breaking news
Jungle Raj
-
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం. -
జంగిల్‌రాజ్‌పై ఆగ్రహం.. జగన్ పర్యటనల్లో జనవాహిని
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వపు ఆటవిక పాలన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోంది. జనం ఈ జంగిల్‌రాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెళ్లిన ప్రతీ చోటకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మంచి ప్రభుత్వమంటూ ముంచేస్తోందని, పైగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగానే కూటమి ప్రభుత్వానికి సహించడం లేదు. అందుకే జనాలను జగన్ దగ్గరగా వెళ్లకుండా.. శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నం.. మొత్తం పోలీసుల ఆంక్షల వలయమే. కేవలం జగన్ వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రాకూడదనేది వాళ్ల కూటమి ఆలోచన. కానీ, ఆ కుట్రను భగ్నం చేస్తూ జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్‌ను దగ్గరుండి వాళ్లే ముందుకు తీసుకెళ్లేలా!.జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం వణుకుతోంది. చివరి నిమిషంలో రూట్ మార్చమని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించినంత మాత్రాన పోలీసులు అత్యుత్సహాం ప్రదర్శించడం ఎందుకు?. జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అని జోగి రమేష్ అన్నారు. జగన్ పర్యటనకు రూట్‌మ్యాప్ ముందే సమర్పించాం. అయినా చివరి నిమిషంలో కావాలనే రూట్‌మ్యాప్ మార్చమని నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు వచ్చే జనాదరణను ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్లాన్లు వేసినా.. జనాన్ని ఆపలేరు. జగన్ అభిమానుల్ని ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. కానీ, అది జరిగే పని కాదు. ఏం జరిగినా.. జగన్ వెంటే జనం ఉంటారు అని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్‌కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్‌లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్‌ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్‌గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్‌రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్‌రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్‌కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్‌లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్‌ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్‌లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్‌గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్‌గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్‌గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్‌మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
జనం కేక.. జంగిల్‌రాజ్‌ను తరిమికొడదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్‌కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్‌ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. 35 కిలోమీటర్లు.. ఆరు గంటలు » తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్‌కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్‌ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. » జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు. » ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్‌లపై వస్తుంటే బైక్‌ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.జననేతకు జనం జేజేలు» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్‌కు ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. » గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. » గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.అడుగడుగునా అడ్డంకులే..సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. జగన్‌ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు. వారిని సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్‌ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్సీపీని, జగన్‌ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.::సిమ్మాదిరప్పన్న -
హక్కుల సంఘం దృష్టికి ఏపీ జంగిల్ రాజ్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున ఆటవిక పాలనను వైఎస్సార్సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు సంఘానికి నివేదిక ఇచ్చాం. -
ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు. బుధవారం గుంటూరులో పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి భారీ సంఖ్యలో చేరి వైఎస్ జగన్ వెంట కదులుతూ చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసు చెక్‌పోస్టులతో నింపేయించింది. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు.. ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ.. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యింంచుకుంటున్న జనం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తే.. పోలీసుల ఆంక్షల వలయాల్ని చేధించుకుని స్వచ్ఛందంగా.. భారీగా, వేల సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. పోలీసులు ఎప్పటిలాగే జగన్ పర్యటనలో భద్రత కల్పించకుండా దూరంగా ఉంటే.. ఆ జననేతకు జనమే సాదర స్వాగతం పలికారు. గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహమేనని, జగన్ వెంటనే తాము ఉన్నామంటూ ఇచ్చిన సంకేతాలని అంటున్నారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు.ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు.. హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్ రాజ్‌పై చట్టబద్ధంగా, అహింసా పద్ధతుల్లో వైస్సార్సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది.కూటమి పాలనలో ఇప్పటిదాకా.. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారుజోగిరమేష్ ఇంటిపై దాడి చేశారువలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారుకొడాలి నాని ఇంటిపై దాడి చేశారుపేర్ని నాని ఇంటిపై దాడి చేశారుముద్రగడ ఇంటిపై దాడి చేశారునల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుకామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారుకేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారుఅబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి చేశారుభూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుహిందూపుర్ వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారుదాడిశెట్టి రాజాపై దాడి చేశారుఉప్పల హారికా, ఉప్పల రాముపై దాడి చేశారుదేవినేని అవినాష్ పై దాడికి యత్నించారుచిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారుమార్గాని భరత్ ఆఫీస్ పై దాడివిడదల రజినీపై దాడికి యత్నం నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడిఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిడెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు సాక్షి ఆఫీసులపై దాడి చేశారు -
అంబటి, జోగి ఇళ్లపై టీడీపీ దాడులు YSRCP నిరసనలతో దద్దరిల్లిన ఏపీ..
-
జంగిల్‌రాజ్‌పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్‌రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్‌కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్‌బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్‌బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్‌బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
కొనసాగుతున్న జంగిల్‌రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్‌తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్‌తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్‌సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ అవినీతి, బంధుప్రీతి కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. ఇక్కడ మహా జంగిల్‌రాజ్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉండేదని, సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అదే ఫలితం బెంగాల్లోనూ పునరావృతం కాబోతోందని తేల్చిచెప్పారు. బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. బెంగాల్ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టంచేశారు. మహా జంగిల్‌రాజ్‌ను కచ్చితంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో బెంగాల్లో బీజేపీ విజయానికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ ‘‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా మాకు అభ్యంతరం లేదు. కానీ, ప్రజలను ఎందుకు వేధిస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. అవినీతి, బంధుపీత్రి, బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇక్కడ ప్రగతి ఆగిపోయింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. కట్ మనీ, కమీషన్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. బెంగాల్ నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే బీజేపీని గెలిపించాలి. మాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం. తృణమూల్ కాంగ్రెస్ అకృత్యాల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ అనే నినాదం రాష్ట్రంలో మార్మోగిపోతోంది. అందుకే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారు చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం సిగ్గుచేటు. వారిని కాపాడేందుకే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తిస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి. బంగ్లాదేశ్‌లో మతపరంగా వేధింపులకు గురై మన దేశంలోకి వచ్చినవారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించాం. దానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బాధితులను బెదిరించాలని చూస్తోంది’’ అని మోదీ విమర్శించారు. తాహెర్‌పూర్‌లో ప్రధాని మోదీకి బదులుగా బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు రూ.3,200 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ యూటర్న్ భారీ పొగమంచు కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మోదీ హెలికాప్టర్లో కోల్‌కతా నుంచి తాహెర్‌పూర్ చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉండగా, పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో చేసేది లేక హెలికాప్టర్‌ను మళ్లీ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. మోదీ కోల్‌కతా నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి తాహెర్‌పూర్‌లో సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగించే సభకు వెళ్తుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీల్డా–కృష్ణానగర్ సెక్షన్‌లోని తాహెర్‌పూర్, బడ్కుల్లా రైల్వేస్టేషన్ల మధ్య పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపా రు. కార్యకర్తల మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నాం.. గౌహతి ఎయిర్‌పోర్టులో నూతన టెరి్మనల్ ప్రారంభించిన మోదీ గౌహతి: అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎజెండాలో ఈశాన్య రాష్ట్రాలు ఏనాడూ లేవని ఆక్షేపించారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయన శనివారం అస్సాంలో పర్యటించారు. రాజధాని గౌహతిలో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.4,000 కోట్లతో నిర్మించిన నూతన టెరి్మనల్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అస్సాం అటవీ భూములను ఆక్రమించుకొని రాష్ట్ర గుర్తింపునకు ముప్పుగా మారిన చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే దీని అక్ష్యమన్నారు. కొందరు దేశ ద్రోహులు ఇప్పటికీ చొరబాటుదారులను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అస్సాంను గతంలో తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)లో విలీనం చేయడానికి కుట్రలు జరిగాయని, కాంగ్రెస్ కూడా ఇందులో భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఆ కుట్రను గోపీనాథ్ బార్డోలోయి విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అస్సాం రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోకుండా కాపాడారని కొనియాడారు. ఇండియాకు, ఆసియాన్ దేశాలకు మధ్య అస్సాం అనుసంధానంగా మారిందన్నారు. కీలక రంగాల్లో దేశ అభివృద్ధికి అస్సాం ఒక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రశంసించారు. గౌహతిలో మెగా రోడ్ షో గౌహతిలో మోదీ శనివారం సాయంత్రం 3.8 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీజీ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ జనం నినదించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ షో ముగిసింది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బలాన్ని చాటేలా ఈ రోడ్ షో జరిగింది. బీజేపీ నాయకులతో భేటీ ప్రధాని మోదీ అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. -
జంగిల్‌రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు. -
బెంగాల్లోనూ ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తాం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్లో ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్‌లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. కొత్తగా ఎం.వై. ఫార్ములా బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్‌రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్‌కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు. ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం ఎన్డీయే ప్రభంజనంతో బిహార్‌లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఐఆర్ను యువత స్వాగతించారు నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్‌రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్‌రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు. -
రికార్డు స్థాయి విజయం తథ్యం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఈసారి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గత 20 ఏళ్లలో ఏన్నడూ లేనట్టి అద్భుతమైన విజయం ఈ ఎన్నికల్లో సాధించబోతున్నామని చెప్పారు. జంగిల్‌రాజ్ మనుషులకు ఘోరమైన పరాభవం తప్పదని పునరుద్ఘాటించారు. ఇద్దరు యువరాజులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల మద్దతు పొందడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన యువరాజు ఛఠ్ పూజలను అవమానించాడని మండిపడ్డారు.ప్రధాని మోదీ మంగళవారం బిహార్ బీజేపీ మహిళా కార్యకర్తలతో నమో యాప్ ద్వారా వర్చువ ల్గా సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం మహిళా కార్యకర్తలు కష్టపడి పని చేసు న్నారని ప్రశంసించారు. బిహార్‌లో ఇటీవల పలు బహిరంగ సభల్లో పాల్గొన్నా నని, మహి ళలు అత్యధికంగా హాజరయ్యారని చెప్పారు. ఒక సభకు మించి మరో సభ జరిగిందన్నారు. ఎన్డీయేకు మహిళల ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.ఎవరూ ఊహించలేని భారీ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మహా దళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వారి జీవనం మరింత సులభతరంగా మారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన, చట్టబద్ధమైన పాలన అమల్లో ఉన్నప్పుడే మహిళలు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఎన్డీయే పాలనలో ఆడబిడ్డల ప్రగతికి పెద్దపీట వేశామన్నారు. బిహార్ మహిళలు నేడు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసల వర్షం కురిపించారు. -
అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?
గోపాల్‌గంజ్: మోదీ–నితీశ్ కుమార్ల అభివృద్ధి అజెండా కావాలో లేక రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జంగిల్‌రాజ్ కావాలో తేల్చుకోవాలని బిహార్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. అభివృద్ధి పట్టం కట్టాలా? లేక ఆటవిక రాజ్యం కావాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. శనివారం బిహార్‌లో గోపాల్‌గంజ్, సమస్తీపూర్, వైశాలి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా వర్చువల్‌గా ప్రసంగించారు. వాతవరణం అనుకూలించకపోవడంతో ఆయా ప్రాంతాలకు ఆయన చేరుకోలేకపోయారు. బిహార్ అభివృద్ధి బాధ్యతను ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి ఈ ఎన్నికలు ఒక సువర్ణావకాశమని అమిత్ షా చెప్పారు. గతంలో ఆర్జేడీ పాలనలో ఎన్నో అకృత్యాలు జరిగాయని వెల్లడించారు. అప్పట్లో నక్సలైట్లు పెట్రేగిపోయారని, రక్తం ఏరులై పారిందని అన్నారు. భూస్వాముల ప్రైవేట్ సైన్యాలు ప్రజలపై పెత్తనం చెలాయించాయని గుర్తుచేశారు. ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ రావొద్దంటే ఆర్జేడీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట రాష్ట్రంలో ఎన్డీయేకు మరోసారి అధికారం కట్టబెడితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రైతులు, మహిళల సంక్షేమానికి ఎన్డీయే మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్లు తెలిపారు. 1.41 కోట్ల మంది జీవికా దీదీల ఖాతాల్లోకి ఇటీవల ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారికి రూ.2 లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 27 లక్షల మంది రైతులకు ప్రతి ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని చక్కెర కర్మాగారాలను మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన ఓటర్ అధికార్ యాత్రను తప్పుపట్టారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా చొరబాటుదారులను బయటకు పంపించడం తథ్యమని అమిత్ షా తేల్చిచెప్పారు. -
చొరబాటుదారులను వెళ్లగొట్టుడే..
నలంద: బిహార్‌లో జంగిల్‌రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను బిహార్‌లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్‌రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం బిహార్‌లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్‌బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్‌ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్రాజ్తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
వికాసానికి– వినాశానికి మధ్య పోరు
ఔరంగాబాద్/హాజీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీయే వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభివర్ణించారు. గురువారం ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఔరంగాబాద్, వైశాలి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారన్నారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే పాటుపడుతోందని చెప్పారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీని చిన్నవైన భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నభుక్కుగా ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనతోపాటు, వలసలకు చెక్ పెడతామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ నడ్డా.. గతంలో ఆ పార్టీ నేతలు పాల్పడిన ‘భూమికి బదులుగా ఉద్యోగాలు’కుంభకోణం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. భారీ ఉద్యోగాల కల్పన వట్టిదేనంటూ ఆయన వీరందరికీ వేతనాలను చెల్లించేందుకు నిధులెక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. -
జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్‌లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్‌తోపాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొలి్పందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగఠ్‌బంధన్ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి(లాఠ్బంధన్) అని మండిపడ్డారు. ప్రధాని మోదీ గురువారం ‘నమో యాప్’ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రచారం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. రఫ్తార్ పకడ్ చుకా బిహార్, ఫిర్ సే ఎన్డీఏ సర్కార్(బిహార్‌లో ప్రభంజనం ఊపందుకుంది, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది) అని మోదీ కొత్త నినాదం ఇచ్చారు. తమ కూటమి పాలనలో ఆల్‌రౌండ్ అభివృద్ధి జరిగిందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో, బిహార్‌లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తేల్చిచెప్పారు. సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న జరిగే ‘ఐక్యతా పరుగు’లో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. యువతదే కీలక పాత్ర మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్ యువత దశాబ్దాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు, ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని ప్రధానమంత్రి మండిపడ్డారు. కడుపు మండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్‌రాజ్‌ను ఓడించారని తెలిపారు. ఆనాటి అరాచక రాజ్యం మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ఓటు విలువ బిహార్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. జంగిల్‌రాజ్ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని పేర్కొన్నారు. బిహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత విషయంలో నవంబర్ 14న నూతన శకం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. -
కొత్త ముసుగులో ‘జంగిల్‌రాజ్’
పట్నా: బిహార్‌లో ‘జంగిల్‌రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు. బెంగాల్లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయలో రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు. -
బీజేపీ ఓటమి ఖాయం: లాలూ
పాట్నా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుద్ధి లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ శనివారం విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బిహార్‌లో జంగిల్‌రాజ్ అంటూ అమిత్ షా పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి గుజరాత్లో అమిత్ షా ఉన్నప్పుడే జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. లాలూప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ‘ప్రతిపక్షాల ఐక్యతే’ ప్రధాన అజెండా అని లాలూ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ర్యాలీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు ప్రతిక్ష నేతలు ఈ ర్యాలీలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ జంగిల్ రాజ్ దిశగా బిహార్?
సాక్షి, న్యూఢిల్లీ: అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటి..? బిహార్ వెనకబాటుతనానికి జంగిల్‌రాజ్ కారణమా..? బిహార్‌లో జంగిల్ రాజ్ అంశం మళ్లీ తెరపైకి రావటానికి కారణం ఏంటి..? బిహార్‌లో పరిస్థితులు జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరాలు, అవినీతి, శాంతి భద్రతల సమస్యలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న బిహార్‌లో మళ్లీ అదే అంశం తెరపైకి వస్తోంది. నేరాల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సాధారణం. అయితే తాజాగా పాలకపక్షంలోని నాయకులే ఇప్పుడు జంగిల్‌రాజ్ గానం వినిపించడం వివాదానికి కారణంగా మారుతోంది. అసలేంటి జంగిల్ రాజ్..? 1990 నుంచి 2005 వరకు బిహార్‌ను లాలూ ప్రసాద్–రబ్రీదేవి పాలించిన కాలాన్ని జంగిల్ రాజ్‌గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. జంగిల్‌రాజ్‌లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల మధ్య నేరపూరిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అంతేగాక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డువచ్చే వారిని బహిరంగంగా బెదిరించడం, హింసాత్మకంగా వ్యవహరించడం ఒక ఫ్యాషన్‌గా కొనసాగేది. ఆ సమయంలో బిహార్ కిడ్నాప్‌లకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోని వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను పట్టపగలే గ్యాంగ్‌లు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం 1992 నుండి 2004 వరకు బిహార్‌లో 32,085 కిడ్నాప్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. లాలూ–రబ్రీ హయాంలో రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున జరిగాయి. లాలూ అండతో ఆ సమయంలో సివాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్‌పై అనేక హత్యారోపణలు ఉన్నప్పటికీ, లాలూ ప్రసాద్ కారణంగా పోలీసులు కేసులు పెట్టేందుకు భయపడ్డారు. కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలో చీకటి పడిన తర్వాత ఇంటి నుంచి బయటి రావాలంటే ప్రజలు వణికిపోయేవారు. బిహార్ పోలీసు గణాంకాల ప్రకారం కేవలం 2001–2005 మధ్య ఐదేళ్ళలో 18,189 హత్యలు జరిగాయంటే 1990 నుంచి 2000 మధ్య కాలంలో జంగిల్ రాజ్‌లో ఎన్ని హత్యలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదేగాక రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, వాహనం కొన్నా స్థానిక గూండాలకు ‘రంగ్దారీ పన్ను’తప్పని సరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే వారిని గూండాలు హత్య చేసేవారు. అసలు లాలూ–రబ్రీదేవి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరగని నేరం అంటూ ఏదీ లేదు. అయితే లాలూ కుటుంబం అధికార పీఠానికి దూరమైన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆర్జేడీని ఎదుర్కొనేందుకు జంగిల్ రాజ్‌ను ఉదహరిస్తూ బీజేపీ, జేడీయూలు ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జంగిల్ రాజ్ పేరు చర్చనీయాంశంగా మారింది. సీతామర్హి బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలోనూ తన నియోజకవర్గం సీతామర్హిలో పెరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, 15 ఏళ్ల క్రితం జంగిల్ రాజ్ రాజ్యమేలిన విధంగా, ప్రస్తుతం బిహార్ జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరస్తులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని, ఈ కారణంగా సీతామార్హిలో రోజులో కనీసం మూడు నేర ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకొనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని మిథిలేష్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. సాధారణంగా శాంతిభద్రతలను ఒక సమస్యగా ప్రతిపక్షం మారుస్తోంది. అయితే బిహార్‌లో స్వపక్షం నుంచే ఈ ప్రకటనలు రావడం రాజకీయంగా నితీష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేవలం మిథిలేష్ కుమార్ మాత్రమే కాకుండా నేరాలతో పాటు శాంతి భద్రతల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ సహా పలువురు నేతలు నితీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక నేర నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అవలంభిస్తున్న విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం, అధికారపార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకులు మాత్రం బిహార్‌లో జంగిల్ రాజ్ కాదు ఎంతో శాంతియుతంగా న్యాయమైన పాలన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏనాడూ రాలేదని నితీష్ మంత్రివర్గ సహచరుడు, జేడీయూ నేత అశోక్ చౌదరి వెల్లడించారు. మొత్తానికి బిహార్ అభివృద్ధికి జంగిల్ రాజ్ ఇమేజ్ ఏదో ఒక రూపంలో కచ్చితంగా అడ్డుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆటవిక రాజ్య యువరాజు
దర్భంగ/ముజఫర్‌పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్‌రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్‌లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్‌ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్‌ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు. -
ఆ రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడరు?
పట్నా: ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న జంగిల్ రాజ్ పాలన గురించి మాట్లాడడం లేదని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటో నిర్వచించాలని డిమాండ్ చేశారు. జేడీ(యూ) ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన నేపథ్యంలో బిహార్ లో ఆటవిక పాలన కొనసాగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై తేజశ్వి యాదవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరిగిన ఇతర రాష్టాల ప్రభుత్వాలపై ఎందుకు దుమ్మెత్తిపోయడం లేదని ప్రశ్నించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాని న్యాయం చేస్తామని చెప్పారు. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని హామీయిచ్చారు. -
డిప్యూటీ సీఎం ఫైర్
పట్నా: 'జంగిల్ రాజ్' వ్యాఖ్యలపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్ లో ఆటవిక పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శించడంతో ఆయన కౌంటర్ ఇచ్చారు. అధికార జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ యాదవ్ నడిరోడ్డుపై యువకుడిని కాల్చి చంపాడని ఆరోపణలు రావడంతో విపక్షాలు నితీశ్ కుమార్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బిహార్ లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తాయి. దీనిపై తేజశ్వి యాదవ్ ఘాటుగా స్పందించారు. 'బిహార్ లో జరిగిన ఘటన జంగిల్ రాజ్ కు అద్దం పడుతుందంటున్నారు. ఢిల్లీలో ఇంతకంటే ఎక్కువగా రోడ్లపై దారుణాలు జరిగాయి. అది జంగిల్ రాజ్ కాదా? మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం, పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, జాట్ల ఆందోళన సందర్భంగా మహిళలపై అత్యాచారాలు.. జంగిల్ రాజ్ పాలనకు ఉదాహరణలు కాదా?' అని తేజశ్వి యాదవ్ ఆవేశంగా ప్రశ్నించారు. -
'నితీష్ పీఎం అయితే దేశంలో జంగిల్ రాజ్'
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. నితీష్ ప్రధాని అయితే బిహార్ లో మాదిరిగా దేశంలో జంగిల్ రాజ్(ఆటవిక రాజ్యం) వస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమంగా జేడీయూతో పొత్తు పెట్టుకొని నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బిహార్ లో జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు తన కారును ఓవర్ టేక్ చేశాడని 19 ఏళ్ల యువకున్ని కాల్చి చంపడంపై ఆమె స్పందిస్తూ... నితీష్ మద్యపానం సేవించేవారిపై చర్యలు తీసుకుంటున్నారని అలాగే అధికార మదంతో ప్రవర్తిస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె సవాల్ విసిరారు. ఈరోజు సాహెబ్ గంజ్ లో ఆమె గంగానది ప్రక్షాళన చేసేందుకు తొమ్మిది పథకాలను ఆమె ప్రారంభించనున్నారు. -
'బీహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్ వచ్చేసింది'
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీయే చెప్పినవిధంగానే బిహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్' (ఆటవిక రాజ్యం) వచ్చేసిందని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతున్నా నితీశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 'బిహార్‌లో మళ్లీ జంగల్ రాజ్ వచ్చేసింది. నితీశ్-లాలూ జోడీకడితే బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం వస్తుందని మేం ఎన్నికల ప్రచారంలో చెప్పాం. జంగల్‌రాజ్ కాదు 'మంగళ్ రాజ్' (మంగళకరమైన రాజ్యం) వస్తుందంటూ నితీశ్-లాలూ చెప్పారు. ఇది ఆటవిక రాజ్యామా? లేక మంగళకర రాజ్యమా? అన్నది ఇప్పుడు ప్రజలే చెప్పాలి' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. బిహార్‌లో వరుసగా ఇంజినీరింగ్ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ప్రజాస్వామ్య విజయం
జంగల్ రాజ్ సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు బిహార్ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందన కనిపించింది. కొందరు దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించగా... మరికొందరు బిహార్ తిరిగి ‘జంగల్‌రాజ్’ పాలనలోకి వెళ్లిపోతుందేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ భారీ విజయంపై కామెంట్లతో ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ వెబ్సైట్లు నిండిపోయాయి. బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల్లోని భారతీయుల నుంచి కూడా స్పందన వ్యక్తమైంది. బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో బాణసంచా కాలుస్తారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ‘పాకిస్తాన్ గురించి మాకు తెలియదుగానీ.. ఇప్పుడు భారత్‌లో మాత్రం బాగా బాణసంచా పేలుస్తారు..’ అని ఓ నెటిజన్ విర్శించారు. -
జంగిల్ రాజ్ కాదు మండల్ రాజ్!


