ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికి పోయాడు..చివరికి ఆర్డర్‌ను డెలివర్ చేయకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్చాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక డెలివరీ బాయ్ ..ఎప్పటి లాగే.. అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్శిల్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రెస్‌కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. కానీ అతను ముందుకు వెళ్లగా… ఆ లోకేషన్ చూసి షాక్ అయ్యాడు.
ఆ వ్యక్తి రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి..తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ..తాను స్మశానంలో ఫ్రెండ్స్‌తో లోపల పార్టీ చేసుకుంటున్నాం” అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేసి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగినదో స్పష్టంగా తెలియడం లేదు. కొందరు ఇది ఫేక్ వీడియో అని, మరికొందరు AI ద్వారా తయారైన వీడియో అని చర్చ చేస్తున్నారు. అయినా, రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్‌లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది.


