breaking news
Ram Charan
-
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!
మెగాహీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'చికిరి' హిట్ కాగా.. డిసెంబరులో మరో పాట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సాంగ్ రాబోతుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో తీస్తుండటం విశేషం. ఇంతకీ సంగతేంటి?'పెద్ది' మూవీ ప్రకటించినప్పుడు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ వచ్చిందో.. తర్వాత నుంచి హైప్ పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు పనిచేస్తున్నాడని తెలుస్తోంది. మూవీలో ఏకంగా ఎనిమిది ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారట. దీనంతటినీ హిందీ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఈయన గతంలో 'దంగల్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు.'పెద్ది' చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అని అన్నారు. రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాలన్నీ చెప్పిన తేదీకి అస్సలు రావడం లేదు. మరి 'పెద్ది' చెప్పిన టైంకి వస్తాడా లేదంటే వాయిదా వేస్తాడా అనేది చూడాలి? -
రామ్ చరణ్-సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ రూమర్స్ నిజమా
-
'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత
ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
పెద్ది ప్రమోషన్స్ కు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కి పండగే...
-
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష్మీ) -
బిజినెస్‌మ్యాన్ కుమార్తె పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ (ఫొటోలు)
-
పెద్ది పోస్ట్ పోన్ అంటున్న కన్నడ ఇండస్ట్రీ..!
-
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగా..మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చిట్‌చాట్ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా.. వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువమంది చేతులు ఎత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబిచ్చింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి.. మీ లక్ష్యాలను నిర్వచించుకోండి.. మీ పాత్రను సొంతం చేసుకోండి. మిమ్మల్న ఎవరూ ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది.అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడింది. మీరు మీ కాళ్లపై ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ఒక్కరూ తమ అండాలను భద్రపరచుకోవాలంటూ ఉపాసన మాట్లాడారు. ఈ రోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డానని.. నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని పేర్కొంది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. నీ కెరీర్లో విజన్, గోల్ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది.అయితే ఉపాసన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రమోట్ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.కాగా.. ఉపాసన, రామ్ చరణ్‌కు దాదాపు పెళ్లయిన 12 ఏళ్లకు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఇంతకీ సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు??You are just promoting your apollo ferlity centre that's it..Sorry @upasanakonidelaGaaru, you are misleading the young generations with this message.After 30 women loose intrest to have kids...Kindly spare our younger… pic.twitter.com/1JbRQhudVX— 𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్🇮 (@Mani_Karnika06) November 18, 2025 -
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
సుకుమార్ మాస్టర్ ప్లాన్.. RC17 సెట్స్ పైకి అప్పుడే..!
-
రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..
-
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ 'పెద్ది' టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్‌కి గురవుతున్నారట. రష్మిక కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇంకొన్నిరోజుల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఎలాంటి షూటింగ్ ఉండే అవకాశం లేదు.'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ మధ్యే 'చికిరి.. చికిరి' అనే పాటని రిలీజ్ చేశారు. అదెంత వైరల్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?) -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది తో టాలీవుడ్ లో రెహమాన్ రీ-ఎంట్రీ.. బద్దలవుతున్న మ్యూజిక్ రికార్డ్స్
-
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి. -
ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)
-
సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న మెగాస్టార్.. మెగాపవర్ స్టార్
ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్‌తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు కొల్లగొట్టింది.ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్‌తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. -
పెద్ది పాటలో చరణ్ స్టెప్స్, సలామ్ అనాలిని గుర్తు చేస్తున్నాయా?
-
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ రామ్ చరణ్ క్లాసిక్ స్టెప్పులేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ విషయంలో చాలామందిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. సోషల్‌మీడియాలో పెద్ద చర్చగా సాగుతుంది. చికిరి అంటూ చరణ్ వేసిన స్టెప్పులు చాలా యూనిక్‌గా ఉన్నాయని అభిమానులు చెబుతున్నప్పటికీ వారిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది.పెద్ది సినిమా నుంచి శుక్రవారం తొలి పాటని విడుదల చేశారు. చికిరి చికిరి... అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ సాహిత్యం అందించారు. సాంగ్ బాగుందని ప్రశంసలు కూడా వస్తున్నాయి. యూట్యూబ్‌లో అన్ని భాషలలో కలిపి 50 మిలియన్ల వ్యూస్‌కు చేరుకుంది. అయితే, అందరి మనస్సులలో ఒక ప్రశ్న ఉంది. ఈ పాటను తెలుగు, హిందీ, కన్నడ , మలయాళంలో విడుదల చేశారు. కానీ, తమిళ వెర్షన్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, దానికి కారణం మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.తమిళ ప్రేక్షకులు కూడా ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు. చరణ్, A.R. రెహమాన్ అభిమానులు కూడా సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతానికి, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే, కొంతమంది A.R. రెహమాన్ తన హైదరాబాద్ కచేరీలో తమిళ వెర్షన్‌ను ప్రత్యక్షంగా పాడవచ్చని ఊహిస్తున్నారు. చికిరి చికిరి తమిళ వెర్షన్‌ను మేకర్స్ ఎలా మార్కెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా!
‘చికిరి చికిరి...’ అంటూ హుషారైన స్టెప్పులేశారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు.‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ ఈ పాట సాగుతుంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫోక్ ఎనర్జీ, మోడ్రన్ బీట్స్‌తో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట అదిరిపోతుంది. రామ్‌చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్రేస్, చార్మ్ అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
పెద్ది 'చికిరి' ఫుల్ సాంగ్ విడుదల
రామ్‌చరణ్- బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘చికిరి చికిరి..’ (Chikiri Chikiri Song)అంటూ సాగే ఈ పాటకు చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌ను బాలాజీ రచించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
-
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్‌ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్‌ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్‌ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్‌తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్‌స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్‌కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్‌గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది. -
పెద్ది ఫస్ట్ సింగిల్ కోసం బుచ్చిబాబు కష్టాలు
-
రామ్ చరణ్.. మళ్లీ ఎందుకు మార్చేశారు?
మెగా అభిమానులు గమనించారో లేదో గానీ రామ్ చరణ్ విషయంలో చిన్న మార్పు జరిగింది. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే సోషల్ మీడియాలో దీన్ని గమనించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్‌తోనే తొలి నుంచి సినిమాలు చేశాడు. కానీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'గ్లోబల్ స్టార్' అనే ట్యాగ్‌ని అటు చిత్ర నిర్మాతలు గానీ ఇటు అభిమానులు గానీ గట్టిగానే ప్రమోట్ చేశారు. మొన్నటి వరకు ఈ ట్యాగ్ తరచుగా కనిపించేది. కానీ ఇప్పుడది మాయమైపోయింది. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం మాధురి ఎలిమినేట్!)ప్రస్తుతం చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. శ్రీలంకలో ఈ మధ్యే సాంగ్ షూట్ కూడా చేశారు. తాజాగా శనివారం హఠాత్తుగా హీరోయిన్ జాన్వీ కపూర్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ.. అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రకటించారు. ఈ పోస్టర్స్‌లో రామ్ చరణ్ పేరుకి ముందు మళ్లీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్' అని కనిపించింది. దీంతో మళ్లీ ఎందుకు మార్చేశారా అని మాట్లాడుకుంటున్నారు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం చరణ్ అంగీకారంతోనే ఈ ట్యాగ్ మార్పు జరిగిందని, ఇకపై ఇదే ట్యాగ్ వాడాలని అనుకుంటున్నారట. ఇదేనా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. 'పెద్ది' సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తెలుగులో చేస్తున్న రెండో సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నెలలో తొలి పాట రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)'దేవర'లో ఎన్టీఆర్ సరసన పల్లెటూరి అమ్మాయిలా చేసిన జాన్వీ కపూర్.. 'పెద్ది'లోనూ దాదాపు అలాంటి రోల్ లోనే కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌తో క్లారిటీ వచ్చేసింది. అచ్చియమ్మ అనేది జాన్వీ పాత్ర పేరు. చూస్తుంటే ఈమెది మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.'పెద్ది' మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కాగా.. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమన్ సంగీతమందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే మార్చి 27న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్స్‌లో కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తుంది. మరి అనుకున్న తేదీకి వస్తారా లేదంటే వాయిదా పడొచ్చా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)Our #Peddi's love with a firebrand attitude 😎🔥Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025 -
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్‌కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్‌తో... హీరో రవితేజ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్‌తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్‌తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్‌తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి గురువారం రామ్‌చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్‌చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్‌చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్‌తో రామ్‌చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్‌కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్‌హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్‌కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్‌కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్‌ను చేయనున్నారట. అలాగే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్‌కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్‌తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
"జైలర్" డైరెక్టర్ నెల్సన్ ఇప్పుడు రామ్ చరణ్ తో
-
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్‌చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్‌లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్‌చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్‌చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని చరణ్‌ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఉపాసన గుడ్ న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
-
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే! కవలలు రాబోతున్నారుమళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.చిరంజీవి కుటుంబంచిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్‌చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్‌తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్‌తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్‌ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.చిరంజీవి కోరిక నెరవేరేనా?దీంతో ఓ ఈవెంట్లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి! View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్! -
'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన కొణిదెల
-
ఉపాసన గుడ్‌న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు. ఆపై ఆమెకు పూలు, పండ్లు, కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు. మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సందడిగా కనిపించారు.మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే 'సింబా' వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
చిరుతో రామ్ చరణ్ మరో భారీ ప్లాన్..
-
రంగస్థలం - 2 సినిమాకు రంగం సిద్ధం
-
చెర్రీ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త.. సుక్కు సినిమాకు ముహూర్తం ఫిక్స్..!
-
ఫిబ్రవరిలో ప్రారంభం
‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్‌లో జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. గతంలో రామ్‌చరణ్, సుకుమార్ కలిసి ఈ సినిమా కథా చర్చల కోసం దుబాయ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దుబాయ్‌లో ఉంటూ, ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట.ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కృతీ సనన్, సమంత వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలోని ఈ సినిమా వచ్చే మార్చి 27న రిలీజ్ కానుంది. -
శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్‌చరణ్.. వీడియో చూశారా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ చిరుత (2007) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ శ్రియ 2001లో వచ్చిన ఇష్టం చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. అంటే చరణ్ కంటే శ్రియ సీనియర్. వీరిద్దరూ జంటగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్లో చరణ్ తల్లిగా కనిపించింది.తొలిసారి కెమెరా ముందు రామ్చరణ్దానికంటే ముందు కూడా వీరు కలిసి యాక్ట్ చేశారు. అదెప్పుడంటారా? ఓ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ సీన్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టింగ్ కోచ్ కిశోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan), శ్రియా శరణ్‌లపై ఓ సీన్ చిత్రీకరించాం. చరణ్ కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి.ఇబ్బందిపడ్డ చరణ్చెప్పాలంటే అది ఒక వరంలాంటిది. ఫస్ట్ టైం కావడంతో చరణ్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. శ్రియా (Shriya Saran) అప్పటికే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా సినిమాలు చేసింది. కానీ శిక్షణ తీసుకుంటే మరింత రాటుదేలుతుందని నా అభిప్రాయం. కోచ్‌గా తనకెప్పుడూ పాజిటివ్ ఫీడ్‌బ్యాకే ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్‌గా మారింది. అందులో చరణ్ కాస్త పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, కళ్లజోడుతో కనిపించాడు. కెమెరా వంక చూసేందుకు సిగ్గుపడ్డాడు. డైలాగులు చెప్పేందుకు తనలో తానే ఘర్షణకు లోనయ్యాడు.అప్పటికీ, ఇప్పటికీ అంతే అందం!అప్పటికే శ్రియ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ కావడంతో ఏమాత్రం బెరుకు లేకుండా యాక్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్ ఇలా ఉన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెలా ఉన్నాడు? ఇప్పుడే రేంజ్‌కు ఎదిగిపోయాడు అని కొందరు అబ్బురపడుతున్నారు. శ్రియ.. అప్పటికీ, ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. శ్రియ చివరగా మిరాయ్ సినిమాలో నటించింది. రామ్‌చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) చదవండి: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో -
మరోసారి చిరు - రామ్ చరణ్ మూవీ ఫిక్స్..!
-
పెద్ది తర్వాత నీల్ తో .. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.'మన ప్రధానమంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుకున్న విజన్‌ని పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు.మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
రాజమౌళికి 'జక్కన్న' పేరు ఎవరు పెట్టారో తెలుసా? (ఫోటోలు)
-
పుణేకి పెద్ది
ప్రేయసితో కలిసి పుణేలో ల్యాండ్ అయ్యాడు పెద్ది. అక్కడి అందమైన పరిసరాల్లో ఇద్దరూ ఆటా పాటా మొదలుపెట్టారు. రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించినదే ఈ ఆటా పాటా. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పుణేలో ఆరంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ పై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ రత్నవేలు. -
దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్ డేట్స్ లాక్..!
-
క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్‌కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్‌తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
పెద్ది లుక్‌తో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన రామ్ చరణ్ (ఫొటోలు)
-
ఫ్లాప్ హీరోయిన్ కు రామ్ చరణ్ బంపర్ ఆఫర్
-
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన సినీ ప్రయాణంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన చిరు.. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదును గుర్తు చేసుకుంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చెర్రీకి అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు స్పెషల్ డే కావడంతో పెద్ది మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. అరంగేట్రం నుంచి మీ సినీప్రయాణం అద్భుతమంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కెరీర్లో పెద్ది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెర్రీ అభిమానులకు బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించనుంది. మెగా హీరో రామ్ చరణ్.. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 18 YEARS OF “MEGA POWER STAR” IN CINEMA ❤🔥From the most awaited debut to one of the most celebrated actors, your journey in cinema has been sensational @AlwaysRamCharan Sir ❤️I'm so happy to be a part of this incredible journey Sir ❤️🤗🙏Dear @AlwaysRamCharan fans, #Peddi… pic.twitter.com/QCLQFCRGqt— BuchiBabuSana (@BuchiBabuSana) September 28, 2025 -
రామ్ చరణ్ - సుకుమార్ మూవీ అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే
-
రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?
మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన గ్లింప్స్ చూసి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఇది ఓకే అయింది. తాజాగా ఈ సినిమా పనులు కూడా షురూ అయ్యాయి. అయితే హీరోయిన్ గురించి వినిపిస్తున్న రూమర్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది.చరణ్-సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మరోసారి ఈ కాంబో అనేసరికి అంచనాలు గట్టిగానే ఏర్పడుతున్నాయి. మరోవైపు 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ తీస్తున్న ప్రాజెక్ట్ కావడం కూడా హైప్‌కి కారణం. ఈ మూవీలో హీరోయిన్గా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని లాక్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రియుడి వల్ల ప్రతిరోజూ శారీరకంగా టార్చర్: ఆర్జీవీ హీరోయిన్)కృతి సనన్ విషయానికొస్తే సుకుమార్ తీసిన 'వన్ నేనొక్కడినే' సినిమాతోనే హీరోయిన్ అయింది. తర్వాత తెలుగులో 'దోచెయ్' చేసింది గానీ ఈ రెండూ ఫెయిలయ్యాయి. దీంతో పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో కొన్ని హిట్స్ కొట్టినప్పటికీ.. గత రెండు మూడేళ్లలో మాత్రం ఈమె చేసిన సినిమాలు చేసినట్లు ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఇలాంటి ఈమెని ఇప్పుడు చరణ్ సరసన హీరోయిన్గా తీసుకుంటున్నారనేసరికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.అయితే సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడ ఇంపార్టెన్స్ కచ్చితంగా ఉంటుంది. బహుశా పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా కృతి సనన్ పేరు పరిశీలిస్తున్నారా అనే సందేహం కూడా వస్తోంది. చూడాల మరి ఎవరిని ఫైనల్ చేస్తారో? ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలున్నాయి. 2027లో రిలీజ్ కావొచ్చని టాక్.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్) -
రామ్‌చరణ్‌తో జోడీ?
హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘ఆర్సీ 17’ అన్నది వర్కింగ్ టైటిల్. ‘రంగస్థలం’(2018) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్. ‘పెద్ది’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం లేకుండా ‘ఆర్సీ 17’ని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట రామ్‌చరణ్– సుకుమార్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.అయితే రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతీసనన్ని తెలుగుకి పరిచయం చేశారు సుకుమార్. ఆ తర్వాత ‘దోచెయ్, ఆదిపురుష్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు కృతీసనన్. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని ‘ఆర్సీ 17’ ద్వారా మరోసారి టాలీవుడ్‌కి తీసుకురానున్నారట సుకుమార్. మరి రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే
-
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)... అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)... రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్)... టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)... ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... ఇలా అన్ని ఆటల్లో లీగ్‌ల హవా సాగుతున్న వేళ...కొత్తగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు కూడా వచ్చే నెలలో తెరలేవనుంది. న్యూఢిల్లీ: ప్రతిభకు పట్టం కడుతూ... ఆటకు మరింత విస్తృత ప్రచారం కల్పిస్తూ... ప్రపంచ ఆర్చరీలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యంగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగునున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌లో 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. వారిలో 12 మంది విదేశీయులు కాగా... మిగిలిన 36 మంది స్వదేశీ ఆర్చర్లు. ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్లు ఆండ్రియా బెకెర్రా (కాంపౌండ్), బ్రాడీ ఎలీసన్ (రికర్వ్) ఈ లీగ్‌లో భాగం కానున్నారు. భారత్ నుంచి స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్ ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ లీగ్‌తో భారత ఆర్చరీ ముఖచిత్రం మారిపోతుందని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) భావిస్తోంది. ‘ఆర్చరీలో మనకు ఘన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి మన దేశంలో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వరల్డ్‌కప్, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్ ఇలా ప్రతి పోటీలోనూ భారత ఆర్చర్లు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో మాత్రం పతకం ఇంకా బాకీ ఉంది. ఈ లీగ్ ద్వారా ఆ ముచ్చట కూడా తీరడం ఖాయమే’ అని ఏఏఐ కార్యదర్శి వీరేంద్ర సచ్దేవ్ అన్నారు. » ఒక్కో జట్టులో నలుగురు మహిళలు, నలుగురు పురుష ఆర్చర్ల చొప్పున 8 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీయుల్లో ఒకరు పురుష ఆర్చర్, మరొకరు మహిళా ఆర్చర్ ఉంటారు. » భారత ఆర్చరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆర్చర్లను ఎంపిక చేశారు. » కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఒలింపిక్ ప్రమాణాలకు తగ్గట్లు 70 మీటర్లు, 50 మీటర్లలో పోటీలు జరుగుతాయి. ఈ లీగ్ మొత్తం ప్రైజ్‌మనీ 2 కోట్ల రూపాయలు. » రౌండ్ రాబిన్ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్‌లు (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకన్ల సమయం ఇస్తుండగా... ఈ లీగ్‌లో 15 సెకన్లకు తగ్గించారు. » రికర్వ్ విభాగంలో మూడో ర్యాంకర్ దీపిక కుమారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌తో పాటు వెటరన్స్ అతాను దాస్, తరుణ్‌దీప్ ఉన్నారు. » కాంపౌండ్ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ రిషభ్ యాదవ్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్, పర్ణీత్ కౌర్ బరిలో ఉన్నారు. ఏ జట్టులో ఎవరున్నారంటే...పృథ్వీరాజ్ యోధాస్ (ఢిల్లీ): మాటియస్ గ్రాండె, ఆండ్రియా బికెర్రా, అభిషేక్ వర్మ, గాథ, ప్రియాంశ్, శర్వరి, క్రిష్ కుమార్, ప్రాంజల్. చెరో ఆర్చర్స్ (జార్ఖండ్): మాథియస్ ఫుల్లెర్టన్, క్యాథరినా బ్యూర్, రాహుల్, ప్రీతిక ప్రదీప్, అతాను దాస్, మాదాల సూర్య హంసిని, సాహిల్ రాజేశ్, కుంకుమ్ మొహొద్. కాకతీయ నైట్స్ (తెలంగాణ): నికో వైనెర్, ఎలియా క్యానల్స్, నీరజ్, వెన్నం జ్యోతి సురేఖ, రోహిత్, అవ్నీత్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, తిషా పునియా. చోళా చీఫ్స్ (తమిళనాడు): బ్రాడీ ఎలీసన్, మీరి మారిటా, రిషభ్ యాదవ్, దీపిక కుమారి, తరుణ్‌దీప్ రాయ్, తనిపర్తి చికిత, పులకిత్, అన్షిక కుమారి. మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర): మైక్ స్కాలెస్సర్, అలెగ్జాండ్రా వాలెన్సియా, బొమ్మదేవర ధీరజ్, పరీ్ణత్ కౌర్, అమన్ సైనీ, భజన్ కౌర్, మృణాల్ చౌహాన్, మధుర. రాజ్‌పుతానా రాయల్స్ (రాజస్తాన్): మెటా గాజోజ్, ఎల్లా గిబ్సన్, ప్రథమేశ్, అంకిత, ఓజస్ ప్రవీణ్, బసంతి, సచిన్ గుప్తా, స్వాతి. ఏపీఎల్ డైరెక్టర్‌గా అనిల్ కామినేని ఈ లీగ్‌కు రూపకల్పన చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని... ఏపీఎల్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌తో భారత ఆర్చర్లకు ఎంతో లాభం జరుగుతుందని అనిల్ వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్చరీ సంఘంతో ఈ లీగ్ గురించి చర్చించాం. ఇకపై ప్రతీఏటా దీన్ని నిర్వహిస్తామని అందుకు తగ్గట్లు అంతర్జాతీయ షెడ్యూల్ రూపొందించాలని చెప్పాం. ప్రస్తుతం ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరంభ లీగ్‌లో పలువురు కొరియా స్టార్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ లీగ్ సమయంలో వారి దేశంలో సెలెక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. ఫలితంగా ఈసారి నుంచి కాకుండా వచ్చే ఏడాది కొరియా ప్లేయర్లను కూడా చూడవచ్చు’ అని అనిల్ తెలిపారు. సినీనటుడు రామ్‌చరణ్ ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. ప్రపంచ ఆర్చరీలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఈ లీగ్ రూపకల్పన చేసినట్లు డైరెక్టర్ అనిల్ కామినేని వెల్లడించారు. ఆర్చరీలో కొత్త విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలపడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్చరీని మరింత మందికి చేరువ చేసేందుకు రామ్‌చరణ్‌ను అంబాసిడర్‌గా ఎంపికచేసినట్లు వివరించారు. -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
భారత్‌లో తొలిసారి జరుగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)కు గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఏపీఎల్ అరంగేట్రం ఎడిషన్ న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది.ఈ లీగ్‌లో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లు పోటీ పడనున్నారు. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ లీగ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ఇందులో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు. ఈ లీగ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీ పడతారు. View this post on Instagram A post shared by Archery Premier League (@archerypremierleague)ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే ఏపీఎల్‌తో బంధం ఏర్పరచుకున్నాను. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ లీగ్ భారత ఆర్చర్లకు గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్ వేదికగా ఉపయోగపడనుంది. ఈ లీగ్ వారి భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు తోడ్పడుతుందన్న గట్టి నమ్మకం మాకుంది. ఆర్చరీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్ దోహదపడుతుంది. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో బ్రాండ్ అంబాసీడర్‌గా ఉండటం వల్ల దేశంలోని చాలా మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితులయ్యే ఆస్కారం ఉంటుందని అన్నారు.ఏఏఐ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. దేశంలోని మిగతా లీగ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్‌ను ఏర్పాటు చేశాం. ఏపీఎల్‌ను ప్రొఫెషనల్ స్థాయికి తగ్గట్లుగా నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, భారత ఒలింపిక్ స్వప్నాన్ని సాకారం చేసే మెట్టుగా మారనుంది. రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండటం ద్వారా ఈ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.పెద్దిలో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్‌ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్‌స్టోన్స్, డైమండ్స్ వాచ్‌ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్‌తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్‌బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్‌గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్‌టైల్ ఆటోమేటిక్ టూర్‌బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్‌లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్‌ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.మహేశ్ బాబుకి ఏఎమ్‌బీ, అల్లు అర్జున్‌కి ఏఏఏ, రవితేజకు ఏఆర్టీ, విజయ్ దేవరకొండకు ఏవీడీ పేరుతో మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆసియన్ సునీల్‌తో కలిసి ఈ హీరోలందరూ థియేటర్ బిజినెస్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రంగంలోకి రాబోతున్నారట. త్వరలో లాంఛనంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)అయితే పైన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్‌లు తెలంగాణలోనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్.. తన ఏఏఏ సినిమాస్‌ని వైజాగ్‌లోనూ లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రాలోనే ఏఆర్సీ(ARC) సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం చర్చలో దశలో ఉందని, త్వరలో ఎక్కడ నిర్మించాలనేది ఫిక్సవుతారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీలానే చరణ్ కూడా వైజాగ్‌లోనే థియేటర్ నిర్మిస్తాడా? లేదంటే విజయవాడ, తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఘోరమైన దెబ్బ పడింది. దీంతో 'పెద్ది' హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా) -
ధూమ్ 4 లో ప్రభాస్, ఎన్టీఆర్..? LCU లోకి రామ్ చరణ్..?
-
9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో పోస్ట్ చేసిన మెగా కోడలు
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు చేసింది. గురు పౌర్ణమి రోజున ప్రారంభించిన సాయిబాబా వ్రతం పూర్తి చేసుకుంది. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశానని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వ్రతాన్ని లతా సిస్టర్‌తో(క్లీంకార నర్సు) కలిసి ప్రారంభించినట్లు తెలిపింది.ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..' గురు పూర్ణిమ నాడు ప్రారంభమైన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింగి. శాంతి, విశ్వాసం, స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించా. నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈ రోజు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాము. జై సాయిరామ్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మొదటి పాటకి వేళాయె
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి మొదటి పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు రామ్‌చరణ్, బుచ్చిబాబు, వెంకట సతీష్ కలిసి ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఉన్న ఫోటోని షేర్ చేసింది యూనిట్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
Sukumar: పెద్ది కోసం ఊహించని కొత్త స్టోరీ రెడీ..!
-
'మోగ్లీ' గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్
-
కర్ణాటక సీఎంతో రామ్‌చరణ్ భేటీ
కర్ణాటక: మైసూరు వద్ద సినిమా షూటింగ్లో ఉన్న సినీ నటుడు రామ్‌చరణ్ ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా మైసూరు నగరం చుట్టుపక్కల ‘పెద్ది’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మైసూరులోని నివాసంలో సీఎం సిద్దరామయ్య ఉన్నట్లు తెలుసుకున్న రామ్‌చరణ్ వచ్చి ఆయన్ను కలిశారు. శాలువాతో సిద్దరామయ్యను సన్మానించి కొంతసేపు ముచ్చటించారు. -
అమ్మమ్మని చివరి చూపు చూడటానికి వచ్చిన రామ్ చరణ్
-
రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్‌తో స్పెషల్ సాంగ్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్‌ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. May Lord Ganesha bring peace, success and positivity into your lives.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025 -
వారి కోసం రెండు షిఫ్టులు పని చేస్తాను: శ్రీలీల
ఈ మధ్య సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా టాక్ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల తన తల్లితో కలిసి పాల్గొంది. కాగా ఈ షోలో శ్రీలీలకు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకేసారి కాల్షీట్లు అడిగితే ముందు ఎవరికి కాల్షీట్ ఇస్తావ్? అనే ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీలీల ఎప్పట్లానే తన స్టైల్లో గడసరి సమాధానం చెప్పింది. ఈ ఇద్దరి కోసం రెండు షిఫ్టులు పనిచేస్తుందట. ఇక మహేష్ బాబు, రవితేజలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది.పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్‌హుడ్, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. -
Yash Raj Films: ధూమ్-4 లో విలన్ ఎవరు
-
ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు!
'వారసత్వం వల్లో, నేను ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్లో ఈ స్థాయికి రాలేదు, నా స్వశక్తితో ఎదిగాను' అంటోంది రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Kamineni Konidela). 'ద ఖాస్ ఆద్మీ' పార్టీ పేరిట తన ఆలోచనలను సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సంపద, హోదా, విజయం, పాపులారిటీ.. ఏది మనల్ని గొప్పవారిని చేస్తుంది? అంతర్గత లక్షణాలైన భావోద్వేగాలపై స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం గొప్పవారిని చేస్తాయా? దీనికి ఎక్కడా సరైన సమాధానం ఉండదు. ఎవరికి వారే తమలోనే సమాధానం వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మడం, నిన్ను నువ్వు ప్రేమించి, నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం అని నా అభిప్రాయం.సమాజం ప్రోత్సహించదుసమాజం ఎప్పుడూ ఆడవారిని వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే.. మనవంతు వచ్చేవరకు ఆగమంటుంది. నిస్వార్థంగా ఉండటమే మంచిదని చెప్తుంది. పెద్ద కలలు కనేందుకు ఎంకరేజ్ చేయదు. మనం ఎదగడానికి ప్రోత్సహించదు. అయినా నేను మంచి స్థాయిలో నిలబడ్డాను. దీనికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్‌చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించాను.కిందపడ్డ ప్రతిసారి లేచా..ఎలాగైనా సరే, జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను, పాటుపడ్డాను. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వేసేది. కిందపడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరుతుంది. కానీ ఆత్మగౌరవం.. నిశ్శబ్ధంగా గుర్తింపును సృష్టిస్తుంది అని ఉపాసన రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ -
రామ్ చరణ్‌కి అమ్మగా ఛాన్స్.. రిజెక్ట్ చేసేశా: ప్రముఖ నటి
సినిమాల్లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. నిజ జీవితంలో హీరోల కంటే తక్కువ వయసులో ఉన్న కొందరు.. అదే హీరోలకు తల్లి-పిన్ని తరహా పాత్రలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మలయాళ నటికి ఏకంగా రామ్ చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఆమె దాన్ని మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఎవరామె? ఏంటి సంగతి?మలయాళ నటి స్వాసిక తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. రీసెంట్గా రిలీజైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్‌గా చేసింది ఈమెనే. 2009లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. మలయాళ, తమిళ సినిమాలు చేసింది. రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది రిలీజైన తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్‌కి తల్లిగా అద్భుతంగా నటించింది. ఈ మూవీ వచ్చిన తర్వాత నుంచి ఈమె తల్లి పాత్రలే చాలా వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))'తల్లి పాత్రల ఆఫర్స్ వరసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కాదు గానీ రామ్ చరణ్‌కి తల్లిగా నటించే ఛాన్స్ రావడం మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. 'పెద్ది' మూవీ కోసమే అడిగారు. కానీ నేను చేయనని చెప్పేశాను. చేసుంటే ఎలా ఉండేదే ఏమో గానీ ఇప్పుడు ఒప్పుకోవడం కరెక్ట్ కాదనిపించింది. భవిష్యత్తులో ఇదే అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తాను' అని స్వాసిక చెప్పుకొచ్చింది.ప్రస్తుతం స్వాసిక వయసు 33 ఏళ్లే. రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు. ఒకవేళ చేసుంటే మాత్రం క్రేజీగా ఉండేదేమో. స్వాసిక వ్యక్తిగత విషయానికొస్తే.. నటుడు ప్రేమ్ జాకబ్‌ని గత కొన్నేళ్లుగా ప్రేమించింది. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా వచ్చిన రెట్రో, మామన్, తమ్ముడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సూర్య 'కరుప్పు' మూవీలో కీలక పాత్ర చేస్తోంది.'పెద్ది' విషయానికొస్తే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఓ గ్లింప్స్ రాగా అంచనాలు పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)🔥 #Swasika’s BOLD response to being offered a mother’s role in #RamCharan’s movie! 😱 #Swasika #RamCharan #Kollywood #TamilCinema #RamCharan𓃵 #Ramcharan #Peddi #Peddi #swasika pic.twitter.com/4JQoobYtHE— Mix Show (@MixShow1016584) August 24, 2025 -
‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్‌కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్‌తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్‌లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్‌కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్‌ని అలరించబోతున్నారు. -
నువ్వు నా హీరో.. తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రామ్‌చరణ్
తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.నా హీరో..నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ -
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన ముద్దల కూతురు క్లీంకార ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని ఇన్‌స్టాలో ఉపాసన పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ లేదా ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ విశేషాలతో పాటు తమ కూతురి ఫోటోలను అభిమానులతో ఉపాసన షేర్ చేస్తారు. ఈసారి క్లీంకార తీసుకునే ఆహారం గురించి ఉపాసన చెప్పారు. రోజూ తన డైట్లో ఒక పదార్థం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.క్లీంకార రోజూ తీసుకునే డైట్లో 'రాగులు' తప్పకుండా ఉంటాయని ఉపాసన ఇలా చెప్పారు.' రాగులతో తయారు అయిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పట్నుంచి నాకు చాలా ఇష్టమైన ఆహారం కూడా ఇదే. దీంతో క్లీంకారకు కూడా దీనినే అలవాటు చేశాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ.. క్లీంకారకు రోజూ రాగుల్ని ఏదో రూపంలో అందించమని సూచించారు. ఆయన కూతరు రాధే జగ్గీ కూడా ఇదే మాట చెప్పింది. తను కూడా చిన్నప్పట్నుంచీ రాగి జావ తాగేదానినని పేర్కొంది. అందికే వారిద్దరూ ఫిట్‌గా ఉన్నారు. భవిష్యత్‌లో నా కూతురు కూడా హెల్దీగా ఉండాలని తన రోజువారి డైట్లో రాగుల్ని చేర్చాను' అంటూ ఆమె చెప్పారు. అయితే, వైద్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించకుండా ఉపయోగించాలని లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే రాగుల్ని అలవాటు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. -
'ధూమ్ 4'లో చెర్రీ, ఎన్టీఆర్..?
-
సరికొత్త పెద్ది
‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్‌చరణ్‌ను సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్‌లో రామ్‌చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రంగస్థలం -2 ప్లాన్ స్టార్ట్?
-
ఉపాసన కోసం 200 నంబర్స్ మార్చిన చెర్రీ..!
-
ఉపాసన ఫోన్లో చరణ్ నెంబర్ ఏ పేరుతో ఉంటుందో తెలుసా?
సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను, సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు? రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటి? జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు? తదితర విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.ఆ పేరుతో చరణ్ మొబైల్ నెంబర్సాధారణంగా భార్యభర్తలు తమ భాగస్వామి మొబైల్ నెంబర్లను ముద్దు పేరుతో సేవ్ చేసుకుంటారు. మహిళలు అయితే తమ భర్త పేరుని హబ్బీ, బేబీ, స్వీట్హార్ట్, మై లవ్..తదితర పేర్లతో సేవ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం చరణ్ నెంబర్ని వెరైటీ పేరుతో సేవ్ చేసుకుంది. తన ఫోన్లో చరణ్ నెంబర్ని ‘రామ్ చరణ్ 200(Ram Charan 200)’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఉపాసననే తెలియజేస్తూ..ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది.అందుకే ఆ పేరు.. చరణ్ నెంబర్ని రామ్ చరణ్ 200 అని ఎందుకు సేవ్ చేసుకుందో ఉపాసన వివరించింది. ప్రస్తుతం చరణ్ వాడుతున్న సిమ్ సంఖ్య ఇదట. ఇప్పటి వరకు ఆయన 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానని నవ్వూతూ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ 200 సార్లు మొబైల్ నెంబర్స్ మార్చారా? అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఊ అంటారా?
బ్లాక్‌బస్టర్ సినిమా ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ... వీరిద్దరూ ఈసారి హీరో, హీరోయిన్లుగా నటించడంలేదట. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీల వంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ (2021) సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావ...’ స్పెషల్ సాంగ్ బాగాపాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఈపాట తర్వాత సమంత మరో స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి... రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకపాటకు సమంత ‘ఊ’ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్ -
షూటింగులు బంద్.. పెద్ది సినిమాకు ఎఫెక్ట్
-
బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ - ఉపాసన (ఫొటోలు)
-
ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?
మెగా హీరో రామ్ చరణ్.. 13 ఏళ్ల క్రితం ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం తర్వాత లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ వచ్చారు గానీ గత కొన్నేళ్లలో మాత్రం సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ ఫుడ్ వ్లాగ్స్ చేసే హిందీ యూట్యూబర్.. ఉపాసనని ఇంటర్వ్యూ చేసింది. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి, ఫుడ్ తింటూ ఆనాటి సంగతుల్ని అడిగింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు రామ్ చరణ్‌కి పెట్టిన లవ్ టెస్ట్ గురించి ఉపాసన బయటపెట్టింది.(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)చరణ్-ఉపాసనలది పెద్దల కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. పెళ్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఓ రోజు ఉపాసన.. 'చరణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే 'ఫేమస్ ఐస్ క్రీమ్' షాప్‌కి తీసుకెళ్లు అని అడిగాను. అప్పుడు మా ఫ్యామిలీ ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉండేవాళ్లం. అక్కడే మొజంజాహి మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్' 'హైదరాబాద్‌లో ఉన్న పాత ఐస్ క్రీమ్ షాప్స్‌లో అదొకటి. అది మార్కెట్ మధ్యలో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా సరే నేను అడిగానని ఓకే చెప్పి తీసుకెళ్లాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. కానీ అక్కడి జనాలు చరణ్‌ని గుర్తుపట్టి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతడికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే' అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మెగా కోడలికి తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)అలానే తమ కుటుంబంలో ప్రారంభించిన 'అత్తమ్మాస్ కిచెన్' ఎలా ప్రారంభమైందో కూడా ఉపాసన చెప్పుకొచ్చింది. 'మా ఇంట్లో అందరూ బాగా తింటారు. బాగా వండుతారు కూడా. మేం వేరే దేశాలకు వెళ్లినప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్‌కి వెళ్తాం. అయినా సరే అక్కడ రాత్రయ్యేసరికి.. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతాడు. ఆ టైంలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. బయట దేశాలకు వెళ్లినప్పుడు ఇలా చరణ్ చాలా కష్టపడేవాడు. అలా అత్తమ్మాస్ కిచెన్ ఆలోచన వచ్చింది' అని చెప్పింది.'అయితే ఈ బిజినెస్ గురించి తొలుత మా అత్తమ్మకు(సురేఖ) చెబితే ఎందుకు అని అన్నారు. విదేశాలకు వెళ్లినా మనలానే చాలామంది సౌత్ ఇండియన్ ఫుడ్ వెతుక్కోవడం కష్టం. అందుకే ఈ బిజినెస్ అని చెప్పాను. ఈ బిజినెస్‌కి చాలా పేర్లు అనుకున్నాం కానీ చివరకు అత్తమ్మాస్ కిచెన్ అని ఫిక్సయ్యాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) -
వీకెండ్ వర్కవుట్.. ఓకే ఫోటోలో మెగా హీరోలు!
మెగా హీరోలంతా ఓకే చోట సందడి చేశారు. జిమ్‌లో చెమట్చోస్తూ కనిపించారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీకెండ్లో ఇలా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఏకంగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పిక్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్నారు. సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టుకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
క్రికెట్ టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న పెద్ది షాట్!
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్‌కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్‌ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్‌లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్‌ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.All the best to the teams participating. Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025 -
RC 17 స్టోరీ లైన్ లీక్.. హాలీవుడ్ రేంజ్ లో మూవీ
-
విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్
-
హాలీవుడ్ రేంజ్ లో సుకుమార్, రామ్ చరణ్ మూవీ..!
-
బుల్లితెరపై తొలిసారి రంగస్థలం మూవీ.. దాదాపు ఏడేళ్ల తర్వాత!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.అయితే రంగస్థలం విడుదలై ఇప్పటికే ఏడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో బుల్లితెరపై అలరించిన ఈ సినిమా.. ఇప్పటివరకు హిందీ మాత్రం రాలేదు. తాజాగా రంగస్థలం సినిమాను ఏడేళ్ల తర్వాత హిందీలో బుల్లితెరపై సందడి చేయనుంది. ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు గోల్ట్ మైన్స్ ఛానెల్లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ట్విటర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #Rangasthalam (Hindi) | 24th August Sunday 8:00 PM | Tv Par Pehli Baar | Primere Only On #Goldmines TV Channel#RangasthalamHindi #rangasthalammovie @AlwaysRamCharan @Samanthaprabhu2 #JagapathiBabu #AnasuyaBharadwaj @prakashraaj #RamCharan #samantharuthprabhu pic.twitter.com/4OebzT3gJs— Goldmines Telefilms (@GTelefilms) July 28, 2025 -
ఆటా పాటా
పెద్దితో కలిసి ఆటాపాటాతో బిజీ కానున్నారట జాన్వీ కపూర్. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ అండ్ రూరల్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు బుచ్చిబాబు.కాగా ఈ వారంలో ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో జాన్వీ కపూర్ పాల్గొంటారని తెలిసింది. రామ్‌చరణ్ – జాన్వీలపై ఓ పాటతో పాటు, లవ్ ట్రాక్, కీలక టాకీ పార్ట్ తీయనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. అది అమానవీయ చర్య మహారాష్ట్రలోని ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్‌పై గోకుల్ ఝా అనే వ్యక్తి చేసిన అమానుష దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఇది చాలా అమానవీయమైన చర్య. అలాంటి వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే. ఆ ఘటనను ఖండించి, అతడిని శిక్షించక పోతే అది మనకే సిగ్గుచేటు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేశారు జాన్వీ. ఇక గోకుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. -
బాబాయ్ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ మెగా హీరోలు మాత్రం!
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్‌కు ముందు హల్చల్ చేశారు. కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్సాహంగా థియేటర్‌కు వెళ్లిన అభిమానులు.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్ తగిలినట్లే అర్థమవుతోంది.అయితే హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు.అయితే మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ.. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్ చెప్పలేదు. దీంతో బాబాయ్ సినిమాకు చెర్రీ పోస్ట్ పెట్టకపోవడంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.The Power Storm we've all been waiting for is finally coming to the big screens in just a few hours.. Wishing my guru @PawanKalyan mama, a historic blockbuster with #HariHaraVeeraMallu 🔥@DirKrish garu’s foundation for a powerful story, along with the commendable efforts of… pic.twitter.com/iR7MYcuYtZ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 23, 2025 It's Veera's Time 🔥Wishing the team of #HariHaraVeeraMallu all the success❤️A lot of hearts gone into this, hoping for a powerful blockbuster! 👊Super excited to watch Kalyan babai again on the Big Screen!! Power storm is coming! ❤️ pic.twitter.com/mHVHcXr45B— Varun Tej Konidela (@IAmVarunTej) July 23, 2025 -
ఇండస్ట్రీ నే షేక్ చేస్తోన్న.. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్
-
చరణ్ 'పెద్ది'.. ఈ రేంజులో మారిపోయాడేంటి?
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. తర్వాత సినిమా 'గేమ్ ఛేంజర్'తో అందరినీ పూర్తిగా నిరాశపరిచాడని చెప్పొచ్చు. అయితేనేం 'పెద్ది' మూవీతో అదిరిపోయే రేంజులో అదరగొట్టేయబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇదివరకే వచ్చిన గ్లింప్స్ ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయేలా మరో అప్డేట్ వచ్చేసింది.త్వరలో 'పెద్ది' కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇందుకోసం జిమ్‌లో చరణ్ చెమటలు చిందిస్తున్నాడు. మొత్తంగా హ్యాండ్స్, బైసెప్స్ లాంటివి కాస్త గట్టిగానే పెంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో చరణే పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం అని ఫిక్సయిపోతున్నారు.(ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్)బుచ్చిబాబు తీస్తున్న 'పెద్ది' చిత్రాన్ని రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇందులో చరణ్.. క్రికెట్, కబడ్డీ ఆటగాడి పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు కనిపిస్తున్న బాడీ.. యాక్షన్ సన్నివేశాల కోసమనిపిస్తోంది. ఈ రేంజు బాడీతో ఫైట్ సీన్స్ అంటే విలన్స్ గాల్లోకి లేస్తారేమో?'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రోజురోజుకి హైప్ పెంచుతున్న ఈ మూవీ నుంచి ముందు ముందు ఇంకెన్ని సర్ప్రైజులు వస్తాయో చూడాలి.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి తన 37వ పుట్టినరోజుని ఇంట్లోనే సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్-ఉపాసనతో పాటు కూతురు క్లీంకార కూడా కనిపించింది. ఆమె ఫేస్ కూడా కాస్త రివీల్ అయింది.(ఇదీ చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్)సెలబ్రిటీలు చాలావరకు తమ తమ పుట్టినరోజుని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చరణ్-ఉపాసన కూడా గతంలో వెళ్లారు. అయితే ఈసారి మరి చరణ్ షూటింగ్ షెడ్యూల్స్ వల్లనో ఏమో గానీ ఇంట్లోనే సింపుల్‌గా పుట్టినరోజు జరుపుకొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పోస్ట్ దిగువన మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఉపాసనకు విషెస్ చెబుతున్నారు.చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల ముందు వరకు ఢిల్లీ షూటింగ్ చేసొచ్చారు. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజైన గ్లింప్స్ మంచి రెస్పాన్ అందుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది. ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్‌లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్‌గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్‌రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది. -
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
రామ్ చరణ్- బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'.. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో చరణ్ మెప్పించాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే, తాజాగా మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో మేకర్స్ రివీల్ చేశారు. ఇదే సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన పాత్ర పేరు 'గౌర్నాయుడు' అని రివీల్ చేశారు.పెద్ది సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్‌కుమార్ గతంలో ఇలా చెప్పారు. 'ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.' అని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు కోచ్‌గా శివరాజ్‌కుమార్ నటిస్తున్నట్లు సమాచారం.వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
ఫ్యామిలీ మేన్
ఇటీవలి కాలంలో వెండితెరపై యాక్షన్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్తంతో వెండితెర ఎర్రబడింది. కానీ ఈ సంక్రాంతి పండక్కి స్క్రీన్‌పై వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్స్‌లో నవ్వులు నింపింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని, సరైన ఫ్యామిలీ కథా కథనాలతో వస్తే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని మరోసారి నిరూపితమైంది.‘సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్’ వంటి చిత్రాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా నిలిచాయి. దీంతో ఇన్ని రోజులు యాక్షన్ మూవీస్ చేసిన స్టార్స్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మేన్’గా మారిపోయారు. కుటుంబ అనుబంధాలు, కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ మేన్‌గా మారిపోయి, ఫ్యామిలీ స్టార్స్‌గా సిల్వర్ స్క్రీన్‌పైకి రానున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ ‘రౌడీ అల్లుడు, బావగారూ.. బాగున్నారా!, శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి చిత్రాల్లో చిరంజీవి చేసిన ఫన్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. ఆ తరహా వింటేజ్ చిరంజీవిని మళ్లీ వెండితెరపైకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తీసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోందని తెలిసింది. కాగా ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ అనే డ్రిల్ మాస్టర్పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, చిరంజీవి–నయనతార ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరిన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారని, ఇటీవల జరిగిన ముస్సోరి షూటింగ్ షెడ్యూల్లో క్యాథరిన్పాల్గొన్నారని, నెక్ట్స్ జరగబోయే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో వెంకటేశ్ సైతంపాల్గొంటారని తెలిసింది. ఇక ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని ఆడియన్స్ స్క్రీన్‌పై చూస్తారని, ఈ సినిమాలో 70 శాతం వినోదం, 30 శాతం ఎమోషన్ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఆనంద నిలయం ఈ ఏడాది సంక్రాంతి పండక్కి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు హీరో వెంకటేశ్. ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని, చిత్రయూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో ప్రస్తుతానికి టాప్ కలెక్షన్ మూవీ ఇది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మళ్లీ ఇదే తరహా సినిమా చేయాలని వెంకటేశ్ భావిస్తున్నారట. ఈ తరుణంలో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన ఓ కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి నిధీ అగర్వాల్, త్రిష, రుక్మిణీ వసంత్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్.అంతేకాదు... ఈ సినిమాకు ‘కేరాఫ్ ఆనందనిలయం’, ‘వెంకటరమణ’, ‘ఆనందరామయ్య’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక వెంకటేశ్ కెరీర్లో సూపర్‌హిట్ సినిమాలైన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్ ఓ రైటర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా ఆయన డైరెక్షన్లో ఓ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. నిజానికి వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మరి... ఈసారి వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌కు వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.అనార్కలి ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ (రిలీజ్ కావాల్సి ఉంది)... ఇలా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు హీరో రవితేజ. ఈ యాక్షన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి, ప్రజెంట్ ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారాయన. ‘నేను... శైలజ, ఆడవాళ్ళు మీకు జోహార్లు, చిత్రలహరి’ వంటి సినిమాలను తీసిన కిశోర్ తిరుమల ఈ ‘అనార్కలి’ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను స్పెయిన్‌లో ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే ఈ సినిమాలోని హీరోయిన్పాత్రలను ఎవరు చేస్తున్నారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆషికా రంగనాథ్, కేతికా శర్మ, మమితా బైజు వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.తాత–మనవడి కథ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘ది రాజాసాబ్’ కూడా ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకుడు. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా ప్రధాన కథాంశం మాత్రం తాత–మనవడి నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మారుతి కన్ఫార్మ్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్యపాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవికా మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, సముద్రఖని, వీటీవీ గణేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.కాస్త ఆలస్యంగా... ‘గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ: ది ఫైటర్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు రామ్ చరణ్ కెరీర్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలకు రామ్ చరణ్ కాస్త దూరమైపోయారని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను ఓకే చేశారని, ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ ఓ నిర్మాతగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. అయితే వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారని తెలిసింది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్‌తో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారట త్రివిక్రమ్. ఈలోపు ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్న ‘పెద్ది’ సినిమా చిత్రీకరణను రామ్‌చరణ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సుకుమార్‌తో సినిమా చేస్తారు రామ్ చరణ్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ సినిమాపై ఓ క్లారిటీ రావడానికి మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి ఫ్యామిలీ ఫీల్ ఉన్న సినిమాలను తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా హీరో సూర్యతో సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా చేస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అని, ఇందులో ఉన్న కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తాయని ఇటీవల దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.వెంకీ అట్లూరి మాటలకు తగ్గట్లే సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.మూడు తరాల కథ ఓ కుటుంబంలోని మూడు తరాల కథను వెండితెరపై చూపించనున్నారు హీరో శర్వానంద్. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమా ప్రధాన నేపథ్యం మూడు తరాల కథ అని మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. 1990, 2020... ఇలా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారు.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రేస్ రాజా’ టైటిల్‌ను అనుకుంటున్నారని, షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుందని సమాచారం. ఇంకా శర్వానంద్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ప్రధానాంశాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రాజు కథ ‘అనగనగా ఒక రాజు’ కథను ఈ ఏడాది థియేటర్స్‌లో చూడమంటున్నారు యువ హీరో నవీన్ పొలిశెట్టి. మారి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ పెళ్లి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుందని, అలాగే హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలిసింది. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.ఇంకా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా చేస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (మలయాళ హిట్ ‘జయ జయ జయ జయహే’ తెలుగు రీమేక్), సుహాస్ – మాళవిక మనోజ్‌లు నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం ఈ నెల 11న, ఏఆర్ సజీవ్ డైరెక్షన్‌లోని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఆగస్టు 1న రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఇంకా ప్రేక్షకుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
'రామ్‌చరణ్ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి
మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకు, రామ్ చరణ్‌కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్‌కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025 -
మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు అసహనం
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా (Game Changer Movie) వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. కారణం.. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో శిరీష్ ఏమన్నారంటే..? 'గేమ్ ఛేంజర్‌తో మా పని అయిపోయిందనుకున్నాం.. అంత నష్టం వచ్చినా హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలా అని వారిని తప్పుపట్టడం లేదు. రామ్‌చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని దాదాపు 70% సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసేసింది' అని పేర్కొన్నారు.చంపుకుతింటున్నారుఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో శిరీష్‌ను ఏకిపారేశారు. దీంతో శిరీష్.. మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు (Dil Raju) అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ గురించి పదేపదే అడిగి చంపుకు తింటున్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయింది. ప్రతిదాంట్లో గేమ్ ఛేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేనే లేదు. తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే..ఎందుకసలు? బాగా ఆడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అడగొచ్చు కదా! ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అలాంటప్పుడు గేమ్ ఛేంజర్‌ను మాత్రమే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఏ సినిమాను ఇంతగా పట్టించుకోలేదు. నా సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ని కూడా వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా అవసరం లేదు కదా!22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా..మేము తమ్ముడు సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాం. దాన్ని వదిలేసి ఆరు నెలల కిందట రిలీజైన సినిమా గురించే మాట్లాడుతున్నారు. రామ్‌చరణ్‌కు, మాకు మధ్య సత్సంబంధాలున్నాయి. చరణ్‌కు ఈ ఏడాది హిట్ ఇవ్వలేకపోయాం. మంచి స్క్రిప్టు సెలక్ట్ చేసుకుని చరణ్‌తో సూపర్ హిట్ మూవీ చేస్తామని ఇదివరకే ప్రకటించాను. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరితోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది. చీల్చి చెండాడుతున్నారుఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్. జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్ తీసుకుని సంచలన హెడ్డింగ్స్ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా? అని అసహనం వ్యక్తం చేశాడు.చదవండి: బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ -
మెగా ఫ్యాన్స్‌కు దిల్ రాజు సోదరుడు క్షమాపణలు
రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్‌పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్‌గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు. -
గేమ్ ఛేంజర్‌పై శిరీష్ కామెంట్స్.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు!
టాలీవుడ్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను.. శిరీష్‌కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్ సమయంలో శంకర్ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్‌గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్‌తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
గేమ్ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్‌ను భారీ బడ్జెట్‌తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్ ఛేంజర్ పోయిందని రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం. ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం. గేమ్ ఛేంజర్ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్ అని నేను నమ్ముతా.' అని శిరీష్ రెడ్డి అన్నారు. -
ట్రెండ్ కి దూరంగా మహేష్ బాబు, రామ్ చరణ్
-
ప్రభాస్ ప్లేస్‌లో బన్నీ.. ఎన్టీఆర్ ప్లేస్‌లో చరణ్.. ‘స్టార్స్’ మారిపోయారు!
తినే ప్రతి గింజపై తినేవారి పేరు ఉంటుందంటుంటారు. అలాగే ఓ దర్శకుడు రెడీ చేసిన కథ కూడా ఏ హీరో చేయాలని ఉంటే ఆ హీరో చెంతకు వెళ్తుందేమో. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు, నిర్మాణ వ్యయాలు, స్క్రిప్ట్‌లో మార్పులూ చేర్పులు, కాల్షీట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవుతున్న ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఇలా ఒకరు చేస్తారనుకున్న కథలో వేరే కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఒక హీరోతో ప్లాన్ చేసిన కథలో మరో హీరో కనిపించనున్నారు. ఆ వివరాల్లోకి...సూపర్ హీరో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ లీడ్ రోల్లో రూపొందిన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించారు సూర్య. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన ఈ ‘విక్రమ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోలెక్స్ రోల్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ‘విక్రమ్’ సినిమా సమయంలోనే సూర్యతో లోకేశ్ ఓ కొత్త సినిమాను ప్లాన్ చేశారని, కానీ ఇది ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లోని సినిమా కాదని, ఇదొక సూపర్ హీరో ఫిల్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే రీసెంట్గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్నట్లుగా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కన్ఫార్మ్ చేశారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్ అని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. దీంతో సూర్య హీరోగా చేయాల్సిన సూపర్ హీరో ప్రాజెక్ట్ ఆమిర్ ఖాన్ చేతికి వెళ్లిందనే టాక్ తెరపైకి వచ్చింది. సినిమా జానర్, దర్శకుడు ఒకరే కావడంతో సూర్య సినిమాయే ఆమిర్ ఖాన్‌కు వెళ్లినట్లుగా స్పష్టం అవుతోంది. బ్రహ్మ రాక్షస ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మ రాక్షస’ (ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే సినిమాను ఆరంభించారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుంచి హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతిలోకి వెళ్లిందని, హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమా చేసేందుకు ప్రభాస్ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నారని, ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టారని తెలిసింది. ఇలా రణ్వీర్ సింగ్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభాస్ చేంతకు చేరింది. గేమ్ చేంజ్ ఎన్టీఆర్ ఆడాల్సిన ఆటలను రామ్‌చరణ్ అడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసుకున్నారు. ఈ కథకు ఎన్టీఆర్‌ను హీరోగా అనుకుని కొన్ని రోజులు వర్క్ చేశారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లోని సినిమా ఇదే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దర్శకుడి రెండో సినిమా ‘పెద్ది’లో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా కావడం, ఇప్పుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ చేయాల్సిన ‘పెద్ది’ సినిమా రామ్‌చరణ్‌కు షిఫ్ట్ అయినట్లుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక ‘పెద్ది’ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ, ఖోఖో... ఇలా పలు రకాల క్రీడల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. కార్తికేయుడు అల్లు అర్జున్ హీరోగా చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో..’ వంటి చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ‘పుష్ప: ది రూల్’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో కాకుండా తమిళ దర్శకుడు అట్లీతో తన సినిమాను ముందుకు తీసుకువెళ్లారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్‌తో తాను చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నరపైనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేశారు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాను వదులుకోలేక ఈ సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్. కార్తికేయ (కుమారస్వామి, మురుగన్) ఆధారంగా ఈ మైథాలజీ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ చేతిలో ‘మురగ: గాడ్ ఆఫ్ వార్’ అనే పుస్తకం కనిపించింది. దీంతో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ఈ మైథాలజీ సినిమాను చేసేందుకే సన్నద్ధమౌతున్నారని, అందులో భాగంగానే ‘మురుగ’ పుస్తకాన్ని చదువుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కాకుండా దర్శకుడు నెల్సన్‌తో ఓ సినిమా కమిట్మెంట్ ఉందన్న వార్తలు ఉన్నాయి. ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కొరటాల శివతో ‘దేవర 2’ ఉంటుందని ఎన్టీఆర్‌నే కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేసే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈలోపు వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమాను పూర్తి చేస్తారని, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రావణం కొంతమంది దర్శకులకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా ‘సలార్, కేజీఎఫ్’ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ‘రావణం’ ఒకటి. ఈ మైథాలజీ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరో అనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పుడు అల్లు అర్జున్ చేతికి వెళ్లిందని టాక్. ప్రభాస్‌కు భారీ లైనప్ ఉండటం వల్లనే అల్లు అర్జున్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికి వెళ్లిందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమా, సుకుమార్‌తో ‘పుష్ప 3’ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘రావణం’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా తెలుస్తోంది. తొలిసారి కొత్తగా... యాక్షన్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా... ఇలాంటి తరహా సినిమాలను చాలానే చేశారు హీరో రామ్. కానీ సస్పెన్స్, హారర్, థ్రిల్ జానర్స్‌లో రామ్ హీరోగా వచ్చిన సినిమాలు లేవు. ఇప్పుడు ఈ జానర్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కోసం కిశోర్ అనే ఓ నూతన దర్శకుడు ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేశారట. రానా స్పిరిట్ మీడియా, ఆర్కా మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాయని సమాచారం. కానీ ‘విరూపాక్ష’తో సూపర్ హిట్ సాధించిన కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీతో నాగచైతన్య ముందుకు వెళ్లారు. ఇలా కిశోర్ రెడీ చేసిన కథ హోల్డ్‌లో పడింది. అయితే ఈ కథ ఇప్పుడు రామ్ చెంతకు చేరిందని, ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల రామ్ చాలా ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందనీ సమాచారం. తమ్ముడు వెండితెరపై ‘తమ్ముడు’ రీ ప్లేస్ అయ్యాడు. నితిన్ హీరోగా చేసిన తాజా చిత్రం ‘తమ్ముడు’. కానీ ఈ సినిమా హీరో నాని చేయాల్సిందని తెలిసింది. చివరి నిమిషంలో నితిన్ చేశారు. మరో ఆసక్తిరమైన విశేషం ఏంటంటే... ‘బలగం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’ అనే మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం నానీని మేకర్స్ సంప్రదించారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా నితిన్ చేతికి చేరింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బలగం’ సినిమాను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ ‘ఎల్లమ్మ’ సినిమానూ నిర్మించనున్నారు. ఇక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్గా సాయిపల్లవి, కీర్తీ సురేష్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. చెన్నై లవ్‌స్టోరీ ఆనంద్ దేవరకొండ లవ్‌స్టోరీ కిరణ్ అబ్బవరంకి వెళ్లింది. వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ‘బేబీ’ సినిమా 2023లో రీలీజై, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కలర్‌ఫొటో’ ఫేమ్ సాయి రాజేశ్ దర్శకుడు. కాగా ఈ సినిమా తర్వాత సాయిరాజేశ్ మరో లవ్‌స్టోరీని రెడీ చేశారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ సినిమాలో లీడ్ పెయిర్‌గా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య ఈ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవడంతో వారి స్థానాల్లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి రాజేశ్, ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. వీలైతే ఈ ఏడాది లేకపోతే, వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఈ తరహాలో ముందు ఓ కథను ఓ హీరో ఆల్మోస్ట్ ఒప్పుకుని, ఆ తర్వాత ఆ కథలో మరో హీరో నటిస్తున్న, నటించనున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. - మూసిని శివాంజనేయులు -
మత్తు ముఠాలూ.. ఈగల్ ఉంది జాగ్రత్త: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు ‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్‌ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’ ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా. కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ఎవరికీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్‌గా ఎదిగారు. రామ్‌చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను. విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు. కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్ ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది.. స్కూళ్ల వద్ద ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం. – రామ్చరణ్ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే.. సినిమాలు, షూటింగ్‌లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్‌తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్‌ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. – విజయ్ దేవరకొండ -
హైదరాబాద్‌లో యాంటీ డ్రగ్ డే ప్రోగ్రామ్ (ఫొటోలు)
-
ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై.. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్‌కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్‌శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం' అని పిలుపునిచ్చారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్‌లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ ... డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్‌కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని అన్నారు.Getting Successful in filmsPlaying a Game after our workSpending quality time with FamilyGives you high that you can't get from anywhere.- #RamCharan Message to Youthpic.twitter.com/rjDHweFOfQ— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 26, 2025 -
Movie Sequels: చరణ్ & మహేష్ రూటే సెపరేట్
-
మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్
-
మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో తన పేరుతో ఉన్న పులిపిల్లని క్లీంకార తొలిసారి కలిసింది. ఈ విషయాన్ని ఉపాసన పోస్ట్ పెట్టి మరీ తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి వీళ్ల కూతురి పేరు పెట్టడం విశేషం.2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. తర్వాత కెరీర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఉపాసనకు కూతురు పుట్టింది. పాపకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలాసార్లు పాపతో తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేశారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)గతంలో చరణ్ దంపతులు.. నెహ్రూ జూలోని పులిని దత్తత తీసుకున్నారు. ఇలా చేసినందుకుగానూ హైదరాబాద్ జూ అధికారులు.. మెగా డాటర్ గౌరవార్థం ఓ పులికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు దాన్ని క్లీంకార ప్రత్యక్షంగా చూసింది. 'ఏడాది క్రితం ఈ పులిపిల్ల ఓ పసికూన. ఇప్పుడు శివంగిలా మారి క్లీంకార కలిసి పేరుని పంచుకుంది. ఈ విషయంలో హైదరాబాద్ జూ నిర్వహకులకు థ్యాంక్యూ. క్రూరమృగాలు అడవిలో ఉండాలి. కానీ అవి కూడా గౌరవంతో బతకాలి' అని ఉపాసన రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు నచ్చేస్తోంది.చరణ్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గేమ్ ఛేంజర్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. కానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం రిలీజైన గ్లింప్స్ వీడియో ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
భారీ డిజిటల్ రైట్స్ తో రామ్ చరణ్ పెద్ది సినిమా సంచలనం
-
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్‌లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్‌ని బట్టి మరింత పెంచేస్తామని నెట్‌ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)
-
ప్రమాదంపై స్పందించిన నిఖిల్
హీరో నిఖిల్ (Nikhil) సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన ఒక పోస్ట్ చేశారు. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ‘ది ఇండియా హౌస్’ (The India House) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, సినిమాలో అత్యంత కీలకమైన సీన్ చిత్రీకరణ కోసం శంషాబాద్ సమీపంలో ఒక భారీ సెట్ వేశారు. సముద్రం సీన్స్ తీసేందుకు అతిపెద్ద వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు అది పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా సెట్లోకి నీళ్లు ముంచెత్తాయి. ఈ ఘటన వల్ల చాలామంది గాయపడ్డారని తెలిసింది. అయితే, తాజాగా ఈ చిత్ర హీరో నిఖిల్ వివరణ ఇచ్చారు.ప్రమాదంపై నిఖిల్ ఇలా స్పందించారు. 'మేము అందరం చాలా క్షేమంగానే ఉన్నాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నాలు చేసే క్రమంలో కొన్నిసార్లు ఇలాంటి రిస్క్‌లు తీసుకోవాల్సిందే. అలాంటి సమయంలో ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరగొచ్చు. కానీ, మా చిత్ర యూనిట్ ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాం. అయితే, మేము అత్యంత ఖరీదైన సినిమా పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.' అని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.We r all Safe 🙏🏽 Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken. We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025 -
రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్..?
-
రామ్ చరణ్‌తో త్రివిక్రమ్ ప్లాన్.. బన్నీనే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్‌తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్‌తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
క్రేజీ కాంబినేషన్?
హీరో రామ్‌చరణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకునేందుకు సన్నాహాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేసి, రామ్ చరణ్‌కు వినిపించారట. ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మించనున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. కాగా ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు రామ్‌చరణ్. అలాగే దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి..‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్ సినిమా సుకుమార్‌తో ఉంటుందా? లేక త్రివిక్రమ్‌తోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్‌లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్‌తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్‌తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్‌కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?త్రివిక్రమ్‌తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' ... చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన 'మసాలా' మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్‌గా ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్' శుభశ్రీ)గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?
సాధారణంగా ఓ వయసు దాటినా తర్వాత రిస్క్ అనిపించే పనులు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా అడ్వెంచర్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మెగాహీరో రామ్ చరణ్ అత్త, అంటే ఉపాసన తల్లి 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా సాహసాలు చేస్తున్నారు. ఏకంగా 600 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటి? తల్లి గురించి ఉపాసన ఏం కామెంట్ చేసింది?(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి)రామ్ చరణ్, ఉపాసనని 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె.. అపోలో సంస్థ యజమాని మనవరాలు అని తెలుసు తప్పితే అంతకు మించి ఉపాసన తల్లిదండ్రుల గురించి ఎవరికీ పెద్దగా తెలీదనే చెప్పొచ్చు. ఉపాసన తల్లి పేరు శోభన. ఈమె ప్రస్తుతం అపోలో ఆస్పత్రులకు వైస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వృతి పరంగా మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ ఈమెకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. గతంలో 2020 డిసెంబరులో తన 60వ పుట్టినరోజు సందర్భంగా 600 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేశారు. అప్పట్లో ఈ విషయమై వార్తలు కూడా వచ్చాయి.తాజాగా 'వరల్డ్ సైక్లింగ్ డే' సందర్భంగా తన సైక్లింగ్ అనుభవం గురించి ఉపాసన తల్లి శోభన.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. 2023లో హైదరాబాద్ నుంచి చెన్నై సైకిల్ రైడ్ చేశాననే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. దీనికి కామెంట్ పెట్టిన ఉపాసన.. 'అమ్మ.. నీ ఛాలెంజ్‌ల వల్ల నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది' అని రాసుకొచ్చింది. దీంతో రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) -
పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్‌చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
‘యాస’కు సై అంటున్న టాలీవుడ్ స్టార్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస మారుతోంది. గతంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా సాధారణ యాసలో డైలాగులు చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. చిత్రకథ ఏ ప్రాంతీయ నేపథ్యంలో సాగుతుందో అక్కడి యాసని పలికేందుకు నటీనటులు సై అంటున్నారు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ, ఆంధ్ర... ఇలా ప్రాంతం ఏదైనా అక్కడి నేటివిటీకి తగ్గట్టు యాస నేర్చుకుని, తమదైన శైలిలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో మేకర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మన హీరోలు పలుకుతున్న యాస విశేషాలేంటో చూద్దాం... రాయలసీమ నేపథ్యంలో... చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి శ్రీకారం చుట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేశారు మేకర్స్. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారనీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. సో... చిరంజీవి రాయలసీమ యాసలో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాల తర్వాత చిరంజీవి– నయనతార కలిసి మూడవసారి నటిస్తున్న చిత్రం ‘మెగా 157’. 2026 సంక్రాంతి కానుకగా ‘మెగా 157’ విడుదల కానుంది. పుడతాం ఏటి మళ్లీ... రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో.. ‘ఓటే పని చేసే నాకి, ఒకేనాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ విలేజ్ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్‌తో సుమారు 50 శాతం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ‘పెద్ది’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.బ్రిటీష్ పాలన నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాతో తొలిసారి రాయలసీమ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలంగాణకి చెందిన విజయ్ ‘వీడీ 14’లో తన పాత్ర కోసం మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఆ యాసని పర్ఫెక్ట్గా పలికేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించనున్నారట విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా కథ కూడా రాయలసీమ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.కదిరి నరసింహ సామి సాచ్చిగా... వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ ఇటీవల వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం స్పష్టమైంది. అందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్‌తో పాటు అక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే ఈ షెడ్యూల్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేసింది యూనిట్. మూడో షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు తనదైన పంచ్ హ్యూమర్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేర్లపాక గాంధీ. ‘వీటీ 15’ కోసం అనంతపురం యాసలో మాట్లాడనున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారట.ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో సాగనుంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అక్కినేని అఖిల్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఆయన మేకోవర్ అయ్యారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్ చిత్తూరు జిల్లాలో కొనసాగనున్నట్లు తెలిసింది.ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా...‘విరూపాక్ష, బ్రో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘హనుమాన్ ’ వంటి బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియన్ మూవీ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా.. ఈ తూరి నరికినానంటే అరపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోనుంచొచ్చాది’ అంటూ రాయలసీమ యాసలో సాయి దుర్గాతేజ్ చెప్పిన డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. పైగా ఫస్ట్ లుక్స్, టీజర్ చూసిన వారికి తన కెరీర్లోనే పూర్తి స్థాయి మాస్ లుక్‌లో, బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలు స్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ అయ్యారు తేజ్. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో కలుపుకుని 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మదనపల్లె యాసలో... ‘మేజర్, హిట్: ది సెకండ్ కేస్’ వంటి హిట్ సినిమాల తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. ఇంటన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో అద్భుతంగా అనిపించింది. ఈ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యాసలో అడివి శేష్ పలికిన డైలాగ్స్, ఆయన వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా అడివి శేష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. ‘డెకాయిట్’ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 25న విడుదల కానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్‌కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్ చిత్రంలో తన గ్లామర్‌తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్ సరసన స్పిరిట్లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ దంపతులు పంపిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
ఊహించని కాంబో.. ఆ దర్శకుడితో చరణ్?
'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిపోయిందనుకుంటే 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్‌కి పెద్ద దెబ్బ పడింది. దీంతో ఫ్యాన్స్ బాగా డీలాపడిపోయారు. అలాంటి టైంలో 'పెద్ది' గ్లింప్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌లోనే ఉంది.లెక్క ప్రకారం 'పెద్ది' తర్వాత.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వార్తల్లోకి వచ్చింది. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. కానీ అట్లీ రావడంతో ఈ దర్శకుడి ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)ప్రస్తుతం ఖాళీ దొరకడంతో త్రివిక్రమ్.. వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఒకవేళ ఇదే సెట్ అయితే వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత చరణ్‌తో త్రివిక్రమ్ ఉండొచ్చని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబో గురించి టాక్ నడిచింది గానీ తర్వాత తర్వాత సైడ్ అయిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ పేరు చరణ్ కోసం తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి స్టోరీతో వస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ తరహాలో ఉంటాయి. మరి ఎవరి దారిలోకి ఎవరు వెళ్తారు? వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!) -
గేమ్ ఛేంజర్‌కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్‌పై విమర్శలు!
ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అంజలి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.అయితే 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్‌పై ఎడిటర్ షమీర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయనతో పని చేయడం నా జీవితంలో చేదు అనుభవమని చెప్పారు. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం చాలా దారుణంగా అనిపించిందని షమీర్ మహమ్మద్ వెల్లడించారు. నేను చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తే.. నాకు అక్కడ అంతా భిన్నంగా ఉందని అన్నారు.ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ కోసం దాదాపు ఒక సంవత్సరం పనిచేశా. ఆరు నెలల తర్వాత వారితో మరో నెల రోజులు ఉండాల్సి ఉంటుందని నాతో చెప్పారు. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి 7 గంటల నుంచి 7.30 గంటలు. దానిని మూడున్నర గంటలకు తగ్గించా. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్నర నుంచి 3 గంటలకు కుదించాడు. డైరెక్టర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ పది రోజుల తర్వాత మాత్రమే వచ్చేవాడు. అదే పద్ధతి చాలా రోజులు కొనసాగింది. దీంతో నేను 300-350 రోజులు చెన్నైలో ఉన్నా. అందుకే ఈ సినిమాను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది" అని అన్నారు. కానీ షమీర్ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎడిటర్ రూబెన్‌ను తీసుకున్నారు. -
త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!
-
పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్ సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి రామ్ చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. వెంకీ చిత్రం తర్వాత...బన్నీ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కోసం..పవన్ కల్యాణ్ చొరవతో రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్‌కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సుక్కు మూవీకి బ్రేక్!వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్ .. సుకుమార్‌తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్ కూడా తన తదుపరి సినిమా చరణ్‌తోనే అని ప్రకటించాడు. కానీ పవన్ కల్యాణ్ కారణంగా చరణ్.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది. -
విలేజ్‌లో పెద్ది యాక్షన్
విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్ది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘పెద్ది’. ఈ మల్టీస్పోర్ట్స్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రోడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో ఓ భారీ విలేజ్ సెట్‌ని ‘పెద్ది’ సినిమా కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సెట్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను ‘ఇన్ స్టా’లో షేర్ చేశారు రామ్‌చరణ్. ‘‘ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ షెడ్యూల్‌తో కీలక దశకు చేరుకుంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది. -
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..
-
రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్‌తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్‌బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. -
రామ్ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్‌చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు. -
మగధీర సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలనుకున్నా: ఆదితి శంకర్
కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. భైరవం మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులను మెప్పించనుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో ఆదితితో పాటు ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆదితి శంకర్ తన స్టెప్పులతో వేదికపై అలరించింది. ఈ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ముద్దుగుమ్మ. టాలీవుడ్ సినిమాల్లో మొదట థియేటర్లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. ఈ సినిమా చూశాకా గూస్బంప్స్ వచ్చేలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. మగధీర మూవీ చూశాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానని ఆదితి శంకర్ తెలిపింది.(ఇది చదవండి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!)కాగా.. అంతకు ముందు హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. #Magadheera సినిమా చూసాక హీరోయిన్ అవ్వాలని అనుకున్న - #AditiShankarWatch Full Interview 👉 https://t.co/eTxTPMH8Yi#RamCharan #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/PLJHDz465S— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
బాలీవుడ్లో ప్రభాస్‌ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్‌కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్‌కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్‌ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్‌గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్‌ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్‌ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్‌లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్‌ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్‌ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్‌స్టార్ ఎవరు కానున్నారో.. -
ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఒకప్పుడు బాక్సింగ్ చాంపియన్.. ఇప్పుడు రామ్ చరణ్ బౌన్సర్!
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ యోధుడు అతడు.. ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన వీరుడు.. అంతేకాదు నాలుగుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడిది.. కానీ ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్..ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis). కాగా టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charana) మైనపు విగ్రహాన్ని ఇటీవలే.. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం.అంతేకాదు.. ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్?1993- 2006 మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొపెఫషనల్ బాక్సర్‌గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌తో తలపడ్డ అతడు.. ఓటమి చవిచూశాడు. అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్‌గా తన కెరీర్లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు.ఇక 2007లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు. 2012లో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2022లో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా.. అక్కడే బౌన్సర్‌గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్‌ను నెట్టివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలాకాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బాక్సర్ మైక్ టైసన్‌కు టాలీవుడ్‌తో అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు.చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025 -
రామ్‌చరణ్‌పై డాక్యుమెంటరీ?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్‌చరణ్. ఈ చిత్రం తర్వాత ఆయనకి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రామ్‌చరణ్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ సంస్థ ఆరు నెలలుగా రామ్‌చరణ్ డాక్యుమెంటరీ పైన వర్క్ చేస్తోందని టాక్. ఈ హీరో కెరీర్, ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం, సాధించిన అవార్డులు... వంటి వాటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా నెటఫ్లిక్స్ సంస్థ డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ నయనతారలపై డాక్యుమెంటరీ ఫిల్మ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక రామ్‌చరణ్ తాజా సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
'వేర్ ఆర్ యూ గోయింగ్ కారా..'.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా?
మెగాఫ్యామిలీ ప్రస్తుతం యూకేలో సందడి చేస్తున్నారు. చిరంజీవితో సహా రామ్ చరణ్ దంపతులు సైతం లండన్‌లో ఉన్నారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు పెట్ డాగ్ రైమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మే 10న ఈ అరుదైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో తన మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా.. మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం.అయితే విగ్రహం ఆవిష్కరణ తర్వాత రామ్ చరణ్ ఫోటోలు దిగారు. ఆ సమయంలో చెర్రీ-ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార సందడి చేసింది. రామ్ చరణ్ తన విగ్రహంతో ఫోటోలు దిగుతుండగా నాన్న వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఉపాసన కారా.. కారా.. అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది.Most Beautiful Video on Internet today ❤️ #RamCharanWaxStatue ! pic.twitter.com/73mqiirlPA— Trends RamCharan ™ (@TweetRamCharan) May 12, 2025 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. మే 10న విగ్రహాన్ని ఆవిష్కరించాడు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) కొన్నాళ్ల క్రితం మ్యూజియం నిర్వహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ కొలతలు తీసుకుని వెళ్లారు. మైనపు విగ్రహంలో చరణ్ తోపాటు అతడి పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అలానే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం. తద్వారా చరణ్ అరుదైన ఘనత సాధించాడు.గతంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో, అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని.. మేడమ్ టుస్సాడ్స్ దుబాయి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ గౌరవం దక్కింది. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)
-
ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్.. జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ సర్ప్రైజ్.. అదేంటంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మెప్పించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేసింది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓకే వేదికపై మెరిశారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా జూనియర్ బర్త్ డేకు పది రోజుల ముందే చెర్రీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చెంపపై ముద్దు కూడా పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆదివారం ఆర్ఆర్ఆర్ మూవీని లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్ వేడుకలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి సందడి చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారి వేదికపైకి కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్గన్, అలియా భట్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. -
మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇతడి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం స్వయంగా చరణ్.. తన విగ్రహాన్ని రివీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!) కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన రామ్ చరణ్.. ఈరోజు తనకోసం వచ్చిన అభిమానుల్ని కూడా కలిశారు. ఇప్పుడు భార్యతో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లారు. తర్వాత తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ కూడా ఉండటం విశేషం.చరణ్ కెరీర్ విషయానికొస్తే.. చిరుత సినిమాతో హీరో అయ్యాడు. మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. కాకపోతే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) Here we gooo…🌟#RamCharanWaxStatue@AlwaysRamCharan x @MadameTussauds pic.twitter.com/4ODzG4zlDT— Trends RamCharan ™ (@TweetRamCharan) May 10, 2025 -
లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


