పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు.
వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు.


