‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’ | AP Turned into Jungle Raj: YSRCP Protest AT Parliament | Sakshi
Sakshi News home page

‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’

Feb 3 2026 11:28 AM | Updated on Feb 3 2026 11:53 AM

AP Turned into Jungle Raj: YSRCP Protest AT Parliament

సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ ఎదుట ధర్నా చేపట్టింది. మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు.

ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు.. హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ  సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే.. 

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్‌ రాజ్‌పై చట్టబద్ధంగా, అహింసా పద్ధతుల్లో వైస్సార్‌సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్‌సీపీ. త్వరలో హోంమంత్రి అమిత్‌ షాను కలసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది.

కూటమి పాలనలో ఇప్పటిదాకా.. 

  • అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు
  • జోగిరమేష్ ఇంటిపై దాడి చేశారు
  • వలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారు
  • కొడాలి నాని ఇంటిపై దాడి చేశారు
  • పేర్ని నాని ఇంటిపై దాడి చేశారు
  • ముద్రగడ ఇంటిపై దాడి చేశారు
  • నల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు
  • కామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారు
  • కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు
  • అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి చేశారు
  • భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు
  • హిందూపుర్ వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారు
  • దాడిశెట్టి రాజాపై దాడి చేశారు
  • ఉప్పల హారికా, ఉప్పల రాముపై దాడి చేశారు
  • దేవినేని అవినాష్ పై దాడికి యత్నించారు
  • చిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు
  • మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి
  • విడదల రజినీపై దాడికి యత్నం 
  • నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడి
  • ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి
  • డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు 
  • సాక్షి ఆఫీసులపై దాడి చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement