వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లొచ్చు | Sakshi
Sakshi News home page

వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లొచ్చు

Published Fri, Dec 1 2023 5:54 AM

NIA Court Allows Elgar Parishad Accused Varavara Rao To Travel To Hyderabad - Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్‌ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్‌ వెళ్లేందుకు ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది.

ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్‌ 5–11 తేదీల మధ్య హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్‌ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్‌కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్‌ నంబర్, షెడ్యూల్‌ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది.

 
Advertisement
 
Advertisement