మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత | President Rule Lifted In Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

Feb 4 2026 3:39 PM | Updated on Feb 4 2026 3:58 PM

President Rule Lifted In Manipur

ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ..  కేంద్ర హోంశాఖ గెజిట్‌ విడుదల చేసింది. ఇప్పటికే మణిపూర్‌ సీఎంగా యుమ్నం ఖేంచంద్‌ను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత రాష్ట్రపతి పాలనను ఉపసంహరించుకుంది. ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియను అధికారికంగా పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.

మణిపూర్‌లో మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. తాజాగా మణిపూర్‌కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్‌చంద్ సింగ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

మణిపూర్‌లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్‌చంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని   ఖేమ్‌చంద్ సింగ్‌కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement