జీవితం పూలపాన్పు కాదు  | Rahul Gandhi Speaks To Gen Z NRI Students In New Video Chat, Says Be Flexible And Persevere | Sakshi
Sakshi News home page

జీవితం పూలపాన్పు కాదు 

Feb 9 2026 6:31 AM | Updated on Feb 9 2026 11:35 AM

Rahul Gandhi speaks to Gen Z NRI students in new video chat

అన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలి 

జెన్‌జెడ్‌ విద్యార్థులకు రాహుల్‌ సూచన 

న్యూఢిల్లీ: జీవితం అనేది ఎత్తుపల్లాల్లేకుండా సరళరేఖలా ఉండదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని యువ ఎన్‌ఐఆర్‌ విద్యార్థులతో వీడియో ద్వారా రాహుల్‌ సంభాషించారు. ఆ సంభాషణ తాలూకు వివరాలను రాహుల్‌ తన యూట్యూబ్‌ ఖాతాలో ఆదివారం పోస్ట్‌చేశారు. 

‘‘ వాస్తవిక ప్రశ్నలు, నిజాయతీ అయిన సమాధానాలు. ఇందులో ఎలాంటి వడబోతలు లేవు. నేటి యువత గుర్తింపు సమస్యతోపాటు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటోంది. జెన్‌ జెడ్‌ యువత తమ ఇష్టాయిష్టాలను, వృత్తిజీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలీక సతమతమవుతోంది.

 స్వేచ్ఛగా ఆలోచించడానికి తమ భావాలను వ్యక్తపర్చడానికి యువత ఇబ్బందిపడుతోంది. కొత్త విషయాలను తెల్సుకోవడం మొదలలు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఒక నిర్ణయం నుంచి ఎలా బయటపడాలి అనే సమస్యలూ జెన్‌జెడ్‌ను చుట్టుముట్టాయి. తమకు తమకు నమ్మకం లేక ఎలా ఇబ్బందులపాలవుతున్నారో, అభద్రతా భావంతో కుంగిపోతున్నారో వాళ్లు నాతో చెప్పారు. ఇబ్బందులు పడే జెన్‌జెడ్‌కు నేనిచ్చే సందేశం ఒక్కటే. సమయానుకూలంగా వ్యవహరిస్తూ దృఢచిత్తంతో పోరాడాలి. అన్నింటినీ ఎదుర్కోవాలి’’ అని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement