంబులు వరుసగా ఉంటాయి. టికెట్ తీసుకున్న వాళ్లు వరుసలో వెళ్లి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఇది ఢిల్లీలో యమునా నది తీరాన ΄ాండవ నగర్లో ఉంది. శిల్పసౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇతర ధార్మిక క్రతువులేవీ ఉండవు. దర్శనం, ధ్యానం, ఉల్లాసంగా గడపడమే ప్రధానం. పిల్లలు ఊయలలూగుతూ ఆడుకోవడానికి ఆటస్థలం కూడా ఉంది. విస్తారమైన గార్డెన్‌లున్నాయి. భారత్ ఉ΄ావన్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలున్నాయి. అక్షరధామ్లోపలకు స్మార్ట్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయితే బ్యాక్‌డ్రాప్‌లో ఆలయ గోపురం కనిపించేటట్లు ఫొటో పాయింట్ ఉంది. అక్కడ కెమెరామన్ ఉంటాడు. ఈ టూర్ జ్ఞాపకంగా ఒక ఫొటో తీయించుకోవడం మరిచిపోవద్దు. 6వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి మధురకు ప్రయాణం. శ్రీ కృష్ణ జన్మభూమి సందర్శనం తర్వాత బృందావన వీక్షణం. సాయంత్రం ఆగ్రాకు ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస ఆగ్రాలో.మధుర మసీదుమధుర ప్రయాణం ఆసక్తిగా సాగుతుంది. కానీ మధురకు చేరిన తర్వాత కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని, భక్తుల విశ్వాసాలకు తగినంత ప్రాధాన్యం పాలకులు ఇవ్వలేదనిపిస్తుంది. ఆలయం లోపల ఒక మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి. దేవకీవసుదేవులను కంసుడు బంధించి ఉంచినట్లు చెప్పే చెరసాల కూడా ఇక్కడే ఉంది. భూగర్భంలో నిర్మించిన రాతి గోడల కట్టడంలోకి ఇరుకు మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలన్నీ ధ్వంసం అవుతూ, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను నిక్షిప్తం చేసుకుంటూ పునర్నిర్మాణమవుతూ వచ్చింది. మొఘలు పాలకుడు ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థాన భవనాన్ని ఆనుకుని నిర్మించిన పెద్ద మసీదును కూడా చూడవచ్చు.యమునాతటిలో నల్లనయ్యబృందావనమది అందరిదీ! గోవిందుడు అందరివాడే... అని ఆడుకోవడానికి ఆడుకోవడానికి అందమైన ప్రదేశం బృందావనం. గోవిందుడు సంచరించిన నేల మీద పర్యటన అనే భావనలోనే ఓ గొప్ప గిలిగింత ఉంటుంది. యమునానది తీరాన విస్తరించిన ఈ నేల మీద ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు, బలరాముడు అనే పుణ్య పురుషుల బాల్యం గడిచిందని భక్తుల విశ్వాసం. ఇస్కాన్ నిర్మించిన భారీ ఆలయాలలో పౌరాణిక కథనాల్లో చోటుచేసుకున్న నాటి జ్ఞాపకాలకు నేటి రూపాలను మనం చూడగలుగుతున్నాం. మధుర నుంచి బృందావనానికి 15 కిమీల దూరం. మరో పది కిలోమీటర్ల దూరాన గోకులం ఉంది. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోసం ఇక్కడ కొంత కాలం నివసించవచ్చు. స్థానికులు మాట్లాడేది హిందీయే అయినా ఆ డైలక్ట్ దక్షిణాది వాళ్లు పుస్తకాల్లో నేర్చుకున్న హిందీకి ఏ మాత్రం సరి΄ోలదు. మెల్లగా అలవాటు చేసుకోవాలి.7వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్. తాజ్ వీక్షణం తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. 16 తేదీ సాయంత్రం 4.40 గంటలకు 6ఈ 6478 విమానం ఆగ్రాలో బయలుదేరి 6. 45 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.భారతీయుల ప్రేమకు చిహ్నంతాజ్మహల్ ను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడవచ్చనిపించే అద్భుతం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి కొన్ని వివరాలు మిగిలే ఉంటాయి. ఓ పాతికేళ్ల కిందట... ‘తాజ్‌మహల్ గొప్ప నిర్మాణమే కానీ ఫొటోలో కనిపించినంత అందంగా డైరెక్ట్‌గా చూసినప్పుడు కనిపించదు’ అనేవారు. అది నాటి మాట. యూపీలో యమునానది తీరాన ఫ్యాక్టరీలున్నప్పుడు వాటి కాలుష్యం కారణంగా తెల్లటి పాలరాయి పసుపు రంగులోకి మారింది. ఫ్యాక్టరీలను తొలగించిన తర్వాత ప్రమాదం తగ్గినప్పటికీ దశాబ్దంపాటు తాజ్‌మహల్ పసుపు వర్ణంలోనే ఉండింది. అలాగే ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో స్థానం పొందింది కూడా. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (తొలి దఫా) మనదేశంలో పర్యటించడానికి ముందు తాజ్‌మహల్ పాలరాయికి పాలిష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తాజ్ మహల్ తెల్లగా మెరుస్తోంది. తాజ్ మహల్ 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు వైపులా ఉన్న తోటలను పరిశీలనగా చూస్తే చార్బాగ్ ఏర్పాటులో మొఘలులు ఎంత నిశితంగా ఉండేవారో అర్థమవుతుంది. మొక్కలు, గుబుర్ల వరుస స్కేలు పెట్టి గీచినట్లు ఉంటుంది. మనకు తాజ్‌మహల్ అంటే ఎంత ప్రేమంటే... 2007లో జరిగిన న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో తాజ్‌మహల్‌కు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇది షాజహాన్ ప్రేమకు మాత్రమే కాదు, ఇది భారతీయుల ప్రేమకు కూడా చిహ్నమే. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి అంగుళమూ ఓ అద్భుతం. అన్నట్లు ఫొటోలు తీసుకునేటప్పుడు తాజ్ మహల్ ముందు మాత్రమే కాదు, వెనుక వైపు యమునా నది బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు తీసుకోవడం మరువద్దు. తాజ్‌మహల్‌తోపాటు ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశం రెడ్‌ఫోర్ట్. దీనిని ఆగ్రాఫోర్ట్ అంటారు. అక్బర్ ఎక్కువకాలం రాజ్యపాలన చేసింది ఈ ఎర్ర కోట నుంచే.హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ ఏడు రోజుల టూర్ పేరు ‘నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా’,టూర్ కోడ్ ఎస్హెచ్ఏ 52. సెప్టెంబర్ 10వ తేదీన మొదలయ్యే ఈ పర్యటనలో అమృతసర్, చండీగఢ్, ఢిల్లీ, మధుర, ఆగ్రా కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలకు..ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ కాంటాక్ట్ నంబరు: 91 97013 60701ప్యాకేజ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో 52,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 39,800 అవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 37,300 రూపాయలు. (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
ఊపందుకుంటున్న సోలో డేట్ కల్చర్..!
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్‌కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్‌కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్‌తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్‌కు ఊతమిస్తున్నారు. ‘డేట్‌కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం. అలా పుట్టింది.. పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్‌కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?.. బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి. ఇలా విస్తరించింది.. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్‌ని ట్రెండ్‌గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు. సోలో డేటింగ్.. ఇలా! ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్‌కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం.. కొన్ని సూచనలు.. దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి. సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది. ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి. నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్నెస్ కలుగుతుంది.(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు) -
ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన కేంద్ర మంత్రి బండి దంపతులు.. కారణం ఏంటంటే..
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్‌ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు. -
డబుల్ కా మీఠా టూర్.. చార్ ధామ్ యాత్ర
గంగోత్రి... గంగానది పుట్టిన ప్రదేశం.కేదార్నాథ్ మంచుకొండల్లోని జ్యోతిర్లింగం.బదరీనాథ్ హిమాలయాల్లో విష్ణు మందిరం.ఇది.. ప్రాశస్త్యం కలిగిన చార్ధామ్ యాత్ర.వీటితోపాటు...రాముడు తపస్సు చేసిన దేవప్రయాగ.శివుడు ప్రేమను వ్యక్తం చేసిన గుప్తకాశీ. పాండురాజు నివసించిన పాండుకేశ్వర్.శివ గౌరి పెళ్లి వేదిక త్రియుగినారాయణ్. అందుకే ఇది డబుల్ కా మీఠా టూర్.చెన్నై నుంచి ఘజియాబాద్‌కు ప్రయాణం. ఘజియాబాద్‌లో విమానం దిగిన తరవాత రోడ్డు మార్గాన హరిద్వార్‌కు ప్రయాణం. హరిద్వార్‌లో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం, విశ్రాంతి. రాత్రి బస. ప్యాకేజ్ ప్లాన్‌లో గంగా హారతి పన్నెండవ రోజు ఉంది. కానీ ఆసక్తి ఉన్న వాళ్లు స్వయంగా ఈ రోజు కూడా వెళ్లవచ్చు.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి హరిద్వార్ నుంచి బార్కోట్‌కు ప్రయాణం. బార్కోట్లో గదిలో చెక్ ఇన్. రాత్రి బస అక్కడే.ఆకుపచ్చ హిమాలయాల వీక్షణంహరిద్వార్ నుంచి బార్కోట్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మన మైదాన ప్రాంతంలో సాగినట్లు ప్రయాణం వేగంగా సాగదు. ఆరు గంటలు పడుతుంది. హరిద్వార్ నుంచి యమునోత్రికి వెళ్లే దారిలో యమునానది తీరాన ఉన్న చిన్న పట్టణం బార్కోట్. నాలుగువేల అడుగుల ఎత్తులో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో, హిమాలయాల పర్వత శ్రేణుల్లో విస్తరించిన గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ. కానీ బార్కోట్లో 75శాతం అక్షరాస్యులే. జాతీయ సరాసరి అక్షరాస్యతకంటే దాదాపు పదిశాతం ఎక్కువ. ఇక్కడ పర్యాటకం మంచి జీవనోపాధి కావడంతో చదువుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక్కడ హిమాలయాల మీద మంచు కనిపించదు. పశ్చిమ కనుమల్లాగా చిక్కటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రాత్రి బస చేయడం మరిచిపోలేని అనుభూతి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బార్కోట్ నుంచి హనుమాన్ చట్టికి, ఆ తర్వాత యమునోత్రికి ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి బార్కోట్కి తిరుగు ప్రయాణం. రాత్రి బస బార్కోట్లోనే.యమున పుట్టిల్లు!బార్కోట్ నుంచి యమునోత్రికి వెళ్లే దారిలో హనుమాన్ చట్టి దాటిన తరవాత 13 కిలోమీటర్ల దూరంలో కాళింది పర్వతం మీద ఉంది యమునోత్రి. ఇది హిమనీనదం. మంచు కరుగుతూ ప్రవాహరూపం సంతరించుకుంటున్న పరిస్థితి. పర్వతాల మధ్య నిశ్శబ్దం తప్ప మరేమీ లేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పర్యాటకుల రణగొణ ధ్వనులు తప్ప సాధారణ శబ్దాలేవీ వినిపించవు. యమునా నది పుట్టిన ప్రదేశంలో ఓ ఆలయం. ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించే పూజారి కుటుంబంతో΄ాటు మరికొన్ని కుటుంబాలు తప్ప ఇది పెద్ద జనావాసం కాదు. ఈ ప్రదేశానికి చేరాలంటే కాలి నడక లేదా గుర్రాల మీద మాత్రమే. స్థానికులు జమ్నోత్రి అంటారు. వారితో మాట్లాడేటప్పుడు జమునోత్రి అనడమే సులువుగా ఉంటుంది. యమునోత్రి ఆలయాన్ని గర్వాల్ రాజు మహారాజా ప్రతాప్ షా నిర్మించాడు. కొంతకాలానికి భూకంపం వచ్చినప్పుడు అది కూలి ΄ోవడంతో ఇప్పుడు మనకు కనిపించే ఆలయాన్ని జైపూర్ మహారాణి 19వ శతాబ్దంలో నిర్మించారు. యమునోత్రికి ఏడు కిలోమీటర్ల దూరాన జానకి చట్టిలో సూర్యకుండ్ హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది. ఈ ఉష్ణనీటి గుండంలో స్నానం చేయవచ్చు.బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్. సాయంత్రం విశ్రాంతి. రాత్రి బస కూడా అక్కడే.ఇది ఉత్తరాఖండ్ కాశీఉత్తరాఖండ్ రాష్ట్రంలో ట్రెకింగ్‌కి ఉత్తరకాశీ చక్కటి ప్రదేశం. పర్వతాల మీద వాలే మంచు దూదిపింజల్లా తేలుతూ ఉంటే పర్వతాల నడుమ కనుమల్లో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే నడక, క్యాంపింగ్ ఒక జీవితకాలపు మధురానుభూతినిస్తాయి. ఈ టూర్ ప్లాన్‌లో ట్రెకింగ్ లేదు. కానీ ఈ టూర్లో యువత ఉంటే నాలుగవ రోజు విశ్రాంతి సమయం లేదా ఐదవరోజు ఖాళీ సమయాల్లో సొంతంగా క్యాంపింగ్ ΄్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ విశ్వనాథుడి పేరుతో ఉన్న శివాలయం ప్రసిద్ధి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి (కాశీ) లోని విశ్వనాథుడి దర్శనానికి వెళ్లలేని వాళ్ల కోసం శివుడు ఇక్కడ అదే పేరుతో వెలిశాడని చెబుతారు. కాశీలో ఉన్నట్లే ఇక్కడ కూడా హనుమంతుడు, దుర్గ, పరశురామ, దత్తాత్రేయ, భైరవ్, అన్నపూర్ణ ఆలయాలున్నాయి.బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి ఉత్తరకాశీకి ప్రయాణం. రాత్రి బస ఉత్తరకాశీలో.గంగ పుట్టిల్లు!ఉత్తరకాశీ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది గంగోత్రి. పదివేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ మనం చూసే ప్రదేశం గంగోత్రి గ్లేసియర్ (హిమానీనదం). మంచు రూపంలో ఉన్న నది. మంచు కరుగుతూ క్రమంగా ప్రవాహ రూపం సంతరించుకుంటుంది. ఇక్కడ గంగోత్రి నుంచి జాలువారిన ప్రవాహాన్ని భాగీరథి నదిగా పిలుస్తారు. ఈ నది దేవ ప్రయాగలో అలకనంద నదిలో సంగమించిన తర్వాత ఆ సంగమ ప్రవాహాన్ని గంగ అని పిలుస్తారు. భగీరథుడి ప్రయత్నం వల్ల శివుడి తల మీద నుంచి గంగ నేలకు వచ్చిన ప్రదేశంగా భావిస్తూ భాగీరథి పేరుతో పిలుస్తారు. నీటిని దైవంగా భావించే సంస్కృతిలో భాగంగా గంగోత్రిలో ఆలయం ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఓ సంగతి ఉంది. ఇక్కడ నివసించే ప్రజల్లో అక్షరాస్యత శాతం 99. ఆశ్చర్యపోయే ముందు ఇక్కడ జనాభా సంఖ్యను తెలుసుకుందాం. ఇక్కడ నివసించే కుటుంబాల సఖ్య యాభై లోపే. జనాభా నూట పది మంది మాత్రమే.తెల్లవారు జామున గుప్త కాశీకి ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్. రాత్రి బసశివుడు ప్రేమ క్షేత్రంగుప్తకాశీ కూడా ఉత్తరకాశీలాగానే హిమాలయ పర్వతాల్లో ఉన్న శైవక్షేత్రం. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది తీరాన ఉన్న కాశి (వారణాసి)కి మరొక ప్రతిరూపం గుప్తకాశి. ఇక్కడ విశ్వనాథ ఆలయంతోపాటు అర్ధనారీశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కేదార్ ఖండ్ అంటారు. ఇక్కడ మణికర్ణిక కుండ్ అనే సరస్సు ఉంది. దీనిని గంగ, యమున నదులకు ప్రతీకగా చెబుతారు. ఇందులో మునిగితే ఈ రెండు నదుల్లో స్నానమాచరించిన ఫలితం ఉంటుందని భక్తుల అభిప్రాయం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమకు యుద్ధం కారణంగా వచ్చిన పాపాల నుంచి విముక్తి ప్రసాదించమని కోరుతూ కాశీకి వెళ్లారని, పాండవులను కలవడానికి ఇష్టపడని శివుడు అక్కడి నుంచి మాయమై గుప్తకాశీకి వచ్చాడని చెబుతారు. అలాగే శివుడు తన ప్రేమను పార్వతికి తెలియచేసిన ప్రదేశం కూడా ఇదేనని చెబుతారు.గుప్తకాశీ నుంచి జీపులో సోన్ప్రయాగ మీదుగా గౌరీకుండ్‌కు ప్రయాణం. కేదార్‌నాథ్‌కు నడక. దర్శనం తర్వాత తిరిగి గౌరీకుండ్ మీదుగా సోన్ ప్రయాగ్ నుంచి గుప్తకాశీకి ప్రయాణం. రాత్రి బస గుప్తకాశీలో.పార్వతి తపస్సు చేసిందిక్కడేగౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్‌కు 14 కి.మీల దూరం. ఇది కేదార్నాథ్ పర్యాటకులకు ఒక మజిలీ. ఇక్కడి నుంచి కాలి నడకన లేదా హెలికాప్టర్లో వెళ్లవచ్చు. శివుని కోసం పార్వతి తపస్సు చేసిన ప్రదేశం గౌరీకుండ్ అని చెబుతారు. దీనికి సమీపంలో ఉన్న త్రియుగినారాయణ్ అనే ప్రదేశంలో శివపార్వతులు వివాహం చేసుకున్నట్లు చెబుతారు. గౌరీకుండ్ దగ్గర నిలబడి ఎటు చూసినా చక్కటి పచ్చదనమే. ఏ మాత్రం కలుషితం కాని ఆహ్లాదకరమైన వాతావరణం. ట్రికింగ్ చేయగలిగితే అద్భుతమైన అనుభూతి.కేదార్నాథ దర్శనంహిమాలయ పర్వతాల్లో ఓ చిన్న పట్టణం కేదార్నాథ్. దాదాపుగా పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది. కేదారనాథుడి పేరుతో పూజలందుకుంటున్న దేవుడు శివుడు. ఇక్కడ కేదార్‌నాథుడి ఆలయంతో΄ాటు చూడాల్సిన ప్రదేశం చోరాబారి హిమానీనదం. ఇక్కడి మంచు కరిగి మందాకిని నది పేరుతో ప్రవహిస్తోంది. కేదార్నాథ్ ఆలయాన్ని మంచుకురిసే సమయాల్లో ఆరు నెలల పాటు (నవంబర్ నుంచి ఏప్రిల్) మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు ఉత్సవమూర్తిని పల్లకిలో గుప్తకాశీకి దగ్గరలో ఉన్న ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ టెంపుల్‌కి తీసుకువస్తారు. ఆరు నెలలపాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. ఆలయం తెరిచేటప్పుడు తిరిగి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.రోజంతా గుప్తకాశీలో విశ్రాంతి. పర్వతాల మీదకు ట్రెకింగ్, స్థానిక ఆలయాల దర్శనాలకు వెళ్లవచ్చు. ఇది ఎవరికి వారు ప్యాన్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి పాండుకేశ్వర్‌కు ప్రయాణం. అక్కడ గదిలో చెక్ ఇన్ అయి రాత్రికి బస.పాండురాజు వనవాసమిక్కడే!గుప్తకాశీ నుంచి పాండుకేశ్వర్‌కు రోడ్డు మార్గాన దాదాపు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆ రోజంతా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఇది బదరీనాథ్‌కు వెళ్లడానికి మధ్యలో ఒక మజిలీ. జోషిమఠ్‌కు బదరీనాథ్‌కు మధ్యలో ఉంటుంది. పాండవుల తండ్రి పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి వదిలేసి వనవాసానికి వెళ్లినట్లు కథనం. ఆ వనవాసంలో పాండురాజు ఇక్కడ నివసించాడని అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ యోగధ్యాన బదరీ ఆలయం, వాసుదేవ ఆలయం ఉన్నాయి. వీటిని పాండురాజు నిర్మించినట్లు తామ్ర శాసనాలు దొరికాయి. అప్పటి పాంచాలదేశమే నేటి ఉత్తరాఖండ్ అని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించి మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ ఇక్కడ కొంతకాలం నివసించారని స్థానిక కథనం. మంచుకురిసే సమయాల్లో బదరీనాద్ ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా ఇక్కడి యోగధ్యాన బదరీ ఆలయానికి తీసుకువస్తారు.బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పాండుకేశ్వర్ నుంచి బదరీనాథ్‌కు ప్రయాణం. బదరీనాథ్‌లో పూజ, మధ్యాహ్న భోజనం తర్వాత మాయాపూర్‌కు ప్రయాణం. మాయాపూర్‌లో హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.రంగవల్లుల మందిరంబదరీనాథ్ ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం. యాభై అడుగుల ఎత్తు ఉంటుంది. సునిశితమైన నిర్మాణ నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం. దూరానికి కూడా కళ్లకు కొట్టొచ్చే రంగులతో ఆకట్టుకుంటుంది. ఆలయ స్తంభాల నుంచి పై కప్పు, మండపం ప్రతిదీ శిల్ప నైపుణ్యంతో ఆకట్టుకుంటుంది. ఉత్తరాది ఆలయాల్లో గ్రానైట్ రాయిలో ఇంత గొప్ప శిల్పనైపుణ్యం నిండిన ఆలయాలను తక్కువగా చూస్తుంటాం. రంగవల్లులతో అలంక రించినట్లు ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా వాహనం గరుడపక్షి విగ్రహం మోకాళ్ల మీద కూర్చన్న భంగిమ ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో బంగారు పూత ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి పద్మాసన స్థితిలో కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. బదరీనారాయణ సాలిగ్రామ రూపాన్ని శంకరాచార్యుడు తప్తకుండ్ దగ్గర ఉన్న గుహలో గుర్తించాడని చెబుతారు. ఆ విగ్రహాన్ని 16వ శతాబ్దంలో గర్వాల్ రాజు గర్భాలయంలో ప్రతిష్ఠించా డని చెబుతారు. ఈ ఆలయంలో గణేశ్, కుబేరుడు, నారదుడు, నరనారాయణ ద్వయం వంటి పదిహేను విగ్రహాలున్నాయి.ఉదయం త్వరగా బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని దేవప్రయాగకు ప్రయాణం. అక్కడ రఘునాథ్ ఆలయ దర్శనం. అలకనంద– భాగీరథి నదుల సంగమం స్థలి వీక్షణం. రిషికేశ్కు ప్రయాణం. అక్కడ రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా, స్వర్గాశ్రమ సందర్శనం తర్వాత హరిద్వార్‌కు ప్రయాణం. హరిద్వార్‌లో హోటల్ చెక్ ఇన్. రాత్రి బస.రాముడు తపస్సు చేసిన నేలదేవప్రయాగకు ఉన్న పౌరాణికప్రాశస్త్యం చాలా గొప్పది. ఇది పంచప్రయాగల్లో ఒకటి. ఇక్కడ ఉన్న రఘునాథ్ జీ ఆలయం వెయ్యేళ్లు పైబడిన నిర్మాణం. అలకనంద–భాగీరధి సంగమ స్థలికి ఎగువ భాగాన ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు విజయంతో అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ ప్రకృతి చాతుర్యం అలకనంద– భాగీరథి నదుల సంగమం. అలకనంద నీరు మట్టితో కలిసి గోధుమరంగులోనూ, భాగీరథి నీరు ఆకు పచ్చరంగులోనూ ఉంటాయి. ఈ రెండింటి కలయిక తర్వాత ఈ ప్రవాహాన్ని గంగానదిగా పిలుస్తారు.ఉత్తుంగ తరంగంరిషికేశ్కి ఉన్న పౌరాణికప్రాస్త్యంతో పాటు భౌగోళిక వైశిష్ట్యం కూడా పెద్దదే. దేవప్రయాగ నుంచి గంగానది రిషికేశ్‌కి వచ్చేటప్పటికి ప్రవాహం ఉదృతంగా ఉరకలెత్తుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా నీరు ఇక్కడ అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి. అలకనంద– భాగీరథి నదుల నీటిలో కనిపించే పచ్చరంగు, బురద రంగు ఛాయలు కూడా కనిపించవు. రిషికేశ్ రివర్ రాఫ్టింగ్‌కి అద్భుతమైన ప్రదేశం. రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేయించే ఆపరేటర్లు ఉంటారు. రాఫ్టింగ్ మెళకువలు నేర్పించి రోడ్డు మార్గాన రిషికేశ్ ఎగువప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ నదిలో వదులుతారు. ప్రవాహంతో పాటుగా కేరింతలు కొడుతూ ఒక్కో రాఫ్టింగ్ బోట్ పరుగులు తీస్తుంటుంది. రిషికేశ్‌లో గంగానది ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు చేరడానికి ఒక వంతెన ఉంటుంది. దానిని లక్ష్మణ్ ఝాలా అంటారు. సీతాదేవి నదిని దాటడం కోసం లక్ష్మణుడు చెట్ల తీగలు, వేళ్లతో వంతెన ఏర్పాటు చేశాడని చెబుతారు. ఇప్పుడు మనకు కనిపించే ఇనుప వంతెనను బ్రిటిష్ పాలకులు నిర్మించారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో వేళ్లు, చెట్ల తీగల వంతెన పర్యాటకుల తాకిడికి కుంగిపోవడంతో ఇనుప వంతెన నిర్మించారు. రిషికేశ్ కి ఒక కిలోమీటరు దూరాన రాముడు కట్టిన వంతెన ఉంటుంది. దాని పేరు రామ్‌ఝాలా.బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హరిద్వార్‌లో సైట్ సీయింగ్. మానసదేవి ఆలయ దర్శనం. సాయంత్రం గంగాహారతి, షాపింగ్, రాత్రి బస.నిర్మల గంగహరిద్వార్లో గంగానది నిర్మలంగా ప్రవహిస్తుంటుంది. నగరంలో మోటారు వాహనాలను అనుమతించరు. గంగానది ఒక ఘాట్ నుంచి మరొక ఘాట్‌కు వెళ్లడానికి ఎలక్ట్రిక్ ఆటోలుంటాయి. చండీదేవి ఆలయానికి వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. రోప్‌వే మీద ప్రయాణిస్తూ గంగానది ఏరియల్ వ్యూ చూడడం మర్చి΄ోవద్దు. మానసాదేవి ఆలయం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవ్చు. సాయంత్రం గంగాహారతి వీక్షణం కనువిందు చేస్తుంది. నాలుగు గంటలకే ఘాట్‌కు చేరితే హారతి మొదలయ్యే లోపు వెలుతురు ఉండగానే కలియతిరగవచ్చు. షాపింగ్ కూడా అప్పుడే పూర్తి చేసుకోవాలి. హారతి తర్వాత చీకటి పడుతుంది. కాబట్టి నేరుగా గదికి రావడమే ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఘజియాబాద్‌కు ప్రయాణం. ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో నిర్వహకుల బాధ్యత పూర్తవుతుంది. పర్యాటకులు విమానం ఎక్కి చెన్నైకి రావడంతో చార్ధామ్ యాత్ర పూర్తవుతుంది. ఐఆర్సీటీసీ నిర్వహించే చార్ధామ్ యాత్ర ఈ నెల 22వ తేదీ న మొదలవుతుంది. సెప్టెంబర్ మూడవ తేదీ తో పూర్తవుతుంది. ఈ పర్యటనలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ ప్రదేశాలను దర్శించుకోవచ్చు.ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న చార్ధామ్ యాత్ర హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ఈ పన్నెండు రోజుల టూర్ సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందులో ఒక్కొక్కరికి దాదాపుగా అరవై వేల రూపాయలవుతుంది. ప్యాకేజ్ ఇలాగ: సింగిల్ ఆక్యుపెన్సీలో దాదాపు 70 వేల రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి అరవై వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 58 వేలకు పైగా అవుతుంది. ఇది ఫ్లయిట్ జర్నీ: విమానం 22వ తేదీ ఉదయం 5.50 నిమిషాలకు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతుంది. ఎనిమిదిన్నరకు ఘజియాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఘజియాబాద్ నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరి ఆరు గంటల పది నిమిషాలకు చెన్నై చేరుతుంది.యమునోత్రి యమునానది పుట్టిన ప్రదేశం. ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు – వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...
దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్‌లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్‌లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్‌లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు బ్రాండ్ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి. బల్క్ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు కో–ప్రాసెసర్లు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి గెజిట్–నోటిఫైడ్ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్ స్పోర్ట్స్ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్‌లలో వాహనాలను నడపడం రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్..(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..) -
ట్రావెల్ థెరపీ.. ఒంటికి ఆరోగ్యం.. మనసుకు ఉత్సాహం..
ఒంట్లో బాలేనపుడు.. మనసుకు ముసురు పట్టినపుడు డాక్టర్లు రకరకాల చికిత్స విధానాలు చెబుతుంటారు.. వాటర్ థెరపీ.. ఫిజియోథెరఫీ. .. ఆయిల్ పుల్లింగ్ .. మడ్ బాత్.. ఇవన్నీ ఒకలాంటి థెరఫీలే.. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా.. ప్రాణాయామం.. ఇలా రకరాలకు ఉంటాయి మరి.. ఎవరివీలును బట్టి వాళ్ళు ఆయా చికిత్సా విధానాలు పాటిస్తారు.. ఇయన్నీ ఒకెత్తు..ఒక్కోసారి.. మనసుకు ముసురుపడుతుంది.. ఎదురుగా ఏముందో కనిపించదు.. ఏం జరుగుతుందో వినిపించదు.. ఒక్కోసారి జీవితం చాన్నాళ్లుగా మూత విప్పని పచ్చడి బాటిల్ మాదిరి నిల్వ వాసన వస్తుంది.. కరకరలాడాల్సిన బిస్కెట్లు మెత్తబడినట్లు ఫీల్. .. జీవితం అంటే ఉద్యోగం.. వ్యాపారం.. తిండి.. నిద్ర.. అంతే ఉంటుంది.. ఎందుకు బతుకుతున్నామో తెలియదు.. అసలిది ఒక బతుకేనా అనే సందేహం.. జీవితం అనే బండి మనం నడుపుతున్నట్లు వెళ్తుందా.. ఆటో మోడ్ లో పెట్టేస్తే అది తనకు నచ్చినట్లు వెళ్తుందా అనే సందేహం కూడా వస్తుంది. అలాంటపుడు పైన చెప్పిన అన్ని థెరఫీలకన్నా ఈ ట్రావెల్ థెరపీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. దీనికి ఏ డాక్టర్ అక్కర్లేదు.. మనమే ప్రాక్టీస్ చేయొచ్చు.. లేదా తోడుగా ఎవరైనా ఉంటే మంచిదే.. ఇదెలా ప్రాక్టీస్ చేయాలి... అన్ని రకాల చికిత్సా విధానాల మాదిరిగానే ఈ ట్రావెల్ థెరపీ కూడా ప్రత్యేకంగా మనసుకు ప్రత్యేకం. .. ముసురుపట్టిన మనసుకు దుమ్ము వదిలిస్తుంది... మసకబారిన కళ్ళకు స్పష్టత ఇస్తుంది.. శరీరానికి ఉత్సాహాన్ని.. కిక్కును ఇస్తుంది.. ఇది సాధన చేయడం కూడా సులువే... పెద్దగా ఏం లేదు.. ముందుగా ఏదో ఒక ఊరు.. ఒక లోకేష్ సెలెక్ట్ చేసుకుని ట్రైన్/ బస్సు/ ఫ్లయిట్ టిక్కెట్లు తీసుకుని ఒక జబ్బ సంచిలో రెండు మూడు జతల బట్టలు.. గట్రా గట్రా కుక్కుకుని వెళ్లిపోవడమే. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకువెళ్తుంటే మన సమస్యలు.. చికాకులు అదే వేగంతో వెనక్కి వెళ్లిపోతున్నా ఫీలింగ్. .. కో ప్యాసింజర్లను ..వారి నడవడిక.. తీరు .. చూస్తుంటే ఏదో కొత్త విషయం చూస్తున్న భావన... సరికొత్త ప్రదేశాలు చూస్తుంటే ఏదో నేర్చుకుంటున్న ఫీల్.. చిన్నపుడు జాగ్రఫీలో విన్న పేరున్న ఊరికి వెళ్తే అబ్బా నేనూ ఒక సాహసికుడినే అన్న కించిత్ గర్వం.. సోషల్ పుస్తకంలో చదివిన నదిలో మునకేస్తే వయసు హఠాత్తుగా పాతికేళ్ళు తగ్గిపోవడం తథ్యం.హిస్టరీ మాష్టర్ చెప్పిన చారిత్రక కట్టడాన్ని నేరుగా చూస్తే దాన్ని మనమే కట్టినంత సంబరం... లోకంలో మన ఊరే కాదు.. చాలా ఊళ్ళున్నాయి.. మన చుట్టూరా ఉన్న జనాలే కాదు చాలా మంది ఉన్నారు.. ఈ విషయం నేను కొత్తగా కనిపెట్టాను అనే భావన.. పఠనం.. పయనం .. ఈ రెండూ మనసుకు ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి.. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ రెండూ మానొద్దు.. డబ్బుల్లేవని చికిత్స మానేయలేం.. డబ్బుల్లేవని ఆస్పత్రికి వెళ్లడం ఆపలేం.. సెలవుల్లేవని చికిత్సను ఆపలేం.. అలాగే డబ్బుల్లేవని ప్రయాణాలు కూడా మానొద్దు.. అప్పుచేసైనా ఆస్పత్రికి ఎలా వెళ్తామో ప్రయాణానికి కూడా వెళ్లాల్సి.. నేను బిజీ అనే భ్రమల్లోంచి రావాలి. .. సెలవుల్లేవు .. నేను బిజీ అనే ఆలోచనలలైన్లను డిలీట్ చేయాలి.. మిత్రులను కలవడం.. వారితో కబుర్లు..ముచ్చట్లు.. ఇవన్నీ మనసుకు ఔషధాలే .. కాదనలేని సత్యంసైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మరి అన్ని వైద్యవిధానాలకు ఉన్నట్లే ఈ ట్రావెల్ థెరఫీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. కాకుంటే అవి మన శరీరం నుంచి కాకుండా మన సైడ్ ఉన్న బంధుమిత్రుల నుంచి వస్తాయి.. వీడికి ఇల్లు సంసారం తిన్నగా ఉండదు.. పైగా చేతిలో అప్పులున్నాయి కానీ షికార్లకు లోటుండదురా ... అబ్బా వీడికి మూణ్నెళ్లకు ఒక టూర్ ఉండాల్సిందే... వీడికి తడి తక్కువ.. తమాషా ఎక్కువ.. మమ్మల్ని తీసుకెళ్లచ్చుగా .. ఏదైనా నీలాగా బతకడం కష్టం మామా.. ఇలా రకరకాల కామెంట్ల రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .. అలాగని మన పయనం ఆగొద్దు.. ఎవరికీ సమాధానం చెప్పొద్దు.. మెడిసిన్ కూడా అంతేగా... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదాని మందులు మానేయలేం.. అలాగే మనసుకు థెరఫీ కావాలంటే ప్రయాణాలు చేయాలి.. కాస్త డబ్బుల పరిస్థితి చూసుకుని తరచూ చిన్నదో పెద్దదో టూర్ వేస్తుండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. కొప్పెర గాంధీ ట్రావెల్ థెరఫిస్ట్ -
ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.కీలక ఆంక్షలు ఇవే..పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.ఇదంతా ఎందుకంటే..తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.ఆంక్షల పరిధి, ప్రభావంచైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. -
గయ నుంచి అయోధ్య దాకా... మనోరథ వీక్షణం
యూపీ... బిహార్... ఒడిశా... జార్ఖండ్... వెస్ట్‌బెంగాల్.ఈ టూర్లో... ఈ రాష్ట్రాలన్నింటినీ టచ్ చేయవచ్చు. రైలు ప్రయాణంలో మధ్యప్రదేశ్ కూడా పలకరిస్తుంది. గయలో విష్ణు పాదాన్ని దర్శించుకోవడంతో మొదలు. పూరీ జగన్నాథుడు...కోణార్క్ సూర్య భగవానుడు. గంగాసాగర కపిలమునీశ్వరుడు...కోల్కతాకాళిక. బైద్యనాథుడు... విశ్వనాథుడు... బాలరాముడు. వీరంతా పర్యటన ఆద్యంతం అలరించే దైవాలు. గంగలో పాద ప్రక్షాళనం సరయులో ముఖ ప్రక్షాళనం. పర్యాటకులను పునీతభావనలో ముంచే ధార్మికతలివి. మనోరథం ఆకాంక్షలను తీర్చే రైలు రథ యాత్ర ఇది. 1 వ రోజు : ఉదయం ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. గ్వాలియర్, వీరాంగణ లక్ష్మీబాయ్, ఓరై, కాన్పూర్, లక్నో మీదుగా రాత్రికి అయోధ్య కంటోన్మెంట్ చేరుతుంది. 2వ రోజు : భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తెల్లవారు జాముకు కాశీకి చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవడం, రిఫ్రెష్మెంట్ తర్వాత గయలోని విష్ణుపాదం ఆలయం, స్థానిక ఆలయాల దర్శనం. రాత్రికి రైలెక్కి పూరీకి సాగిపోవడం.ఫాల్గు తీరాన విష్ణుపాదంవిష్ణుపాద ఆలయం నిర్మాణపరంగా చాలా ప్రత్యేకం. ఇది బీహార్ రాష్ట్రంలో రాజధాని నగరం పట్నాకి వంద కిలోమీటర్ల దూరాన గయలో ఉంది. ఇక్కడ పిండప్రదానం చేస్తారు. రామాయణకాలంలో రాముడు, సీత ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణం దేవి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించిన ఆలయం. ఆమె ఇందోర్ రాణి. క్రీ.శ 1787లో ఫాల్గునది తీరాన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు మంచి రాయి కోసం అన్వేషణ జరిగింది. గయ జిల్లాలోని బథని గ్రామంలోని పర్వతం నుంచి చక్కటి బ్లాక్ గ్రానైట్‌ని గుర్తించారు. రాజస్థాన్ నుంచి శిల్పకారులను రప్పించారు. ఆ శిల్పకారులు ఆలయ నిర్మాణం కోసం నివసించిన గ్రామం పేరు పత్తర్కట్టి. ఇప్పుడది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. గయాసురుడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి హతమార్చిన ప్రదేశం అని స్థలపురాణం. ఆ సందర్భంలో విష్ణువు తన పాదాన్ని గయాసురుడి ఛాతీ మీద పెట్టి అతడిని అదిమేశాడని, ఆ ప్రదేశంలో భూమి మీద విష్ణువు పాద ముద్ర నిలిచిపోయిందని చెబుతారు. అందుకు ఆనవాలుగా పెద్ద పాదాన్ని చూపిస్తారు. గయ అనగానే బుద్ధుడు గుర్తుకు వస్తాడు. అయితే ఆ గయ ఈ గయ ఒకటి కాదు. ఈ గయకు పదిహేను కిలోమీటర్ల దూరాన బో«ద్‌గయ ఉంది. అది బుద్ధుడికి జ్ఞానోదయమైన గయ అది. ఈ పర్యటనలో ఆ ప్రదేశాన్ని అక్కడి బోధివృక్షాన్ని, బుద్ధుని భారీ విగ్రహాన్ని, వివిధ దేశాల నమూనా బౌద్ధ చైత్యాలను చూడవచ్చు. 3వ రోజు: మధ్యాహ్నానికి రైలు పూరీకి చేరుతుంది. జగన్నాథ ఆలయ దర్శనం, రాత్రి బస రైల్లోనే. రైలు పూరీ స్టేషన్లోనే ఉంటుంది.సర్వం పూరీ జగన్నాథంజగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రం, పూరీ పట్టణంలో ఉంది. పురాణ కాలం నుంచి ఇక్కడ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితోపాటు అతడి అన్న బలభద్ర (బలరాముడు), చెల్లి సుభద్రల విగ్రహాలు పూజలందుకుంటాయి. ఇక్కడి దేవతా విగ్రహాలు రాతివి కాదు, దారు శిల్పాలు. మాల్వ రాజు ఇంద్రద్యుమ్నుడు ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు కలలో కనిపించి సముద్రంలో తేలుతూ వచ్చిన కర్రదుంగతో విగ్రహాలు చేయించమని చెప్పాడని, ఆ మేరకు రాజు బంగాళాఖాతం తీరంలో ఎదురు చూడగా ఒక వేప దుంగ కొట్టుకు వచ్చిందని, దానిని సేకరించి విగ్రహాలు తయారు చేయించాడని చెబుతారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణాన్ని క్రీ.శ పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ నిర్మించాడు. ఈ ఆలయంలో పూజాదికాలు నిర్వహించేది భిల్లు శబర జాతి ఆదివాసీలు. పూరీ జగన్నాథుని రథయాత్ర దేశమంతటా ప్రసిద్ధి. సర్వజన సమానత్వానికి ప్రతీక ఈ ఆలయం. కులాలు, జాతులు, పేదగొప్ప తేడా లేకుండా భక్తులంతా సమానమే. ఈ ఆలయం గొప్పదనం పాటించడం. అయితే ఈ ఆలయంలోకి హిందూయేతరులకు ప్రవేశం ఉండదు. విదేశీయులతోపాటు భారతీయ జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా ప్రవేశం నిషిద్ధమే. ఈ విషయమై అనేక చర్చలు, వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. కొన్ని నియమాలననుసరించి ప్రవేశం కల్పించవచ్చనే సడలింపు ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ అవేవీ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. 4 వరోజు : కోణార్క్ ఆలయ దర్శనం తర్వాత రైలు కోల్‌కతాకు బయలుదేరుతుంది.కోణార్క రథాలయంరథం ఆకారంలో ఉన్న ఈ సూర్యదేవాలయం ఒక ఖగోళ విజ్ఞాన భండారం. క్రీ.శ 13వ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ కౌశలం దాడుల్లో ధ్వంసమైపోగా మిగిలిన ఉన్న ఆనవాళ్లలో నాటి శిల్పుల నైపుణ్యాన్ని వెతుక్కుంటూ ఆనందించడమే మిగిలింది. యునెస్కో ఈ ఆలయాన్ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సూర్యదేవాలయం ఒడిశా, పూరీ జిల్లాలో ఉంది కోణార్క్ లో ఉంది. ఈ ప్రాంగణంలోని ఛాయాదేవి ఆలయం కూడా అద్భుతమైన నిర్మాణమే. ధ్వంసమై΄ోయిన వైష్ణవాలయం శిథిలాలను దగ్గరగా వెళ్లి చూస్తే నాటి ఇటుకల సైజు, వాస్తుశైలి అర్థమవుతాయి. ఇక్కడ ప్రదర్శించే లేజర్ షోలో ధ్వంసమైన ఆలయాల పూర్తి రూపాన్ని చూడవచ్చు. 5వ రోజు : ఉదయం రైలు కోల్‌కతాకు చేరుతుంది. రైలు దిగి గంగాసాగర్‌కు ప్రయాణం. కపిలముని ఆశ్రమం పర్యటన తర్వాత రాత్రి బస గంగాసాగర్‌లో.గంగ భూమ్మీదకొచ్చిందిపురాణాల్లో కపిలముని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గంగ భూమ్మీదకు రావడానికి కారణభూతులు కపిలముని. స్థానిక కథనాల ప్రకారం ఆ కపిలముని ఆశ్రమమే ఇది. స్థానిక రాజు సాగరుడు అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి దానిని కపిలముని ఆశ్రమ ప్రాంగణంలో కట్టి వేసి తాను దాక్కున్నాడు. అశ్వం కోసం రాజు తన అరవైవేల మంది కొడుకులను పంపించాడు. వారు అశ్వాన్ని వెదకుతూ వచ్చి కపిలముని ఆశ్రమంలో గుర్తించారు. కపిలముని అశ్వాన్ని దొంగలించాడని ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన కపిలముని వారిని తన తపశ్శక్తితో భస్మం చేశాడు. వారి ఆత్మలు నరకంలో కొట్టుమిట్టాడుతున్నాయని, వారిని స్వర్గానికి పంపించాలంటే ఎలా అని మునిని అడిగినప్పుడు... గంగ దివి నుంచి భువికి దిగి వచ్చి చితాభస్మాలను తడుపుతూ ప్రవహించినప్పుడు వారికి శాపవిమోచనం జరుగుతుందని చెప్పాడు. సాగరుడి వంశంలో తరువాతి తరాలకు చెందిన భగీరథుడు ఆ పనికి పూనుకున్నాడు. భగీరథుడి ప్రయత్నంతో గంగ నేలకు దిగి వచ్చిన ప్రదేశమే ఈ గంగాసాగర్. గంగ భూమ్మీదకు వచ్చిన రోజు మకర సంక్రాంతి. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు ఇక్కడ గంగామాతకు విశేష పూజలు చేస్తారు. కపిల ముని ఆశ్రమం వెస్ట్‌బెంగాల్, సౌత్ 24 పరగణాస్ జిల్లా, గంగాసాగర్ గ్రామంలో ఉంది. 6వ రోజు : గంగాసాగర్ నుంచి కోల్‌కతాకు రావడం. కాలీమాత ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు జసిదిహ్ వైపు సాగిపోతుంది.కాళిక శక్తిపీఠంకాళీమాత ఆలయం కలకత్తా కాళిగా దేశమంతటికీ ప్రసిద్ధి. ఇది 51 శక్తిపీఠాల్లో ప్రత్యేకమైన శక్తిపీఠం. వెస్ట్‌బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఉంది. ఈ ఆలయం ఆదిగంగానది తీరాన ఉంది. ఆది గంగా నది అంటే గంగోత్రిలో ఉద్భవించిన గంగానది కాదు. ఇది హుగ్లీ నది మూల స్థానం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం రెండు వందల యేళ్ల కిందట నిర్మించినది. కాళీమాత మొదట గుడిసె వంటి చిన్న కప్పుతో కూడిన నిర్మాణం ఉండేది. కాళీ మాత విగ్రహం మనిషి ఆకారంలో ఉండదు. ఒక రాతికి మూడు విశాలమైన బంగారు కళ్లు, పొడవైన నాలుక, నాలుగు చేతులు ఉంటాయి. కాళీమాత ఆకారం ఇలా ఉండడానికి కారణంగా ఒక కథనం చెబుతారు. శివుడు తాండవం చేసి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని పయనిస్తున్న సమయంలో ఆమె కుడికాలి బొటనవేలు దేహాన్ని వీడి కింద పడి΄ోయిందని, ఆ వేలు పడిన ప్రదేశం ఇదని చెబుతారు. అందుకే కాళికామాత విగ్రహం మనిషి రూపంలో ఉండదు, బొటనవేలి ఆకారంలోనే ఉంటుంది. ఈ ఆలయ వీక్షణానికి కేవలం దర్శనం చేసుకుని వచ్చే సమయాన్ని మాత్రమే కేటాయించుకుంటే సరి΄ోదు. కాళికా మాత ఆలయం లోపల నట్ మందిర్, జోర్ బంగ్లా, సోస్థి తాలా, హర్కాత్ తాలా, రాధాకృష్ణ ఆలయం, నకులేశ్వర్ మహాదేవ్ఆలయం, కాకు కుండ్లు ఉంటాయి. ప్రశాంతంగా దర్శనం చేసుకుని, ఆధ్యాత్మికతను ఆస్వాదించాలంటే మూడు గంటల సమయం పడుతుంది.7వ రోజు: తెల్లవారు జాముకు రైలు జసిదిహ్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవడం. ఆ తర్వాత వైద్యనాథ్ ఆలయ దర్శనం. రాత్రికి రైలెక్కిన తర్వాత రైలు వారణాసికి సాగిపోతుంది.జార్ఖండ్ బైద్యనాథుడుదక్షిణాది వాళ్లకు బైద్యనాథ ఆలయం అనగానే మహారాష్ట్ర, పర్లిలో ఉన్న బైద్యనాథ ఆలయమే గుర్తుకు వస్తుంది. ఇది జార్ఖండ్, సంతాల్ పరగణా, దియోఘర్‌లో ఉన్న బైద్యనాథ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. పురాణాల ప్రకారం రావణాసురుడు హిమాలయాల్లో శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాక΄ోవడంతో తన ఒక్కో తలనూ ఖండిస్తూ తొమ్మిది తలలను ఖండించుకున్నాడు. చివరికి పదవ తలను ఖండించబోతున్న క్షణంలో శివుడు ప్రత్యక్షమై వరమిస్తాడు. కోరిన కోరికలు తీర్చే కామ్న లింగాన్ని ప్రసాదిస్తే దానిని శ్రీలంకకు తీసుకెళ్తానని అడుగుతాడు రావణుడు. అలాగే శివుడు కామ్నలింగాన్నిస్తాడు. శ్రీలంక వెళ్లే వరకు మధ్యలో ఎక్కడా నేల మీద పెట్టకూడదనే నియమాన్ని కూడా చెబుతాడు. కామ్నలింగంతో బయలుదేరిన రావణాసురుడు జార్ఖండ్, దియోఘర్‌లో ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి సంద్యాక్రతువుల సమయమవుతుంది. ఒక గొర్రెల కాపరికి ఆ లింగాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు నేల మీద పెట్టవద్దని కోరుతాడు. అలాగేనని తీసుకున్న ఆ పశువుల కాపరి రావణాసురుడు రావడం ఆలస్యం కావడంతో ఆ శివలింగాన్ని నేల మీద పెట్టి వెళ్లి పోతాడు. భయంకరమైన వర్షం కారణంగా రావణాసురుడు తిరిగి రావడం ఆలస్యమైంది. ఆ అకాలవర్షానికి కారణం విష్ణువు మాయోపాయమేనని గ్రహిస్తాడు. ఆ లింగాన్ని పెకలించి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ సాధ్యం కాదు. ఇక చేసేదేమీ లేక వెళ్లిపోతాడు. ఆ కామ్నలింగం ఉన్న ప్రదేశం కావడంతో దీనికి జ్యోతిర్లింగ క్షేత్రమైంది. 8వ రోజు ఉదయానికి వారణాసికి చేరుతుంది. విశ్వనాథుని దర్శనం తర్వాత రాత్రి బస వారణాసిలో. లయకారుని నిలయంకాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగ దర్శనం, గంగాహారతి వీక్షణంతోపాటు విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి అమ్మవార్ల ఆలయాలు, కాలభైరవ మందిరాలను కూడా దర్శించుకోవాలి. వీటన్నింటికీ ప్రత్యేకమైన ప్రాశస్త్య్రం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న విశ్వనాథుడి మందిరం కొత్తది. యూపీలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో ఈ ఆలయం అసలు పేరు ఆది విశ్వేశ్వరాలయం. భారత్ మీదకు దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అక్బర్ ఆస్థానంలో ఉన్న మొదటి మాన్సింగ్, తోడరమల్లు దీనిని పునర్నిర్మించారు. 17వ శతాబ్దం అంటే ఔరంగజేబు పాలన కాలంలో మరోసారి ఆటు΄ోట్లను ఎదుర్కొన్నదీ ఆలయం. హిందూ ఆలయాన్నింటినీ కూల్చేయమన్న ఆదేశం మేరకు జరిగిన విధ్వంసంలో ఇది ్ ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ ప్రాంగణంలో జ్ఞానవాపి మసీదు వెలిసింది. 18వ శతాబ్దంలో ఇందోర్ రాణి అహిల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న నిర్మాణం విశాలంగా అధునాతనంగా ఉంది. దీనిని 2021లో విస్తరించారు. లయకారుని ఆలయం ఇన్ని దఫాలుగా లయమైపోతూ తిరిగి ఆలయంగా మారుతూ వచ్చింది. 9 వరోజు : ఉదయం రైలు అయోధ్యవైపు సాగుతుంది. అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ గరితోపాలు ఇతర ఆలయాల దర్శనం. సరయు నదిలో హారతి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలైనట్లే.రామ్‌లల్లా ఏడాదిన్నరగా దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆలయం రామ్‌లల్లా ఆలయం. అదే అయోధ్య రామమందిరం. రోజుకు లక్ష మంది దర్శించుకుంటున్నారు. ఆ సంఖ్య పర్వదినాల్లో ఒకటిన్నర లక్షకు చేరుతోంది. బాబర్ కాలంలో మసీదు రూపం సంతరించుకుని, బ్రిటిష్ పాలనకాలం తర్వాత స్వతంత్ర భారతంలో ప్రతీకాత్మకంగా రాముడు, సీత విగ్రహాలను ప్రతిష్ఠించుకుని, ముప్పై మూడేళ్ల కిందట విధ్వంసానికి గురయ్యి న్యాయస్థానం తీర్పుతో తిరిగి రూపుదిద్దుకున్న ఆలయం ఇది. ఇందులో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం ఆకట్టుకుంటుంది. దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డగా భావించేటట్లు ఉంటుంది రాముడి రూపం. కళ్లు మూసుకుని మొక్కుకోవడమే కాకుండా కళ్లారా చూడాల్సిన రూపం. ఆలయ నిర్మాణం కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత హనుమాన్ ఘరి దర్శనం, సరయు తీర విహారం ఆహ్లాదకరంగా సాగుతాయి.10వ రోజు : ఉదయానికి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లక్నోకు చేరుతుంది. అదే రోజు అంటే 22వ తేదీన కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయ్, గ్వాలియర్, ఆగ్రా కంటోన్మెంట్‌కు చేరడంతో పర్యటన పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ నిర్వహించే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ‘పూరీ కోల్‌కతా గంగాసాగర్ యాత్ర (ఎన్జెడ్బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్‌కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్‌కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్ (స్లీపర్) లో ఒక్కొక్కరికి దాదాపు 19 వేల రూపాయలవుతాయి. గమనిక: లక్నో, కాన్పూర్, ఓరై, వీరాంగణ లక్ష్మీబాయి, గ్వాలియర్ స్టేషన్ల మీదుగా పర్యటన సాగుతుంది. ఇక్కడి పర్యాటక ప్రదేశాల సందర్శన ఈ ప్యాకేజ్‌లో లేదు. ఈ టూర్లో బుక్ చేసుకున్న పర్యాటకులు ఆగ్రా స్టేషన్‌కు వెళ్లాల్సిన తప్పనిసరేమీ ఉండదు. పై స్టేషన్లలో ఎక్కడైనా రైలెక్కవచ్చు, దిగవచ్చు. ఐఆర్సీటీసీ నిర్వహించే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ‘పూరీ కోల్‌కతా గంగాసాగర్ యాత్ర (ఎన్జెడ్బీజీ62)’ చేయవచ్చు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మొదలై తిరిగి అదే స్టేషన్‌కు చేరే ఈ పది రోజుల యాత్రలో గయ, గంగాసాగర్, కోల్‌కతా, పూరీ, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్యలను చూడవచ్చు. టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 40 వేల మూడు వందలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 30 వేల ఐదు వందలు, ఎకానమీ క్లాస్ (స్లీపర్) లో ఒక్కొక్కరికి దాదాపు 19 వేల రూపాయలవుతాయి. ఈ ట్రిప్ ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మొదలవుతుంది. ప్యాకేజ్కోడ్ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=NZBG62& – వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్‌లోని భారతీయులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్‌కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్‌లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.గత కొన్ని వారాలుగా ఇరాన్లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో సూచించింది. ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది. pic.twitter.com/boZI4hAVin— India in Iran (@India_in_Iran) July 15, 2025ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్‌పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
Travel కశ్మీర్ లోయలో సూర్యోదయం
14 వేల అడుగుల ఎత్తులో ప్యాంగాంగ్ ఉప్పు నీటి సరస్సు. సరస్సు నీటి మీద సూర్యోదయం సూర్యాస్తమాల వీక్షణం. పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ తొలి గ్రామం టర్టక్. బుద్ధుని అవశిష్ట స్థాపితమైన ధవళకాంతుల శాంతి స్థూపం.తొమ్మిది అంతస్థుల నిర్మాణం లాంచెన్ పాల్కర్ ప్యాలెస్. సియాచిన్ వార్ మెమోరియల్... హండర్ సాండ్ డ్యూన్స్. ఇవన్నీ లధాక్, లే పట్టణం... ఆ పరిసరాల్లోనే ఉన్నాయి.హైదరాబాద్ నుంచి లే పట్టణానికి ప్రయాణం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 6ఉ 2056/6821 విమానం ఉదయం 7.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు లేకు చేరుతుంది. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి హోటల్ గదిలో చెక్ ఇన్. లే సముద్రమట్టం కంటే 11,500 అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి మారిన వాతావరణానికి అనుగుణంగా దేహం తనను తాను సరిచేసుకోవడం కోసం ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆక్సిజెన్ స్థాయులకు తగినట్లు దేహం సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుంది. వయసులో ఉన్న వాళ్లు త్వరగా అడ్జస్ట్ అవుతారు. వీలయితే మార్కెట్, బజారులో ప్రశాంతవిహారాన్ని ఆస్వాదించవచ్చు.రాత్రి బస లేహ్‌లోనే.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సైట్‌సీయింగ్‌కి బయలుదేరాలి. లేæ పట్టణంలోని శాంతిస్థూప, లేక్ ప్యాలెస్‌ల సందర్శనం. ఆ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’, గురుద్వారా పథేర్ సాహిబ్, మాగ్నటిక్ హిల్, సింధు నది– జన్సార్ నదుల సంగమ స్థలి, ఆల్చి మోనాస్ట్రీ దర్శనం తర్వాత తిరిగి లేహ్ పట్టణానికి వచ్చి రాత్రి బస చేయాలి.శాంతికి ఇందిరా గాంధీ చేయూతబుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్టించి నిర్మించిన స్థూపం ఇది. బౌద్ధం ప్రపంచ శాంతిని కోరుతుంది. లధాక్ కేంద్రపాలిత ప్రాంతం(ఉమ్మడి కశ్మీర్), లే పట్టణంలో బౌద్ధులు శాంతికి చిహ్నమైన ధవళ స్థూపాన్ని నిర్మించాలని తలపెట్టారు. వారికి జపాన్‌లోని బౌద్ధులు ఆర్థిక సహాయం చేశారు. మనదేశంలోని ఇతర రాష్ట్రాల బౌద్ధులు కూడా తమవంతు సహాయం చేశారు. ఈ నిర్మాణాన్ని 1983లో తలపెట్టారు. దారి తోవ లేని ఈ ప్రదేశానికి వాహనాలు వెళ్లడం కోసం రోడ్డు నిర్మాణానికి నిధులను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శాంక్షన్ చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి మెటీరియల్ సమకూర్చింది. బౌద్ధావలంబకులతోపాటు భారత ఆర్మీ జవానులు కూడా ఈ నిర్మాణం కోసం శ్రమదానం చేశారు. ఈ స్థూపం లే పర్యాటకానికి కేంద్రబిందువైంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం అందంగా ఉంటాయి. సూర్యకిరణాలు చుట్టూ ఉన్న మంచు పర్వతాల మీద ప్రతిబింబిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి.లే రాజమందిరంలే పట్టణంలో ఉంది కాబట్టి లే ప్యాలెస్ అంటారు, కానీ దీని అసలు పేరు లాంచెన్పాల్కర్ ప్యాలెస్. క్రీ.శ 1600 నాటి నిర్మాణం. బయటి నుంచి చూస్తే రాయి మీ రాయి పెట్టి నిటారుగా ఎటువంటి సృజనాత్మకత లేని నిర్మాణం అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న పెయింటింగ్స్ చూస్తే ప్రపంచంలోని క్రియేటివిటీని రాశిపొఓసినట్లు అనిపిస్తుంది. పెయింటింగ్స్‌లో రంగుల కోసం జాతిరాళ్ల చూర్ణాన్ని అద్దారు. ఇది తొమ్మిది అంతస్థుల రాజమందిరం. కింది అంతస్థుల్లో గుర్రపుశాలలు, ధాన్యం నిల్వ చేసే గదులు. పై అంతస్థుల్లో సెంగె నమ్గ్యాల్ రాజ కుటుంబం నివసించేది. డోంగ్రా జాతి ఉద్యమకారులు ప్యాలెస్‌ను ఆక్రమించుకోవడంతో రాజకుటుంబీకులు ఈ ప్రదేశానికి 15 కిలోమీటర్ల దూరాన స్టోక్ అనే ప్రదేశంలో ఉన్న రాజమందిరానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ ప్యాలెస్ పాడుపడింది. ఇప్పుడు నిర్వహణ బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుని పునరుద్ధరిస్తోంది. ఈ ప్యాలెస్ నుంచి కశ్మీర్ మంచుకొండలు కనువిందు చేస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టర్టక్ గ్రామానికి ప్రయాణం. దారిలో సియాచిన్ వార్ మెమోరియల్ దర్శనం, థాంగ్ జీరో పాయింట్ వీక్షణం. మధ్యాహ్న భోజనం టర్టక్ గ్రామంలో. బాల్టీ హెరిటేజ్ హౌస్, మ్యూజియం, నాచురల్ కోల్డ్ స్టోరేజ్ ప్లేస్ (ఫ్రీజింగ్ పాయింట్), సాయంత్రం కల్చరల్ షో తర్వాత రాత్రి బస నుబ్రా వ్యాలీలో. తెల్లవారు జామునే నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్ చేసి లేహ్‌లో గది చెక్ అవుట్ చేసి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాలి. 6ఉ 6822/6217 విమానం మధ్యాహ్నం 13.30 గంటలకు లేహ్‌లో బయలుదేరి 19.15 గంటలకు హైదరాబాద్‌కి చేరుతుంది. యుద్ధం... మరపురాని జ్ఞాపకం!సియాచిన్ వార్ మెమోరియల్ సియాచిన్ బేస్ క్యాంపు దగ్గర ఉంది. ఇది దేశం కోసం అసువులు బాసిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం.ఈ నేల మనదే!టర్టక్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనదేశపు చివరి గ్రామంగా గుర్తిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టిబెట్ సరిహద్దులో ఉన్న మాణా గ్రామాన్ని కూడా దేశపు చివరి గ్రామంగా గుర్తించేవారు. ఇప్పుడు మాణా గ్రామానికి తొలి గ్రామం హోదా దక్కింది. పాకిస్థాన్ సరిహద్దును తాకుతున్న టర్టక్ గ్రామం 1971 యుద్ధంలో భారత్ సొంతమైంది. బాల్టిస్థాన్ రీజియన్‌కు చెందిన ప్రదేశం. టర్టక్లో నివసించే ప్రజలు కూడా బాల్టి తెగకు చెందిన వారే. షియోక్ నది తీరాన, సియాచిన్ గ్లేసియర్‌కు ముఖద్వారం ఈ గ్రామం. ఒకసారిపాక్ పాలనలోకి వెళ్లి తిరిగి భారత్ సొంతమైన ప్రదేశంగా ఈ మట్టి మీద నడవడం గొప్ప థ్రిల్.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ త్వరగా ముగించుకుని హోటల్ గది చెక్ అవుట్ చేసి పాంగాంగ్ కి బయలుదేరాలి. ఆ రోజు పాంగాంగ్ లేక్, పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి విహారమే. రాత్రి బస కూడా అక్కడే.యుద్ధక్షేత్రాల సరస్సుపాంగాంగ్ త్సో అత్యంత విశాలమైన సరస్సు. ఉప్పునీటి సరస్సు. ఏడువందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే దాదాపు హైదరాబాద్ నగరమంత. ఈ సరస్సు యాభై శాతం టిబెట్ పరిధిలో చైనా పాలనలో ఉంది. నలభై శాతం లధాక్ పరిధిలో భారత్ పాలనలో ఉంది. మిగిలిన పదిశాతం మాత్రం భారత్– చైనాల మధ్య వివాదాస్పద ప్రదేశంగా ఉంది. ఈ నీటి స్వచ్ఛతను నీటి అడుగున ఉన్న రాళ్లు చె΄్తాయి. నీరు శీతాకాలంలో గడ్డకట్టుకుపోతుంది. బోర్డర్ టూరిజమ్ పేరుతో ఈ ప్రదేశం ఇప్పుడు పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చెందింది. భారత్ రణ్‌భూమి దర్శన్‌లో భాగంగా మిలిటరీ విభాగం యుద్ధక్షేత్రాలు, వార్ మెమోరియల్లలోకి పర్యాటకులకు అనుమతిస్తోంది.సూర్యోదయానికి ముందే నిద్రలేచిపాంగాంగ్ సరస్సు మీద సూర్యోదయాన్ని వీక్షించాలి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి లేహ్‌కు ప్రయాణం. దారిలో థిక్సీ మోనాస్ట్రీ, షే ప్యాలెస్, రాంచోస్ స్కూల్ చూసుకుని లేహ్‌కు చేరి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. ఆ రోజు సాయంత్రం సరదాగా మార్కెట్ విహారం, షాపింగ్‌లో గడపడమే.ఈశాన్యంలో సూర్యోదయంపాంగాంగ్ సరస్సు దాదాపుగా 14 వేల అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో ఎత్తైన ఉప్పు నీటి సరస్సు ఇదే. ఈ సరస్సు తీరాన్నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం అద్భుతమైన అనుభవం. అయితే సూర్యోదయాన్ని వీక్షించాలంటే ఉదయం ఐదింటికే అక్కడ ఉండాలి. అలాగే సూర్యాస్తమయం కోసం రాత్రి ఏడున్నర వరకు వేచి చూడాలి. మనకు ఉత్తరాయనం, దక్షిణాయనం ఉన్నట్లే ఈ రోజుల్లో సూర్యోదయం ఈశాన్య దిక్కులోనూ, సూర్యాస్తమయం వాయువ్య దిక్కులోనూ జరుగుతుంది. నుబ్రా మంచు పూల పరిమళంనుబ్రా అంటే పూల లోయ అని అర్థం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇలాంటి పూలలోయ ఉత్తరాఖండ్‌లో కూడా ఉంది. ఇది కశ్మీర్‌లోయలోని పూల లోయ. షియోక్ నది– సియాచిన్ ( నుబ్రాదగ్గర ఈ నదిని కూడా నుబ్రా నది అనే పిలుస్తారు, ఇదే నదిని టిబెట్‌లో యర్మా నదిగా పిలుస్తారు) నది కలిసే ప్రదేశంలో విస్తారమైన లోయ ఉంది. మనుష్యసంచారం ఉండని ఆ లోయ రకరకాల పూల చెట్లకు ఆలవాలమైంది. పదివేల అడుగుల ఎత్తులో ఒక లోయ, ఆ లోయలో పూలు... ఆ ఊహ కూడా అందంగా ఉంటుంది. ఈ లోయకు ఒక వైపు పాంగాంగ్ లేక్ ఉంది. ఒంటె మీద సాగే నుబ్రా పూలతోటలు, హండర్ గ్రామంలోని ఇసుక తిన్నెల విహారం జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం. ప్యాకేజ్ ఇలా ఉంటుంది!లే విత్ టర్టక్ ఎక్స్ హైదరాబాద్ (ఎస్హెచ్ఏ41)’ ఏడు రోజుల టూర్.ఆగస్టు 20వ తేదీ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.సింగిల్ ఆక్యుపెన్సీలో 47 వేలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 42 వేలుట్రిపుల్ ఆక్యుపెన్సీలో 41,600 రూపాయలవుతుంది. టూర్ కోడ్: LEH WI-TH TURTUK EX HYDERABAD (SHA41) ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి!హైదరాబాద్ నుంచి లేహ్, లేహ్ నుంచి హైదరాబాద్‌కి విమానం టికెట్లు.లేహ్‌లో 3 రాత్రులు, నుబ్రాలో 2 రాత్రులు, పాంగాంగ్లో ఒక రాత్రి హోటల్ గదుల బస.సైట్ సీయింగ్ ప్రయాణానికి నాన్ ఏసీ వాహనాలు, షేరింగ్ పద్ధతిలో. ఆరు రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, రాత్రి భోజనం∙ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్, కల్చరల్ షో, రోజుకో వాటర్ బాటిల్, ఐటెనరీలో సూచించిన ప్రదేశాల ఎంట్రీ టికెట్లు ప్యాకేజ్ ధరలోనే. టూర్ మేనేజర్ ఉంటారు, అత్యవసరానికి ఆక్సిజెన్ సిలిండర్ సిద్ధంగా ఉంటుంది.ఇవేవీ ప్యాకేజ్‌లో వర్తించవు!ఇంటి నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి రవాణాహోటళ్లలో లాండ్రీ, టెలిఫోన్, ఎక్స్ట్రా వాటర్ బాటిళ్లు.పర్యాటక ప్రదేశాల్లోకి వీడియో కెమెరాకు ఎంట్రీ ఫీజ్, క్యామెల్ రైడ్‌తోపాటు ఇతర వినోద కార్యక్రమాలు, ఐటెనరీలో లేని ఆహారం ఆర్డర్ చేసుకుంటే విడిగా డబ్బు చెల్లించాలి.వాతావరణం అనుకూలతలను బట్టి అవసరమైతే టూర్ ఐటెనరీలో స్వల్పమార్పులు ఉంటాయి. వాటికి సహకరించాలి. లే నుంచి నుబ్రాకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ఖర్దూంగ్లా పాస్ మీదుగా నుబ్రా వ్యాలీ చేరడం. నుబ్రాలో గదిలో చెక్ ఇన్. దీక్షిత్, హండర్ గ్రామాలు, మోనాస్ట్రీల పర్యటన. సాయంత్రం కామెల్ సఫారీని ఆస్వాదించి రాత్రి నుబ్రా వ్యాలీలో బస.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ స్థానం ..! హాట్‌టాపిక్‌గా అమెరికా వంటకాలు..
కొన్ని వంటకాలు యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ పొందుతాయి. అంతేగాదు ఆ వంటకాల కారణంగా ఆ దేశం పేరు, అక్కడ ప్రజల ఆహార విధానాలు ఫేమస్ అవుతాయి కూడా. అంతేగాదు వంటకాల కారణంగా దేశాధినేతలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాక నైపుణ్యంతో మహామహులనే మనసుదోచుకోవచ్చనే సామెత ఉండనే ఉంది కూడా. అందుకు చరిత్రలో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ట్రావెల్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యుత్తుమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో అమెరికా చేరడమే నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..ప్రపంచవ్యాపంగా ఉన్న ఆహారప్రియులు ఇష్టపడే వంటకాల ఆధారంగా ర్యాంకుల ఇచ్చి మరీ జాబితాను అందించింది. ఆ జాబితాలో గ్రీస్ 4.60 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటలీ, మెక్సికో, స్పెయిన్, పోర్చుగల్ నిలిచాయి. వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి నిలయమైన భారత్ 12వ స్థానం దక్కించుకుంది. భారతదేశంలోని వంటకాలే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలగా నిర్ణయించి మరి ఈ ర్యాంకు ఇచ్చిందట. అలాగే మన దేశంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్‌ని కూడా ఇచ్చింది. అందేలె..రోటీ, నాన్, చట్నీ, బిర్యానీ, పప్పు, బటర్ చికెన్, తందూరి చికెన్ వంటి ప్రముఖ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో మన భారతీయులు సైడ్ డిష్‌గా తినే పచ్చడి(చట్నీ) కూడా ఆ జాబితాలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు భారతదేశంలో ఆయా వంటకాలను ఎక్కడ ఆస్వాదించాలో వంటి వాటి వివరాలను కూడా టేస్ట్ అట్లాస్ అందించడం విశేషం. అయితే ఈ సారి ది బెస్ట్ రెసిపీల్లో అమెరికా వంటకాలు చేరడమే సర్వత్ర చర్చనీయాంశమైంది. పైగా అది ఏకంగా భారత్ తర్వాతి స్థానంలో అమెరికా(13) చోటుదక్కించుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఎందుకంటే పెరూ(14), లెబనాన్ (26), థాయిలాండ్ (28), ఇరాన్ (41) వంటి దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉండటంతో నెట్టింట రకరకాల చర్చలకు దారితీసింది. అసలు యూఎస్ వంటకాలంటే ఏంటి అంటూ సెటైర్లు వేస్తు కామెంట్లు చేయగా, మరికొందరు బ్రో ఉందిగా మెక్‌డొనాల్డ్స్ అని కామెడీ మీమ్స్‌తో పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్..! నిపుణుల షాకింగ్ విషయాలు..)


