హీరో రామ్‌చరణ్‌ ఇంట జపాన్‌ చెఫ్‌ చేతి బిర్యానీ..! | Japanese Chef Prepares Authentic Biryani For Ram Charan At His Home, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

హీరో రామ్‌చరణ్‌ ఇంట జపాన్‌ చెఫ్‌ చేతి బిర్యానీ..! టేస్ట్‌ ఎలా ఉందంటే..

Jan 8 2026 4:52 PM | Updated on Jan 8 2026 5:08 PM

Japanese Chef Prepares Authentic Biryani For Ram Charan

బిర్యానీ ఎవ్వరినైనా ఇట్టే తన రుచికి ఫిదా చేసేస్తుంది. యావత్తు ప్రపంచాన్ని తన ఘుమఘమలు వైపుకి లాగేసుకుంటుంది. అసలు ఒక్కసారి రుచి చూసిన వారెవ్వరైనా..మరోసారి తినేలా ఊరించే వంటకం ఇంది. అలాంటి వంటకానికి ఎందరెందరో ఫిదా అయ్యారు. అచ్చం అలానే బిర్యానీ ప్రియుడిగా మారి అందులో స్పెషలిస్ట్‌గా అవతరించాడు ఈ జపనీస్‌ చెఫ్‌. ఆ ఇష్టమే హైదరాబాద్‌కి రప్పించి ..మన చిరు తనయడు ఇంటికి వచ్చేలా చేయడమే కాదు..హీరో రామ్‌చరణ్‌కి రుచి చూపించాడు కూడా. ఔనా ఏంటా కథా అని కుంటున్నారా..!. అయితే  తక్షణమే చదివేయండి ఆ సంగతేంటో..

ప్రత్యేక బిర్యానీలకు సంబంధించి వరల్డ్‌ పేమస్‌ జపనీస్‌ చెఫ్‌ మాస్టర్‌  తకమాసా ఒసావా ఇటీవల హైదరాబాద్‌లోని మన రామ్‌చరణ్‌ ఇంటికే వచ్చి మరి వండుకున్నాడు. ఇదేంటి అనుకోకండి బహిరంగంగా వండుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసుకునే ఈ చెఫ్‌ తకమాసా..అలానే మన చరణ్‌ ఇంట్లో కూడా బిర్యానీ వండి ఆ వీడియోని నెట్టింట షేర్‌ చేసుకున్నాడు. ఇది క్షణాలో ఆహారప్రియులను, రామ్‌చరణ్‌ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏంటి మేటర్‌ అంటే..

ఆయన రామ్‌ చరణ్‌ నివాసానికి వచ్చి..అక్కడ బ్యూటిఫుల్‌ లోకేషన్స్‌ని షేర్‌ చేస్తూ..అక్కడే తన స్పెషల్‌బిర్యానీ వండాడండోయ్‌. అక్కడితో ఆగలేదు రామ్‌చరణ్‌కి, వాళ్ల అమ్మ సురేఖమ్మకి కూడా టేస్ట్‌ చేయమని పెట్టాడు కూడా. మన హీరో రామ్‌చరణ్‌ అయితే బాస్‌ ఇది చాలా రుచిగా ఉంది గ్రేవీలా లేదంటూ చమత్కరించాడు. ఎందుకంటే జపాన్‌ వాళ్లు ఏదైనా సూప్‌ మాదిరిగా అదేనండి పులుసు టైపులో తింటుంటారు కథా అందుకని మన హీరో చరణ్‌ సరదాగా అలా అన్నారు. మన జపాన్‌ చెఫ్‌ తకమాసాకి ఈ బిర్యానీ వండడం ఎలా తెలిసిదంటారా..?

అలా తెలుసుకుని..ఇలా గరిటపట్టేశాడు..
టోక్యోకు చెందిన చెఫ్‌​ తకమాసా సింగిల్‌ పాట్‌ బిర్యానీ స్పెషలిస్ట్‌ అట. అంతేగాదు ట్యోక్కోలో బిర్యానీ రెస్టారెంట్‌ని కూడా నడుపుతున్నాడు. అతని బిర్యానీ వండే స్కిల్‌కి, టేస్ట్‌కి మిచెలిన్ బిబ్ గౌర్మాండ్‌ అనే మంచి అవార్డు సైతం వచ్చింది ఈ చెఫ్‌కి. మన తకమాసాకి బిర్యానీ గురించి తెలిసింది 2009లోనట. తమిళనాడులో ఆఫీస్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడూ..స్థానిక తినుబండారాలపై బిర్యానీ అని రాసి ఉడంట చూశాడట తకమాసాక. 

ఆసక్తిగా అనిపించి ఆర్డర్‌ చేసి తిన్నాడట. అంతే ఆక్షణమే దానిపై మనసు పారేసుకుని ఇలా బిర్యానీ చెఫ్‌గా సెటిల్‌ అయ్యిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలన్ని పర్యటించి మరి అక్కడ బిర్యానీ వంట పద్ధతులను తెలుసుకుంటూ, దీని రుచిపై అధ్యయనం చేస్తున్నాడట ఈ చెఫ్‌ తకమాసా. బిర్యానీపై ఉన్న అతని ప్రేమ చూస్తుంటే భోజనప్రియులకు ఆహారమే సార్వత్రికభాష అని నిరూపితమైంది కదూ..!

 

(చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement