ద్రోహి.. శత్రువు  | Rahul Gandhi labeled Ravneet Singh Bittu | Sakshi
Sakshi News home page

ద్రోహి.. శత్రువు 

Feb 5 2026 5:01 AM | Updated on Feb 5 2026 5:01 AM

Rahul Gandhi labeled Ravneet Singh Bittu

రాహుల్, బిట్టూ మధ్య తీవ్ర వాగ్వాదం  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీ, కేంద్ర మంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టూ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. బుధవారం ఉదయం పార్లమెంట్‌ మకరద్వారం వద్ద ఇరువురు నేతలు ఎదురుపడ్డారు.  పార్లమెంట్‌ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీలకు సంఘీభావంగా రాహుల్‌ మాట్లాడేందు సిద్ధమవుతుండగా ఇంతలోనే బిట్టూ అక్కడికి వచ్చారు. 

విపక్ష ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏదో యుద్ధంలో గెలిచి వచి్చనట్లు ఇక్కడ కూర్చున్నారంటూ బిట్టూ ఎద్దేవా చేశారు. దానిపై రాహుల్‌ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక ద్రోహి మన పక్కనుంచే వెళ్తున్నాడు. అతడి ముఖం చూడండి. ఎలా కనిపిస్తున్నాడో చూడండి. హలో బ్రదర్‌. నా ద్రోహి మిత్రుడా.. ఆందోళన చెందకు. నువ్వు మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తావు’’ అంటూ వ్యాఖ్యానించారు. బిట్టూతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.  అయితే, రాహుల్‌తో కరచాలనానికి బిట్టూ నిరాకరించారు. 

రాహుల్‌ వైపు చూస్తూ దేశానికి శత్రువు(దేశ్‌ కీ దుష్మన్‌) అంటూ నిందించారు. అక్కడున్న సస్పెండైన ఎంపీలను, కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి దేశ్‌ కీ దుష్మన్‌ అంటూ పలుమార్లు అన్నారు. ఈ వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది. అనంతరం బిట్టూ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ చెడిపోయిన పిల్లాడు’ అంటూ నిందించారు. అక్కడ ఎంతోమంది ఎంపీలు ఉండగా, సిక్కు మతస్థుడినైన తనను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారని రాహుల్‌పై మండిపడ్డారు. 

‘‘తామే పెద్ద దేశభక్తులమని గాం«దీలు పదేపదే చెప్పుకుంటారు. రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అంటుంటారు. మా తాత బియాంత్‌ సింగ్‌ పంజాబ్‌లో బలిదానం చేశారు. గాంధీ కుటుంబం సృష్టించిన ఉగ్రవాదానికి ఆయన బలయ్యారు. సిక్కుల రక్తంతో గాం«దీల చేతులు తడిచాయి. సిక్కు వ్యతిరేక గొడవల్లో ఎంతోమంది చనిపోయారు. సిక్కులను హత్య చేసి, గురుద్వారాలను కూల్చేసిన గాంధీ కుటుంబ వారసులతో ఈ సర్దార్‌ ఎప్పటికీ చేతులు కలపడు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు. నాకు జరిగిన అవమానాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తా’’ అని బిట్టూ స్పష్టంచేశారు.  

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి  
కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్‌ బిట్టూ ద్రోహి అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి సహా బీజేపీ నేతలు, సిక్కు నాయకులు తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సిక్కులకు వ్యతిరేకం అన్న సంగతి మరోసారి తెలిసిపోయిందని అన్నారు. రాహుల్‌ గాం«దీని సిక్కులు ఎప్పటికీ క్షమించబోరని తేలి్చచెప్పారు. మరోవైపు రాహుల్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సిక్కు వర్గాన్ని కించపర్చినందుకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. రాహుల్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ అమరీందర్‌ సింగ్‌ రాజా సమర్థించారు. ద్రోహిని ద్రోహి అనకపోతే ఇంకేం అంటారని ప్రశ్నించారు. బిట్టూకు కాంగ్రెస్‌ ఎంతో చేసిందని, అయినా సరే పారీ్టకి ద్రోహం చేసి వెళ్లిపోయాడని ఆరోపించారు.       

Advertisement
 
Advertisement
Advertisement